Lover? A ghost? in Telugu Spiritual Stories by SriNiharika books and stories PDF | ప్రేయసా? దయ్యమా?

Featured Books
Categories
Share

ప్రేయసా? దయ్యమా?



 సమస్య అదృష్టం అనుమానం 
రఘు ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి.ఒక గొప్ప కంపెనీలో ఉద్యోగం దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ అది కొద్దికాలం మాత్రమే అని తనకు తర్వాత అర్థం అయింది.ఒక రోజు ఆఫీస్ లో తను చేసే వర్క్ కంప్లీట్ కాలేదని వాళ్ళ బాస్ అరిచాడు.అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ తననే చూశారు మరియు బాస్ కళ్ళలో చెరుగుతున్న నిప్పుల్ని కూడా.రఘు తప్పదు అన్నట్టు బాస్ అనే ప్రతిమాటను పడ్డాడు. ఈ రోజు నా గ్రహచారం ఏమీ బాగోలేదు, ఎలాగైనా పని పూర్తయిన తరువాతనే ఇంటికి వెళ్ళాలి అని పట్టుపట్టి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తునే ఉంటాడు.అందరూ ఆఫీస్ టైమ్ అయిపోయిందని బయలుదేరుతారు. "హే రఘు, నువ్వు రావా మామ" అని మిత్రుడు సురేష్ అడుగుతాడు. "అరేయ్ ,నువ్వే విన్నావుగా..బాస్ నన్ను ఎన్ని మాటలు అన్నారో,ఎప్పుడు అలాంటి మాటలు నేను పడలేదు.మా అమ్మ నాన్న కూడా అలా నన్ను తిట్టి ఉండరు.మన బాస్ కి నా విలువ ఎంటో తెలియాలి. ఈ పని ఈ రోజు అయ్యేంత వరకు ఇక్కడి నుండి నేను కదలను.నువ్వు వెళ్ళు,నేను పని ముగించుకొని వస్తాను..." అని అంటాడు.


ఉద్వేగంతో రఘు "సరే బై మామ,జాగ్రత్త రా,నువ్వు ఒక్కడివే ఉన్నావు.ఎక్కువ సేపు ఉండకు.రాత్రి ఒంటరి ప్రయాణం మంచిది కాదు.మళ్లీ ఇక్కడి నుండి ఒక గంట జర్నీ , మీ సిటీకి వెళ్ళాలంటే అడవి పక్కనే ఉన్న స్మశానం దాటి పోవాలి.ముందే నువ్వు భయస్తుడివి..అందుకే చెబుతున్న... ప్రతిదీ ఊహించుకొని భయపడ్తావ్.. మరి ఆలోచించుకో..."అంటాడు సురేష్... "భయం లేదు,ఏం లేదు.నేను చాలా ధైర్యవంతుడినే.దయ్యలకి ,భూతాలకు భయపడే వ్యక్తి కాను నేను..రఘు ఇక్కడ రఫ్ఫ్ ఆడిస్తడు"...అంటాడు రఘు. "ఏమో...రఫ్ ఆడ్తావో..రాకుండా పోతావో..నాకైతే డౌటే.. మొన్న పార్టీలో మామూలుగా చిన్నపిల్ల దయ్యం మాస్క్ లో చూసి భయపడి,నాలుగు రోజులు ఇంటి నుండి బయటికే రాలేదు. దయ్యాల గురించి,ధైర్యం గురించి నువ్వు చెప్తుంటే నాకు నవ్వొస్తుంది." "అది గతం గతః... అప్పుడేదో తెలీక జరిగింది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ముందు ఇక్కడి నుండి వెళ్ళు..." "సరేలే,నీ ఇష్టం...ఎవరి కర్మ వారిది..నీ మంచే కోరి చెప్తున్నా...బై.." అంటూ అక్కడి నుండి కదులుతాడు సురేష్. రఘు బాస్ ఇచ్చిన పని పూర్తి చేసి,నేనేంటో నిరూపించుకోవాలి. ఈ ఫైల్ అతన్ని మొహం మీద కొట్టాలి అని అనుకుంటాడు.పని చేస్తాడు. సమయం 10 గంటలు అవుతుంది.పని ఇంకా కాలేదు చేస్తునే ఉన్నాడు....చేస్తునే ఉన్నాడు. పని ఇంకా 30 నిమిషాల్లో అవుతుంది..సమయం చూస్తే..11:00 అవుతుంది. "వామ్మో సమయం చాలా ఎక్కువ అయిపోతుంది. "త్వరగా ఫినిష్ చేయాలి అని ,పని పూర్తిగా చేసేస్తాడు.కంపెనీ కావాల్సిన ప్రోజెక్ట్ డాక్యుమెంట్ రెఢీ అయింది. పని పూర్తి చేసుకుని రఘు , ఆఫీస్ కి తాళాలు వేసి ఆ తాళాలను, వాచ్మెన్ రంగయ్య కిచ్చి బైక్ పై ఇంటికి బయలుదేరుతాడు. సిటీ అంతా నిశిలో నిశ్శబ్దంగా ఉంది దానికి తోడు అమావాస్య మరింత చీకటిని ఇచ్చింది. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రఘుకి. చిన్నప్పుడు ప్రతిరోజు ఇంటి బయట మంచం మీద పడుకుని, వాళ్ళ అమ్మమ్మ చెప్పిన పొడుపు కథలు ,దయ్యం కథలు గుర్తుకొచ్చాయి. అమావాస్య రోజు దెయ్యాలు తిరిగే రోజట. ఆ రోజు దయ్యాలకు చాలా శక్తులు వస్తాయి. అవసరమైతే అది మనిషి రూపంలో కూడా వస్తాయి అని బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, రఘుకి వెన్నులో వణుకు పుట్టింది. అయినా ఎంతో ధైర్యం కూడగట్టుకొని , తన బండి పై చల్లని గాలులలో ఝూమ్మని సాగుతున్నాడు. అలా కొద్ది దూరం వెళ్లేసరికి, సిటీ పొలిమేర వచ్చింది. ఆ సిటీ అనేది సముద్ర తీరానికి ఆనుకునే ఉంటుంది. రఘు ప్రశాంతమైన సముద్రంలో అలలు తీరాని చేరి, వాటిని హాయిగా చూస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆ బీచ్ కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ బీచ్ లో ఎవరు రాత్రిపూట వెళ్లరు. ఎందుకంటే రాత్రిపూట ఎంతోమంది అని అక్కడ చంపేశారు మరియు అనుమానాస్పదంగా కూడా చాలా మంది చనిపోయారు. వాటికి కారణం అక్కడ తిరుగుతున్న దయ్యాలే అని ఒక ఆర్టికల్ కూడా ఈనాడు పత్రికలో వచ్చిన పెద్ద సంచలనం చేసింది. అవి కూడా అమావాస్యరోజు వరుసగా జరిగిన పది మంది మరణాలు,వాళ్లు కూడా పెళ్లికాని ఆడవాళ్ళు మాత్రమే.ఇలా ఎందుకు జరుగిందో ఆ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.అవన్నీ ఎదలో గుర్తు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.రఘును ఒక్కసారిగా భయం ఆవరించుకొంది. "ఛ,సురేష్ మాటలు విని అప్పుడే వానితో పాటు హాయిగా వెల్లుంటే బాగుండేది..ఇప్పుడు ఇంత భయం ఉండేది కాదంటూ.."తనలో తను బాధ పడతాడు.అంతలోనే ఆకస్మాత్తుగా తన ఎదురుగా కొంచెం దూరంలో రోడ్డుపై ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్టు కనబడుతుంది.గుండె ఒకేసారి ఝల్లుమంది. హార్ట్ బీట్ వేగంగా పెరిగింది. "లోపల భయం గూడు కట్టుకున్న ,బయట ధైర్యంగా బండి డ్రైవ్ చేస్తాడు.రోడ్డుపై ఏమీ కూడా కనిపించదు.తనకు కనబడిన రూపం సడెన్గా మాయం అవుతుంది.'' అంతా అయోమయం గందరగోళంగా ఉంది.రఘుకి ఏం చేయాలో తోచడం లేదు. అలా బీచ్ వంక చూస్తాడు. ఒకేసారిగా తన గుండెలదురుతాయి.ఒక తెల్లని చీర కట్టిన అమ్మాయి అలా గాలిలొ దూరంగా బీచ్లో ఎగురుతూ కనిపిస్తుంది.బామ్మ చెప్పినవి అన్నీ నిజాలే అన్న విషయం గుర్తొస్తుంది రఘుకి.అది చూసిన రఘు వెంటనే భయంతో బైక్ ని మరింత స్పీడ్ గా నడుపుతాడు. "ఈరోజు ఈ దయ్యాలను దాటుకొని నేను ఇంటికి వెళ్తానో లేదో"..అనుకుని ముందు వచ్చే మూలమలుపు చూసుకోలేదు. దగ్గరికి వచ్చాక... తనకు కనబడుతుంది రోడ్డుమీద..u turn .. సడన్ బ్రేక్ వేస్తాడు. బండి లోయలో పడుతుంది. తను ఒడ్డుపై పడతాడు.


"హమ్మయ్య!" అనుకుంటాను రఘు,తనకి ఏమి కాలేదు.చిన్న చిన్న గాయాలు తప్ప. తనకి ఏమీ దిక్కు తోచడం లేదు.సమయం సరిగ్గా 12 అవుతుంది. బైక్ లోయలో పడిపోయింది .ఈపాటికి అది నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటుంది.నేను బాగానే ఉన్నా..కొంచెంలో ప్రాణాపాయం తప్పింది అనుకుంటూ అతనికి ఇష్టమైన దేవుడు శ్రీ కృష్ణుడిని తలుస్తాడు రఘు. ఆ సమయం 12 చూసినప్పటి నుండి తనలో భయం మరింత ఉదృతంగా పెరిగింది.బీచ్లో ఎవ్వరూ కూడా కనబడరు.ఆ రోడ్డు మూల మలుపు తిరిగిన తర్వాత స్మశానం ఒకటి వస్తుంది.అడవి చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు రెండు వైపులా స్మశానం వ్యాపించి ఉంది. తను రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అడవిలో చాలా దూరంగా, స్మశానంలో కుక్కలు మరియు నక్కలు అత్యంత భయంకరంగా, మనిషికి భీతి కలిగేలా కూ.కూ. అని అరుస్తున్నాయి. గాలి చల్లగా వీస్తోంది, కొంత కొంత ఉదృతంగా , ఉద్రిక్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అది చూసి రఘులో భయం కలిగింది. భయం భయంగానే బండి వదిలేసి, నడుస్తూ వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా పది కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఇంటిని చేరాలంటే, ఎవరైనా వచ్చి లిఫ్ట్ ఇస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాడు. కానీ ఎవరూ రావడం లేదు. అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా అతని ముందు నుండి వేగంగా ఒక మనిషిని వెళ్లినట్టు అనిపించింది, ఆ రూపం యొక్క వాసన మరియు గాలి కూడా తగిలింది తనకు. రఘులో మరింత భయం పట్టుకుంది,ఏమై ఉంటుందో ఆ ఆకారం వైపు చూస్తాడు అక్కడ ఏమి కూడా కనబడదు, ఒక కుక్క కనబడుతుంది. హో హో కుక్కేనా ,నేను ఇంకేదో అని చాలా భయపడ్డాను అనుకుంటూ కర్చీఫ్ తీసుకొని తన మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటాడు. అంతలో వెనకనించి ఎవరు తన భుజం మీద చెయ్యి వేస్తారు. రఘుకి ఒకే సారి గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడి నుండి పారిపోదామని అనుకుంటాడు. కానీ అది వెంబడిస్తుంది మళ్లీ అని భయం, ధైర్యం తెచ్చుకుని వెనక్కి చూస్తాడు.వెనక్కి తిరిగి చూస్తే ఒక అందమైన అమ్మాయి స్కూటీ మీద వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి ఒక్క సారిగా షాక్ అవుతాడు. మళ్లీ మనసులో అనుమానాస్పదంగా వాళ్ళ బామ్మ చెప్పినట్టుగా దయ్యమే ఇలా అమ్మాయిగా వచ్చిందా అని అనుమానపడతాడు.


