Are Amaindi - 6 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

అరె ఏమైందీ? - 6

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"అక్క చెప్తూన్నది నిజమే బావగారూ. ఈ సమస్యని మామూలు డాక్టర్లు పరిష్కారం చెయ్యలేరు. మీరు ఒక పారా సైకాలజిస్ట్ ని కలవాలి." అనంతం అన్నాడు.

"మేం సైకాలజిస్ట్ లని కూడా కలిసాం. వాళ్ళూ ఏం పరిష్కారం చూపలేకపోయారు." చిరాగ్గా అన్నాడు చిదంబరం.

"బావగారూ నేను చెప్పింది పారా సైకాలజిస్ట్. మీరు సరిగ్గా వినలేదు. ఈ పారా సైకాలజిస్ట్ లు అంటే భూతవైద్యుడి తరహా అన్నమాట. వాళ్ళు ఇలాటి భూతాల్ని, దెయ్యాల్ని యిట్టె వదలగొడతారు." అనంతం అన్నాడు.

"అలాంటి వాడెవరన్ననీకు తెలిస్తే చెప్పరా బాబూ, నీకు పుణ్యం ఉంటుంది." బతిమాలుతున్నట్టుగా అంది శకుంతల.

"మంగళాచారి అని చాలా ఫేమస్ పారా సైకాలజిస్ట్. మీరు ఆయనదగ్గరికి నిరంజన్ ని తీసుకువెళ్ళండి. ఆ దయ్యాన్ని వదలగొట్టి, నిరంజన్ లో ధైర్యం నింపుతాడు. ఆ మంజీరని ఏ ఇబ్బంది లేకుండా నిరంజన్ పెళ్లిచేసుకోగలడు." అనంతం అన్నాడు.

"ఆ దయ్యం బాధ లేకుండా నేను మంజీరని పెళ్లిచేసుకోగలిగితే, అది చాలా మంచి విషయమే. అలాంటి అందాన్ని అనుభవించకుండా వదిలేయడం నాకూ ఇష్టం లేదు. దానిచేతుల్లో అలా తన్నులు తినడం నాలో చాలా భయం కలిగిస్తూ వున్నా, నాకు చాలా అవమానం గానూ వుంది. ఏ ఆడపిల్ల చేతిలోనూ ఇప్పటివరకూ నేను అలా అవమాన పడలేదు. దానిని కసిగా అనుభవించేవరకూ నా మనస్సు శాంతించదు." నిరంజన్ అన్నాడు.

"ఆమ్మో దయ్యం వచ్చేస్తోంది అని అరిచే నువ్వేనా ఇలా మాట్లాడేది? నీ మాటలు వింటూ ఉంటే నువ్వు మామూలుగా అవుతావన్న ధైర్యం కలుగుతోంది." చిదంబరం అన్నాడు.

"ఎందుకో మావయ్య చెప్పింది వింటూవుంటే నాకు ధైర్యం అనిపించింది." నిరంజన్ అన్నాడు.

"మంచిదే కదా. మీరు ఆలస్యం లేకుండా నిరంజన్ ని ఆ పారా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి. అతని అడ్రస్ చెప్తాను." అలాని అనంతం మంగళాచారి అడ్రస్ చెపుతూంటే జాగ్రత్తగా విన్నారు తక్కిన ముగ్గురూ.

తరువాత మరికాస్సేపు మాట్లాడాక, శకుంతల ఇచ్చిన స్నాక్స్ తిని కాఫీ తాగి అక్కడనుండి వెళ్ళిపోయాడు అనంతం.

"ఎప్పుడూ నీతోటె ఉంటే మా పనులెప్పుడు పూర్తవుతాయి? మేం కిందకి వెళ్లి మా పనుల్లోపడతాం." అని శకుంతల కుర్చీలోనుండి లేచింది.

ఆ తరువాత చిదంబరం కూడా కుర్చీలోనుండి లేచి ఇద్దరూ ఆ రూమ్ లోనుండి బయటకి వెళ్లారు.

