Nuli Vechani Vennela - 22 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 22 (Last Part)

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 22 (Last Part)

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

 "సమయం పదకొండున్నర అవుతూంది. మీ  అంకుల్ పదకొండు గంటలకే వస్తానని చెప్పారు కానీ ఇంకా రాలేదు. ఫోన్ కూడా అటెంప్ట్ చెయ్యడం లేదు. తను మాట నిలబెట్టుకోగలరంటావా?" సోఫాలో తన పక్కనే కూచున్న మేనక మొహంలోకి చూస్తూ అడిగింది సమీర.

"ఇప్పటివరకూ ఒక్క అసైన్మెంట్ లో కూడా మా అంకుల్ ఫెయిల్ కాలేదు. కాస్త లేటయ్యారు అంతే. మీరు కొంచెం ఓపిక పట్టండి." మేనక అంది.

దానికి మేనక ఎదో అనబోతూ ఉండగా స్మరన్ ఇంకా అనురాగ్ అక్కడకి వచ్చారు. వాళ్ళని చూస్తూనే సమీర, మేనక ఇద్దరూ లేచి నిలబడ్డారు.

"ఇద్దరం కలిసి వద్దామనుకున్నాం, నా వల్లనే లేటయింది." అక్కడున్న సోఫాలో కూలబడుతూ అన్నాడు అనురాగ్.

"ఎలాగు వచేస్తున్నాం కదాని ఫోన్ అటెంప్ట్ చెయ్యలేదు." స్మరన్ అక్కడున్న కుర్చీలో కూచుంటూ అన్నాడు. "నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా వున్నాను మిస్ సమీరా."

"కాసేపట్లో నా ఆంటీ, కజిన్ ఇంకా నా ఫ్రెండ్ కూడా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేవరకూ అగగలరా?" విషయాలన్నీ తెలుసుకోవాలని ఎంత ఆతృతగా వున్నా వాళ్ళు లేకుండా వినాలని సమీర కి లేదు.

"నో సమీరా. నేనలా వెయిట్ చెయ్యలేను. మీరిప్పుడే అదంతా తెలుసుకోవాలి." స్మరణ్ గొంతు దృఢం గా వుంది.

"ఆల్రైట్." ఒక చిరాకు ఎక్సప్రెషన్ తో అనురాగ్ పక్కన సోఫాలో కూలబడుతూ అంది సమీర. "చెప్పండి అదేమిటో? మా డాడ్ ని అంతగా ఆందోళన పెట్టిన ఆ విషయం ఏమిటి? నాకు అంతగా హాని తలపెట్టిన ఆ దుర్మార్గులు ఎవరు?"

"ఒకే. నేను చెప్తాను. అది చెప్పేముందు, నేను మీకొక ఎక్సరసైజ్ ఇచ్చాను చేశారా? నేను మీరు మీ డాడ్ చెప్తే మీరు నమ్మలేని విషయాలనన్నిటినీ ఒక లిస్ట్ ప్రిపేర్ చెయ్యమన్నాను."

"ఆ చేసాను." చిరాగ్గా అంది సమీర. "కానీ ఆ లిస్ట్ రాసిన నోట్ బుక్ ఎక్కడ పెట్టానో నాకిప్పుడు గుర్తు లేదు."

"నాకు గుర్తువుంది. నేను ఆ నోట్ బుక్ తీసి దాచాను." ఇంకా నిలబడే వున్నా మేనక అక్కడనుండి వెళ్లి, ఆ నోట్ బుక్ తీసుకుని వచ్చి స్మరణ్ కి ఇచ్చాక, స్మరణ్ పక్కనే వున్న ఇంకో కుర్చీలో కూలబడింది.

"చూసారా సమీరా............." ఆ లిస్ట్ చదివిన తరువాత అన్నాడు స్మరణ్ ".................అదేమయి ఉంటుందో కనీసం మీ ఊహ లోకి కూడా రాలేదు."

"అవును. అది నేను ఒప్పుకుంటాను." తలూపుతూ అంది సమీర. "ఇంక నన్ను టెస్ట్ చెయ్యకుండా వేగంగా అదేమిటో చెప్పండి ప్లీజ్." అంది.

