Aa Voori Pakkane Oka eru - 6 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 6

Featured Books
Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 6

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"అప్పుడు తనకున్న అప్పులన్నీ మా అన్నయ్య తీర్చేసి, నాతో పాటే తనని చదివించడం మొదలుపెట్టాడు. తనకి మంచి ఎడ్యుకేషన్ కావాలని నన్ను జాయిన్ చేసిన కాలేజ్ లోనే తననీ జాయిన్ చేసాడు. తను అంతో ఇంతో ఆస్థి ఉన్నవాడిని కట్టుకుని జీవితంలో సుఖపడాలని తన తల్లి కోరిక. అది తీర్చాలనే నీ కజిన్ వెంట పడింది. వాడెలాంటి వెధవో ఎప్పుడో తనకి తెలిసే ఉంటుంది. కానీ అప్పటికే విడదీసుకోలేనంతగా వాడితో కమిట్ అయిపోయి ఉంటుంది. అందుకనే నా అడ్వైజ్ ని కూడా పట్టించుకోలేదు." మరోసారి దీర్ఘంగా నిట్టూర్చాడు మదన్.

"తన విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేసానో నాకు అర్ధమైంది మదన్, ఈ విషయం నాకు కొద్దీ రోజుల ముందే తెలిస్తే ఎంతో బావుండేది. నా కజిన్ ఎంత పెద్ద రాస్కేల్లో తనకి తెలిసేలా చేసి, తన తల్లి కోరిక కూడా తీరేలా చేసేదాన్ని." సుస్మిత కూడా నిట్టూర్చింది. "ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నేను ఈ ఇబ్బంది నుండి బయటపడగానే మొదట ఆమె విషయమే చూస్తాను." ధృడంగా అంది సుస్మిత.

"ఇది మంచి ఆలోచన. నేను చెప్తే వినలేదు. కనీసం నువ్వు చెప్తేనన్నావింటుందేమో చూద్దాం." మదన్ అన్నాడు. కాస్త ఆగి మదన్ ఇంకా ఎదో అనబోతూ ఉండగా అక్కడికి వంశీ వచ్చాడు.

"టౌన్ నుండి ఆడిటర్ వచ్చారు. అన్నయ్య నిన్ను అర్జన్ట్ గా రమ్మన్నాడు." అన్నాడు ఇద్దరివైపూ చూస్తూ.

"చాలా మంచి టైం దొరికింది ఆ ఆడిటర్ పద్మనాభానికి రావడానికి." చిరాగ్గా అంటూ రాతి మీదనుండి లేచాడు మదన్. "మనకింక వెళ్ళాక తప్పదు. నువ్వూ వచ్చెయ్యి." సుస్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్.

"నేను కాసేపు ఇక్కడే వుండి వస్తాను. మీరిద్దరూ వెళ్ళండి. ఈ ప్లేసన్తా నాకు చాలా బాగా నచ్చింది." ఆ రాతిమీద అలాగే కూచుని అంది సుస్మిత.

"చీకటి పడుతూంది. నువ్వింకా ఇక్కడే ఉండడం మంచిది కాదు. రేపు మళ్ళీ వద్దాం. నువ్వూ మాతో వచ్చెయ్యి."

"నేనేం చిన్నపిల్లని కాదు. నాకు దారి కూడా బాగా గుర్తుంది. నేను రాగాలను, మీరిద్దరూ వెళ్ళండి." సుస్మిత మొండిగా అంది.

"పోనీ వంశీ నీకు తోడుగా ఉంటాడు."

" చెప్పాను కదా. నేనేమి చిన్నపిల్లని కాదు. నాకెవరి తోడూ అవసరం లేదు. ఆలా మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చెయ్యొద్దు." కోపంగా అంది సుస్మిత. "ఒక్క అరగంటలో వచ్చేస్తాను. మీరిద్దరూ వెళ్ళండి."

చేసేదేమీ లేక వంశీ మొహంలోకి చూసి అక్కడనుండి కదిలాడు మదన్. మదన్ తో పాటుగా వంశీ కూడా కదిలాడు. నిజానికి మదన్ తో పాటు, వంశీ అవసరం కూడా వుంది ఆడిటర్ దగ్గర. అందుకనే సుస్మిత ఒక్కర్తీ ఆలా తోటలో ఉండడం ఇష్టం లేకపోయినా, మదన్ ఆలా అన్నప్పుడు ఉంటానని అనలేక పోయాడు వంశీ.

