ఏ వ్యక్తి అయినా విజయవంతమైన లేదా ఫెయిల్యూర్ చెందిన దానికి కారణం వారి యొక్క అలవాట్లు మీయొక్క అలవాట్లే మిమ్మల్ని విజయవంతమైన వారిగా తీర్చిదిద్దుతాయి మంచి అలవాట్లు గెలుపు బాట వైపు నడిపిస్తాయి చెడు అలవాట్లు మీకు సరైన దిశగా నడవకుండా చేస్తాయి మీరు జీవితంలో కొన్ని అలవాట్లను మార్చుకుంటే మీరు తప్పక విజయం చెందుతారు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు డబ్బు మరియు సక్సెస్ సంపాదించడం అదృష్టం పైన ఆధారపడి ఉండదు కేవలం యొక్క కఠోర శ్రమ పైన ఆధారపడి ఉంటుంది మీరు చేసే పని యొక్క విధానమే నీకు ప్రతిఫలంగా లభిస్తుంది మీరు విద్యార్థి అయితే కొన్ని అలవాట్లు తప్పకుండా మానుకోవాలి ఉంటుంది టీవీ చూడడం తప్పక మానుకోవాలి మీరు ఎప్పుడైనా విన్నారా ధనవంతులు విద్యావంతులు ఎప్పుడైనా మేము టీవీ చూస్తూ సమయం గడుపుతూ ఉంటామని ఎప్పుడూ విని ఉండరు ఎందుకంటే వారు టీవీ చూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోరు ఎందుకంటే వారు విలువైన సమయాన్ని టీవీ చూస్తూ వృధా చేసుకోవడానికి ఇష్టపడరు మనలో చాలామంది అనవసర వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా డబ్బును వృధా చేయడం జరుగుతుంది ఇతరులకు గొప్పగా చూపించుకోవడానికి వారి వద్ద ఉన్న ధనాన్ని మొత్తం అవసరం లేని వస్తువులపై ఖర్చు చేస్తారు అందువలన వారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు ధనవంతులైన వారిని చాలావరకు గమనిస్తూ ఉండండి వారు అవసరమైన వస్తువుల పైన వారి ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది అభివృద్ధి చెందాలంటే ఎప్పుడైనా సరే వృధా ఖర్చులు అనేవి చేయకూడదు.
ఆలస్యంగా మేల్కోవడం మానుకోవాలి
అపజయం పొందే వ్యక్తులలో చాలావరకు ఇదొక పెద్ద కారణంగా ఉంటుంది ఎందుకంటే ఆలస్యంగా లేవడం వలన పనులు సరైన సమయంలో పూర్తి చేయలేక పోతాం విజయవంతమైన వ్యక్తులు త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం జరుగుతుంది వారి పనులు సక్రమంగా సరైన సమయంలో పూర్తి చేయగలుగుతారు.
ప్రతిరోజు ఏదో ఒక ఫిజికల్ గేమ్ ఆడండి
మనలో చాలామంది ఇంట్లో టీవీ ముందు కూర్చుని క్రికెట్ చూస్తూ ఉంటారు గంటల తరబడి టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్స్ చూసి వారి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది ఇలా వృధా చేసుకోకుండా ప్రతిరోజు కొద్ది సమయాన్ని గేమ్స్ ఆడటానికి కేటాయించండి దీనివలన ఆరోగ్యంగా చురుకుగా మరియు దృఢంగా ఉంటారు ఫిజికల్ గేమ్స్ ఆడడం వలన మానసిక ఉల్లాసం లభిస్తుంది టీవీ లో గేమ్స్ గంటల తరబడి చూడడం కంటే బయట యట్ షటిల్ ఆడడం లాంటివి చేయండి బ్యాట్మెంటన్ ఆడండి లేదా మీకు నచ్చిన ఏ ఇతర ఆట అయినా ఆడండి దాని వల్ల నీకు ఉపయోగం ఉంటుంది. జీవితంలో ఇతరులను నిందించడం మానుకో ఇతరులను నిందించే వారు వారి తప్పులను వారు ఒప్పుకోవడానికి ఇష్టపడరు ఇది చాలా తప్పు విజయవంతమైన వ్యక్తులు వారి తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు అందుకే వారు విజయం పొందుతారు సక్సెస్ఫుల్ పర్సన్ వారి యొక్క లోపాలను తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తారు అన్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు వారి తప్పులను ఎవరైనా నా వారికి వివరిస్తే వారు వాదనకు దిగుతారు లేదా చెప్పిన వారే తప్పు అని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తారు మన తప్పులను మనం ఒప్పుకోవాలి అప్పుడే మనం సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుంది.
