Web Site in Telugu Spiritual Stories by Siva Siva books and stories PDF | వెబ్ సైట్

Featured Books
Categories
Share

వెబ్ సైట్

" న్యూ జెర్సీ " ఏప్రిల్ 1 సాయంత్రం 7:30 నిముషాలుమన నగర మేయర్ గారు కొద్ది సేపటి క్రితం తాజా ప్రకటన ఒకటి విడుదలచేసారు.న్యూజెర్సీ శివారులోని మూసేసిన బ్రిడ్జికింద ఓ పారే మురికికాలువలో ఈ రోజు సాయంత్రమే గుర్తు తెలియని మృతదేహాం కనుగొనబడింది. ఆ చంపిన హంతకుడు ఎవరో " శవాన్ని" గుర్తుపట్టలేనంతగా ఒంటిపై  చర్మాన్ని వలిచేసి కేవలం మొండాన్ని మాత్రమే మూటగట్టి అందులోకి విసిరేశారు. బ్రిడ్జ్ యొక్క సిమెంట్ ఫిల్లర్ల మీద " Missed Call " అని చనిపొయ్యిన వాళ్ళ రక్తంతో పెద్ద. పెద్ద. పదాలు దిద్దినట్లు వార్తలు అందుతున్నాయి  అసలు ఏంటి " ఈ Missed Call.......ఇది దేనికి సంకేతం . ? గత కొన్నినెలల నుండి వరుసబెట్టి జరుగుతున్న,మిస్సింగ్కేసులు,ఈ అంతు చిక్కని చావుల వెనుక ఉన్నా రహస్యం  వీడేనా.? ఇప్పటివరకు దొరికిన శవాలన్నీ కనిపించకుండా పొయ్యినవారివే అవ్వడం గమనార్హం.. ఒకవేళ నిజంగానే దీనికి..మనం రోజూ మాట్లాడుకునే" ఆ Missed Call కి "  సంబంధం ఉందా....?? ఎంత ప్రయత్నించినా ఇంత కాలం మైన దానివెనక చీకటి కోణం ఛేదించలేకపొయ్యారు.మీకు  తెలియని నంబర్ల నుండి ఫోన్ ఎత్తోద్దని,పరిస్థితులు అన్నీసద్దుమణిగే వరకు ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలని మీ పరిసరాలలో " అనుమానాస్పదంగా "జరుగుతున్నట్టు  అనిపించినా మొహంతెలియని అపరిచితులు మిమ్మలని అనుసరించినా వెంటనే అధికారులకు తెలియ పరచాలని రాత్రి సమయాల్లో ఇక పై..." ఆర్మీ వాహనాలు "..రోడ్ల మీద తిరుగుతూ " గాలింపు " పడతాయాని,....నైట్ 10 దాటిన తరువాత సామాన్యులేవ్వరు బయటకు వచ్చి వారి దగ్గర ఇబ్బందులు పడవద్దని ఆయన కోరారు అంటూ" లోకల్ " న్యూస్ ఛానెల్లో వస్తుంది....అప్పటికే గంటల తరబడి టీవీ చూసి. విసుగుచెందిన దీపక్ కట్టేసి పడుకున్నాడు.అరగంట గడిచిన తరువాత. " తన మొబైల్ వైబ్రేషన్ తో " ఊగిపోతూ చప్పుడు చేస్తుంది. పదుల సంఖ్యలో మెసేజ్స్   వందల ఫోన్ కాల్స్, గ్యాప్ లేకుండా వస్తున్నాయి.కట్ చేస్తే తిరిగి చేస్తున్నారు.నిద్రకు "ఉపక్రమించబోతున్నా దీపక్ కు ఆ సౌండ్ కాస్త చిరాకుగా అనిపించింది...ముందు వాట్సప్ గ్రూప్స్ నుంచి త్వరగా బయటకి రావాలి.పని..పాట...లేని వెధవలు... రాత్రుళ్ళు వీళ్ళు నిద్ర పోరు...నన్ను పోనివ్వరు అసలు ఆ మాధవ గాడిని అనాలి.....వినకుండా అడ్డమైనవాటిల్లోకి నన్ను యాడ్ చేశాడు...