Nuli Vechani Vennela - 17 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 17

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 17

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

“ఆ విషయం వదిలేయండి. అది తెలుసుకోవడానికి నేనెలాగూ వున్నాను కదా. ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్పాల్సినవి ఏమైనా వున్నాయా?”

“మా డాడ్ నాతో అంతగా చెప్పాలనుకుని చెప్పకుండా చనిపోయిన ఆ విషయం ఏమిటన్నదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి నేను ఇప్పటివరకూ చెప్పినది చాలు.”

“సమీరా, నీకు కలుగుతూన్న ఆ వింత అనుభవాలు, ఆ హల్యూసీనేషన్స్ మాటేమిటి? వాటి గురించి కూడా చెప్పు.” తనూ తనకి చేసిన ప్రామిస్ ని గుర్తుచేస్తున్నట్టుగా అన్నాడు అనురాగ్.

“మిస్ సమీరా, మీరు ఏ విషయం దాచకుండా నాకు చెప్పడానికి అగ్రీ అయ్యారు.” స్మరణ్ గుర్తు చేశాడు.

“ఆల్రైట్.” సమీర తలూపింది. “ఎక్జాట్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పలేను. కానీ నాకు ఎవరో నవ్వుతున్నట్టుగా, ఏడుస్తున్నట్టు గా, ఇంకా నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. అంతేకాదు నన్ను ఈ మధ్య ఎవరో తాకుతున్నట్టుగా కూడా వుంటూ వుంది.” ఇబ్బందిగా అంది సమీర బాత్రూమ్ లో ఇంకా బెడ్రూం లో తనకి కలిగిన అనుభవాలు గుర్తుకు వచ్చి. వాటి గురించి వివరంగా అడిగితే ఏం చెప్పాలో బోధపడడం లేదు.

“తనూ అడిటరీ ఇంకా విజువల్ హల్యూసీనేషన్స్ కి సబ్జెక్ట్ అవుతూందని నా అభిప్రాయం. తనని హిప్నోటైజ్ చేసి ప్రోగ్రామ్ చేద్దామనుకుంటున్నా.” మల్లిక అంది.

“మీరు కేవలం తనకి ఫ్రెండ్ మాత్రమే అనుకున్నా, సైకాలజిస్ట్ కూడా అన్నమాట.” మల్లిక మొహంలోకి చిరునవ్వుతో చూస్తూ అన్నాడు స్మరణ్.

“అవును.” మల్లిక కూడా చిరునవ్వు నవ్వింది

“మిస్ సమీరా, మీరింకా చెప్పలసిన విషయాలు ఏమన్నా వున్నాయా?” మళ్ళీ సమీర మొహంలోకి చూస్తూ అడిగాడు స్మరణ్.

“ఇంతకన్నా మరేం లేవు.” తనని ఇంకా గుచ్చి గుచ్చి ఆడగకుండా వుండాలని దేవుడిని ప్రార్ధిస్తూ అంది సమీర.

“తన జీవితం చాలా ప్రమాదంలో వుందని నాకు అనిపిస్తూంది. ఆ ప్రమాదం ఎలా వస్తూంది, దానిని ఎలా తప్పించాలి అన్న విషయం లో మీరు మాకు సహాయం చెయ్యాలి .” మల్లిక అంది.

“మీ ఫ్రెండ్ తాలూకు ఊహ నిజం. మీ జీవితం నిజంగానే చాలా ప్రమాదంలో వుంది సమీరా. యు నీడ్ టు బి వెరీ కేరఫుల్.” సమీర మొహంలోకే చూస్తూ అన్నాడు స్మరణ్.

ఆ విషయం ఎంత ఊహిస్తూన్నదే అయినా, స్మరణ్ అలా అనేసరికి భయంతో నిండిపోయింది సమీర హృదయం.

“కానీ నెల రోజుల్లోనే మీ డాడ్ అంతగా చెప్పాలనుకుని, చెప్పకుండా చనిపోయిన ఆ విషయం ఏమిటో నేను మీకు చెప్తాను. అంతే కాదు మీ హల్యూసీనేషన్స్ కి కారణం ఏమిటో కూడా తెలుసుకుంటాను. మీ ప్రాణాలకి పొంచివున్న ఆ ప్రమాదాన్ని తప్పిస్తాను.  ఇదంతా చెయ్యడానికి నాకీ రోజునుండి నెలరోజుల గడువు చాలు." ఆ రోజేమిటో చెప్పాక మళ్ళీ అన్నాడు స్మరణ్ “మీరు నేను చెప్పినట్టల్లా చేస్తే చాలు.”

