Dharma - Hero - 3 in Telugu Fiction Stories by Kumar Venkat books and stories PDF | ధర్మ -వీర - 3

Featured Books
Categories
Share

ధర్మ -వీర - 3

వీర శాంతి ని సైకిల్ మీద తీసుకొని తన కాలేజీ కి తీసుకెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక, శాంతి అటు, ఇటు చూసి. ఎవ్వరైనా ఉన్నారా లేదా అని చూస్తుంది.

శాంతి :- "ఒకసారి ఆగవయ్య"

వీర :- "ఎందుకు అండి?"

శాంతి :- "ఒకసారి ఆపఓయ్."

వీర సైకిల్ దిగి "ఏమైంది అండి" అని అడుగుతాడు.

శాంతి :- "ఇంకెన్ని రోజులు నీ ప్రాణస్నేహితుడు కి కూడా తెలీకుండా మన ప్రేమ కథ ని కొనసాగిస్తావు?" 

వీర :- "హే, ఎవరైనా చూస్తారు."

శాంతి :- "చుస్తే చుడనివ్వు.., నాకేమి నీలా భయం కాదు, అయినా ఊరిలో వాళ్ళ మీద కి మాత్రం గోడవలకి వెళ్తావ్ కానీ. మా నాన్న కి,అన్నయ్య కి ఎందుకు అంత భయపడతావ్."

వీర :- "నాకేమీ మీ నాన్న, అన్నయ్య అంటే భయం లేదు, వాళ్లంటే కుంచెం గౌరవం అంతే. ఊరిలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఊరుని ఇంత ప్రశాంతంగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్లంటే కుంచెం ఇష్టం."

శాంతి :- "చా! అబద్దం చెప్తే నమ్మెటట్టు ఉండాలి, మా అన్నయ్య సూర్య ని చుస్తే నీకు చచ్చేంత భయం కదా. "

వీర :- "ఆదిగో , బుల్లెట్ బండి మీద వస్తున్నాడు.. మీ అన్నయ్య నే అడుగు"

శాంతి "ఆమ్మో అన్నయ్య" అని వెంటనే అక్కడున్న చెట్టు పక్కకి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే అక్కడికి శాంతి వాళ్ళ అన్నయ్య సూర్య వస్తాడు. 

సూర్య "ఎరా వీర, ఇక్కడేం చేస్తున్నావ్? మా చెల్లి సైకిల్ నీ దగ్గర ఉంది ఏంటి?" అని సీరియస్ గా అడుగుతూడు

వీర :- "మీ చెల్లి, సైకిల్ కి పంచేర్ అయింది అని సైకిల్ షాప్ లో పెట్టి వెళ్ళింది. పని ఐపోయింది అని తీసుకెళ్లి కాలేజీ లో పెడదామని వెళ్తున్న"

సూర్య :- సరే, వెళ్లి జాగ్రత్తగా పెట్టేసి రా. "

వీర :- "సరే, సూర్య"

సూర్య అక్కడ్నుండి వెళ్ళిపోయాక మెల్లగా శాంతి బయటికి వస్తుంది. 

శాంతి :- "నీకేమైనా పిచ్ఛా, మా అన్నయ్యని చుస్తే ముందే చెప్పాలి గా, కుంచెం ఉంటే ఇద్దరం దొరికిపోయేవాళ్ళం."

వీర :- "చుస్తే చుడనివ్వు.., ఎం చేస్తాడు? మనల్ని విడదీయాలని చుస్తే మీ అన్నయ్య అని కూడా చూడను. నా చేతిలో అయిపోతాడు."

శాంతి :- "ఆలా జరిగితే నేను బ్రతకను వీర.., నాకు మా అన్నయ్య, నా కుటుంబం అంటే చాలా ఇష్టం, అలాగే నువ్వు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నా వాళ్ళ మీరు గొడవ పడి మీలో ఎవరికైనా ఏమైనా జరిగితే, నేను తట్టుకోలేను, ఆత్మహత్య చేస్కుని చనిపోతా"

వీర :- "హే! శాంతి, ఎందుకు ఏడుస్తున్నావ్? నేను సరదాగా ఆలా అన్నాను."

వీర, శాంతి ని గట్టిగ కౌగిలించుకుని "నేను ఉండగా ఆలా జరగనివ్వను శాంతి, మీ కుటుంభం మొత్తాన్ని ఒప్పించి హ్యాపీ గా అందరితో కలిసి మనం పెళ్లి చేసుకుందాం. సరేనా.. 

శాంతి :- "సరే.."

4 సంవత్సరాల తర్వాత...

దేవపురి లో మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి ప్రెసిడెంట్ గా శివయ్య గారు పోటీ చేయకుండా తన కొడుకు సూర్య ని కాండిడేట్ గా నామినెటే చేసారు. 

శివయ్య గారు అతని కొడుకు సూర్య కలిసి నామినేషన్ వేయటానికి వెళ్తారు. సూర్య లోపల నామినేషన్స్ లో సంతకం చేసి బయటికి రాగానే, ఆల్రెడీ ప్రెసిడెంట్ గా గెలిచినట్టు బయట టపాసులు పేల్చి, డాన్స్ లు వేస్టు హడావిడి చేస్తూ ఉంటారు.. 