"మమ్మీ..........................................డాడీ.................................ఆ దయ్యం వచ్చేసింది............నన్ను చంపేస్తోంది...............రండి......రండి...........నన్ను కాపాడండి." చిదంబరం, శకుంతల ఇద్దరూ కిందకి వెళ్లి కొన్ని నిమిషాలన్నా అయిందోలేదో, మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు నిరంజన్.

"మీ డాడీ బయటకి వెళ్లారు. నేను నీ కూడా వుంటాను." నిరంజన్ దగ్గరికి వచ్చి, బెడ్ మీద వాడి పక్కన కూలబడి, వాడిచుట్టూ కుడిచెయ్యివేసి అంది శకుంతల. "ఇంతకీ ఆ దయ్యం ఎక్కడ? దాని అంతు చూస్తాను."

"నువ్విలా వచ్చావో లేదో అది బయటకి పోయింది." నిరంజన్ అన్నాడు భయంగా చూస్తూ.

"ఖర్మ. నీ సమస్య ఎప్పటికి తీరుతుందో." తనకుడిచేతిని నిరంజన్ మీదనుండి తీసి, బెడ్ మీద అడ్జస్ట్ అవుతూ నిట్టూర్చింది శకుంతల.

&&&

"మీరు చాలా సమర్ధులని మా తమ్ముడు చెప్తే మీ దగ్గరికి వచ్చాం. ఎలాగైనా ఈ సమస్యనుండి మమ్మల్ని మీరే బయటపడేయాలి." మంగళాచారి మొహంలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ అంది శకుంతల.

ఆరోజు ఉదయమే మంగళాచారి దగ్గరికి కలిసివెళ్లారు చిదంబరం, శకుంతల ఇంకా నిరంజన్. నలుగురూ అయన క్లినిక్ లో సెటిల్ అయ్యాక అయన మొహంలోకి చూస్తూ అంది శకుంతల. ఒక బల్లకి అటుపక్క కుర్చీలోమంగళాచారి, ఇటుపక్క మూడుకుర్చీల్లో మధ్యలో నిరంజన్ అతనికి ఎడమపక్క శకుంతల కుడిపక్క చిదంబరం కూచునివున్నారు. ఆ ముగ్గురూ కూచున్న చోట రెండు కుర్చీలే ఉండేవి కానీ ముగ్గురు రావడంతో ఇంకో కుర్చీ తెచ్చి తగిలించాడు మంగళాచారి.

"మీరేం భయపడకండి. ఇతనిది కేవలం సైకలాజికల్ ప్రాబ్లెమ్ అయినా లేదా ఏదన్నా స్పిరిట్ ఇంవోల్వ్ అయివున్నా కూడా నేను తీర్చేస్తాను." మంగళాచారి అంది.

"ఖచ్చితంగా ఇందులో ఎదో దయ్యం ఇన్వాల్వ్ అయివుందండీ. లేకపోతే మా అబ్బాయి ఇంతలా భయపడడు. మా అబ్బాయి ఎంత ధైర్యంగా వుండేవాడో మీకు తెలియదు." చిదంబరం అన్నాడు.

"ముందు విషయం ఏమిటో నాకు క్లియర్ గా చెప్పండి." మంగళాచారి అన్నాడు.

చిదంబరం, శకుంతల వంతులు తీసుకుని ఏం జరిగిందో తమకి నిరంజన్ చెప్పినంతవరకూ  చెప్పారు.  

"మీరిద్దరూ మాత్రమే మాట్లాడుతూ వున్నారు, ఈ అబ్బాయేమీ చెప్పడం లేదు." నిరంజన్ మొహంలోకి చూస్తూ అన్నాడు మంగళాచారి.

"వాడు మాకే ఏదీ సరిగ్గా చెప్పలేదు, ఇంకా మీకేం చెప్తాడు." చిరాగ్గా అన్నాడు చిదంబరం.

"నేను ఏదన్నా పేషెంట్ నుండి స్ట్రెయిట్ గా వినాలి. అతను నాకు విషయం అంతా క్లియర్ గా చెప్తేనే నేను హెల్ప్ చేస్తాను."

