A blessing or a curse? in Telugu Spiritual Stories by SriNiharika books and stories PDF | వరమా లేక శాపమా?

Featured Books
Categories
Share

వరమా లేక శాపమా?


హీరోయిన్ కాజల్

హీరో నాని

వీరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాలేదు కదా .ఇప్పుడు నా కథ లో చూడండి.

కథ లోకి వెళితే...,..


అమ్మా నా బాక్స్ రెడీ చేశావా..


అదిగో అప్పుడే పెట్టేసాను అక్కడ డైనింగ్ టేబుల్ మీద వుంది చూడు...


అబ్బా ఎక్కడ అమ్మ కనపడటం లేదు నాకు టైమ్ అవుతుంది త్వరగా రా లేదంటే నేను వెళ్ళిపోతాను...నాకు బస్ మిస్స్ అవుతుంది అమ్మా..


అబ్బబ్బ ...ఎం పిల్లో ఏమిటో అస్సలు ఒక పని రాదు కనీసం నన్ను అంట్లు కూడా రుద్ధనివ్వదు..ఆయననే అనుకుంటే ఇది ఆయన తలలో నుంచి జారిపడింది అంటూ వాష్బేసిన్ లో చేతిలో ఉన్న గిన్నెలు పడేసి త్వరత్వరగా చేతులు కడిగేసి డైనింగ్ రూమ్ లో కి వచ్చింది వనజ ....


మైథిలి తన రూం లో బుక్స్ ర్యాక్ లో ఏవో వెతుకుతుంది..


వనజ డైనింగ్ టేబుల్ మీద వున్న బాక్స్ పట్టుకెళ్ళి తన గది డోర్ దగ్గర నిలుచుంది.హడావడిగా అన్ని పడేస్తూ వెతుకుతున్న మైథిలి నీ చూస్తూ ఎం కావలె నీకు అల అన్ని పడేస్తున్నవు?అని అడిగింది వనజ.


నా కాలేజ్ ఐడీ కార్డు అమ్మ అని గది జల్లడ పడుతూ అంది మైథిలి.రూం వంక చూసింది వనజ ఎక్కడ కనపడలేదు డోర్ వెనక వైపు వున్న హ్యంగర్ గుర్తు వచ్చింది వనజ కి డోర్ వైపు చూసింది దాని వెనక వుంది.తీసి మైథిలి కి ఇచ్చింది.

అబ్బ థాంక్స్ అమ్మ. బాయ్ అమ్మ ఈ రోజు నా కేస్ స్టడీ సబ్మిట్ చేస్తున్న అమ్మ హడావుడిలో గుర్తు రాలేదు.ఒకే ఒకే బాయ్ అమ్మ అంటూ బుగ్గ మీద ముద్దు ఇచ్చి పరుగు తియ్యబోయింది..హ్యాండ్ బ్యాగ్ పట్టి వెనక్కి లాగి ఇదిగో బాక్స్ రోజు ఎలా పెట్టింది అల వస్తుంది.. ఈ రోజు అయిన మొత్తం తిను అని వనజ పూర్తిగా మాట్లాడే లోపే సరే సరే అని అంటూ మైథిలి పరుగు తీసింది..


వనజ ఇది రోజు జరిగేదేలే అని మనసులో నవ్వుకుని తన రూం లో లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి డోర్ దగ్గర వేసి మళ్లీ తన పని లో నిమగ్నం అయ్యింది.


...........


నీ ప్రాజెక్ట్ చూసాను అమ్మ .చాలా బాగుంది చాలా విషయాలు చాలా బాగా చెప్పావు...కానీ...అని సాగదిస్తున్న ప్రోఫిసర్ రత్నాకర్ శర్మ నీ చూస్తూ ఉంటే మైథిలి కి బయం అవుతుంది..


పరవాలేదు చెప్పండి సార్ అంటూ తను ముందు ఉన్న నె రికార్డ్ నీ వెనక్కి తీసుకుంటూ అంది మైథిలి...


ఎం లేదు మైథిలి..నీ ప్రాజెక్ట్ లో మేటర్ చాలా బాగుంది కానీ అంతకు మించి ఏదయినా వీడియో ఆడియో, ఫోటగ్రాఫ్స్ లాంటివి కూడా చేర్చితే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం.


కానీ నా స్టడీ కి సంబంధించిన మేటర్ దొరుకుతుంది అంటారా ఎందుకు అంటే అది ఒక అంతరించిపోయిన కళ ...మరి ఎలా?


మైథిలి.ప్రపంచం చాలా చిన్నది మనం వెతికితే తప్పకుండా దొరుకుతుంది.నాకు తెలిసిన ఒక ప్రొఫిసర్ కూడా దిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఎదో కారణం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు.ఎందుకు ఏమిటి అని ఇప్పటికీ కూడా తెలియదు.కానీ నువ్వు అమ్మయివి ఒంటరిగా ఎలా చేయగలవు అని ఆలోచిస్తున్నా .


సార్ ముందుగా మీరు నేను అమ్మాయినీ అని చిన్నగా చూడకండి.మీరు చెప్పాలి అనుకున్నది చెప్పండి 


ప్రొఫెసర్ చిన్నగా నవ్వి... తన తల నిమురుతూ నువ్వు ఆడపిల్లవి కాదు ఆడపులివి అని నాకు తెలుసులే. ఆ ప్రోఫిసర్ రాసిన మ్యాటర్ రికార్డ్ గా చెయ్యక ముందే ఆయన చనిపోయారు కానీ ఆయన డైరీ లో కొన్ని ముఖ్యమైన అంశాలను రాసుకున్నారు అది మన మేన్ లైబ్రరీ లో వుంది.కానీ ఎవరికి అలో లేదు నేను ప్రిన్సిపల్ నీ అడిగి చూస్తాను...


ఓ.... థాంక్ యూ వెరి మచ్ సార్...


ఒకే ఇక ఇంటికి వేళ్ళు నేను తెలుసుకుంటాను.


ఒకే సార్.బై సార్...


...............


అమ్మా ...తల నొప్పి గా వుందా అని సోఫా లో కూర్చొని టీవీ చూస్తున్న వనజ తల నీ మునివేళ్లతో మర్ధన చేస్తూ అడిగింది మైథిలి...

ఆ మాట విన్న వనజ ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యి వెంటనే వెనక్కి తిరిగి చూసింది...మైథిలి నీ... ఆరోగ్యం బాగానే ఉంది కదా లేక నేను ఎం అయిన కల కానీ కంటున్నాన అని తన చెయ్యి గిల్లి చుసుకుంది వనజ.


ఉండమ్మా ఎందుకలా అంటావు నేను ఆ మాత్రం నీకు సేవ చేయను అని అనుకుంటున్నావా?