ధనం పొదుపు చేయకపోవడం చాలా పెద్ద పొరపాటు...సాధారణంగా పేదవారు డబ్బు పొదుపు చేయరు డబ్బు పొదుపు చేసే వారు ఎప్పుడు పేదవారు గా ఉండరు సంపాదించిన మొత్తం డబ్బును ఖర్చు చేస్తారు ఈ కారణం వల్ల మరీ బీదవారిగా మిగిలిపోతారు అదే ఒక ధనవంతుడు డబ్బుతో డబ్బును సంపాదిస్తాడు మరియు డబ్బును పొదుపు చేసి ఇ సరైన సమయంలో ఆ డబ్బును ఆదాయం వచ్చే మార్గాలలో ఇన్వెస్ట్ చేస్తాడు పేదవారు ఎక్కడి నుండైనా నా డబ్బు వస్తుందేమో అనే నమ్మకంతో వారి వద్ద ఉన్న డబ్బును మరీ అతిగా ఖర్చు చేయడం జరుగుతుంది. పేద వారు సాధారణంగా పేద వారితో గడపడానికి ఇష్టపడతారు అదే పేదవారు ధనవంతులను ప్రేరణగా తీసుకుని జీవితంలో పేదవారు ధనవంతుల ఆలోచనలు మరియు విధానాలను వారి జీవితంలో అమలు చేయగలిగితే పేద వారి జీవితంలో కూడా ఎంతో మార్పు వస్తుంది అన్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉంటాడు సక్సెస్ఫుల్ పర్సన్ కు ఏదైనా ఒక ఐడియా వస్తే వెంటనే ఆ ఐడియా పై పని చేయడం మొదలు పెడతాడు ఒకానొక రోజు విజయం పొందుతాడు పేద వారు జీవితంలో చాలా వరకు రిస్క్ తీసుకోవడానికి వెనకాడతారు అదే ధనవంతులు రిస్క్ తీసుకోవడానికి భయపడరు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా రిస్క్ తీసుకోవడానికి ముందు సరైన అవగాహన పొందాలి సరైన అవగాహన ఉంటే ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని సక్సెస్ పొందవచ్చు.
జీవితంలో విజయం పొందాలంటే ఏం చేయాలి....
జీవితంలో విజయం పొందాలంటే హార్డ్ వర్క్ చేయాలా లేదా స్మార్ట్ వర్క్ చేయాలా అని చాలామంది ఆలోచిస్తుంటారు మనం విజయం పొందాలంటే తప్పకుండా హార్డ్ వర్క్ అనేది చాలా ముఖ్యమైనది
స్మార్ట్ వర్కు హార్డ్ వర్క్ జత కలిస్తే జీవితంలో విజయం పొందడంలో మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు.
జీవితంలో తెలుసుకోవలసిన నగ్నసత్యాలు...
అహంకారం కలిగిన వ్యక్తి మరియు పొట్ట కలిగిన వ్యక్తి కావాలనుకున్నా సరే ఇతరులను కౌగిలించుకో లేరు ఒక కొడుకు ఎప్పటి వరకు తండ్రి అవకుండా ఉంటాడో అప్పటివరకు తన తండ్రి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పుగానే అనిపిస్తుంది జేబు నిండా డబ్బు ఉంటే మీరు చెడు దారిలో నడిచేలా దిశను మార్చే కలుగుతుంది కానీ ఖాళీగా ఉండే జేబు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేస్తుంది కొందరు ప్రతి ఒక్కరిని తన వారిగా భావిస్తారు అలాంటి వారిని ఎవరూ లెక్క చేయరు ఎవరైనా మిమ్మల్ని నీ సొంత వారు ఎవరు అని అడిగితే మీరు ఈ విషయం చెప్పండి సమయమే నా అసలైన మిత్రుడు అని చెప్పండి సమయం మనకు సహకరిస్తే అందరూ మనవారే అదే సమయం మనకు సహకరించకపోతే అంతా పరాయి వారే జీవితంలో ఒంటరిగానే పోరాడవలసి వస్తుంది జనం నీకు ఓదార్పును మాత్రమే ఇస్తారు నీతో పాటు కలిసి నడవరు ఈ ప్రపంచంలో నమ్మకస్తులైన వారు ఎవరు అంటే కన్నతల్లి మాత్రమే ప్రయాణం ఎక్కడికైనా సరే ఎంచుకోండి అంతేకానీ దారి సరైనదిగా ఉండేలా చూసుకోండి నిజంగా నువ్వు జీవితంలో విజయం సాధించాలని అనుకుంటున్నావా నీ యొక్క నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడం చాలా అవసరం మీరు అపజయం పొందితే జనం మిమ్మల్ని చులకనగా చూస్తారు అవహేళన చేస్తారు ఒకవేళ మీరు విజయం సాధిస్తే అదే జనం మిమ్మల్ని చూసి ఈర్ష పడతారు ఏ
వ్యక్తి అయినా అతని సంపాదనతో పేదవాడు అవడు అతడి అవసరాలను బట్టి పేదవాడు అవుతాడు మిమ్మల్ని మీరు ఎప్పుడూ దురదృష్టవంతులు అని అనుకోకండి ఎందుకంటే మీరు ప్రతిరోజు కడుపునిండా తినగలుగుతున్నారు ఎవరైనా పేదవారి పిల్లల్ని అడిగి చూడండి ఒకసారి ఆకలి కంటే గొప్ప మతం భోజనం కంటే గొప్ప దేవుడు లేడు మీలో ఎవరైనా సరే ఒక గుడి మసీదు మరియు చర్చి నిర్మాణానికి ఒక సిమెంటు సంచి దానం చేసే సమయంలో లో ఒక్కసారి తప్పక ఆలోచించండి మీ చుట్టుపక్కల ఆకలితో అలమటించే వారికి ఒక సంచి బియ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి అదే మీరు చేసే గొప్ప దైవ కార్యం.