"అయితే ఆయనకి విషయం అంతా క్లియర్ గా చెప్పరా. మాకు చెప్పినట్టుగా అరకొరగా కాకుండా  ఈయనకి అంత వివరంగా చెప్పు." నిరంజన్ వైపు చూస్తూ అంది శకుంతల.

"మీకు చెప్పినదే ఇక్కడా చెప్పగలను. ఆ గెస్ట్ హౌస్ లో వున్న రూమ్ లో కాబోయే భార్యాభర్తలం కదా అని కాస్త చనువు తీసుకోబోయాను. తనలో ఎదో తెలియని మార్పు వచ్చేసింది. అంతబలం తనకి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నన్ను పిచికొట్టుడు కొడుతూ వుంటే ఏం చెయ్యలేక అలాగే వుండిపోయి కాస్సేపటికి స్పృహకోల్పోయాను. నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి తనక్కడ లేదు, నేను నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాను." నిరంజన్ అన్నాడు.

"అదే నిన్నలా బంతాట ఆడుకునేప్పుడు, తనని పెళ్లిచేసుకునేవాడు వేరే వున్నాడని, నువ్వు తనగురించి ఆలోచించినా సరే నీ తాట తీస్తానని అందన్నావు కదా." శకుంతల గుర్తు చేసింది.

"అవునండి అలాక్కూడా అంది." నిరంజన్ అన్నాడు. 

"మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలం అన్నావు. తనకి ఇష్టంలేకుండా ఈ పెళ్లి కుదిర్చారా? అలా ఎందుకని అంది?" ఆశ్చర్యంగా అడిగాడు మంగళాచారి.

"లేదండీ. ఈ పెళ్ళికి తనూ ఇష్టపడే ఒప్పుకుంది." నిరంజన్ అన్నాడు. "అంటే తాను సడన్గా ఎవరో పూనినట్టుగా అయిపోయింది. అంటే దయ్యం పూనడం అంటారే అలాగా. ఇది తనని పూనిన ఆ దెయ్యం చెప్పింది."

"అందుకనేనండీ ఈ విషయంలో ఎదో దయ్యం ప్రమేయం ఉందని అంటున్నాం. ఆ దయ్యానికి మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదు. అందుకనే మా అబ్బాయిని చితకేసి అలా అంది." చిదంబరం అన్నాడు.

"అవును మా అయన చెప్పింది నిజం." శకుంతల అంది.

"ఆ దయ్యం తానెవరో ఏమిటో నీకు చెప్పిందా?" మంగళాచారి అడిగాడు.

"ఏదో.............ఏదో మాట్లాడింది ..........కానీ ఆ షాక్ లో నాకు తను ఏం మాట్లాడుతోందన్నదానిమీద కాన్సంట్రేషన్ కాలేదు." నిరంజన్ అన్నాడు.

"ముందు ఆ దయ్యం ఎవరో ఎందుకు తను అలా ఆందో తెలియాలి. అది తెలియకుండా ఈ సమస్య పరిష్కారం కాదు." మంగళాచారి అన్నాడు.

"ఎంత అడిగినా ఇంతకన్నా మా అబ్బాయి చెప్పలేకపోతూ వున్నాడు. మీరు మాత్రం ఎలా తెలుసుకుంటారు?" శకుంతల ఆశ్చర్యంగా అడిగింది.

మంగళాచారి నవ్వి అన్నాడు. "మీ అబ్బాయిని హైప్నోటైజ్ చేసి అప్పుడసలు ఏం జరిగింది, ఆ దయ్యం ఏం అంది అన్నది తెలుసుకుంటాను."

"దయచేసి ఆ పనిచేయండి అయితే." శకుంతల అంది.

"మీరు ఈ సమస్యని తీర్చినట్టు అయితే మీ మేలు ఎప్పటికీ మర్చిపోము. ఆ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లిచేసుకోగలిగితే మాకు చాలా లాభిస్తుంది." చిదంబరం అన్నాడు.

