One Girl Story in Telugu Women Focused by SriNiharika books and stories PDF | ఓ అమ్మాయి కథ

Featured Books
Categories
Share

ఓ అమ్మాయి కథ


   చేసిన తప్పును తెలుసుకొని తనని తాను సరిదిద్దుకున్న ఓ ఇంతి కథ. 


పెళ్ళి నిశ్చయించారు పెద్దలు. పెళ్ళి రేపు అనగా ఇంట్లో డబ్బులు, నగలు తీసుకొని తను ఇష్టపడిన రాహుల్ తో పారిపోయింది పెళ్ళి కూతురు భాను. 


పెళ్ళికి మంచి ముహూర్తాలు లేవంటూ కొద్ది రోజులు జీవితాన్ని లవర్స్ గా ఎంజాయ్ చేద్దామని తనని నమ్మించి సొంతం చేసుకున్నాడు. కొద్ది రోజులు ఎటువంటి ఆంక్షలు లేకుండా సరదాగా గడిపారు. పెళ్ళి చేసుకుందాం అంటే ఎప్పుడూ మాట దాటేసేవాడు. మూడు నెలల తరువాత భాను నెల తప్పింది. ఆ విషయం రాహుల్ కి చెప్పి ‘పెళ్ళి చేసుకుందాం. ఆలస్యం అయితే ప్రమాద’మని చెప్పింది. 


రాహుల్ పెళ్ళికి కావాల్సినవి తెస్తానని చెప్పి బయటకి వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. భాను కంగారు పడుతూ ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భాను తెచ్చుకున్న నగలు, డబ్బులు కూడా లేవు. భానుకి అర్థమైంది తను మోసపోయానని!


అమ్మ, నాన్నలకి తను ఒక్కటే సంతానం. వారి వద్దకు వెళ్ళాలి అనుకుంది. మోసపోయానని చెప్పితే ఆదరిస్తారు అనుకొని ఊరికి చేరింది. ఊర్లో వారికి తానెవరో తెలియకుండ ఉండేలా మొహానికి ముసుగు వేసుకుంది. తన ఇంటికి చేరుకుంది కానీ తాళం వేసి ఉంది


. భాను లేచిపోవడం వల్ల ఊరిలో పరువు పోయింది. వారు ఆ బాధలో ఉండగా పెళ్ళి వారు తల ఓ మాట అనడం భరించలేక వాళ్ళ అమ్మ, నాన్న.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పారు. తన వల్లే అమ్మ , నాన్న ఈ లోకం నుండి వెళ్ళిపోయారని, తట్టుకోలేక పోయింది. వారి ఊరిలో ఉన్న బావిలో దూకి చనిపోవాలని అనుకుంది. 


ఆ ఊరికి మెడికల్ క్యాంప్ కి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న సింధూ ఆ దృశ్యాన్ని చూసి భానును ఆపింది. 


ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావుని సింధూ అడగగానే తన గురించి చెప్పింది 


"మేడమ్! నేను చేసిన పనికి చావు తప్ప ఇంకో పరిష్కారం లేదు.. అవునా కాదా చెప్పండి!????”

సింధూ భాను వైపు చూస్తూ... 

“మీరు చేసింది తప్పే! కాదు అనను.. కానీ చనిపోవడం కరెక్ట్ కాదు.... చూడండి భాను.. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. కాకపోతే అన్నిటినీ తట్టుకుని నిలబడే మనోదైర్యం ఉండాలి. అదే మీకు మార్గాన్ని చూపిస్తుంది. 


మీ ఇష్టపూర్వకంగానే కదా కలిశారు. ఆ ఫలితమే మీ కడుపులోని బిడ్డ. తనని చంపే హక్కు మీకు లేదు. బిడ్డ పుట్టాక, చనిపోవాలి అనుకునే నిర్ణయాన్ని మీరే మార్చుకుంటారు. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి పరిష్కారం తప్పక దొరుకుతుంది....” 

భాను నవ్వుతూ.... 