“మిస్టర్ స్మరణ్,............. ” ఆశ్చర్యంతో నిండిన మొహంతో అంది సమీర. “...........మా డాడ్ చెప్పాలనుకుని చెప్పకుండా చనిపోయిన విషయం వరకూ ఓకే. కానీ మీరు నా హల్యూసీనేషన్స్ కి కారణం ఏమిటో కూడా చెప్తాననడం ఆశ్చర్యంగా వుంది.”       

“మిస్ సమీరా...........” నవ్వాడు స్మరణ్ “........... నా అభిప్రాయం లో మీ డాడ్ అంతగా చెప్పాలనుకున్న ఆ విషయం ఏమిటో తెలుసుకుంటే మీ హల్యూసీనేషన్స్ కి కారణం కూడా తెలుస్తుందనే నాకు అనిపిస్తూంది. మీరు ఎక్కువగా వర్రీ కాకుండా నా మీద కాన్ఫిడెస్ వుంచండి చాలు.”

“ఆల్ రైట్ దెన్.” నిట్టూర్చి తలూపింది సమీర. 

“ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని కనిపెట్టుకుంటూ ఎవరో ఒకరు వుండాలి. ఇది చాలా ముఖ్యం. అందుకోసం...........”

“అందుగురించి నేను వున్నాను సర్” మల్లిక అంది. “తనని ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా నేను వుంటాను.”

“నో, మీరు సరిపోరు. ఇందులో డిటెక్షన్ లో కూడా అనుభవం వున్న వ్యక్తి కావాలి.” మల్లిక మొహంలోకి చూసి అలా అన్నాక మళ్ళీ సమీర మొహంలోకి చూశాడు స్మరణ్. “నా మేనకోడలు మేనక, నేను ఈ అసైన్మెంట్ పూర్తి చేసేవరకూ మీ కూడా ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా వుంటుంది. మీరు దీనికి అంగీకరించాలి.”

“మీ మేనకోడలు మేనక నాతో వుంటుందా ఎప్పుడూ?” ఒక ఇబ్బంది కరమైన ఎక్స్ప్రెషన్ తో అంది సమీర.

“మీరేం భయపడనక్కరలేదు. తన ప్రెసన్స్ చాలా ఎంజాయబుల్ గా వుంటుంది మీకు. కానీ ఇది చాలా ముఖ్యం. ”

“సమీ, నువ్వు దీనికి వేరే ఏం ఆలోచించకుండా ఒప్పుకో. నాకు ఇందులో అభ్యంతర పెట్టాల్సినది ఏమీ కనిపించడం లేదు.” మల్లిక అంది.

“ఒకే సర్, నాకు అంగీకారమే.” తలూపుతూ అంది సమీర.

“ఆల్ రైట్ దెన్. ప్రస్తుతానికి నేను వెళ్ళి వస్తాను.” కుర్చీలోనుంచి లేచి నిలబడ్డాడు స్మరణ్. “ఈ అసైన్మెంట్ పూర్తయ్యే లోపల నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవాల్సి వుంటుంది.”

స్మరణ్ తో పాటుగా లేచి నిలబడ్డారు అనురాగ్, మల్లిక ఇంకా సమీర కూడా.

“మీరెప్పుడైనా నన్ను కలుసుకుని మాట్లాడొచ్చు.” చిరునవ్వుతో అంది సమీర.

“నేను మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను, చేయడానికి ప్రయత్నించండి.”

“చెప్పండి సర్, అలాగే ప్రయత్నిస్తాను.” ఆసక్తి నిండుకుంది సమీర మొహంలో.

“ఆ డైరీ లో ఆ విషయం తెలిస్తే మీరెంత గానో హర్ట్ అవుతారు, నమ్మలేరు అని రాశారు మీ డాడ్.” స్మరణ్ అన్నాడు. “అసలు ఎలాంటి విషయాలు తెలిస్తే మీరసలు నమ్మలేరు, హర్ట్ అవతారు అన్నది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి నాకు ఇవ్వండి.”

