Manasichi Chudu - 5 in Telugu Love Stories by Ankithamohan books and stories PDF | మనసిచ్చి చూడు - 5

Featured Books
Categories
Share

మనసిచ్చి చూడు - 5

               

                మనసిచ్చి చూడు - 05



గౌతమ్ సడన్ బ్రేక్ వేయడం వల్ల కళ్లు తెరిచి చూసింది,పక్కన గౌతమ్ చాలా కోపంగా ఉన్నాడు. 
ఇప్పుడు మళ్లీ ఎమైంది అని ఇంత కోపంగా చూస్తూ ఉన్నాడు అనుకుంది. 

నేను డ్రైవర్లాగా కనిపిస్తున్నానా.... నువ్వు నిద్రపోతు
ఉంటే నేను డ్రైవ్ చేయడానికి.....???? సూటిగా చూస్తూ అన్నాడు. 

డ్రైవర్ అని అనుకోవడం ఎందుకు మీరు నా భర్త అని మర్చిపోతున్నారు.

సరే దిగి వెళ్ళు నాకు పని ఉంది. 

హా థాంక్యూ థాంక్యూ బై 😍

              ***************

ఇంట్లోకి వస్తున్న కోడలి మొహంలో సంతోషం చూసి ఉమా గారు సంతోషంగా వెళ్ళి వాడు ఎమైన మాట్లాడినాడా తల్లి అని అడిగింది 😍

అవును అత్తయ్య డైరెక్ట్గా మాట్లాడకపోయిన ఇన్డైరెక్ట్గా  మాత్రం నా మీద ప్రేమ చూపిస్తున్నారు అనిపిస్తుంది. నేను నిన్న అడిగాను ఇలా కొన్ని వస్తువులు కావాలి అని ఈరోజు అడగకుండానే మాల్కి తీసుకొని వెళ్ళారు అత్తయ్య అని ఎంతో సంతోషంగా చెప్పుకుంది.

మెల్ల మెల్లగా తనలోనే మార్పు వస్తుందిలే సమీరా నువ్వే మార్చుకోవాలి తనని. 

తప్పకుండా అత్తయ్య గారు. 
సాయంత్రం మీ మామయ్య గారు డిస్చార్జ్ అయి వస్తారు తల్లి. 

అలాగే అత్తయ్య ఎమ్ కాదు మీరు కంగారు పడకండి. 

(అసలు విషయం తెలిస్తే మీరు మమ్మల్ని ఏమనుకుంటారో సమీరా.ఏదైనా గానీ మీరు సంతోషం ఉంటే అదే సంతోషంగా మాకు,మా వాడిని అర్థం చేసుకునే భార్య వచ్చింది అది వాడి అదృష్టం) 

అలాగే సమీరా.... ❣️ 

*******************************

      సమీరాను వదిలి ఆఫీస్కి వెళ్లాడు గౌతమ్.

రే జగదీష్ రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది విక్రమ్ కంపెనీతో గుర్తు ఉందా....?? 

గుర్తుంది రా ఎలా మర్చిపోతాను. 

ఓకే రా ఒకవేళ నేను రాలేకపోతే నువ్వే హ్యాండిల్ చెయ్ రా. 

ఏ రా ఎందుకు రాలేవు...?? 

ఎమ్ లేదు రా కొంచెం పని ఉంది. 

ఎమ్ పని రా మీటింగ్ కంటే అంత ముఖ్యమా......??? 

అవును రా చాలా ముఖ్యం. 

ఏంటి రా అంత ముఖ్యం.....???? 

అదేమీ లేదు రా రేపు నేను సమీరా కొంచెం బయటకి వెళ్తున్నాము. 

సూపర్ రా వెళ్ళి రండి నేను చూసుకుంటాను నో ప్రాబ్లమ్

కానీ ఈ విషయం ఇంక సమీరాకి చెప్పలేదు రా. 

ఎమ్ ఎందుకు రా. 

ఎమ్ లేదు ఊరికే రా. 

గౌతమ్ మనసులో మాత్రం ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నాడు సమీరాకి ఎలా చెప్పాలా అని. 

                 ****************
ఇక్కడ ప్రతాప్ వర్మ గారు కొడుకు గురించి ఆలోచిస్తునే ఉన్నారు.పెళ్ళి అయితే అయింది కానీ కొడుకులో ఏ మాత్రం మార్పు వస్తుందో అని కొంచెం గాభరా పడుతున్నాడు.ఏది ఏమైనా సరే కొడుకు పెళ్ళి జరిగినందుకు మాత్రం ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. 

            అనుకున్నట్టె గౌతమ్ సాయంత్రం వచ్చి వాళ్ళ నాన్న గారిని డిస్చార్జ్ చేసుకుని వెళ్ళారు.ఇంటికి వెళ్లడం హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టరు. 