ఆ అమ్మాయి కూడా అందమైన తెల్లని పంజాబీ డ్రెస్ లో ధగధగా మెరిసిపోతూ ఉంది.ముఖానికి అడ్డంగా స్కార్ఫ్ కట్టుకొని ఉంది. కురులు గాలికి ఊగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి వాలకం చూసి నిజంగా దయ్యమే వచ్చింది అనుకుంటాడు రఘు. రఘు అనుకుంటూనే ఎవరు నువ్వు అని అడుగుతాడు. "నేను ఎవరైతే నీకెందుకు, ఈ టైంలో నువ్వు యిక్కడ ఏం చేస్తున్నావ్ స్మశానంలో?" అని అడుగుతుంది అమ్మాయి. "నా బైక్ రిపేర్ అయ్యిందండి. అందుకే నడుచుకుంటూ వెళుతున్నాను.." "చూడబోతే మంచి ప్రొఫెషనల్స్ డ్రెస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయిలా ఉన్నావు. బైక్ రిపేర్ అయితే మరో ఆటో ఎక్కొ, బస్సు ఎక్కో వెళ్లాలి కానీ ఇలా నడుచుకుంటూ వెళ్తారా" అని అడుగుతుంది. "అదేం కాదండీ, సగం దూరం వచ్చాక బైక్ ట్రబుల్ ఇచ్చింది." "సరే , మీరు ఎక్కడికి వెళ్లాలి చెప్పండి నేను లిఫ్ట్ ఇస్తాను.." రఘు చాలా సంతోషంగా థాంక్స్ అండి అంటూ, ఆ అమ్మాయి యొక్క స్కూటీ ఎక్కబోయి వెంటనే మళ్ళీ ఆగిపోతాడు.. అమ్మాయి : "ఏమైంది, ఆగిపోయారు..." రఘు : "మీకు పెళ్లి అయ్యిందా "అని అడుగుతాడు రఘు.. అమ్మాయి : "వాట్ డు యు మీన్?" రఘు : "అంటే,మీరు నన్ను ఏం చెయ్యరు కదా? మిమ్మల్ని నమ్మొచ్చా..."అంటాడు రఘు. అమ్మాయి : లోలోపల నవ్వి ,బయటికి గంభీరంగా.. "అంటే మీ ఉద్దేశం ఏమిటి. నేను ఏమైనా క్రిమినల్ లా అవుపడుతున్నానా.అయినా మీరు అసలు అబ్బయేనా,ఇలా భయపడుతున్నారు.ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ చేస్తాను అని, అర్ధరాత్రి వేళ ఏ భయం లేకుండా వచ్చి లిఫ్ట్ ఇస్తుంటే ,లిఫ్ట్ తీసుకోవాలంటే ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి ...మీరు చాలా పిరికివాళ్ళాలా ఉన్నారు కదా.." రఘు : చ ఛ,అదేం లేదు.ఊరికే అడిగాను..అంతే... అమ్మాయి : ఓకే,సరే ఎక్కండి... రఘు : "ఒక్క విషయం అండి.మీరు ఎవరైనా సరే నాకు మాత్రం ఒక నిజం చెప్పండి ...." అమ్మాయి : "సరే అడగండి రఘు" అని అంటుంది రఘు ఆశ్చర్యంగా చూస్తాడు, నా పేరు మీకెలా తెలుసు..అని అడుగుతాడు.. అమ్మాయి : నాకు నీ బయోడేటా మొత్తం తెలుసు,నువ్వు Infosys లో పనిచేస్తున్నావు. ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వస్తున్నావు. రఘు : అవును ,మీరు అన్నవి నిజం , కాని ఇవన్నీ ఎలా? అమ్మాయి : "అవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలే కానీ నువ్వు ఎం అడగదలుచుకున్నావో అది చెప్పు.." రఘు : "నన్ను ఏమి అనుకోవద్దు..మరి మేడం" భయంతో చెప్తాడు రఘు అమ్మాయి : ఓకే చెప్పండి రఘు : "మీరు నిజంగా అమ్మాయేనా లేదా దయ్యమా? మా బామ్మ చెప్పారు, అమావాస్యలో దయ్యాలు,ఆత్మలు అమ్మాయిలా మారి వస్తారని చెప్పింది ..అంటూ వణుకుతూ చెప్తాడు..." అమ్మాయి బాగా నవ్వుతుంది..ఆ నవ్వుకు రఘు భయపడతాడు. రఘు : "మీరు నవ్వుతూ ఉంటే నిజంగా దయ్యమే అనిపిస్తుంది.." అమ్మాయి : అవును ...అంటుంది... రఘుకి ఒళ్ళు మొత్తం షివరింగ్ అవుతూ చెమటలు పట్టేసాయి.. "ప్లీజ్ నన్ను ఏం చేయకండి" అంటూ బ్రతిమిలాడాతాడు రఘు. అమ్మాయి : "ఆపండి మీరు కాస్త,మీకు నేను దయ్యంలా కనిపిస్తున్నానా ,మీరు భలే వారు...హెల్ప్ చేయడానికి వస్తె అందరూ దేవత అనో,మదర్ థెరీసా అనో ఇలా పొగుడుతారు.కానీ మీరు టెక్నాలజీ యుగంలో ఉండి కూడా దయ్యాలు, భూతాలు అని భయపడుతున్నారు.నేనేమీ దయ్యం కాను మీరు ధైర్యంగా ఎక్కండి" అని అంటుంది ఆ అమ్మాయి.


అమ్మాయి మాటలు అయిపోగానే, స్మశానంలో కాలుతున్న శవం ఒక్కసారిగా పైకి లేస్తుంది.రఘుకి మరింత భయం వేస్తుంది.దూరంగా కుక్కలు,నక్కలు అరుస్తాయి.రఘు అమ్మాయి వైపు చూస్తాడు. అమ్మాయి : "అయ్యో...మీకు ఇంత కూడా బుర్ర లేదు. కాలే శవం లేవడానికి కారణం, వాటి ఎముకలో ఉండే భాస్వరం మండడం వల్ల అలా ఎముకలు పైకి లేస్తాయి అంతే తప్ప అది దయ్యం కాదు.ఇంకా కుక్కలు ,నక్కలు అరిచినంత మాత్రాన దయ్యం రాదు అని సర్ది చెప్తుంది..." రఘు కదలకుండా ఉంటాడు.. అమ్మాయి : మీకు లిఫ్ట్ కావాలా వద్దా,నేను వెళ్లి పోతున్నాను..అంటుంది రఘు వెంటనే స్కూటీ ఎక్కి కూర్చుంటాడు.ఇద్దరు కూడా ఆ స్మశానం నుండి బయలుదేరుతారు. స్కూటీ కదులుతుంది కానీ రఘుకి మాత్రం ఎదో తెలియని భయం ఉంటుంది.అసలు ఈ అమ్మాయి వివరాలేంటో తెలుసుకుందాం అని రఘు మెల్లగా మాట్లాడటం మొదలు పెడతాడు. రఘు : "ఏవండీ ! మీరు ఏం చేస్తుంటారండి" అమ్మాయి : "స్మశానంలో శవాలను పీక్కుతింటాను" అంటుంది సీరియస్ గా రఘు : "ఒక్కసారిగా రఘు గొంతులో నుండి నీళ్ళు మింగుతాడు.." ఏంట్రా బాబు ఇది,శావాలు అంటుంది..నన్ను పీక్కు తినదు కదా" అని మనసులో అనుకుంటాడు.. రఘు : "మన మధ్య ఈ అర్ధ రాత్రి జోకులు బాగోవు మేడం...కాస్త దయచేసి నిజం చెప్పండి" అమ్మాయి : "ఎందుకు ,ప్రతి రోజూ నన్ను ఫాలో అవ్వడానికా..?'" రఘు : "దయ్యాలకి ఫాలోయింగ్ కూడా ఉంటుందా" ...అని మెల్లగా గొణుగుతాడు.. అమ్మాయి : "నాకు వినబడింది..మిస్టర్..."అంటుంది రఘు : "వామ్మో,దీనికి ఇంద్రునికి ఒళ్ళంత కళ్ళు ఉన్నట్టు,దీనికి చెవులు ఉన్నట్టు ఉన్నాయని మనసులో అనుకుంటాడు.." అమ్మాయి : "అవును..నాకు ఒళ్ళంతా చేవులే ఉంటాయి.నువ్వు ఎది అనుకున్న అది నాకు తెలుస్తుంది.ఈ రోజు అమావాస్య మాకు చాలా మంత్ర శక్తులు లభిస్తాయి" అంటూ రఘును భయపెడుతుంది తను రఘు ," వామ్మో శక్తులా....., ఎంటి దేవుడా నాకు ఈ దుస్థితి..ఇలా ఇరికించావు..."అని తనలో తానే అనుకుంటాడు అమ్మాయి : "ఈ రోజు నుంచి నిన్ను నానుండి ఎవ్వరూ కాపాడలేరు..ఆ దేవుడు సైతం..ఒక్క నేను తప్పా.." రఘు : "ప్లీజ్..మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు" అమ్మాయి : "సరే అయితే విను,నేను మీ ఆఫీస్ నుండి 10 km తర్వాత ఉన్న ఆరిజిన్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను. మాది కూడా మీ సిటీ యే, గాంధీ నగర్ కాలనిలో ఉంటాము.. కానీ నువ్వు ఎప్పుడు కనబడలేదు,నిన్ను తిందాం అంటే..." రఘు : "వామ్మో...తినడం ఏంట్రా...నేనేమైనా చికెన్ హా మటన్ హా....దీని మాటలకి నిజమే అనిపిస్తుంది. దీని చేతికి చిక్కి నా పరిస్థితి వెనుక నుయ్యి ముందు గొయ్యిలా తయారయింది." అమ్మాయి : '"హేయ్..అడిగేది..నిన్నే మాట్లాడవ్..అంటూ గద్దిస్తుంది ఆ అమ్మాయి.." రఘు : తడబడుతూ...చెప్పండి మేడం అంటాడు.. అమ్మాయి : నీ గ్రాడ్యుయేషన్ ఏంటి రఘు : నేను న్యూఢిల్లీలో ఎంబీఏ చేశాను.. అమ్మాయి : ఓహో అదా సంగతి,ఓకే ఇంతలో రఘు వాళ్ళ ఇల్లు వస్తుంది.స్కూటీ ఆపుతుంది అమ్మాయి.రఘు బండి దిగి ,థాంక్స్ చెప్పి ఇంట్లో వెళుతుంటాడు... అమ్మాయి : "హొయ్,ఉత్తి థాంక్స్. యేనా...నువ్వేం మనిషివయ్యా..." ఇంకా ఏం అడుగుతుంది రా నాయనా అనుకుంటూ... "ఏం కావాలి మేడం.చెప్పండి అని అడుగుతాడు" రఘు ఆ అమ్మాయిని.