&&&

ఆడిటర్ పద్మనాభంకి ముకుందం, మదన్ ఇంకా వంశీ ముగ్గురూ హెల్ప్ చెయ్యాల్సి వచ్చింది తమకి సంబంధించిన అన్ని లెక్కలు పూర్తి కావడానికి. అందుకు గంటకన్నా ఎక్కువ సమయమే పట్టింది. కానీ అప్పటికి కూడా సుస్మిత తిరిగి ఇంటికి రాలేదు.

"అరగంటలో వచ్చేస్తానని చెప్పింది, ఏం చేస్తూంది ఇంతసేపు?" మదన్ ఆందోళనగా అన్నాడు. "బాగా చీకటి కూడా పడిపోయింది."

"నేనిప్పుడే వెళ్లి తనని తీసుకుని వచ్చేస్తాను." అక్కడనుండి కదులుతూ అన్నాడు వంశీ.

"నేనూ నీతోపాటుగా వస్తాను." వంశీతో పాటుగా బయలుదేరాడు మదన్. ఇంతసేపు తనెందుకు తోటలోనే ఉండిపోయిందో కారణం తోచడం లేదు. ఇద్దరూ ఆల్మోస్ట్ పరిగెత్తుతున్నట్టుగానే తోటలో మునుపు సుస్మిత, మదన్ కూచున్న చోటుకి వెళ్లారు.

పున్నమి మరుసటి రోజు కాబట్టి వెన్నెల ఇంకా బాగానే వుంది. ఆ వెన్నెలలో సుస్మిత ఇద్దరికీ బాగానే కనిపిస్తూ వుంది. తను నిలబడి ఎదురుగుండా వున్నా మామిడి చెట్టువైపు చూస్తూ వుంది. తన మొహం షాక్ తో నిండిపోయి వుంది.

" ఏంటలా నిలబడి చూస్తున్నావు? అరంగంటలో వచేస్తానన్నదానివి ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నావు?" సుస్మిత దగ్గరగా వెళ్లి తన భుజాల చుట్టూ చేతులు వేసి కుదుపుతూ అన్నాడు మదన్.

"చిట్టిరాణి.....చిట్టిరాణి ......" ఇంకా అయోమయంలోనూ, షాక్ లోనే వుంది సుస్మిత.

చిట్టిరాణి పేరువినగానే మదన్ ఇంకా వంశీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు అయోమయంగా చూసుకున్నారు. "చిట్టిరాణి ఏమిటి? కాస్త అర్ధం అయ్యేలా చెప్పు." మనసంతా ఒకరకమైన భయంతో నిండిపోతూ ఉంటే కంగారుగా అడిగాడు మదన్.

"చిట్టిరాణి ....తను వచ్చింది....." ఇంకా అదే అయోమయంతో అంది సుస్మిత.

"చిట్టిరాణి వస్తే ఇప్పుడు ఏమైంది? తను కూడా నీలాంటి మనిషే కదా. ఇలా భయపడాల్సిన అవసరం ఏముంది?" వంశీకి కూడా ఏమీ అర్ధంకాక చిరాగ్గా అన్నాడు.

"కొంచెం అర్ధం అయ్యేలా చెప్పు సుస్మితా అసలేం జరిగింది?" మరోసారి తన భుజాల్ని బలంగా కుదుపుతూ అడిగాడు మదన్.

"మదన్" అని ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా మదన్ ని రెండుచేతులతో పట్టుకుని అతని గుండెలమీద తలపెట్టి ఒక్కసారిగా భోరుమంది సుస్మిత. "చిట్టిరాణి వచ్చింది. అది నీ మీద చాలా కోపంగా వుంది. నిన్ను నానా రకాల హింసలు పెడతానని, నీ మీద పగసాధిస్తానని అంది." అలాగా ఏడుస్తూనే బెక్కుతూ చెప్పింది. తనూ సుస్మితని రెండు చేతులతో పట్టుకుని షాక్ తో వింటున్నాడు మదన్.

"దాని మొహం. ఏడిసింది. మా వాడు ఎంత వద్దన్నా వెంటపడి వేధించడమే కాకుండా ఇలా అంటుందా? పళ్ళు రాలగొట్టి మూల కూచో పెడతాను. అయినా అదేదో ఆలా అంటే నువ్వూ అంత షాక్ అయి ఇలా ఏడవాలా?" వంశీ కోపంగా అన్నాడు.

