ఈ కథ ఒక ఆర్మీ అధికారి గురించి . అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి . అతని ప్రేమ గురించి.
అలాగే అతన్ని బాగా inspire చేసినటువంటి ఒక అధికారి గురించి,
దేశం మీద ఒక సైనికుడికి ఉండే భక్తి , విధేయత గురించి. మరియు ఆర్మీ లో జరిగే కొన్ని అక్రమ ఒప్పందాలు , వాటి వెనుక ఉన్న కొంత మంది పెద్దల గురించి, వాటికి వ్యతిరేకంగా ఇద్దరు అధికారుల చేసే పోరాటమే ఈ కథ .
అతని పేరు సుభాష్.
అతను హైదరాబాద్ లో అతని స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. సుభాష్ కి అతను తప్ప ఎవరు లేరు.
చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. అతని స్నేహితుడి పేరు హేమంత్. ఇద్దరు చిన్నపుడు నుంచి ఒకే దగ్గర చదువుకున్నారు.
హేమంత్ ఒక sofrware కంపెనీ లో పనిచేస్తున్నాడు.
సుభాష్ కి ఆర్మీ లో పనిచేయడం అంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి ఆర్మీ పరీక్షలు రాసి సెలెక్ట్ కూడా అవుతాడు. కానీ హేమంత్ కి సుభాష్ ఆర్మీ కి వెళ్లడం అంత ఇష్టం లేదు.
కొన్ని రోజుల తరువాత సుభాష్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది.
హేమంత్: సుభాష్ ఆర్మీ కి వెళ్లడం అంత అవసరమా? ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా?
సుభాష్: నీకు బాగా తెలుసు నాకు ఆర్మీ అంటే ఎంత ఇష్టమో, చిన్నప్పటి నుంచి నా ఆశయం ఆర్మీ అని నీకు కూడా తెలుసు మళ్ళి కొత్తగా అడుగుతున్నావ్ ఈ సమయంలో ?
హేమంత్: అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు తెలుసు. నీకు ఏమైనా ఐతే అక్కడ?
సుభాష్: నాకు బాగా తెలుసు నా గురించి నా కన్నా ఎక్కువుగా ఆలోచించే వ్యక్తివి నువ్వే. నాకు సప్పోర్టుగా ఉండేది నువ్వే అనుకున్నా. కానీ నువ్వు మాత్రం నాలో భయాన్ని నింపడానికి చూస్తున్నావ్ హేమంత్.
హేమంత్: అందుకే చెప్తున్న ఇక్కడే ఉండి ఒక మంచి జాబ్ చేసుకోరా, అవసరం ఐతే మా కంపెనీ లో నేను మాట్లాడి నీకు జాబ్ ఇప్పిస్తా.
సుభాష్: నేను జీతం కోసం ఆర్మీ కి వెళ్ళటం లేదు. నాకు ఆర్మీ లో పని చేయడం అంటే పిచ్చి, లక్ష్యం అందుకే వెళ్తున్న!
హేమంత్: ఆర్మీ లో జాబ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ చచ్చినా తీసుకొని వెళ్లే దిక్కు ఉండదు ఒక్కక్కసారి, డెడ్ బాడీ కూడా ఎవరికీ దొరకదు యుద్ధం వస్తే.
సుభాష్ కి కొంచెం కోపం, నవ్వు రెండు వస్తాయి.
సుభాష్: ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? రెండు ఉద్యోగాలు చేసేటప్పడు మాత్రమే ఎందుకు ఈ జాబ్ అంటారు, లాభం ఏమి ఉండదు అంటారు.
1.వ్యవసాయం, 2. ఆర్మీ ఉద్యోగం.
పండించే రైతు, దేశం కోసం పోరాటం చేసే సైనికుడు లేకపోతే ఏ దేశం ఆరోగ్యం గా, ప్రశాంతం గా ఉండలేదు.
ఈ దేశం లో లాభాన్ని ఆశించా కూడా చేసే రెండు పనులు వ్యవసాయం, ఆర్మీ ఉద్యోగం ఇవి మాత్రమే. ఎందుకు లాభం అనే ప్రశ్న వీటికే మాత్రమే అడుగుతారు?
