Nuli Vechani Vennela - 12 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 12

Featured Books
Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 12

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"అసలు ఏం జరిగింది? ఎక్కడనుండి ఆ ఫోన్ కాల్?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మల్లిక.

"లాస్ట్ నైట్ నిరంజన్ హార్ట్ ఎటాక్ తో పోయాట్ట." సమీర అంది. "ఆ ఫోన్ చేసింది ఎవరో నాకు తెలియదు."

"వాట్?" నమ్మలేనట్టుగా చూస్తూ అంది మల్లిక. "థర్టీ టు ఇయర్స్ యంగ్ మాన్. అతను హార్ట్ ఎటాక్ తో పోవడం ఏమిటి? ఎదో ప్రాంక్ కాల్ అయివుంటుంది."

"అలా కూడా కావచ్చు." అలా అన్నాక సడన్గా గుర్తుకువచ్చింది సమీరకి. "ఎదో వీడియో క్లిప్ పంపిస్తానన్నాడు. చూద్దాం."

సెల్ ఫోన్ తీసుకుని చూస్తే, నిజంగానే ఎదో వీడియో క్లిప్ వాట్సాప్ లో వేచివుంది. ఆతృతగా ఆ వీడియో క్లిప్ ని ఓపెన్ చేసి చూసింది సమీర. మల్లిక కూడా అంతే అతృతతో అదే చూస్తూంది.

"ఇట్ ఈజ్ రియల్లీ వెరీ మచ్ షాకింగ్ దట్ సచ్ ఏ యంగ్ మాన్ డైయింగ్ విత్ హార్ట్ ఎటాక్."

నిరంజన్ శవం చుట్టూ జనాలు వున్నారు. వాళ్లలో ఎవరో అది అన్నారు. వాళ్ళందరూ ఇంకా ఎదో, ఎదో మాట్లాడుకుంటూ వున్నారు. వాళ్ళందరి మధ్య నిరంజన్ శవం మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తూ వుంది.

"ఇంక సందేహం ఏమీ లేదు. ఆ నిరంజన్ చనిపోయాడు." వన్ మినిట్ లాగ వున్నా ఆ వీడియో క్లిప్ ఎండింగ్ కి రాగానే, సెల్ మళ్ళీ ముందున్న టేబుల్ మీద పడేస్తూ అంది మల్లిక.

"నీకసలు ఏమీ అనిపించడం లేదా సమీ. మీరిద్దరూ ఒకప్పుడు గుడ్ లవర్స్." సమీర మొహం లోకి ఆశ్చర్యంగా చూస్తూ అంది మల్లిక.

"ఆ మాట కొస్తే నేనెప్పుడూ వాడిని లవ్ చేశాననుకోను.కేవలం ఆ సుఖం కోసమే వాడితో పడుకున్నాను. అందుకనే వాడికి పెళ్లయిపోయింది అని తెలిసాక, నేనేమీ అఫక్ట్ అవ్వలేదు. ఈజీ గా మర్చిపోగలిగాను." తేలిగ్గా అంది సమీర.

"కానీ నువ్వు ఇప్పుడు కూడా వాడితో అప్పుడప్పుడు మాట్లాడుతూనే వున్నావు."

"ఎస్, అవును." తలూపింది సమీర. "వాడు తరువాత చాలా పశ్చాత్తాపపడి, ప్రాధేయ పడ్డాడు. తనకీ, తన వైఫ్ కి డివోర్స్ అయిపోయిందని, ఇద్దరూ కలిసి లేరని చెప్పాడు. వాడిని క్షమించగలిగాను, మేమిద్దరం మళ్ళీ కొన్నిసార్లు సెక్స్ కూడా చేసుకున్నాం. కానీ వాడంటే ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా మాత్రం ఫీలవ్వలేకపోయాను. నిజానికి ఇది నాకు వాడు నాతో అబద్ధం చెప్పాడని మాత్రమే కాదు. వాడంటే నాకు మొదటినుండి సెంటిమెంటల్, ఇంక ఎమోషనల్ ఫీలింగ్ లేదు. అందుకనే ఇప్పుడు వాడి బాడీని చూస్తూ వున్నా, నాకేం అనిపించలేదు."

