Nuli Vechani Vennela - 16 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 16

Featured Books
Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 16

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

“నాకు ఒక అక్క వుండేది, నాకన్నా ఏజ్ లో చాలా పెద్దది. ఆమె తరువాత చాలా సంవత్సరాల వరకూ నేను పుట్టలేదు. మా నాన్న ఏదో చిన్న బిజినెస్ చేస్తూ వుండేవారు ఎవరితోనో పార్టనర్ షిప్ తో . ఆ పార్టనర్ కూడా మా ఇంటికి తరుచూ వస్తూవుండేవాడు. మా పేరెంట్స్ ఇద్దరితోటి చాలా క్లోజ్ గా వుండేవాడు. ఒక ఫ్రెండ్ కూడా మాత్రమే అనుకున్నా. ఒకరోజు మా అమ్మతో బెడ్రూంలో చూశాను. ఎలా చూశానో నేను చెప్పలేను. చిన్న కుర్రాడినే అయినా ఏం జరుగుతోందో నాకు అర్ధం అయింది. వాళ్ళనేమీ అనలేక మౌనంగా వుండిపోయాను.. కానీ కోపం అపుకోలేక ఆ విషయం తరువాత మా నాన్నతో చెప్పాను.” కాస్త ఆగి, బెడ్ ఎడ్జ్ మీద కూచున్నాడు  అనురాగ్.

“రియల్లీ హారీబుల్!” తనూ బెడ్మీద నుండి లేచి డ్రెస్ చేసుకోవడం మొదలు పెట్టింది. “మరీ ఆశ్చర్య పడాల్సిన విషయం కాదు. కానీ ఒక చిన్న కుర్రాడిగా నీకది తట్టుకోవడం చాలా కష్టం.” డ్రస్ చేసుకున్నాక,  వచ్చి అనురాగ్ పక్కన కూచుని, తన కుడిచేతిని అతని చుట్టూ వేసి కళ్ళలోకి చూస్తూ అడిగింది “ఏమన్నాడు మీ డాడ్?”

“బాగా ఆశ్చర్యపడాల్సిన విషయం అప్పుడే జరిగింది. నాతో మా నాన్న అన్నదేమిటంటే నేను చిన్న కుర్రాడినని, అలాంటి విషయాలు పట్టించుకోకూడదని.”

“ఆశ్చర్యం లేదు. అలాంటి మగాళ్లు కూడా వున్నారు.” సమీర అంది. “డబ్బు కోసమో వేరే అవసరాల కోసమో భార్యల్ని వేరే మగవాళ్ళ దగ్గరకి పంపించే భర్తలు, అందుకు ఒప్పుకొనే భార్యలు కూడా వున్నారు. కాకపోతే అలాంటి భార్యాభర్తలు నీ పేరెంట్స్ కావడం జస్ట్ నీ బాడ్ లక్!”

“తరువాత వాడు మా అక్కతో కూడా కనిపించాడు. వాళ్ళిద్దరినీ అదే గదిలో అలాగే చూశాను. అంతేకాదు అప్పటికి ఇంకొంచెం పెద్దవాడిని కూడా.”

“మీ అక్కకి అప్పటికి పెళ్లి కాలేదా? వ్యభిచరించే వాడికి వాళ్ళు వీళ్ళు అని తేడా ఏమిటి? అలాగే తల్లి అలా చేస్తూన్నప్పుడు కూతురు అలా చేస్తూండడం లో ఆశ్చర్యం లేదు.” నిజానికి అనురాగ్ చెప్పిన విషయం సమీర ని మాక్సిమం షాక్ చేసినా, అది మొహంలోనూ ఇంకా మాటల్లోనూ బయట పడకుండా అంది.

“పెళ్లి అయింది. తన మొగుడు అంతో ఇంతో బాగానే సంపాదిస్తూ వుండేవాడు కూడా. కానీ ఏవో గొడవలతో  మా ఇంట్లోనే వుండేది.”

“బహుశా అతనితో సంసార సుఖం లేకపోవడమే అందుకు కారణం కావచ్చు.”

“అయితే మాత్రం తల్లితో పడుకున్న వాడితో పడుకుంటుందా?”

“వాడు తన తల్లితో కూడా వ్యభిచరిస్తూన్న విషయం తనకి తెలిసి వుండకపోవచ్చు.”