తిన్నగిన్నె తియ్యని నువ్వు వచ్చి తలకి మర్దన చేస్తుంటే ఎందుకో భయమేసింది అందుకే అలా అన్నాను. చెప్పు ఏంటి సంగతి?

.


ఎం లేదు కానీ..నా కేస్ స్టడీ కోసం నేను కొన్ని రోజులు ఒక ఊరికి వెళ్ళాలి అమ్మ.నాన్న నీ నువ్వే ఒప్పించాలి.


 నాతో కాదు తల్లి నువ్వు మీ నాన్నే చూసుకోండి. అయినా దెయ్యాలు భూతాలు అంటూ తిరుగుతావ్ ఏంటే కాస్త ఇంటిపట్టున ఉండి ఇంటి పని నేర్చుకోవే తల్లి అంటే వినవు పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లాకా కనీసం ఇంటి పని కూడా నేర్పించలేదు మీ అమ్మ వాళ్ళు అని నన్ను తిట్టుకుంటారు. అయినా నీకు సంబంధాలు చూడలేక చచ్చిపోతున్నా. ఫోటో చూసి పిల్ల మాకు నచ్చింది అని అంటున్నారు ఏం చదువుకుంటుంది అని అడిగిన వాళ్ళ ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం విని మాకొద్దు బాబోయ్ అని పారిపోతున్నారు. ఒకరయితే నా నంబర్ ఏకంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు.


వావ్ వాట్ ఏ గ్రేట్ న్యూస్ మమ్మీ.


నీకు అలానే అనిపిస్తుంది లే వచ్చాక మీ డాడీ ని అడుగు నీ ప్రయాణం ఎంత గ్రేట్ అని చెప్తారు.


ప్లీజ్ మమ్మీ హెల్ప్ మీ నా ఇది నా కల.


.....,......


వరుణ్ నికు ఒక విషయం చెప్పాలి.మైథిలి తన కేస్ స్టడీ కోసం ఎక్కడికో వెళ్తుంది అంటా.


ఎక్కడికి?


కోయ వాగు అని ఒక పల్లెటూరు డాడీ...


ఒక్కదానివే నా ఇంకెవరైనా తోడు వస్తున్నారా?


నా ఫ్రెండ్ శరణ్య వస్తుంది డాడీ.


ఎన్ని రోజులు పడుతుంది నీ కేస్ స్టడీ కోసం?


ఒక టెన్ డేస్ డాడ్ .


నికు ఆ ఊరి గురించి తెలుసా?


లేదు డాడీ.మా ఫ్రొఫెసర్ చెప్పారు ఆ ఊరిలో నా ప్రశ్నలకి సమాధానాలు వుంటాయి అని.


దొరకడం అంత సులువు కాదు.నీలానే ఆ ఊరిలో జరిగే వాటి గురించి తెలుసుకోవలని వెళ్ళిన ఒక ప్రిఫ

సార్ సూసైడ్ చేసుకొని చనిపోయారు.ఇప్పటికీ ఆయన చావుకి కారణాలు తెలియవు.అందుకే చెప్తున్నా వద్దు!


నాన్న ప్లీజ్ ....ఇది నా ఆశయం.వద్దు అనకండి.మీరే అంటారు కదా మన ఆశయం నెరవేరే క్రమంలో ఎన్నో ఎడుదుడుకులు ఎదురు అవుతూ ఉంటాయి అవన్నీ బరించి ముందుకు వెళితేనే మనం గెలవగలం.విజయం ఊరికే వరించదు కష్టపడాలి అని

మరి ఇప్పుడు మీరే ఇలా...


కానీ మైథిలి..


ప్లీజ్ డాడ్.. ఈ ఒక్క సారి...


కానీ ఒక షరతు ..


ఒకే డాడ్ .చెప్పండి


రోజు నాకు కాల్ చెయ్యాలి నువ్వు ఎక్కడికి వెళ్లినా గూగుల్ లొకేషన్ నాకు పంపాలి,ఏదయినా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర దాచకుడదు.


ఓ..... ఒకే డాడ్...అని వరుణ్ నీ హత్తుకుంది మైథిలి.


ఏమో నే నాకు బయం గా వుంది.


అమ్మా..మళ్ళీ నువ్వా ఇప్పుడూ...


అది అంతేలే తల్లి.. పిచ్చిమాలోకం... అల్ ది బెస్ట్ అని కూతురి తల నిమిరాడు వరుణ్...


హా...అన్ని పిచ్చి గానే అనిపిస్తాయి మీకు. అంటూ ముతి ముడుచుకొని లోపలికి వెళ్ళిపోయింది.


వరుణ్ మైథిలి లు నవ్వుకున్నారు.కానీ మైథిలి కి అప్పుడు తెలియదు ఇక పై ఆ నవ్వు తనకి కరువు అని.



.....


హలో శరణ్యా రెడీ అయ్యవా...నేను బస్టాండ్ లో ఉన్న త్వరగా రా అని ఫోన్ పెట్టేసిన మైథిలి కి ఆల్రెడీ బస్ లో కూర్చొని హాయ్ అని కేక వేసింది శరణ్య మైథిలి వైపు.మైథిలి చిరు కోపం తో వెళ్లి తన పక్కన కూర్చుని ఫోన్ లో నే చెప్పవచ్చు గా ...ఇలా అరిచి చెప్పాలా...?అని బ్యాగ్ పైన పెడుతూ అంటుంది..


చిల్ మా... జస్ట్ ఫర్ ఫన్...


సరే మనం వెళ్ళే ఊరిలో మాత్రం ఇలాంటి పనులు చెయ్యకు...


ఎందుకు వాళ్ళు మనుషులు కాదా...వాళ్ళకి నవ్వు రాధా నిలా?


ఇదిగో ఇదే తగ్గించితే మంచింది..మనం వాళ్ళ ఊరిలో మిగిలిపోయిన చివరి టెలీపతి వచ్చిన వ్యక్తి కోసం వెళ్తున్నట్టు అక్కడ ఎవరికి చెప్పకు.నాకు తెలియకుండా ఎవరితో ఎక్కోవ మాట్లాడకు..


హేయ్ ఆపు బుజ్జి...నేను ఎం అయిన ఇప్పుడే స్కూల్ కి వెళ్ళే బుజ్జి పాప అనుకుంటున్నావా.మిరపకాయ బజ్జీ నీ...అని వెనక్కి చూసింది వెనకాల వున్న అబ్బాయి తననీ చూడటం చూసి కన్నుకొట్టింది శరణ్య.మైథిలి అది చూసి తల కొట్టుకొని నిన్ను తీసుకొని వెళ్తున్న చూడు నాది బుద్ధి తక్కువ.నీ చావూ నువ్వు చావు అని అంటూ హేడ్ ఫోన్ పెట్టుకొని సాంగ్స్ వింటు పడుకుంది మైథిలి.