"నిజంగా వెరీ గుడ్ థింగ్! నువ్వలా లేకపోయుంటే, ఇప్పుడు వీడిలా పోయినందుకు ఎంతో ఫీలయి వుండేదానినివి. అసలే అంకుల్ పోయిన డిప్రెషన్ నుండి ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నావు." సమీరని కౌగలించుకుని, తన కుడి బుగ్గ మీద ముద్దుపెట్టుకుంటూ అంది మల్లిక.

"యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్." నవ్వుతూ అంది సమీర.   

&&&

ఎమోషనల్ గా నిరంజన్ గురించి ఏమీ ఫీలవ్వక పోయినా, తన మరణ వార్త తెలిసాక చాలా అనీజీ గా వుంది సమీరకి. తరంగ్ తో తను సుఖం అలా అనుభవించింది, వాడలా చనిపోయాడు. నిరంజన్ కూడా తనని తరంగ్ ఎంత సుఖపెట్టాడో, అంతా సుఖపెట్టాడు. ఇప్పుడు నిరంజన్ కూడా ఇలా చనిపోయాడు. తనతో పడుకోవడం వల్లే వీళ్ళిద్దరూ ఇలా చనిపోయారా? తనలోనే తనతో పడుకున్నవాళ్ళని చంపేసే లక్షణం ఉందా? భయంగా వుంది సమీరకి ఆలోచిస్తూంటే.

నిజానికి తరంగ్ అలా చనిపోయాక, వెళ్లి వాడి డెడ్ బాడీ చూడకపోయినా, ప్రతిసారీ సెక్స్ గుర్తుకు వచ్చినప్పుడల్లా వాడే గుర్తుకు వచ్చేవాడు. ఆ ఆక్సిడెంట్ తరువాత వాడి బాడీ ఎంత భయంకరంగా మారిపోయిందో వాళ్ళు, వీళ్ళు అనుకున్న మాటలు గుర్తుకు వచ్చి, వాడి బాడీ తన మనసులో అలా ఇమాజిన్ అయ్యేది. దానితో చాలా రోజులు సెక్స్ గురించే మరిచిపోయింది మళ్ళీ నిరంజన్ పరిచయం అయ్యేవరకూ .

అమెరికా లో తమ ప్రొడక్ట్స్ సెల్ చేస్తూవున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మీట్ నిర్వహించినప్పుడు, రీసెంట్ గానే తమకి పరిచయం అయి బాగా పెరఫార్మ్ చేస్తూన్న ఒక డిస్ట్రిబ్యూటర్ తో కలిసి మీటింగ్ కి వచ్చాడు నిరంజన్. ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నిరంజన్ చీఫ్ ఆఫీసర్ మాత్రమే కాకుండా, అతనికి మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే  ఆ తరువాత నుండి ఆ డిస్ట్రిబ్యూటర్ బదులుగా నిరంజనే వచ్చి తనని కలిసేవాడు.

అలా నిరంజన్ తో పరిచయం కలిగింది. ఆ పరిచయం మంచి స్నేహం గా కూడా మారింది. అంత మంచి స్నేహంగా మారడానికి తను కూడా కారణం. మంచి హ్యాండ్సమ్ పెర్సనాలిటీ తో వున్ననిరంజన్ తనని బాగా ఆకర్షించాడు. చాలా రోజుల తరువాత సెక్స్ మీద మళ్ళీ తనకి ఆసక్తి కలిగింది.

"నేను అమెరికా లో సెటిల్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇండియా అంటే నాకు ప్రాణం. నేను ఎప్పటికైనా ఇండియన్ అమ్మాయినే పెళ్లి చేసుకుని, ఇండియా లోనే సెటిల్ అవుతాను." 

తనతో అన్నివిషయాలు షేర్ చేసుకునేవాడు. వాటిల్లో ఇదొకటి. తానొక ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఈ డిస్ట్రిబ్యూటర్ తనకి మంచి ఫ్రెండ్ ఇంకా మంచి శాలరీ కూడా ఆఫర్ చెయ్యడం తో కాదనలేకపోయాడు ఇంటి దగ్గర డబ్బు అవసరం కూడా ఉండబట్టి.  కానీ ఇండియాలోనే సెటిల్ అవ్వాలని తన కోరిక.

