Nuli Vechani Vennela - 6 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 6

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 6

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

చెంప దెబ్బ కొట్టినట్టుగా వుంది మల్లిక చెప్పింది. అవును, ఇలా ఆలోచిస్తూ కూడా ఆ తరంగ్ గాడితో పడుకోకుండా తానెందుకు వుండలేకపోతూంది? మరొకసారి అలాంటి తప్పు చేయకూడదన్న ధృడమైన నిర్ణయం తీసుకుంది.  కానీ తను అనుకున్నట్టుగా తను ఉండలేక పోయింది. ఆ మల్లిక చెప్పింది హండ్రెడ్ పర్శంట్ నిజం. కొన్ని సందర్భాలలో ఆ అర్జ్ ని తట్టుకోవడం తనకి చాలా కష్టం అయిపొయింది.  మరీ ఐరానికల్ గా ఆ తరంగ్ గాడితోటే సెక్స్ చేసింది. వాడు తనని అప్పుడు అనుభవించిన తీరు తలుచుకుంటూ వుంటే ఇప్పటికి కూడా తన వళ్ళంతా పులకించిపోతూ వుంది. ఎదో థ్రిల్ ఫీలింగ్ తో మనసంతా నిండిపోతూ వుంది. వాడు తన శరీరంలో తాకని, ముద్దు పెట్టని భాగం లేదు. వాడు మల్లికని కూడా ఇలాగే అనుభవించే వాడా ఆశ్చర్యంగా ఆలోచించేది తను.  

అలా ఆలోచిస్తూ బెడ్ మీద కుడిపక్కనుండి, ఎడమపక్కకి దొర్లబోయింది సమీర. కానీ ఆశ్చర్యం! ఒక్క ఇంచ్ కూడా కదలలేక పోయింది. కాదు, తనని ఎవరో వెనకనుండి రెండు చేతులతో కౌగలించుకుని కదలనివ్వడం లేదు. ఆ స్పర్శ తనకు చాలా బాగా తెలుస్తూంది. తనకి బాగా తెలిసిన స్పర్శ లాగానే వుంది.

"నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావు కదూ?" స్వరం కూడా అదే. తరంగ్.

"తరంగ్………......." తను ఎదో అనడానికి ప్రయత్నం చేసినట్టుగా వుంది. అందో లేదో తెలీదు.

"ఎస్, నీ తరంగ్." అచ్చం అలాగే నవ్వుతున్నాడు.

ఒక్కసారి గుండె ఆగి కొట్టుకోవడం ప్రారంభించింది సమీర కి. ఒళ్ళంతా విపరీతమైన భయంతో నిండిపోయింది.  తరంగ్ వచ్చాడు. తనని వెనకనుండి కౌగలించుకున్నాడు. తనతో మాట్లాడుతూ వున్నాడు. ఇది ఊహ అనుకోవడానికి అవకాశం లేదు. తన ఎక్స్పీరియన్స్ చాలా రియలిస్టిక్ గా వుంది. ఇది కల కూడా కాదు. ఎందుకంటే తానిప్పుడు పడుకుని లేదు, తెలివిగానే వుంది.

తరంగ్ ఎక్కడో ఒకచోట ప్రాణాలతో వుండివుంటే తను ఇలా ఆలోచించేది కాదు. ప్రాణాలతో వున్న మనుషులికి ఎక్కడకి కావంటే అక్కడికి వచ్చి ఇలా చేసే అవకాశం లేదు.కానీ స్పిరిట్స్ కి సాధ్యం కానిది ఏముంది? అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి రాగలవు, ఎమన్నా చెయ్యగలవు. దీనర్ధం ఏమిటంటే తరంగ్ చనిపోయాక స్పిరిట్ గా మరి పోయాడు.

తనింటి పక్కకి తరంగ్ ఫామిలీ షిఫ్ట్ అయ్యాక, ఒక రెండు సంవత్సరాల తరువాత, తరంగ్ ఒక మోటార్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు. తనకి తెలిసిన విషయం ప్రకారం చాలా రాష్ గా మోటార్ బైక్ డ్రైవ్ చేసి, డివైడర్ గుద్దుకుని ప్రాణాలు కోల్పాయాడు. తను తన బాడీని చూడ్డానికి వెళ్ళలేదు. మల్లిక తనని వెళ్లనివ్వలేదు. తనూ వెళ్ళలేదు.