హెల్లొ మేడం మీ నిద్ర అయిపోయిందా మనం వెళ్ళవలసిన ఊరు వచ్చేసింది.హెలో శరణ్య లే..,.


ఓ....అప్పుడే వచ్చేసామా అని అవలింతలు తిస్తు ఒళ్ళు విరుస్తూ అంటుంది శరణ్య...


అవును పదా...


అవును నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరో వస్తారు అన్నావు.


హా...ఈ ఊరిలో వున్న మా రిలేషన్ కి తెలిసిన వ్యక్తి..


రిలేషన్ కి తెలిసిన వ్యక్తి రావడం దేనికీ వాల్లే వస్తె అయిపోతుంది కదా!


మళ్ళీ మొదలు పెట్టావా.వాళ్ళు ఇక్కడ వుండరు వాళ్ళ పొలాలు అతను చూసుకుంటాడు.ఇంకో విషయం అతను మూగవాడు.తననీ ఇబ్బంది పెట్టేలా ఎం చెయ్యకు.


ఇబ్బందే గా.....అస్సలు పెట్టను...


పదా మన స్టాప్ వచ్చేసింది...


.............


ఏడి మన హీరో ఇంకా రావడం లేదు..


వస్తాడు ఆగు...


మన హీరో ఓన్లీ ముగావాడేన ...లేక గుడ్డివాడు కూడా నా. మే బీ దారి తప్పిపోయాడు ఏమో అని...


శరణ్య నువ్వు కొంచం ఆగు...


గళ్ళ చొక్కా జీన్స్ ప్యాంటు వేసుకొని చూడటానికి మహేష్ బాబు ల వున్నాడు అటు చూడు మైథిలి..


మైథిలి అనుకోకూండా అటు చూసింది.నిజమే అలానే వున్నాడు.అతను వాల్లవైపే రావడం చూసి వాళ్ళు హైరానా పడ్డారు. ఎందుకుంటే వాళ్ళు అతన్ని చూడటం చూసి ఏదయినా తప్పుగా అనుకున్నాడా అని.


అతను వచ్చి వాళ్ళ ముందు నిల్చున్నాడు..


మైథిలి కాస్త గాబర పడి ...సారి అండి తప్పుగా అనుకోకండి మా కోసం ఒక అబ్బాయి రావాలి అది మీరే అనుకోని మా ఫ్రెండ్ చూసింది...


ఆ అబ్బాయి చిన్నగా నవ్వాడు..


శరణ్య మైథిలి చెవిలో ఆ మూగొడు ఈ మహేష్ ఒక్కడే కావచ్చు అని అంది..నువ్వు ఆగు అని అంది మైథిలి...


అది నేనే అని సైగ చేసాడు.మైథిలి మా కోసం వస్తారు అని చెప్పిన అబ్బాయి మీరేనా అని అడిగింది..


అవును అని తల ఊపి సైగ చేసాడు...


ఓ....నువ్వేనా....హాయ్ నేను శరణ్య అందరూ ముద్దుగా శ్రీ అంటారు అని హగ్ చేసుకుంది...మైథిలి తననీ వెనక్కి లాగింది...శరణ్య ఇది పల్లెటూరు ఇక్కడ ఇలా చేయడం తప్పు..ఎం అనుకోకండి దానికి ఇవన్నీ తెలియవు చిన్నప్పటి నుండి సిటీ లో పెరిగింది ...నా పేరు మైథిలి మరి మీ పేరు...తను పైకి ఆకాశం వైపు చూపించాడు..


శరణ్య ఆకాశం వైపు చూసి .... ఓ..మీరు పేరు ఆకాష్ కదా...అని అంది..కాదు అని తల ఊపాడు...

మైథిలి ఆకాశం వైపు చూసి సూర్య.....అని అంది...

అవును అని తల ఊపాడు సూర్య...


ఒకే సూర్య ...మనం రేపు కలుద్దాం థాంక్స్ ఇక్కడి వరకు మా లగేజీ మోస్తూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నావు...


పరవాలేదు అని చేతితో సైగ చేసి... మీకు ఏదయినా అవసరం వుంటే పిలవండి అని ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూపి తను వెళ్ళిపోయాడు...


........


సూర్య...సూర్య....అని తలుపు కొట్టారు...


గడియారం వైపు చూసాడు సూర్య...సమయం 2:30 నిమిషాలు మెల్లిగా బెడ్ దిగి లైట్ ఆన్ చేసి డోర్ తీశాడు....


మయూరి...నువ్వు ఏమిటి ఇక్కడ..


నీతో మాట్లాడాలి అనిపించింది సూర్య...


సూర్య చిన్నగా నవ్వి ..సరే లే రేపు పొద్దున్నే నేను వస్తాను లే నువ్వు వెళ్ళు...


లేదు సూర్య...కాసేపు వుంటాను...మనసు ఎం బాలేదు...


ఎం అయింది మయూరి..?చెప్పు..


నాకు విధించబడిన సమయం అయిపోతుంది సూర్య ఇంకా కొన్ని రోజుల్లో నేను విముక్తురాలిని అవుతాను కానీ నా తరువాత నా స్థానం లోకి వచ్చి జీవ కిరీటాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే..నాకు నువ్వు తోడుగా వున్నావు కాబట్టి జీవ కిరీటాన్ని నేను కాపడగలుగుతున్న కానీ నువ్వు నాల మారిపోయాక నికు ఎవరు తోడు వుంటారు అని అర్థం కావడం లేదు... ఆ సూర్యుడి కిరణం తాకగానే నువ్వు నాల అయిపొక తప్పదు అని ఆలోచిస్తూ ఉంటే బాధ గా వుంది..


మయూరి నువ్వు ఎందుకు బాధ పడుతున్నావు.అది నా బాధ్యత...నేను దాన్ని బరువుగా ఎప్పుడు అనుకోను...సరే నువ్వు వెళ్ళు నేను పొద్దున్నే వస్తాను...ఎవరయినా నువ్వు అక్కడ లేవని తెలిస్తే వినాశనం తప్పదు...ముందే అపాయం పొంచి ఉంది.


ఎందుకు సూర్య...ఎం జరిగింది...?


మైథిలి,శరణ్య అని ఈ రోజు ఇద్దరు వచ్చారు...వారు రావడానికి గల కారణం ఇంతక ముందు వచ్చిన ఫ్రోఫిసర్ చనిపోవడానికి గల కారణం ఒక్కటే.మనం రక్షిస్తు కాపాడుతూ వస్తున్న జీవ కిరీటాన్ని దక్కించుకోవడం..మనకి మాత్రమే తెలిసిన మన పూర్వీకులు మనకి అందించిన అతీంద్రియ శక్తులు గురించి తెలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు.


