Nuli Vechani Vennela - 18 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 18

Featured Books
Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 18

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

“ఇప్పటివరకూ మా అంకుల్ ఎన్నో అసైన్మెంట్స్ టేక్ అప్ చేశారు. అన్నిటిలోనూ విజయం సాధించారు. అది వూరికినే సాధ్యం కాలేదు.” మేనక కాఫీని సిప్ చేయడం పూర్తి చేసి, కప్పుని కింద పెట్టింది. “ఒక విషయంలో మా అంకుల్ ఒక నిర్ణయానికి వచ్చారంటే అది తప్పు కాదు. ఒక నెల రోజుల్లోనే మీ అసైన్మెంట్ పూర్తి చేస్తానని మా అంకుల్ చెప్పారు. అది కచ్చితంగా జరుగుతుంది. ఒక నెల రోజులు మీరు నన్ను బేర్ చేయండి చాలు.”

“ఎస్, సమీ. ఇందులో నష్టం నాకు కూడా ఏమీ కనిపించడం లేదు.” సమీర మొహంలోకి చూస్తూ అంది మల్లిక.

“యాం ఐ లెఫ్ట్ విత్ ఎనీ అదర్ చాయిస్?” నవ్వింది సమీర. “అలాగే కానిద్దాం.”

&&&

“నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా నీరజా?” కోపంగా అడిగింది సమీర, నీరజ చెప్పింది విన్నాక. “ఇక్కడ నువ్వు పనిచేస్తే ప్రమాదం అని నీ హస్బండ్ చెప్పడం ఏమిటి, అందువల్ల నువ్వు ఇక్కడనుండి వెళ్లిపోదామనుకోవడం ఏమిటి?”

“ఐ యాం సారీ మేడమ్.” నీరజ తలదించుకుని అంది. “నేను మీతో వుంటే నన్నూ చంపేస్తానని ఆ లేడీ బెదిరిస్తూందట. అందుకనే నన్ను ఇంక ఇక్కడ వుద్యోగం చేయవద్దని మా హస్బండ్ గట్టిగా చెప్పేసారు. ఆయన మాట కాదని నేను ఇక్కడ వుద్యోగం చేయలేను.”

“ఓహ్, గాడ్! నాకు ఏం చెప్పాలో బోధపడడం లేదు.” తల రెండు చేతులతో పట్టుకుని అంది సమీర.

“ప్లీజ్ మేడమ్. నన్ను రిలీవ్ చేసి పంపించేయండి. నేను కూడా చనిపోతే నా కూతురు అనాధ అయిపోతుంది.” ఏడుపు గొంతుతో అంది నీరజ.

“నువ్వంతగా భయపడి వెళ్ళి పోదామనుకుంటే నిన్ను బతిమాలి వుంచుకోవాలన్న ఆలోచన నాకు కూడా లేదు. నువ్వు వెళ్ళి ఆ అనురాగ్ ని పంపించు. నీ అకౌంట్ సెటిల్ చేసి నిన్ను పంపించేమని చెప్తాను.” కోపంగా అంది సమీర.

“ఏం జరిగినది మేడమ్? ఏమిటిదంతా?” సమీరకి అపొజిట్ గా వున్న కుర్చీలో కూచుని వున్న మేనక అడిగింది.

మేనక సమీరతో పాటుగా రావడం తో మల్లిక ఇంటి దగ్గరే వుండిపోయింది. నీరజ విషయం అంతా వివరించి చెప్పింది సమీర మేనకకి.

“ఆ ఒక్క సైకలాజికల్ డిజార్డర్ తప్ప తను వర్క్ అంతా బాగా చేస్తూంది. నేనూ తనకి బాగా అలవాటు పడిపోయాను. ఇప్పుడిలా చెప్పి వెళ్లిపోతాను అంటోంది. నాకు ఏం చేయాలో బోధపడడం లేదు.”

దానికి మేనక ఏదో చెప్పబోతూ వుండగా అనురాగ్ ఆ రూమ్ లోకి వచ్చి సమీరకి అపొజిట్ గా, మేనకకి ఎడమవైపు వున్న కుర్చీలో సెటిల్ అయ్యాడు.