“తప్పకుండా అలాగే.” మళ్ళీ నవ్వింది సమీర.

“రేపు మార్నింగ్ మేనక మిమ్మల్ని వచ్చి కలుస్తుంది, మీతో పాటుగా వుంటుంది. మరింక నేను వస్తాను.”

అలా అని స్మరణ్ అక్కడనుండి వెళ్ళి పోగానే మళ్ళీ ముగ్గురూ కుర్చీల్లో కూలబడి మాటల్లో పడ్డారు.

&&&

            “ఏది ఏమైనా తనని ప్రమాదం నుండి తప్పించడానికి ప్రయత్నాలు మొదలు అయ్యాయి. అందుకు నాకు చాలా సంతోషం గా వుంది.” డైనింగ్ టేబల్ దగ్గర అందరూ సప్పర్ చేస్తూండగా, నిర్మల అంది. “ఆ అనురాగ్ నిజంగా చాలా మంచిపని చేశాడు.”

            అప్పటికి సమీర విషయంలో ఒక డిటెక్టివ్ ని ఎంగేజ్ చేసిన సంగతి వివరంగా నిర్మలకి, ఇంకా సంజయ్ కి కూడా చెప్పేసారు మల్లిక ఇంకా సమీర.

            “అంతేకాదు. రేపటినుండి మేనక అనబడే అమ్మాయి నాతోపాటుగా వుంటుంది. ఈ అసైన్మెంట్ పూర్తయ్యేవరకూ తనూ నాతోనే వుంటుంది. తను ఆ స్మరణ్ మేనకోడలు. తనని నాతొ అలా వుంచుకోవడం తప్పదని ఆయన తెగించి చెప్పేసారు.”

            “హార్టీ వెల్కమ్ టు హర్.” సంజయ్ అన్నాడు. “నిన్ను ప్రమాదం నుండి కాపాడే ఏ విషయాన్నైనా సరే నేను స్వాగతిస్తాను.”

“ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం వుంది, ఇప్పటివరకూ మీకు చెప్పనది.” సమీర మొహంలోకి చూస్తూ అంది మల్లిక. “తను అనుమతిస్తే నేను మీకది చెప్తాను.”

“గో ఆన్.” మల్లిక ఏం చెప్పదలుచుకుందో అర్ధం అయి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి సమీరకి.

అప్పుడు మల్లిక, సమీర అనురాగ్ ని ప్రేమిస్తూన్న విషయం గురించి ఇంకా అతన్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్న విషయం గురించి చెప్పింది.          

“ఇది నేను మరీ ఆశ్చర్య పడాల్సిన విషయం కాదు. అలాంటి ద్వేషం ఇలాంటి ప్రేమగా మారుతూ వుంటుంది. ఆ అనురాగ్ నిజంగానే హ్యాండ్సం పర్సనాలిటీ. ఆడపిల్లలు అతనితో లవ్ లో పడడం సహజమే.” చిరునవ్వుతో అన్నాడు సంజయ్. “అంతేకాదు, మీరిద్దరూ అలా భార్యాభర్తలు అవ్వడం బిజినేసస్ కి కూడా చాలా మంచిది.”

“కానీ సమీ............................ “ నిర్మల అంది నొసలు ముడేసి “........................... అతను వయసులో నీకన్నా చాలా పెద్దవాడు. దగ్గర, దగ్గర ఇరవై సంవత్సరాలు.”

“లవ్ కి అలాంటివేమీ పట్టవు ఆంటీ. లవ్ లాజిక్, రీజన్ చూడదు. అవన్నీ చూసుకుని పుడితే అది లవ్ కాదు.” మల్లిక అంది చిరునవ్వుతో సమీర మొహంలోకి చూస్తూ “నేను తన లవ్ కి ఆ కారణం తో అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తనూ ఇదే చెప్పింది.”

“ఒక్క ఏజ్ విషయం లో తప్ప, తక్కిన విషయాల్లో ఇందులో అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. అనురాగ్ గురించి మనందరికీ తెలుసు, తనెంతో మంచి కుర్రాడు.” నిర్మల అంది.

తరువాత అలా మాట్లాడుకుంటూనే సప్పర్ పూర్తి చేశారు నలుగురూ.