అమ్మాయి : "ఏం వద్దులే కానీ ముందు వెళ్లి తిని బొజ్జో...ఇంకోసారి స్మశానంలో కనబడితే మా ఫ్యామిలీ కి ఆహారం అవుతావు..జాగ్రత్త" అంటూ స్కూటీ తిప్పి వెళ్తుంది. రఘు తన మనస్సులో ఇంకా సందిగ్ధం వీడదు.ఈమె అమ్మయా ? దయ్యమా? అసలు ఎవరు తను ? రఘు అర్థ రాత్రి ఇంటికి వస్తాడు. ఇంటి డోర్ తట్టుతాడు.చెల్లెలు గిరిజ వచ్చి తలుపు తీస్తుంది. రఘు నీరసంతో వస్తాడు..నువ్వు పడుకొలేదా గిరిజ గిరిజ : '"లేదు అన్నయ్య ,రికార్డ్స్ ఉన్నాయి.అందుకే రాస్తూ కూర్చున్నాను.అమ్మ నువ్వు ఇంకా రాలేదని చెప్పింది,వస్తె చూడమని చెప్పి, తను పడుకుంది. డాడీ నీకు కాల్ చేశారు కానీ నువ్వు లిఫ్ట్ చెయ్యలేదు.అయిన ఇంత లేట్ ఎందుకు అయింది రా నీకు?" రఘు తలకాయ ఆల్రెడీ హీట్ ఎక్కి ఉంది.గిరిజ ప్రశ్నలకు తన పిచ్చి మరింత ఎక్కింది.. రఘు : "ఆపు..నీ డిటెక్టివ్ ప్రశ్నలు..కాస్త నన్ను ప్రశాంతంగా వదిలేయ్.."అంటాడు రఘు. గిరిజ : '"సరే,వచ్చి తిను...నీకోసం అమ్మ చికెన్ 65 వండి పెట్టింది కానీ నువ్వు రావని నేనే తినేశా, ఈ సారికి ఈ వంకాయా కర్రీ తో అడ్జస్ట్ కారా"..అంటుంది గిరిజ రఘు :" నన్ను కూడా తినవే..అన్ని నువ్వే తిన్నకా నేనేమీ తినాలి.. వంకాయ కర్రీ అంటే నాకు నచ్చదు అని నీకు తెలుసుగా.." గిరిజ :"ఆపారా బాబు నీ గోల, తినలేదులే ...నువ్వే తిను...అంటూ ఫ్రీజ్ నుండి తెచ్చి ముందు పెడుతుంది గిరిజ..." రఘు తినడం మొదలు పెడతాడు. గిరిజకు అన్నయ్యను ఆట పట్టించడం తనకు అలవాటు,ఎప్పుడు విసిగిస్తు ఉంటుంది. అమ్మాయితో అన్నయ రావడాన్ని.. తను పైనుండి గమనిస్తుంది... "అరేయ్ అన్నయ్య ఇంతకుముందు ఎవరితో మాట్లాడుతున్నావు రా ఇంటిముందు గాల్లో"అని అడుగుతుంది గిరిజ రఘు :"గాలితో కాదు, ఎవరో తెలియని పర్సన్ రా,నా బైక్ ట్రబుల్ ఇస్తే తను దేవతలాగా వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చింది. గిరిజ : "దేవతనా దయ్యమా?" రఘు :" దయ్యం ఎక్కడైనా లిఫ్ట్ ఇస్తుందా..?" గిరిజ : "ఏమో మరి? నాకు ఎవరు కనపడలేదు.నువ్వు గాల్లో మాట్లాడితే నీకు పిచ్చి పట్టిందేమో అనుకున్నా...' రఘు కి లోపల టెన్షన్ వేస్తుంది రఘు : "నువ్వు సరిగ్గా చూడలేదు తెల్ల పంజాబి డ్రెస్ లో తనని " గిరిజ : నేను నిజం చెపుతున్నాను.నువ్వు నడిచి వచ్చావు కదా,లిఫ్ట్ ఎక్కి రావడం" ఎంటి అని అడుగుతుంది గిరిజ రఘు : గిరిజ చెప్పేదే నిజమే కావచ్చు.ఆ దయ్యం ఎవరికీ కనబడకుండా నాకే కనబడింది. ఆ అమ్మాయి దయ్యమే,ఇంకోసారి ఆమెను కలవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్మశానంలో రాత్రి పూట ఒంటరిగా వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంటాడు. సరే,గుడ్ నైట్ అంటూ మద్యలో తినడం అపేసి బెడ్ రూమ్ లో కి వెళ్తాడు.. గిరిజ : అన్నయ్య బాగా భయపడినట్టు ఉన్నాడు..హ్మ్మ్ అంటూ..రికార్డ్స్ రాయడం ఆపేసి తను కూడా వెళ్ళి పడుకుంటుంది. రఘులో ఒకే ఆలోచన. అర్ధరాత్రి ఏ అమ్మాయి కూడా బయటికి రాదు. ఆ అమ్మాయి వచ్చింది అంటే కచ్చితంగా దెయ్యమే మా బామ్మ చెప్పినట్టు, మళ్లీ అందులో తెల్లని దుస్తులు ,కురులు కూడా ఊగుతూనే ఉన్నాయి......అవన్నీ అతనిలో అలజడిని రేపుతాయి.


అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్ర పోతాడు రఘు. ఉదయం అవ్వగానే, వెచ్చని సూర్యకిరణాల రఘు పై పడగానే, తను నిద్ర లేస్తాడు. త్వరగా లేచి, స్నానం చేసి రెడీ అవుతాడు. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఫైల్స్ సబ్మిట్ చేయాలి. వెంటనే బయటికి వెళ్లి ,బైక్ స్టార్ట్ చేద్దాం అని బైక్ కోసం వెతుకుతాడు. తనకు రాత్రి జరిగిన విషయం అంతా గుర్తుకు వస్తుంది. తన ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్ మొత్తం రెడీ చేయడం, తర్వాత బైక్ లోయలో పడి పోవడం, తనకు ఒక అమ్మాయి లిఫ్ట్ ఇవ్వడం అన్ని గుర్తుకు వస్తాయి. "ఓహ్ షట్..నిజమే కదా.." అని ఆటో ఎక్కి ఆఫీస్ కి వెళ్తాడు రఘు. అందరూ స్నేహితులు వస్తారు. సురేష్ రఘు ని పలకరిస్తాడు. "హాయ్ రఘు,ఏంట్రా చాలా డల్ గా ఉన్నావ్." "అదేం లేదు మామ.. నార్మల్ యే" "ఏదో దయ్యాన్ని చూసి భయపడ్డట్టు ఉన్నావ్, నీ మొహం అలా పెట్టావ్..." రఘు ,"వీడికి అన్ని ఎలా తెలుస్తాయి అసలు," నాకు జరిగింది ఆలోచిస్తే, గిరిజ చెప్పింది మరియు సురేష్ మాటలు వింటుంటే ఇదంతా నిజమే కావచ్చు..రాత్రి నేను ప్రయాణం చేసింది దయ్యంతోనేనా?? ఎన్నో ఆలోచనలు వెంటనే ఆవరించాయి రఘుని చుట్టూ.. రఘు నీ పిలుస్తాడు సురేష్ సురేష్ మాటలు విని రఘు మళ్ళీ ఆలోచనల నుండి తేరుకుని బయటికి వస్తాడు. సురేష్ : "నిన్న రాత్రి చేసిన ప్రాజెక్ట్ ఫైల్ రెడీ అయిందా రఘు?" అయింది సురేష్, సురేష్ :"కంగ్రాట్స్ రఘు, నువ్వేంటో ఈరోజు మన బాస్ కి తెలుస్తుంది..'" వెంటనే అక్కడున్న ప్యూన్ రామయ్య.. రఘుని బాస్ క్యాబిన్ పిలిచాడు అని చెప్తాడు. రఘు ఆ ఫైల్ తీసుకొని బాస్ దగ్గరికి వెళ్తాడు. రఘు : "మే ఐ కం ఇన్ సార్". బాస్ : కమ్ ఇన్ రఘు...నేను ఇచ్చిన ఫైల్ కంప్లీట్ చేశావా రఘు : హా సర్ అయిపోయింది బాస్ : "వెరీ గుడ్, నువ్వు ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తావ్ అని అనుకోలేదు. ఈరోజు దీనినే టెండర్ వేయబోతున్నాను .మనం అనుకున్న విధంగా గవర్నమెంట్ టెండర్ మన కంపెనీ కి వస్తె.. నీ జీవితం మారిపోతుంది.నువ్వు ఇంకా ఎప్పటికీ ఇలా ఉద్యోగం చేస్తుంది జీతం తీసుకోవాల్సిన దుస్థితి నీకు ఉండదు. రాబోయే ప్రాజెక్టులో నీకు టెన్ పర్సెంట్ షేర్ ఇస్తాను.. గుడ్ లక్ రఘు అంటాడు" రఘు : థాంక్స్ సర్... అని చెప్పి తన చేతికి ప్రోజెక్ట్ డాక్యుమెంట్ ఇచ్చి బయటికి వస్తాడు ఎంతో ఆనందంతో. రఘు తన క్యాబిన్లో వచ్చి కూర్చుంటాడు. పక్కనే ఉన్న సురేష్ రఘులోని హుషారుని చూసి "ఏమన్నాడు రా బాస్"..అని అడుగుతాడు రఘు :"అనుకున్న విధంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ మన కంపెనీ కి వస్తే మంచి షేర్ ఇస్తాను అన్నాడు.." సురేష్ :"సూపర్ రా మామ.. ఒకే దెబ్బకు నీ లైఫ్ సెట్ అయిపోవాలి..." అని అంటాడు రఘు.. అంతా బానే ఉంది కానీ...అని అంటాడు రఘు.. సురేష్ : ఏమైంది రా ,మళ్లీ కానీ ఎంటిరా? రఘు : అది నీకు ఎలా చెప్పాలి రా..నువ్వు నమ్మవు సురేష్ : "చెప్పు రా అసలు ఏం జరిగిందో ఊరించకుండా" వెంటనే అక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ వచ్చి, రఘు నిన్న 11:00 వరకు నువ్వే ఆఫీస్ లో ఉన్నావు. మరి ఆఫీస్ తాళాలు ఎవరికి ఇచ్చావు అని అడుగుతాడు మేనేజర్... "సర్ అది ,నేను మన వాచ్మెన్ రంగయ్య కి ఇచ్చాను సార్" అని అంటాడు రఘు. "తను నిన్న తన భార్యకు బాగోలేదు అని లీవ్ పెట్టాడు. ఆఫీస్ కి వచ్చాడా... రంగయ్య" అతన్ని పిలవండి అని అనగానే వాచ్మెన్ రంగయ్య అక్కడికి హుటాహుటిన వస్తాడు. అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య నీ అడుగుతాడు "నువ్వు నిన్న వచ్చావా ఆఫీస్ కి..." లేదు అని అంటాడు రంగయ్య..