“ఐ యాం సారీ సమీ. తను ఇలా అంటుందనుకోలేదు. తన సైకలాజికల్ డిజార్డర్ బాగా ముదిరి పోయింది. నేను తనని ఆపడానికి ప్రయత్నిస్తున్నాను, తను వినడం లేదు.” అనురాగ్ అన్నాడు.     

“నో మోర్ ట్రైయింగ్ లైక్ దట్ అనురాగ్, తన అకౌంట్ సెటిల్ చేసి పంపించేయి.” కోపంగా అంది సమీర. “ఈ సారి సెక్రటరీ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా వుందాం.”

“ఆల్ రైట్ సమీ. నువ్వు ఆ విషయం గురించి వర్రీ కాకు. నీకు ఇంకొక సెక్రటరీ వచ్చేవరకూ ఆ ప్లేస్ కూడా నేనే భర్తీ చేస్తాను.” నవ్వాడు అనురాగ్. “ఈ రోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు పూర్తయ్యాక, అన్నిటితో కలిపి ఆ నీరజ విషయం కూడా చూస్తాను.”

ఆ తరువాత సమీర ఇంకా అనురాగ్ బిజినెస్ విషయాలు డిస్కస్ చేసుకుంటూ వుంటే మౌనంగా చూస్తూ వుండిపోయింది మేనక.

&&&

“మీరు అన్నీ విషయాలు ఒక మేల్ పర్సన్ తో షేర్ చేసుకోలేరని మా అంకుల్ అభిప్రాయ పడ్డారు. అలాంటి విషయాలు ఏమన్నా వుంటే నన్ను తెలుసుకోమన్నారు. కాబట్టి మీరు మా అంకుల్ కి చెప్పలేని డిటెక్షన్ కి అవసరమైన విషయాలు ఏమన్నా వుంటే నాతో ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు.”

ఆ రోజు బెడ్రూం లో ఇద్దరూ బెడ్ మీద సెటిల్ అయ్యాక, మేనక సమీర తో అంది. మేనక తన ప్లేస్ తీసుకోవడం వల్ల, మల్లిక తనకి అలాట్ చేసిన రూమ్ లోకి వెళ్ళిపోయింది.  ఆ సమయం లో బెడ్ మధ్యలో మేనక, సమీర ఒకరికొకరు అపొజిట్ గా కూచుని వున్నారు.

“ఓహ్, మేనకా. నిన్ను చూస్తూంటే నాకు డిటెక్షన్ కి అవసరమైన విషయాలు ఏమిటి, అన్నీ విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తూంది. నీతో నాకు గొప్ప ఫ్రెండ్లీ ఫీలింగ్ కలుగుతూంది.” నవ్వుతూ అంది సమీర.

“ఐ యాం ఇండీడ్ వెరీ లక్కీ మామ్.” మేనక కూడా నవ్వింది. “మీలాంటి గ్రేట్ లేడీ కి నాతో ఫ్రెండ్లీ ఫీలింగ్ కలగడం నా లక్.”

“కానీ నా గురించి పూర్తిగా తెలిసాక, నా మీద నీ అభిప్రాయం మారుతుందేమోనని నాకు భయంగా వుంది.” మొహంలో అనీజీ ఫీలింగ్ తో అంది సమీర.

“ఒక గర్ల్ తన జీవితంలో ఇతరులకి తెలిసిపోతాయాయేమోనని భయపడే విషయలేముంటాయి మామ్, ఆమె లవ్ అఫ్ఫైర్స్ అండ్ సెక్సుయల్ రిలేషన్ షిప్స్ తప్ప. ఈ రోజుల్లో ఏ ఒక్కరూ వాటికి అతీతం కాదు, ఇంక్లూడింగ్ మి. ఒకవేళ అలాంటివాటి వాటివల్లే మీరు మీ జీవితం గురించి నాకు చెప్పడానికి ఆలోచిస్తూవుంటే, జస్ట్ ఫీల్ ఫ్రీ. మీ నుండి నేను మీ గురించి ఏం విన్నా మీ మీద నా అభిప్రాయం మారదు.” స్థిర స్వరం తో అంది మేనక.

