Orei Bawa - Osei Maradala - 17 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 17

Featured Books
Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 17

సీత భయంగా గుటకలు మింగుతూ రామ్ వైపు చూసేసరికి అప్పటికే రామ్ కళ్ళు ఎర్రగా మారిపోయి నిప్పులు కురిపిస్తూ ఉంటే “ ఈరోజుతో నా పని అయిపోయింది..... “ అనుకుంటూ “ అది కాదు బా.... “ అని బావ అని పిలిచేలోపే రామ్ కోపంగా ఇద్దరు వైపు చూస్తూ “ మీ పర్సనల్ విషయాలు ఆఫీస్ లో మాట్లాడకండి గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ .... “ అని గట్టిగా అరిచాడు

@@@@@@@

రామ్ కోపానికి అమిత్ దెబ్బకి భయపడి లేచి నిలబడితే సీత దడుచుకొని లేచి నిలబడింది......

రామ్ కోపంగా “ వెళ్లండి ఇక మీ ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కనీసం అక్కడైనా ఇలా మాట్లాడకుండా పద్ధతిగా మీ వర్క్ మీరు చూసుకోండి...... “ అని అన్నాడు

రామ్ కనీసం తనని మాటవరసకైనా ఏం జరిగిందని అడగకుండా అలా అంటుంటే సీతకి ఏడుపు వస్తూ ఉన్న అమిత్ ముందు బయటపడటం ఇష్టం లేక కష్టంగా దాన్ని దాచుకుంటూ అది కాదు అని అనే లోపే అమిత్ భయపడి “ పద సీత వెళ్దాం సార్ చాలా కోపంలో ఉన్నట్టున్నారు !!! “ అంటూ సీత చేయి పట్టుకోగానే సీత కోపంగా అమిత్ వైపు చూసింది

అమిత్ దెబ్బకి చెయ్యి వదిలేసి భయంగా చూస్తూ ఉంటే సీత కోపంగా “ ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదా??? “ అని చెప్పి బయటకు వెళ్ళిపోతే ఆమె తన వెనకే సారీ అంటూ వెళ్ళాడు

వాళ్ళిద్దరూ వెళ్లిపోగానే రామ్ తన చైర్ లో కూర్చుని తల పట్టుకొని కొంచెం సేపు ఆలోచించి “ అసలు వీడేం మాట్లాడాడు?? సీత వాడికి ప్రపోజ్ చేయడమేంటి??? అసలు అది జరిగే పనేనా??? కచ్చితంగా ఇదైతే నిజం కాదు మధ్యలో ఏదో జరిగింది ఇంటికి వెళ్ళాక కనుక్కుంటాను...... పాపం సీత నేను కోపంగా ఆరవగానే బాధపడింది ఇంటికి వెళ్లాక దానికి సారీ చెప్పాలి..... “ అని అనుకుంటూనే

పదేపదే అమిత్ అన్నమాట గుర్తుకు వస్తూ ఒకవేళ అమిత్ సీతని ప్రేమిస్తున్నాడా??? అని అనుకోగానే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యేసరికి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు......

సీత అమిత్ ఇద్దరూ బయటికి వెళ్లాక నీతూ గుడ్లప్పగించే ఇద్దరి వైపు చూస్తూ ఉంది...... ఎందుకంటే సీత కోపంగా ముందుకు వెళుతూ ఉంటే అమిత్ తనకే సారీ చెప్తూ వెళ్తున్నాడు..... అసలు లోపల ఏం జరిగింది??? అని నీతూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ముక్క కూడా అర్థం కాక అయోమయంగా మొహం పెట్టింది......