“తెలిసి వుండదని నేననుకోవడం లేదు.”

“దటీజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అనురాగ్” అనురాగ్ చుట్టూ తన చేతిని తీసి, బెడ్ మధ్యలో కంఫర్టబుల్ గా సెటిల్ అవుతూ అంది సమీర. “నీ పేరెంట్స్ ఇంకా సిస్ అలా బిహేవ్ చేయడానికి కారణం ఏమిటన్నది నేను చెప్పలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. అందువల్ల వాళ్ళ  మీద నువ్వు ద్వేషం పెంచుకుని వుంటే మాత్రం, ప్లీజ్ అది మర్చిపోయి వాళ్ళని క్షమించు. అంతకన్నా భయకరమైన పాపాలు చేసిన వాళ్ళే చాలా హాపీగా తిరుగుతున్నారు ఈ లోకంలో.”

వెంటనే సమీరని కౌగలించుకుని తన రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు అనురాగ్. “నువ్విలా అంటావు అనుకోలేదు సమీ. ఇది వినగానే నా మీద నీ అభిప్రాయం మారిపోతుందనుకున్నాను. కానీ నీకు చెప్పకుండా వుండలేకపోయాను.”

“నేనేం అక్రమ సంబంధాలని సపోర్ట్ చేయడం లేదు అనురాగ్. కానీ ఎలాంటి పరిస్తితులు వాటికి దారి తీస్తాయో మనకి తెలియదు. ఫైనాన్షియల్ రీజన్స్ కావచ్చు, లేదా సెక్సువల్ ఆర్జ్ తట్టుకోలేకన్నా కావచ్చు.” అనురాగ్ ని కౌగలించుకుని, తనూ కూడా అతని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాక, అతన్ని వదిలి, అతని కౌగలిని విడిపించుకుని అంది సమీర. “నన్నే చూడు. నా ఫ్రెండ్ తో కూడా సెక్స్ చేస్తున్నాడు అని తెలియగానే ఆ తరంగ్ అంటే ఏవగింపు కలిగింది. మళ్ళీ వాడితో అది చేయకూడదనుకున్నాను. కానీ వుండలేకపోయాను. ఆ నిరంజన్ నాకు అబద్ధం చెప్పి, మోసం చేయాలని చూసినా వాడితోనూ సెక్స్ చేశాను. కొన్ని సమయాల్లో ఆ  సెక్సువల్ ఆర్జ్ అలా వుంటుంది.”

అనురాగ్ గట్టిగా నిట్టూర్చి వూరుకున్నాడు ఏం మాట్లాడాలో తెలియక.

“కొన్ని సందర్భాలలో ఫైనాన్షియల్ డిఫికల్టీస్ కూడా అలాగే వుండొచ్చు. డబ్బు బాగా వున్నప్పుడు ఆ విషయం తెలియక పోవచ్చు. కానీ లేనప్పుడు పేదరికం తట్టుకోవడం, అప్పులు తట్టుకోవడం చాలా కష్టం. మీ వాళ్ళు అప్పట్లో ఎలాంటి పరిస్తితుల్లో వున్నారో నీకు తెలియదు కదా.”

“ఫైనాన్షియల్ గా నీకు ఏ  ఇబ్బందులు లేక పోయినా, నీకు ఈ విషయం అర్ధం కావడం నాకు ఆశ్చర్యం గానే వుంది.” చిరునవ్వుతో అన్నాడు అనురాగ్.         

“ఫైనాన్షియల్ గా నాకు ఏ  ఇబ్బందులు లేకపోవచ్చు. కానీ డబ్బు లేకపోతే వచ్చే కష్టాల్ని అర్ధం చేసుకోగలిగే కామన్ సెన్స్ నాకుంది.” నిట్టూర్చి అన్నాక, అంతలోనే అడిగింది “ఇంతకీ ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కడ వున్నారు, ఏం చేస్తున్నారు?”

“నా పేరెంట్స్ ఇద్దరూ చనిపోయారు. నా అక్క తన హస్బండ్ తోనే వుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ వుంటుంది. నేను మామూలుగానే మాట్లాడుతూ వుంటాను.”

“నువ్వు తనని వాడితో అలా చూసిన విషయం తనకి తెలుసా?”