ఇంకా ఆర్మీ లో చనిపోతే అంటావా?
ఒక సైనికుడు చనిపోయినప్పుడు పక్కన ఎవరు ఉండకపోవచ్చు... కానీ ఈ ఆర్మీ బట్టలు మాతో ఉన్నంత వరకు, 130 కోట్ల భారతీయుల ఆశీర్వాదం బలం మాతో ఉన్నంత వరకు చావు ఎప్పుడు సైనికుడిని బయపెట్టలేదు.
ఒక సైనికుడిని చావు ఎప్పడు అతడిని బయపెట్టలేదు, కేవలం ఓటమి మాత్రమే భయపెడుతుంది ఎందుకంటే మేము ఓడిపోతే 130 కోట్ల భారతీయుల మాపైన పెట్టిన నమ్మకం కూడా ఓడిపోయినట్టే కాబట్టి.
ఈ డ్రెస్ ఒంటి మీద ఉండి చనిపోవాలని ప్రతి ఒక్క సైనికుడి కోరిక. అలాంటి చావు కన్నా గొప్ప చావు ఇంకా ఎమ్ ఉంటుంది.
ప్రపంచంలో ఏ ఉద్యోగం చేసిన రాని గర్వం, పొగరు, సంతృప్తి ఒక్క సైనికుడిగా చేసే ఉద్యోగంలో మాత్రమే ఉంటుంది.
హేమంత్: నన్ను క్షమించు ...నాకు ఇప్పుడు బాగా అర్ధం అయ్యింది. నువ్వు ఈ జాబ్ ని ఎంత ఇష్ట పడుతున్నావో. !కేవలం నీకు ఏమైనా ఐతుంది అని భయపడి ఆలా మాట్లాడా.
సుభాష్: నాకు తెలుసు హేమంత్, ఎప్పడు నా గురించి ఆలోచించే నీలాంటి స్నేహితుడు ఉన్న తరువాత నాకేం అవుతుంది.
అదే సమయం లో సుభాష్ హేమంత్ చేతిలో పేపర్స్ పెట్టి వాటి మీద సంతకం చేయమంటాడు. సుభాష్ గార్డియన్గా హేమంత్ని సంతకం పెట్టమని ఇస్తాడు.
సుభాష్: సంతకం పెడితే నువ్వు పెద్ద వాడివి అయిపోయినట్టే.
హేమంత్ : " ఈ ప్రపంచం లో అందరూ తమని కాపాడడానికి ఒక హీరో ఉండాలి, కానీ అదే హీరో వాళ్ళ ఇంట్లో నుంచి వస్తాడు అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు"
నేను కూడా అలాంటి వాడినే ..
4 సంవత్సరాల తరువాత సుభాష్ హైదరాబాద్ క్యాంపుకి వస్తాడు. వచ్చినరోజు సుభాష్ ఛాతిపైన గాయం ఉంటుంది, దాని గురించి ఎవరికీ ఏమి చెప్పలేదు, హేమంతో సహా!!
అప్పుడే చెప్తాడు హేమంత్కి తనకి ప్రమోషన్ వచ్చింది అని. ఆ శుభా వార్త విని ఏంచేద్దాం అని హేమంత్ అడుగుతాడు.
సుభాష్: ఇద్దరం కలిసి అనాధ ఆశ్రమము వెళదాం. అక్కడ ఉన్న చిన్న పిల్లలకి స్వీట్స్, బట్టలు, అలాగే వాళ్ళకి కావాల్సినవి తీసుకువెళదాం. అలాగే కొంత మనీ కూడా వార్డెన్ ఇస్తే పిల్లలకి ఎం కావాలో చూసుకుంటుంది.
హేమంత్: సరే, నువ్వు ఎలా చెప్తే ఆలా చేద్దాం.
అనుకున్నట్టుగానే ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్లి పిల్లలకి అన్ని పంచి వారితో కొద్ది సమయం గడుపుతారు వాళ్ళని చూసి ఇద్దరు చాలా
సంతోషంగా ఫీల్ అవుతారు.
హేమంత్ ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్లి ఆడుకుంటూ ఉంటాడు,
ఇలా మాట్లాడుతున్నాడు
హేమంత్: పెద్దగా అయినా తరువాత ఏమి అవుతావురా నువ్వు ?