"ఇట్స్ ఇండీడ్ ఏ పీటీ. తనలా అంత చిన్నవయసులో చనిపోయి వుండకూడదు. మనం వాడిని ఇప్పుడు చూడడం వల్ల కలిసొచ్చేది ఏమీ లేదు. మనని అంతలా సుఖపెట్టిన వాడి బాడీని అలా చూసి మనం తట్టుకోలేం. మనం ఆ బాడీని చూడకపోవడమే మంచిది."

మల్లిక చెప్పిన దాంట్లో రీజన్ వుందనిపించింది. అయినా వాడితో సుఖాన్ని పంచుకుందే తప్ప వాడిమీద తనకి ఎలాంటి ఫీలింగ్ లేదు. అంతే కాకుండా తనతోటీ తన ఫ్రెండ్ తోటీ వాడు ఒక్కలాగే సెక్స్ చేస్తూ వున్నందుకు వాడిమీద కోపంగా కూడా వుండేది.    

తను స్పిరిట్స్ ఇంకా పారానార్మల్ గురించి ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించ లేదు. కానీ ప్రస్తుతం తన అనుభవం గురించి ఆలోచిస్తూవుంటే అవి నిజమే అనిపిస్తూంది. కానీ ఇన్నిరోజులుగా ఎప్పుడూ లేనిది ఆ తరంగ్ ఇప్పుడెందుకు తన దగ్గరికి వచ్చినట్టు?

"నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను చాలా కాలం. అది సాధ్యం కాదని తెలిసిపోయింది. అందుకనే వచ్చాను." తన మనసులో మాట కనిపెట్టినట్టుగా అన్నాడు వాడు.

తనకి చాలా భయంగా వుంది. గుండె వేగం పెరిగింది. వాడిపట్టు నుండి విడిపించుకుని అక్కడనుండి పారిపోవాలని వుంది. కానీ తను కొంచం కూడా కదల లేక పోతూ వుంది.

"ఎంత సుఖం అనుభవించాం మనిద్దరం కలిసి. నీ ఫ్రెండ్ తో కలిపి ఎంతో మందిని అనుభవించాను నేను. కానీ ఎవ్వరూ నీ అంత అందంగా వుండి నువ్విచ్చినంత సుఖం ఇవ్వలేకపోయారు."

రాస్కల్! అప్పుడు మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. అంత భయంతోనూ వాడంటే కోపం వచ్చింది.

అంతలోనే వాడు తనని బెడ్ మీద వెల్లకిలా చేసాడు. వాడి వుద్దేశం అర్ధం అయ్యేలోపే తన శరీరం వాడి బరువుతో నిండిపోయింది. తను వాడిని చూడలేక పోతూ వుంది. కానీ వాడు తన శరీరం మీద కదులుతూ వుంటే, అప్పట్లో వాడు కదులుతున్నట్టు గానే వుంది. చాలా ఆశ్చర్యంగా చాలా భయపడుతూ వున్నా, తన శరీరం అప్పట్లోలాగే సుఖాన్ని అనుభవించడం మొదలు పెట్టింది. వాడు తన శరీరంలో ఒక్కో యవ్వన భాగాన్ని తీరు, తీరున అనుభవిస్తూ వుంటే, అప్పుడెంత సుఖం అనుభవించిందో, ఇప్పుడూ అంత సుఖం అనుభవిస్తూ వుంది. వాడిలో ఎలాంటి మార్పు లేదు. ఏదీ తన శరీరం లో వదలి పెట్టడం లేదు. 

అలా ఎంత సమయం గడిచిందో గుర్తు లేదు. కానీ చాలా సేపు సుఖంతో ప్రాణం పోతుందేమో అనిపించింది. వాడు తనతో పని పూర్తి చేసుకుని ఎప్పుడు పోయాడో గుర్తు లేదు. తను ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో కూడా గుర్తులేదు. కానీ తను లేచేసరికి సమయం ఉదయం ఎనిమిది అయిపొయింది.

            &&&  

"థాంక్ యు, నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్ కి వస్తున్నందుకు" ఆ మర్నాడు ఆఫీస్ లో అనురాగ్ అన్నాడు తానేవో ఫైల్స్ చూస్తూ వుండగా.

