Aa Voori Pakkane Oka eru - 4 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 4

Featured Books
  • I Hate Love - 11

    दिव्या की बात सुनाने नहीं नहीं मैं ठीक हूं ,,,इसकी कोई जरूरी...

  • My Devil CEO

    तो चलिए शुरू करते है लखनऊ जिसको आप सभी उत्तर प्रदेश की राजधा...

  • प्यार तो होना ही था

    रूचि  .. रूचि  ... मेरी बात तो सुनो बेटा , मैं तुम्हारे भले...

  • आशा की किरण - भाग 2

    अरे, कौफी कहां है, मां?’’ रचना ने आवाज लगा कर पूछा, ‘‘यहां त...

  • शक्तिपुंज

    पृथ्वी से बहुत दूर,क्रॉडियम - पृथ्वी से अलग एक खूबसूरत दुनिय...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 4

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"నిజంగానా?" తనకి తెలియకుండానే తనూ రాతి మీదనుండి కిందకి దిగిపోయి, ఆమెకి ఎదురుగా వెళ్లి, ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్. "నేనస్సలు నమ్మలేకపోతున్నాను."

"చెప్పానుగా నేనిప్పుడు నీకు అబద్ధాలు చెప్పానని." సమ్మోహనంగా నవ్వింది సుస్మిత. "నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావేమో, నాతో మాట్లాడతావేమో అని చాలా ఆశగా ఎదురుచూశాను. కానీ  నువ్వు నా దగ్గరకి రావడానికి కానీ, నాతో మాట్లాడడానికి కానీ మళ్ళీ ప్రయత్నించనే లేదు. ఈ లోపున పరీక్షలు అయిపోయాయి. నువ్వు వెళ్లి పోయావు. అదే నీకు అక్కడ ఆఖరి సంవత్సరం కాబట్టి నిన్ను మళ్ళీ కాలేజీలో కలుసుకునే అవకాశం కలగలేదు." కాస్త ఆగింది.

ఆమె చెప్పేది నమ్మలేనట్టుగా ఆలా చూస్తూనే వుండిపోయాడు మదన్. తను హ్యాండ్సమ్ గా ఉంటానని మదన్ కి తెలుసు. కానీ ఇలాంటి అప్సరస కూడా ముచ్చట పడేంత హ్యాండ్సమ్ గా ఉంటానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.

 "నిన్ను మరిచిపోవడానికి ప్రయత్నించాను. మరిచిపోయాననే అనుకున్నాను. కానీ నేను ఏం చేస్తే ప్రమాదం నుండి పూర్తిగా బయటపడగలనో అర్ధమయిందో, నాకు నువ్వే గుర్తుకు రావడం మొదలు పెట్టావు. నీ దగ్గరికే రావాలని చాలా బలంగా అనిపించింది. కానీ అసలే అలాంటి ఎక్సపీరియన్స్ వుంది నాతో నీకు. అంతే కాకుండా నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోయింది మనం కలిసి. నీకు పెళ్ళై పోయిందేమో కూడా తెలీదు. కానీ నా సబ్కాంషస్  మాత్రం నీ దగ్గరికే వెళ్ళమని గోల పెట్టింది. మాటల సందర్భంలో మాధురి చెప్పిన నీ అడ్రస్ గుర్తుంది. సో, ధైర్యం చేసి వచ్చేసాను." ఒక చిరునవ్వు వచ్చి చేరింది మదన్ పెదాలమీదకి. మనస్సంతా ఆనందంతో నిండిపోయింది. తననే ఆలా చూస్తూ చెప్పేది వింటూవున్నాడు.

"ఇక్కడి కొచ్చాక, నీకు పెళ్లి కాలేదని తెలిసాక, నేనేత రిలీఫ్ ఫీలయ్యానో నీకు తెలీదు. నువ్వు ఇంట్లో నేనొచ్చినప్పుడు లేకపోవడం కూడా అడ్వాంటేజ్ గానే వుంది. నేను నీకు లవర్ ని అని చెప్పగానే నీ అన్నావదినా వెంటనే నమ్మలేకపోయారు కానీ ఎందుకో నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయారు. నువ్వొచ్చేవరకూ నన్ను మేడ మీద నీ రూమ్ లో రెస్ట్ తీసుకోమన్నారు. సో ఆలా నీ రూమ్ లో నాకు ఎంట్రీ దొరికింది." గట్టిగా ఒకసారి నిట్టూర్చింది సుస్మిత.