పిల్లవాడు: నీ కన్నా పెద్దగా అవుతా .
అది గమనిస్తున్న సుభాష్ నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడ నుంచి హేమంత్ వస్తూ అనుకుంటాడు
హేమంత్: ఈ మధ్య బుడతలు కూడా బులెట్ కన్నా గట్టిగ దింపుతున్నారు.
వీళ్ళకి ఎవరికీ ట్రైనింగ్ అవసరం లేదు. వీళ్ళే నేర్పిస్తారు మనకి కొన్ని రోజులు అయితే .
సుభాష్: చాలు కానీ, లోపలి వెళ్లి వార్డెన్ ని కలుద్దాం...
తరువాత వార్డెన్తో మాట్లాడుదాం అని లోపలికి వెళుతారు.
వాళ్ళు వార్డెన్ తో మాట్లాడే సమయంలో బయట పిల్లలు అందరూ చాలా బాగా అల్లరి చేస్తూ ఉంటారు.
అది గమనించిన వార్డెన్, మానస వచ్చినట్టు ఉంది అంటుంది.
తను అనుకున్నట్టు గానే మానస వచ్చి పిల్లలతో ఆడుకుంటుంది, అందరికి కోసం చాకోలెట్స్ తెచ్చింది.
హేమంత్: ఎవరు మానస?
వార్డెన్: మానస ప్రతి నెల ఇక్కడికి వస్తూ ఉంటుంది వచ్చినా ప్రతిసారి పిల్లలకోసం ఏదోఒకటి తీసుకొని వస్తుంది చాలా సరదాగా సమయం గడుపుతుంది ఇక్కడి పిల్లలతో, తను కూడా ఒక అనాధ అని మాత్రం చెప్పింది అంతే, అంతకు మించి తన గురించి మాకు పెద్దగా తెలియదు.
సుభాష్ అక్కడనుంచి బయటకి చూస్తూ ఉంటాడు. అక్కడ మానస పిల్లలతో ఆడుకుంటుంది.
ఎందుకో చూడగానే సుభాష్ కి తను బాగా నచ్చేసింది. తనని చూడకముందే తన మనసుని చూసేసాడు సుభాష్..
వార్డెన్: ప్రతి నెల తాను కొంత డబ్బు సహాయం కూడా చేస్తుంది, తను ఇచ్చిన డబ్బులతోనే ఇద్దరు పిల్లలని చదివిస్తున్నాం.
సుభాష్: మేము కూడా ఈ పిల్లల కోసం కొంత సహాయం ప్రతినెల చేద్దాం అనుకుంటున్నాము. మా వాళ్ళ ఒక పిల్లవాడి జీవితం మారితే అంతకన్నా ఆనందం మాకు ఏముంటుంది. ఈ 50 వేలు ఉంచండి. ప్రతి నెల మానుంచి కొంచెం సహాయం మీకు అందుతుంది.
మానస అక్కడనుంచి వెళ్లపోతుంది అది గమనించిన సుభాష్ మేము కూడా వెళ్ళిపోతాం అని చెప్పి బయటకి వచ్చేస్తారు. అది గమించిన వార్డెన్ చిన్నగా నవ్వుతుంది.
మానస బయట నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. సుభాష్ మరియు హేమంత్ తనని ఫాలో చేస్తూ ఉంటారు.
అదే సమయంలో ఒక అబ్బాయి మానసకి డాష్ ఇచ్చి వెళ్లిపోతుంటాడు. మానస వాడిని ఆపి బాగా తిడుతుంది (దూరం నుంచి ఇద్దరు గమనిస్తూ ఉంటారు).
సుభాష్ అలానే చూస్తూ ఉంటాడు మానసని.
హేమంత్: నచ్చిందా అమ్మాయి?
సుభాష్: చూడడానికి అంతా లక్షణంగా ఉంది, ఎదుటి వారికీ సహాయం చేసే మంచి మనసు చూసాం, పోకిరి ఎదవాలకి బుద్ధి చెప్పే తెగువ ఉంది, ఇంత కన్నా ఒక అమ్మాయి నచ్చడానికి ఇంకా ఎమ్ కావాలి ?