"సరే అయితే. మీ అబ్బాయిని ఇప్పుడే హిప్నోసిస్ లోకి పంపించి విషయం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడే వుండండి కానీ మమ్మల్ని అసలు డిస్టర్బ్ చెయ్యకూడదు." అలాగని చెప్పి మంగళాచారి కుర్చీలోనుండి పైకిలేచాడు. "బాబూ నువ్వు ఈ కుర్చీలోకొచ్చి కూర్చో." ఆ గదిలో ఒక మూలగా వున్న ఇంకో కుర్చీని చూపిస్తూ అన్నాడు.

ఆ కుర్చీ ఒక వాలు కుర్చీ. అందులో వెనక్కి వాలి కళ్ళుమూసుకుని హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు. అందులోనే మంగళాచారి తన పేషెంట్స్ ని కూచోపెట్టి, హిప్నోసిస్ లోకి పంపి వాళ్ళనుండి విషయాలు తెలుసుకుంటూ వుంటాడు.

"నువ్విందులో కూచుని వెనక్కి వాలి కళ్ళు మూసుకో. నువ్వు ప్రత్యేకంగా ఏం చేయనవసరం లేదు. నీలో వచ్చే ఆలోచనలని ఆపాల్సిన పని కూడా లేదు. నేను అంటూన్నది మాత్రం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించు." అన్నాడు మంగళాచారి.

చిదంబరం, శకుంతల అలాగే కూచునివుండగా, నిరంజన్ మాత్రం చెప్పినట్టుగా చేసాడు.

"ఇప్పుడు నీకు చాలా ప్రశాంతంగా, హాయిగా వుంది. నీ మనసులో ఎలాంటి అనవసరపు ఆలోచనలు లేవు." నిరంజన్ మొహంలోకి చూస్తూ అన్నాడు మంగళాచారి.

"నా మనసులో ఇప్పుడు చాలా పిచ్చి ఆలోచనలు వున్నాయి." నిరంజన్ వున్నాడు.

"అవి ఆలా వున్న పర్వాలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను చాలు. మళ్ళీ ఇలా మాట్లాడకు." ఇలా తన పేషెంట్స్ మాట్లాడ్డం అలవాటే కాబట్టి చిరాకు పడకుండా అన్నాడు మంగళాచారి. మళ్ళీ తనని హిప్నోసిస్ లోకి పంపే ప్రయత్నం మొదలు పెట్టాడు.

"నీకిప్పుడు చాలా ప్రశాంతంగా, హాయిగా వుంది. చాలా ప్రశాంతంగా, హాయిగా వుంది. నీ మనసు పూర్తిగా నా మాటలమీదే కేంద్రీకృతమైవుంది. నువ్వు నేను చెప్పినవాటిగురించే ఆలోచిస్తావు. నా ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తావు."

మంగళాచారి మాటల్లో ఎదో మాయవున్నట్టుగా, నిరంజన్ మొహం నిజంగానే పూర్తి ప్రశాంతంగా మారింది. తనలో అనవసరమైన ఆలోచనలన్నీ పూర్తిగా మాయం అయ్యాయి.

"నేనిప్పుడు అయిదు అంకీలు లెక్కపెడతాను. నేను అయిదు అనేసరికి నువ్వింకా పూర్తి ప్రశాంతంగా, హాయిగా మారతావు. నీలో ఏ భయం ఉండదు. నువ్వు ధైర్యంగా అన్ని ఆలోచనలు చెయ్యగలుగుతావు. నువ్వు నిద్రలోకి మాత్రం వెళ్లవు."

నిరంజన్ ఏ కదలిక లేకుండా అలాగే వున్నాడు.