మనకి వున్న శక్తుల గురించి వారికి తెలిస్తే వాళ్ళు మనల్ని ఇక బ్రతకనివ్వ్వరు సూర్య.తీస్కొని వెళ్లి వాళ్ళ పరిశోధనలు చేసే చోట ముక్కలు ముక్కలు చేసి చంపేస్తారు..అది మన రక్త మంసలలో కాదు మన ఆత్మ లో వుంది అని తెలియని వెర్రి వాళ్ళు.వాళ్ళ స్వార్థం కోసం జీవించే పిచ్చి వాళ్ళు.నన్ను చంపి జీవ కిరీటాన్ని కాజెయ్యలి అని చూసిన ఆ ప్రొఫెసర్ నీ చంపింది నువ్వే అని తెలిస్తే నికు ఆపద సూర్య...వాళ్ళతో జాగ్రత్త...


అలాగే నేను జాగ్రత్తగానే వుంటాను నువ్వు ఇక వేళ్ళు...నేనే రేపు పొద్దున వస్తాను...


నువ్వు వచ్చిన నేను వినగలను కానీ మాట్లాడలేను కదా...అందుకే ఇలా...అని మయూరి మాయం అయ్యింది...సూర్య వెళ్లి పడుకున్నాడు..


మళ్ళీ తలుపు చప్పుడు... ఈ సారి కిటికీ నుండి బయటకు చూసాడు సూర్య..మైథిలి,శరణ్య ఇద్దరు తలుపు దగ్గర వున్నారు తెల్లవారి 7 గంటలు అవుతుంది..

.

సూర్య వెళ్లి తలుపు తీశాడు....


సూర్య..మనం బయటకి వెళ్లాలి... ప్లీస్ త్వరగా రావా..


సరే రెండు నిమిషాలు అని సైగ చేసాడు...లోపలికి వచ్చి కూర్చోమని అన్నాడు..


వాళ్ళు పరవాలేదు అని బయట అరుగు మీదనే కూర్చున్నారు..సూర్య వెళ్లి త్వరగా రెడీ అయ్యి వచ్చాడు...


మైథిలి నేరుగా ఊరి చివరి కొండ దగ్గరికి తీస్కొని వెళ్ళమంది..సూర్య కి తను అక్కడికి ఎందుకు వెళ్ళమని అందో అర్ధం అయ్యింది..కొండ దగ్గరికి వెళ్లగానే తన దగ్గర ఉన్న పుస్తకం చూసి


సుప్రభాత మహకాలం

ఉషోదయ తోలికిరణం

ఆలస్యం అయితే చేజరునూ అదృష్టం

ఇకపై మరుసటి దినమే నికు ఆ క్షణం ప్రాప్తం


ఏమిటే ఇది....


ఇక్కడ కి వచ్చి చనిపోయిన ప్రోఫిసర్ ఆర్య రాసిన డైరి. ఇది ఒక్కటే మనకి వున్న ఆధారం మన గమ్యానికి...


సూర్య...మైథిలి నీ అలానే చూస్తూ వున్నాడు.మైథిలి తన వంక చూస్తూ సూర్య...నాకు నీ గురించి ఎం తెలియదు కానీ నికు చెప్తున్నా ఎందుకో తెలియదు కానీ నిన్ను చూడగానే నాకు నీ మిద ఒక మంచి ఫీలింగ్ కలిగింది.నీ పై నాకు నమ్మకం కలిగింది.ఒక క్షణం లో ఒక వ్యక్తి మిద ఇలా నమ్మకం కలగడం నాకు ఇదే మొదటి సారి సూర్య..


నేను వచ్చింది నా రీసెర్చ్ కోసం కానీ నాల రీసెర్చ్ కోసం వచ్చిన మా సార్ అనుకోకుండా సూసైడ్ చేసుకొని చనిపోయారు.ఆయన చావుకి కారణం నేను తెలుసుకోవాలి...అంతే కాదు మన పూర్వీకుల తో పాటు అంతరించి పోయిన కొన్ని అతీంద్రియ శక్తులు వున్న మనుషులు ఇక్కడే వున్నారు అని నాకు తెలిసింది.వాళ్ళ ద్వారా దేశానికి ఎంతో మంచి జరుగుతుంది.వాళ్ళు ఎవరు అని తెలుసుకొని వారి ద్వారా దేశానికి సేవ చేయడమే నా ఆశ...కానీ అల చెపితే మాకు ప్రాణాపాయం అని పల్లెటూరి మిద రీసెర్చ్ అని వచ్చాము.. ఆ శక్తులు వున్న మనుషులు నీ కలవాలి అంటే ఈ వాక్యానికి అర్ధం తెలియాలి అని వుంది...


మొదటి రెండు లైన్లు ఎర్లీ మార్నింగ్ అని అర్థం అయ్యింది...మ్యాప్ ప్రకారం మీ ఊరిలో పడే మొదటి తొలి కిరణం తెలుసుకోవాలి...కానీ మనం వచ్చే లోపు తెల్లవారి పోయింది .ఇక రేపే మళ్ళీ మన రీసెర్చ్...అని అక్కడే కూర్చుంది...శరణ్య కూడా వచ్చి తన పక్కన కూర్చుంది...మైథిలి వాళ్ళ వలన దేశానికి ఎలా మంచి జరుగుతుంది...ఎందుకు జరగదు శ్రీ...


మన దేశం లో పెరుగుతున్న ఉగ్రవాదం వలన ఎన్నో మారణహోమాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నారు.బాంబు పేలుళ్లకు బలి అవుతున్నారు.అతీంద్రియ శక్తులు వున్న మనుషులు మన దగ్గర వుంటే ఆ బాంబు ఎక్కడ ఉంది అని చెప్పగలరు..మన దేశం కోసం పోరాడే సైన్యం నీ తీసుకెళ్ళి చిత్ర హింసలు పెట్టీ చంపేస్తున్న మనం ఎం చెయ్యలేక పోతున్నాం. బూకంపాలు,సునామీలు,వరదలు ఇలా ఎన్నో అన్నింటినీ మనం ఆపలేము కానీ ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడగలము...అంతే కాదు వారి దగ్గర ఒక కిరీటం వుంటుంది అంట.. ఆ కిరీటం తలపై అయితే పెడితే చనిపోయిన వారు అయిన మళ్ళీ బతకగలరు అంట అది ఈ అడవిలో వుంది అంట... ఆ కిరీటం రాత్రి పూట ప్రతీ పూర్ణిమ నాడు ఆ వెన్నల కిరణం పడి తే శక్తి పొందుతుంది అంట..ఇవన్నీ ఆర్య గారు కళ్ళతో చూసి ఆయన డైరీ లో రాసుకున్నారు . .రేపు పూర్ణిమ అంటే మనం కచ్చితంగా రేపు ఉదయం లోపు ఆ చోటు గురించి తెలుసుకోవాలి.