"నువ్వెప్పుడూ కావాలనుకున్నానీకొక మంచి జాబ్ మా కంపెనీలో ఇక్కడ వచ్చే శాలరీ కన్నా రెట్టింపు శాలరీ తో సిద్ధంగా ఉంటుంది." తను చెప్పింది.

"నో, అది మాత్రమే సరిపోదు." చిరునవ్వుతో అన్నాడు తను. "ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇండియా లో సెటిల్ అవ్వాలన్నది నా కోరిక. నీ కంపెనీలోనే కాదు, నీ జీవితంలో కూడా చోటిస్తానంటే ఆలోచిస్తాను."

తనకి అభ్యంతరం ఏమీ కనిపించలేదు. నిరంజన్ కేవలం హ్యాండ్సమ్ గా ఉండడమే కాదు, తాము చేసే బిజినెస్ ఫీల్డ్ లో మంచి పరిచయం వున్నవాడు కూడా. తనకి లైఫ్ పార్టనర్ అయితే తనకి మాత్రమే కాదు, తమ కంపెనీకి కూడా బాగా ఉపయోగ కరంగా వుండగలడు. ఇంక ఒక్క విషయంలో మాత్రమే తన కెపాసిటీ తెలియాలి.

ఆ విషయంలో కూడా పెద్దగా ఆలస్యం కాలేదు. సెక్స్ లో సుఖ పెట్టడం లో తరంగ్ ఎంత అఫిషియంట్ అని ప్రూవ్ చేసుకున్నాడో, తనూ అంత అఫిషియంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సో, తనకి అనురాగ్ ని లైఫ్ పార్టనర్ గా యాక్సప్ట్ చెయ్యడంలో ఎలాంటి అభ్యంతరం కనిపించలేదు. వీలు చూసుకుని తన డాడ్ తో ఆ విషయాలు చర్చించాలనుకుంది.

పనున్నా లేకపోయినా తనని కలవడానికి వస్తూ వుండేవాడు. అతను తనని కలిసిన ప్రతిసారి సెక్స్ చేసుకుంటూ ఉండేవారు.

ఇలా ఉండగా ఒక రోజు అతని సెల్ ఫోన్ లో ఎదో రొమాంటిక్ వీడియో చూస్తూ ఇద్దరూ సెక్స్ చేసుకున్నారు. తనలో వేడి దింపుకున్నాక, సెల్ ఫోన్ బెడ్ మీదే వదలి బాత్రూం లోకి వెళ్ళాడు అనురాగ్. జస్ట్ అప్పుడే తాము అతని సెల్ ఫోన్ లో చూస్త్తూన్న వీడియో ఎండింగ్ కి వచ్చింది.

అతని సెల్ ఫోన్ లో ఇంకేం ఉన్నాయో అని చూడ్డం మొదలు పెట్టింది. ఫొటోస్ లోకి వెళ్లి చూస్తూ ఉండగా, అతను ఒక అమ్మాయి తో ఇంటిమేట్ గా వున్న ఫోటో లు కనిపించాయి. ఇంక చూస్తూ ఉంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఫోటోలు కూడా అందులో వున్నాయి.

"ఇప్పుడు ఇంక నీతో అబద్ధం చెప్పదలుచుకోలేదు. నాకు తనతో పెళ్లి అయింది. మా పెళ్లి ఒక పెద్ద మిస్టేక్! ఆ విషయం పెళ్లయిన కొద్దిరోజుల్లోనే మేమిద్దరం గ్రహించాం. అందుకనే ఇద్దరం అంగీకారంతో విడాకులు కూడా తీసుకున్నాం. తనకి మళ్ళీ పెళ్లి కూడా అయిపోయింది."