తమాయించుకుని ఏడుపు అపి, మదన్ చుట్టూ వున్నా చేతులు తీసేసి, మదన్ పట్టునుండి విడిపించుకుని అంది సుస్మిత వంశీ మొహంలోకి చూస్తూ. " నువ్వు పళ్ళు రాలగొట్టి మూల కూచోపెట్టడానికి ఇప్పుడు తను మనిషి కాదు. చనిపోయి దెయ్యం అయిపోయింది."

"వాట్?" మరోసారి షాక్ కి లోనయిపోయాడు మదన్. "చిట్టిరాణి దెయ్యం అయిపోయిందా?" ఆశ్చర్యంగా అడిగాడు.

"అవును మదన్. చిట్టిరాణి చచ్చిపోయి దెయ్యం అయిపోయింది. అదిప్పుడు ఈ మామిడిచెట్టు మీదనే వుంది. మీరిద్దరూ ఆలా వెళ్ళగానే అది ఆ మామిడిచెట్టు మీదనుండి నా ముందుకి వచ్చింది. తను చనిపోయి దెయ్యం అయిపోయానని చెప్పింది.. కానీ మదన్ తను నీ మీద చాలా కోపంగా వుంది. నిన్ను నానా రకాలుగా బాధలు పెడతానని చెప్పింది." సుస్మిత మొహమంతా భయంతో నిండిపోయింది.

"చదువుకున్నావు, దయ్యాలు, భూతాలు అంటావేమిటి?" కోపంగా అన్నాడు మదన్.

"అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా?" కోపంతో అరిచినట్టుగా అంది సుస్మిత. "అది ఇప్పుడు కూడా ఇక్కడే ఈ మామిడి చెట్టు మీద వుంది. మనల్ని గమనిస్తూ వుంది."

"అయితే తనని ఇప్పుడు మన ముందుకి రమ్మని చెప్పు. నీతో చెప్పింది నాకూ చెప్పమని చెప్పు." మదన్ కూడా కోపంగా అరిచినట్టుగానే అన్నాడు.

"మీరిద్దరూ ఆలా వాదులాడుకోవద్దు. ముందు మనం ఇక్కడినుండి ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు మాట్లాడుకుందాం." వంశీ అన్నాడు.

మదన్ కి, సుస్మిత కి కూడా ఆ సలహా నచ్చి ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నాక తలూపారు. తరువాత ముగ్గురూ ఇంటిదారి పట్టారు.

&&&

ఇంట్లో భోజనాలు పూర్తిచేసి, హాలులో కుర్చీల్లో రిలాక్స్ అవుతూ, సుస్మిత కి తోటలో కలిగిన అనుభవం గురించి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

"తనేం చెప్పినా వినకుండా బలవంతంగా అక్కడనుండి తీసుకుని వచ్చేయాల్సింది. ఆలా తనని అక్కడ విడిచిపెట్టి రావడం నాదే తప్పు." నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు మదన్.

"నువ్వూ నన్నక్కడ ఆలా వదిలి వచ్చేబట్టే ఆ చెట్టుమీద చిట్టిరాణి ఉందని నాకు తెలిసింది. ఇంక నువ్వక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండొచ్చు."

"పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నిజంగానే ఆ మామిడి చెట్టుమీద చిట్టిరాణి ఉంటే ఇంతకాలం నన్నెదుకు ఏమీ చెయ్యలేదు?" సుస్మిత ఉద్దేశం తెలిసాక కోప్పడకుండా ఉండలేకపోయాడు మదన్. ఆ తోటలోకి వెళ్లకుండా ఉండడం అంటే చాలా కష్టం అయిన విషయం మదన్ కి.

"తను చనిపోయి దెయ్యం అయింది రెండురోజుల కిందటే, అందుకనే ఇంతకాలం నిన్నేం చెయ్యలేదు." సుస్మిత అంది.

"ఆ చిట్టిరాణి ఉదంతం నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నీకేదోలా తెలిసిరావడం మంచిదే అయినా, ఇందంతా చాలా అయోమయంగా వుంది." వనజ అంది మోహంలో అదే ఎక్స్ప్రెషన్ తో." అయితే చిట్టిరాణి చనిపోయి దెయ్యం అయిపోయిందా?"