"సమీరా..........." అనురాగ్ సడన్గా లేచి నిలబడి, సమీర ముందుకొచ్చి, తన కుడిచేతిని సమీర ముందు ఉంచి అన్నాడు. ".........అయన అదంతా చెప్పేముందు నువ్వు నాకొక ప్రామిస్ చెయ్యాలి. నీకు నా మీద వున్న ప్రేమ నిజమే అయితే నువ్వా ప్రామిస్ చేసే తీరాలి."

"ఏమంటున్నావు అనురాగ్, నువ్వు చెప్పేదేం నాకు బోధపడడం లేదు." మొహం లో అయోమయం తో లేచి నిలబడింది సమీర.

"ఎస్ సమీ, నువ్విప్పుడేం విన్నా మొత్తం మానవత్వం మీదే నమ్మకం పోగొట్టుకోనని, మీ డాడ్ కోసం, అయన ఎస్టాబ్లిష్ చేసిన ఆ బిజినెస్ కోసం, దానిమీద ఆధారపడి వున్న అనేక కుటుంబాల కోసం, ఇంకా నా కోసం మామూలుగానే వుంటానని, నువ్వు నాకు ప్రామిస్ చెయ్యాలి. అలాని ప్రామిస్ చేస్తేనే అయన ఇప్పుడది నీకు చెప్తారు."

"నీకేమైనా మతిపోయిందా? అది వినడానికి నేనెందుకు అలంటి ప్రామిస్ చెయ్యాలి?" కోపంతో అరిచింది సమీర.

"నో సమీ. నువ్వలాంటి ప్రామిస్ చేస్తేనే, నీకా విషయాలు మేం చెప్పేది. లేకపోతె మేం ఏం చెప్పకుండానే ఇక్కడనుండి వెళ్ళిపోతాం." తన చేతిని అలాగే సమీర ముందు ఉంచి అన్నాడు అనురాగ్.

"ఆల్రైట్." తన కుడిచేతిని అనురాగ్ కుడిచేతిలో ఉంచి ఇరిటేటింగా అంది సమీర. "నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా నన్ను టెస్ట్ చెయ్యకుండా విషయం చెప్పండి.”

"మిస్ సమీరా............" స్మరన్ కుర్చీలోనుండి లేచి నిలబడ్డాడు. "...........మిమ్మల్ని అంతమొందించాలని ప్రయత్నించింది మీ ఆంటీ నిర్మల, కజిన్ సంజయ్, మీ ఫ్రెండ్ మల్లిక ఇంకా వాళ్లతో కుమ్మక్కయిన డాక్టర్ మనోహర్ ఆంటే మీరు నమ్మగలరా? ఆ విషయం తెలుసుకునే మీ డాడ్ అంతగా మధనపడి చివరకి హార్ట్ ఎటాక్ తెచ్చుకున్నారు ఆంటే మీరు నమ్ముతారా?"

"ఏమిటి, ఏమిటి మీరంటున్నది?" షాకింగా అరిచింది సమీర అనురాగ్ చేతిలోనుండి తన చేతిని తీసివేసి, స్మరణ్ మొహంలోకి చూస్తూ. .

"ఎస్ సమీరా. మీ ఆంటీ నిర్మల ఇంకా సంజయ్ మొదటనుండి మీ ఆస్తంతా కాజేయాలని ఆలోచిస్తూ వున్నారు. మీ డాడ్ తన తమ్ముడి డబ్బులతో వ్యాపారం ప్రారంభించి అంత ఎత్తుకు ఎదిగి మిమ్మల్ని తన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలిగా చేసేసారు. కానీ తన వ్యాపారానికే కారణం అయిన తన తమ్ముడి భార్య కొడుకు మాత్రం మామూలుగానే ఉండిపోయారు. మీ డాడ్ ఇంటెలిజెన్స్, హార్డవర్క్ కాకుండా తన తమ్ముడి పెట్టుబడే అయన బిజినెస్ లో ఎదుగుదలకి కారణమని మీ ఆంటీ ఇంకా కజిన్ ఆలోచించారు. మిమ్మల్ని తెలివిగా అడ్డు తప్పించాలనుకున్నారు. అందుకు మీ ఫ్రెండ్ మల్లిక ఇంకా డాక్టర్ మనోహర్ కూడా వీళ్ళతో చేతులు కలిపారు."