మైథిలి నువ్వు అతీంద్రియ శక్తులు వున్న మనుషులు గురించి రీసెర్చ్ చేస్తున్నావ్ అని తెలుసు కాని నువ్వు చెప్పే వరకు ఇవన్నీ తెలియవు..శరణ్య ఎవరితో నువ్వు చెప్పకు..


లేదు మైథిలి నేను చెప్పను...


సూర్య నువ్వు కూడా..


లేదు అన్నట్లు సైగ చేసాడు...వాళ్ళు ముగ్గురు కలిసి ఇంటికి వెళ్లిపోయారు....


సూర్య మీ ఉరు చాలా అందంగా ఉంది..మీ ఊరు చుపిస్తావ అని అడిగింది మైథిలి ...

చిరునవ్వు నవ్వాడు సూర్య...

ఒకే పదా అని శ్రీ మెడలో క్యామార వేసుకొని బయల్దేరింది...


సూర్య వాళ్ళ ఊరిలో వున్న చెరువులు ,పంట పొలాలు,గోపురాలు అన్ని చూపించాడు...వాళ్ళ ఊరి కొలనులో మధ్యలో ఒక చెట్టు వుంది అది అందమైన పూల చెట్టు శ్రీ అక్కడికి వెళ్లి ఫోటో దిగుధాం అంది ముగ్గురు పడవలో వెళ్లి అక్కడ ఫోటో దిగారు .మళ్ళీ తిరిగి వచ్చే సమయం లో. మైథిలి కి ఇష్టం అయిన తన చేతి ఉంగరం జారీ అందులో పడిపోయింది...కానీ అది పడగానే అక్కడే వున్న చేప దాన్ని మింగేసి కిందికి పారి పోవడం చూసింది మైథిలి ...ఇక అది దొరకదు అని సైలెంట్ గా ఉండిపోయింది....మైథిలి కి ఆ ఊరు చాలా నచ్చింది...మళ్ళీ పొద్దున్నే వెళ్లాలి అని ఇంటికి వెళ్లిపోయారు.. మైథిలి ,శ్రీ ఇద్దరు సూర్య కి థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయారు...


......


సూర్య నిద్ర పోవడానికి ఎంత ప్రయత్నం చేసిన తనకి నిద్ర రావడం లేదు చాలా సేపు మంచం మీద అవస్థలు పడి ఇక లేచి కూర్చున్నాడు..కిటికీ నుండి చందమామ నిండుగా కనిపిస్తున్నాడు...సూర్య చూడగానే కిటికీ కి వున్న పరదా దూరం జరిగింది...చల్లని గాలి లోపలికి వీచింది.....తను కనులు మూయగనే పొద్దున మైథిలి ఉంగరం మింగిన చేప నీటి పైకి తెలి తన ఉంగరం బయటకి విసిరింది ఒక సీతాకోక ఆ ఉంగరాన్ని తెచ్చి సూర్య చేతుల్లో పెట్టింది....

ఏమిటి సూర్య నువ్వు ప్రేమలో పడ్డవా... ఆ అమ్మాయి ఉంగరం నికు ఎందుకు?

సూర్య మొహం లో చిన్న చిరునవ్వు వచ్చింది?

వెంటనే అక్కడే పొలాల లో తిరుగుతున్న మిణుగురులు అన్ని వచ్చి తన గది నిండా నిండాయి.. ఆ ఉంగరాన్ని చూస్తూ...మైథిలి మాట్లాడిన మాటలు,తన నవ్వు గుర్తు చేసుకొని సూర్య తనలో తానే మురిసిపోతూ నవ్వుతున్నాడు...


ఒక్క సారి గా తలుపు తట్టిన శబ్దం అయ్యింది...సూర్య చూపు కి అక్కడే ఉన్న కబోర్డ్ ఓపెన్ అయ్యింది .ఉంగరం వెళ్లి అందులో పడగానే మళ్ళీ మూసుకుంది ..మిణుగురులు అన్ని బయటకి వెళ్లి పోయాయి..


ఈ సమయం లో ఎవరు మయూరి వచ్చిందా అని ఆలోచిస్తూ తలుపు తీసాడు సూర్య...కాదు వచ్చింది శరణ్య..సూర్య ఎం కావాలి అని సైగ చేస్తూ గడియారం వైపు చూస్తూ అడిగాడు...


లోపలికి రావచ్చా..


రండి అని తలుపు తీసాడు సూర్య ..


వచ్చి సూర్య మంచం మీద కూర్చుంది శరణ్య..


సూర్య..నువ్వు తప్పుగా అనుకోకు ...అని తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ...నేను నిన్ను ప్రేమిస్తున్నా అని తన నీ హాగ్ చేసుకుంది.సూర్య తననీ వెనక్కి నెట్టాడు..లేదు సూర్య నువ్వు నాకు కావాలి...నీ కోసం నేను ఎం అయిన చేస్తాను..నన్ను నికు అర్పించమని చెప్పిన ఇప్పుడే అర్పిస్తా అని తన రెండు చేతులని పట్టుకొని అంటుంది.తన చేతులని విడిపించుకొని నేను ముగా వాడిని,చదువు రాదు అని సైగలతో చెప్పాడు .. అయిన పరవాలేదు అని తన పై పడి తననీ తన వశం చేసుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ..కానీ సూర్య సూటిగా తిరస్కరిస్తాడు..సరే సూర్య నేను నికు నచ్చలేదు కదా నాకు అర్థం అయింది..కానీ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను..నేను నిజం గా నిన్ను ప్రేమిస్తున్నా.తప్పుగా అనుకోకు..ఒక్క సారి నిన్ను హగ్ చేసుకుంటా.అని ముందుకు వస్తుంది.. సూర్య ఈ సారి తిరస్కరించలేదు...తను వచ్చి హగ్ చేసుకుంది. ఒక్క సారి గా ఉన్న చోట నే కింద పడిపోయింది...సూర్య కి ఎం అర్ధం కాలేదు వెనక్కి తిరిగి చూశాడు..మయూరి.....


మయూరి కోపం గా వచ్చి...సూర్య నికు ఎం అయిన అర్ధం అవుతుందా..నువ్వు ఎం చేస్తున్నావు అని? ఏమిటి ఇది అంతా.


సూర్య మయూరి దగ్గరికి వెళ్లి.తననీ ఎందుకు చంపేసావు తను ఎం తప్పు చెయ్యలేదు అని కోపంగా అంటాడు...