She is a perfect Girl..
తనను ఫాలో చేస్తూ మానస ఇంటి దాకా వెళ్తారు. సుభాష్ అమ్మాయి వివరాలు కనుక్కోమని హేమంత్ కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
మరుసటి రోజు హేమంత్ తన గురించి అన్ని వివరాలు కన్నుకొని వస్తాడు.
హేమంత్: తన గురించి అన్ని విషయాలు కనుక్కున్న, కానీ కానీ కానీ
సుభాష్: ఏంటి కానీ కానీ , ఎవరు తాను చెప్పు ??
హేమంత్: తను ఒక వ్యభిచారి.
అది విని సుభాష్ ఒక్కసారి షాక్ అవుతాడు మొదట, కానీ వెంటనే ఆ షాక్ నుండి బయటకి వస్తాడు
హేమంత్: మర్చిపోరా, ఇక్కడ అమ్మాయలు లేరా.. నీకు బాగా నచ్చే అమ్మాయి, చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది, మనం వెతుకుదాం.
సుభాష్: ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం.
హేమంత్: అంతా చెప్పిన తననే ప్రేమిస్తా అంటావ్ ?
సుభాష్: ప్రేమిస్తా కాదు ప్రేమిస్తున్న.
హేమంత్: అలాంటి పని చేసే అమ్మాయితో నీకు ప్రేమ ఏంటిరా?
సుభాష్: " నువ్వు అలాంటి అమ్మాయిని ఎవరు ప్రేమించరు అంటున్నావ్, అలంటి పని చేస్తున్న తన మనసు ఇంకా అంతా పవిత్రంగా ఉంది అని నేను అంటున్నా.
సరే నీకోసం మళ్ళి అక్కడికి వెళదాం, తనని చూస్తా, తను అలాంటిది అని తెలిసిన తరువాత కూడా తన మీద ప్రేమ తగ్గింది అనిపిస్తే మళ్ళి తనని చూడ... ఓకే నా?
హేమంత్: సరే. చూద్దాం పా!!
ఇద్దరు కలిసి వెళ్తారు.. తనని చూస్తారు.
హేమంత్: చెప్పురా ఇప్పుడు, తగ్గిందికా ఇప్పుడు?.
సుభాష్: ఏమాత్రం తగ్గలేదు ఇంకా పెరిగింది. మీరు అందరూ తను చేసే పని చూస్తున్నారు, నేను మాత్రమే తన మనసుని చూస్తున్న, అందుకే తన మీద ఉన్న ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది
హేమంత్ చాలా కోపముగా చూస్తాడు , సుభాష్ నవ్వుతు ఉంటాడు. తరువాత అక్కడ నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు.
హేమంత్: సరే సరే , నేను చెప్పింది నువ్వు ఎప్పుడు విన్నావు అయినా? నీకు ఏది నచ్చితే అది చెయ్. నాకు కూడా కావాల్సింది అదే. నీ సంతోషం
సుభాష్: సరే తన గురించి ఏమి గమనించావు అది మాత్రం చెప్పు.
హేమంత్: మానస ఎక్కువగా రాత్రి సమయంలో బయటకి వస్తుంది. మాములుగా ఐతే చాలా పద్ధతిగా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటుంది నిన్న కనిపించినట్టు,
పని మీద బయటకి వెళ్ళినప్పుడు మాత్రం వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటుంది. ( వ్యగంగా)
సుభాష్: వివరాలు కనుక్కోమంటే ఎమ్ కనుక్కున్నావ్ రా?
సుభాష్ మూడు రోజులు అలానే తనని ఆలా చూస్తూ ఫాలో చేస్తూ ఉంటాడు,
ఒక రోజు తనని ఫాలో చేస్తూ ఉంటారు.
హేమంత్: ఇంకా ఎన్ని రోజులు రా ఇలా చూస్తూ ఉంటావ్ ? అది ఏమైనా కాలేజీ స్టూడెంట్ ఆ ?
సుభాష్: అది కాదు ఆమె ఆను ?
అయినా ఎన్ని రోజులు ఇలా ఫాలో చేస్తాం, వెళ్లి చెప్పేస్తా ?