"ఏంట్రా వాగుతున్నావ్, నువ్వేం చెప్తే అది నమ్ముతాననుకున్నావా?" స్మరన్ మీద పడి అతని షర్ట్ కాలర్ చేతుల్లోకి తీసుకుని అతని మొహంలోకి తీవ్రంగా చూసింది సమీర. "నన్ను మా అమ్మ ప్రేమించిన కన్నా కూడా ఎక్కువగా ప్రేమించిందిరా నా ఆంటీ. తనకొక చెల్లెలు వున్నా కూడా నన్ను చూసుకున్నంత గొప్పగా చూసుకునే వాడు కాదేమో నా కజిన్. అలాంటి వాళ్ళు నా ఆస్థి కాజేయడానికి నన్ను అడ్డు తప్పించాలనుకున్నారంటావా? నన్ను ప్రాణంగా ప్రేమించే నా ఫ్రెండ్ మల్లిక వాళ్లతో చేతులు కలిపిందంటావా? నీకెంత ధైర్యం ఇలా మాట్లాడడానికి?" చాలా గట్టిగా అరుస్తూ స్మరన్ ని రెండు చేతులతో ఊపుతోంది సమీర.

"సమీ ప్లీజ్. అయన చెప్పిన ప్రతిమాట నిజం. ఇన్వెస్టిగేట్ చెయ్యకుండా, ఆధారాలూ లేకుండా, అయన ఇలా మాట్లాడడం లేదు. ఇది చాలా కష్టంగా ఉంటుంది నీకు నమ్మడానికి కానీ ఇది నిజం." సమీర ని రెండు చేతులలోకి తీసుకుని అన్నాడు అనురాగ్.

"నువ్వు ఈ రాస్కెల్ ఒకటై పోయారా? ఏ ప్రయోజనం కోసం నాకు ఇలాంటి అబద్దాలు చెప్తున్నారు?" స్మరన్ ని వదిలి అనురాగ్ మొహంలోకి కోపంగా చూస్తూ అరిచింది సమీర.

"సమీ ప్లీజ్........" సమీర ని గాఢంగా హత్తుకుని నుదుటిమీద ముద్దు మెట్టుకుని అన్నాడు అనురాగ్. "................నీకిలా చెప్పడానికి మేమెంత కష్ట పడుతున్నామో నీకు తెలీదు. ఇది నీకు మానవత్వం మీదే నమ్మకం పోయేలా చేస్తుందని నాకు తెలుసు. అందుకనే నేను నీ చేత అలాంటి ప్రామిస్ చేయించాను."

"గాడ్!............." నిస్సత్తువగా అక్కడున్న సోఫాలో కూలబడిపోయింది సమీర. "..............ఇలాంటి విషయాలు వినడం కన్నా చావు నాకు చాలా మధురంగా ఉంటుంది." వెనక్కి జారగిలబడి కళ్ళుమూసుకుంటూ అంది.

అనురాగ్ ఎదో మాట్లాడబోతూ ఉండగా సమీర సెల్ ఫోన్ మోగింది. తీసుకుని అటెండ్ చేసాడు అనురాగ్. అది వింటూండగానే అనురాగ్ మొహం ఆందోళనతో నిండిపోయింది.

"నీ కజిన్ ఇంకా నీ ఆంటీ వాళ్ళు వెళుతోన్న కార్ కి పెద్ద ఆక్సిడెంట్ అయింది. నీ కజిన్ ఇంకా ఆంటీ అక్కడికక్కడే చనిపోయారు. నీ ఫ్రెండ్ మల్లిక కొసప్రాణాలతో వుంది."

ఎలా లేచి నిలబడిందో సమీరకే అర్ధం కాలేదు. తరువాత చాలా వేగంగా ఆ నలుగురూ అక్కడనుండి వాళ్ళవున్న హాస్పిటల్ కి చేరుకున్నారు.

&&&

"నన్ను క్షమించకు సమీరా. దయచేసి నన్ను క్షమించకు. ఇలాంటి ద్రోహి క్షమాపణకు అర్హురాలు కాదు." మల్లిక నిజంగానే కొసప్రాణంతో వుంది, చాలా నీరసంగా మాట్లాడుతూ వుంది.