“ఓహ్, గాడ్! అయితే నీకూ ఒక లవ్ అఫైర్ వుందా?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సమీర.

“అన్నీ వున్నాయి, ఆ విషయాలు తరువాత మాట్లాడతాను. ముందు మీరు చెప్పదలుచుకున్నది అంతా చెప్పండి.” చిరునవ్వుతో అంది మేనక

"కానీ ముందు నువ్వు చెప్తేనే నాకు నీతో చెప్పాలనిపిస్తుంది." మేనక మొహం లోకి చూస్తూ అంది సమీర.              

చిన్న నవ్వు నవ్వింది మేనక.  "నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే టైం లో అరవింద్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ప్రేమించాననే అనుకున్నా. ఒక బలహీన క్షణంలో ఒక్కటయ్యాం కూడా. కుదిరినప్పుడల్లా కోరిక తీర్చుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు నా ప్రేమ విషయం మా మమ్మీ తో చెప్పాను."

  డిస్టర్బ్ చెయ్యకుండా ఆసక్తిగా వింటోంది సమీర.

"ఈ సమయంలో కలిగే ఆకర్షణలన్నీ ప్రేమలాగే అనిపిస్తాయి. అలా అనుకుని పెళ్లి చేసుకుంటే చిక్కుల్లో పడతావ్. నువ్వు చదివే  కోర్సే ఎంతో అలోచించి ఎంచుకుంటావ్. ఇంక పెళ్లి చేసుకోబోయే భర్త విషయంలో ఎంత జాగ్రత్తగా వుండాలి." అంది.

నేను అప్పుడు నేను అరవింద్ అప్పుడప్పుడు కలుస్తూన్న విషయం గురించి కూడా చెప్పేసాను. ఆ విషయాన్నీ కూడా మా మమ్మీ చాలా తేలికగా తీసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

"వయసులో ఆడ మగా కలిసి కోరిక తీర్చుకోవడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. నీకేదో కాస్త బాగా అనిపించి ఆ అబ్బాయితో కోరిక తీర్చుకున్నావు. అంత మాత్రం చేత నీ లైఫ్ కి పూర్తిగా సూట్ అవుతాడనుకోవడం సరికాదు. నువ్వు ఆ అరవింద్ అన్ని విధాలుగా నీకు సూట్  అవుతాడనుకుంటే నా అభ్యంతరం లేదు. కాకపోతే ఇంకొంతకాలం పరిశీలించి చూడు. కోరిక తీర్చుకునేప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోవడం మర్చిపోకు."

అప్పటికీ అరవింద్ నాకు అన్నివిధాలుగా సూట్ అవుతాడనే అనుకున్నా. ఆ తరువాత కూడా అప్పుడప్పుడు మేం కోరిక తీర్చుకుంటూనే వున్నాం. కానీ క్రమంగా మాలో ఇంకపాటిబిలిటీ నాకు బోధపడింది. మేమిద్దరం కలిసి ఆనందంగా వుండలేం అనుకున్నాం. నేను ఆ విషయం చెప్పినప్పుడు అరవింద్ కూడా అలాగే అనిపించివుంటుంది. మేం ఇంక విడిపోదాం అన్న నిర్ణయాన్ని తనుకాదనలేదు." మేనక ఆపింది. 

"గాడ్! మీ మమ్మీ లాంటి మమ్మీలు చాలా అరుదు." విస్మయంగా అంది సమీర.

"ఆ విషయాన్ని నేనూ అనిగీకరిస్తాను." చిరునవ్వు నవ్వింది మేనక.

"ఆ తరువాత మరి వేరే లవర్ ఎవరూ లేరా?"

"లేరనే చెప్పాలి." నిట్టూర్చింది మేనక. "నాకు నేను సరైన లైఫ్ పార్టనర్ ని ఎంచుకోలేనేమోననిపించింది. అందుకే ఆ బాధ్యతని మా మమ్మీకి వదిలేసాను. ఇప్పుడు తను నాకో హస్బెండ్ ని వెతికే పనిలోనే వుంది."