రాత్రి అలాంటి అనుభవం తరవాత తనకి చాలా డిస్టర్బింగ్ గా వుంది. హండ్రెడ్ పర్సెంట్ అది కల కాదని తనకి తెలుసు. వచ్చిన నిద్ర కూడా సరిగా లేదు. తన మోహంలో అలసట తెలుస్తూ వుంది. ఆంటీ, ఇంకా కజిన్ ఇద్దరూ అడిగారు ఏమైనా ఇబ్బందిగా ఫీలవుతోందా అని. అనురాగ్ కూడా తనని ఆలా అడిగితె బావుండును అని వుంది. అసలు అనురాగ్ తనని ఆలా అడగాలని తనకెందుకు అనిపిస్తూ వుంది?

"నేను రాకపోతే ఆ ప్రెజర్ కూడా నీ మీద పడుతుందని నాకు తెలుసు. ఇప్పటికే చాలా భారం మోస్తూ వున్నావు, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేదు." చిరునవ్వుతో అంది తను కుర్చీలో వెనక్కి జరగిలపడుతూ.

"ఈ కంపెనీ గురించి ఎంత ఇబ్బంది పడ్డా నాకు సంతోషంగానే ఉంటుంది." ఒక చిరునవ్వు అనురాగ్ పెదాల మీదకి కూడా వచ్చి చేరింది. "నన్ను ఈ స్థితి కి తెచ్చింది ఈ కంపెనీయే. ఎలా మర్చిపోగలను?"

చాలా ఇంటిమేట్ కశ్చిన్స్ అడగాలని వుంది. కానీ ఎలా అడగగలదు? నిన్న మొన్నటివరకూ కూడా ద్వేషిస్తూనూ, ఇంకా దూరంగానే ఉంచింది. కాస్తయినా ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలి కదా.

"కానీ చాలా టైర్డ్ గా కనిపిస్తూన్నావు. మళ్ళీ డాడ్ గురించి, ఆ విషయాలన్నిటి గురించి ఆలోచించడం మొదలుపెట్టావా?"

హమ్మయ్య, అడిగేశాడు. తన గురించి కన్సర్న్ వుంది. చాలా సంతోషం గా అనిపించింది. ఎంత సంతోషంగా అనిపించిందంటే రాత్రి వచ్చిన కల గురించి చెప్పేయాలినిపించింది. కానీ అది ఎవరితోటి అంత తేలిగ్గా చెప్పుకోగలిగిన విషయం కాదు. ముఖ్యంగా అనురాగ్ తోటి.

"అసలు నేను ఆలోచించడం ఆపేస్తే కదా." గట్టిగా నిట్టూరుస్తూ అంది.

"నువ్వెలాగో లా ఆ థింకింగ్ నుంచి బయటపడాలి. నేను కూడా మీ డాడ్ ఏ విషయం గురించి అంతగా మధన పడ్డారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. బట్ ......... నువ్వు మాత్రం ఆ ప్రెజర్ నుండి బయటికి రా. నువ్వెలాంటి ముఖ్యమైన విషయాలమీద కాన్సంట్రేట్ చెయ్యాలో నీకు తెలుసు కదా."

"ఎస్, అఫ్కోర్స్!" అందంగా నవ్వింది సమీర కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ. "చూస్తా. ఇలా రెగ్యులర్గా నా అక్టీవిటీస్ లో మునిగి తేలితే అది సాధ్యమవుతుందేమో."

"హండ్రెడ్ పర్సెంట్ ఆలా సాధ్యమే." అనురాగ్ కూడా నవ్వాడు. "ఎనీహౌ నీకు పెర్సనల్ సెక్రటరీ గురించి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసాను. అందరూ కాపబుల్. వాళ్లలో నువ్వెవరిని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు."

"చూసావుగా లాస్ట్ టైం నా సెలెక్షన్ ఎలా ఏడిసిందొ? వాళ్లలో నువ్వే ఎవళ్ళో ఒకళ్ళని సెలెక్ట్ చెయ్యి. నీ మీద, నీ సెలెక్షన్ మీద నాకు నమ్మకం వుంది."

"అలాగే అయితే." అనురాగ్ నవ్వు కూడా అందంగానే వుంది.