లేని పోనీ తల నోప్పులువీడి వల్లే ఇదంతా అనుకుంటూ కోపంతో దానిని ఎత్తుతూ హాల్లో.. అవతల ఎవరు..?? అన్నాడు...కానీ అటు నుంచి లోలోపల దుఃఖించే." ఓ ఏడుపు "..బయటకు రావడానికి  కష్టపడుతూ అతని చెవిని తాకింది.హాల్లో..హాల్లో...ఎవరు  మీరు.? నాకెందుకు ఫోన్ చేశారు.?ఒక్కనిముషం ఇంతకుముందు ఈ గొంతును ఎక్కడో విన్నట్టు గుర్తు.రేయ్ "విక్కీ"  అనగానే"ఓ లోతైన స్వరం" మౌనాన్ని వీడి ఆ వైపు నుండి నోరు తెరిచింది.నా ఫోన్ లో  ప్రస్తుతం" నీ నంబర్ " తప్పా ఎవరిదీ కనిపించట్లేదు....నేను నా డ్యూటీ  ముగించుకొని ఇంటికిరాగానే ఒక."Unknown నుండి కొన్ని క్షణాల క్రితంనా మొబైల్ కు" ఓ మెసేజ్ " వచ్చింది.అప్పటి నుండి ఫోన్ లోని అన్నీ నంబర్లు వాటంతట అవే,డిలీట్, అయిపోయ్యి   మాయం అయ్యాయి.గుర్తున్నా వారికి ప్రొటెక్షన్ ఆఫీసర్లకు ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు ఒక్క నీకు తప్పా  భయం వేస్తోంది.ఆఖరిక్షణాలు దగ్గర పడిన వారికీ భూమి  మీద కాలం తీరిపొయ్యిన వ్యక్తులకు,అంతిమ గడియాలు సమీపించాయాని...వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందనితెలియజెయ్యడానికి ఈ మెసేజ్ వెళ్తుందంటా.వీటిని ఇలా  ఎవరు సృష్టించి వదులుతున్నారో తెలియదు...ఈ మెసేజ్లోపల ఉన్నది చదివేందుకు నాకు" ధైర్యం "సరి పోవట్లేదుకానీ ఇది వచ్చినప్పటి నుంచి మా ఇంటిలో... ఏదేదో జరిగి పోతుంది."  కొన్ని శబ్దాలు " వినిపిస్తున్నాయి.... ఇంటి పైన పెంకులు వాటంతట అవే విరుగుతున్నాయి. తలుపులన్నీ బయట నుండి లాక్ అయ్యిపోయ్యాయి...ఈ గదిలో నేనుబంధించబడ్డాను.నా చుట్టూ ఎదో జరుగుతుంది.నువ్వైనా అందరికీ ఫోన్ చేసి నా పరిస్థితి గురించి చెప్పు. నా రూమ్ ముందుకు వచ్చి ఎవరివో " అడుగులు " ఇప్పుడే ఆగాయి అన్నాడు అంతే తన కాల్ కట్ అయ్యింది..విక్కీ..!!.."రేయ్ విక్కీ..!!అని రెండుసార్లు పిలిచాడు.పలక లేదు.తిరిగిచేసినా కలవడంలేదు.పోలీసుల లైన్స్ అయితే ఫుల్ బిజీ.బయటకి రప్పించడానికి విధి ఎదురుచూస్తోంది షూ లేస్ కట్టుకుంటు గోడ వైపుకు చూశాడు దీపక్.అక్కడక్యాలెండర్ లోని పేజీలు... సన్న గాలికి ఒకదాని తరువాత మరొకటి లేస్తున్నాయి. అలా తిరుగుతున్నప్పుడు అతనికితెలిసివచ్చింది ఆ రోజు " డేట్  " ఏంటో....అప్పటి పరుగు పెట్టిన తనగుండె నెమ్మదిస్తూ శాంతించింది.అది April1stఅంటే ఫుల్స్ చెయ్యడానికి ఎంతకైన తెగించేరోజు.గతంలోకూడా అందరూ ఇలాంటివి చెప్పి, నిజం అనుకోని అక్కడి వరకు వెళితే మోసం చేసి ఫుల్ చేసేవారు...వేళా...పాళా.. ఉండదు సమయం సందర్భమే తెలియదు వీడికి.చెప్పింది నిజం అనుకోని ఒక్కక్షణం అదిరిపోయ్యాను..