నేను ఒక పర్వతం మీద ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు రోజూవారీ కూలీలు. ఇద్దరు కష్టపడితే గాని ఇల్లు గడవదు. ఒక రోజు, నేను ఒక రుమాలు కొనాలనుకున్నాను, అది నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరికీ ఉంది నాకు తప్ప… కాబట్టి, ఒక రోజు నేను నా తండ్రి ప్యాంటు జేబు నుండి 5 రూపాయలు దొంగిలించాను.
నా తండ్రి దొంగిలించిన డబ్బు గురించి వెంటనే నిలదీసాడు .”ఎవరు డబ్బు దొంగిలించారు?” నా తమ్ముడిని మరియు నన్ను అడిగాడు. నేను అలాగే నిలబడిపోయాను, మాట్లాడటానికి చాలా భయపడ్డాను. మేమిద్దరం తప్పును ఒప్పుకోలేదు, కాబట్టి తండ్రి చెప్పాడు, “సరే, ఎవరూ ఒప్పుకోకూడదనుకుంటే, మీరిద్దరూ శిక్షించబడాలి!” అన్నాడు. వెంటనే, నా తమ్ముడు తండ్రి చేతిని పట్టుకుని, “నాన్న, నేనే చేసాను!” అన్నాడు. నా తమ్ముడు నా కోసం నింద తన మీద వేసుకొని మరియు శిక్షను అనుభవించాడు. .
అందరు నిద్రపోయాక అర్ధరాత్రి, నేను గట్టిగా ఏడ్చాను. నా తమ్ముడు తన చిన్న చేత్తో నా నోరు మూసి , “అక్క , ఇప్పుడు ఇక ఏడవవద్దు. అంతా అయిపోయింది అన్నాడు. ” నా తమ్ముడు నన్ను రక్షించి నాకు చెప్పిన మాటలు నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆ సంవత్సరం, నా తమ్ముడికి 8 సంవత్సరాలు మరియు నాకు 11 సంవత్సరాలు. నేను చేసిన తప్పుని అంగీకరించడానికి తగినంత ధైర్యం లేనందుకు నేను ఇప్పటికీ నన్ను నేను ద్వేషించుకుంటున్నాను.. సంవత్సరాలు గడుస్తున్నాయి… కానీ, ఈ సంఘటన నిన్నే జరిగినట్లుగా ఉంది.
నా తమ్ముడు పాఠశాలలో చివరి సంవత్సరంలో ఉన్నాడు. నేను నా ఇంటర్ కాలేజీ ముగించుకుని అపుడే విశ్వావిద్యాలంలో డిగ్రీ ప్రవేశానికి అర్హత సాధించాను. ఆ రోజు నా తండ్రి, తల్లితో మన ఇద్దరు పిల్లలు ఎలా చదువుతున్నారు..? నాకు ఇద్దరిని చదివించడం చాలా కష్టంగా ఉంది. ఒకరిని చదువు మాన్పించేయాలని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న నేను, నా తమ్ముడు ఏంచేయాలో అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నాము.
నేను, ఆ ఊరి నుండి విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించిన మొదటి అమ్మాయిని. చదువు మానేయడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇదంతా మనస్సులో అనుకుంటుండగానే …. వెంటనే తమ్ముడు ,తండ్రి ముందుకు వెళ్లి నేను చదువు మానేస్తాను. నావల్ల కావట్లే ఈ చదవడం. నేను అన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు.
ఆ మాట విన్న తండ్రికి చాలా కోపం వచ్చింది. నాకు నిన్ను చదివించాలి ఉంది. కానీ, నువ్వు ఇంత అసమర్థుడివి అని అనుకోలేదు అని కొట్టాడు. అదంతా చూస్తున్న నేను , లేదు నాన్నా…! నేనే చదువు మానేస్తాను. తమ్ముడు చదువుకోవడం మన కుటుంబానికి చాలా ముఖ్యం అని వాదించాను. అయినా కూడా తమ్మడు వినకుండా మరునాటి నుండి ఇటుకలు మోసే పనిలో చేరాడు. తద్వారా తనకి వచ్చిన డబ్బులు నాకు పంపించొచ్చని వాడి ఆలోచన. అప్పుడు నా తమ్ముడి వయస్సు 17, నా వయస్సు 20 సంవత్సరాలు.
ఒకరోజు కాలేజీ హాస్టల్లో ఉన్న నాకు, నా స్నేహితురాలు వచ్చి నా కోసం ఎవరో గ్రామం నుండి వచ్చి గేటు దగ్గర ఎదురు చూస్తున్నారని చెప్పింది. ఆ మాట విన్న నేను, నాకోసం ఎవరు వచ్చారని..? వెళ్లి చూస్తే అది నా తమ్ముడు. దగ్గరికి వెళ్లి నవ్వు నా తమ్మిడివే అని చెప్పాలి కదా… ! ఎందుకు చెప్పలేదు…? అని అడిగాను. అప్పుడు తమ్ముడు, ఇంత మురికి బట్టలతో ఉన్న నేను నీ తమ్ముడిని అని చెప్తే, నీ స్నేహితులు నిన్ను ఏడ్పిస్తారేమో అని చెప్పలేదు అన్నాడు. అది విన్న నేను తమ్ముడి బట్టల మీద ఉన్న దుమ్ము ని తూడ్చేస్తూ ..,ఇంకెప్పుడు అలా అనకూడదని చెప్పి చాలా ఏడ్చాను .