“తెలుసును. అప్పటికి నేను మరీ చిన్న పిల్లడిని కాకపోవటం వల్ల అడిగేసాను. తనలా నాకూ సెక్స్ లో సుఖం లేకపోతే తప్ప తన బాధ అర్ధం కాదని చెప్పింది. అదే నిజం అయితే వేరే ఎవరినన్నా వెదుక్కోమని మా అమ్మతోనే పడుకుంటున్న వాడితో వద్దని చెప్పాను. నాకు ఇంకా షాకింగ్ ఏమిటంటే ఆ విషయం తనకీ తెలిసినట్టే వుంది. ఏం మాట్లాడలేదు.” అనురాగ్ కాస్త ఆగి అన్నాడు. “మా వాళ్ళిద్దరూ వాడంటే అలా మోజు పడడానికి కారణం, డబ్బు వుండటమే కాదు, వాడు కాస్త చూడటానికీ బాగానే వుండేవాడు.”       

సడన్గా ఒక ప్రశ్నార్ధక ఎక్స్ప్రెషన్ వచ్చింది సమీర మొహంలోకి. “ఇంతకీ నువ్వు నీకు చాలా మంది ఆడ వాళ్ళతోటి సంబంధాలు వున్నాయన్నావు కదా, అదెలా జరిగింది?”

“మర్చిపోలేదా అది నువ్వు?” మళ్ళీ చిరునవ్వు నవ్వాడు అనురాగ్.

“మర్చిపోలేదు.” తనూ చిరునవ్వు నవ్వింది సమీర. “అందులో ఎక్స్పీరియన్స్ అలా లేకపోతే నన్ను అంతలా సుఖపెట్టడం కూడా నీకు సాధ్యమయ్యేది కాదు కదా. అభ్యంతరం లేకపోతే చెప్పు.”

“నా ఫామిలీ కి సంబంధించి అలాంటి విషయాలే చెప్పినవాడిని. ఇది చెప్పడంలో అభ్యంతరం ఏముంటుంది?” గట్టిగా నిట్టూర్చి అన్నాడు అనురాగ్. “మా అమ్మని, అక్కని వాడితో అలా చూశాక, నాకు సెక్స్ మీద విరక్తి పుట్టింది. ఎప్పుడూ సెక్స్ చేస్తాను, దానిని ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు.” కాస్త ఆగాడు అనురాగ్. “నువ్వు చెప్పింది కూడా నిజమే. ఫైనాన్షియల్ గా కస్టాలు కూడా మా వాళ్ళ  అలాంటి ప్రవర్తనకి కారణం కావచ్చు. నేను డిగ్రీ చదువుతూన్న రోజుల్లో నాకు డబ్బులు లేక ఒక కిరాణా కొట్టు యజమాని దగ్గర పార్ట్ టైమ్ జాబ్ చేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వెళ్లాల్సి వచ్చేది. అలాగే ఒకసారి ఎవరూ లేనప్పుడు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అతని భార్య నన్ను అది తనతో చేయమని బలవంతం చేసింది. చేయకపోతే కనక, నేను తనని రేప్ చేయడానికి ప్రయత్నం చేశానని అందరికీ చెప్తానంది. దానితో నాకు చెప్పలేదు.”

“మై గాడ్! నీకు మొదటి అనుభవం అలా జరిగిందా?” గట్టిగా నవ్వి అంది సమీర. “సారీ. నాకెందుకో ఇది విన్నాక నీ మీద జాలి కన్నా నవ్వే వస్తూంది.”

అనురాగ్ కూడా నవ్వాడు. “ఆ నా బాస్ తరచూ నన్ను వాళ్ళింటికి పంపించేవాడు. తరచూ మా మధ్య అది జరిగేది. ఒకరోజు తను నాతో చెప్పింది. మా మధ్య జరిగేది తన భర్తకి తెలుసని, తను కావాలనే నన్ను వాళ్ళింటికి పంపిస్తున్నాడని. అతను తనని అందులో సుఖపెట్ట లేకపోవడం వల్ల, తను అప్పుడప్పుడు అలా సుఖపడడానికి ఒప్పుకున్నాడు. నన్ను చూసి, నన్ను ప్రత్యేకంగా కావాలనుకుంది. సొ తరువాత జరిగిందది.”

“సో అయ్యగారికి అందులో అంత మెలకువకి కారణం అదన్నమాట.” మరోసారి నవ్వింది సమీర.