ఫెక్ మెసేజ్లు  రక..రకాల రూపంలో " ఈ ఆన్లైన్ ప్రపంచం " మీద చక్కర్లుకొడుతూ ఉంటాయి..దీనికే ఇంత అతి చెయ్యాలా..? అని వేసిన జాకెట్ విప్పుతూ కూర్చున్నాడు..అవును ఇప్పటి వరకు నాకు వచ్చిన " కాల్స్ "అన్నీ వాడు చేస్తే మరీ ఇందాకాటి నుంచి సందు దొరకకుండా వాట్సాప్  లోకి ఆ మెసేజెస్ ఎవరు పంపినట్టు?అనే సందేహం దీపక్ బుర్రకు వచ్చింది. టేబుల్ మీద ఉన్న తన ఫోన్ అందుకొని వాట్సాప్ అకౌంట్ తెరిచి చూశాడు.అందులో చాలా కాలం తరువాత తన మాజీ ప్రియురాలు అయ్యిన"జెస్సి"నంబర్ నుంచి ఆ సందేశాలు అన్నీ వస్తున్నాయి.దాదాపు రెండేళ్ళ  ఎడబాటు తరువాత తిరిగి ఆమెకాంటాక్ట్ లోకి రావడంతోహృదయం అంతా " పాత జ్ఞాపకాలతో  " బరువెక్కింది..... ఇన్నీ నెలలు గడిచాక, సడన్ గా నేనెందుకు గుర్తుకొచ్చానో తను దేని గురించి మరలా మాటలు కలుపుతుందో చదివి తెలుసుకోమని తన లోని ఆ ఆరాటం ఎగదోసి ముందుకునెట్టడంతో జెస్సి పంపిన మెసేజ్ లను ఒకొక్కటి చూడటం మొదలుపెట్టాడు కానీ ఒంటరిగా దేనిని పూర్తిగా చదవలేక  పొయ్యాడు...ఎందుకంటే అవన్నీ " అనుమానాస్పదంగా " ఉంటూ అతనికి చెమటలు పట్టించాయి....వెంటనే ఒకచేతితో కార్ తాళాలు తీసుకొని మరొకచేతితో కత్తిని వెనుక దోపుకున్నాడు.ఇక్కడ నుండి తొమ్మిదిమైళ్ళ అవతలే జెస్సి ఉండేది.కానీ ఎవరి కంట పడకుండా అంత దూరం వెళ్ళాలి. పొరబాటున " పెట్రోలింగ్ ఆర్మీ వాళ్ళకు "  దొరికితే తన పని అయ్యిపోయ్యినట్టే,కార్ తో ఇది సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు.అందుకే ఆలోచనని మార్చుకోని" బైక్ " మీద తన మాజీ ప్రియురాలు....." జెస్సి "...ఇంటికి బయలుదేరాడు దీపక్,అది కూడా లైట్స్ లేకుండా.ఆ రాత్రి రోడ్డుమొత్తం చాలా నిర్మానుష్యంగా,అప్పుడప్పుడు మ్రోగే  ఆర్మీవాహనాల సైరన్లతో హోరెత్తుతుంది..అందరూ కూడాఫోన్లకి దూరంగా ఉంటూ ఇల్లు దాటి బయటకు రావట్లేదు అసలు మనుషులను ఇంత కిరాతకంగా హత్య చేస్తున్నది  ఎవరు.? జైల్ నుంచి తప్పించుకుపారిపొయ్యిన నేరస్తుడాలేక పేరుమోసిన సైకో కిల్లర్ వచ్చాడా..? ఏదైతే ఏమీ వీళ్ళ పుణ్యమా అని రోడ్ల మీద ట్రాఫిక్ క్లియర్ అయ్యింది..లేదు అంటే ఈ పాటికి అసలు ఎన్ని అవస్థలు పడేవాడినో, అని అతనికి మనస్సు రక రకాలుగా ఉరకలేస్తుంది..మొత్తానికి" న్యూ జెర్సీ " నుంచి బయటకు చేరుకున్నాడు.కానీ జెస్సి వాళ్ళు ఉండే ఏరియకు వెళ్ళాలి అంటే మాత్రం ఎదురుగా ఉన్నటువంటి కొండ ప్రాంతాన్నీ దాటాలి.అసలే అది చాలా డేంజరస్.అక్కడ రోడ్డంతా కనబడని లోతైనా గతుకులతో  మధ్య..మద్యలో హకస్మాత్తుగా మీదకు దొర్లే బండరాళ్లతో ప్రమాదకరంగా ఉంటుంది.