Dharma - Hero - 2 in Telugu Fiction Stories by Kumar Venkat books and stories PDF | ధర్మ -వీర - 2

Featured Books
Categories
Share

ధర్మ -వీర - 2

ధర్మ - వీర లు చేసిన రచ్చకి ఆ గుడికి వచ్చిన జమిందార్ గారి అబ్బాయి తల దించుకుని వాళ్ళ కుటుంబం తో వాళ్ళ ఉరికి తిరిగి వెళ్ళిపోతాడు. 

ధర్మ- వీర లు చేసిన గొడవ కొంతమంది పెద్ద మనుషులు చూసి దేవపురి ప్రెసిడెంట్ గారికి వాళ్ళ గురించి చెప్పి పంచాయతీ పెట్టిస్తారు.

దేవపురి ప్రెసిడెంట్ శివయ్య గారు, ఆ ఊరికి పెద్ద.

శివయ్య :- "మీరు చేసింది చిన్న తప్పు ఏమి కాదు, కానీ వీర వాళ్ళకి సహయం చేయడం కోసమే గుడి లోపలికి వెళ్ళాడు కాబట్టి దానికి వీర ని క్షమించేస్తాను. కానీ మీరు ఇద్దరు ఊరికి వచ్చిన పెద్ద వాళ్ళ మీద చేయి చేస్కుని ఊరు నుంచి తరీమేసారు. దీనికి శిక్ష పడాల్సిందే."

వీర :- "ప్రెసిడెంట్ గారు, ఇందులో ధర్మ తప్పు ఎమీ లేదు, ఇదంతా నా వల్ల జరిగింది, కాబట్టి ఎం శిక్ష వేసిన నాకే వేయండి. ధర్మ ని వదిలేయండి."

శివయ్య :- "నువ్వు మాట్లాడకు వీర, ధర్మ ఒక పెద్ద కులానికి చెందిన వాడు, పెద్ద కుటుంబానికి సంబందించిన వాడు. అయినా తన పరువు గురించి, వాల్ల కుటుంబం ప్రతిష్ట గురించి ధర్మ కి అసలు పట్టింపే లేదు. ఈసారి ధర్మ ని వాళ్ళ నాన్న కూడా కాపాడలేడు."

వీర :- "నన్ను ఏమైనా చేస్కోండి, కానీ ధర్మ జోలికి వస్తే బాగోదు పెద్దయ్య."

శివయ్య :- "చిన్న - పెద్ద లేకుండా నోరు పెడరుగుతుంది, ఎం చేస్తావ్ రా, హా."

వీర కోపంగా తన పిడికిలి బిజిస్తాడు, వెంటనే ధర్మ వచ్చి వీర చేయి పట్టుకుని, తన చెవిలో "రేయ్ గొడవ వద్దు, శాంతి నిన్నే చూస్తుంది రా" అని అంటాడు. 

వెంటనే వీర మెల్లగా వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతాడు, ఇంక అక్కడ ఎం జరిగిన పట్టించుకోకుండా దొంగలాగా, శాంతి వైపు దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. 

శివయ్య :- "శిక్ష ని అమలు, చేయండి."


ఇంతలో అక్కడికి ధర్మ వాళ్ళ నాన్న వచ్చి "ఆపండి శివయ్య గారు, మీరు చేసేది సరైంది కాదు."

శివయ్య :- "చక్రవర్తి, ఈసారి నీ కొడుకు చేసిన తప్పు ఏంటో తెలుసుకునే వచ్చావా?"

చక్రవర్తి :- "పక్క ఊరు వాడు మన ఉరి వాడి మీద చేయి చేసుకుంటే ఒకటిగా కలిసి వాళ్ళని తరీమేసారు, అంతేగాని కులం అనే గీత గీస్కుని కూర్చోలేదు, నా కొడుకు." 

శివయ్య :- "నువ్వు ఈ ఊరిలో పెద్ద ధనవంతుడు వి కావచ్చు కానీ కొడుకు ని పెంచడంలో మాత్రం.."

చక్రవర్తి :- "ఇక చాలు నేను నా కొడుకుని తీసుకువెళ్తున్నాను." 

చక్రవర్తి ధర్మ, వీర ల చేయి పట్టుకుని అక్కడ నుండి వెళ్తుంటే 

శివయ్య :- "వీర ని కొడుకు కాదు, వాడికి శిక్ష పడాల్సిందే చక్రవర్తి."

చక్రవర్తి :- "వీడు నా మనిషే, నా ఇంటి మనిషి. వీర ని కూడా తీస్కుని వెళ్తాను." 

చక్రవర్తి వాళ్లిద్దర్ని తీస్కుని వెళ్తుంటే, వీర వెనక్కి తిరిగి శాంతి వైపు చూస్తూ వెళ్తాడు, శాంతి కూడా వీర ని అలానే చూస్తూ ఉంటుంది. 