&&&

“మళ్ళీ ఏదో ఫోన్ కాల్ అన్నోన్ నంబర్ నుండి.” తన స్మార్ట్ ఫోన్ వైపు చూస్తూ అంది సమీర. ఆ సమయంలో సమీర, మల్లిక సోఫాలో హాల్లో పక్క పక్కనే కూచుని వున్నారు. “ఆ రోజు తరువాత  అన్నోన్ నంబర్ నుండి కాల్స్ అంటే ఏదో భయం గానే వుంది.”

“ముందు అటండ్ అవ్వు. ఫోన్ కాల్స్ కి కూడా భయపడితే ఎలా.” మల్లిక అంది.

“ఈజ్ ఇట్ సమీర, మానేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మామూత్ ఇండస్ట్రీస్?” ఏదో ముఫై ఏళ్ల ఆడమనిషి గొంతులా వుంది.

“అఫ్కోర్స్, ఎస్.” సోఫాలో ఇంకా ఎక్కువ కంఫర్ట్ కి సెటిల్ అవుతూ అంది సమీర. “టెల్ మి వై డిడ్ యు కాల్ మి?”

“మీరు నిరంజన్ లవర్ కదా.” స్ట్రెయిట్ గా తెలుగులో అడిగేసిందావిడ. “మీరు తెలుగు వారని నాకు తెలుసు.”

“ఆ విషయంతోటి మీకేమిటి సంబంధం?” కోపంగా అడిగింది సమీర.

“నేను నిరంజన్ భార్యని. వాడికిలా అందర్నీ లవ్లో పడేయడం, ఇంకా మోసం చేయడం అలవాటే. వాడు వన్ వీక్ బ్యాక్ హార్ట్ ఎటాక్ తో పోయాడు కదా. వాడిగురించి తలుచుకుని ఎక్కడ అనవసరంగా బాధ పడుతూ వుంటారో అని  ఫోన్ చేశాను. మీ లవ్ విషయం నాకీ మధ్యనే తెలిసింది.”

“థాంక్ యు ఫర్ యువర్ గుడ్ ఇంటెన్షన్ అండ్ సారీ ఫర్ మై మిస్ అండర్స్టాండింగ్ యు.” అపలాజిటిగ్గా అంది సమీర. “కానీ వాడు నాకు అబద్ధాలు చెప్పాడని ఎప్పుడో తెలిసిపోయింది. ఆ తరువాత కూడా ఒక ఫ్రెండ్స్ లా వుండేవాళ్ళం కానీ, నాకు వాడి మీద బాధపడాల్సినంత ఫీలింగ్ లేదు.”

“బట్ సమీరా, ఎలాంటి ఫ్రెండ్షిప్ కి కూడా వాడు యోగ్యుడు కాదు.”

“ఆల్ రైట్, ఆల్ రైట్, ఇప్పుడు చనిపోయాడు కదా, వాడి గురించి ఆలోచన ఎందుకు చెప్పండి?” అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టుగా అడిగింది సమీర. “మీకు వాడికి విడాకులు అయిపోయాయి కదా. మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా?”

“మా ఇద్దరికీ విడాకులు కాలేదు. విడాకులు ఇచ్చి బయటికి తోసేస్తే, ఇంకా ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తాడోనని మార్చడానికి ప్రయత్నిస్తూ కలిసే వున్నాను. మీ లవ్ విషయం నాకు వాడు పోయకే తెలిసింది. అంటే మా ఇద్దరికీ విడాకులు అయిపోయాయి అని చెప్పాడా?”

“ఎస్, అదికూడా వాడికి పెళ్లి అయిపోయిందని నాకు తెలిసిపోయిన తరువాత. కాకపోతే నేను పెద్దగా షాక్ అవ్వలేదు. లైఫ్ పార్టనర్ అయితే మా బిజినెస్ కి కూడా వుపయోగ పడతాడని ఆలోచించాను అంతే. ఎనీ హౌ అలాంటివాడు మీ ఇద్దరికీ విడాకులు అయిపోయాయి అని చెప్పడం లోనూ ఆశ్చర్యం లేదు.”

“మీ డాడ్ గురించి, మీ గురించి చాలా మంచివారని విన్నాను. అందుకనే మీరు అనవసరంగా బాధపడకూడదని ఫోన్ చేశాను. మీరు వాడి మీద ఎలాంటి ఫీలింగ్ లేకుండా వున్నందుకు నాకు సంతోషంగా వుంది. వుంటా మరి.”