అందుకే ముందు వెనుక కొద్దిగా  ఆలోచించి జాగ్రత్తగా బండి నడుపుతున్నాడు...కానీ కొంత దూరం వెళ్ళిన తరువాత, తన వల్ల కాక రోడ్డు పక్కన బైక్ ఆపి,టెన్షన్ తగ్గడానికి సిగరెట్ వెలిగించి ఆ అడవిని అలా చూస్తూ ఉండిపొయ్యాడు.ఎన్నడూ లేనిది ఆకాశంలో తోక చుక్కలు.మెరుపులు చక్కర్లుకొడుతూ తనకి కనిపించడంమొదలు పెట్టాయి.అవి యాదృచ్చికంగా కాదు దేనికోసమో తీవ్రంగా గాలిస్తూ  తిరుగుతున్నాయి.అంత ఎత్తులో ఉండటం వలన ఒకవేళ    వైమానిక సైన్యం హంతకుడిని పట్టుకోవడానికి రంగం లోకి దిగి ఉంటుంది. రేపు ఉదయానికి వాడేవాడో ఇంకా తెలిసి పోతుందని అనుకున్నాడు దీపక్.సగం కాల్చిన సిగరెట్ ని  కింద పడేసి తిరిగి బైకి దగ్గరకు వెళ్లబోతుండగా ముక్కులు పగిలిపోయ్యేలా తుప్పల్లోంచి " దుర్వాసన  " గమాయించి కొడుతోంది....అది ఏమై ఉంటుందా అని  ఆ రాళ్ళ గుట్టలమీద నిలబడి కిందకు " ఫోన్ టార్చ్ "వేసి చూశాడు...కిందచెట్ల మధ్యలో ఇరుక్కోని " ఒక అమ్మాయి శవం " సగానికి పైగా కుళ్ళి తల క్రిందులుగా వ్రేలాడుతుంది. ఈగలు ఇంకా పురుగులు, ఆ డెడ్  బాడీ , మీద విలయతాండవం చేస్తూ తినేస్తున్నాయి. చనిపొయ్యి చాలా రోజులు గడిచిపోవడం  వలన ఆమె శరీరం నల్లబడి పొయ్యి లోపలి నీరు మొత్తం ఎర్రగా కిందకు కారుతుంది... ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అసలే రాత్రి.చుట్టూ కొండలు.తనతో తన నీడ కూడా లేదు  పైగా తనను అక్కడ ఎవరైనా చూస్తే  " ఈ శవానికి "  నీకులింక్ ఉందని,నేరాన్ని తన పైకి తోసి జైలులో పడేస్తారేమో అనే భయంతో,  వెనక్కు తిరిగి చూడకుండా హడావుడిగా  బైక్ మీదకు వెళ్లి స్టార్ట్ చెయ్యగా, మూడో కిక్కుకు ఇంజిన్ ఎత్తుకుంది. అంతే తనకు ఏం అవుతుందో కూడా ఆ క్షణం ఆలోచించలేదు.....ఉన్న వేగం మొత్తం పట్టుకోని, వదిలితే కళ్ళు మూసి తెరిచే లోపు జెస్సి ఉండే ఏరియాలో బండిని ఆపాడు...బైక్ స్టాండ్ వెయ్యకుండా వదిలెయ్యడంతో అదికిందపడిపొయ్యింది.వీపు వెనుక దాచిన కత్తిని బయటకు తీసాడు.  అక్కడ చీకటిగా ఉంది. మనుషులేవ్వరు కూడా కనబడటం లేదు......చిన్నగా జెస్సి వాళ్ళ ఇంటి తలుపుల దగ్గరకు చేరుకున్నాడు. విచిత్రంగా ఉంది...అప్పటికే ఇంటి తలుపులు బద్దలై ఉన్నాయి.అడ్డుగా ఉన్న వాటిని కాలితో నెడుతూ లోపలికి అడుగుపెట్టాడు.చూస్తుంటే జరగరానిది ఏదో జరిగింది ఇంట్లోకూడా ఎవరు కనిపించడంలేదు.డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఫుడ్ ఇంకా  వేడిగానే ఉంది.అయ్యితే ఇంతసేపు ఇక్కడే ఉన్న జనాలు  ఈ కొద్దీసమయంలో ఎక్కడికి వెళ్ళిపొయ్యి ఉంటారు.