"గుడ్" నవ్వింది సమీర. "నీ ఎఫైర్ విషయం మీ మమ్మీ నీ డాడీ కి చెప్పివుండరు. చెప్తేకనుక అయన చాలా కోపగించుకుని వుండేవారు."

"నో, నాకు మా డాడీ లేరు. నా చిన్నప్పుడే పోయారు. అయన చేసే బ్యాంకు జాబ్ మా మమ్మీ కి ఇచ్చారు. నాకు మా మమ్మీ కి మా స్మరన్ అంకుల్ తప్ప వేరే ఎవరూ లేరు." మరోసారి నిట్టూర్చింది మేనక.

"నాకు మొన్నటి వరకూ డాడ్ తప్ప మామ్ లేదు. నా మామ్ నా చిన్నప్పుడే చనిపోయింది ఆక్సిడెంట్లో. నా ఆంటీ నన్ను ఎంత చక్కగా చూసుకున్నారు అంటే చాలా రోజులు నేను తనే నా మామ్ అనుకున్నాను." సమీర అంది.

"మీ మామ్ లేకపోయినా అంతగా ప్రేమించే మనిషి దొరికినందుకు మీరు అదృష్టవంతులే." మేనక అంది.

"కానీ ఒక మామ్ దండించినట్టుగా నన్ను మా ఆంటీ దండించలేకపోయింది. అందుకే చాలా ఇండిస్సిప్లిన్డ్ లైఫ్ గడిపాను. సెక్స్ చాలా ఫ్రీగా ఎంజాయ్ చేసాను." మరోసారి నిట్టూర్చింది సమీర.

"మీకు చెప్పాగా ఆ విషయం గురించి అప్సెట్ అవ్వొద్దని. కేవలం మానవులకి మాత్రమే కాదు, ఇంకా అన్ని జీవరాసులుకి కూడా సెక్స్ ఒక అవసరం. అది తీర్చుకోవడం పెద్ద తప్పని నేను అనుకోను. అంతకన్నా పెద్ద తప్పులు చేసినవాళ్లు ఎంతో ఫ్రీగా, హ్యాపీగా ఈ సమాజంలో తిరుగుతున్నారు కదా." మేనక అంది.

"నువ్వు చెప్పింది విన్నాక నాకు సంబంధించిన విషయాలన్నీ చాలా ఫ్రీగా నీతో షేర్ చేసుకోగలను అనిపిస్తూంది." సమీర అంది.

"మీకు చెప్పాలనిపిస్తే తప్పకుండా చెప్పండి. ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఓనర్ నాతో ఇలా షేర్ చేసుకుంటున్నారు అంటే నాకు చాలా హాపీగా వుంటుంది." మేనక అంది.

అప్పుడు సమీర మొదట తరంగ్ గురించి చెప్పింది. కొంచెం ఇబ్బందిగా అనిపించినా వాడితో తనూ, తన ఫ్రెండ్ మల్లికా సెక్స్ చేయడం గురించి కూడా చెప్పింది. అలాగే నిరంజన్ గురించి, వాడి నిజస్వరూపం గురించి కూడా చెప్పింది. 

"నాతో సెక్స్ చేసిన ఆ ఇద్దరూ ఇప్పుడు భూమ్మీద లేరు. దట్ మీన్స్ చనిపోయారు." అంది.

"ఓహ్, రియల్లీ! అదెలా జరిగింది?" ఒక సర్ప్రైజింగ్ ఎక్సప్రెషన్ తో అడిగింది మేనక.

తరంగ్, నిరంజన్ ఇద్దరూ ఎలా చనిపోయారో చెప్పింది సమీర. "నాకిప్పుడు భయం వేస్తూంది నాతో సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకున్నవాళ్లంతా అలాగే అవుతారేమోనని. నాకు వాళ్లతో ఎమోషనల్ ఇంకా సెంటిమెంటల్ కాంటాక్ట్ లేదు. కానీ నాతో సెక్స్ చేసిన వాళ్లిద్దరూ అలా చనిపోయారంటే మాత్రం చాలా అనీజీ గా వుంటుంది."