లాస్ట్ టైం ఒక సెక్రటరీని తన గురించి తనే సెలెక్ట్ చేసుకుంది. ఆ సెక్రటరీ తో చాలా బాధలుపడి ఆఖరికి జాబ్ నుండే బయటకి పంపించేయాల్సి వచ్చింది. అందుకనే ఈ సారి సెక్రటరీ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో,, అనురాగ్ అంటే ఇష్టంలేకపోయినా ఆ బాధ్యతని తనకే వదిలేసింది.

"ఆల్రైట్ దెన్. ఆ షార్ట్ లిస్ట్ చేసినా వాళ్లలో బెస్ట్ అనిపించిన పర్సన్ని నీ గురించి సెలెక్ట్ చేస్తాను. మరి ఈ రోజు వర్క్ చూద్దామా?" 

తనకెందుకో సడన్గా చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది. చాలా యాక్టివ్ గా, ఇంకా హ్యాపీగా అనురాగ్ తో వర్క్ గురించి డిస్కస్ చేసి, అవసరమైన సంతకాలు చేసింది. తనింటికి వచ్చేవరకూ కూడా ఆలా సంతోషంగానూ, ఇంకా ఉత్సాహంగానే వుంది. తనింటికి రాగానే తనెంతో సంతోషపడాల్సిన సంఘటన ఇంకోటి జరిగింది.                 

&&&

"వాట్ ఏ సర్ప్రైజ్ మల్లికా? నేను నిన్నసలు ఎక్సపెక్ట్ చెయ్యలేదు. రాస్కల్ వస్తున్నావని నాకెందుకు ఫోన్ చెయ్యలేదు?" ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించిన మల్లికని ఘాడంగా కౌగలించుకుని, తన కుడి బుగ్గమీద ముద్దు పెట్టుకుని అడిగింది.

"నీకిలా ప్లజంట్ సర్ప్రైజ్ ఇద్దామనే చెప్పలేదు." నవ్వుతూ మల్లిక కూడా సమీరని ఘాడంగా కౌగలించుకుంది. "మై గాడ్! నిన్నలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయినందుకు నేనెంత ఫీలవుతున్నానో నీకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గరికి ఇలా వచ్చేసినందుకు చాలా రిలీఫ్ గా వుంది."

"సరే, సరే. ముందు తనని ఫ్రెష్ అప్ అయి రానిస్తే మీ ఫ్రెండ్స్ ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు." అక్కడికి కాఫీ కప్పుతో వచ్చిన తన ఆంట్ నిర్మల అంది.

"ఒకే దెన్." మల్లికని విడిచిపెట్టి, మల్లిక పట్టునుండి తనని విడిపించుకుంటూ అంది సమీర. "నువ్వు నా రూమ్ లో వెయిట్ చేస్తూ వుండు. నేను పదినిమషాల్లో అక్కడ వుంటాను."

&&&

తరవాత పదినిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకోలేదు సమీర ఫ్రెష్ అప్ అయి తన రూమ్ లోకి వెళ్ళడానికి. అప్పటికి తన బెడ్ మీద పడుకుని ఎదో మ్యాగజైన్ చూస్తూన్న మల్లిక అది పక్కన పడేసి లేచికూచుంది.

"నిజంగా నీ కమిట్మెంట్స్ అన్ని పూర్తిచేసుకునే వచ్చావు కదా? నీకు మళ్ళీ వెళ్లాల్సిన అవసరం రాదు కదా?" మల్లిక పక్కనే కూలబడి, మల్లిక చుట్టూ తన కుడిచేతిని వేసి దగ్గరకి తీసుకుని, ఆదుర్దాగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సమీర.

"అన్నీ పూర్తి చేసుకునే వచ్చాను. ఇంక నీడలా నీతోటె వుంటాను. నీకు పెళ్లయి నీ మొగుడో, లేకపోతే నువ్వు లవ్లో పడి నీ లవరో వచ్చి నీతో ఏకాంతం కావాలని అడిగే వరకూ, నీ బెడ్ రూమ్ లో కూడా నీతోటే వుంటాను."