రఘుకి ఏమీ అర్థం కాదు.నిన్న రాత్రి గేట్ దగ్గర ఉన్నది ఎవరు మరి? నువ్వు లేవా రంగయ్య అని మళ్ళీ అడుగుతాడు రఘు లేదు సార్, నేను రాలేదు... అంతలో ఒక వ్యక్తి వచ్చి, గార్డెన్లో నీరు పడుతుంటే కోతి బొమ్మ చేతిలో ఈ తాళాల గుత్తి పెట్టి ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు... రఘుకి అంతా అయోమయంగా ఉంటుంది.సురేష్ అతన్ని నిదానంగా అడుగుతాడు.అసలు ఏమైందో టెన్షన్ పడకుండా చెప్పు రఘు అని అడుగుతాడు సురేష్... రఘు మొత్తం జరిగిన విషయం చెప్తాడు. రాత్రి సముద్రతీరంలో చూసిన రూపం గురించి మరియు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి గురించి,చెల్లెలు గిరిజ చెప్పిన విషయం గురించి అన్ని వివరిస్తాడు రఘు. ఇవన్నీ విషయాలు విని ఆశ్చర్యంగా సురేష్ అవునా అని అంటాడు.. "అవును రా మామ, ఇప్పుడు నేను ఏమి చేయాలి" అని అడుగుతాడు రఘు... "మనం అందరం కలిసి నువ్వు చూసిన వన్నీ నిజాలు అవును కాదో తెలుసుకొనాలి... అంటే దానికోసం మన మిత్రులందరూ కలిసి మళ్లీ అమావాస్య నాడు అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి చూద్దాం.నువ్వు ఒక 100 అడుగులు ముందు ఉంటావు.నిన్ను అనుసరిస్తూ మేమందరం వస్తాం.అది దయ్యమో కాదో అక్కడ నువ్వు చూసింది ఏమిటి అనే విషయం మనకి తెలిసిపోతుంది " అని అంటాడు సురేష్. "ఓకే మామ నువ్వు అన్నది అంత బాగుంది.నాకేదో భయంగా ఉందిరా.. దయ్యంతో ఆటలు అవసరమంటావా" "నువ్వు భయపడి,మన ఇజ్జత్ తీయకు. అయినా ఈ కాలంలో దయ్యం అంటే ఎవరు నమ్మరు, అలాంటివేమీ ఉండవు. నువ్వు భయపడకు." రఘు : మరి నాకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ఎవరు? నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.." సురేష్ : "తను కూడా దయ్యమే కావచ్చు కానీ కొంచెం జాలి కలిగిన దయ్యం, అందుకే బహుశః నిన్ను ఏమీ చేయకుండా, లిఫ్ట్ ఇచ్చి మరి విడిచిపెట్టింది ఇంకోసారి దొరక్కు....కొన్ని అత్మలకూ నచ్చిన వ్యక్తులు దొరికితే ఏమీ చేయకుండా వదిలేస్తాయ్ అంటా.ఆ ఆత్మకు నువ్వు నచ్చావు కావచ్చు అది నిన్ను విడిచి పెట్టదు" అని భయపెడతాడు సురేష్.. అరేయ్ , భయపెట్టాకురా అని అంటాడు రఘు. ఒకే మామ. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళు.ఎల్లుండి కదా అమావాస్య, నేను ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ తో చెపుతాను. వాళ్లకు కూడా ఒక త్రిల్లింగ్ ఉంటుంది..అని చెప్పి సురేష్ రఘుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. రఘు కూడా ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతాడు. రఘు ఇంటికి వచ్చే దారిలో, ఆ రోజు రాత్రి కనబడ్డ అమ్మాయి కార్ లో వెళుతుంది. రఘు చూసి ఆశ్చర్యానికి గురి అవుతాడు. "బహుశా ఈమె ఆత్న కాదు అమ్మాయే కావచ్చు" కన్ఫాం చేసుకునేందుకు రఘు ఆమెను ఫాలో అవుతాడు. ఆ కార్ ఒక పెద్ద కంపెనీలో వెళ్లి ఆగుతుంది. ఆరిజిన్ ఆర్గనైజేషన్... అని పేరు కనబడుతుంది. ఆ అర్ధరాత్రి ఆ అమ్మాయి చెప్పిన కంపెనీ పేరు ఇదే. తను ఇందులోనే పనిచేస్తుంది అని కూడా చెప్పింది. లోపలికి వెళ్లబోతుంటే వాచ్మెన్ ఆపుతాడు. "అగు బాబు,ఎటు వెళ్తున్నావు పర్మిషన్ ఉందా?"అని అంటాడు వాచ్మెన్. "తను మాకు కావల్సిన వ్యక్తి .నేను తనను కలవాలి..వెళ్లనివ్వు మిస్టర్"...అని అంటాడు రఘు. "అవునా,అయితే మీరు ఇలా అడగాల్సిన పనిలేదు వాళ్లే నాకు చెప్తారు కదా..మీకు ఎలాంటి పర్మిషన్ లేదు మీరు వెళ్ళండి సార్ నసపెట్టకుండా" రఘు :"అరేయ్ ,తను మాకు తెలిసిన వాళ్ళు అని చెప్తున్నాను కదా..." కొంచెం అరుస్తూ... వాచ్ మెన్ పై.. "అయితే తను మీకు ఏమవుతారు," "కాస్త ఆలోచించి, ఫ్రెండ్ అని అంటాడు..." "మేడం గారి ఫ్రెండ్స్ అందరు నాకు తెలుసు.. తన ఫ్రెండ్స్ ఎవరు తన పర్మిషన్ లేకుండా ఇక్కడికి రారే మరి" "మీరు మేడంకి ఫోన్ చేసి చెప్పండి మిమ్మల్ని పంపిస్తాను నిరభ్యంతరంగా.." ... "ఏంటి బాబు ఆలోచిస్తున్నావ్ ఫోన్ చెయ్.."అని గద్దిస్తాడు వాచ్మెన్ రఘు : "అది..ఫోన్ నంబర్ లేదు.మీరే ఇవ్వండి..


"ఏంటి తమాషాలు చేస్తున్నావా.నంబర్ లేదు.ఎం లేదు...అసలు ఆ అమ్మాయి గారు ఎవరో నీకు తెలుసా..." రఘు, వాచ్మెన్ మాటలకి తెల్లబోయి నిల్చోని, రఘు : "ఎవరు తను?" అని అడుగుతాడు. "అరిజీన్ ఆర్గనైజేషన్ కి కాబోయే సీఈఓ ,తన పేరు సౌజన్య రెడ్డి" రఘు అలాగే షాక్ తో వింటాడు.. "ఆ అమ్మాయి (సౌజన్య రెడ్డి) కార్ దిగి,వెనుక తిరిగి చూస్తుంది రఘుని.కాని తను ఎవరో తెలియనట్టు , పలకరించకుండా వెళ్ళిపోతుంది." "మేడం నిన్ను చూసి కూడా పిలువలేదు అంటే నువ్వు ఎవరో తెలీదు ఇక్కడి నుంచి వెళ్ళిపో చూస్తే మళ్ళీ నన్ను తిడతారు.."అంటూ వాచ్మెన్ రఘుని నెట్టేస్తాడు బయటికి రఘు అక్కడి నుండి ఇంటికి వెళ్ళి పోతాడు. ఇంట్లో వెళ్ళిన తర్వాత బాగా ఆలోచిస్తాడు. అమ్మాయి ఉంది నిజమే?ఈమె ఒకే...ఆ బీచ్ లో దయ్యం ఉంది..అది కూడా నిజమే... అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు ఇందులో ఎవరు దెయ్యం? ఎవరు మనిషి? అర్థం కాక బుర్ర పిచ్చెక్కిపోతుంది దేవుడా.ఆ అమ్మాయి ఎందుకు నన్ను చూసి చూడనట్టు, తెలియనట్టు చూసి వెళ్ళిపోయింది. అలాగే ఆలోచనల్లో మునిగి పోయి ఉన్నప్పుడు ఫోన్ కి మెసేజ్ వచ్చింది,దాంతో రఘు ఒకసారి మొబైల్ తీసి చూస్తాడు.అప్పటికే సాయంత్రం అవుతుంది. ఎవరో "హాయ్..!! హౌ ఆర్ యు డియర్ అని మెసేజ్ వచ్చింది" రఘు : ఎవరు మీరు ? అని మెసేజ్ చేస్తాడు. అవతలి వైపు నుండి, "నేను నిన్న రాత్రి నీకు లిఫ్ట్ ఇచ్చాను.ఆ అమ్మాయే నేను..." రఘు : నా నంబర్ ఎలా దొరికింది.. అమ్మాయి : "నేను అనుకుంటే ,ఎవ్వరి నంబర్ అయినా దొరుకుతుంది.." రఘు : హో ఒకే, కాబోయే సీఈఓ అంటే ఆ మాత్రం ఉంటుంది అని తనలో తాను అనుకోని..... "నేను మీ ఆఫీస్ కి వచ్చా..నువ్వు నన్ను చూడలేదా..." అమ్మాయి: "అవునా, ఐ యాం సోరీ,నేను నిన్ను గమనించలేదు.." రఘు : కెన్ ఐ కాల్ యూ... అమ్మాయి : "వద్దు ,అమ్మ నాన్న ఉన్నారు.నేను ఇంట్లో ఉన్నాను.నేను మళ్ళీ నీతో మాట్లాడుతాను బాయ్" అని మెసేజ్ చేస్తుంది. రఘుకి ఏదో తెలియని నిరాశ ఆవరించిన, ఆ అమ్మాయి కనబడింది మరియు మెసేజ్ చేసింది అన్న సంతోషం తనకు కలిగింది.తన మనసులో ఎలాగైనా ఒకసారి ఆ అమ్మాయిని కలవాలని నిర్ణయించుకుంటాడు. రఘు సురేష్ కి ఫోన్ చేసి, అరేయ్ మామ,ఆ అమ్మాయి కనపడింది రా..అదే రా..అర్ధరాత్రి నాకు దేవతలా లిఫ్ట్ ఇచ్చింది..ఆ అమ్మాయిని చూసాను.తను నాకు మెసేజ్ కూడా చేసింది...అని అన్ని విషయాలు చెప్పేస్తాడు. "అవును,సూపర్,తను ఎవరో పూర్తి విషయాలు తెలుసుకున్నావా.."మళ్ళి తర్వాత దయ్యం అంటావా"..అంటాడు సురేష్.. "అదేం లేదు రా,తను మనిషే.." "ఒకే ఎల్లుండి బీచ్ కి వెళ్ళాలి. రెఢీగా ఉండు.నేను మన అందరి ఫ్రెండ్స్ కి కూడా విషయం వివరించాను.వాళ్ళు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు దయ్యాన్ని చూడటానికి.నువ్వు నీ దయ్యాన్ని చూపించడానికి రెడీ గా ఉండు" రఘు : "అరేయ్.నువ్వు మరీ ఎక్కువ భయ పెడుతున్నవు.


