Suryakantham - 1 in Telugu Love Stories by keerthi kavya books and stories PDF | సూర్యకాంతం - 1

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

సూర్యకాంతం - 1

అందరికి వందనాలు,

మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు, ఇక ఆలస్యం చేయకుండా మన కథ ప్రోమోలోకి ప్రవేశిద్దాం. తన రూపురేఖల వల్ల (చాలా లావుగా ఉన్న లేడీ కాబట్టి) ఎవ్వరూ ప్రేమించలేరనే అభద్రతా భావంతో ఉన్న అమ్మాయి. ఆమె తనను తాను ద్వేషిస్తుంది మరియు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు ఆమెను ఒత్తిడి చేస్తారు. ఆమె తన రూపాన్ని బట్టి కాకుండా ఆమె హృదయాన్ని చూసి ఆమెను ప్రేమించే వ్యక్తిని కనుగొంటుందా? చూద్దాం!

 


అందరికి ధన్యవాదాలు,

XOXO

-kk

 

------------------------------------- సూర్యకాంతం పార్ట్-1-------------------------------------

 

 


రాజమండ్రి దగ్గర  ఓ చిన్న పల్లెటూరు, పచ్చని పొలాలు ఎటు చుసిన కొబ్బరి తోటలు , పైన నీలి రంగు ఆకాశం అపుడే నిద్ర లేస్తున్న సూర్యుడు ఎర్రటి కిరణాలూ ఊరంతా సూర్య కిరణాలతో ఆహ్లాదకరంగా ఉంది. 


భాగమతి, ఇంట్లో హడావిడి గ వంటలు చేస్తూ ఉంది. అపుడే సూర్యకిరణాలు వేడికి పిచుకుల కిల కీలలు శబ్దానికి పరవిశించి ఆమె కు తెలియకుండానే మొహం లో చిన్న చిరునవ్వు విరాజిస్తూ లేచి ఒళ్ళు విరుచుకుంటూ లేస్తుంది సూర్య ( అసలు పేరు సూర్యకాంతం ఆ పేరు నచ్చక షార్ట్ కట్ లో సూర్య అని పెట్టుకుంది ) 


అమ్మ! గుడ్ మార్నింగ్ , అంటూ భాగమతి ఓ చిరు ముద్దు  ఇస్తుంది. అంతలో బయట వాలా తండ్రి న్యూస్పేపర్ చదవటం చూసి నాన్న! ఏంటి వార్త విశేషాలు అటు ముచ్చట్లు పెడుతుంది.

సూర్య (సూర్యకాంతం తల్లి భాగమతి, తండ్రి భానుచంద్ర, బామ్మ కాంతమ్మ )


విలది చిన్న కుటుంభం చింత లేని కుటుంభం


సూర్య వాలా తల్లితండ్రులు ఎక్కడ వాలా ప్రేమని ఇంకో ఒకరికి పంచాల్సి వస్తుంది అని ఇంకో బిడ్డని కూడా కనలేదు. సూర్య అంటే వాలా అంత ఇష్టం.


భాగమతి తన కూతురికి ఇష్టమైన గుంతపునుగులు చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెడుతుండగా ఆ స్మెల్ కి పరుగున వచ్చి తింటూ ఉంటుంది.


భాగమతి తన కూతురికి ఇష్టమైనవి చేసి ఇవ్వటం తన భర్త మాట జవదాటకుండా ఉండటమే ఆమె ఉండటమే ఆమె భాద్యత. 


కాంతమ్మ కోడలు భాగమతి ని ఎపుడు దెప్పి పొడుస్తుంది ఎందుకంటే కట్నం తీసుకు రాకుండా ఈ ఇంటి కోడలు ఇది అని. కానీ భాగమతి అత్తగారు ఏమి అనిన పెద్దగా పట్టించుకోదు. ఆమెకు తన భర్త కూతురే ప్రపంచం.


కాంతమ్మ: ఏమిటే నా బంగారు కొండా అంటూ కూర్చుంటూ ఇవాళ మీ అమ్మ ని కోసం ఎం చేసింది?


సూర్య:  ఆస్వాదిస్తూ తింటున్న సూర్య గుంటపంగులూ చేసింది నాని!

(సూర్య నానమ్మ అనలేక ముద్దుగా నాని అని పిలుస్తుంది కాంతమ్మ ని )


భానుచంద్ర కూడా రెడీ అయి బ్రేక్ఫాస్ట్ కి వస్తారు. 


కాంతమ్మ: నాన్న భాను పొలం పనులు బానే సాగుతున్నాయా ? పని వాలు అంత టైం కి వస్తున్నారా? 

 భానుచంద్ర: హా అమ్మ! అంత బానే సాగుతుంది. ని ఆరోగ్యం ఎలా ఉంది అమ్మ!


కాంతమ్మ: బాగుంది రా కానీ ఎందుకో దిగులుగా ఉంది రా భాను


భానుచంద్ర: ఏమైంది అమ్మ ?


కాంతమ్మ: మనం తర్వాత మాట్లాడుకుందాం అని ( పర్సనల్ గ మాట్లాడదాం అని సైగ చేస్తుంది)


భానుచంద్ర: హ్మ్మ్ అంటూ ఆమెకు బదులు ఇస్తాడు.


సూర్య: నాన్న నాకు ఈరోజు పొలం చూడాలి అని ఉంది నేను రానా 


భానుచంద్ర: సరే అమ్మ రా ! కానీ ఎక్కువ సేపు ఉండదు ఆ ఎండలో అంతసేపు ఉండటం నేను భరించలేను.


సూర్య: సరే నాన్న


భాగమతి : ఈయన ప్రేమ ని చూసి ఆనందపడాలో బాధపడాలో అని మనసులో అనుకుంటూ పనుల్లో మునిగిపోతుంది. 


కాంతమ్మ: ఒక ఇంటికి వెళాల్సిన కూతురు మీద ఇంత ప్రేమ పెట్టుకుంటున్నాడు రేపు దీన్ని ఒక అయ్యా చేతికి ఇచ్చే ఆలోచన ఉందా లేదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది.


సూర్య పెద్దగా ఏమి చదవలేదు తనకి ఇష్టమైనవి తినడం ఇంట్లో ఉండటం తప్ప పెద్దగా ఏమి తెలీవు. తనకి అమ్మ నాన్న నానమ్మ మరియు తన ప్రాణ స్నేహితురాలైన మైత్రి . ఇదే తనప్రపంచం.  ఇంత ఆనందంగా ఉన్న తాను చినప్పటి నుంచి చుట్టూ పక్కల వాలు తన ఆకారాన్ని చూసి ఎపుడు హేళన చేస్తూ ఉంటారు కానీ సూర్య పైకి నవ్వుతు అవ్వని భరిస్తుంది ఎందుకంటే తాను ఇంకొరికి నవ్వుకు కారణం అయ్యాను అని చిన్న ఆలోచన తనని గొడవ పడకుండా వాళ్లతో ఆనందంగా బదులు ఇస్తూ ఆ విషయాన్ని అక్కడే విడిచి పెటేస్తుంది.


**************************************************************************************

 

ఇలా ప్రశాంతంగా ఉన్న కుటుంభం లో కాంతమ్మ ఒక అను బాంబు పేలుస్తుంది.


మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మన హీరో ఎంట్రీ ఉంటుంది. స్టే ట్యూన్డ్!