Orei Bawa - Osei Maradala - 14 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 14

రామ్ ఫ్లాట్లోకి అడుగుపెట్టటమే మరో ప్రపంచం లోకి అడుగు పెట్టిన ఫీల్ వచ్చి కర్టన్స్ అన్ని స్కై బ్లూ కలర్ లోకి మారితే , రకరకాల షోకేస్ బొమ్మలు , వాల్స్ కి అందమైన పెయింటింగ్స్ టైప్ స్టిక్కర్స్ , హ్యాంగింగ్స్ తో పాటు డ్రీమ్ క్యాచర్ కూడా పెట్టి ఉండి హాల్ మొత్తం అందంగా కనిపిస్తూ ఉంటే అలా సడన్ గా తన ఫ్లాట్ ఒక ఫ్యామిలీ ఉండేలా తయారయ్యేసరికి కొంచెం షాక్ అయ్యి తర్వాత వెంటనే పెదవుల మీద నవ్వుతో సీత అని పిలవగానే “ హా బావ బెడ్రూంలో ఉన్న వచ్చేయ్...... “ అని అంది

బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి సీత చేస్తున్న పని చూసి షాక్ అయ్యాడు రామ్.....

@@@@@@@@

అంతగా షాక్ అయ్యే విషయం ఏం జరిగిందంటే సీత రామ్ రావటానికి అరగంట ముందు తను ఆన్లైన్లో పెట్టిన ఫోటో ఫ్రేమ్స్ అన్ని రావడంతో వాటిలో ఫొటోస్ కోసం దగ్గర్లో ఉన్న ఫోటోషాప్ కి వెళ్లి చిన్నప్పటినుంచి వాళ్ళిద్దరు కొట్టుకున్నవి తిట్టుకున్నవి నవ్వినవి ఏడ్చినవి పెళ్ళిలో స్టిల్స్ అన్ని చాలావరకు ఫ్రేమ్ తీయించి తీసుకువచ్చింది.......

అందులో హైలెట్ ఏంటంటే స్టిల్స్ లో భాగంగా తన ఫ్రెండ్స్ బలవంతం మీద రామ్ సీత బుగ్గ మీద ముద్దు పెడుతున్న ఫోటో దాదాపు 5 ఫీట్ అడుగులు ఉండేలా చేయించి అక్కడే ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకొని దాన్ని తీసుకువచ్చి బెడ్ రూమ్ ఓపెన్ చేయగానే కనిపించేలా ఎదురుగా ఉన్న వాల్ కి స్టిక్ చేస్తూ ఉంది...... అది చూసే అభి షాక్ అయ్యాడు......

“ బావ వచ్చావా??? “ అని సీత అనగానే “ ఒసేయ్ ఒసేయ్ ఏంటే ఈ పని??? ఎవరైనా ఇలాంటి ఫోటోలు ఎదురుగా పెట్టుకుంటారా??? ఎవరైనా చూస్తే ఎంత ఎంబారిసంగా ఉంటుంది??? “ అని అరుస్తూ వెళ్ళాడు

“ అబ్బా బావ మన బెడ్ రూమ్ లోకి ఎవరు వస్తారు చెప్పు??? ఈ ఫోటో నాకు బాగా నచ్చింది అందుకే ఇలా ఫ్రేమ్ తీయించి పెట్టాను.... ఏం నీకు నచ్చలేదా??? నచ్చకపోతే చెప్పు మరో బెడ్ రూమ్ ఉందిగా అందులో పెట్టుకుంటాను..... “ అని బుంగమూతి పెట్టుకుని అంది

ఆ ఫోటో ఫ్రేమ్ లో రామ్ తన ఫ్రెండ్స్ ముందు సీతకి ఇబ్బందిగా ముద్దు పెట్టడానికి ముందుకు వచ్చిన తన కళ్ళల్లో ఒక మెరుపు ఉంటే రామ్ ఊపిరి తగలగానే సీతలో చిరు సిగ్గుతోడై సిగ్గుపడుతూ బుగ్గలు ఎర్రగా మార్చి ఉండటం గమనించి పెదవులు సీతబుగ్గని గట్టిగా టచ్ చేసాయి......

అంత ఫీల్ కనిపిస్తున్న ఆ ఫోటో తీయమని లహరామ్ కి చెప్పాలి అనిపించక “ ఉంచు బాగానే ఉంది..... “ అని చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళగానే సీత నవ్వుకుంటూ “ నాకు తెలుసు ఈ ఫోటో ఎవరికైనా నచ్చుతుందని!!! “ అనుకుంటూ ఇంకా హుషారుగా ఆ ఫ్రేమ్ పెట్టేసాక మిగిలిన ఫొటోస్ ఒక్కొక్క ఫ్రేమ్లో చేరుస్తూ ఉంది...

