Is life fair or unfair? in Telugu Moral Stories by Yamini books and stories PDF | జీవితం న్యాయమా?అన్యాయమా ?

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

జీవితం న్యాయమా?అన్యాయమా ?

విలువ : ధర్మం

ఉపవిలువ : సత్ప్రవర్తన.

కర్ణుడు , కృష్ణుడి తో ఇలా అన్నాడు – “జీవితం లో నాకు చాలా అన్యాయం జరిగింది. వివాహం కాని యువతికి జన్మించటం నా తప్పా ?నేను పుట్టిన తక్షణమే నా తల్లి నన్ను విడిచి పెట్టింది . రాజభవనంలో పెరగవలసిన నేను సూతుని ఇంట పెరగ వలసి వచ్చింది. సూత పుత్రునిగా పరిగణించ బడటం వలన ద్రోణాచార్యుల వారి వద్ద ధనుర్విద్య పూర్తిగా నేర్చుకోలేక పోయాను. “పరశురాముని వద్ద విద్య సంపూర్ణంగా నేర్చుకున్న ప్పటికీ నేను క్షత్రియుడను కావడం వలన యుద్ధ సమయంలో తాను నేర్పిన విద్య నాకు గుర్తు రాకుండా ఉండాలి అని శాపం పొందవలసి వచ్చింది. ఇది నా తప్పేనా? అసలు విద్య నేర్చుకుంటున్నప్పుడు నేను క్షత్రియ వంశం లో పుట్టానని నాకు తెలియదు.      

        “ఒక బాలుడు పరుగున వచ్చి నా రథం క్రింద పడినాడు, అది ఒక ప్రమాదం (ఆక్సిడెంట్ ) అయినప్పటికీ ఆ పిల్లవాని తండ్రి నన్ను శపించాడు". ద్రౌపది  స్వయంవరంలో కూడా నేను సూర్య పుత్రుడిని అయినప్పటికీ సూతపుత్రుడినని అవమానించ బడ్డాను. 

      కుంతీ దేవికి  తన మిగతా సంతానం పైన వాత్సల్యం ఎక్కువ. ఆమె నాకు ఎన్నడూ నేను తన కుమారుడిని అన్న సత్యం చెప్పలేదు. ఆఖరికి నిజం చెప్పినప్పటికీ తన పిల్లలపైన  రెండవసారి ఆయుధం ప్రేయోగించ వద్దని కోరింది. ఒక తల్లిగా ఆవిడ నా పట్ల అలా  ప్రవర్తించినప్పటికీ  నేను ఆమె కోరినవన్నీ నెరవేరుస్తానని  ఒప్పుకున్నాను.  నాకు   “కురుకుల" సింహాసనం లభించవలసి ఉన్నప్పటికీ దుర్యోధనుడి దయా దాక్షిణ్యాల వలన లభించిన చిన్న రాజ్యాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాను. “భీష్మాచార్యుల వారు కూడా నా శక్తి సామర్ధ్యములను గుర్తించకుండా నన్ను శంకించటమే  కాకుండా  తాను సైన్యాధ్యక్షుడిగా  ఉండగా నేను యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయకూడదని అన్నారు”. 

      ఈ నాడు నేను ఈ దుస్థితి లో కూడా ఇలా ఉన్నానంటే దానికి కారణం దుర్యోధనునితో  నాకు గల స్నేహమే. మీకందరికీ అతను దుష్టుడిగా కనిపించవచ్చేమో కానీ అతను నాకు ఎప్పుడు మంచే చేశాడు. దేవతలందరూ నన్ను విడిచిపెట్టినప్పటికీ అతను మాత్రం నాతోనే ఉన్నాడు. అందువల్ల నేను అతని పక్షాన ఉండటంలో తప్పు ఏముంది? అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించాడు. 

కర్ణుడు అడిగిన ప్రశ్నలకి శ్రీ కృష్ణుడి సమాధానాలు :