మదన్ ఏమి మాట్లాడలేదు. తనని చూస్తూ ఉంటే ఇంకా ఎదో చెప్పాలనుకుంటున్నట్టుగానే వుంది. మదన్ వూహ నిజమైంది.

"నువ్వు రాగానే, మొదట నిన్ను బతిమాలుకొని ఎలాగోలా ఇక్కడ ఆశ్రయం దొరికాక నా మనసులో మాట నీకు చెప్పాలన్నది నా ఆలోచన. కానీ ఆ రోజున నేను పొగరుగా మాట్లాడిన విధానం గుర్తుంచుకుని నువ్వు నాకు అసలు అవకాశం ఇవ్వవేమో అన్న భయం కూడా వుంది. అలా తర్జన భర్జనలు పడుతూ ఉంటే అక్కడే బెడ్ మీద వున్ననీ డైరీ కనిపించింది. అసలే కాలక్షేపం కావడం లేదు అంతే కాకుండా ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో కూడా తెలుస్తుంది కదాని తీసి చదవడం మొదలు పెట్టాను. చిట్టిరాణి విషయం చదివాక షాక్ అయ్యాను. నువ్వు చిట్టిరాణి ని ఎప్పుడూ ఇష్టపడకపోవడం, ప్రేమించకపోవడం నాకు ఆనందం కలిగించింది కానీ, చిట్టిరాణి అలా నదిలో పడిపోవడం నన్ను దిగ్భ్రమ పరిచింది. నేను ఆ షాక్ నుండి బయటకి వచ్చాక, మళ్ళీ నిన్నెలా ఒప్పించాలా అని ఆలోచిస్తూంటే ఈ బ్లాక్ మెయిల్ ఆలోచన వచ్చింది. ముందో, వెనకో నేను ఇదంతా నీకు చెప్పే ఆలోచనతోనే వున్నాను. ఇందంతా నిజామా అని నువ్వు నన్ను మరోసారి అడక్కు. నిన్నెలా కన్విన్స్ చెయ్యాలో నాకు తెలీదు. నిన్ను చాలా బాధపెట్టాను. ఐ యాం సారీ. ఇంటికి వెళ్ళగానే నీ డైరీ నీకు ఇచ్చేస్తాను." కాస్త ఆగి మళ్ళీ అంది. "ఎంత జీవితం ముఖ్యం అయినా, ఆస్తి ముఖ్యం అయినా వాటి గురించి ఎవళ్ళనో ఒకళ్ళని కట్టుకునే మనస్తత్వం కాదు నాది. నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, కావాలనుకున్నాను కాబట్టే నీ దగ్గరికి వచ్చాను. లేకపొతే ఇంకో ఉపాయం ఏదన్నా అలోచించి ఇంకో చోటికి ఎక్కడికన్నా వెళ్లేదాన్ని."

మదన్ అప్పటివరకు ఎప్పుడూ ఏ అమ్మాయి తోనూ అలా చెయ్యలేదు. ఏ అమ్మాయి తో నైనా అలా చేస్తానని, అంత డేరింగ్ తనలో ఉందని కూడా అనుకోలేదు. నిజంగా మదన్ వైపునుండి అది పూర్తిగా అసంకల్పిత చర్య. తనేం చేస్తున్నాడో తనకి పూర్తిగా బోధపడేలోగా, సుస్మితని షాక్ కి గురిచేస్తూ ఆమెని రెండు చేతులతోటి బలంగా కౌగలించుకున్నాడు మదన్. సుస్మిత ఇంకా షాక్ లోనే వుండి, నివ్వెరపోయి చూస్తూ ఉండగానే ఆమె రెండు పెదాల మీద బలంగా తన పెదాలు మోపాడు.

అప్పటికి షాక్ నుండి బయటపడి ఏం జరుగుతోందో అర్ధంచేసుకోగలిగింది సుస్మిత. ఆమె మనస్సులో కేవలం కొంచెం భాగం మాత్రం అతని పట్టునుండి విడివడాలని గోల పెడితే, చాలా భాగం ఆ వెచ్చదనం ఆ అనుభవం ఇంకా ఇంకా కావాలని పోరుపెట్టింది. ప్రతిఘటించడానికి బదులుగా తనూ అతని చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా కౌగలించుకుంది. తన పెదాలని అతని పెదాలనుండి విడిపించుకుని, అతని కుడి బుగ్గ మీద బలంగా ముద్దు పెట్టింది.