తమకి విడాకులు వచ్చి, తనకి మళ్ళీ పెళ్లి కూడా అయిపోతే, తనెందుకు ఇంకా తన  ఫోటోలు తన సెల్ ఫోన్ లో వుంచుకున్నాడని తను అడగలేదు. తనకి అడగాలనిపించలేదు. నిజానికి తను తెలుసుకున్న ఆ న్యూస్ తనని ఏ విధం గాను ఎఫెక్ట్ చెయ్యలేదు.

అదే తనకి అప్పుడూ, ఇప్పుడూ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ వుంది. తనకి సెక్స్ సుఖం కోసం తప్ప, తన లైఫ్ పార్టనర్ మీద ఏ ఎమోషన్ ఉండదా? తరంగ్ తో తను సెక్స్ లో అలా సుఖం అనుభవించినా, వాడు చచ్చి పోయాడన్నాక వాడి గురించి ఏమీ అనిపించలేదు. ఇప్పుడు తను లైఫ్ పార్టనర్ చేసుకుందామనుకున్న నిరంజన్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందన్న మాట తెలిసినా తనకి ఏమీ అనిపించలేదు. కేవలం డిసిజేన్ మారింది అంతే. తమ కంపెనీకి సంభందించిన రా మెటీరియల్ విషయంలో, డిస్ట్రిబ్యూటర్ విషయంలో మార్చుకున్నంత తేలికగా డిసిజేన్ మార్చుకుంది. ఇంక నిరంజన్ ని పెళ్లి చేసుకునే సమస్యే లేదు. తనకి తన లైఫ్ కన్నా, సెక్స్ లో సుఖం కన్నా కూడా, తమ బిజినెస్ ఎక్కువ ఇంపార్టెంట్. తనతో అంత ఇంపార్టెంట్ విషయంలో జెన్యూన్ గా వుండలేనివాడు తనకి లైఫ్ పార్టనర్ గా వస్తే, తను తమ బిజినెస్ కి ఎంతో ముఖ్యం కావడం వాళ్ళ అది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం వుంది.

అయితే తన మారిన నిర్ణయం, తనతో సెక్స్ సుఖం అనుభవించడానికి మాత్రం అడ్డుకాలేదు. ఆ తరువాత కూడా ఇద్దరూ ఎప్పట్లాగే సెక్స్ ని ఎంజాయ్ చేసే వారు. బిజినెస్ రేలషన్శిప్ కూడా ఏ తేడా లేకుండా అలానే వుంది.

"మన పెళ్లి విషయం మీ డాడ్ తో ఎప్పుడు మాట్లాడతావు?" ఒకరోజు రాత్రి ఇద్దరూ పూర్తిగా సెక్స్ ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుతోన్న సమయంలో అడిగాడు నిరంజన్.

"సారీ నిరంజన్ ఆ విషయం లో నా నిర్ణయం మారింది." నిజానికి ఆ మూమెంట్ వరకు వాడికి తను వాడిని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మార్చుకుందని చెప్పలేదు. "నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. ఇది కంఫర్మ్డ్."

"ఓహ్, సమీ..................." గాభరాగా అన్నాడు వాడు. "....................చెప్పాగా మాకిద్దరికీ విడాకులు కూడా ఎప్పుడో అయిపోయాయి. పెళ్లయ్యాక మేమిద్దరం రెండునెలలు కన్నా ఎక్కువ కలిసి లేం. నువ్వు నీ నిర్ణయం మార్చుకోకు ప్లీజ్."

"ఆల్రెడీ మారిపోయింది నిరంజన్. ఇంక మారిన నా నిర్ణయం మాత్రం మారదు. నిన్ను నేను పెళ్లి అయితే చేసుకోలేను. ఇప్పుడు నీకు నాతొ సెక్స్ కష్టం గా ఉంటే, ఇద్దరం మర్చిపోదాం ఆ విషయం." నిజానికి వాడితో సెక్స్ మర్చిపోవడం చాలా కష్టం. దేనిమాట ఎలా వున్నా అంతగా సుఖపెడుతున్నాడు వాడు తనని సెక్స్ లో. తన మనసుని చాలా ఎదిరించి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

వాడు తన నిర్ణయం మార్చాలని చాలా ట్రై చేసి చూసాడు. కానీ తను వినలేదు. ఇద్దరూ సెక్స్ మాత్రం మామూలుగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇంతలో తను ఇండియా కి ఇలా బయలు దేరి రావడం, ఇప్పుడు వాడి డెత్ న్యూస్.