ఎంప్లాయిస్ లేని చోటుకి రాగానే సీత కోపంగా అమిత్ తల మీద మొటికాయలు వేస్తూ “ అసలు నేను నీకు ఎందుకు ప్రపోజ్ చేశాను రా ??? ఆ మాత్రం గుర్తుకు లేదా??? ఎక్కడ ఏం వాగాలో కూడా తెలీదా??? నువ్వు మాత్రం నాకెందుకు ప్రపోజ్ చేశావు??? నేను అడిగితేనే కదా మరి ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు??? “ అని కోపంగా అడిగింది

“ జస్ట్ సరదాగా అన్నాను సీత మనం ఎంత థిక్ ఫ్రెండ్స్ అనేది అభిరామ్ సార్ కి అర్థం అవ్వాలి అని అలా అన్నాను...... నిజమే నువ్వు సీనియర్స్ ర్యాగింగ్ చేసిన విషయంలో హెల్ప్ చేయమని అడిగితే చేశాను నువ్వు ఐ లవ్ యు చెప్తే తిరిగి నేను ఐ లవ్ యు టూ చెప్పాను అంతేకానీ మన మధ్య ఏమీ లేదని మనకి తెలుసు......

కానీ ఇక్కడ ఉన్న ఎంప్లాయిస్ ని చూశాను మనం సార్ క్యాబిన్ కి వెళ్లేటప్పుడు నీవైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు...... వాళ్ళ నుంచి నిన్ను కాపాడటానికి నీతో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాననుకో మన ఇద్దరినీ లవర్స్ అనుకోని నిన్ను అసలు డిస్టర్బ్ చేయరు ..... “ అనటమే పాపం అమిత్ చెంప చెకోడీ అయ్యి కళ్ళు బైర్లు కమ్మాయి

సీత కోపంతో ఊగిపోతూ “ అంటే ఏంటి ఇప్పుడు మనిద్దరం లవర్స్ లాగా కలరింగ్ ఇచ్చి అందరి ముందు రాసుకుపోసుకొని తిరగాలా??? అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా??? లేకపోతే కాలేజ్ లో మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా???

ఇంకొకసారి ఇలాంటి తిక్క తిక్క పనులు చేశావంటే ఫ్రెండ్ అని కూడా చూడకుండా చంపేస్తాను ..... “ అని చేతులు గొంతు వరకు తీసుకువచ్చి ఛ అంటూ చేతులు వెనక్కి తీసుకొని

“ అసలు నువ్వెందుకు రా నా టీంలో పడ్డావు నన్ను చంపడానికి కాకపోతే??? గుర్తుంచుకో అమిత్ నేను ఎప్పటికీ నిన్ను లవ్ చేయను..... నీ ఇంటెన్షన్ నాకు బాగా అర్థం అయింది..... నువ్వు మంచి వాడివి అని ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నాను లేకపోతే నా రియాక్షన్ మరోలా ఉండేది......

పైగా కాలేజ్ టైమ్ నుంచే చెప్తున్నా అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకోకు అని ఇప్పుడైతే అసలు పెట్టుకోకు ...... “ అని సీరియస్ గా చెప్పి అప్పుడే ప్యూన్ పిలవడంతో అతనితో కలిసి ట్రైనర్ దగ్గర కి వెళ్ళింది....

అమిత్ బాధగా వెళ్తున్న సీత వైపే చూస్తూ “ నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పిన రోజు నేను నిన్ను మొదటిసారి చూడగానే ప్రేమించే ఐ లవ్ యు టూ చెప్పాను సీత..... నా ఇంటెన్షన్ నీకెప్పుడో అర్థమైంది అని తెలుసు కానీ నీకు నేను జస్ట్ ఫ్రెండ్ గా మాత్రమే ఇష్టమని కూడా తెలుసు......

కానీ ఎక్కడో చిన్న హోప్ కనీసం ఇప్పుడైనా నా ప్రేమని అర్థం చేసుకుంటావేమోనని ఇలా మాట్లాడితే అసలు ఏ హోప్ లేకుండా నా ప్రేమని జీవితంలో ఒప్పుకోనని చెప్పేసి వెళ్లిపోయావు ..... “ అని అనుకుంటూ బాధగా తన వెనకే వెళ్ళాడు

అలా ఆఫ్టర్నూన్ వరకు ట్రైనర్ దగ్గర ఉండి ట్రైనర్ తో కొంచెం సేపు మాట్లాడి రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని తెలుసుకొని టైమింగ్స్ తెలుసుకోనేసరికి లంచ్ టైం అయింది లంచ్ చేసేసి ఈరోజుకి వెళ్లిపోవచ్చు అని చెప్పటంతో అమిత్ సీతతో క్యాంటీన్ కి వెళ్దాం అని అడిగాడు......