“మొదలు పెట్టడం అయిష్టంగానే అయినా, తరువాత నేనూ ఇష్టం గానే చేశాను. ముఫైఏళ్ల వయసులో, మంచి పరువంతో, చాలా అందంగానే వుండేది. అలాంటి మనిషిని ఏమీ చేయలేకపోవడం, వాళ్ళాయన దురదృష్టం.” తనూ చిరునవ్వు నవ్వాడు అనురాగ్. “ఎంతవరకూ నిజమో తెలియదు. వాళ్ళాయన కాకుండా తను సెక్స్ చేసిన మొదటి వ్యక్తిని నేనేనని చెప్పింది.”

“ఐ సీ. ఇంటరెస్టింగ్!” చిరునవ్వుతో అంది సమీర.

“ఇంకా ఇంటరెస్టింగ్ అయిన విషయం ఇందులో ఇంకొకటి వుంది. నేనలా తనతో సెక్స్ చేయడం వాళ్ళాయన కి కేవలం తప్పక మాత్రమే కాదు, తనది ఇష్టపడి ఎంజాయ్ చేసే వాడనుకుంటాను. నేను అక్కడ పనిచేసినంత కాలం నాకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది వుండేది కాదు.”

“అంటే నీ చదువు మొత్తం అలా వచ్చిన డబ్బుతో చక్కబెట్టేశావా?”

“అలాగే అనుకో.” గట్టిగా నిట్టూర్చి అన్నాడు అనురాగ్. “నాకు సెక్స్ లో సుఖం మాత్రమే కాదు, బాగా అనుభవం వచ్చింది అక్కడే. ఎస్, నువ్వనుకుంటున్న నైపుణ్యం నాకు అక్కడే వచ్చింది. కాకపోతే నాకు ఆవిడ తో తప్ప ఇంకెవరితోటీ అలాంటి సంబంధం లేదు. కొన్నిసార్లు అలాంటి అవకాశం వచ్చినా, చేస్తూన్న ఆ ఒక్క తప్పు చాలనుకున్నాను.”

"పెద్దమనుషులు కాని అమ్మాయిలతో పాటుగా నలభై ఏళ్ళు పైబడ్డ ఆంటీలతో కూడా నీకు అనుభవం ఉందని చెప్పావుగా."  నొసలు చిట్లించింది సమీర. 

"నీ ఫీలింగ్ లో ఎమన్నా మార్పు వస్తుందేమోనన్న అభిప్రాయంతో ఆలా అన్నాను. కానీ నాకు అనుభవం ఈ ఒక్క ఆంటీ తో మాత్రమే వుంది." నిట్టూరుస్తూ అన్నాడు అనురాగ్.

"చాలా డిజప్పోయింట్ చేసావు నువ్వు నన్ను. ఇంకా ఇలాంటిది చాలా వినొచ్చు అనుకున్నా నీ దగ్గరనుండి." ఒక డిజప్పోయింట్ ఎక్సప్రెషన్ అభినయిస్తూ అంది.

"సారీ ఫర్ డిజప్పోయింటింగ్ యు." తనూ ఒక రిగ్రెట్ఫుల్ ఎక్సప్రెషన్ అభినయిస్తూ అన్నాడు అనురాగ్.

“ఇంక చెప్పడానికి ఏం లేదా మరి?” తరువాత ఇంకేం మాట్లాడకుండా కూర్చున్న అనురాగ్ ని చూసి అడిగింది సమీర.

“దటీజ్ ఆల్. అంతకన్నా ఇంకేమీ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి లేదు.”

“ఒకే. మరి ఈ రోజుకి వెళ్ళి వస్తాను.” బెడ్ మీద నుండి కిందకి దిగింది సమీర.

“రేపు మార్నింగ్ టెన్ థర్టీ అలాగ ఆ డిటెక్టివ్ ని మనం ఆఫీసు లో కలుస్తున్నాం, గుర్తుంచుకో.” తనూ బెడ్ మీద నుండి దిగి ఆమెకి అపొజిట్ లో నిలబడుతూ అన్నాడు అనురాగ్.

“తప్పుతుందా?” అనురాగ్ ని మరోసారి కౌగలించుకుని, అతని రెండు బుగ్గల మీద ముద్దు పెడుతూ అంది సమీర.