"వదినా, నేను చిట్టిరాణి గురించి తనకంతా వివరంగా చెప్పేసాను. నా దగ్గర బయటపడలేదు కానీ మామిడితోటలో తనగురించి విపరీతంగా అలోచించి ఆలా ఇమాజిన్ చేసుకుని ఉంటుంది." చిరాగ్గా అన్నాడు మదన్.

"చిట్టిరాణి వారం రోజులపైగా కనిపించడంలేదని విన్నాను. తను చనిపోకపోతే ఏమై ఉంటుంది?" భృకుటి ముడేసి అన్నాడు ముకుందం.

"ఒకవేళ తను చనిపోయినా దెయ్యం అయి మన మామిడి చెట్టుమీద ఉంటుందని మాత్రం నేను అనను. ఎందుకంటే నా దృష్టిలో దయ్యాలు, భూతాలు లేవు." ఇంకా చిరాగ్గానే వున్నాడు మదన్.

"అంత తేలిగ్గా తన గురించి అనేకురా. నువ్వెంత వద్దనుకున్నా నిన్ను ప్రాణంలా ప్రేమించిన మనిషి." ముకుందం మళ్ళీ అన్నాడు.

"ఏమిటి ప్రేమించడం? ఎంత వద్దు వద్దన్నా వెంటపడి వేధించింది. అంతగా ప్రేమించాలనుకుంటే తన వెంట కుక్కలా పడుతున్న ఆ నాగరాజుగాడిని ప్రేమించొచ్చుకదా." వంశీ కోపంగా అన్నాడు.

"ఇప్పుడది సమస్య కాదు. కానీ ఈ విషయం ఏమిటో నాకు బోధపడడం లేదు. సుస్మిత లాంటి తెలివైన పిల్ల కేవలం ఆలా ఇమాజిన్ చేసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను." వనజ అంది.

"థాంక్స్ ఆంటీ. మీరైనా నన్ను నమ్మారు." వనజవైపు కృతజ్ఞతగా చూస్తూ అంది సుస్మిత.

"నా దృష్టిలో మాత్రం అది కేవలం నీ ఇమాజినేషన్ మాత్రమే. అంతకన్నా ఇంకేం కాదు." స్పష్టంగా అన్నాడు మదన్.

"ఆల్రైట్. అది కేవలం నా ఇమాజినేషన్ మాత్రమే, నిజం కాదు." సుస్మిత తన కుర్చీలోనుంచి లేచి మదన్ ముందుకు వచ్చింది. "కానీ నా తృప్తి కోసం, కేవలం నా తృప్తి కోసం, నువ్వు నాకొక మాట ఇవ్వగలవా?" మదన్ మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది.

"నువ్వడగబోయే మాట ఏమిటో నాకు తెలుసు. నేను ఇవ్వలేను." మదన్ కోపంగా అన్నాడు.

"ఇంతేనా నువ్వూ నన్ను ప్రేమించింది? నా గురించి ఒక చిన్న మాట కూడా ఇవ్వలేవా?" ఆవేదనగా అడిగింది సుస్మిత. "ఇది నేనడుగుతున్నది కేవలం నీ క్షేమం కోసం, నీ కోసం."

"తను మొదటిసారిగా నిన్నొకటి అడుగుతూంది, నువ్వు కాదనడం నాకు నచ్చడం లేదు మదన్." వనజ అంది.

"నేనెప్పుడూ ఇంక ఆ మామిడి తోటలోకి వేళ్ళకూడదు, అంతే కదా నువ్వూ నన్ను అడగబోయేది." కుర్చీలోనుంచి లేచి కోపంగా అన్నాడు మదన్.

"ఇది కేవలం ఆ చిట్టిరాణి సమస్య తీరేవరకూ. ఆ తరువాత నిన్ను నేను అక్కడికి వెళ్లకుండా ఆపను."

కోపంగా ఏమీ చెప్పకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు మదన్.

"ఆ తోటలో టైం స్పెండ్ చెయ్యడం నా తమ్ముడికి చాలా ఇష్టం. వాడు చాలా అప్సెట్ అయిపోయాడు." ముకుందం అన్నాడు.

"మేం ఎంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నామో మీకు తెలియడం లేదు. అసలు జరిగిందంతా పూర్తిగా వింటే మీరిలా మాట్లాడరు." సుస్మిత అంది.