"అది కేవలం కో-ఇన్సిడెంటల్. వాళ్లతో మీరు ఎమోషనల్ ఇంకా సెంటిమెంటల్  గా అటాచ్ కాకపోవడం మీ అదృష్టం. వాళ్ళిద్దరిని పూర్తిగా మర్చిపోయి ఎవరైనా ఒక మంచి వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. అంతేకాదు అతనితో ఎమోషనల్ ఇంకా సెంటిమెంటల్  గా కూడా అటాచ్ కండి." మేనక అంది.

"ఆల్రెడీ ఆ పని చేసాను." నవ్వింది సమీర. "ఆ వ్యక్తి అనురాగ్. మా కంపెనీ సి ఈ ఓ. మీ అంకుల్ ని ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంగేజ్ చేసింది అతనే."

"వెరీ హ్యాండ్సమ్ గై. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా వుంటారు." నవ్వింది మేనక.

"నువ్వు కనిపెట్టలేని విషయం ఏమిటంటే ఆ అనురాగ్ నా కన్నా చాలా పెద్ద. దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్. అతనిప్పుడు ఫార్టీ టు. కానీ అది అతని మీద నా ప్రేమకి అడ్డురాలేదు."

"నిజమైన ప్రేమకి ఏదీ అడ్డురాదు." మరోసారి నవ్వింది మేనక. "ఎనీహౌ అతనికి ఫార్టీ టు అని కనిపెట్టడం చాలా కష్టం. జస్ట్ థర్టీ ఇయర్స్ ఏజ్డ్ లా కనిపిస్తూ వున్నాడు."

"కొందరు ఎప్పుడూ అలా యంగ్ గా కనిపిస్తూ వుంటారు." సమీర అంది. "నిరంజన్ కూడా చాలా యంగ్ గా హ్యాండ్సమ్ గా వుండేవాడు. నేను వాడినే పెళ్లిచేసుకుందామనుకున్నాను. వాడికి మా బిజినెస్ గురించి కూడా బాగా తెలిసివుండడంతో ఒక అసెట్ లా వుంటాడనుకున్నాను. కానీ వాడి గురించి తెలిసాక నా నిర్ణయం మార్చుకున్నాను. ఐరనీ ఏంటంటే, వాడిగురించి తెలిసిన తరువాత కూడా మేమిద్దరం కొంతకాలం సెక్స్ చేసుకున్నాం."

"వాడి గురించి మీకు ఎలా తెలిసింది?"

వాడి సెల్ ఫోన్లో వాడి పెళ్లి ఫోటోలు చూసిన విషయం గురించి, వాడి భార్య ఇంకా తనకి ఫోన్ చేసి మాట్లాడిన విషయం గురించి చెప్పింది సమీర.

"ఆవిడ తాలూకు ఫోన్ నెంబర్ మీ దగ్గర వుందా? నాకు ఇవ్వగలరా?" మేనక అడిగింది.

"వుంది. ఇస్తాను కూడా. కానీ దేనికి?" భృకుటి ముడేసింది సమీర. ఆ రోజు ఎందుకైనా మంచిదని ఆవిడ నంబర్ సేవ్ చేసి అట్టేపెట్టింది సమీర.

"ఎందుకో ఆవిడతో మాట్లాడడం అవసరం అనిపిస్తూంది నాకు. ఆవిడ ఫోన్ నెంబర్ మా అంకుల్ కి ఇచ్చి ఆవిడతో మాట్లాడమంటే, మీకేం అభ్యంతరం లేదుకదా?"

"ఆవిడతో మాట్లాడవల్సినదంతా నేనే మాట్లాడగలను. మధ్యలో మీ అంకుల్ ఎందుకు?"

"ఒక డిటెక్షన్ కి అడగాల్సినవి మీరు అడగలేరు." నవ్వింది మేనక. "దయచేసి మీరు నాకు ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. తక్కినది మా అంకుల్ చూస్తారు."

"ఆల్రైట్. నాకు అభ్యంతరం ఏమీ లేదు." తరువాత తన ఫోన్ లో సెర్చ్ చేసి ఆ నెంబర్ మేనక కి ఇచ్చింది సమీర.