“మీ నోబుల్ ఇంటెన్షన్ కి థాంక్ యు వెరీ మచ్.” నవ్వింది సమీర.

ఆ తరువాత ఆ ఫోన్ కాల్ కట్ అవడం తో ఆ ఫోన్ ని అక్కడే వున్న టేబల్ మీద పడేసి, తన వంకే ఆశ్చర్యంగా చూస్తూ వున్న మల్లిక మొహంలోకి చూస్తూ కోపంగా అంది సమీర. “రాస్కెల్. వాడో పెద్ద అబద్ధాల పుట్ట. తనకి తన భార్యతో  విడాకులు అయిపోయాయి అని చెప్పింది కూడా అబద్ధమే.”

“మీ సంభాషణ బట్టి అర్ధం అయింది, ఇప్పుడు ఫోన్ చేసింది వాడి వైఫ్ కదా?” మల్లిక అంది.

“ఎస్” తలూపింది సమీర. “నేను వాడిని తలుచుకుని అనవసరంగా ఫీల్ అవ్వకూడదని ఫోన్ చేసి వాడు ఎలాంటి వాడో చెప్పింది. మా ఇద్దరి లవ్ గురించి వాడు పోయిన తరువాత తెలిసిందట. వాడొక నెంబర్ వన్ చీట్.”

“వాడేదో కాస్త ఆకర్షణీయంగా, మంచివాడిలా కనిపించడంతో నేనూ నిన్ను ఎంకరేజ్ చేశాను. ఐ యాం సారీ, సమీ.” ఒక రిగ్రెట్ ఫుల్  ఎక్స్ప్రెషన్ తో అంది మల్లిక.

“నువ్వు వాడిని నేను చూపించిన ఫొటోల్లో చూసే ఒక ఐడియా కి వచ్చావు, కానీ నేను వాడిని ప్రత్యక్షంగా చూసి, వాడితో సెక్స్ పంచుకున్నాను. నా తెలివితేటలు, గ్రహణ శక్తి ఏమయ్యాయి?” నొసలు ముడేసి అంది సమీర. “నో మల్లికా, ఐ యాం నాట్ కాపబుల్ ఆఫ్ లుక్కింగ్ ఆఫ్టర్ దిస్ మచ్ ఆఫ్ బిజినెస్. ఎవడో నన్ను, దేని గురించో బుట్టలో వేసుకోడానికి ప్రయత్నిస్తే నేను పడిపోయాను. నన్నెవరయినా కూడా తేలికగా మోసం చేసేవచ్చని ఇది నిరూపిస్తూంది.”

“అలా ఆలోచించకు సమీరా. లోలోపల నువ్వెప్పుడూ వాడిని నమ్మలేదు. అందుకనే వాడిమీద ఎలాంటి ఫీలింగ్ కల్పించుకోలేదు. వాడిని పెళ్లిచేసుకోకూడదన్న నిర్ణయాన్ని కూడా చాలా తెలికగానే తీసుకోగలిగావు. నీ మీద నీకు కంట్రోల్ వుంది, నువ్వు అన్నీ విషయాల్ని తేలికగా గ్రహించగలవు కూడా. అనవసరంగా బాధపడకు.”

“ఏమో మల్లికా, కేవలం సెక్స్ కోసం వాడితో రిలేషన్ షిప్ కంటిన్యూ చేశాను. నా డాడ్ కి ప్రాణం అయిన ఈ బిజినెస్ ని నేను కంటిన్యూ చేయగలనా అని అపనమ్మకంగా వుంది.” మొహంలో ఆందోళనతో అంది సమీర.

“నో సమీ, ఇకపైన నీకు అనురాగ్ భర్తగా కూడా తోడుగా వుండబోతున్నాడు. నేనూ ఎప్పుడూ నీ కూడా వుంటాను. మేమిద్దరం నువ్వు రాంగ్ డెసీజన్స్ తీసుకోకుండా చూస్తాం. నువ్వు రిలాక్స్ గా వుండు.” సమీర చుట్టూ తన కుడిచేతిని వేసి దగ్గరకి తీసుకుంటూ అంది మల్లిక.