“ప్రశాంతత ఎక్కడుంది , ఎక్కడ దొరుకుతుంది.... 

నా నిర్ణయం మార్చుకొమ్మని ఎంత బాగా చెప్తున్నారు.. మీకేమీ నాకున్న సమస్యలు లేవు కదా.. 


నాకంటూ ఎవరూ లేరు, చేతిలో జాబ్ లేదు... కడుపులో బిడ్డ.... భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్ధకంగా మిగిలింది... బిడ్డ పుట్టి పెరిగిన తరువాత ‘నా తండ్రి ఎక్కడమ్మా’ అంటే నా దగ్గర సమాధానం ఉందా!??


నా గురించి వాడికి తెలిసిన మరుక్షణం బ్రతికున్న శవంలా అనుక్షణం వాడి ముందర నిలపడేకన్న, వాడు పుట్టిన వెంటనే నేను చనిపోతేనే మంచిది... 


మీరు నా స్థానంలో ఉంటే తెలిసి వచ్చేది... !???? ఒంటరి మహిళ ఈ సమాజంలో బ్రతకడం ఎంత కష్టమో!?. అలాంటి కష్టాన్ని మీరు కనీసం ఫేస్ చేసి కూడా ఉండరు…” 

సింధూ నవ్వుతూ “భాను... మీకు ఎవరు చెప్పారు... నాకు కష్టం అంటే ఏమిటో తెలియదని!??? చిన్నప్పటి నుంచి అవే స్నేహితులుగా , సమస్యలే బంధువుల పెరిగాను... 

నా కథ చెప్తాను వినండి!???


నాకు ఊహ తెలిసే సమయానికి అనాథ ఆశ్రమంలో ఉన్నాను .. పిల్లలు లేని ఎంతో మంది వచ్చేవారు కానీ ఒక్కరికీ కూడా నేను నచ్చలేదు... చిన్నప్పటి నుంచి అమ్మ , నాన్న ప్రేమ కోసం తపించేదానిని.... 

బాగా చదువుకునే దానిని. అది చూసి కొంతమంది దాతలు ముందుకు రావడం తో ఇంటర్ బైపిసి వరకు చదువుకున్న... లైబ్రరీ లో జాబ్ చేసేదానిని. 

ఒక సారి లో పని నుంచి తిరిగి వస్తున్న నన్ను కొందరు పోకిరి వాళ్ళు బలవంతం చేయబోయారు. 


అప్పుడే అటుగా వచ్చిన ఒకతను నన్ను వాళ్ళ బారి నుండి కాపాడాడు.. ఆ ప్రయత్నంలోనే అతనికి తలకి గాయం అయింది. అది చూసిన ఆ అల్లరి మూక భయపడి పారిపోయారు... 

నేను దగ్గరలో ఉండే హాస్పిటల్ కి తీసుకొనివెళ్ళాను.. తనకి మెలుకువ వచ్చే వరకు అక్కడే ఉన్నాను. తన వద్ద వారి ఫ్యామిలీ వివరాలు కనుక్కొని హాస్పిటల్ లో ఉన్న విషయం చెప్పాను.. 

తన వారు రావడానికి సమయం పడుతుందని అన్నారు... 

నేను ఆశ్రమంలో ఉండే వారికి ఫోన్ చేసి విషయం చెప్పాను... వాళ్ళు వచ్చేదాక అక్కడే ఉన్నాను.. అతని అమ్మ, నాన్న వచ్చారు. అప్పుడే తెలిసింది అతను ఆర్మీ లో పని చేస్తారు అని, పేరు సూర్యని. 


నా గురించి అడిగితే చెప్పాను.. ఆ తరువాత మా ఆశ్రమానికి తిరిగి వచ్చేసాను.. కొన్ని రోజుల తరువాత సూర్య, వాళ్ళమ్మ , నాన్నతో వచ్చి నన్ను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు.. 