చక్రవర్తికి ఆ ఊరిలో పెద్ద ధనవంతుడు, అతనికి పొలాలు , చాపల చెరువులు , 1 రైస్ మిల్ ఉన్నాయ్. చక్రవర్తి రైస్ మిల్లో నే వీర వాళ్ళ నాన్న కృష్ణమూర్తి గుంబస్తాగా పని చేస్తున్నారు. చక్రవర్తికి కృష్ణమూర్తి చాలా నమ్మకస్తుడు. 

చక్రవర్తికి ఒక్కడే కొడుకు, ధర్మ. ధర్మ కి అన్నదమ్ములు ఎవ్వరు లేరు కానీ ఆ లోటు ధర్మకి వీరా నే తీర్చాడు. ధర్మ వాళ్ళ అమ్మ లక్ష్మి గారు కూడా వీర ని తన సోంత కొడుకులా చూసుకునే వారు.

వీర కి ఒక తమ్ముడు ఉన్నాడు , రాజు. రాజు అంటే వీర కి ప్రాణం.  

రాజు :- "అన్న, నీకేం కాలేదు గా? నేను చాలా భయపడిపోయా అన్న."

వీర :- "నాకేం కాలేదు రాజు, చక్రవర్తి అయ్యగారు సమయానికి వచ్చి పంచాయతీ నుంచి తీస్కోచేశారు. అయనకే థాంక్స్ చెప్పుకోవాలి."

ధర్మ :- "నేను ఉండగా, మీ అన్నకి ఎం అవుతుంది రాజు, మీరు దైర్యంగా ఇంటికి వెళ్ళండి." 

వీర :- సరే, రేపు మన షాప్ దగ్గరకి వచ్చాయి, అక్కడ మాట్లాడుకుందాం."

వీర కి ఒక మెకానిక్ షాప్ ఉంది, వీర ఆ ఊరిలో మంచి మెకానిక్. 

ఆ తర్వాత రోజు ధర్మ, వీర ని కలవడానికి తన షాప్ దగ్గరకి వెళ్తాడు. 

ధర్మ :- "ఏంట్రా నిన్న పంచాయతి దగ్గర శాంతి నిన్ను ఆలా చూసేస్తుంది. కొంపతీసి వెళ్లి తనతో నీ ప్రేమ విషియం చెప్పేసావా ఏంటి?"

వీర :- లేదురా, అయినా తన కులం ఏంటి, నా కులం ఏంటి. తనేమో ప్రెసిడెంట్ గారి ముద్దుల కూతురు, నేనేమో ఒక గుంబస్తా కొడుకుని. అసలు మా ఇద్దరికీ ప్రేమ కుదరదు రా. " 

ఇంతలో ఒక సైకిల్ బెల్ సౌండ్ వినిపిస్తుంది, ఎవరా అని ఇద్దరు బయటికి చుస్తే, శాంతి సైకిల్ పట్టుకుని బయట నుంచుని ఉంటుంది. 

ధర్మ :- "టైర్ పంచెర్ ఏమో, వెళ్లి చూడరా."

వీర :- భయంగా ఉందిరా, కొంపతీసి మనం మాట్లాడుకున్నది వినేసింది అంటావా? నువ్వే వెళ్లి ఏమైంది అని అడగరా ప్లీజ్."

ధర్మ :- నువ్వు నాతో రా, వచ్చింది నీ పిల్ల అయితే నేను ఒక్కడినే వెళ్లి ఎం చేస్తా? "

ఇద్దరు కలిసి షాప్ బయటికి వెళ్తారు, 

ధర్మ :- "ఏమైంది?

శాంతి :- "టైర్ పంచేర్ అయినట్టు ఉంది ఒకసారి చెక్ చేయాలి"

ధర్మ :- మీరు వచ్చి కూర్చోండి, మా వోడు ఇలాంటివి క్షణాల్లో ముగించేస్తాడు."

వీర :- "ఐపోయింది, ఇక మీరు నిశ్చాంత గా వెళ్లుచ్చు."

శాంతి :- "నాకెందుకో కుంచెం అనుమానం గా ఉంది."

ధర్మ :- "అయ్యో, మా వాడి పనిని మీరు అనుమాన పడాల్సిన అవసరం లేదు."

శాంతి :- "అయితే నన్ను ఈ సైకిల్ మీద కాలేజీ దగ్గర దింపడానికి రమ్మని చెప్పండి, మధ్యలో మళ్ళీ సైకిల్ కి ఏమైనా అయితే నాకు కాలేజీ కి లేట్ అయిపోతుంది కదా. "

ధర్మ :- "వెళ్ళరా, వేళ్ళు.."