యవ్వనంతో ఉప్పొంగుతూన్న ఆమె శరీర స్పర్శ అద్భుతంగా వుంది మదన్ కి. నిండైన ఆమె వక్షోజాలు రెండూ తన గుండెలకి బలంగా ఒత్తుకుంటూంటే ఏమి చేస్తున్నాడో బోధపడడం లేదు. తన కుడి చెయ్యి ఆమె వెనక భాగాన అలా కిందకి దిగి ఆమె పిరుదుల మీద ఆగడం అతను అనుకోకుండా చేసిన విషయమే. కానీ ఆ చేతిని బిగుతుగా వున్న ఆమె పిరుదుల మీద రాస్తూ ఆ నున్నదనాన్ని అనుభవించడం అతను కావాలని చేస్తున్నదే. ఎప్పుడైతే అతను తాను ఆ కుడిచేతిని ఆ రెండు పిరుదుల మధ్యలో వున్న కాలువలో బలంగా మోపాడో ఆమె కూడా తన రెండు తొడలు తనకి తెలియకుండానే బాగా జాపింది.

ఆమెని అలాగే పొదివి పట్టుకుని ఆమె మొహం అంత ముద్దులతో ముంచేశాడు మదన్. తన స్పర్శ మదన్ కి ఎంత మనోహరంగా, అద్భుతంగా వుందో అతని స్పర్శ కూడా ఆమెకి అంత మనోహరంగాను అద్భుతంగాను వుంది. మనస్సంతా ఎదో ఎదో అద్భుతమైన భావంతో నిండిపోతూ ఉంటే, శరీరం అంతా సుఖం కరంట్ లా ప్రవహిస్తూవుంటే అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుని అతని జుట్టులోకి తన వేళ్ళు పొనిచ్చింది సుస్మిత.

అంతలోనే ఇద్దరినీ డిస్టర్బ్ చేస్తూ ఎదో పుల్లముక్క ఎవరో కాలు వేస్తె విరిగిన శబ్దంలా అనిపించింది. ఆ నిశబ్దంలో ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చారు. నిజానికి ఆ డిస్టర్బన్స్ ఇద్దరిలోనూ పూర్తిగా మరుగున పడిపోయిన మోరల్ కాన్షస్ నెస్ ని బయటకి తెచ్చినట్టుగా అయింది. ఎంత తామిద్దరూ లవర్స్ అయినా, పెళ్లి కాకుండా అలా చేయడం మంచిదికాదని ఇద్దరికీ బాగా తెలుసు. ఒంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి మదన్ కౌగిట్లోనుంచి బయటికి వచ్చింది సుస్మిత.

"ఐ యాం సారీ. నేనెలా చేద్దామని అస్సలు అనుకోలేదు." మోహంలో రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు మదన్.

"ఇట్స్ ఆల్ రైట్." తనేం చేసిందో పూర్తిగా అవగాహనలోకి వచ్చి మొహం ఎర్రగా అయిపొయింది సుస్మితకి. "కానీ మన పెళ్లి అయ్యేలోపు మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు."

"అంటే నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశావన్నమాట." చిలిపిగా నవ్వుతూ అన్నాడు మదన్.

"రాస్కేల్, అదే ఉద్దేశం లేకపోతే నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకోనిస్తాను అనుకున్నావా?" కోపంతో మండిపడింది సుస్మిత. "ఆల్రెడీ చెప్పేసానుగా నీకు, నేను నీ దగ్గరికే రావడంలో ప్రధాన ఉద్దేశం అదే."

"ఒకే, ఒకే." సడన్ గా చుట్టూ వున్న పరిస్థితిని గమనిస్తూ అన్నాడు మదన్. ఆరోజు పున్నమి కాకపోతే అప్పుడు చీకటి భయంకరంగా ఉండేది వాళ్ళిద్దరికీ. "బాగా చీకటి పడిపోయింది. మనం ఇంక ఇంటికి వెళ్లిపోదాం” అన్నాడు.