" సురేష్ : సర్లే కాని రేపు ఆఫీస్ లో మన ప్రాజెక్టు, గవర్నమెంట్ టెండర్ లో సెలెక్ట్ అయి మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది.పార్టీ చేసుకోవడానికి మంచిగా రెడీ అయిరా.. రఘు : ప్రాజెక్ట్ మనకు వస్తుందని గ్యారెంటీ ఏంట్రా... సురేష్ : "దానిని తయారుచేసింది ఎవరు? ది గ్రేట్ రఘు వరుణ్, బి టెక్...చూడ్డానికి పిరికొడే అయినా ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే తిరుగుండదు.ఇంతకు ముందు కూడా 2 ప్రాజెక్ట్ లు కూడా నువ్వు డిజైన్ చేసినవే.అప్పుడు కంపెనీకి చాలా కోట్లు లాభాలు వచ్చాయి.అదే నమ్మకం నాకు ఇప్పటికీ కూడా ఉంది.తప్పకుండా ప్రాజెక్ట్ మనకే వస్తుంది." అలా ఇద్దరు మాట్లాడుకొని,రేపు ఉదయం ఆఫీస్ కి బయలుదేరుతారు.ఆ టెండర్ లో వారికి ప్రాజెక్ట్ అనుకున్నట్టే వస్తుంది.ఆఫీస్ స్టాఫ్ అందరికీ పార్టీ ఇస్తాడు బాస్,అలాగే రఘుని అభినందిస్తాడు. ఈవెనింగ్ సురేష్ మరియు రఘు ఇద్దరు షాపింగ్ చేయడానికి కళా మందిర్ షాపింగ్ మాల్ కి వెళ్తారు . అదే సమయానికి ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మతో అక్కడికి షాపింగ్ కి వస్తుంది. రఘు ఆ అమ్మాయిని చూస్తాడు.చాలా సంతోషంతో సురేష్ కి కూడా చూపిస్తాడు. షాపింగ్ మాల్ లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి షాపింగ్ చేయడం మొదలుపెట్టింది. వెంటనే రఘు ఉత్సాహంతో వెనక నుండి వెళ్లి, "హాయ్ సౌజన్య రెడ్డి గారు, అని అంటాడు మీరు నాకు డైరెక్ట్ గా కలుస్తారు అని నేను అనుకోలేదు వాటే కోఇన్సిడెన్స్ కదా..అని అంటాడు రఘు.. ఆ అమ్మాయి "ఎవ్వరూ మీరు అని అడుగుతుంది.? మీరు నన్ను చూసి మరెవరో అనుకొని పొరబడుతున్నారు.నా పేరు సుహాసిని ,సౌజన్య రెడ్డి కాదు." అని చెప్పగానే రఘు షాక్ అవుతాడు. "అదేంటి? ఆ రోజు రాత్రి మీరు నన్ను స్కూటీ మీద డ్రాప్ చేశారు.అలాగే నిన్న నాతో చాటింగ్ చేశారు అంటూ" మెసేజెస్ కూడా చూపిస్తాడు "మీరు పోరపడుతున్నారు.నాకు స్కూటీ లేనే లేదు.ఎప్పుడు కార్ లోనే వెళ్తాను మరియు ఈ మెసేజెస్ నావి కావు " ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ "ఎవరు ఈ అబ్బాయి "అని అడుగుతుంది తనను అమ్మాయి : ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నాడు అమ్మా! పద మనం వెళ్దాం. రఘు షాక్ లో ఉండిపోతాడు. ఎంటి ఈ అమ్మాయి!ఇలా అంటుంది? నిజంగా తన పేరు సుహాసినే కావచ్చు.పక్కనే వాళ్ళ అమ్మ కూడా ఉంది కాబట్టి నాకు అబద్ధం చెప్పే అవకాశం లేదు. మరి ఆ అమ్మాయి ఎవరు? వీరు ఒక్కరా ఇద్దరా?ఏమి అర్థం కావట్లేదు.రూపం చూస్తే ఒకేలా ఉంది.స్కార్ఫ్ లో ఉండి నేనే సరిగ్గా చూడలేదు కావచ్చు అని..అనుకుంటాడు. సురేష్ : "ఏంట్రా రఘు. అమ్మాయి అన్నావు? చాటింగ్ అన్నావు? తీరా వచ్చి చూస్తే నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది." రఘు : "నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవడానికి తను నా గర్ల్ ఫ్రెండ్ ఏమి కాదు. జస్ట్ కలిసి ఒకసారి థాంక్స్ చెప్పాలని...అంతే.." సురేష్ : "ఆ అమ్మాయి మాటలు వింటుంటే ఆమె చెప్పింది నిజమే అని నాకు అనిపిస్తుంది.." రఘు : "మరి నాకు వాచ్మెన్ అబద్ధం చెప్పాడు అంటావా? మరి వాడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? మరి నాకు మెసేజ్ చేసింది ఎవరు? అయ్య బాబోయ్ నాకు ఏమీ అర్థం కావడం లేదు..." సురేష్ : మామ ఒకసారి కాల్ చేయరా ఆ నెంబర్ కి రఘు : ఇప్పుడు ఎందుకు రా? సురేష్ : "ఒరేయ్ మట్టిబుర్ర ఎదవ?ఫోన్ చేస్తే తెలుస్తుంది కదారా ఆమె దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది, అప్పుడు నీకు మెసేజ్ చేసింది ఆ అమ్మాయే అని నీకు తెలుస్తుంది మరియు తను ఇంతవరకు చెప్పింది అబద్దం అని కూడా తెలుస్తుంది." రఘు : ఆ అమ్మాయి నెంబర్ కి కాల్ చేస్తాడు... సురేష్ : అరేయ్ నీ నెంబర్ అంటే తెలిసిపోతుంది. నా నంబర్ నుండి చెయ్ రా రఘు : ఓకే రా, అని సురేష్ మొబైల్ తీసుకుని ఆ అమ్మాయి నెంబర్ కి ఫోన్ చేస్తాడు రఘు. సురేష్ : ఫోన్ రింగ్ అవుతుంది..... కానీ ఎవరి లిఫ్ట్ చేయడం లేదు. షాపింగ్ మాల్ లో ఆ అమ్మాయి మరియు పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు. వాళ్ల దగ్గర ఎలాంటి ఫోన్ సౌండ్ రావడం లేదు. బహుశా వాళ్ళు సైలెంట్లో పెట్టి ఉండవచ్చు అంటాడు రఘు. అంతలో ఒక అమ్మాయి వాయిస్... ఫోన్ లో "హలో" అని వినబడుతుంది. వెంటనే ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఎదురుగా ఉన్న అమ్మాయి షాపింగ్ చేస్తూ ఉంటుంది మరి ఫోన్లో మాట్లాడుతుంది ఎవరు? దయ్యమా? ఇద్దరికి భయం వేస్తుంది... రఘు : హలో సౌజన్య రెడ్డి గారా... అమ్మాయి : హా అవును.చెప్పండి.ఎవరు మీరు? రఘు : నా పేరు రఘు.నిన్న చాటింగ్ చేశారు గుర్తుంది కదా... అమ్మాయి : హా గుర్తుంది.కానీ నేను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను. మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి...


ఇద్దరూ కూడా షాపింగ్ మాల్ నుండి షాపింగ్ చేయకుండానే వెనక్కి వెళ్ళిపోతారు. ఇద్దరు వెళ్లి బార్ షాప్ లో ఫుల్లుగా బీరు తాగుతారు. రఘు : "ఎం జరుగుతుంద్రా అసలు నా చుట్టూ..నాకు ఎం తెలిసి చావట్లేదు..." సురేష్ : "అరేయ్ ,అవన్నీ పట్టించుకోకు, ఈరోజు నువ్వు చేసిన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది. బాస్ ఫుల్లు అప్రిషియేట్ చేసిండు. నువ్వు హ్యాపీ గా ఉండు అని అవే సర్దుకుంటాయి.." రఘు : "ఏమోరా... నాకు ఆ మెసేజ్ రాకున్నా బాగుండేది.నాకు ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు ఉండేది కాదు." రఘు ఫోన్ లో మెసేజ్ వస్తుంది... అవతలివైపు ఆ అమ్మాయి "హాయ్" అని మెసేజ్ చేసింది. సురేష్ : "ఎవరు రా మామ, నీకు మెసేజ్ చేసింది." రఘు :" ఇంకెవరూ ఆ దయ్యమే...." సురేష్ రఘు పరిస్థితిని చూసి " హా హా ..నవ్వుతాడు.." రఘు : "ఎందుకురా నవ్వుతున్నావు." "సారి మామ..ఊరికే నవ్వా...నువ్వేం బాధ పడకు ..ఎలాగైనా ఆ దయ్యం మిస్టరీనీ మనం బయట పెట్టీ తీరుదాము. రఘు : "అలాగే రా..తప్పకుండా రేపే అమావాస్య. ఈరోజుతో అక్కడ దయ్యం ఉందా లేదా నాకు తెలియాలి.ఇంకా నాకు msg చేసినా అమ్మాయి ,షాపింగ్ మాల్ కలిసిన అమ్మాయి ఒక్కరే కదా నాకు తెలియాలి.ఇవన్నీ తెలుసుకొని గేమ్ ని క్లోజ్ చేస్తాను...అంటూ" చాలా ధైర్యంగా మాట్లాడుతాడు రఘు సురేష్ : "అవునురా.మన సిటీలో ఎన్నో రోజులుగా బీచ్ లో అందరికీ కనబడే దెయ్యం మిస్టరీ గనక మనం బయట పెట్టగలిగితే మనకు మంచి పేరు కూడా వస్తుంది." రఘు : "ఒకవేళ అక్కడ నిజంగా దయ్యమే ఉంటే..." సురేష్ : "నాకు తెలిసిన ఒక సిద్ధాంతి ఉన్నారు..వారితో ఈ విషయం చెప్పాను. వారు కూడా మనతో పాటు వస్తా అని అన్నారు." రఘు : గుడ్ రా సురేష్... సరే చాలా లేట్ అయిపోతుంది. నేను నిన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేసి,నేను వెళ్తాను పద అని అంటాడు. సరే పద అంటూ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. **************************