"ఆ రాస్కెల్ స్మరణ్ చెప్పేదంతా అబద్ధం అని చెప్పు. వాడు నా ఆంటీ ఇంకా కజిన్ నా ఆస్తి కాజేయడానికి నన్ను అడ్డు తప్పించాలని చూసారని చెప్తున్నాడు. అలాగే నువ్వు వాళ్లతో చేతులు కలిపావంటున్నాడు." మల్లిక కుడిచేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఆందోళనగా తన మొహంలోకి చూస్తూ అంది సమీర.

"ఆ స్మరణ్ చెప్పింది నిజమే. నీ ఆంటీ ఇంకా కజిన్ సంజయ్ ఆస్థి కోసం నిన్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నారు. వాళ్ళకి నేను ఇంకా డాక్టర్ మనోహర్ కూడా సాయం చేసాం." మల్లిక అంది.

"నేను................నేను ఇది ఎప్పటికీ నమ్మను." అరిచింది సమీర. "నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. ఒకవేళ వాళ్ళు అనుకున్నా, నువ్వెందుకు వాళ్ళకి సాయం చేస్తావు? అసలు నన్ను అమ్మకన్నా ఎక్కువగా చూసుకున్న నా ఆంటీ, ఇంకా నన్ను అన్నయ్య కన్నా ఎక్కువగా ప్రేమించిన సంజయ్ ఎందుకు అలా ఆలోచిస్తారు?"

"వాళ్ళు అలా ఆలోచించేరు సమీరా, ఆలోచించేరు. కేవలం తన భర్త డబ్బుతోటె మీ డాడ్ అలా ఎదిగారని అదంతా వాళ్ళకే చెందాలని మీ ఆంటీ ఇంకా కజిన్ అనుకున్నారు. వాళ్ళు ఎర చూపించిన డబ్బుకి డాక్టర్ మనోహర్ అమ్ముడు పోయాడు. నిన్ను వలలో వేసుకోవడానికి నిరంజన్ ని ఏర్పాటు చేశారు. నీకు ఇంకా తెలియంది ఆ నిరంజన్ ఒక సైకియాట్రిస్ట్ కూడా. అందుకనే వాడు నీకు తెలియాకుండానే నిన్ను హిప్నోసిస్ లోకి పంపి నీకు ఆడిటరీ ఇంకా సెన్సువల్ హల్యుసియేషన్స్ వచ్చేలా, అలాంటి డ్రీమ్స్ వచ్చేలా ప్రోగ్రాం చేసాడు. నేను కూడా నిన్ను హిప్నోసిస్ లోకి పంపినప్పుడల్లా అలాంటి హల్యుసియేషన్స్ ఇంకా డ్రీమ్స్ వచ్చేలా ప్రోగ్రాం చేశాను. నిన్ను నెమ్మదిగా పిచ్చిదాన్ని చేసి అడ్డు తప్పించుకోవాలని మా ఆలోచన."

"నువ్వు.......నువ్వు కూడా వాళ్లతో చేతులు కలిపావా?" విస్మయంగా అడిగింది సమీర.

"ఎస్ సమీ. నేను కూడా వాళ్లతో చేతులు కలిపాను." పేలవంగా నవ్వింది మల్లిక. "నిజానికి నాకు మొదటినుండి నువ్వంటే ద్వేషం, అసూయ. నువ్వు నాకన్నా చాలా అందంగా ఉండడం, నాకన్నా ఎక్కువగా ఆస్తిపాస్తులు నీకు ఉండడం అందుకు కారణం. చనిపోయేముందు మా ఫ్యామిలీ  పరిస్థితి ఏమిటో తెలుసా నీకు? బంక్రాప్ట్ అయిపోయాం. ఒకవేళ ఆ ఫ్లైట్ ఆక్సిడెంట్లో పోకపోయి వుంటే నా పేరెంట్స్ సూసైడ్ చేసుకుని ఉండేవారు. అలాంటి పరిస్తితుల్లోనుండి రావడంవల్ల నీ అదృష్టం నాకు అసూయ కలిగిస్తూ ఉండేది. అందుకనే అంకుల్ నాకలా సాయం చేస్తూవున్నా, నువ్వలా నాకు సాయం చేస్తూవున్నా, నేను హ్యాపీ గా ఫీలవ్వలేకపోయాను. నీ మీద స్నేహభావం కన్నా, అసూయనే పెంచుకున్నాను. నువ్వు నశించిపోవాలనే కోరుకున్నాను. అందుకే నీ ఆంటీ ఇంకా కజిన్ల తో నేను కూడా చేతులు కలిపాను."