కాలేజీ కంప్లీట్ అయ్యాక నేను ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించాను. తల్లితండ్రులు మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తిని చూసి పెళ్లి చేసారు. ఇంట్లో నుండి వెళ్లిపోతూ తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఏడ్చాను. మీరందరు కూడా మాతో వచ్చేయండి అని అడిగాను. అందుకు నా భర్త కూడా ఒప్పుకున్నాడు. అపుడు నా తమ్ముడు , నువ్వేం దిగులుపడకు అక్క, నీ ఇంటిని మరియు అత్తగారిని బాగా చూసుకో. నేను మన తల్లితండ్రుల్ని బాగా చూసుకుంటానని చెప్పాడు.
కొన్ని సంవత్సరాల్లోనే నా భర్త ఫ్యాక్టరీ ఓనర్స్ లో ఒకడయ్యాడు. అపుడు తమ్ముడిని పిలిచి బావగారు నిన్ను ఫ్యాక్టరీ మేనేజర్ ని చేస్తా అన్నారు. అపుడు నీకు మంచి జీతం లభిస్తుంది నువ్వు మన తల్లితండ్రుల్ని బాగా చూసుకోవచ్చు అని చెప్పాను. అది విన్న తమ్ముడు వద్దు అక్క, నా చదువుకి అంత పెద్ద ఉద్యోగం సరికాదు. కానీ, ఇదే ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తాను అని చెప్పాడు. ఇక చేసేది ఏమిలేక ఒప్పుకున్నాను.
ఒకరోజు ఎలక్ట్రిక్ పని చేస్తుండగా.. షాక్ తగిలి చేతికి బాగా గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అపుడు నేను, నా తమ్ముడి దగ్గరకు వెళ్లి… ఆరోజు మీ బావగారు మేనేజర్ గా జాయిన్ అవమంటే వద్దన్నావు. ఇపుడు చూడు ఎలా అయిందో.. ! అని కన్నీళ్లు పెట్టుకున్నాను.
అది విన్న తమ్ముడు, అది కాదు అక్కా .. ! ఇప్పుడిపుడే బావగారు ఫ్యాక్టరీ ఓనర్స్ లో ఒకరయ్యరు. చదువు సరిగా లేని నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తే, చూసే నలుగురు బావగారి గురించి ఏమనుకుంటారు…? నాకు మిమ్మల్ని ఏ రకంగా బాధపెట్టడం ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు వాడి వయస్సు 24సంవత్సరాలు నా వయస్సు 27 సంవత్సరాలు.
తమ్ముడి కంటే నేను వయస్సులో పెద్దదాన్ని. కానీ, నేనెపుడు అంత బాధ్యతగా ఆలోచించలేదు. చిన్నప్పటి నుండి వాడు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు నాకోసం అన్నిటిని వదులుకున్నాడు. చదువు, మంచి జీవితం మరియు మంచి జాబ్ కూడా.. నాకన్నా చిన్నవాడైన ఎంతో అనుభవంతో ఆలోచిస్తుంటాడు అని లోలోపల సంతోషపడ్డాను.
మరుసటి సంవత్సరం.., తమ్ముడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసాము . అపుడు పెళ్లి పెద్ద తమ్ముడిని ఒక ప్రశ్న అడిగాడు. నీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరని..? అపుడు నా తమ్ముడు చెప్పిన సమాధానం ” నాకు మా అక్కయ్య అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నపుడు మేము స్కూల్ కి వెళ్లేప్పుడు నా చేతి గ్లౌవ్స్ ఒకటి పోయింది తాను తన చేతి గ్లౌవ్స్ ని నాకు ఇచ్చింది.”
అపుడు మాకు ఇంకో గ్లౌవ్స్ కొనుక్కునే పరిస్థితి లేదు. రోజూ మేము స్కూల్ నుండి ఇంటికి వెళ్లేసరికి తన చేయి చల్లబడి బాగా నొప్పి వేసేది. అయినా కూడా తను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు చెప్తే నాన్నగారు నన్ను కొడతారని అలాగే భరించింది. అపుడే అనుకున్నాను నేను జీవితంలో అక్కకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని” ఆ మాట విన్న అందరు లేచి చప్పట్లు కొట్టారు.
ఆ మాటలు విన్న నా కళ్లు చెమ్మగిల్లాయి. సంతోషంతో వెళ్లి తమ్ముడిని గట్టిగా పట్టుకుంది.
నీతి | Moral : “అక్క, తమ్ముడి అనుబంధం విడతీయరానిది. ఈ కథలో తమ్ముడు, అక్క కోసం చేసిన త్యాగాలు చూస్తుంటే అక్క ఎంత అదృష్టవంతురాలో అర్ధమవుతుంది. నిజ జీవితంలో మనము ఇన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ, కష్టంలో ఉన్నా అని మన అవసరం కోసం చేయి చాచిన మన సోదర/సోదరికి తప్పకుండ చేతనైన సహాయం చేయాలి.”