"రేపు మళ్ళీ వద్దాం. నా వైపునుంచి అంతా చెప్పను. ఇంక నీ వంతు." సుస్మిత అంది.

"నా డైరీ అంతా చదివేసావుగా. ఇంకా నేనేం ప్రత్యేకంగా చెప్పాలి నీకు?" భృకుటి ముడేసాడు మదన్.

"నీ డైరీ లో నువ్వు రాయనిది చాలా వుండే ఉంటుంది. అదంతా రేపు నువ్వు చెపుదువు గాని."

"ఒకే, నాకేం అభ్యంతరం లేదు." చిలిపిగా చూస్తూ అన్నాడు మదన్. "నీతో ఇలా తోటలోకి రావడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం."

"రేపు కానీ ఇలాంటిది ఏమైనా ట్రై చేసావో, నేను ఒక్కర్తినే ఇక్కడినుండి తిరిగి వెళ్తాను. ఆ విషయం గుర్తుంచుకో." అక్కడనుండి నడవడం మొదలు పెట్టింది సుస్మిత.

దీర్ఘంగా నిట్టూర్చి మదన్ ఆమెని అనుసరించడం మొదలు పెట్టాడు.

&&&

బెడ్ మీద అడ్డంగా పడుకున్న సుస్మితకి అల్లకల్లోలంగా వున్నమనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో బోధపడడం లేదు. తోటలో చోటు చేసుకున్న ఆ సంఘటన ఒళ్ళంతా సిగ్గుతో ముంచేస్తూన్నా, అప్పుడు కలిగిన ఆ మధురానుభూతి మాత్రం ఇప్పుడూ కలుగుతూన్నట్టుగానే వుంది ఆలోచిస్తూంటే. దొంగ రాస్కేల్, ఎంత ధైర్యం! తనెంత ప్రేమిస్తున్నానని చెప్పినా అంత తొందరగా అంతకి తెగిస్తాడని మాత్రం అనుకోలేదు.

వద్దు వద్దనుకున్నా మదన్ తనని ఒడిసి పట్టుకుని తన పెదాలు మీద పెదాలు ఆంచిన తీరు గుర్తుకొస్తూనే వుంది. తన విషయం తెలీదు కానీ సుస్మితకి సంభందించిన వరకు మాత్రం అదే మొదటి కౌగిలి, ఇంకా మొదటి ముద్దు. సెక్స్ లో అనుభవం లేకపోయినా ముద్దుల గురించి, ఇంకా ఆ పెద్ద విషయం గురించి ఏవో ఊహలు, అంచనాలు వున్నాయి. మొదటి కౌగిలి, మొదటి ముద్దు అద్భుతంగా వుంటాయనిపించినా అంత అద్భుతంగా వుంటాయని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.

అంతలోనే మదన్ తన కుడిచేతిని తన పిరుదుల మీద ఆనించి మసాజ్ చేసిన విషయం గుర్తుకొచ్చి మొహం అంతా ఎర్రగా అయిపొయింది. తాను ప్రతిఘటించడానికి బదులుగా, తన పిరుదుల మధ్య కాలువలో చేతిని గట్టిగా మోపగానే తొడలు బాగా జాపి ఇంకా గట్టిగా కౌగలించుకుంది. ఆ అనుభవం ఎంత బాగా ఉంటే మాత్రం ఆలా ఎలా చేసింది? పెళ్లి కాకుండా అలంటి అనుభవాలు తన దృష్టిలో చాలా తప్పు. ఆ విషయం మరిచిపోయి, తనూ అతనిని కౌగలించుకుని ముద్దులు పెట్టి కో-ఆపరేట్ చేసింది. తనలాగే ఊరుకుని ఉంటే విషయం ఎంతవరకూ వెళ్లేదో! బహుశా అక్కడే తనని అనుభవించి వుండేవాడేమో?