తను ఎం తప్పు చెయ్యలేదు..కానీ చెయ్యాలని వచ్చింది తన చేతి వంక చూడు అని చూపించింది మయూరి తన చేతిలో ఒక ఇంజెక్షన్ వుంది.అది నికు పొడవబోయింది.నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయిన మన బాధ్యత నీ విస్మరించి న కారణం తో నిన్ను అగాధం కి నెట్టివెయ్య బడేవాడివి...ఇటు చూడు అని తన రెక్కలతో ఒక సారి ఉపాగనే అక్కడ ఒక మెరుపు వచ్చింది...అందులో శరణ్య ఎవరితో నో ఫోన్ లో మాట్లాడుతూ వుంది.


మీరు అడిగిన అతీంద్రియ శక్తులు వున్న మనుషులు నేను చూసాను..మైథిలి కి ఇంకా తెలియదు.ఎంత తెలివి వున్న తన లాంటి పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు నేను తయారు చేసిన క్యమరా లెన్స్ లో వారి నిజస్వరూపం లో కనిపిస్తారు అని తెలుసు కొలేక పోయరు.తననీ నా వశం చేసుకుని తనతో ఆ జీవ కిరీటాన్ని దక్కించుకుంటాను..


తను నీ వశం కాకపోతే.(ఫోన్ లో అవతలి వ్యక్తి)


మా బాబాయ్ నీ చంపినందుకు వాడి ప్రాణం తీస్తాను...


నువ్వు అనుకున్నంత సులువు కాదు...వాడు ప్రాణాలతో కావలి అప్పుడే మన రీసెర్చ్ పూర్తి అవుతుంది...ఈ విషయం మైథిలి కి తెలియకుండా జాగ్రత్త పడు.తెలిస్తే మన రీసెర్చ్ కి ఒప్పుకోదు..(అవతలి వ్యక్తి)


హ్మ్మ్.,పిచ్చి పిల్ల వాడు దొరికితే దేశానికి సేవ చెయ్యాలి అని ఆలోచిస్తుంది.వాడితో ప్రపంచాన్ని శాసించే మహారాణి అవ్వగలం అని అర్థం చేసుకోలేదు...అని నవ్వుతుంది...అయిన దాని అవసరం ఆ కిరీటం వుండే స్థలం తెలిసే వరకూ మాత్రమే .తరువాత అది బ్రతికి ఉంటే మనం అనుకున్నది జరగదు.అది జరగ నివ్వదు...అదే నన్ను తన రీసెర్చ్ లో తోడుగా తెచ్చుకుంది అనుకుంటుంది...దానినే నేను తోడు తెచ్చుకున్నాను అని తెలియదు దానికి..సరే నేను పని పూర్తి చేసి ఫోన్ చేస్తాను .


జాగ్రత...(అవతలి వ్యక్తి)


హ్మ్మ్... ఆడదాని ముసుగులో పడి రాజ్యాలను వదులుకున్న చరిత్ర మనది,గొప్ప గొప్ప మునీశ్వరులు అటువంటిది ఆడదాని కొంగు వాసన చూసి పడిపోయారు ..నేను ఈ కాలం పిల్ల నీ వాడిని నా వెంట పడే ల చేసే ఆయుధం నా దగ్గర వుంది...నువ్వు బయపడకు..


మయూరి మళ్ళీ తన రెక్కల నీ కిందికి దించింది .వెలుగు మాయం అయ్యింది...


సూర్య తల కిందికి వేసుకొని అక్కడే కూర్చున్నాడు...చూసావా నేను రాకుంటే ఎం జరిగి వుండేదో.నిన్ను కుడా మన అన్నయ్యా ల పట్టుకొని వెళ్లి ముక్కలు ముక్కలు చేసి వాళ్ళ రీసెర్చ్ కోసం చంపే వాళ్ళు.మంచి పని కోసం వాడవలసిన జివకిరిటం దుష్టుల చేతిలో పడి లోక వినాశనం అయ్యేది.ఇక నైనా జాగర్త ..అవును నువ్వు ఎం ఆలోచిస్తున్నావు...నీతో నేను ఎంత మాట్లాడాలి అని ప్రయత్నం చేసిన నువ్వు ప్రతిస్పందించలేదు..


నువ్వు నా దగ్గర ఎదో దాయలని ఆలోచిస్తున్నావు.నీ మనసుని నేను చదవకుండా నువ్వు అడ్డుపడుతున్న వా?


లేదు మయూరి.ముందు నా బాధ్యత!తరువాతే ఏదయినా.


మంచింది.రేపు నువ్వు మయూరం గా మారి నీ బాధ్యత వహించాలి నేను మయూర లోకానికి రేపు వెళ్ళే సమయం ఆసన్నం అయింది.గుర్తు వుంది కదా.


మర్చిపోను.


సరే.నేను తన శవాన్ని కోయావాగు లో వదిలి వెళ్లిపోతాను.జాగ్రత్త a అమ్మాయిని రేపు ఎలా అయిన వెళ్లిపోయే ల చెయ్యి లేదంటే తనకి కూడా ఇదే పరిస్థితి పడుతుంది.అని శ్రీ శవం తో మాయం అయ్యింది..


తెల్లవారాక ముందే సూర్య తలుపు తట్టిన శబ్దం విని.శ్రీ కోసం వెతుకుతూ మైథిలి వచ్చింది అనుకోని.సూర్య వెళ్లి తలుపు తీశాడు.


తెల్లటి పొగ మంచు లో విరబూసిన మల్లెపువ్వు ల వుంది మైథిలి.పిల్ల గాలికి ఎగురుతున్న తన ముంగురులని వెనక్కి సర్దుతూ...తన గులాబీ రేకుల లాంటి పెదవుల మీద చిరునవ్వు నీ చూస్తుంటే సూర్య కి కాసేపు సమయాన్ని ఆపేయాలి అనిపించింది.ఒక్క క్షణం సమయం ఆగిపోయింది.గాలికి ఎగురుతున్న తన ముంగురులు సైతం ఆగిపోయి తేలియాడుతున్నాయి.


సూర్య...కాస్త ముందుకి వెళ్ళి మైథిలి ముందు నిల్చున్నాడు.తన కనులలోకి చూస్తుంటే మరో లోకం అనిపించింది తనకి....




నెమలి బొమ్మ వున్న చేవి పోగుని చూసిన సూర్య కి తన బాధ్యత గుర్తు వచ్చింది.. కాలం తిరిగి మామూలు అయ్యింది.


సారి సూర్య ఎం అనుకోకు ఆ ప్లేస్ ఎక్కడ ఉంది సరిగ్గా తెలియదు కదా అందుకే కాస్త ముందుగానే వెళ్దాము అని...


సూర్య అలానే చూస్తూ ఉంటాడు...