మరుసటి రోజున ఉదయం... రఘు ఉదయాన్నే ఆఫీస్ కి బయల్దేరాడు. వెంటనే అతనికి ఎదురుగా ఒక నల్ల పిల్లి అడ్డు వచ్చింది. వాళ్ళ అమ్మ అది అపశకునం అని చెప్పినగాని వినకుండా రఘు ఆగకుండా అర్జంట్ ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. అలా ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఒక కారు అతన్ని గుద్దడానికి వస్తుంది. వెంటనే ఒక అమ్మాయి అతన్ని వెనక్కి లాగి కాపాడుతుంది. హఠాత్తుగా కల చెదిరిపోయి మేల్కొంటాడు రఘు. రఘును వాళ్ళ అమ్మ చూసి, "ఏమైందిరా సడన్ గా లేచావు?"అంది రఘు వాళ్ళ అమ్మ అదేం లేదు అమ్మ... ఎదో పీడకల వచ్చింది లే... " అవునా ,అయితే ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకు ముందే నీకు ఈరోజు మంచి రోజు కాదు. అందులో ఈరోజు అమావాస్య రోజు. గత అమ్మవాస్య నాడు కూడా నువ్వు అర్ధరాత్రి ప్రయాణం చేసి చాలా ఇబ్బంది పడ్డావూ." "మేము నీ జాతకాన్ని తీసుకెళ్లి జ్యోతిష్యుని దగ్గరికి తీసుకెళితే,నీకు కన్య దోషం ఉందని చెప్పాడు." "కాబట్టి నువ్వు ఏ అమ్మాయితో తిరక్కు. ఈ రోజు బయటకు వెళ్ళకు" రఘు : "అమ్మ నీకు తెలుసు కదా..నీకు చెప్పకుండా ఎవరిని కూడా లవ్ చేయను అని నువ్వు మళ్లీ నా మీద అనుమానం పడతావు. ఈరోజు నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి ఆఫీస్కి.." రఘు మాత్రం వాళ్ళ అమ్మ ఆఫీస్ కి సెలవు పెట్టమని చెప్పినా వినకుండా రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతాడు.వెంటనే తనకు ఒక నల్ల పిల్లి ఎదురు వస్తోంది. రఘు వాళ్ళ అమ్మ చూసి, "ఒరేయ్ సన్నాసి!ఈరోజు నీకు మంచి రోజు కాదు అని చెప్పాను కదా! అందుకే ఈ అపశకునం వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా మూస్కొని ఇంట్లో ఉండు..."అని చెప్పింది అమ్మ రఘులో కూడా ఏదో దిగులు మొదలవుతుంది. ఈరోజు అన్ని కలలో జరిగినట్టే జరుగుతున్నాయి. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి అని కాసేపు ఆగి కాస్త మంచి నీళ్ళు తాగి బయలుదేరుతాడు. తను ఒక రోజు స్వప్న శాస్త్రం పుస్తకం చదువుతున్నప్పుడు " వేకువ జాములో వచ్చే కలలు దాదాపు నిజం అవుతాయి " అని అందులో రాసి ఉంది. ఆ పుస్తకం ప్రకారమే ఈ రోజు జరుగుతుందేమో అని తలుచుకుంటూ బైక్ రోడ్డు క్రాస్ చేస్తాడు. బైక్ పెట్టేసి తను నిల్చుంటాడు. అతని మీదికి బ్రేకులు ఫెయిల్ అయిన ఒక బస్ అనేది వేగంగా వస్తుంది. వెంటనే అక్కడ ఉన్న ఒక అందమైన వైట్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అతన్ని వెనక్కి లాగి కాపాడుతుంది. ఆమె ఎవరో కాదు షాపింగ్ మాల్ లో రఘు చూసిన అమ్మాయి సుహాసిని.అదే అమ్మాయిని తను అర్ధరాత్రి రోజు కూడా చూశాడు. తనకు ఆ అమ్మాయి రూపం మరియు స్వరం బాగా గుర్తుంది. సుహాసినికి థ్యాంక్స్ చెపుతాడు రఘు. ఆ అమ్మాయి కూడా అతన్ని గుర్తుపట్టి పట్టనట్టుగా, ఇట్స్ ఓకే చెప్పి, తను స్కూటీపై వెళ్తుంది. రఘు ఆ అమ్మాయి వెళ్లే వైపే చూస్తూ ఉంటాడు.ఇలాంటి అందమైన అమ్మాయి నా జీవితంలో వస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తాడు రఘు.అప్పుడే ఆ అమ్మాయికి పడిపోతాడు. **********************


రఘు ఆఫీస్కి వెళ్తాడు. వెంటనే రఘు సురేష్ ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. సుహాసిని లేదా సౌజన్య రెడ్డి మరియు నాకు అర్ధరాత్రి లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ఒకరా లేక వేర్వెరా ? తెలుసు కోవడానికి నేను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను... సురేష్ : ఏంట్రా అది.... రఘు, సురేష్ ప్లానింగ్ మొత్తం వివరిస్తాడు. సురేష్ కూడా దానికి అంగీకరిస్తాడు. తనకు తెలిసిన ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఫ్రెండ్ కి , మెసేజ్ లు చేస్తున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో మరియు అడ్రస్ కనుక్కో అంటూ ఆ నంబర్ ని తన మిత్రుడుకీ యిస్తాడు సురేష్. తర్వాత ఇంకో మిత్రుడికి ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి ,ఆమె నంబర్ నీ సెండ్ చేస్తాడు. చూస్తుండగానే సాయంత్రం అయింది.రఘు మరియు సురేష్, వారితో పాటు మరో ఇద్దరు మిత్రులు ఒకరు సిద్ధాంతి గారు అందరూ కలిసి రాత్రి 11 గంటలకు , అక్కడున్న దయ్యం గుట్టు తేల్చడానికి బీచ్కి బయలుదేరుతారు కార్ లో.రఘు మాత్రం బైక్ ను డ్రైవ్ చేస్తూ ముందుకు దారిచూపుతాడు. అది అర్ధరాత్రి అమావాస్య కావడం వల్ల బీచ్ లో ప్రశాంతంగా ఉన్న సంద్రం కూడా గంభీరంగా, ఉవ్వెత్తున లేచే కెరటాలతో మనుషులను సైతం మింగెలా ? ఎగసి ఎగసి పడుతున్నాయి. పచ్చని ప్రకృతి సైతం ప్రకంపనలు చేస్తూ బీతి కలిగిస్తుంది. ఆకాశంలో ఇంకా గబ్బిలాలు తిరుగుతూనే ఉన్నాయి. పెద్దపెద్ద వృక్షాలు గాలికి శబ్దాలను చేస్తున్నాయి. ఆ రహదారి వెంట కారు ప్రయాణిస్తుంటే , గాలి వచ్చి ముందుకు వెళ్ళకంటూ జోరుగా వెనక్కి నెడుతోంది. ఇలా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను చూసి కూడా, భయం భయం తోనే కారు ముందుకు సాగుతుంది. అందరి సిద్ధాంతి గారి పై నమ్మకం పెట్టి ఉంచారు నా స్నేహితులు.రఘు మాత్రం చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు. రఘు బైక్ ని ఆపాడు. వెనక వారికి సైగ చేశాడు. వారందరూ కూడా సిద్ధాంతితో పాటు చీకటిగా ఉన్న బీచ్ వైపు రఘును అనుసరిస్తూ వెళ్తున్నారు. సిద్ధాంతి గారు మంత్రాలు చదువుతున్నాడు. అందులో ఒక వ్యక్తి, "సిద్ధాంతి గారు మీ మంత్రాలు వింటే దయ్యాలు వచ్చి చితగ్గొడతాయి కావచ్చు"ఎందుకంటే మూవీస్ లో అలానే జరుగుతుంది. "ఊరుకోరా బుద్ధిలేని వెధవా! నన్ను చూస్తూ ముందుకు సాగు అని అంటారు సిద్ధాంతి.." అందరూ వెళుతుంటారు. రఘు దయ్యాన్ని చూశా అని చెప్తాడు. వెనక ఉన్న వారి గుండెల్లో గుబులు పుడుతుంది. అందరికీ ముచ్చెమటలు పట్టేస్తాయి సిద్ధాంతి గారితో సహా. సురేష్ మాత్రం ఒకటి గమనిస్తూ ఉన్నాడు. దయ్యం అంటే భయపడే వాడు రఘు , ఇంత ధైర్యంగా ఎలా ముందుకు వెళ్తున్నాడో అర్థం కావడం లేదు. అందులో దయ్యాన్ని చూసి కూడా ధైర్యంగా నిలబడి ఉన్నాడు. సురేష్ కి లోలోపల ఏదో అనుమానం కలిగింది. ఒకవేళ రఘు దయ్యం కావచ్చు అని. ఛ ఛ .. అలా ఏమీ ఉండదు అని అందరూ ముందుకు వెళ్తారు. అందరూ చూసి షాక్ అవుతారు రఘుతో సహా... అక్కడ ఏముందంటే.. బీచ్ మధ్యలో నాలుగు కర్రలు పాతిపెట్టి నిర్మించిన చిన్న గుడిసె,ఆ గుడిసె మీద ఒక కర్ర, దానికి తెల్లని వస్త్రం కట్టేసి ఉంది. ఎవరైనా దానిని దూరం నుండి చూస్తే, బీచ్లో అది గాలికి రెపరెపలాడుతూ ఎగరడం వల్ల, అది అందరికీ దయ్యంలా కనిపించి దాని జోలికి ఎవరు వెళ్లలేదు. పుకార్లు మరియు తెలియని భయాలు ఆ దయ్యం అనే ఒక కల్పిత పాత్రకి మరింతగా ప్రాణం పోశాయి. ఆ ప్రదేశంలో ఎవరికీ యాక్సిడెంట్ అయి చనిపోయిన అది దయ్యమె చేసిందని బలంగా నమ్మేవారు. నిజంగా అక్కడ ఎలాంటి దయ్యం లేదు కేవలం భయం తప్ప.మొత్తానికి విజయవంతంగా దయ్యం గుట్టు రట్టయింది. అందరూ ప్రాణాలతో ఊపిరిపీల్చుకున్నారు. అక్కడినుంచి అందరూ సంతోషంగా ఇళ్లకు వెనుదిరిగారు.