అని  ఎంత ఆలోచించినా వారి జాడ ఏలా కనుగొనాలో అతనికి  అర్ధం కాలేదు. "ఆ ఇల్లు " జరిగిన కీడును దాచుకుంటుంది  జెస్సి..? ఎక్కడ ఉన్నావు..? బయటకు రా.. అని అరుస్తూ ఆమె ఉండే గది వైపుకి వెళ్ళాడు దీపక్..డోర్ తెరిచే ఉందిలోపలికి అలా అడుగు పెట్టగానే కింద ఫ్లోర్ నాలుగు వైపు  మూలల్లో రక్తంపలుచగా అల్లుకుంది.జెస్సి వాడుకునే పది అడుగుల అద్దం పగిలి వాటి ముక్కలు ఆ నెత్తుటి ధారలా  మీద పడుకున్నాయి. అదంతా చూసి గుండె ధడేల్ మందివాటిని తొక్కకుండా అడుగు దూరంగా వేస్తూ, ఇం కొద్దిగా లోపలికి వెళ్ళి బెడ్ లైట్ వేశాడు.ఆ వెలుగులో కింద జెస్సి చేయ్యి కనిపించింది అది కూడా" నరకబడి ."....భయంతోతన శరీరం పూర్తిగా చల్లబడిపొయ్యింది....అది జెస్సినేనా అంటే తన మనస్సు ఎందుకో ఒప్పుకోవట్లేదు. ఆ చెయ్యికి టచ్ అవ్వకుండా కొంచెం...కొంచెం...పక్కకు తప్పుకుంటూ అవతలికి వెళ్ళే ప్రయత్నంలో జరుగుతుండంగా, సోఫాకుగోడకి మధ్య ఉన్న సందులో నైటీ ధరించిన ఎవరిదో శవం, వెల్లికిలా పడుకుని ఉంది.దాని తలను పూర్తిగా పగలగొట్టి పడేశారు.ఆ బాడీ చూడగానే వామ్మో అని అరుస్తూ,కదిలే సమయంలో కాలుని చూసుకోకుండా... " రక్తం " మీద వేసి జర్రన జారీ వెనక్కిపడ్డాడు దీపక్.....అలా పడ్డప్పుడు నడి నెత్తికి టంగుమని ఎదో బలంగా కొట్టుకోవడంతో,కొద్ది సేపు మైకంలో లెవలేక ఉండిపొయ్యాడు..అలా పడిన సమయంలో రూమ్లో సీలింగ్ వైపుకు,చూస్తూ   ఉన్నప్పుడు,పైన తిరుగుతూ ఉన్నటువంటి ఫ్యాన్ కి జెస్సి యొక్క రెండు కళ్ళు అక్కడ అతికించి ఉన్నాయి.ఓపికను  కూడగట్టుకొని ఎలా..గోలా. బయటకు పారిపోదాము అనివెళ్లబోతుండగా ఇంతలో అక్కడే ఎదురుగా గోడకి జెస్సికా వాళ్ళ అమ్మ తల మూసేసిన కళ్ళతో వ్రేలాడుతూ దీపక్ కి కనిపించింది.అదంతా చూస్తుంటే భయంతో ఉన్న ప్రాణం " ఏ క్షణమైనా పొయ్యేలా ఉంది.....వారి ఇద్దరినీ ఎవరైతే హతమార్చారో   ఆ హాంతకుడు, ఈ ఇంట్లో, ఎక్కడో ఓ చోట ఉండొచ్చునని తనకు కూడా హాని ఏదొకటి జరగకముందే వెళ్ళిపోవాలని ఈ ప్రదేశంలో ఎదో.." చెడుశక్తి "...బలి కాంక్షిస్తోందని దీపక్  భావించాడు.బయటకు పరుగులు పెడుతుండగా ఎదురు తన ఫ్రెండ్ " మాధవ్ " మరియు రియా  ఆ ఇంటి లోపలికి సడన్ గా వస్తూ రక్తపుమరకలు అంటుకొని ఉన్న దీపక్ ని  చూసి వారిద్దరు అదిగో దెయ్యంఅంటూ గొంతు చించుకొని  ఒకరిని ఒకరు పెనేసుకున్నారు.." రేయ్..!! రేయ్..!! ఆగండ్రా నేను దయ్యాన్ని కాదు దీపక్ కావాలి ఆంటే చూడండి అంటూ చోక్కాతో తన మొఖాన్ని పట్టిన మరకలను తుడుచుకొని తన ఫెస్..చూపించాడు..