సమీర ఏదో అనబోతూ వుండగా కాలింగ్ బెల్ మోగింది. సర్వెంట్ మైడ్ వెళ్ళి ఓపెన్ చేయగానే, ఒక ఇరవై ఏళ్లు అలా వున్న అమ్మాయి లోపలికి ఎంటర్ అయింది. ఆ అమ్మాయి ఏం చెప్పకుండానే అర్ధం అయింది సమీరకి, ఆ స్మరణ్ మేనకోడలు ఈ అమ్మాయేనని.

&&&

“నేను అనుకున్నాను, నువ్వు ఒక పంతొమ్మిది లేక ఇరవై ఏళ్ల అమ్మాయివి అయివుంటావని. ఆ విషయంలో నా అంచనా తప్పుకాలేదు.”

ఇంట్రడక్షన్స్ పూర్తయి మేనక అక్కడ వున్న కుర్చీలో కూచున్నాక ఆమె మొహంలోకి చూస్తూ అంది సమీర.

“కానీ నేను వూహించనిది నువ్వింత అందంగా, అట్రాక్టీవ్ గా వుంటావని.”

మేనక నిజంగానే చాలా అందంగా, అట్రాక్టీవ్ గా కనిపిస్తూ వుంది సమీరకి.

“ఇన్నిరోజులూ సమీర నెక్స్ట్ ప్లేస్ నాదే అనుకునే దాన్ని. కానీ అదిప్పుడు నీకిచ్చేక తప్పదు. అంతేకాకుండా నువ్వు మా ఇద్దరికన్నా బాగా యంగ్ కూడా.” మల్లిక అంది తనూ మేనకవైపే చూస్తూ.

“నో, మాం. మిమ్మల్ని ఇద్దర్నీ చూశాక నా మీద వున్న నా ఒపీనియన్ మార్చుకున్నాను.” సర్వెంట్ మైడ్ తీసుకుని వచ్చిన కాఫీని తీసుకుంటూ చిరునవ్వుతో అంది మేనక. “నేను ఇన్ని రోజులూ చాలా అందంగా వుంటాననుకునే దాన్ని. అదెంత మాత్రం నిజం కాదు. మీ ఇద్దరూ చాలా బ్యూటిఫుల్ ఇంకా అట్రాక్టీవ్!”        

అది విన్నాక సమీర ఇంకా మల్లిక మోహ మొహాలు చూసుకున్నారు చిరునవ్వుతో.

“మమూత్ ఇండస్ట్రీస్ ఏం డీ తో సమయం స్పెండ్ చేయడం అంటే నేను చాలా అనీజీ గా ఫీల్ అయ్యాను, అలాంటి గొప్ప మనిషి నాతో ఎలా వుంటుందా అని.” కాఫీని సిప్ చేస్తూ అదే చిరునవ్వుతో అంది మేనక. “కానీ ఈ కొద్ది క్షణాలలోనే తెలిసింది, నేను మీతో చాలా హాపీ గా, ఫ్రీగా వుండగలనని.”

“మీ అంకుల్ చెప్పారు నాకు, నీ ప్రెసెంస్ చాలా ఎంజాయబుల్ గా వుంటుందని. నీతో నిజంగానే నేను టైమ్ ఎంజాయ్ చేయగలను అనిపిస్తూంది.” సమీర అంది.

“బట్ నా మాటేమిటి? ఇప్పటివరకూ నీకు నీడలా వుండేదాన్ని, నన్ను పక్కన పెట్టేస్తావా?” సమీర మొహంలోకి కోపంగా చూస్తూ అడిగింది మల్లిక.

“మామ్, మీరూ మా కూడా వుంటానంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ నేను ప్రతిక్షణం సమీరా మామ్ తో వుండక మాత్రం తప్పదు. మా అంకుల్ స్ట్రిక్ట్ ఇనస్ట్రక్షన్స్.” ఇంకా కాఫీని సిప్ చేస్తూ అంది మేనక.

“నా లైఫ్ ఏదో డేంజర్ లో వుందన్న విషయం ఒప్పుకుంటాను. కానీ అందుకు ఎవరో ఒక మనిషి నాకు నీడలా ప్రతిక్షణం వుండాల్సిన అవసరం వుందని మాత్రం అనుకోను .” అనీజీ ఎక్స్ప్రెషన్ తో అంది సమీర.  

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)