ఉదయం అవ్వగానే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ లో ఒకటి వార్త.... ఒకటే headline... "ఇన్ని రోజులుగా భయబ్రాంతులకు గురి చేస్తున్న బీచ్లోని దయ్యం గుట్టురట్టయింది. ఒక యువకుల బృందం దీనిని చేధించింది. రఘు మరియు సురేష్ మరియు వారి యొక్క మిత్రులను, జిల్లా డి.ఎస్.పి గౌరవంగా సత్కరించి అభినందించారు." రఘు సురేష్ కి కాల్ చేస్తాడు.... "హలో రఘు చెప్పురా.." "ఆ మామ లేచావా...!?" "లేచాను రఘు, మన వార్తే న్యూస్ లో పదే పదే వస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే నిన్న రాత్రి నిన్ను చూసి నేను ఎక్కువ భయపడ్డాను" అని అంటాడు సురేష్ "ఎందుకురా అలా అంటున్నావు?" "ఉన్నట్టుండి నువ్వు చాలా ధైర్యంగా ఉంటేనూ,?" "దానికి ఒక సీక్రెట్ ఉంది అది ఏంటంటే నిన్న రాత్రి మొత్తం నేను గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను.నిజానికి దయ్యాలంటూ ఉండవు అవి కేవలం మనం కల్పించుకున్న కల్పిత ఊహలు మాత్రమే. నిజంగానే ఒకవేళ దెయ్యాలు ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి శరీరం లేదు కనుక అవి మన కంటికి కనబడవు.మనల్ని ఏమీ చేయలేవు. మనం మన సమాజంలో దయ్యం అనే ఒక బొమ్మని వేసిన దానిని క్రూరంగా చిత్రీకరించాం, అది ఏమైనా చేయగలదు, దానికి మాయలు వచ్చు ,మంత్రాలు వచ్చు, మనిషిని చంపేస్తుంది అంటూ మనమే ఊహించుకొని ,అడ్డుగోడలు గీసి, ప్రతిక్షణం దాన్ని చూసి భయపడుతున్నాము. వాస్తవానికి దయ్యాలు భూతాలు లేవు. ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఇలా తయారయ్యాను.ఆ రోజు రంగయ్య రాకున్నా కోతి బొమ్మను చూసి రంగయ్య అనుకొని తాళం ఇచ్చి వచ్చాను. అది నాకు తర్వాత గుర్తుకు వచ్చింది. నేను పుస్తకం చదివినప్పుడు నాలో నేను ఊహించుకుంటున్న తప్పుడు ఆలోచనలే నాకు భయానికి కారణాలు అని తెలుసుకున్నాను. సురేష్ : "ఓహొ....ఇదా సంగతి.... చాలా బాగా ఆలోచించావు." రఘు : "ఈరోజు సుహాసిని ఇందిరా గాంధి పార్క్ కి వెళ్తుంది. నేను ఈ రోజు తనను కలుస్తాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా. మనం అనుకున్నట్టే జరగాలి .ఎవరికీ కూడా ఎలాంటి అనుమానం రాకూడదు " అని రఘు సురేష్ కి చెప్తాడు. సురేష్ : సరే రా,అన్ని నువ్వు చెప్పినట్టే చేశాను.నువ్వు తనని కలిశాక చెప్పు. రఘు : ఓకే రా....భై అని ఫోన్ పెట్టేస్తాడు రఘు. *************************


సుహాసిని ఇంట్లో.. సుహాసిని నిన్నటి నుండి చాలా దిగులుగా ఉంది. అన్నం కూడా తినటం లేదు.ఏమైందో తనకు అని వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడుతున్నారు. అప్పుడే వాళ్ళ స్నేహితురాలు శ్వేత వచ్చింది. అది చూసిన సుహాసిని వాళ్ళమ్మ శ్వేతతో , "అమ్మ! శ్వేత సుహాసిని నిన్నటి నుండి ఎందుకో డల్ గా ఉంది నేను అడిగితే ఏమీ చెప్పట్లేదు. నువ్వు అయినా కాస్త అడిగి తెలుసుకో'..అని చెప్పింది. "అలాగే ఆంటీ, ఎక్కడుంది తను.." "పైన తన గదిలో పడుకుని ఉంది. నేను లే అని ఎంత బతిమాలినా లేవలేదు." "నేను లేపుతాను ఆంటీ గారు, మీరు ఏం బాధపడకండి. మీరు తనకు భోజనం చేసి ఉంచండి,తను వచ్చి తింటుంది" అలాగే నమ్మ...అని సుహాసిని వాళ్ళ అమ్మ కిచెన్ లోకి వెళ్తుంది. **** "సుహాసిని....లే సుహాసిని...ఎంటే నీ మొద్దు నిద్ర..లే అంటే లేవట్లేదు... అన్నం కూడా తినట్లేదు అంట.. నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందే నీకు..?" సుహాసిని ఏడవడం చూసి, శ్వేత కంగారు పడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. సుహాసిని చెప్పదు అలాగే బాధపడుతూ ఉంటుంది. శ్వేత: "ఏమైందో చెప్పు సుహాసిని... ఎప్పుడు హ్యాపీ గా ఉండే దానివి ఎందుకు ఇలా అయ్యావు ఒకసారిగా.నేను నీ బెస్ట్ ఫ్రెండ్నీ నాతో చెప్పు..." సుహాసిని : "మొన్న నేను మా అమ్మతో కలిసి షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఎవడో నన్నే ఫాలో అయ్యాడు అంట.నేను షాపింగ్ మాల్ లో రెస్ట్ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు ,తను ఒక సీక్రెట్ కెమెరా ద్వారా ఫొటోస్ మరియు వీడియోస్ తీశాడంట.


నిన్న నాకు కాల్ చేసి బెదిరించాడు. తనకు లక్ష రూపాయలు డబ్బు అవసరం ఉంది అది ఇస్తే , ఆ ఫొటోస్ మరి వీడియోస్ డిలీట్ చేస్తాను,ఎవ్వరికీ లీక్ చేయను అని చెప్తున్నాడు. ఈ విషయం అమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు" అని శ్వేతని పట్టుకుని ఏడుస్తుంది సువాసిని. శ్వేత : మరి ఆ డబ్బు ఇవ్వడానికి ఏక్కడికి రమ్మన్నాడు? ఆ రోగ్... సుహాసిని: ఇందిరా గాంధీ పార్క్ కి శ్వేత : "నువ్వు భయపడకు,మా మామ డి.ఎస్.పి. ఆయనకి ఒక కాల్ చేస్తే అంతా ఆయనే చూసుకుంటాడు." సుహాసిని: "పోలీసులకు చెప్తే తనకు తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు తనకు కానిస్టేబుల్ నుండి కమిషనర్ వరకు అందరూ తెలుసు. వాళ్ల ద్వారా మనం ఏం చేయలేం. అలా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తనకు తెలిస్తే నా జీవితం మొత్తం యూట్యూబ్లో పెడతాడు. దీనిని మనమే జాగ్రత్తగా డీల్ చేయాలి శ్వేత.." శ్వేత : "మనం ఇద్దరం ఏం చేయలేము శ్వేత. మనకు నాలెడ్జ్ ఉన్న ఎవరైనా బాయ్స్ సపోర్ట్ ఉండాలి." సుహాసిని : "ఇపూడు ఎలానే...మనకు తెలిసిన వారు ఎవ్వరూ లేరు..." శ్వేత: "సరే మనం ముందుగా ఇందిరాపార్కు వెళ్లి ఆ రాక్షసుని కలుద్దాం. ఎలాగైనా తనని బ్రతిమాలి తన దగ్గర నుండి అన్ని డిలీట్ చేయమని చెబుతాను. పోతే ఒక లక్ష రూ₹ పోతాయి.మనకు మళ్లీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా..." సుహాసిని : సరే నే.... శ్వేత : నువ్వు డల్గా ఉండకు .కాబోయే సీఈవో వి. ఎంత హుషారుగా ఉండాలి. **** ఇద్దరు కూడా ఇందిరా గాంధీ పార్క్ కి వెళ్తారు. రఘు కూడా సుహాసిని వాళ్ళు ఇందిరా గాంధీ పార్క్ కి వెళ్తున్నారని తెలుసుకుని, వాళ్ళ కంటే ముందే ఏమి కూడా ఏమి కూడా ఎరుగనట్టు పార్క్ లో వెళ్లి ఉంటాడు. రఘును , సుహాసిని చూస్తుంది. సుహాసిని అతన్ని కలవాలని అనుకుంటుంది కానీ ఏదో ఏదో తెలియని మొహమాటం, తన సమస్యను ఇతనికి చెప్తే ఏమైనా పరిష్కరిస్తాడేమో అని అనుకుంటుంది కానీ పిరికివాడు ఏం చేయగలడు. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు అని మనసులో అనుకొని రఘుని కలుస్తుంది. హాయ్ రఘు,అని అంటుంది సుహాసిని... రఘు షాక్ అవుతాడు.నేను తనని కలవాలని వస్తె తనే నన్ను కలిసింది.దేవుడా నువ్వు చాలా గ్రేట్ అని తనలో తను అనుకుంటాడు. "హలో బాస్...ఎక్కడున్నావు..నిన్నే"... అని రెండోసారి పిలవగానే..


ఊహల నుండి బయటికి వస్తాడు రఘు. "హలో మేడం బాగున్నారా...?" "మేడం వద్దులే కానీ నా పేరు సుహాసిని.. సుహాసిని అని పిలువు." "ఒకే సుహాసిని. చాలా థ్యాంక్స్ అండీ" "ఎందుకు ?" "ఒక రోజు అర్ధరాత్రి బైక్ రిపేర్ అయితే నాకు లిఫ్ట్ ఇచ్చారు మరియు బస్ డీ కొడుతుంటే కాపాడారు." "ఓకే... నువ్వు చాలా ఇంటెలిజెంట్. ఆరోజు నీకు లిఫ్ట్ ఇచ్చింది నేనే అని ఎలా కనిపెట్టావూ. ఆరోజు నేను స్కార్ఫ్ కట్టుకునే ఉన్నా నువ్వు నన్ను చూడలేదు కదా..మరి ఎలా" రఘు : " మిమ్మల్ని ఆరోజు షాపింగ్ మాల్ లో చూసినప్పుడు, అదే స్కార్ఫ్ ని మీరు తెచ్చారు. కానీ సేమ్ స్కార్ఫ్ అందరూ వాడొచ్చు అని ఆరోజు నేను లెక్క చేయలేదు. నేనే పొరపడి ఉంటాను అని అనుకున్నా. తర్వాతి రోజు మీరు నన్ను బస్ ఆక్సిడెంట్ నుండి కాపాడినప్పుడు , మీరు నన్ను డ్రాప్ చేసిన స్కూటీనే తెచ్చారు.అదే డ్రెస్ నీ మీరు వేసుకున్నారు. అప్పుడే నాకు 50% మీరే అని అర్థమైంది. ఇంకా 50% కన్ఫర్మ్ మీరు ఇందిరా గాంధీ పార్క్ కి రావడం ద్వారా తెలిసింది"అని అంటాడు రఘు. సుహాసిని : సుహాసిని అనుమానంగా ఆలోచిస్తూ... "అంటే మేము వస్తున్న విషయం నీకు ముందే తెలుసా...?" రఘు : "ఆ తెలుసు కానీ అది ఎలా తెలుసో మీకు తర్వాత చెప్తాను..." కానీ ఆ రోజు అర్థరాత్రి మీరు మాట్లాడే ప్రతి మాట... నను చాలా భయపెట్టింది. ఆ రోజు రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. మీరు నిజంగా దయ్యమే అని అనుకున్నాను." సుహాసిని మరియు శ్వేత ఇద్దరు కూడా బాగా నవ్వుతారు. సుహాసిని : "నేను అంత ధైర్యవంతురాలిని కాదు. ఆ రోజు ఆఫీస్ వర్క్ చేసి లేట్ అయింది.సమయానికి కార్ రిపేర్ అయితే శ్వేత స్కూటీ నా దగ్గరే ఉంచుకున్నా.