మై గాడ్! బెడ్ మీద నిలువుగా పడుకుని అడ్జస్ట్ అయింది సుస్మిత. తాను వచ్చిన రోజునే మేడ మీద మదన్ రూమ్ కి రెండు రూమ్ ల అవతల వున్న రూమ్ ని సుస్మిత కి అలాట్ చేసారు మొత్తం అన్ని సౌకర్యాలతో. మదన్ అన్న, వదిన  ఇంకా ఆ ఇంకో కుర్రాడు తన మీద చూపిస్తూన్న ప్రేమ, అభిమానం చూస్తూ ఉంటే వాళ్ళు మదన్ ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్ధం అవుతూంది. మదన్ తో తన పెళ్ళికి ఎలాంటి అడ్డూ వుండదనే అనిపిస్తూంది. ఇంత త్వరగా, ఇంత చక్కగా తన ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందని, తన కోరిక తీరుతుందని తను అనుకోలేదు.

ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒక్కటే. తాను బ్రాహ్మిన్. నాన్-వెజ్ తినదు. మదన్ వాళ్ళ ఫామిలీ అదర్ కాస్ట్. వాళ్ళు నాన్-వెజ్ తింటారు. తను తినకపోయినా, వాళ్ళు తింటూవున్నా కూడా తనకి అనీజీ గానే ఉంటుంది. రాత్రి సప్పర్ టైం లో వాళ్ళు చికెన్, ఫిష్ అవి తన పక్కనే తింటూ ఉంటే తన మోహంలో ఫీలింగ్స్ కనిపించకుండా ఉండడానికి తను చాలా ప్రయత్నిచాల్సి వచ్చింది. రేపెప్పుడైనా తనని వాళ్ళు నాన్-వెజ్ తినమని బలవంత పెడితే ఏం చెయ్యాలో తోచడం లేదు. పుట్టి బుద్ధెరిగాక తాను గుడ్డు కూడా ఏ రోజు తినిన పాపాన పోలేదు.

ఏం చేస్తాం, కొన్నింటికి అడ్జస్ట్ అవ్వక తప్పదు, నిట్టూరుస్తూ అనుకుంది సుస్మిత. అంతగా ప్రేమించాక ప్రేమించిన మనిషికోసం కొన్ని పాత అలవాట్లు వదలుకోవాలి, కొత్త అలవాట్లు చేసుకోవాలి తప్పదు మరి, అనుకుంటూ కళ్ళు మూసుకుని మరోసారి నిద్రపోవడానికి ప్రయత్నం ప్రారంభించింది. ఇలా నిద్రలోకి జారుకొంటూంది అన్న సమయంలో కరెంట్ షాక్ కొట్టినట్టుగా చిట్టిరాణి గుర్తుకు వచ్చింది. ఒక్కసారిగా బెడ్ మీద లేచి కూచుంది సుస్మిత.

డైరీలో చదివిన దాని ప్రకారంగా చాల గాఢంగా ప్రేమించింది చిట్టిరాణి మదన్ ని. మదన్ రాసిన దాని ప్రకారం, తన అభిప్రాయంలో అలాంటి ప్రవాహంలో పడ్డాక తను బ్రతికే అవకాశం లేదు.ఒకవేళ తను బ్రతికి ఉంటే? రేపెప్పుడైనా మళ్ళీ మదన్ దగ్గరికి వచ్చి గోలపెడితే? డైరీ లో రాసిన దాని ప్రకారంగా చిట్టిరాణి విషయంలో మదన్ చాలా స్పష్టంగా వున్నాడు. ఒకవేళ చిట్టిరాణి బ్రతికి వచ్చినా మదన్ తనని ప్రేమిచ్చేందుకు గాని, పెళ్లి చేసుకునేందుకు గాని అవకాశం లేదు. కానీ ఇంతకాలం అంత గాఢంగా ప్రేమించిన చిట్టిరాణి ఊరుకుంటుందా? ఎలాగోలా మళ్ళీ మదన్ ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చెయ్యకుండా వుంటుందా? ఆలా ఆలోచిస్తూ ఉంటే చాలా అనీజీ గా వుంది.

అంతలోనే సుళ్ళు తిరుగుతూ వంతెన కింద తను చూసిన నది గుర్తుకు వచ్చింది సుస్మితకి. అలాంటి నదిలో చిట్టిరాణి పడిపోయిందంటే ఒళ్ళంతా జలదరిస్తూ వుంది. ప్రాణం పోయేంతవరకూ తనెంత కొట్టుకుని ఉంటుంది? అందులోనూ ప్రేమ విఫలమై తనలా చనిపోయింది. తన ఆత్మకి శాంతి వుంటుందా? తను స్పిరిట్స్ ని నమ్మాలా వద్దా అని ఏ రోజు ఆలోచించ లేదు. ఒకవేళ చిట్టిరాణి స్పిరిట్ గా అయివుంటే మాత్రం మదన్ ని విడిచి పెట్టదు. మదన్ ని ప్రేమిస్తూన్న తనని బాధ పెట్టాలని చూస్తుంది.