సుభాష్ మానస దగ్గరికి వెళ్లి నీతో ఒక నిమిషం మాట్లాడాలి అంటాడు.
మానస: చెప్పు ఏంటి సంగతి? నిన్ను కొన్ని రోజుల నుంచి ఇక్కడే చూస్తున్న, ఏమైనా అద్దె ఇల్లు కోసం వెతుకుతున్నారా ? సహాయం ఏమైనా కావాలా ?
సుభాష్: నేను నిన్ను ప్రేమిస్తున్న !!!
మానస: ప్రేమా? నాతో ? నేను ఎవరో, ఎమ్ చేస్తానో తెలిస్తే లవ్, కొవ్వు అన్ని కరిగిపోతాయి.
దూరంగా ఉన్న హేమంత్ : వాడు ఎవడో తెలిస్తే నీ కొవ్వు కరుగుతుంది.
సుభాష్ : నువ్వు ఎమ్ చేస్తావో నాకు తెలుసు, కానీ నాకు అది అనవసరం. నువ్వు ఎలాంటి దానివి అనేది మాత్రమే నాకు అవసరము.
మానస: నేను ఎమ్ చేస్తానో ఎవరో తెలిసి కూడా ప్రేమిస్తున్నావా? కొంచెం తేడాగా ఉంది గురు నీకథ!
డబ్బులు లేవా? అందుకే కొత్త దారిలో అడుగుతున్నావా? నాకు నీ అంత సమయం లేదు బై.
రెండు రోజులు తను కనపడదు సుభాష్ కి,,, రోజు చూస్తారు కానీ వాళ్ళకి కనపడదు.
కొన్ని రోజుల తరువాత మళ్ళి కనిపిస్తుంది. సుభాష్ వెళ్లి మాట్లాడుతాడు.
సుభాష్: నేను చెప్పింది ఎమ్ చేసావ్? ఆలోచించావా?
మానస: ఏంటిరా నీ బాధ? నా వెనుక పడుతున్నావ్? ఏ కాలేజీ అమ్మాయి వెనుకో పడచ్చు కదరా ? పడే అవకాశం ఉంటుంది?
నా లాంటి అమ్మాయి వెనుక పడుతున్నావ్ అంటే " నిన్ను ప్రేమ పిపాసి అనుకోవాలో, కామ పిశాచి అనుకోవాలా "?
సుభాష్: (నవ్వుతూ) ఇంతకీ నువ్వు ఎమ్ అనుకుంటున్నావు నా గురించి ?
మానస: రెండో రకం ఐతే ఈపాటికి తెలిసిపోయేది, అందుకే నీ మంచి కోసమే చెపుతున్న నావెనుక పడటం ఆపేసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో.
సుభాష్: " ఒక అమ్మాయి అందం చూసి వచ్చే ప్రేమ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఒక అమ్మాయి మైండ్ సెట్, బిహేవియర్ చూసి వచ్చే ప్రేమ కొన్ని నెలలు, సంవత్సరాలు ఉంటుంది ఏమో, కానీ ఎప్పుడైతే ఒక మనసు మంచితనం , వ్యక్తిత్వం నచ్చి వచ్చే ప్రేమ జీవితాంతం
ఉంటుంది" That love is Forever
నాకు అలాంటి ఫీలింగ్ నిన్ను చూసినప్పుడే మాత్రమే వచ్చింది. నిన్ను కాకుండా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొనే అవకాశమే లేదు.
మానస:మాటలు బాగానే మాట్లాడుతున్నావు... అయినా నా గురించి అంతా బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావ్? ఎమ్ తెలుసు నాగురించి ?
సుభాష్ అప్పుడు తనని ఆశ్రమంలో చుసిన విషయం, అక్కడ నుంచి తనని ఫాలో అయినా విషయం, అప్పటి నుంచి తనుఅంటే ఇష్టం అని చెప్తాడు.
అది విన్న మానస ఒకసారి ఆలోచిస్తుంది, ఒకసారి కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ బయట పడదు.
మానస: నీ చావు నువ్వు చావు, నిను చెప్పాలిసింది నేను చెప్పా.
అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఏమి మాట్లాడకుండా, ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది.
సుభాష్ కొంచెం నిరాశ పడుతాడు అక్కడ.
తరువాత రోజు సుభాష్ ఆర్మీ మిషన్ మీద ఒక చోటుకి వెళ్ళలిసివస్తుంది, కొన్ని రోజులు అక్కడే ఉండచ్చు అని హేమంత్ కి చెప్పి వెళ్ళడానికి సిద్ధం అవుతాడు.
మానసని కొంచెం చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు.
కొన్ని రోజులు హేమంత్ మాత్రమే మానస ఉండే దగ్గర, తిరుగుతూ ఉంటాడు. అది గమించిన మానస కొంచెం నిరాశ చెందుతుంది, హేమంత్ దగ్గరకి వెళ్లుదాం, వెళ్లి సుభాష్ గురించి అడుగుదాం అనుకుంటుంది కానీ ధైర్యం సరిపోలేదు, చివరికి ఒకసారి వెళ్లి అడుగుతింది.
మానస: మీ స్నేహితుడు ఎక్కడ? కనపడటం లేదు?
హేమంత్ కొంచెం కోపంగా, చిరాకుగా జవాబు చెప్తాడు.
హేమంత్: పని మీద బయటకి వెళ్ళాడు, అయినా నాకు అర్ధం కానీ విషయం ఏంటి అంటే? నీలాంటి అమ్మాయి వెనుక ఎవడు పడడు, అలాంటిది వాడు నువ్వు అంటే అంతా ఇష్టం అని చెప్పి నీ వెనుక ఇంతలా తిరుగుతుంటే వాడిని నువ్వు పట్టించుకోవు.
అంతకుమించి వాడు చాలా మంచివాడు, నువ్వు అంటే అంత ఇష్టం అంటే, నువ్వు ఏమో ఇలా వాడిని బాధపెడుతున్నావ్ ?
" అందరూ నువ్వు చేసే పనిని చూసి నువ్వు అంటే ఏమిటో చెప్తున్నారు, కానీ వాడు మాత్రమే నీ మనుసుని చూసి నువ్వు ఎలాంటి దానివి చెప్పాడు"
అయినా వాడు ఏమైనా రోడ్ మీద పని పాట లేకుండా తిరిగే వాడు అనుకుంటావా? He is a Indian Army Officer.
దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే ఒక సైనికుడు, అలాంటి వాడు నువ్వు అంటే అంతా ఇష్టం అని చెప్తున్నా నీకు అర్ధం అవ్వట్లే??
మానస కళ్ళ నిండా కనీళ్ళ తో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నడుచుకుంటే వెళ్ళిపోతుంది ఆ సమయంలో తనలో తాను ఇలా అనుకుంటుంది.
మానస (ఇన్నర్ వాయిస్) : "నాలాంటి అమ్మాయి వెనుక పడుతున్నప్పుడే అర్ధమైంది అతను ఎంత మంచి వాడో అని.
నా వాళ్ళ అతని జీవితం నాశనం అవుతుంది అని తెలిసి ఎలా తను అంటే ఇష్టం అని చెప్పగలను".
దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అతను ఎక్కడ? డబ్బుల కోసం ఇలా బ్రతికే నేను ఎక్కడ?
నేను ఇక్కడే ఉంటె ఏమైనా జరగవచ్చు, ముందు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి"
ఒక చిన్న బ్యాగులోబట్టలు పెట్టుకొని బయటకి వచ్చేస్తుంది. పక్కనే ఉన్న కేఫ్ లో కూర్చొని ఉంటుంది. కానీ తనకు ఎవరు లేరు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఆలోచిస్తూ అక్కడే ఉంటుంది .
హేమంత్ ఇంటికి వెళ్లే సరికి సుభాష్ కూడా వస్తాడు అప్పుడే.
సుభాష్ అడిగిన తరువాత జరిగింది చెప్తాడు. అనుమానం వచ్చిన సుభాష్ వెంటనే మానస ఉండే ఏరియా కి వెళ్తాడు అప్పడికే తను అక్కడ కనపడదు. ఫోన్ లిఫ్ట్ చేయదు.