ప్రతాప్ వర్మ మనసులో మాత్రం నేను బాగానే ఉన్నాను కానీ పాపం వీడు చాలా కంగారు పడుతున్నాట్టు ఉన్నాడు కానీ ఎమ్ చేసిన నీకోసమే నాన్న,నీ సంతోషం కోసమే నాన్న.

        నాన్న మీరు దేని గురించి వరీ అవ్వకండి,అన్ని చూసుకోవడానికి నేను ఉన్నాను మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న చాలు. 

అలాగే గౌతమ్ నువ్వు ఎమ్ కంగారు పడకు. 

సమీరా నాన్న గారిని బాగా చూసుకో,ఆ బాధ్యత నీదే. 

🙄🙄🙄🙄 నాతో మాట్లాడని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా ఆనుకొని అలాగే అండీ అంది. 

ఉమా గారు కొంచెం ఏమోష్న్ల్ అయ్యారు కానీ నిజం ఏంటో ఆమెకి తెలుసు కదా.అందుకే కొంచెం నటించారు కానీ నిజానికి మొదట్లో చాలా బాధ పడ్డారు. 

గౌతమ్ తన రూమ్లోకి వెళ్తూ సమీరా ఒక్కసారి లోపలికి రా..... అన్నట్టు సైగ చేస్తూ వెళ్లాడు. 

ఏమంటాడో ఏమో అని లోపలికి వెళ్ళింది. 

నీతో కొంచెం మాట్లాడాలి సమీరా ఒక గంట తరువాత కొంచెం బయటికి వెల్దామ్. 

ఇప్పుడు ఈ టైమ్లో ఎందుకు అండీ. 

చెప్పింది చెయ్ చాలు కొంచెం మాట్లాడాలి అంటూన్నానుగా. 

అలాగే మీ ఇష్టం అండీ బ్లష్ అవుతూ.... ❣️ 

సమీరా వైట్ సారీలో లుజ్ హెయిర్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది.గౌతమ్ కూడా వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్తో మ్యాన్లీ లుక్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇద్దరు చూడముచ్చటైన జంట. 

       ఉమా గారికి వెళ్ళొస్తాను అని చెప్పి కార్లో వచ్చి కూర్చుంది.ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు ఏంటి అని కొంచెం టెన్షన్గా ఉన్న కూడా భర్త అనే నమ్మకం ఉంది కాబట్టి కామ్గా కూర్చుంది.
             
          కొడుకు-కోడలు అలా సంతోషంగా బయటికి వెళ్తు ఉంటే చాలా ఆనందపడ్డారు ప్రతాప్ వర్మ అండ్ ఉమా గారు.కానీ పిడుగు లాంటి వార్త సమీరాని చిత్రవధ చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు.

         బోర్గా ఉంది అని అటు ఇటు చూస్తూ ఉంది సమీరా........ అది అర్థం చేసుకొని పాటలు పెట్టాడు గౌతమ్. 



"తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా… మనసా… ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది!
తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా… మనసా… ఇది ఏజన్మ సంబంధమో

ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే.. మారినా.. కాలమే.. ఆగినా
మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ !
తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో 

ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే… నీవుగా… ప్రాణమే… నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ !
తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా… మనసా… ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది!
తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో "

పాటను వింటూ కొంచెం సంతోషంగా ఉంది సమీరా, గౌతమ్ తనని గమనిస్తునే ఉన్నాడు.ఇప్పుడు ఇంత సంతోషంగా కూల్గా ఉన్నావు కానీ కాసేపటి తరువాత నేను చెప్పబోయే వార్త విని నువ్వు ఎలా అనుకుంటావో ఏమో అని కొంచెం టెన్షన్గానే ఉంది.

        కార్ నేరుగా ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరకు వెళ్ళింది గౌతమ్ బయటకు దిగి డోర్ ఓపెన్ చేసి చాలా కూల్గా రా అన్నాడు. 

       కానీ ఇక్కడికి ఎందుకో తనకి అర్థం కాలేదు. 

            ఇక్కడికి ఎందుకు అని అడిగింది. 

ఇది నా ఫ్లాట్ పర్లేదు రా అని చెప్పి తీసుకొని వెళ్లాడు లోపలికి,సమీరాలో ఏదో తెలియని  అలజడి,రెండు ఆందోళన మొదలైయ్యాయి.
అప్పుడే కరెక్ట్గా కరెంట్ కూడా పోయింది.......???? 


ఇంకా ఉంది.....?????

                    ధన్యవాదాలు 💐 

                    అంకిత మోహన్ ✍️