ఆశ్రమంలో అనాధగ పెరిగిన అమ్మాయితే బంధాలకు విలువ ఇస్తుందని, తల్లిదండ్రులని తన తల్లి తండ్రి గా చూసుకుంటుందని సూర్య అభిప్రాయం... అలా సూర్యకి భార్యగా ఆ ఇంట అడుగు పెట్టాను... 


చిన్నప్పటి నుంచి కోల్పోయిన ప్రేమను సూర్య రూపంలో, తల్లి తండ్రి ప్రేమను మా అత్తయ్య మామయ్య రూపంలో నాకు అందేలా చేశాడు ఆ దేవుడు.. 


డాక్టర్ అవ్వడం నా కల అని తెలుసుకున్న సూర్య నన్ను చదువుకోమని ఎంతో ప్రోత్సహించాడు.. నన్ను డాక్టర్ గా చూడటం తన కలని చెప్పారు.. 


అత్తయ్య, మామయ్య కూడా నన్ను సపోర్ట్ చేశారు.. 

అలా ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యాను... అభికి ఇచ్చిన సెలవులు అయిపోవడంతో తను వెళ్ళిపోయారు. ప్రతి రోజు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాడు, వీలుచిక్కినప్పుడల్లా సూర్య నా కోసం వచ్చేవాడు.. మా పెళ్ళి అయిన ఏడాదికి నేను నెల తప్పాను .. 


ఆ విషయం తెలిసి సూర్య వచ్చారు. సూర్య తండ్రి అవుతున్నందుకు ఎంతో ఆనందపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవదని ఆ క్షణం వరకు తెలియదు . ఒక రెండు రోజులు సెలవు తీసుకొని నా దగ్గరికి వచ్చాడు సూర్య తను రాగనే గుడికి వెళ్ళి దేవుడు ఆశీర్వాదం తీసుకొని వద్దామని అందరం బయలుదేరాం.. నాకిష్టమైన సంపంగి పులు దారిలో కనపడ్డాయి. అవి తీసుకురావడానికి సూర్య కార్ దిగి వెళ్ళాడు.. పూలు తీసుకొని వస్తుండగా ఏక్సిడెంట్ అయింది…


నా కళ్ళ ముందరే సూర్య చనిపోయారు.. 

కొడుకు అలా కళ్ళ ఎదుటే చనిపోవడంతో మామయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చింది... దాదాపు రెండు హాస్పిటల్లో ఉన్నారు... 


నా కలల ప్రపంచము ఒక్కసారిగా చెల్ల చెదురు అయింది.. నేను, నా కడుపులోని బిడ్డ ఆ ఇంటికి అరిష్టం అని సూర్య తరుపు బంధువులు అందరు అన్నారు... 


కానీ మా అత్తయ్య , మామయ్య ఒకే మాట అన్నారు ‘మా సూర్య ఆర్మీ లో జాయిన్ అయినప్పుడే అనుకున్నాము.. వాడు ఏదోక రోజు యుద్ధములో చనిపోతాడు అని.. కాకపోతే ఏక్సిడెంట్ లో చనిపోయారు.. విధిని ఎదిరించి బ్రతకడం ఎవరి తరం కాదు..

ఇంకా మా కోడలు మా ఇంట అడుగు పెట్టగానే ఎన్నో ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న పూర్వీకుల అస్తి మాకు దక్కింది, సూర్యకి ప్రమోషన్ వచ్చింది.. ఎంత సేపు చెడు జరిగితే దానికి కారణం ఆడవాళ్ళ పైన తోసేస్తూ ఉంటాము.. అదే మంచి జరిగితే చెప్తామా.. లేదు కదా…ఇకపై సింధూ మా కోడలు కాదు, కూతురు” అని చెప్పారు.. 


బంధువులు అందరు తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయారు. ఒక ఒంటరి మహిళ ఎన్ని కష్టాల పడుతుందో అంతకంటే ఎక్కువగానే క్లిష్టతరమైన పరిస్థితిలను ఎదుర్కొన్నాను. 