సీత కోపంగా లేదు అని చెప్పి రామ్ దగ్గరికి వెళ్ళింది.....

అప్పుడే నీతూ రామ్ దగ్గరికి వెళ్లాలి అనుకున్నది కాస్త సీత వెళ్లడంతో అసహనంగా క్యాంటీన్ కి వెళ్ళిపోయింది......

అప్పటి వరకు రామ్ సీత బాధగా ఉందని తను కూడా డల్ అయిపోయి చైర్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కొంచెం సేపటి తర్వాత మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చూపిస్తూ లంచ్ అవర్ అయినా పట్టించుకోలేదు.....

రామ్ మొహం లో సీరియస్ నెస్ కంటే కళ్ళల్లో బాధ చూసిన సీత బాధగా డైరెక్ట్ గా వెళ్లి రామ్ ఒడిలో కూర్చొని తన మెడ మీద మోహాన్ని దాచి నడుము చుట్టూ చేతులు వేసి “ నువ్వు నమ్ముతున్నావా బావ నేను వాడికి నిజంగా ఐ లవ్ యు చెప్పాను అంటే ??? “ అని అడిగింది

సీత తన ఒడిలో కూర్చోగానే వచ్చింది సీత అని అర్థమైన రామ్ వర్క్ ఆపేసి తన నడుము చుట్టూ చేయి వేసి నిజం తెలుసుకోవాలి అనుకుని “ నువ్వే అన్నావు కదా సీత ఐ లవ్ యు చెప్పానని ??? ఒకవేళ నీకు అతను ఇష్టం ఉంటే చెప్పు నేను సైడ్ అయిపోతాను..... “ అని కావాలని డల్ గా మొహం పెట్టి అన్నాడు

సీత కోపంగా రామ్ మెడ మీద గట్టిగా కొరికి “ పిచ్చి పట్టిందా నీకు??? అసలు ఎందుకు ఐ లవ్ యు చెప్పానో తెలుసుకోవాలి కదా??? “ అంటూ “ కాలేజ్ లో సీనియర్స్ నేను జాయిన్ అయినా కొత్తలో ర్యాగింగ్ చేసే టైంలో అమిత్ ని చూపించి ఐ లవ్ యు చెప్పమని చెప్పారు లేకపోతే పనిష్మెంట్ కింద వాళ్ల నోట్స్ లు సంవత్సరం పాటు రాయమని చెప్పారు ...... నీకు తెలుసు కదా నాకు రాయటం అంటే ఎంత బద్ధకమో!!! అందుకే జస్ట్ అమిత్ ని ఒక బ్రదర్ గా అనుకొని ఒక ఐ లవ్ యు చెప్తే పోతుంది కదా అని తనతో డీల్ కుదుర్చుకున్నాను.....

ర్యాగింగ్ చేస్తున్నారు జస్ట్ నేను అలా చెప్తాను నువ్వు తిరిగి ఐ లవ్ యు టూ చెప్పు అంతే అని అన్నాను అమిత్ కూడా ఒప్పుకున్నాడు అంతే బావ జరిగింది..... అయినా వాడిని ఎవరినో ప్రేమిస్తే నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను చెప్పు ??? ఆ మాత్రం ఆలోచించకుండా ఇలా డల్ అయిపోతే ఎలా??? “ అంటూ ఇంకోసారి కోపంగా బుగ్గ మీద కూడా గట్టిగా కొరికింది

రామ్ అబ్బా అని అరుస్తూ “ ఏంటే ఇది చిన్న పిల్లలాగా నన్ను కొరికేస్తున్నావు??? “ అంటూ బుగ్గ నొప్పి పుడుతూ ఉంటే అక్కడ రుద్దుకొని “ కచ్చితంగా బుగ్గ మీద గాట్లు పడే ఉంటాయి..... అయినా రాక్షసిలా ఈ కొరకటం ఎక్కడ నేర్చుకున్నావు??? “ అని చిరుకోపంగా అరిచాడు అప్పటికే తన మనసులో ఉన్న చిన్న కలత సీత మాటలతో తీరిపోవటంతో ఎక్కడలేని హుషారు వచ్చింది బాబుకి