అన్ని ఫ్రేమ్స్ వాల్క్ స్టిక్ అయిపోయే టైం కి బయటకు వచ్చిన రామ్ రూమ్ మొత్తం చూడగానే వాళ్ళ చిన్నప్పుడు రామ్ సీత అలిగిన ఫోటోలు కొట్టుకున్న ఫోటోలు కోపంగా ఉన్న ఫోటోలు నవ్వుతూ ఉన్న ఫోటోలు అన్నీ ఉండి పెద్దయ్యాక సేమ్ స్టిల్స్ ఉండి చిన్నప్పటివి మధ్యలో ఉంటే రౌండ్ గా పెద్దగా ఉన్నప్పటివి పెట్టి ఉన్నాయి...... చూడటానికి వాళ్ల జీవితం అప్పటివరకు మొత్తం కనిపిస్తున్నట్టు ఉంటుంది.....

వాటన్నిటినీ చూసి రామ్ అప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే సీత రామ్ ని బయటకి తీసుకురావడానికి “ వచ్చావా బావ ఎలా ఉంది???? నా రెన్యువేషన్??? నీకు నచ్చిందా??? “ అని ఎగ్జైటింగ్ అడిగింది

చాలా బాగుంది అని చెప్పి ఒక్కో ఫోటోని తడుముతూ ఉంటే “ నాకు తెలుసు బాగుంటుంది అని!!!! ఎంతైనా సీత సెలక్షన్ కదా!!! “ అని కాలర్ లేని డ్రెస్ ని ఎగరేసి అంది

“ చాల్లే కానీ నాకు ఇది చెప్పు నేను కాలేజీలో ఉన్న ఫోటోలు నీకు ఎక్కడివి??? “ అని అనుమానం గా అడిగాడు

“ నువ్వు అంత అనుమానం గా చూడనవసరం లేదు నైట్ నువ్వు నిద్రపోయాక బోర్ కొడుతూ ఉంటే నీ ఫోన్ గెలిగాను...... అప్పుడు నీ ఫోటోలు కనిపించి బాగున్నాయి అనిపించి నా ఫోన్లోకి షేర్ చేసుకున్నాను..... ఈరోజు ఫ్లాట్ రెన్యువేట్ చేయాలనిపించింది ఈ ఫొటోస్ అన్నీ మన జ్ఞాపకంగా ఇప్పుడు ఇలా చేశాను...... “ అని బుంగమూతి పెట్టి అంది

“ ఓ నేనింకా నా వెనక స్పై చేస్తూ కాలేజ్ వరకు వచ్చి నేనేమీ చేస్తున్నావో చూసావు అనుకున్నాను!!! “ అంటూ నవ్వుతూ చెప్పి డ్రెస్ అప్ అవడానికి కబోర్డ్ దగ్గరికి వస్తాడు

సీత బుంగమూతి పెట్టుకుని “ నాకేమీ అలాంటి అలవాట్లు లేవు..... “ అని చెప్పి “ ఇంతకీ ఇన్ని రోజులు తర్వాత ఆఫీస్ కి వెళ్ళావు కదా ఏమని చెప్పావు నీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కి??? మన పెళ్లి అయిపోయిందని చెప్పావా??? లేకపోతే ఇంకా సింగిల్ అనే చెప్పుకొని తిరుగుతున్నావా???? “ అని నడుము మీద చేతులు పెట్టుకొని అడిగింది

“ హ హ ప్రస్తుతానికైతే సింగిల్ అనే చెప్పాను..... అవసరమైనప్పుడు మింగిల్ అని చెప్తాను..... ఎందుకంటే ప్రజెంట్ నా స్టేటస్ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు..... “ అనగానే సీత మనసు కలుక్కుమని “ అంటే నన్ను నీ భార్యగా ఎవరికి పరిచయం చేయవా??? “ అని డల్ గా అడిగింది

“ ఇప్పుడు కాదు సీత సమయం వచ్చినప్పుడు నేనే అందరికీ నిన్ను నా భార్యను పరిచయం చేస్తాను..... అప్పటివరకు ఆగు..... మా మంచి సీతమ్మవి కదా!!! “ అని డ్రెస్ వేసుకోవటం అయిపోవడంతో అలిగి బుంగమూతి పెట్టి ఉన్న సీత గడ్డం పట్టుకుని లాడుతూ అన్నాడు

“ అయితే నేను కూడా సింగిల్ అనే చెప్తాను ఆఫీస్ లో జాయిన్ అయ్యాక!!!! మింగిల్ అని చెప్తే నువ్వు కూడా ఫీల్ అవుతావు కదా!!!! “ అని విసురుగా అంది