శివయ్య గారు సంతోషంగా నవ్వుతు "ఆగండ్ర.. వీడింకా గెలవ లేదు, ప్రెసిడెంట్ గా పోటీ చేస్తునట్టు నామినేషన్ లో సంతకం చేసాడు అంతే." అని అంటాడు. 

అప్పుడు అక్కడ జనం లో ఒకడు "సూర్య బాబు గారు సంతకం చేసారంటే ఇంకా గెలిచినట్టే అయ్యా.., మీకు ఎదురు నిలబడే వారు మన ఊరిలో ఇంకెవరు ఉన్నారు అయ్యా. 
"ప్రెసిడెంట్ సూర్యబాబు కి జిందాబాద్" అని జిందాబాద్ లు కొడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి 4 పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగుతాయి. అందులో నుంచి కొంతమంది మనుషులు దిగి పరిగెడుతూ వచ్చి మొదటి కార్ డోర్ ఓపెన్ చేస్తారు. ఆ కార్ లో నుండి ఒక ఆరు అడుగులు ఉన్న వ్యక్తి నల్లటి కళ్ళదాలతో, భీకరమైన శరీరం తో బయటికి దిగుతాడు. అత్తడ్ని చూడగానే జిందాబాద్ కొట్టె జనం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడిపోతారు. 

ఆ వ్యక్తి మెల్లగా నడుస్తూ శివయ్య దగ్గరికి వచ్చి, అతని కాళ్ళకి మొక్కి "నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య.. నేను ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి నామినేషన్ వేద్దామని వచ్చాను. 

వెంటనే కోపంతో సూర్య వచ్చి ఆ వ్యక్తి కాలర్ పట్టుకొని "ఏరా రంగా.. ఎంత ధైర్యం ఉంటే మా ఉప్పు తిని మమ్మల్నే మోసం చేసింది కాకుండా, మాకె ఎదురు నిలబడటానికి వస్తావా. 

అది చూసి రంగా మనుషులు గట్టిగా కోపంతో అరుస్తారు.. రంగా తన చేయి పైకి చూపించిగానే వాళ్లు సైలెంట్ అయిపోతారు. 

రంగా :- "గతం లో జరిగిన దానికి, ఇప్పుడు వచ్చే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి అసలు సంబంధమే లేదు. మన ఊరి ప్రజలు ఎవర్ని ప్రెసిడెంట్ గా కోరుకుంటే వల్లనే గెలిపిస్తారు."

శివయ్య :- " ఏంట్రా.., ప్రజల్ని భయపెట్టి పదవిలో కూర్చుందాం అనుకుంటున్నావా. నువ్వు ఊరిలో చేసే వెదవ పనులు అందరికి తెల్సు. ఇంకా ప్రజలు నీకు భయపడకూడదు అనే నేను ఈసారి నా కొడుకు సూర్య ని ఎలక్షన్ లో నిలబెట్టాను. ఇక నీ ఆటలు సాగవు రా."

రంగా :- "ప్రజల భయాన్ని మీరు ఇంకా అర్ధంచేసుకోలేదు అనుకుంట పెద్దయ్య. వాళ్లు దేనికి భయపడతారో, దేనికి లొంగుతారో అన్ని మీకు ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు చూస్తారుగా."

రంగా సూర్య వైపు కోపంగా అతని కళ్ళలో చూస్తూ లోపలికి వెళ్తాడు. సూర్య అతన్ని ఆవేశంగా చూస్తూ బయటికి వస్తాడు. 

శివయ్య, సూర్య లు కార్లో వెళ్తు ఉంటారు 

శివయ్య :- "రంగా ని మనం తేలిగ్గా తీసుకోలేం, ఎందుకైనా మంచిది సూర్య, నువ్వు కుంచెం వాడితో జాగ్రత్తగా ఉండు."

సూర్య :- "వాడు మనల్ని ఏదైనా చేసేముందు మనమే ఏదైనా చేస్తే మంచిదేమో నాన్న."

శివయ్య :- "ఇప్పుడేం వద్దు, ఇంకో రెండు రోజుల్లో మహా శివరాత్రి, గుడిలో ఉత్సవం పూర్తికానివ్వు. ఆ తర్వాత ఆలోచిద్దాం."

రంగా అక్కడ నామినేషన్ లో సంతకం చేసి బయటికి వస్తాడు. కారులో కూర్చున్నాక తన మనిషిని పిలుస్తాడు. 

రంగా :- "రేయ్, ఇంకో రెండు రోజుల్లో మహా శివరాత్రి, ఈ ఊరిలో జరిగే అతిపెద్ద ఉత్సవం. మనం ప్లాన్ చేసినట్టు అంత సిద్ధం కద?"

అప్పుడు అతని మనిషి "అంతా సిద్ధం అన్న, ఆరోజు ఈ ఊరి ప్రజలు భయంతో ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు, వాళ్ళని ఆదుకునే అసలైన దేవుడు మీరే అని వాళ్ళకి అర్ధమవుతుంది.