ఓహ్, గాడ్! ఈ ప్రాబ్లెమ్ ని నువ్వే సాల్వ్ చెయ్యాలి' మరోసారి బెడ్ మీద ఎడమపక్క వత్తిగిల్లి, కళ్ళుమూసుకుని మరోసారి నిద్రపోవడానికి ప్రయత్నించేముందు దేవుడిని ప్రార్ధించింది సుస్మిత. ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ కావడం అంత తేలిక కాదన్నట్టుగా, ఆ తరువాత కూడా చాల సేపటివరకూ నిద్రపోలేక పోయింది.

&&&

మర్నాడు ముందు రోజుకన్నా వేగంగానే బయలు దేరారు సుస్మిత ఇంకా మదన్ తోటలోకి. ముందు రోజు కూర్చున్న చోటులోకే వెళ్లి అక్కడ మునుపు కూచున్న రాళ్లమీద బాసిపట్టు వేసుకుని కూచున్నాక సుస్మిత అంది మదన్ మొహంలోకి చూస్తూ. "గుర్తుంది కదా. నిన్నటిలాంటి అడ్వెంచర్స్ ఏమైనా చేస్తే అంత బాగుండదు. అలాంటివన్నీ కేవలం పెళ్లయ్యాక మాత్రమే."

"ఈ రోజు నువ్వే వచ్చి కావాలన్నా అలాగా చెయ్యను. ప్రామిస్." వచ్చే చిరునవ్వుని అదుపుచేసుకుంటూ సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు మదన్.

"ఆల్రైట్." సుస్మిత అని సడన్గా ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ తెచ్చుకుంది మొహంలోకి. "ఇప్పుడు ఆ చిట్టిరాణి విషయం గురించి పూర్తిగా చెప్పు. ఏ విషయం దాచడానికి వీల్లేదు."

"నేనా డైరీలో రాసిన కన్నా ఎక్కువగా చెప్పడానికి ఏమీ లేదు." అనీజీ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు మదన్.

"చిట్టిరాణి తన చిన్నప్పటినుండి నిన్ను ఘాడంగా ప్రేమిస్తూంది. ఎంతగా ప్రేమించిందంటే నీ గురించి తానేమైనా చేస్తుంది. అలాంటి ప్రేమ గురించి, ఆలా ప్రేమించే అమ్మాయి గురించి మొత్తం నువ్వు డైరీ లో రాసిన నాలుగు పేజీల్లో ఉందంటే నేను నమ్మను. మొత్తం చెప్పు. నేను వినాలి." దృఢస్వరంతో అంది సుస్మిత.

"సరే అయితే." రాతిమీద నుంచి లేచి నిలబడ్డాడు మదన్. "చిట్టిరాణి అసలు పేరు ప్రమీల. ముద్దుగా చిట్టిరాణి అని ఇంట్లోవాళ్ళు ఇంకా అందరూ పిలుస్తారు. మా ఇంటికి కొంచెం దూరం లోనే వాళ్ళ ఇల్లు వుంది. మా కుటుంబానికి వాళ్ళ కుటుంబంతో కొంచెం చుట్టరికం కూడా వుంది. మా ఇద్దరికీ ఎప్పటినుండి పరిచయం అంటే,మాకు జ్ఞానం వచ్చిన దగ్గరినుండి. మేమిద్దరం వంటిమీద బట్టలు లేకుండా ఒకళ్ళనొకళ్ళం చూసుకున్న రోజులు నాకు ఇంకా గుర్తు వున్నాయి. అంత చిన్నతనం నుంచి మాకు పరిచయం." సుస్మిత మొహంలోకి చూసి చెప్తూ, కాస్త ఆగాడు మదన్.

రెండు చేతులు కూచున్న రాతిమీద వెనక్కి ఆనించి బాలన్స్ అయింది సుస్మిత. మోహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా వింటోంది.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)