"రియల్లీ! ఓహ్, నైస్." అందంగా నవ్వింది సమీర. "ఒకవేళ నువ్వన్నా పరిస్థితే వచ్చినా, నువ్వు నా నీడలా నాతో ఎప్పుడూ వుండడం వాళ్ళకి నచ్చితేనే, వాళ్ళకి నాతో వుండి ఏదైనా చేసే ఛాన్స్. లేకపోతె లేదు."

"అప్పుడు వాళ్ళకి నాతొ కూడా ఏదైనా చెయ్యాలనే ఆలోచన వస్తుందేమో జాగ్రత్త!" మోహంలో హెచ్చెరిక నటిస్తూ అంది మల్లిక.

"ఓహ్, గాడ్! యు అర్ ఇంపాజిబుల్!" మల్లిక కుడిబుగ్గ మీద మరోసారి ముద్దు పెట్టుకుంటూ అంది సమీర.      

"జస్ట్ ఏ మూమెంట్ సమీ." సడన్గా తన పట్టునుండి విడిపించుకుని, బెడ్ దిగి, సమీర మొహంలోకి సూటిగా చూస్తూ అంది మల్లిక. "నువ్వు నా కొన్ని ప్రశ్నలకి ఏమీ దాచకుండా సమాధానం చెప్పాలి?"

"నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధంకావడం లేదు." సమీర మొహం అయోమయం తో నిండి పోయింది. "అసలు నువ్వు నన్ను ఏం అడగదలుచుకున్నావు?"

"కొన్ని రోజులుగా నీకు ఎలా అనిపిస్తూ వుంది? అంతా బాగానే వుంది కదా? ఏమీ ఆడ్ ఇన్సిడెంట్స్ లేవు కదా?"

"నీకు ఎందుకు ఇలా అనిపిస్తూ వుంది? ఏమైనా ఆడ్ ఇన్సిడెంట్స్ ఎందుకు వుంటాయి?" సమీర గుండె వేగం పెరిగింది. ఎందుకు మల్లిక కి ఇలాంటి ప్రశ్న అడగాలని అనిపించింది? ఏవీ ఆడ్ ఇన్సిడెంట్స్ లేకపోతె తనిలా ఫీల్ అయ్యేది కాదు. కానీ గత కొన్ని రోజులుగా తన జీవితంలో చోటు చేసుకుంటున్న ఆడ్ ఇన్సిడెంట్స్ గురించి ఆలోచించడానికి కూడా భయంగానే వుంది.  

"నీతో నాకున్న ఫ్రెండ్షిప్ వల్ల, మనిద్దరిమధ్య డెవలప్ అయిన గొప్ప ఇంటిమసీ వల్ల నాకు నీతో సైకిక్ కనెక్షన్ ఏర్పడింది. అందువల్ల నువ్వేమన్నా ఇబ్బందుల్లో కానీ, ప్రమాదంలో కానీ వున్నావంటే, నాలో తెలీని అనీజీనెస్ ఏర్పడుతుంది. నా కలల్లో నువ్వే ఏవో ప్రమాదాలు ఎదుర్కుంటున్నట్టుగా కనిపిస్తావు. గత వన్ ఆర్ టు మంత్స్ గా అదే జరుగుతోంది. నా పనులన్నీ ఇంత త్వరగా ముగించుకుని నేను నీ దగ్గరకి వచ్చేయడానికి అదొక కారణం." కాస్త ఆగి దీర్ఘంగా నిట్టూర్చాక మళ్ళీ అడిగింది మల్లిక. "అందుకనే అడుగుతున్నాను, చెప్పు. నీ లైఫ్ అంతా రొటీన్ గానే వుంది కదా, ఏదీ ఆడ్ గా భయపడాల్సిన ప్రకారంగా లేదు కదా?"

గుండె వేగం మరింత పెరిగి, భయం ఇంకా ఎక్కువ అయింది సమీరలో. కానీ అది మోహంలో కనిపించకుండా జాగ్రత్తపడుతూ అంది. "ఇదేంటి ఆశ్చర్యంగా? నువ్విలాంటి పారా నార్మల్ విషయాలేవీ నమ్మవు కదా. నీకు సంజయ్ కి ఈ విషయంలోనే కదా ఎప్పుడూ పడనిది."