"గాడ్! ఇదేదీ,................ ఇదేదీ కూడా నేను నమ్మలేక పోతున్నాను." కళ్ళవెంట నీళ్లు కారిపోతూవుంటే అంది సమీర.

" మేమని అనుకోకపోయినా, నీ మీద ఎదో గూడు పుఠాణి జరుగుతోందని అనుమానం వచ్చింది అంకుల్ కి. అందుకనే మదన్ చౌదరి అనే డిటెక్టీవ్ ని ఏర్పాటు చేశారు. అతను నిజం తెలుసుకుని రిపోర్ట్ చెయ్యగానే తట్టుకోలేక పోయారు. నీకు ఫోన్ లో చెప్తే నమ్మవనుకుని, ఇన్ ప్రెసెన్స్ చెప్దామనుకున్నారు. కానీ అలా చెప్పేలోగానే ఆ షాకింగ్ న్యూస్ తట్టుకోలేక హార్ట్ ఎటాక్ తో చనిపోయారు."

కాస్త ఆగి సమీర మాట్లాడే లోగ మళ్ళీ అంది మల్లిక. "నీ ఆఫీస్ లో నీ దగ్గర సెక్రటరీ గా చేరిన నీరజా చరవర్తిని కాంటాక్ట్ చేసి డబ్బుతో కోనేసాం. మేం చెప్పినట్టుగా తనకి తన చనిపోయిన భర్త కనిపించి మాట్లాడుతున్నట్టుగా నాటకం ఆడింది. తన భర్తే తనలో చేరి నీతో మాట్లాడినట్టుగా నిన్ను నమ్మించింది. ఆ ప్రమీల మీ డాడ్ ని ప్రేమించిన మాట నిజమే. పెళ్లిచేసుకున్దామనుకున్న మాట నిజమే. అది మీ డాడ్ తిరస్కరించిన మాట నిజమే. కానీ తను మీ డాడ్ వల్ల సూసైడ్ చేసుకోలేదు. ఏవో పెర్సనల్ రీజన్స్ వల్ల సూసైడ్ చేసుకుంది. కేవలం నిన్ను మెంటల్ గా డిస్టర్బ్ చెయ్యడం కోసం మాత్రమే నీ ఆంటీ అలా చెప్పింది." కాస్త ఆగింది మల్లిక.

సమీర కి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా మల్లిక నే చూస్తూ వుంది.

"డిటెక్టీవ్ స్మరణ్ అపాయింట్ అయ్యాక ఇంక మా ఆటలు సాగవనిపించింది. అందుకనే నీరజని అలా పంపించేశాం. ఆ మదన్ చౌదరి గురించి నీ కజిన్ కి ఇంకా ఆంటీ కి తెలుసు. వాడు ఫారిన్ నుండి తిరిగి వచ్చి నిన్ను కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నం ప్రారంభించగానే, వాడిని తెలివిగా.......... అలా .............అడ్డు తప్పించేసారు." మల్లిక లో శక్తి తగ్గి పోయింది. తన మాట తడబడడం ప్రారంభించింది.

"మల్లీ........మల్లీ ...........చనిపోకు ప్లీజ్. నువ్వెలాంటి తప్పులు చేసిన, నువ్వింకా ఇప్పటికీ నను ద్వేషిస్తూనే వున్నా, నిన్ను నేను క్షమిస్తాను. నువ్వు నా ఫ్రెండ్ గా నాకు కావాలి. ప్లీజ్ చచ్చిపోకు." ఆవేశం గా అరిచింది సమీర

"ఇప్పుడు బతుకుదామన్నా నా చేతుల్లో లేదు సమీ. నా తప్పుకి భగవంతుడు వేస్తూన్న శిక్ష ఇది. కానీ .........కానీ..........నువ్వు నన్ను క్షమించగలవా? అది నీ వల్ల అవుతుందా?" మాట ఇంకా నీరసించి కష్టం మీద మాట్లాడుతూ వుంది మల్లిక.