అర్ధ రాత్రిపూట ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా. అమ్మాయిలం కదా మా భయాలు మాకుంటాయ్. నువ్వు అలా అడ్డగాడిదలా అడ్డంగా రోడ్డుపై నిలబడి ఉంటే నేను కూడా నిన్ను చూసి దయ్యమే అనుకున్నాను. కానీ వెనక నుండి నిన్ను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను.నువ్వు ఒక కుక్కని చూసి భయపడటం వల్ల నాకు చాలా నవ్వు వచ్చింది. నువ్వు పిరికివాడివి అని నాకు అనిపించింది.ఇంకా హాని చేసే వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్స్ డ్రెస్సులో అయితే ఉండరు , కొంచెం ధైర్యం చేశా, అప్పుడు నేను వెనకనుండి నిన్ను తాకితే "నువ్వు ఇంకా చాలా భయపడ్డావ్, నీలో భయమే నాలో ధైర్యాన్ని పెంచింది. అందుకే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేంతవరకు నిన్ను మాటలతో భయపెట్టాను. సో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ." రఘు : "చాలా భయ పెట్టారు మామూలుగా కాదు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ మీతో వచ్చాను. నాకు దయ్యం అంటే సుస్సు. ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా కూడా పడుకోను. అమ్మ అయినా నాన్న అయినా పక్కన ఉండాల్సిందే. జరిగిందేదో జరిగిపోయింది. కాని నేను మిమ్మల్ని కంపెనీలో కలిసినప్పుడు ,అక్కడ మీ వాచ్ మెన్ మీ పేరు మార్చి ఎందుకు చెప్పాడు తర్వాత మీరు షాపింగ్ మాల్ లో ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేస్తే , వేరే వాళ్లు లిఫ్ట్ చేశారు. అచ్చం మీ గొంతే..అది ఎలా..?నాకు అర్థం కాలేదు..." సుహాసిని : "అది ఏమంత పెద్ద విషయం కాదు. మీరు నన్ను ఫాలో అవ్వడం చూసి నేనే, వాచ్ మెన్ కి ముందే కాల్ చేసి నా పేరు మార్చి చెప్పమని చెప్పాను. తర్వాత మీరు కాల్ చేసిన సిమ్ ఫ్రెండ్ ది, ఇవిడే ఆ ఫ్రెండ్ , మీతో ఎవరైనా రఘు అని కాల్ చేస్తే నాలా మాట్లాడి, బిజీగా ఉన్నా అని ఫోన్ పెట్టెయ్ అని ముందే చెప్పి ఉంచాను." రఘు : ఓకే అవన్నీ విషయాలు వదిలేయండి.మీరు నన్ను చూసి, నా పేరు, నా బయో డేటా మొత్తం చెప్పారు అది ఎలా? సుహాసిని : " మీ మెడలో ఉన్న ఐడి కార్డు చూసి...." రఘు : "హొ అవునా....వామ్మో మీ మేధ శక్తికి జోహార్లు"అయినా నాకు ఆ రోజు షాపింగ్ మాల్ లో మీరు అబద్ధం ఎందుకు చెప్పారు. సుహాసిని : "అమ్మ ఉన్నారు. తప్పుగా అర్థం చేసుకుంటారని అలా అబద్దం చెప్పాల్సివచ్చింది."


రఘు : "ఓ ఓకే.ఓకే.....మీరు గ్రేట్ అండి.ఒక కంపెనీకి చిన్నవయసులోనే సీఈఓ అవుతున్నారు అంటే మీలాంటి గొప్ప వారిని కలవడం నా అదృష్టం. మీలాంటి వారి రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేం అండి." శ్వేత : "అంతొద్దు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు కని ఒక చిన్న పని ఉంది చేసి పెట్టు" సుహాసిని , వద్దు వద్దు అంటూ శ్వేత చేయి పట్టుకుంటుంది. ఏమవ్వదులేవే చెబుదాం అంటూ శ్వేతా అంటుంది. రఘు : "ఏమైంది.నాకు చెప్పండి.నా శాయశక్తులా నేను సహాయ పడతాను.ఏమైనా సమస్యా.." శ్వేత : అవునండి దీనికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అంటూ విషయం మొత్తం వివరిస్తుంది. రఘు : "ఆ రాక్షసుడు ఎవరో నేను కనిపెడతాను అతని నెంబర్ ఇవ్వండి." రఘు ఆ నంబర్ తీసుకుంటాడు. తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఆ నెంబర్ని ట్రాక్ చెయ్యమని చెప్తాడు. రఘు : "మీరు వెళ్ళండి ఇక్కడి నుండి. నేను అతని సంగతి చూసుకుంటాను. రేపు ఉదయం కల్లా అతన్ని నేను పట్టుకుంటాను." సుహాసిని : "చాలా థ్యాంక్స్ అండీ" రఘు : మీరు మందులాగే రఘు అని పిలవండి చాలు.... సుహాసిని అప్పుడు మనమిద్దరం ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అలా అయినప్పటి నుండి ప్రతిరోజు ఇద్దరూ మాట్లాడుకోవడం,ఇలా ఒక రోజు కాస్త తెలియకుండానే వారం రోజులు గడిచి పోతుంది. ఒకరి ప్రేమలో మరొకరు పడిపోతారు. ఒకరోజు అకస్మాత్తుగా సుహాసినికి అనుమానం వస్తుంది. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి ఎలాంటి కాల్ చెయ్యట్లేదు? అసలు ఏమైంది? ఫోన్ చేసి అడుగుతుంది రఘుని. రఘు : "హా సుహాసిని,వాడు దొరికాడు. చిత్తుచిత్తుగా కొట్టి మా ఇంటి వెనకాల గోడౌన్ లో కట్టేశాను. నువ్వు త్వరగా రా..." సుహాసిని , రఘు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రఘు వాళ్ళ కుటుంబ సభ్యులందర్ని పరిచయం చేస్తాడు సుహాసినికి. ఆ కుటుంబంలోని ప్రేమానురాగాలకు సుహాసిని కూడా వాళ్ళలో ఒకరిగా కలిసిపోతుంది. సుహాసిని : "రఘు ,వాడు ఎక్కడా?" పదా, నీకు చూపిస్తా అని ఇంటి వెనకాల, ఒక గోడౌన్ లో సుహాసినినీ తీసుకెళ్తాడు.అక్కడ ఎవరు కూడా ఉండరు. "ఏక్కడ రఘు! తను ఎక్కడ ఉన్నాడు?" రఘు : " నీకు ఎదురుగా ఉన్నాడు"


సుహాసిని : "వాట్ ? ఏమంటున్నావ్ నాకేమి అర్థం కావడం లేదు.. అర్థం అయ్యేలా చెప్పు రఘు...." రఘు : "ఆరోజు ఇందిరా గాంధీ పార్క్ లో... మిగతా 50% మీరు రావడం వల్ల నాకు కన్ఫామ్ అయ్యింది అని చెప్పాను గుర్తుందా...ఇదంతా చేసింది నేనే. ఆ ఫోన్ లో బ్లాక్ మెయిల్ చేసింది కూడా నేనే.. ఇదంతా నేను ఆడిన డ్రామా." సుహాసిని : "నినూ.......నువ్వు ఇంత రాక్షసుడివా... ఛీ... నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది." రఘు : "అబ్బా.. ఆడవారికి ఎలా చెప్తే అర్థమవుతుంది. అప్పుడు అలా అబద్దం ఆడాల్సి వచ్చింది తల్లి. మరి నువ్వు నన్ను భయపెట్టి, బాధ పెట్టినప్పుడు ఏమీ లేదా? మరి దానికి నేనేం చేయాలి?" సుహాసిని : "అయితే మాత్రం..అలా ఆడవారు బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీయడం తప్పు కదా...?" రఘు : "అయ్యో మహాతల్లి... నేను ఏలాంటి వీడియోలు ఫోటోలు తీయలేదు. నిన్ను గుర్తించడానికి అలా ఒక ట్రిక్ ప్లే చేశాను అంతే. ఇన్ని రోజులు మన ఫ్రెండ్ షిప్ లో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా..?" సుహాసిని : "అయినా నాకు నీమీద చాలా కోపంగా ఉంది" రఘు : "సరే ,తప్పంతా నాదే.ఇప్పుడు నన్ను ఎం చేయమంటావు...నువ్వే చెప్పు...సరే నీ కాళ్ళు పట్టుకొనా" అంటూ సుహాసినీ కాళ్ళ మీద పడతాడు సుహాసిని : "ఎంటి రఘు...నువ్వు మరినూ...సరే..అయిందేదో అయిందిలే. చెల్లుకి చెల్లు. మళ్లీ నువ్వు ఎప్పుడు ఇలా చెయ్యద్దు" రఘు : ఓకే ఓకే.. ఇద్దరు హాయిగా నవ్వుకుంటారు... ఇంతలో ఒక unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి సుహాసిని మాట్లాడుతుంది. ఒక అజ్ఞాత వ్యక్తి మాట్లాడుతాడు. "నువ్వు షాపింగ్ మాల్ లో డ్రెస్ మార్చుకుంటున్నప్పూడు , నీ ఫొటోస్ మరియు వీడియోస్ lతీశాను,అది యూట్యూబ్ లో పెట్టకుండా ఉండాలంటే ఒక లక్ష రూపాయలు పట్టుకొని రావాలి రేపు ఉదయం ఇందిరా గాంధీ పార్క్ దగ్గరికి........భై బేబీ"అంటూ కాల్ కట్ చేస్తాడు. సుహాసిని, రఘుని మళ్లీ అనుమానంగా చూడటం మొదలు పెడుతుంది..... రఘు కూడా ఆశ్చర్యానికి గురి అవుతాడు..... తర్వాత ఏమైంది? *************** సమాప్తం ************