"అన్ని పారా నార్మల్ విషయాల్ని ఆలా కొట్టిపారేయలేను. ముఖ్యంగా నా హంచెస్ కి సంబంధించి. అందులోనూ అవి నీకు సంబందించినవి అయితే అసలు ఛాన్స్ తీసుకోను. అందుకనే అడుగుతున్నా. నువ్వు నా దగ్గర దాపరికం లేకుండా చెప్పు."

"నిన్ను మించిన క్లోజ్ గా నాతొ ఎవరూ వుండరు. నాకు నీతో, నీకు నాతొ దాపరికలేమీ లేవు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా?" మళ్ళీ బెడ్ మీద కూలబడి, మల్లికని కూడా తన పక్కకి లాక్కుని కూచోబెట్టుకున్నాక అంది మళ్ళీ. "కొన్ని ఇన్సిడెంట్స్ అయితే వున్నాయి. కాకపోతే అవి భయపడాల్సినంత కావేమో అనే అనుకొంటున్నా. అందుకనే నేను వాటిని నీతో షేర్ చేసుకోలేదు. లేకపోతె నువ్వెంత దూరంలో వున్నా నీకు వాటి గురించి చెప్పేదాన్ని."

"సరే, అవేంటో ఇప్పుడు చెప్పు నాకు. వాటిని పట్టించుకోవాలో, వద్దో డిసైడ్ చేసేస్తాను." సమీర మొహంలోకి చూస్తూ అంది మల్లిక.

"గత కొద్దీ రోజులుగా నాకు ఏవో శబ్దాలు వినిపిస్తూ వున్నాయి. ఎవరో ఏడుస్తున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా………….....అవి నా ఊహలో లేకపోతె నిజంగానే ఎవరో ఏడుస్తూ, నవ్వుతూ వుంటే వింటున్నానో నాకు బోధపడడం లేదు. అలాగే గాజుల శబ్దం, కాలి మువ్వల శబ్దం. నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నా, నిజంగానే నేనవి వింటున్నానా లేకపోతే ఆలా వూహించుకుంటున్నానా అని."

"ఎగ్జాట్ గా ఎప్పటినుండి ఇలా వుంది?" భృకుటి ముడేసింది ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ తో మల్లిక. "అంకుల్ చనిపోయిన తరవాతనుంచా?"

"అంతకన్నా ముందునుంచే అనుకుంటా. నేను అమెరికా లో వుండగానే ఇలా జరిగేది. కాకపోతే నేనిది అంత సీరియస్ గా తీసుకోవలసిన విషయం అనుకోలేదు. ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇలాంటి హల్యూసీనేషన్స్ కామనే కదా." ఆ విషయాలు అంత కామన్ గా, తేలికగా తీసుకోవలసిన విషయాలుగా సమీరకి అనిపించలేదు. కాకపోతే వాటిగురించి తాను భయపడుతున్నట్టుగా మల్లికతో చెప్పదలుచుకోలేదు.

"అఫ్ కోర్స్, ఎస్." తలూపింది మల్లిక. "అప్పుడప్పుడు మన షబ్-కాన్షస్ ఇలాంటి హల్యూసీనేషన్స్ క్రియేట్ చేస్తుంది. వాటిగురించి పెద్దగా పట్టించుకోనక్కరలేదు. ఇంతేనా, ఇంకా ఏమైనా సీరియస్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా?"

"సీరియస్ అంటే, సీరియస్ అని చెప్పలేను." మల్లిక సమాధానం విన్నాక నిజంగా రిలీఫ్ ఫీలయింది సమీరా. "కాకపోతే రీసెంట్ గా ఒక రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇవికొంచం డిఫెరెంట్." వీటిగురించి కూడా మల్లిక అలాగే చెప్పాలి, దేవుణ్ణి వేడుకుంటూ అంది సమీర.  

"సరే వాటిగురించి కూడా చెప్పేయ్ మరి." ఎంకరేజింగ్ గా చూస్తూ అంది మల్లిక.

అప్పుడు బాత్రూం లో తనకి కలిగిన అనుభవం, ఇంకా బెడ్ మీద తరంగ్ తో తనకి కలిగిన అనుభవం గురించి చెప్పింది సమీర.

"సెన్సువరీ హల్యూసీనేషన్స్. ఒకక్కపుడు ఇలాంటి అనుభవాలు కూడా కలుగుతూ వుంటాయి. అంత పెద్దగా కంగారు పడక్కరలేదు."

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)