నువ్వా...?? ఎందుకురా జెస్సిని చంపేసావు లవ్ బ్రేక్ అప్ అయ్యిందని అలా చంపేస్తావా.?? ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు.అన్యాయంగా ఓ ప్రాణం తీసేశావు. నువ్వు చేసిన ఈ పాపం ఊరికే పోదంటూ కింద" ఆ డెడ్ బాడీస్ " చూస్తూ మాధవ వణికి పోయ్యాడు..ఏంట్రా..?నా మీదకు తోస్తున్నావు.? నేను తనని చంపడం ఏమిటి....? ఈ రోజు రాత్రి పడుకున్నప్పడు తనే మెసేజెస్ చేసింది.ఇక్కడికి వచ్చి చూసేలోపు తను చనిపొయ్యి పడి ఉంది.అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆమెని ఎవరు చంపారో తెలియట్లేదు అయ్యినా నాకు చీమల్ని దోమల్ని చంపడమే రాదు. ఇంకా మనుషుల్ని చంపేంత సినిమా ఎక్కడ ఉంది రా...కొంపతిసి నువ్వు గాని మర్డర్ చేసావా. అని తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ లను చూపిస్తూ వాడి మీద అనుమాన పడ్డాడు దీపక్....నాకు అరవడం తప్పా కరవడం రాదని నీకు కూడా తెలుసు కదరా దీపక్..?? ఒకవేళ ఈ రియా వేసేసిందేమో అని తన మీదకు తోసాడు మాధవ.రేయ్ బండోడా మనం ఇద్దరం కలిసే కదా ఇక్కడికి వచ్చాం అలాంటప్పుడు నేను ఎలా చంపుతా..??.....చూడు దీపక్ నీకు వచ్చిన మెస్సెజెస్ లాంటివే మాకు పంపింది... జెస్సి.. అందుకే మేముఇద్దరం ఇక్కడికి వచ్చాము.అసలే బయట" సెక్యూరిటీ ఫోర్స్" వాళ్ళ బందోబస్తు పకడ్బందీగా ఉంది. ఎవ్వరినీ వదలడం లేదు....అన్నింటినీ తనిఖీ చేస్తున్నారుఅనుమానం కలిగిన ప్రతి ఒక్కరినీ ,ప్రీజన్ కి తీసుకు వెళ్ళి లోపల పడేస్తున్నారు...ఇప్పుడు గనుక మనల్ని చూస్తే ఇక ఏం లేదు... మర్దర్లు అన్ని మనమే చేసాము అని ముగ్గుర్ని కాల్చి చంపినా చంపుతారు...అయ్యితే మనల్ని కావాలనే ఇక్కడికి మెసేజెస్ చేసి రప్పించారు.ఇంతజరిగిన తర్వాత మనం ఇంకొక్క క్షణం కూడా,  ఉండటం ఎవ్వరికీ మంచిది కాదు.పదండి వెళ్ళిపోదాం అని రియా తొందర పెట్టడంతో వారంతా ఆ చోటు విడిచి పోతుండగా రేయ్ అటు చూడు అక్కడ జెస్సి కంప్యూటర్ ఇంకా ఆన్ లోనే కనబడుతోంది. ఆమె పరసనల్ డేటా మొత్తం అందులోనే ఉంటుంది అని నాతో ఎన్నోసార్లు చెప్పింది....దానిని గనుక చూస్తే మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియొచ్చు.... మీరేం అంటారు అని అడగ్గా దానికి వారు కూడా సరే అన్నారు.ఆ ముగ్గురు జెస్సి వాడే కంప్యూటర్, ముందు కూర్చోగానేఆ కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకస్టోరీ రాసి ఉండటం వారికి కనిపించింది.జెస్సి అసలే జర్నలిజం చేసింది  వారి ఛానెల్ కోసం " ఆ ఆర్టికల్ " రెడి చేసింది ఏమో అనుకోని మొదట  దాన్ని కొట్టి పడేశారు....