ఫొటోలో తను చూసిన వాడి డెడ్ బాడీ గుర్తుకు వచ్చి, ఒళ్ళు గగుర్పొడిచింది సమీరకి. తను ఒకప్పుడు ఎంతో సుఖం అనుభవించింది ఆ బాడీ తో అంటే ఎందుకో చాలా అనీజీ గా వుంది. నిజానికి సుఖాన్నిచ్చే ఏ బాడీ అయినా ఒకనాటికి అలా డెడ్ బాడీ కావాల్సిందే. కానీ ఆ విషయం నోటిఫై కావడం లేదు.

"బయలుదేరు సమీ. ఈ రోజు నీతో ఆఫీస్ కి వస్తానని చెప్పాను కదా." మల్లిక వచ్చి చెప్పేవరకూ తను ఆఫీస్ కి బయలు దేరి వెళ్లాలన్న మాటే మరిచిపోయింది సమీర.

&&&

"నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా వుంది. సమీర ని డిప్రెసివ్ మూడ్ లోనుండి బయటకి తీసుకు వచ్చి, పూర్తిగా మామూలుగా మార్చగలిగింది నువ్వు మాత్రమే."

తన ఛాంబర్ లో ముగ్గురూ సెటిల్ అయ్యాక, అనురాగ్ అన్నాడు మల్లిక మొహంలోకి చూస్తూ. తను తన సీట్లో మామూలుగా కూచుని ఉంటే, అనురాగ్ ఇంక మల్లిక ఎదురుగుండా పక్క, పక్క సీట్లలో కూచుని వున్నారు.

"కానీ తను పనికిరాని విషయాలన్నిటి గురించి ఆలోచించి, మూడ్ పాడు చేసుకుంటూ ఉంటే, నేను కూడా ఏ హెల్ప్ చెయ్యలేను." మల్లిక కోపంగా అంది.

"ఏం జరిగింది? తను ఏ విషయాల గురించి అలోచించి మూడ్ పాడు చేసుకుంటూ వుంది?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అనురాగ్.

"మల్లికా, ఆ విషయాలు వదిలేయొచ్చు కదా. తనక్కూడా చెప్పి తన మూడ్ కూడా పాడు చెయ్యాలా?" చిరాగ్గా అంది సమీర.

"అనురాగ్ మన వెల్ విషర్. తనకి అన్ని విషయాలు తెలియడం మంచిదనే నేను అనుకొంటున్నాను." సమీర మొహంలోకి చూసి అలా అన్నాక, అనురాగ్ మొహంలోకి చూస్తూ మొత్తం విషయం అంతా చెప్పింది మల్లిక.  నిజానికి ముందో, వెనకో అనురాగ్ తో అదంతా చెప్పాలనే సమీర అనుకొంటూ వుంది, కాబట్టి ఇంక మరి చిరాకు పడకుండా మల్లిక చెప్తున్నది తనుకూడా వింటూ కూచుంది.

"ఏమిటిది సమీరా? నువ్వు మేడ మీద నుండి కిందకి దూకేయబోవడం ఏమిటి? సమయానికి మల్లిక నిన్ను ఆపి ఉండకపోతే ఏం జరిగి ఉండేది?" అక్కడ వరకూ చెప్పగానే, మల్లికని ఆపి ఆందోళనగా అడిగాడు అనురాగ్ సమీర మొహంలోకి చూస్తూ.

"ఆ విషయానికి తనే సమాధానం చెప్పగలదు. తననే అడుగు." సమీర అంది. 

సమీర అలా అనగానే మళ్ళీ మల్లిక మొహంలోకి చూసాడు అనురాగ్.

"కారణం తెలియట్లేదు కానీ, తనేవో హల్యూసీనేషన్స్ కి సబ్జెక్టు అవుతూ వుంది. అందుకనే అలా బిహేవ్ చేస్తూంది. తనని హిప్నోటైజ్ చేసి అందుకు కారణం తెలుసుకుంటాను. మళ్ళీ అలా చేయకుండా ప్రోగ్రాం చేస్తాను." మల్లిక అంది.