"ఇంకా మీరు మా అంకుల్ తో చెప్పలేనివి ఎమన్నా వున్నాయా? వుంటే దయచేసి నాతో చెప్పండి. మీ దగ్గర నన్ను పెట్టడానికి అదొక ప్రధాన కారణం. మీరు మా అంకుల్ తో షేర్ చేసుకోలేనివి నాతో షేర్ చేసుకుంటారని."

"అప్పుడు నువ్వు అవన్నీ ఎలాగూ మీ అంకుల్ తో చెప్తావుకదా. అప్పుడు మీ అంకుల్ తో చెప్తే ఏమిటి, నీతో చెప్తే ఏమిటి?" చిరాగ్గా అంది సమీర.

"అవి చెప్పవలసినంత అవసరమైనవి అనిపిస్తే మాత్రమే చెప్తాను. లేకపోతె చెప్పను.  దయచేసి చెప్పండి. మీ లైఫ్ రిస్క్ లో వుంది అన్న విషయం మర్చిపోవద్దు." ఒక వార్నింగ్ ఎక్సప్రషన్ తో అంది మేనక.

దానితో తనకి కలుగుతూన్న ఆడిటరీ ఇంకా సెన్సువల్ హల్యూసీనేషన్స్ గురించి చెప్పింది సమీర. అలాగే తను మేడమీద నుండి కిందకు దూకేయ బోతూ వుంటే, తనెలా తన ఫ్రెండ్ మల్లిక చేత  కాపాడబడింది కూడా చెప్పింది.

"ఎందువల్లనో తెలీదు కానీ నేనొక సైకాలాజికల్ డిజార్డర్ తో బాధపడుతూవున్నాను. నా ఫ్రెండ్ మల్లిక నాకు ట్రీట్మెంట్ చేసి బాగుచేసే ప్రయత్నంలో వుంది. తానొక పెద్ద సైకాలజిస్ట్."

" అలాంటి సైకాలజిస్ట్ ఫ్రెండ్ ప్రస్తుత పరిస్థితులలో మీకు చాలా అవసరం కూడా."

"తనతో ఒకటే ఇబ్బంది. ఏ పారానార్మల్ ని నమ్మదు. కళ్ళముందే ప్రూఫ్ కనిపిస్తూవున్నా, ఒక స్పిరిట్ ఇంవోల్వ్మెంట్ నా లైఫ్ లో వుందంటే ఒప్పుకోదు." చిరాకుగా అంది సమీర. 

"దానర్ధం అలాగని మీరు అభిప్రాయపడుతున్నారా?" నొసలు చిట్లించింది మేనక.

"అలాంటి వాటిని వేటినీ నేనూ నమ్మేదాన్ని కాదు. కానీ పరిస్థితులు నమ్మేలా చేశాయి." అప్పుడు ఒక ఆడమనిషి మాటలు తను విని అనుసరించిన విషయం, నీరజ హస్బెండ్ తనతో మాట్లాడిన విషయాలు, ఇంకా తన ఆంటీ ప్రమీల గురించిన చెప్పిన విషయాలు చెప్పింది. "ఇప్పుడు చెప్పు. పారానార్మల్ ని నేను నమ్మాలా, వద్దా?" ఆఖర్లో అడిగింది.

"ప్రస్తుతానికి పారానార్మల్ ని నమ్మొద్దు అనడానికి ఒక రీజనబుల్ ఎక్సప్లనేషన్ నేను ఇవ్వలేను. కానీ నాకు మాత్రం మీ సైకాలజిస్ట్ ఫ్రెండ్ చెప్పిందే కరక్ట్ అనిపిస్తూంది." మేనక అని మళ్ళీ సమీర ఎదో చెప్పేలోగా తనే అంది. "ఈ విషయం గురించి ప్రస్తుతానికి ఆర్గ్యుమెంట్ ఏమీ వద్దు. త్వరలోనే అన్ని విషయాలు తేటతెల్లం అవుతాయి. ప్రస్తుతానికి పడుకోండి."

మేనక అలా అన్నాక ఏమీ ఆలోచించ కుండా నిద్రకి ఉపక్రమించింది సమీర. ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలీదు. 

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)