సిస్టమ్ లో డేటా మొత్తం " ఏరేజ్ " అయ్యిపోయ్యి ఉంది. ఒక్క ఆ స్టోరీ తప్పా ఏం లేదు పదా  అని దీపక్, మాధవ వెళ్ళబోతుండగా " రియా " వారిద్దరిని వెనక్కు లాగి తన చూపుడు వేలితో అందులో జెస్సి సిద్ధం చేసి ఉంచిన ఆ డాక్యుమెంటరీని చూపించింది.. అందులో " జెస్సి మాటల్లో "అసలు రూపమే లేని ఓ వింత పేరు.జరుగుతున్న చావుల  ఎవరు ఉన్నారో తెలుసుకొని. ,ఆర్టికల్..,సిద్ధం చెయ్యమని ఇది మొదట మన ఛానెల్ లోనే టెలికాస్ట్ అవ్వాలని,. పెద్దబాధ్యతను మేనేజ్మెంట్ నాకు అప్పగించింది. మొదట ఇది అంతా బాగానే ఉన్నా తరువాత తరువాత తెలిసింది దీని లోతేంటో...నేను బాధిత కుటుంబాల నుండి తెలుసుకున్న సమాచారం ప్రకారం...కొన్ని కొత్త విషయాలనేవి...బయట పడ్డాయి.టెక్నాలజీ"తన యుద్ధం "మొదలు పెట్టింది ఈ విశాలమైన ఇంటర్నెట్..ప్రపంచములో...తెరవకుడాని ప్రమాదకరమైన సైట్స్ కొన్ని వేలకొలది ఉన్నాయి.అందులో ఒకటే ఇప్పుడు నేను చెప్పబోయ్యే ఈ Www.Netra.com...చాలా అంటేచాలా భయాంకరమైనది. ఎందుకంటే అందులోనే అతను ఉంటాడు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కంప్యూటర్ లేదా మోబైల్ ఉపయోగించే సమయంలో.. అనుకోకుండా కొన్ని  " unknown  "లింక్స్ క్లిక్ చేస్తుంటాం...అలా జరిగినప్పుడేమనం వాడే డివైస్ దానంతట అదే ఆ సైట్ లోకి తీసుకొని వెళుతుంది మనల్ని.........దానిలో ఎవ్వరూ చూడకూడని వీడియోస్ రికార్డ్ చెయ్యబడి అప్లోడ్ అయ్యి ఉన్నాయి.... అవి అసలు దేనికి సంబంధించినవో, వాటిని ఎవరు అలా తీసారో....అందులో ఏం ఉంటుంది అనేది...అంత త్వరగా అర్ధంకాదు.దీని వల్లే అదేంటో తెలుసుకోవాలనే ఆతృతతో ఆ వెబ్ సైట్ లో.. మరింత లోపలికి వెళ్ళిపోయి....వెనక్కు రాలేనంత దూరానికి చేరుతారు యూజర్లు. అప్పుడు అది మనల్ని చివరకు" అతని "దగ్గరకి లాక్కెలుతుంది.మొదటదానిని ఓపెన్ చేసిన వారు వసీకరణం చెందుతారు. ఎంత లాగా అంటే ఒక్కరోజు ఆ సైట్ తెరవకుండా ఉండలేనంత ఆకర్షితులం అవుతాము.తరువాత వారిమైండ్ మొత్తాన్ని " ఆ సైట్ "తన ఆధీనంలోకి తెచ్చుకొని వాళ్ళను అత్యంత భయానకమైన మయాలోకం లోకి తీసుకువెళ్తుంది అక్కడఎలా ఉంటుందో అనేది ఎవ్వరికి తెలియదు... ఎందుకంటే ఆ లోకంలోకి వెళ్ళిన వారంతా కూడా, చనిపొయ్యి శవాల రూపంలోనే వెనక్కు వస్తారు....... ఆ వెబ్ సైట్ లో ఉండేవి అన్నీ బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన గుర్తులు....., అలాగే చనిపొయ్యిన వారిని.. రప్పించడానికి ఉపయోగించే కొన్ని అక్షరాలు,చెయ్యవలసినవి ఇవ్వవలసినది ఇస్తే..............                                          (  పార్ట్ 2 ) త్వరలో