"ఆ చేసేదేదో త్వరగా చెయ్యి. లేకపోతె అవసరం అనుకుంటే వేరే ఇంకెవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి కానీ, సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ తీసుకెళదాం." మల్లిక మొహంలోకే చూస్తూ ఆందోళనగాఅన్నాడు అనురాగ్.

"రిలాక్స్ అనురాగ్. నేనున్నాగా! ఎలాంటి ప్రమాదం లేకుండా నేను చూసుకుంటాను. త్వరలోనే చెయ్యవలసింది చేస్తాను." మల్లిక కాస్త ఆగి అంది. "ఎనీహౌ నువ్వు వింటే నేను చెప్పాల్సింది ఇంకా వుంది."

"ఆల్రైట్ చెప్పు." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అన్నాడు అనురాగ్.

ఆ తరువాత అదే మాడ్యులేషన్ లో నిర్మల చెప్పిన కధ అంతా చెప్పింది మల్లిక. "ఈ ముగ్గురూ ఆ ప్రమీల చనిపోయి దయ్యం అయి ఇప్పుడు సమీర ని ఇలా సాధిస్తూందని అభిప్రాయం పడుతూ వున్నారు. వాళ్ళిద్దరి మాట పక్కన పెట్టు. ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలిజంట్ అయిన సమీర కూడా అలా ఆలోచించడం ఏమిటి? ఇది పనికిరాని ఆలోచనతో మూడ్ పాడు చేసుకోవడం కాదా?" మల్లిక అడిగింది.

“అబ్సల్యూట్లీ! నిజంగానే అది పనికిరాని ఆలోచన." సమీర మొహంలోకి చూస్తూ అన్నాడు అనురాగ్. "అసలు అలంటి పారానార్మల్ విషయాలు నువ్వెలా నమ్ముతావ్?"

"ఆ విషయం పక్కన పెట్టు. ఒక విషయం చెప్తే నీ మూడ్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలని వుంది." నవ్వుతూ అంది సమీర.

"ఏమిటది?" ఆసక్తిగా చూస్తూ అడిగాడు అనురాగ్.

"ప్రస్తుతం నువ్వుంటున్నఫ్లాట్ నే ఇవ్వడం జరిగింది ఆ ప్రమీలకి. ఆవిడ ఆ ఫ్లాట్ లోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది." అదే చిరునవ్వు మొహంతో అంది సమీర.

కాస్త సీరియస్ నెస్ ఇమ్మీడియేట్ గా కనిపించినా, వెంటనే చిరునవ్వు వచ్చి చేరింది నిరంజన్ మొహంలోకి. "ఐ యాం సారీ టు డిజప్పోయింట్ యు సమీర. నో, ఐ యాం నాట్ ఫీలింగ్ ఎనీ ఫియర్. జస్ట్ బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ పారానార్మల్."

సమీర ఎదో చెప్పబోతూ ఉంటే అక్కడికి వచ్చింది నీరజ, డోర్ మీద టాప్ చేసి తన పెర్మిషన్ తీసుకున్నాక. నీరజ ని పరిచయం చేసింది మల్లికకి సమీర. మల్లిక ని విష్ చేసాక, కొన్ని విషయాలు సమీర కి రిపోర్ట్ చేసి అక్కడనుండి వెళ్ళిపోయింది నీరజ.

"తను వర్క్ లో చాలా అఫిషియంట్. పైన ఏమీ తేడా కనిపించదు. కానీ తానొక సైకలాజికల్ డిజార్డర్ తో బాధ పడుతూ వుంది." అనురాగ్ అన్నాడు మల్లిక మొహంలోకి చూస్తూ.

"తన గురించి సమీర నాతో చెప్పింది." మల్లిక అంది. "చాలామంది సైకలాజికల్ పేషంట్స్ పైకి నార్మల్ గానే వుంటారు. యూజువల్ గా వాళ్ళు చేసే పనుల్లో స్కిల్ ఫుల్ గానే వుంటారు."

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)