"ఒకటి..........నువ్వు నెమ్మది నెమ్మది గా ప్రశాంతంగా అవుతున్నావు. రెండు............నీ దృష్టి పూర్తిగా నా మాటల మీదే కేంద్రీకృతమై వుంది. మూడు...........నీ మనస్సు, శరీరం పూర్తిగా నా ఆధీనంలో వున్నాయి. నేను చెప్పినట్టుగా వింటాయి. నాలుగు...........నువ్వు నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇస్తావు. అయిదు.......... నీకిప్పుడు పూర్తి సంతోషంగా, హాయిగా వుంది. ఇప్పుడు నువ్వు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా వున్నావు." మంగళాచారి కొంచెం, కొంచెం గా ఆగుతూ ఆలా అనగానే, నిరంజన్ పూర్తి ప్రశాంతం గా మారిపోయాడు.

నిరంజన్ ఆలా హిప్నోటిజం మొదలుపెట్టగానే  శకుంతల, చిదంబరం అతనికి ఇరుపక్కలా వచ్చి నిలబడ్డారు. నిరంజన్ లో వచ్చిన మార్పు వాళ్ళకి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

"నువ్విప్పుడు ఆరోజు, ఆ సంఘటన గురించి ఆలోచిస్తావు. నేనడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తావు. ఇప్పుడు చెప్పు. మీరిద్దరూ ఆ గదిలో వుండగా ఆ అమ్మాయి ఎలా వుంది?"  

నిరంజన్ నుండి ఏ సమాధానం లేదు. తను మౌనంగా అలాగే వున్నాడు.

"నువ్వు నా ప్రశ్నలకి సమాధానం ఇస్తావు. నీ మనసు పూర్తిగా నా ఆధీనంలో వుంది. నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం లో నీకు ఆనందం వుంది." కాస్త ఆగాక మళ్ళీ అడిగాడు మంగళాచారి. "ఇప్పుడు చెప్పు. ఆ అమ్మాయి నీకప్పుడు ఎలా కనిపించింది?"

"అద్భుతంగా.......ఎప్పటికన్నా కూడా అందంగా........ ఎంత అందమైన అమ్మాయిలు నా వెంటపడి నా స్వంతమవుతూవున్నా, మంజీర లాంటి అమ్మాయి నాతొ వంటరిగా ఆలా వుందంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది."

"తనకెలా అనిపించింది? ఐ మీన్, తన మోహంలో భావాల్ని బట్టి తనెలా ఆలోచిస్తూందో గ్రహించావా?"

"తను కంగారు పడుతున్నట్టుగా వుంది. నా మనసులో అభిప్రాయాన్ని కనిపెట్టినట్టుగా వుంది."

"ఏమిటి నీ మనసులో అభిప్రాయం?"

"తనని బలవంతంగా అయినా సరే అనుభవించి తీరాలన్న అభిప్రాయంతో వున్నాను."

"మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. పెళ్లయ్యాక ఎలాగు తను నీ స్వంతమవుతుంది. ఈలోపున ఎందుకా కంగారు?"

"తనది చాలా విచిత్రమైన స్వభావం. నాతో పెళ్ళికి ఒప్పుకున్నా, కనీసం నేను చెయ్యివేసి ముట్టుకోవడానికి కూడా అంగీకరించదు. ఆ అందాన్ని ఆలా చూస్తూ గుటకలు మింగడమే తప్ప, కనీసం ముద్దుపెట్టుకుని కూడా ఎరుగను. అందుకనే తనతో సెక్స్ కుదురుతుందో, కుదరదో పెళ్లికిముందే తెలుసుకోవాలనుకున్నాను. నాతో పరిచయమైన ఏ అమ్మాయిని అంతకాలం నేను అనుభవించకుండా వుండలేదు. ఈ అమ్మాయిని కనీసం ముట్టుకోనైనా ముట్టుకోలేకపోవడం నాకు పెద్ద అవమానం గా అనిపించింది."

"కొంతమంది అమ్మాయిలు పెళ్ళికి ముందు సెక్స్ తప్పని భావించి అలా వుంటారు. పెళ్లయ్యాక బాగానే కో-ఆపరేట్ చేస్తారు. నువ్వు తనతో పెళ్లయ్యేవరకూ ఆగితే పోయేది కదా."