    కర్ణా ! నేను జైలులో పుట్టాను నా పుట్టుకకు ముందే మృత్యువు నా కోసం వేచి ఉన్నది. నేను పుట్టిన రాత్రే తల్లి నుండి వేరు చేయబడ్డాను.  సూతుడి ఇంట్లో నీకు కొంతైనా విద్యాభ్యాసం జరిగింది. చిన్నప్పటినుండీ నువ్వు కత్తులు, రథాలు, గుర్రాలు, ధనుర్భాణాల ధ్వనుల మధ్య పెరిగావు. మరి నేనేమో పశువుల పాకలోనే పెరిగాను. అక్కడ కత్తులు, రథాలు ఏమి లేవు ఉన్నదల్లా ఆవు పేడ, ఆవులు, గొల్లభామలు. మరొక పక్కన నా మీద సొంత మేనమమమామ అయిన కంసుడి  హత్య యత్నాలు. వాళ్ళ సమస్యలన్నిటికీ నేను కారణ మంటూ ప్రజలు అనటం నాకు వినిపిస్తూనే  ఉంటుంది. తప్పించుకు పారిపోయే పిరికిపంద అని కూడా నన్ను అంటూ ఉంటారు. మీరందరు గురువుల  చేత మెప్పును పొందుతూ ఉంటే నేనసలు గురుకులానికి వెళ్ళనే లేదు. పదహారేళ్ళు వచ్చాక మాత్రమే నేను సాందీప  మహర్షి గురుకులంలో చేరాను. 

      నాకు ఏ సైన్యమూ లేదు. అతి చిన్న వయసులో మేనమామ ను చంపినందుకు నిందింప బడ్డాను. జరాసంధుని భయం వలన యమునా నదీ తీరం నుంచి చాలా దూరం సముద్రపు ఒడ్డున మొత్తం నా జాతి ప్రజలందరితో కలిసి పారిపోయి బ్రతకవలసి వచ్చింది. అది మాకు చాలా కొత్త చోటు. నీకు ఒక రాజ్యంమైనా ఉన్నది. మరి నాకేది రాజ్యం? నాకు ఎంత మాత్రం పరిచయం లేని ఆడపిల్లలు తమని పెళ్ళి  చేసుకోమని, కాపాడమని ప్రార్థిస్తే, చేస్తున్న పనులన్నిటినీ  ఎక్కడికక్కడ వదిలి పెట్టి, వారిని రక్షించి, పెళ్ళాడవలసి వచ్చింది. నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎన్నడూ దక్కలేదు. కానీ, నన్ను  ప్రేమించిన వాళ్ళందరూ నన్ను పొందగలిగారు. 

      ఒకవేళ దుర్యోధనుడు యుద్ధం లో గెలిస్తే నీకు చాలా గొప్ప పేరు, మరింత కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మరి నేనో ! కేవలం ఒక సారధిని ! ధర్మజుడు యుద్ధంలో గెలిస్తే నాకు ఏమి వస్తుంది?ఇప్పటికే ఈ యుద్ధానికి, ఎదురైన సమస్యలకి  నేనే కారణమని నన్ను నిందిస్తున్నారు. ధర్మరాజు గెలిచినా, ఓడినా నాపై పడిన ఈ నింద పోదు. 

ఒక్క విషయం బాగా గుర్తుంచుకో కర్ణా ! జీవితంలో ప్రతి ఒక్కరికి అనేక సవాళ్ళు ఎదురవుతాయి.  జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు దుర్యోధనుడికి  జీవితంలో అనేక విధములుగా అన్యాయం జరిగింది అదే విధంగా యుధిష్ఠిరుడికి కూడా. ఏది ధర్మమో అది నీ అంతరాత్మకే తెలుసు .మనకి ఎంత అన్యాయం జరిగింది, మనం ఎన్ని సార్లు తిరస్కరించబడ్డాము? అన్నది ముఖ్యం కాదు ఆ సమయాల్లో మీరు ఏవిధంగా స్పందించారు అన్నదే చాలా ముఖ్యమైన విషయం. అదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఊరికే రచ్చ చేయటం మానుకో కర్ణా ! అంతరాత్మ ప్రభోధించిన మార్గంలో మనం నడుద్దాము. జీవితంలో అన్యాయం జరిగిందంటే అది తప్పు త్రోవలో నడవటానికి అనుమతిని మంజూరు చేసినట్లు కాదు. 

నీతి : జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు. మన పరిస్థితులను ఎదురుకోవటానికి చక్కదిద్దు కోవటానికి యధా శక్తి ప్రయత్నం చెయ్యాలి. పరిస్తుతులు మన చేయి దాటి పోయినప్పుడు నిరాశతో క్రుంగి పోవడం వలన ఇతరులను నిందించడం వలన తప్పుడు మార్గంలో వెళ్ళటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు . అలా కాకుండా తప్పొప్పులను చక్కగా విచారించుకు ని విచక్షణతో సరైన మార్గాన్ని అనుసరిస్తే మనలోనే మనకి శాంతి లభిస్తుంది.