“ఇనఫ్ కిసెస్ ఫర్ ద డే. ప్లీజ్ గో.” తనూ ఆమె రెండు బుగ్గలనీ ముద్దు పెట్టుకున్నాక, ఆ కౌగిలినుండి విడిపించుకుంటూ అన్నాడు అనురాగ్.

“ఒకే బై.” తరువాత అక్కడనుండి తిన్నగా ఇంటికి వచ్చేసింది సమీర.

&&&

“నీ లవర్ కి సంబంధించిన సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఇది తనకి తెలిస్తే ఏమనుకుంటాడు? తనకి ద్రోహం చేస్తున్నట్టుగా నీకు అనిపించలేదా?” అనురాగ్ గురించి సమీర చెప్పింది మొత్తం విన్నాక అడిగింది మల్లిక.

“ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకోలేదు. అందుకనే నీకు చెప్పేసాను. “ నవ్వింది సమీర. “నీ దగ్గర నేను ఏ విషయం చెప్పకుండా వున్నాను చెప్పు? మనిద్దరం అంత క్లోజ్ కదా.”

“అఫ్కోర్స్ , ఎస్.” నవ్వింది మల్లిక

“అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను, రేపే ఆ డెటెక్టివ్ నన్ను ఆఫీస్ లో కలువబోతూ వున్నాడు. నువ్వూ వస్తావా, ఇద్దరం మాట్లాడదాం.”

“తప్పకుండా అలాగే. నాకూ ఏ అభ్యంతరం లేదు.” మల్లిక అంది. “ఇలాంటి డిటెక్షన్స్ అవీ సినిమాలలోనూ ఇంకా నవల్స్ లోనూ తప్ప వేరే రకంగా తెలియదు. నాకూ ఇంటరెస్టింగ్ గానే వుంది.”

“అయితే ఇంక పడుకుందాం. ఆఫీస్ వర్క్ తో చాలా అలసిపోయాను.” బెడ్ మీదకి వాలిపోతూ అంది సమీర.

“నువ్వీరోజు అలసిపోయింది ఆఫీస్ వర్క్ తో అనిమాత్రం అనిపించడం లేదు.” తనూ సమీర పక్కనే పడుకుంటూ అంది  మల్లిక. “బాగా సుఖపెట్టాడా?”

“నీ ఊహ కరక్టే.” నవ్వి కళ్ళు మూసుకుంది  సమీర. ఎప్పుడు నిద్రలోకి జరిపోయిందో తనకే తెలియలేదు.

&&&

“ఐ యామ్ డిటెక్టివ్ స్మరణ్.” తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ కుర్చీలో కూచున్న స్మరణ్ వంక ఆసక్తిగా చూసింది సమీర. ఇంచుమించులో యాభైయేళ్ల వయసుతో ఆకర్షించేలా వున్నాడు. “నేను ఎప్పుడూ పర్సనల్ గా కలిసి మాట్లాడక పోయిన, మీ నాన్నగారి గురించి చాలా మంచి వ్యక్తి అని విన్నాను. ఆయన కూతురుగా మీకు ఉపకారం కావడం నాకు ఆనందం కలిగించే విషయం.”

ఆ సమయం లో సమీర తో పాటుగా అనురాగ్ ఇంకా మల్లిక కూడా వున్నారు. సమీర కి అపొజిట్ గా వున్న కుర్చీల్లో, స్మరణ్ కి ఇరుపక్కలా వున్న కుర్చీల్లో ఎడమపక్క మల్లిక ఇంకా కుడిపక్క అనురాగ్ కూచుని వున్నారు.

“థాంక్ యు వెరీ మచ్ మీరిలా వచ్చి నన్ను కలిసినందుకు.” నవ్వింది సమీర. “కానీ నాకు ఎక్కడనుండి మొదలు పెట్టాలో, ఏం చెప్పాలో బోధపడడం లేదు.”

“మీరు చెప్పడం మొదలుపెట్టడం కన్నా ముందుగానే, నేను మీకు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.” స్మరణ్ అన్నాడు. “నేను డిటెక్షన్ మొదలు పెట్టాక నాకు మీనుండి అన్నీ విషయాల్లోనూ ఫుల్ కొ-ఆపరేషన్ కావాలి. నేను అవసరమనుకుని చేద్దామనుకున్న దేనికీ మీరు అడ్డుపెట్టకూడదు. అంతేకాదు మీరు అన్నీ విషయాలు ఏ అరమరికలు లేకుండా నాతో షేర్ చేసుకోవాలి.”