ఎం అయింది అల చూస్తున్నావు... ఓ....శ్రీ నా...అది ఇంత పొద్దున లేవడం కష్టం అందుకే లేపలేదు అది లేచే లోపు మనం వచ్చేస్తము...పదా అని సూర్య చెయ్యి పట్టుకుని మరో చేతితో డోర్ పెట్టేసి సూర్య చెయ్యి పట్టుకొని లాగుతూ తీసుకెళ్ళింది... ఆ క్షణం సూర్య కి ఎప్పుడు లేని అనుభూతి... ఆ అనుభూతిలో సూర్య కి కేవలం మైథిలి మాత్రమే కనిపించింది కానీ ఆ సూర్యుడి కిరణాలు పడేవా సమయం లో మయూరి నమస్కారం చేస్తుంది.. ఆ క్షణంలో జివకిరిటం పై పడే కిరణాల వెలుతురు కొన్ని మైళ్ళ వరకి వెళ్తుంది అని గుర్తు రాలేదు...


హఠాత్తుగా మైథిలి సూర్య చెయ్యి వదిలేసింది.అడవిలో ఒక వైపు నుండి పెద్దటి కాంతి అది ఆకాశం వైపు చూపిస్తుంది..మైథిలి అటు వైపు అడుగులు వేస్తూ ముందుకు కదిలింది. సూర్య అనుకోకుండా చుసే సరికి మైథిలి ఆ వెలుతురు వంక పరుగులు తీస్తుంది..తననీ అపే లోపు తను ఆగిపోయింది ...సూర్య అపడం వలన కాదు ఆ జీవ కిరీటాన్ని చూసి....సూర్య కి ఎం చేయాలి అర్ధం కాలేదు...మయూరం మళ్ళీ తన రెక్కల కింద కిరీటాన్ని దాచి శిలగా మారిపోయింది.


మైథిలి సూర్య చెయ్యి పట్టుకుని మళ్ళీ ఊరిలోకి పరుగు తీసింది.మైథిలి స్పర్శ తననీ వేరే లోకానికి తీసుకెళ్ళింది...తనకి ఎందుకు ఇలా అవుతుంది.తన ఆత్మ ఎందుకు తన వశం లో నుండి తప్పిపోతోంది.తన మనసుని కట్టడి చేస్తూ..తన శక్తి నీ మొత్తం కూడబెట్టి తన బాధ్యత నీ గుర్తు చేసుకున్నాడు....తన చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు...


ఇద్దరు నడుస్తూ మళ్ళీ ఊరిలోకి వెళ్తున్నారు...సూర్య ఆ కిరీటం ఎంత అందం గా వుంది కదా...దాని కి రక్షణగా కేవలం మయూరం మాత్రమే వుంది .మరి ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు కావచ్చు...తననీ ఎలా కలవాలి ...అని మాట్లాడుతూ ముందుకు నడుస్తుంది..


ఊరిలోకి రాగానే ఊరి ప్రజలు అంతా కలిసి వాగు దగ్గర వున్నారు.పోలీసులు చేపలు పట్టేవాళ్ళు అందరూ వున్నారు.ఒక శవం బయటకి తీస్కొని వచ్చారు.మైథిలి అక్కడికి పరుగు తీసింది..రా సూర్య అని అంటూ ..జనలని ముందుకు తోస్తూ వెళ్ళిన మైథిలి కి ఒక్క క్షణం గుండె ఆగిపోయింది..తన నోటి నుండి పలకాలి అనుకున్న మాట నీ పలక లేక పోయింది ..తను ఏడుస్తుంది కానీ ఆ ఏడుపు బయటకి రావడం లేదు...ఒక్క క్షణం కళ్ళు తిరిగి పడిపోయింది.




...........


మైథిలి లేచి చూసింది .తను ఇంట్లో వుంది.అక్కడేవున్న కుర్చీలో సూర్య కూర్చొని వున్నాడు...మైథిలి లేచి సూర్య...సూర్య...శ్రీ...శ్రీ ...ఎక్కడ వుంది..అని అడిగింది..సూర్య తల కిందికి వేసుకున్నాడు... శ్రీ నవల్నే చనిపోయింది...అంతా నా తప్పే దానిని నేను ఒంటరిగా వదిలి వెళ్లకుండా ఉండవలసింది..అంతా నా వాల్లే ..నా వల్ల ఒక ప్రాణం పోయింది ఇది నేను మరిచిపోలేను...నన్ను నేను ఎప్పటికీ క్షమించలేనూ..ఇక ఈ రీసెర్చ్ వద్దు....ఇప్పటికే దిని వలన ఇద్దరు చనిపోయారు...ఇక నేను చేయను...కానీ వాళ్ళని కచ్చితంగా కలిసి తిరుతా.ఇంత మంచి వాళ్లని చంపే అధికారం వాళ్లకి ఎవరు ఇచ్చారు అని అడుగుతాను.అమాయకుల ప్రాణాలను తీసి వాళ్ళు రక్షకులు ఎలా అవుతారు అని అడుగుతాను...పదా సూర్య ఈ రోజు సాయంత్రం వాళ్ళు అక్కడికి వస్తారు కదా పదా...

అని మాట్లాడుతూ వుండగానే ....పోలీస్ లు ఇంటి ముందు కి వచ్చారు..


మైథిలి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది...

.

మీరు ఈ ఊరికి ఎందుకు వచ్చారు?


మేము పల్లెలు పట్టణాలు అనే అంశం మీద రీసర్చ్ చేస్తున్నాం అంతరించిపోతున్న సంప్రదాయాలు,పొలాలు ,పక్షులు లాంటివి వాటి కోసం మేము ఇక్కడికి వచ్చాం..


మీ ఫ్రెండ్ నీ ఎవరయినా చంపి వుంటారు అని మీరు అనుకుంటున్నారా?అంటే శత్రువులు ఎవరయినా ?


లేదు అండి..అల ఎం లేదు


మీరు తననీ చివరిగా ఎప్పుడు చూశారు...?


రాత్రి పడుకునే ముందు


మీరు ఒకే ఇంట్లో వున్నారు కదా..తను బయటకి వెళ్ళడం కానీ ఎవరయినా మీ ఇంట్లో కి చోర పడటం లాంటివి ఎం చూడలేదా?వాగు లో దొరకదని ఎదయినా కారణం వుండవచ్చు అని అనుకుంటున్నారా?


లేదు ..తనకి స్విమ్మింగ్ అంటే ఇష్టం .ఈత కొట్టడానికి వెళ్ళింది కావచ్చు అని అనుకుంటున్న...


ఇదిగోండి మీ ఫ్రెండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ..తను నీళ్లలో పడిపోవటం వలన ఊపిరి ఆడక చనిపోయింది...తన శరీరం మీద ఎటు వంటి ఫింగర్ప్రింట్స్ కానీ తనది హత్య గా చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు.మీరు రేపు పొద్దునే వచ్చి బాడీ తీసుకొని వెళ్ళవచ్చు.


ఒకే ...థాంక్యూ..