“ ఓయ్ అదేంటి నేను కొన్ని రీజన్స్ వల్ల నీకు నాకు పెళ్లయిందని చెప్పలేదు.... మరి నువ్వు ఏ రీజన్ తో నీకు పెళ్లి అవ్వలేదని చెప్తావు??? అలా చెప్తే నీకు ఎంతమంది ట్రై చేస్తారో తెలుసా??? “ అని కంగారులో అన్నాడు

“ హా ఇక్కడ కూడా సేమ్ సిచువేషన్..... నాతో నీ పెళ్లయిపోయిందని తెలిసాక నీ లవర్ బాధపడుతుందేమో అందుకే చెప్పలేదు ఏమో అనిపిస్తుంది!!! “ అనగానే రామ్ కళ్ళు రెడ్గా మారడం గమనించి “ బాబోయ్ కోపం వచ్చినట్టుంది అనవసరంగా గెలికానా???? “ అనుకుంటూ

“ అలా అనుకున్నాను అంతే కానీ అది నిజం కాదు కదా!!!! నా బావ శ్రీరామచంద్రుడు ఒకే బాణం ఒకే భార్య అంతే మరొకరి వైపు కన్నెత్తి కూడా చూడడు...... నాకు ఆ నమ్మకం ఉంది కానీ మనిద్దరికీ పెళ్లి అయ్యిందని ఒకేసారి చెప్పాలని నా ఇంటెన్షన్ అంతే!!!!! నువ్వు కోపం తెచ్చుకోకు బావ..... “ అని రామ్ చెంప నిమురుతూ అంది

రామ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ” ఇంకొకసారి నన్ను మరొకరితో లింక్ చేసి మాట్లాడకు సీత నాకు కోపం వస్తుంది..... “ అని చెప్పి బయటికి వెళ్తూ “ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేశావు??? “ అని అడిగాడు

“ ఎక్కడ స్నాక్స్ బావ ఇంటిని రెడీ చేయనే సరిపోయింది...... అందుకే మనం సరదాగా బయటికి వెళ్దామా??? ప్లీజ్ ప్లీజ్ బావ “ అని గడ్డం పట్టుకుని బ్రతిమిలాడింది సీత

రామ్ నవ్వుతూ ఓకే అనగానే “ అయితే ఉండు వెంటనే రెడీ అయి వస్తాను..... “ అంటూ ఎగ్జైట్ అవుతూ లోపలికి వెళ్లి అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ వేసుకొనిజుట్టుని వన్ సైడ్ పిన్ పెట్టి సెకండ్ సైడ్ వదిలేసి లైట్ మేకప్ వేసుకుని బొట్టు కుంకుమ పెట్టుకుని పాపిటి నిండుగా కుంకుమ పెట్టుకొని కళ్ళకి కాటుకదిద్ది గాజులు వేసుకుని అవి సరి చేసుకుంటూ బయటికి వచ్చింది సీత.....

గాజుల శబ్దానికి సోఫాలో కూర్చుని ఉన్న రామ్ వెనక్కి తిరిగి సీతని చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు...... సీత అచ్చం భూలోకపు గాంధర్వ కన్యల అందంగా ఉంది.....

సీత రామ్ ని పట్టించుకోకుండా తన గాజులు సరి చేసుకుంటూ వచ్చి “ వెళ్దామా బావ ??? “ అనగానే రామ్ సీత బుగ్గ మీద ముద్దు పెట్టి “ బ్యూటిఫుల్ చాలా అందంగా ఉన్నావు...... “ అని చెప్పి సీత కంటి కోసల కాటుక తీసి చెవి వెనుక పెట్టి విజిల్ వేసుకుంటూ మరి బైక్ కుస్ తిప్పుకుంటూ బయటికి వెళ్తే సీత నవ్వుకుంటూ రామ్ వెనుక వెళ్ళింది......

అలా ఇద్దరు కలిసి జుయ్ జుయ్ అని హైదరాబాద్ రోడ్ల మీద బయలుదేరి ఏం తిందామని రామ్ అడగగానే పానీ పూరి చాట్ బేల్ పూరి అని పెదాలు నాలుకతో తడుపుతూ నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటే కళ్ళల్లో మెరుపుతో ఎగ్జైటింగ్ గా ఉంది సీత......