“ నీ దగ్గరే చిన్నప్పుడు నన్ను ఇలాగే కోరికే వాడివి కదా అందుకే ఇప్పుడు నేను కోరికాను..... అయినా నువ్వు నన్ను అనుమానించావు నేను నీతో మాట్లాడను పేహే!!! “ అని పైకి లేవబోతు ఉంటే రామ్ తనని లేవకుండా నడుము చుట్టూ చేతిని బిగించి మళ్లీ కూర్చోబెట్టుకొని “ లేదే నేను నిన్ను అనుమానించలేదు..... యాక్చువల్ గా నువ్వు వెళ్ళాక అనవసరంగా నీమీద అరిచానని ఫీలయ్యాను అందుకే డల్ గా ఉన్నాను..... అయినా నీ ఫ్రెండ్ అలా మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది చెప్పు??? నన్ను కూడా ఎవరైనా అలానే అంటే నీకు కోపం రాదా??? “ అని సీరియస్గా అడిగాడు

“ అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే ఇప్పటివరకు నేను చెప్పేది వినిపించుకోకుండా నన్ను దూరం పెట్టావు కదా!!! అందుకే నేను నీతో మాట్లాడను..... “ అని మూతి తిప్పుతూ చిరు కోపంగా అంది

“ అదేం లేదులేవే బాబు నువ్వు మాట్లాడకపోతే నాకు రోజు గడవదు..... అయినా నా సీత మీద నాకు నమ్మకం లేదు అనుకున్నావా??? ఆ టైంలో మైండ్ కొంచెం డిస్టర్బ్ అయి ఏం మాట్లాడాలో అర్థం కాక మిమ్మల్ని బయటకి పంపించాను..... ఇంటికి వెళ్ళాక ఈ విషయం గురించి మాట్లాడొచ్చులే అనుకున్నాను అంతేకానీ నీ మీద నాకు ఏమీ అనుమానం లేదు..... అయినా నా గురించి నీకు తెలియదా??? “ అని సీత పెదవులని రెండు వేల మధ్య పట్టి లాగుతూ అన్నాడు

రామ్ అలా అనడంతో సీత సైలెంట్ అయిపోయి పెదవుల నొప్పి పుట్టడంతో రామ్ చేతి మీద కొట్టి “ సరే సరేలే ఇకనైనా లంచ్ చెయ్ నువ్వు లంచ్ చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను...... “ అని అంది

“ ఇద్దరం కలిసి తిందాం లే రా “ అంటూ తన బాక్స్ ఓపెన్ చేసి తన ఒడిలోనే చిన్నపిల్లలా కూర్చుని ఉన్న సీతకి పెడుతూ తను తిని లంచ్ అవర్ అయిపోయే వరకు అక్కడే ఉండి తర్వాత రామ్ క్యాబ్ బుక్ చేయడంతో సీత బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది

అమిత్ కూడా సీత తన మీద కోపంగా ఉందని అందుకే తనకి చెప్పకుండా వెళ్ళిపోయిందని బాధపడి రూమ్ వెతుక్కోవడానికి వెళ్లిపోయాడు......

@@@@@@@

నీతూ రామ్ తో మాట్లాడదామని సాయంత్రం వరకు వెయిట్ చేసి రామ్ సెల్లార్ లోకి రాగానే రామ్ అని అరుస్తూ తన దగ్గరికి వెళ్లి “ రామ్ ఆరోజు షాపింగ్ మాల్ లో కనిపించిన అమ్మాయి అదే నీతో కనిపించిన నీ మరదలు ఈరోజు మన కంపెనీకి వచ్చింది కదా!!! ఎందుకు??? పైగా నీ క్యాబిన్ కి మేనేజర్ సార్ తీసుకువచ్చారు ఎందుకు???? ఆ తర్వాత మేనేజర్ సార్ వెళ్లిపోయిన మీ ఇద్దరే చాలాసేపు క్యాబిన్లో ఉండిపోయారేంటి??? అంతేకాకుండా లంచ్ అవర్ కూడా నీ దగ్గరే ఉంది ఎందుకు??? “ అని పిచ్చి ప్రశ్న వేసింది

ఇంకా ఉంది......

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......