"మంజీర విషయంలో నాకలా అనిపించలేదు. కేవలం నన్ను ముట్టుకోనివ్వకపోవడం మాత్రమే కాదు, ఎలాంటి రొమాంటిక్ ఇన్సిడెంట్ చూసినా తను చాలా ఇరిటేట్ అయిపోతుంది. ఈవెన్ గోడ మీద వాల్ పోస్టర్స్ ఇంకా, పుస్తకాల్లో బొమ్మలు కూడా ఎమన్నా రొమాంటిక్ గా ఇంకా సెక్సీగా వుంటే తను చాలా చిరాకు పడిపోతుంది. అందుకనే అసలు తనతో సెక్స్ అవుతుందో లేదో తెలుసుకుందామనుకున్నాను."    

"తరువాత ఏమైంది?"

"తనని గట్టిగా కౌగలించుకుని, బుగ్గ మీద ముద్దు పెట్టుకుందామనుకున్నాను." నిరంజన్ మొహం అనీజీ గా మారింది.సైలెంట్ గా వుండిపోయాడు.

"నువ్వు చెప్తావు. నీ మనసు పూర్తిగా నా అధీనంలో వుంది. తరువాత ఏమైందో నువ్వు పూర్తిగా నాకు చెప్తావు."

"నేను తనని కౌగలించుకునే లోపే, నా మనసులో ఉద్దేశం కనిపెట్టినట్టుగా నన్ను తన కుడికాలితో మధ్యలో తన్నింది. తను నెగటివ్ గానే రెస్పాండ్ అవుతుందని తెలిసినా అలా రియాక్ట్ అవుతుందనుకోకపోవడంవల్ల నేను వెనక్కి పడిపోయాను. నాలో పౌరుషం పెరిగింది. నేను తనని ఎలాగన్నా రేప్ చెయ్యాలని నిర్ణయించుకుని, వేగంగా లేచి తనమీదకి వెళ్ళాను." నిరంజన్ రొప్పుతూ వున్నాడు.

"రిలాక్స్ ..........రిలాక్స్ యువర్ సెల్ఫ్...........నువ్వు ప్రశాంతం గా అయి జరిగింది చెప్తావు. నువ్వలా చెప్పగలవు." నిరంజన్ మొహంలోకి చూస్తూ అన్నాడు మంగళచారి.

మళ్ళీ కొంచెం ప్రశాంతంగా అయ్యాడు నిరంజన్. ".....తను......తను సడన్ గా అదొకలా మారింది. తన చేతులతోనూ, కాళ్లతోనూ నన్ను బలంగా కొడుతూ, తన్నడం మొదలుపెట్టింది. తనకి అంత బలం ఎక్కడనుండి వచ్చిందో తెలియదు కానీ, నేనేమీ చెయ్యలేకపోతూ వున్నాను. మళ్ళీ మరొకసారి కిందపడిపోయాను. నన్ను తన కాళ్లతో నా డొక్కల్లో ఇంకా ఎక్కడపడితే అక్కడ బలంగా తంతూ వుంది. ఎదో గట్టిగా అరుస్తూ కూడా వుంది. కాకపోతే ఆ దెబ్బల వాళ్ళ నాకు తన అరుపుల మీద కాన్సంట్రేషన్ కాలేదు. నేను నెమ్మదిగా స్పృహ కోల్పోయాను."

"తను ఏమని అరిచింది? కొంచెం గుర్తుచేసుకుని చెప్పు."

నిరంజన్ మొహం మీద ముడతలు ఇంకా దిట్టంగా మారాయి. తను గుర్తు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తూ వుంది.

"నువ్వు గుర్తు చేసుకోగలవు. అది నీవల్ల అవుతుంది. గుర్తు చేసుకుని చెప్పు." నిరంజన్ మొహంలోకి అలాగే చూస్తూ అన్నాడు మంగళాచారి.

"...........తన భర్త వేరే చోట వున్నాడ్రా. వాడు తప్ప ఇంకా ఎవరు తన వంటిమీద చెయ్యివేసినా ముక్కలు ముక్కలు చేస్తాను. నిన్నే అంటిపెట్టుకుని, నువ్వు తన గురించి ఆలోచించినా సరే నీ తాట తీస్తాను............"