“ ఆ చెత్త తప్ప ఇంకొకటి తినవా??? “ అని మొహం చిట్లిచ్చి అడిగాడు రామ్

“ నీకు తెలియదు బావా వాటి టేస్ట్!!!! ఒక్కసారి టేస్ట్ చెయ్ ఇంకెప్పుడూ ఇలా మాట్లాడవు...... ఎప్పుడు హెల్తీ ఫుడ్ అంటూ ఇంట్లో ఇంట్లోనే కూర్చుని ఇంట్లో వంటకాలు మాత్రమే తినడం కాదు అలా బయటకు వెళ్లి బయట రుచులు కూడా చూడాలి.....ళ” అని జ్ఞానోపదేశం చేస్తూ ఉంటే “ అమ్మ తల్లి ఆపు నీ ఉపన్యాసం...... ఇప్పుడు పానీపూరి కావాలి అంతే కదా పద..... “ అంటూ రోడ్ సైడ్ పానీపూరి బండి కనిపించగానే ఆపి నువ్వు వెళ్ళు అనగానే నువ్వు కూడా రా బావ అని సీత అడిగింది

“ నాకు ఈ అన్ హేల్ది ఫుడ్ అసలు నచ్చదని నీకు తెలుసు కదా!!!! నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు వెళ్లి తిను..... “ అని సీరియస్ గా చెప్పగానే సీత బుంగమూతి పెట్టుకొని వెళ్లి పానీ పూరి చెప్పి నిలబడగానే అతను పానీపూరీకి సంబంధించిన ఇంగ్రిడియంట్స్ అన్ని వేసి ఎక్స్ట్రా ఆనియన్స్ వేసి అందిస్తూ ఉంటే వాటి టేస్ట్ ఆస్వాదిస్తూ ఒక్కొక్కటి మైమర్చిపోయి కళ్ళు మూసుకొని మరీ తింటుంది సీత......

సీత తినే విధానానికి రామ్ నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటే “ అంత టేస్టీగా ఉంటాయా ఇవి??? “ అని అనుకుంటూ తినాలని అనిపించిన సీత ముందు కొట్టిన డబ్బాకి ఇప్పుడు వెళ్లి అడిగితే చులకన అయిపోతాడేమోనని బెట్టుగా అంతే ఉన్నాడు

ఇంతలో సీత రామ్ ఎక్స్ప్రెస్ గమనించి నవ్వుకుంటూ రామ్ దగ్గరికి వచ్చి ఆ పట్టు బావ అంటూ బలవంతంగా రామ్ నోట్లో పానీపూరి కుక్కి రామ్ తిన్నాక “ ఎలా ఉంది టేస్ట్??? ఆదుర్స్ కదా??? అందుకే చెప్పేది అప్పుడప్పుడు అన్ని రకాల టెస్ట్స్ చూడమని!!!! “ అంటూ మరో పానీపూరి వేయించుకొని రామ్ కి పెడుతూ ఉంటే “ నేను తింటాను నువ్వు తిను..... “ అంటూ చెప్పి ఇద్దరూ చెరో మూడు ప్లేట్ల వరకు లాగించేశారు

తర్వాత సీత చాట్ బేల్ పూరి రెండు చెప్పి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుని రామ్ నీ తన పక్కన కూర్చోబెట్టుకొని “ ఎలా ఉంది బావ టేస్ట్ నీకు బాగా నచ్చింది కదా??? నచ్చే ఉంటుందిలే అందుకే మూడు ప్లేట్లు తిన్నావు కదా!!! అప్పుడే అర్థమైపోయింది....
“ అని నవ్వుతూ అంది

“ హ్మ్ బాగుంది బట్ హెవీగా తినకూడదు ఎంతైనా రోడ్ సైడ్ ఫుడ్ కదా!!! “ అని కావాలని గంభీరంగా మొహం పెట్టుకొని అన్నాడు

సీత నవ్వుతూ “ హహ బావ చాల్లే కవరింగ్..... “ అంటూ ఉండగానే చాట్ బేల్ పూరి రెండు రావటంతో ఇద్దరు షేర్ చేసుకొని తిని సరదాగా మరొక అరగంట హైదరాబాద్ రోడ్ల మీద తిరిగి ఇంటికి చేరుకొని ఇక నేను డిన్నర్ చేయలేను బావ పొట్ట ఫుల్ అయింది అనగానే నాకు కూడా ఫుల్ అయ్యింది అని బద్ధకంగా రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడిపోగానే సీత కూడా రామ్ వెనకే వెళ్లి రామ్ పక్కనే పడుకొని “ బావ మరో నాలుగు రోజుల్లో నా జాయినింగ్ కూడా ఉంది..... “ అని నవ్వుతూ అంది

“ ఓకే ఆ రోజు నేనే నిన్న ఆఫీసులో డ్రాప్ చేస్తాను సరేనా!!!!! “ అని చెప్పి అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇద్దరు హ్యాపీగా నిద్రపోయారు

అలా నాలుగు రోజులు రామ్ ఆఫీస్ కి వెళ్తే సీత ఇంట్లో ఉంటూ తన వాళ్లతో అప్పుడప్పుడు మాట్లాడుతూ డైలీ యూట్యూబ్లో చూస్తూ రకరకాల వంటలు తయారు చేస్తూ రామ్ మీద వాటిని ప్రయోగిస్తూ ఉంటే రామ్ వాటికి బలవుతూ ఉన్నాడు......

ఇంకా ఉంది......

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......