అని లోపలికి వచ్చి కూర్చుంది మైథిలి..ఎదురుగా కిటికీ నుండి చల్లని గాలి లోపలికి వస్తుంది.. ఆ గాలికి కిటికీ దగ్గర టేబుల్ మీద ఉన్న చున్ని ఎగిరి కింద పడింది...మైథిలి దగ్గరికి వెళ్ళి చూసింది ..అది నిన్న శ్రీ వేసుకున్న చున్ని.అంటే తననీ చంపింది సూర్య...అని ఆలోచించి అక్కడి నుంచి వెంటనే వెళ్లి పోవాలి అని వెనక్కి తిరిగింది .వెనక సూర్య నిల్చొని కిందికి చూస్తున్నాడు.మైథిలి ముందుకు పారిపో బోయింది..రెండు అడుగులు ముందుకు వెయ్యగానే తలుపు లు ముసుకున్నయి...వేరే తలుపు దగ్గరకి పరుగు తీసింది.. ఆ తలుపు కూడా మూసుకుంది..అక్కడే వున్న వస్తువులని సూర్య పైకి విసిరివెయ్య బోయింది... ఆ వస్తువులు అలానే గాల్లో తేలి మళ్ళీ ఎక్కడివి అక్కడే వెళ్లి సర్ధుకున్నయి...మైథిలి ఏడుస్తూ....సూర్య ముందుకు వచ్చింది...నేను నిన్ను ఎంత నమ్మనూ ..నమ్మక ద్రోహి..శ్రీ ఎం తప్పు చేసింది దాన్ని ఎందుకు చంపేసావు.అది ఎంత మంచిది నికు తెలుసా.దేశానికి సేవ చెయ్యాలి అని ఆలోచించి నీ కోసం వెతుకుతూ వచ్చిన మా సార్ నీ కూడా చంపేసావు ...ఇప్పుడు ఇంకా ఎం కావాలి నికు ...నన్ను కూడా చంపుతావా ..దా చంపెయి నికు కావాల్సింది అదే కదా...అని తన ముందు కి వెళ్లి నిల్చుంది..అక్కడే ఉన్న కబొర్డ్ ఓపెన్ అయ్యింది ..అందులో నుంచి ఎదో వేగం గా వచ్చి సూర్య చేతిలో ఆగింది...అది వచ్చిన స్పీడ్ కి అది ఏమిటి అని కనిపించలేదు మైథిలి కి...ఏమిటి అది కత్తి అంతేగా.... చంపెయ్య్..నికు చంపడం కొత్త కాదు గా..చంపడం ఆ వాగు లో పడెయ్యడం నికు అలవాటే గా....


సూర్య మెల్లిగా తన చెయ్యి ముందుకు చాచి మైథిలి వంక చూసాడు...ఇద్దరు అడవిలో మయూరి దగ్గరికి చేరుకున్నారు.మయూరి ఎగురుతూ మైథిలి ముందుకు వచ్చింది...సూర్య మైథిలి కళ్ళలోకి చూస్తూ మయూరం గా మారి పోయాడు...ఎగురుతూ జీవ కిరీటం దగ్గరికి వెళ్ళి నిల్చొని తన రెక్కలని పైకి చాచాడు.ఆకాశం లో నుంచి వెన్నెల వెలుతురు వచ్చి ఆ కిరీటం మిద పడగానే అది గాలిలో లేచింది...పెద్ద నక్షత్రం వలె మెరుస్తూ మళ్ళీ వెళ్లి మయూరం ముందు ఆగింది..మయూరం మైథిలి వంక చూస్తూ తన రెండు రెక్కలని కిరీటం మిద పెట్టగానే శిలగా మారిపోయింది...హఠాత్తుగా నెల నుంచి పెద్ద వృక్షాలు మొలిచాయి.. ఆ శిలని కప్పేసాయి...ఎం అర్థంకాని మైథిలి చూస్తూ వుండిపోయింది..మయూరి ఒక చిన్న పెట్టే నీ మైథిలి ముందు గాలిలొ తెలెల చేసింది..తీసుకొమ్మని సైగ చేసి మాయం అయ్యింది...మైథిలి అది చేతిలోకి తీసుకొని మరుసటి రోజు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది..శ్రీ శవాన్ని వాళ్ళ ఇంటి వాళ్ళకి అప్పజెప్పి అంతిమ సంస్కారాలు చేసి అక్కడే దగ్గరలో ఉన్న గార్డెన్ లో కూర్చుంది మైథిలి..మయూరి ఇచ్చిన పెట్టే గుర్తు వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఆ పెట్టే తీస్తుంది.అది ఓపెన్ చేసి చుసే సరికి అందులో తన ఉంగరం వుంది ..వాగు లో పడిపోయిన ఉంగరం మళ్ళీ తన దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ దాన్ని మళ్ళీ చేతికి పెట్టుకుంది..అది పెట్టుకోగానే తనలో ఎదో ప్రవేశించినట్లు అనిపించింది మైథిలి కి...కనులు మూసుకుని వెనక్కి వాలింది .ఇన్ని రోజులూ గా తన వెనుక జరిగిన సంఘటనలు అన్ని తన కనుల ముందు మెదిలాయి..మయూరి వాళ్ళ అన్న నీ ప్రోఫిసర్ తిస్కెళ్ళి పరిశోధనలు చేసి చంపేయడం కిరీటం సంపాదించి ప్రపంచాన్ని ఎలాలన్న తన కల కోసం తను చేసిన హత్యలు,తనకి తెలియకుండా శ్రీ తన వెనుక చేసిన ఘోరాలు,సూర్య తన గురించి ఆలోచించిన ఆలోచనలు అన్ని తనకి తెలిసిపోతున్నాయి..అవన్నీ జరిగే సమయాలలో తను అక్కడే వుండి చూస్తున్నట్టు గా వుంది తనకి.ఇది నాకు వాళ్ళు ఇచ్చిన వరమా లేక నేను సూర్య విషయం లో ఎంత పెద్ద తప్పు చేసానో చెప్పి నన్ను నిరంతరం బాధా పడమని ఇస్తున్న శాపమా.అని ఆలోచిస్తూ ముందుకు చూసింది...ఎదురుగా వెళ్తున్న మనుషులు వాళ్ళ మనసులో అనుకునే మాటలు..ఒక చెట్టు మరొక చెట్టు మాట్లాడుకుంటున్న మాటలు,నీటిలో ఇదే చేపల భవిష్యత్తు అన్ని తనకి అర్ధం అవుతున్నాయి.తను ఎం తెలుసుకోవాలి అని అనుకున్న అవి అన్నీ తెలుస్తున్నాయి..అందరి వైపు చూస్తూ ఇంటికి ప్రయాణం అయ్యింది.


ఇది ఆరంభం ....అంతం కాదు.....