మల్లికని హత్తుకుని భోరుమంది సమీర. "క్షమించకుండా ఎలావుండగలను? ఏం చేసినా, ఎలా చేసినా నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి."

"అదే నిజం అయితే, నా ఈ ప్రాణం పోతూన్నఈ సమయం లో నాకొక్క మాట ఇవ్వగలవా?"

"చెప్పు అదేమిటో?" ఏడుపుని నిగ్రహించుకుని అంది సమీర.

"ప్రపంచంలో నాలాటి నమ్మకద్రోహులే కాదు, అనురాగ్ లాంటి మంచి వ్యక్తులు కూడా వుంటారు. మామూలుగా మారి, అనురాగ్ ని పెళ్లి చేసుకుని అంకుల్ అంతగా ప్రేమించిన బిజినెస్ ని చూడు. దానిమీద ఆధారపడి వున్నఆ కుటుంబాల్ని కాపాడు."

"నావల్ల అవుతుందటావా?" మరోసారి ఏడుస్తూ అడిగింది సమీర.

"ఈ స్నేహితురాలి ఆత్మశాంతి కోసం నువ్వది చెయ్యక తప్పదు. చెయ్యక..........." మల్లిక మాట ఆగిపోయి తన చేతులు, సమీర చేతులచుట్టూ బిగుసుకుపోయాయి. తెరిచిన ఆమె కళ్ళు సమీరనే చూస్తూ ఉండిపోయాయి.

మల్లిక చనిపోయిందని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు సమీరకి. ఆఖరిసారిగా మల్లిక శరీరం మీద పడి భోరుమంది.

ఎపిలాగ్

"నీ మనసుకి తట్ట లేదు కానీ, మీ డాడ్ అంతగా ఆందోళన పడ్డారు నీకు చెప్పడానికి అంటే నా అనుమానం నీ ఆంట్, కజిన్ ఇంకా మల్లికల మీదకి మళ్లింది. నేను స్మరణ్ గారికి నా అనుమానం గురించి చెప్పాను కూడా." అనురాగ్ అన్నాడు.

ఆ సమయంలో సమీర ఇంట్లో సమీరా, అనురాగ్ ఇంకా డిటెక్టీవ్ స్మరన్ వున్నారు. అప్పటికి సమీరకి, అనురాగ్ కి పెళ్లయి ఒక నెల రోజులు అలా అవుతూంది. తన ఆంట్, కజిన్ ఇంకా మల్లిక తో గడిపిన ఆ ఇంట్లో ఉండలేక వేరొక ఇంట్లోకి మారిపోయింది సమీర అనురాగ్ తో పాటుగా.

 అనురాగ్, సమీర సోఫాలో పక్క పక్కనే కూచుని ఉంటే, డిటెక్టీవ్ స్మరన్ వాళ్ళకి అపోజిట్లో కుర్చీలో కూచుని వున్నారు. 

"నిజంగా నేను పెద్దగా శ్రమ పడింది కూడా ఏమీ లేదు ఈ అసైన్మెంట్లో. ఆ యాంగిల్ లోనే డిటెక్షన్ చేస్తూ వెళ్ళాను. మీరిచ్చిన నెంబర్ తో ఆ నిరంజన్ భార్యతో మాట్లాడగానే, ఆ నిరంజన్ కి ఇంకా డాక్టర్ మనోహర్ కి వున్న లింక్ కూడా బోధపడింది. నిజానికి ఫారిన్ కంట్రీ లో కూడా డిటెక్షన్ చేసి మొత్తం నిజం అంతా బయటికి తీసింది డిటెక్టీవ్ మదన్ చౌదరి. అతని ఆఫీస్ అంతా జాగ్రత్తగా వెదికితే అతను ఈ విషయంలో చేసిన డిటెక్షన్ రిపోర్ట్ కనిపించింది. అది చదివాక మొత్తం అన్నివిషయాలు బోధపడిపోయాయి."

"పాపం అతని ఫ్యామిలీ ఇప్పుడు ఎలా వున్నారు?" సమీర అడిగింది.