"అయితే అసలు జరిగిందేమిటో మాకు మొదటినుండి మరోసారి చెప్పు." ముకుందం అడిగాడు ఆసక్తిగా.

అప్పుడు సుస్మిత మరోసారి వచ్చి తన కుర్చీలో కూర్చుని అసలు జరిగిందేమిటో చెప్తూ ఉంటే ఆసక్తిగా వినడం ప్రారంబించారు తక్కిన ముగ్గురూ.  &&&

"ఇప్పటికీ సుస్మిత నీకు ఫోన్ చేస్తూనే వుందా? నీతో మాట్లాడుతూనే వుందా?" మాధురి ఇంట్లో సోఫాలో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ అడిగాడు శేషేంద్ర.

"ఆ డ్రగ్ ఇష్యూ తరువాత తను కొంచెం హర్ట్ అయిన మాట నిజమే. అంతకుముందున్నంతగా లేకపోయినా తను నాతొ అప్పుడప్పుడు మాట్లాడుతూనే వుంది. నేనూ ఫోన్ చేస్తూనే వున్నాను." అలా చెప్పకపోతే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక అబద్ధం చెప్పింది మాధురి. ఆ డ్రగ్ ఇష్యూ తరువాత తనే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడింది తప్ప సుస్మిత ఎప్పుడూ మళ్ళీ ఫోన్ చెయ్యలేదు.

"ఆ వ్యవహారం నువ్వు సరిగ్గా చేసివుంటే అసలు ఈ తలపోటు వచ్చి ఉండేదే కాదు. నువ్వసలు ఏమీ తీసుకోకుండా తనని తీసుకోమంటే ఎలా తీసుకుంటుందనుకున్నావు?" కోపంగా అన్నాడు శేషేంద్ర. అసలు ఆ డ్రగ్ ఇష్యూ అలా ఫెయిల్ అయిన తరువాత మాధురి మీద చాల కోపం వచ్చింది శేషేంద్రకి. బయటకి గెంటేసే వాడే కానీ, తను తన వేడి చల్లార్చుకోవడానికి చాల కన్వీనియంట్గా అందుబాటులో ఉండటమే కాదు, అందంగా కూడా ఉంటుంది. అందుకనే వదులుకోలేక పోయాడు.

"ఆ సంఘటన జరిగి రెండు సంవత్సరాల పైన అవుతూంది. ఇంకా ఇప్పుడూ మనం ఆ విషయం గురించి ఆలోంచించాలా?" మాధురి అంది. "జరిగినదానికి విచారపడడంకన్నా చేయాల్సినదేమిటో మనం ఆలోచించుకుంటే మంచిది కదా."

"ఆ మాత్రం తెలివితేటలు నాకు లేక." సోఫాలో ముందుకు వంగి కోపంగా అన్నాడు శేషేంద్ర. "అది చాలా తెలివైనది. మా ప్లాన్ తెలుసుకునే ఇంట్లోనుంచి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది. తనకి ఇరవై రెండేళ్లు వచ్చి ఆస్తి మీద హక్కురాగానే మమ్మల్ని ఇంట్లోనుండి గెంటేస్తుందనడంలో సందేహంలేదు. తనకి ఇరవై రెండేళ్లు రావడానికి రెండునెలల సమయం కూడా లేదు. ఏం చెయ్యాలో బాధపడడం లేదు." శేషేంద్ర కావాలనే తనకి ఇరవై రెండేళ్లు వస్తే సరిపోదు, పెళ్లి కూడా చేసుకుంటే తప్ప తన తండ్రి ఆస్తి మీద సుస్మిత కి  హక్కు రాదని చెప్పలేదు. అలా చెప్పేస్తే కనక, సుస్మితని చంపేయడమే తన ఆస్తిమీద తమకి పూర్తి హుక్కు రావడానికి దారి  అని మాధురి కి అర్ధం అయిపోతుంది. తనని డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడానికి ప్రయత్నించడానికే ఎంతో ఆలోచించింది. చంపేస్తామంటే అస్సలు ఊరుకోదు. ఊరుకోకపోవడమే కాదు తనని రక్షించే ప్రయత్నం కచ్చితంగా చేస్తుంది.

"ఏమిటి మీ ప్లాన్ ఇంతకీ?" వద్దనుకున్నా అడక్కుండా ఉండలేకపోయింది మాధురి. వీళ్ళేమి చెయ్యబోతున్నారు ఇంతకీ సుస్మితని?