"అదే మాక్కూడా చెప్పాడు." చిదంబరం అన్నాడు.

"అవును. అంతకుమించి ఒక్క ముక్క కూడా చెప్పడం లేదు." శకుంతల అంది.

"మీరిద్దరూ మాట్లాడకండి. నిశబ్దంగా వుండండి." వాళ్ళిద్దరి మొహాల్లోకి చూసి అన్నాక, మళ్ళీ నిరంజన్ మొహంలోకి చూసి అడిగాడు మంగళాచారి. "జాగ్రత్తగా గుర్తు చేసుకో. నువ్వు గుర్తు తెచ్చుకోగలవు. ఆ అమ్మాయి ఇంకేం మాట్లాడింది?"    

నిరంజన్ మళ్ళీ రొప్పడం మొదలు పెట్టాడు. తన మొహం ఇంకా అనీజీ గా మారిపోయింది.

"రిలాక్స్....రిలాక్స్........రిలాక్స్......... గాభరా పడకు. ప్రశాంతంగా గుర్తు చేసుకో. నీకా శక్థి వుంది. ప్రశాంతం గా గుర్తుచేసుకుని నాకు చెప్పు. ఇంకా ఆ అమ్మాయి ఏం మాట్లాడింది?"

కానీ నిరంజన్ ఇంకా అలాగే రొప్పుతూనే వున్నాడు, తన మోహంలో అనీజీనెస్ ఇంకా ఎక్కువ అయింది.

"మా అబ్బాయి ఇలా ఇబ్బంది పడుతూ వుంటే చూడలేకపోతున్నాం. ఆ విషయం తెలియకపోయినా పర్వాలేదు. ఇంక ఆపేద్దాం." శకుంతల గాభరాగా అంది.

చిదంబరం కూడా అలంటి ఎక్సప్రెషన్ తోటే మంగళాచారి మొహంలోకి చూస్తూ వున్నాడు.

"మీ సమస్య పరిష్కారం కావాలా వద్దా? నేనున్నానుగా. మీ అబ్బాయికి ఏమీ కాదు. మీరు గాభరాపడకుండా, డిస్టర్బ్ చెయ్యకుండా వుండండి చాలు." వాళ్ళవైపు చూడకుండానే అలా అన్నాక, నిరంజన్ మొహంలోకే చూస్తూ అన్నాడు మంగళాచారి. "నువ్వు గుర్తు చేసుకోగలవు. నీవల్ల అవుతుంది. చెప్పు. ఇంకా ఏం మాట్లాడింది ఆ అమ్మాయి."

"నా కూతురి వంటిమీద చెయ్యివెయ్యడానికి నీకెంత ధైర్యం? దానికెప్పుడో నేను వాడితోటి పెళ్ళిచేసేసాను. వాడుతప్ప ఇంకెవరు దానివంటిమీద చెయ్యివేసినా ముక్కలు, ముక్కలుగా నరికేస్తాను." ఈసారి నిరంజన్ చటుక్కున చెప్పేసాడు.

"అంటే ఆ అమ్మాయిని ఆవహించింది ఆ అమ్మాయి తల్లేనా? తను ఆ అమ్మాయి పదో, పన్నెండో ఏళ్ల వయసువుండగా చనిపోయింది." అనకుండా వుండలేకపోయాడు చిదంబరం.

"అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయికి పెళ్ళిచేసేడమేమిటి? అలా పెళ్ళయిపోయివుంటే మన అబ్బాయితో పెళ్ళికి ఎందుకుఒప్పుకున్నారు ఆ తండ్రీకూతుళ్ళు?" శకుంతల కోపంగా అంది.

"తెలియాల్సిన విషయం తెలిసిపోయింది. ఇంకా మీ అబ్బాయి హిప్నోసిస్ లో ఉండాల్సిన అవసరం లేదు." మంగళాచారి అన్నాడు

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)