"అతను కూడా నాలాగే ఒంటరి. మ్యారేజ్ చేసుకోలేదు. ఫ్యామిలీ ఎవరూ లేరు. మీరు బాధ పడనవసరం లేదు." స్మరణ్ నవ్వాడు.

"జీవితంలో అందరూ తప్పులు చేస్తారు. అలాగే మీ వాళ్ళు కూడా చేశారు. ఆ విషయం మర్చిపోయి ప్రశాంతంగా వుండు." అనురాగ్ అన్నాడు.

"ఆ నిర్ణయానికి నేను మల్లికకి మాట ఇచ్చినప్పుడే వచ్చాను." సమీర నవ్వి అంది అనురాగ్ మొహంలోకి చూస్తూ. "నేను నా గురించి కాదు. మా డాడ్ ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్ గురించి, దాని మీద ఆధారపడ్డ వాళ్ళ గురించి ఆలోచించాలి. నువ్వు నాకు తోడుగా వుంటావుగా."   

"ఆ విషయం నువ్వు నన్ను ప్రత్యేకంగా అడగాలా?" అనురాగ్ అన్నాడు. "నీకు భర్తగా, మమ్మూత్ ఇండస్ట్రీస్ కి సి ఈ ఓ గా నేనుప్పుడూ తోడుగానే వుంటాను."

"పోలీసులు వెళ్లి అరెస్ట్ చెయ్యడం కన్నా ముందే డాక్టర్ మనోహర్ సూసైడ్ చేసుకున్నాడు." స్మరణ్ అన్నాడు.

"ఆ విషయం తెలిసింది." నిట్టూరుస్తూ అంది సమీర. "ఒకళ్ళని మోసం చేసి ఎవరూ సుఖపడలేరని ఇది నిరూపిస్తూంది."

"నేను వెళ్లివస్తాను. నా అవసరం మీకు మరెప్పుడూ రాకూడదనే కోరుకుంటున్నాను." స్మరణ్ లేచి అన్నాడు.

స్మరణ్ తో పాటుగా సమీర ఇంకా అనురాగ్ కూడా లేచి నిలబడ్డారు.

"మీకు చెల్లించాల్సిన మొత్తం నేను మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాను." అనురాగ్ అన్నాడు.

"గమనించాను." స్మరణ్ నవ్వాడు. "కానీ చెయ్యాల్సిన మాక్సిమం వర్క్ ఆ మదన్ చౌదరి చేసేసాడు. నేను చేసింది చాలా తక్కువ."

తరువాత స్మరణ్ వెళ్ళిపోతూ ఉంటే ఎంట్రన్స్ వరకూ వెళ్లి సాగనంపారు అనురాగ్, సమీర.

"వాళ్లతో గడిపిన ఆ ఇంట్లో ఉండలేక ఈ ఇంట్లోకి మారాను. కానీ ఈ ఇంట్లో కూడా వాళ్ళ ఆలోచనలు వదలడం లేదు."

మరోసారి సోఫాలో పక్క పక్కన కూలబడ్డాక, అనురాగ్ చుట్టూ చేతులువేసి అతని కుడిభుజం మీద తలాంచుకుని అంది సమీర.

"దేనికైనా కొంత సమయం పడుతుంది. మనకొక పాపో బాబో పుడితే నీలో పూర్తి మార్పువస్తుంది" అనురాగ్ అన్నాడు.

ఆ మాటలకి చిన్నగా నవ్వి, అనురాగ్ ని మరింత గట్టిగ కౌగలించుకుంది సమీర.

శుభం

రచయిత పరిచయం

రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై అయిదు ఇంగ్లీష్  పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా పేపర్ బాక్స్ గా అమెజాన్ లాంటి పాపులర్ ఆన్ లైన్ వెబ్సైట్లు లో లభ్యం అవుతూ వున్నాయి. ఈయన వ్రాసిన మొత్తం అన్ని ఇంగ్లీష్ పుస్తకాల లోని పదాల సంఖ్య నలభై లక్షల పైమాటే. ఈయన పుస్తకాలని ఇంగ్లీషులో వ్రాసినా, అవన్నీ తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు వాళ్ళకి సంభందించినవే.

&&&