అది విన్నాక అనురాగ్ మొహంలోకి ఇబ్బందిగా చూసింది సమీర.

“స్మరణ్ అనవసరమైనది ఏదీ ఆడగరు, చేయమనరు. నువ్విందులో ఇబ్బంది పడడానికి ఏమీ లేదు.” అనురాగ్ అన్నాడు.

“ఎస్ సమీ. ఇంతవరకూ వచ్చాక ఇంక ఏమీ ఆలోచించకు. ఈ డిటెక్షన్ అవసరమని నాకూ అనిపిస్తూంది.” మల్లిక అంది.

“ఆల్ రైట్ దెన్, ఐ అగ్రీ టు యువర్ కండిషన్స్.” తలూపుతూ అంది సమీర.         

“నువ్వు మీ డాడ్ ఫోన్ చేయడం నుండి మొదలు పెట్టు. అక్కడనుండి చాలా ఆప్ట్ అనిపిస్తూంది నాకు.” మల్లిక అంది సమీర సంశయం తనకి గుర్తుకు వచ్చినట్టుగా.

“ఒకే దెన్.” అలా అన్నాక తన డాడ్ తనూ మాట్లాడుకున్నది, తన డాడ్ విషయం ఏమిటో చెప్పకుండా తనని అర్జెంట్ ఇంటికి రమ్మనడం, ఇంటికి వచ్చాక తన డాడ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయివుండడం అంతా వివరంగా చెప్పింది సమీర. “మా డాడ్ తనతో ఎంతో క్లోజ్ గా వున్న వాళ్ళతో కూడా ఆ విషయం షేర్ చేసుకోలేదు. చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. నా డాడ్ చనిపోయారన్న బాధ ఒకవైపు అయితే, ఏం చెప్పాలనుకుని చెప్పకుండా చనిపోయారా అన్న బాధ ఇంకో వైపు. ఆ విషయం ఎలా తెలుసుకోవాలన్నది బోధపడడం లేదు.”

“ఐ సీ” సాలోచనగా తలూపాడు స్మరణ్ “మీ డాడ్ కి డైరీ రాసే అలవాటు ఏమన్నా వుందా?”

“ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.” అక్కడ డ్రా లో వుంచిన తన డాడ్ డైరీ ని బయటకి తీసింది సమీర. “మా డాడ్ కి డైరీ రాసే అలవాటు వుంది కానీ, రెగ్యులర్ గా రాయరు. ఏమైనా ముఖ్యమైన విషయాలు వున్నప్పుడు మాత్రం వ్రాస్తారు. ఇది చూడండి.” తన డాడ్ డైరీలో చనిపోబోయే ముందు రాసిన ఆ పేజీ ని ఓపెన్ చేసి స్మరణ్ కి ఇచ్చింది సమీర.

ఆసక్తిగా అదంతా చదివాక ఆ డైరీని మూసి మధ్య వున్న టేబల్ మీద పెట్టాక అడిగాడు స్మరణ్. “ఇందులో మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించారా?”

“ఏమిటది?” ఆసక్తిగా అన్నాక అనురాగ్ ఇంకా మల్లిక మొహాల్లొకి చూసింది సమీర. వాళ్ళ మొహాల్లో కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ వుంది.

“ఆయన మీతో అంతగా చెప్పదలుచుకున్న విషయం మీకు పరిచయం లేనిది కాదు. మీరు వూహించలేకపోతున్నారు అంతే.”

“వాట్?” ఆశ్చర్యంగా అరిచింది సమీర. “అలా అని మీరెలా చెప్పగలరు?”

“అందులో మీ డాడ్ ఆ విషయం మీరెప్పటికీ నమ్మరన్నట్టు గా అభిప్రాయపడ్డారు. అది ఒకవేళ ఏదో కొత్త విషయమే అయితే మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం ఏం వస్తుంది?”

“యు ఆర్ రైట్!” ఒక అప్రసియేటివ్ ఎక్స్ప్రెషన్ తో అంది సమీర. “మరి అదేమిటో నేనెందుకు వూహించలేకపోతున్నాను?”

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)