బంధువులు ఎన్ని మాటలు అన్నా, మమ్మల్ని దూరం పెట్టిన అలాంటివి ఏమి పట్టించుకోకుండా నాకు అండగా నిలబడి నన్ను చదివించారు నా అత్తయ్య, మామయ్య.. 


నాకో పాప. తను ఇప్పుడు ఫిఫ్త్ చదువుతోంది.

సూర్య కోరిక మెరుకు పేదవారి కోసమే నేను పని చేస్తున్న ఈ హాస్పిటల్ కట్టడానికి కారణం కూడా అదే. అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నా ... 

అప్పుడప్పుడు వాలంటీర్ గా కొన్ని స్వచ్ఛంద సంస్థలతో టై అప్ అయి మెడికల్ క్యాంపులు నిర్వహించేదానిని. అలా మీ విమల నాకు పరిచయం అయింది.. అత్తయ్య, మామయ్య నాకు తల్లి తండ్రి గా మారి నన్ను కంటికి రెప్పల కాపాడుకుంటూ ఉన్నారు” 


ఇదంతా విన్న భాను కంట్లో నీరు.. 

“మేడమ్ నన్ను దయచేసి క్షమించండి. నోరు జారాను”. 


‘పర్లేదు అండి... ప్రతి ఒకరి జీవితంలో కష్టాలు ఉంటాయి.. వాటిని దాటుకొని ముందడుగు వేయాలి. తప్పదు.. ఇది మన జీవితం కదా....” 


“చూడు భాను! నాకు తెలిసిన ఎన్. జీ. ఒ లో నీకు ఉండటానికి వసతి కలిపిస్తాను. అక్కడే ఉండండి కొద్ది రోజులు”. 


“అలాగే మేడమ్…” 


భాను ఎన్. జీ. ఒ లో ఉంటూ అక్కడి ఉన్న వారికి సాయం చేసేది. తనకి డ్రాయింగ్ బాగా వచ్చు. అందుకే

దగ్గర్లో ఉన్న స్కూల్ లో డ్రాయింగ్ టీచర్ గా చేరి, తన సంపాదన మొత్తాన్ని ఎన్జీవోకి ఇచ్చేసేది. 


ఒక రోజు రాత్రి భానుకి నొప్పులు రావడంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు. భానుకి పండంటి బాబు పుట్టాడు.. భాను కి మెలుకువ రాగానే ఎవరికో ఫోన్ చేసింది. వారు వచ్చి బాబుని చూసి ఎంతగానో మురిసిపోయారు.. భానుకి థాంక్స్ చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపోయారు.. 


సింధుకి భాను ఇలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు.. భాను వైపు ప్రశ్నార్థకంగా చూసింది?


" మేడమ్... నా వల్ల నా తల్లిదండ్రులు తమ పంచప్రాణాలుగా భావించిన పరువును పోగొట్టుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.. వీటికి నేనే కారణం... అలాంటి బాధను నేను కూడా అనుభవించాలి కదా.. 


నా కడుపున పుట్టినందుకు తండ్రి ప్రేమ తెలియక , అయిన వారు లేక నా బిడ్డ బాధ పడకూడదు.. వాడి ముందర నేను ఓ అపరాధిలా నిలపడకూడదు.. మన ఎన్జీవో గ్రూప్ లో ఓ జంట తమకి పిల్లల లేక బాధపడుతున్నాము అని చెప్పారు.. 


ఆశ్రమంలో వారికి నెలల బిడ్డ దొరకడం లేదని చెప్పి బాధ పడ్డారు.. బిడ్డ పెంపకంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అనేది ఆ జంట కోరిక.. అందుకే నా బిడ్డను వారికి ఇచ్చేశాను” అని చెప్పి సింధుని పట్టుకొని ఏడిచింది.. 


భాను తీసుకున్న నిర్ణయం సబబే అనిపించింది సింధూ కి.... 


భాను వృత్తిలో, ప్రవృత్తిలో మంచి పేరు తెచ్చుకుంది.. ఎన్నో ఎన్జీవోలతో కలిసి పని చేస్తూ తన జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తోంది.. 

***శుభం***