బయటకి వచ్చి అంతా వెతుకుతారు కానీ దొరకదు కొంచెంసేపు. .
చివరికి సుభాష్కి కనపడుతుంది ఎక్కడ ఉందొ. తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు.
సుభాష్ ని చూడగానే ఏదో తెలియని ఆనందం.. కానీ బయటకి మాత్రం చెప్పలేకపోతుంది... కొంచెం కోపంగా ఉన్నట్టు నటిస్తుంది.
సుభాష్: ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధం ఐనట్టు ఉన్నావ్, దింపాలా ఎక్కడైనా?
మానస: కొంచెం కోపంగా.. అవసరం లేదు, నేను వెళ్ళగలను.
సుభాష్: నువ్వు వెళ్ళిపోతే ప్రతినెల ఆ పిల్లలతో ఎవరు ఆడుకుంటారు, వాళ్ళని ఎవరు చదివిపిస్తారు?
మానస: మనీ గూగుల్ పే చేస్తా !!
సుభాష్: ఓహ్ ఓహ్ !! మరి నాతో ఎవరు మాట్లాడుతారు?
మానస: నీతో నేను ఎందుకు మాట్లాడుతా? నువ్వు ఎవరు అసలు నీ పేరేంటి?
సుభాష్: నీకు నా పేరు కూడా తెలియదా?? నా పేరు సుభాష్!
మానస: ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఆర్మీ ఆఫీసర్ అని?
సుభాష్: ఇంతకీ నేను అంటే ఇష్టమో లేదు చెప్పలేదు ఇంకా నువ్వు?
మానస: నువ్వు ఆర్మీ ఆఫీసర్ అని ఎందుకు చెప్పలేదు ఫస్ట్
సుభాష్: అంత కన్నా ముందు నువ్వు అంటే ఇష్టం అని చెప్పా దానికి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు .
అప్పటికి మానస కొంచెం బాధతో ముఖం ఉంటుంది, సమాధానం ఎం చెప్పదు. సుభాష్ పక్కకి వెళ్లి కూర్చుంటాడు.
సుభాష్: ఇప్పుడు చెప్పు నేను అంటే ఇష్టమో కాదో ?
మానస సుభాష్ కళ్ళలోకి చూస్తూ, ఏడుస్తూ ఉండిపోతుంది, తరువాత భుజం మీద తలపెట్టుకొని మాట్లాడడం మొదలు పెట్టింది.
మానస: నాకు ఎటు వెళ్లాలో తెలియలేదు అందుకే ఇక్కడే ఉండిపోయా. నాకు ఎవరు లేరు, అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, ఒక చెల్ల మాత్రమే ఉంది, దానిని అయినా బాగా చదివిపించుకోవాలి అనుకున్న, తను కూడా నేను ఎప్పుడు వెళ్లే ఆర్ఫనేజ్ లోనే ఉండేది. కొన్ని అనుకోని కారణాల వాళ్ళ,
ఏమి చేయాలనీ పరిస్థితులలో ఇలాంటి పని చేయాలిసి వచ్చింది.
సుభాష్: నీకు ఇంత వరకు లేకపోయి ఉండవచ్చు, కానీ ఇక నీకు అన్ని నేనే!!
ఏ సిటీ వెళ్లాలో తెలియక ఏడుస్తున్నావా? (సరదాగా)
మానస నవ్వుతుంది… అదే సమయంలో హేమంత్ కూడా వస్తాడు, వచ్చి మానస కి సారీ చెప్తాడు.
ముగ్గురు కలిసి సుభాష్ ఇంటికి వెళ్తారు.
నీతి:
ఒక అమ్మాయి ఎటువంది అని తాను చేసే పనిని బట్టి ఎప్పటికి నిర్ణయం తీసుకోరాదు, కేవలం తన మనస్తత్వం, వ్యక్తిత్వం ని బట్టి మాత్రమే ఎలాంటిది అని నిర్ణయం తీసుకోవాలి.
ప్రపంచంలో ఏ ఉద్యోగం చేసిన రాని గర్వం, పొగరు, సంతృప్తి ఒక్క సైనికుడిగా చేసే ఉద్యోగంలో మాత్రమే ఉంటుంది.