"ఇంతకాలం మేము కుక్కల్లా తన ఆస్తికి కాపలా కాసాం. కాస్త వున్న ఆస్తిని బోలెడంత చేసాం. అందుకుగాను ఆ ఆస్తిలో కొంచెం వాటా అడుగుదాం అనుకున్నాం. ఆ కొంచెం కూడా మాకివ్వడం ఇష్టంలేక అలా వెళ్లి పోయింది." తెలివిగా అబద్ధం చెప్పాడు శేషేంద్ర. "అసలు మీ అమ్మగారి కోరిక ఏమిటి చెప్పు? నువ్వు అంతో ఇంతో ఆస్థి వున్నవాడితో సుఖంగా సెటిల్ అవ్వాలనే కదా. నన్నొక బికారిలా పెళ్ళిచేసుకుంటే ఆమె ఆత్మ శాంతిస్తుందా చెప్పు."

"ఆ మాట నిజమే," తలూపింది మాధురి.

"సుస్మితతో ఎంతో కొంత ఆస్తి మా పేరుమీద రాయించుకోగానే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ సుస్మిత ఎక్కడవుందో తెలిస్తే కాళ్లావేళ్లా పడి కొంత ఆస్తి మా పేరుమీద రాయించుకుంటాను. నువ్వు చేయాల్సిందల్లా ఆ సుస్మిత ఎక్కడవుందో నాకు చెప్తే చాలు." బతిమాలుతున్నట్టుగా అన్నాడు శేషేంద్ర.

"నాకు తెలిసిఉంటే ఈపాటికే నీకు చెప్పేసేదాన్ని. నువ్విలా అడగాల్సిన అవసరం లేదు." మాధురి అంది. "తను కనిపించకుండా పోయి రెండురోజులే కదా అయింది. ముందో వెనుకో తను నాకు ఫోన్ చేస్తుంది. తను ఫోన్ చెయ్యగానే ఎక్కడవుందో అడిగి తెలుసుకుంటాను."

"నువ్వు చాలా తెలివిగా అడిగి తెలుసుకోవాలి. నాకు చెప్పడానికి నువ్వు తనని అడుగుతున్నావని తెలిస్తే నీకు తను ఏమీ చెప్పదు." జాగ్రత్త అన్నట్టుగా చూస్తూ అన్నాడు శేషేంద్ర.

"ఆ విషయం నాకు తెలుసు. చాల జాగ్రత్తగానే అడిగి తెలుసుకుంటాను." తలూపింది మాధురి.

"నువ్వు తనకేమైనా ఫోన్ చేసి చూసావా?"

"రెండు మూడు సార్లు చేసి చూసాను. నాట్ రీచబుల్ అని వచ్చింది."

"మాకు అలాగే వస్తూంది. ఆ అతితెలివైనది తనని ట్రాక్ చెయ్యడానికి అవకాశం లేకుండా ఫోన్ సిమ్ డిస్ట్రాయ్ చేసేసి ఎక్కడో పడేసి ఉంటుంది." వెనక్కి జరగిలబడుతూ చిరాగ్గా అన్నాడు శేషేంద్ర. "ఎనీహౌ తన ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి చూసావా?"

"నాకు తనకి కామన్ గా వున్న ఒకరిద్దరు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చూసాను. వాళ్ళు తమ దగ్గరికి రాలేదని చెప్పారు."

"ఎక్కడికి వెళ్లి ఉంటుందో ఏమీ అంతుపట్టడం లేదు. దేశం కానీ దాటి వెళ్లిపోలేదు కదా. తనకి ఒకరిద్దరు ఫ్రెండ్స్ అబ్రాడ్ లో కూడా వున్నారు."

"అలా అబ్రాడ్ వెళ్లిపోయి ఉంటుందనిపించడం లేదు. ఈ చుట్టుపక్కలే ఎక్కడో అక్కడ వుండి ఉంటుంది. నేడో రేపో నాకు ఫోన్ చేస్తుంది. నేను తానెక్కడవుందో కనుక్కుని నీకు చెప్తాను. నువ్వు ధైర్యంగా వుండు." మాధురి అంది.

"థాంక్ యూ. నువ్వు ఆ మాత్రం హెల్ప్ చేస్తే చాలు." మాధురి మొహంలోకి కృతజ్ఞతగా చూస్తూ అన్నాడు శేషేంద్ర.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)