Love Affair - 2 in Telugu Love Stories by Aaradhya Roy books and stories PDF | ప్రేమాధ్యంతం - 2

Featured Books
Categories
Share

ప్రేమాధ్యంతం - 2

తన తల్లి తండ్రిని చూస్తూ ఏడుస్తున్న ఆమె కన్నీరు రాథోడ్ మనసుని కాస్త కూడా కరిగించవు ఆ క్షణం.

ఇరవై ఏళ్ళు కంటికి రెప్పలా మారి తన అమ్మ, నాన్న చెంతన ఆనందంగా గడిపిన ఆ అమ్మాయి ప్రయాణం ఓ భయంకరమైన నరక కూపంలోకి వెళ్తుంటే కన్నీరు, మున్నీరుగా విలపిస్తాయి అక్కడి తండా వాసుల సున్నిత హృదయాలు.

"దయచేసి నన్ను వదిలేయండి దొర, మీ కాళ్లు పట్టుకుంటాను"... అంటూ ఎక్కిళ్ళు పెడుతున్న ఆ అమ్మాయి మాటలు పూర్తి కాకుండానే ఒక్కసారిగా బిగుసుకుపోతుంది.

పోకెట్ నుండి తీసిన గన్ వేళ్ళతో తిప్పుతున్న అతని చర్యకి గొంతులో మాటలు అక్కడే సమాధి చేసి మెల్లిగా సీట్ చివరికి జరిగి ముడుచుకుపోతుంది.

ఆమె భయాన్ని ఫ్రంట్ మిర్రర్ నుండి చూసిన అతని పెదవుల్లో రాక్షస నవ్వు.

@@@@@

ఆరు నెలల తరువాత...

ఉదయం ఏడు గంటలు.....

రాథోడ్ విల్లా.....

గేట్ ముందు నిల్చొని భయంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇద్దరు నడివయసు దంపతులు.

సాధారణ పంచె కట్టులో ఉన్న సుబ్బరాజు, రంగు వెలిసిన కాటన్ చీరలో ఉన్న అతని భార్య విజయలక్ష్మి.
అడుగులో అడుగు వేసుకుంటూ వాచ్ మెన్ ని పిలుస్తారు.

"ఎవరు కావాలండి??"...వాళ్ళ అవతారాలు చూసి అయోమయంగా అడుగుతాడు వాచ్మెన్.

"జయమ్మ గారిని కలవాలి!!"... అతని చూపులకి ఇబ్బందిగా చెప్పగానే అనుమానంగానే తనే దగ్గరుండి గుమ్మం దాకా తీసుకెళ్తాడు.

గుమ్మం నుండి ఇంటి లోపలికి చూస్తున్న ఆ తల్లిదండ్రుల గుండెలు ముక్కలయిపోతాయి. ఎదురుగా కొంచెం దూరంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు ఆ ఇంటి పనిమనిషిగా ఇల్లు తుడుస్తూ కనిపిస్తుంటే గుండె బరువెక్కుతుంది ఆ దంపతులకి.

అందంగా, బోద్దుగా ఉండే తన కూతురు ఆరు నెలల్లో బక్క చిక్కి ఒంట్లో ప్రాణం లేనట్టుగా కనిపిస్తుంటే తమ బ్రతుకు మీద తమకే అసహ్యం.

"ఏమయ్యా!! నా బిడ్డ... సూడయ్యా ఎలా అయిందో??"... అంటూ పసిపాపలా ఏడుస్తున్న తన భార్య మాటలకి అతను మాత్రం ఏమని చెప్పి ఓదార్చాగలడు.

"మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్లి ఇంట్లో చెప్పి మిమ్మల్ని పిలుస్తాను!"... అంటున్న వాచ్మెన్ మాటలకి కన్నీళ్లు తుడుచుకొని మౌనంగా ఉండిపోతారు.

ఐదునిమిషాలకి వాళ్ళని లోపలికి పంపగానే ఆ ఇంటి వాళ్ళు ఆప్యాయంగా పలకరిస్తారు వారిని. ఇంట్లో వాళ్ళు ఎన్నీ మాట్లాడుతున్న ఆ ఇద్దరి ప్రాణం తమ పంచప్రాణాల కోసం వెతుకుతుంటే అక్కడున్న వారందరు బాధగా చూస్తారు వాళ్లిద్దరి వైపు.

"అయ్యా!! ఒక్కసారి నా బిడ్డని సుసేసి పోతాం అయ్యా ఇది దాని మీద బెంగేట్టుకొని ఆరోగ్యం పాడు సేసుకుంటుంది. ఒక్కసారి సుపిత్తే ఎల్లిపోతాం అయ్యా!!"...అంటూ దీనంగా వేడుకుంటున్న సుబ్బయ్యని చూసి వారి కళ్ళల్లో కంటి చెమ్మ.

ఆ దంపతులు ఎంతగా అడిగిన వారి దగ్గరి నుండి జాలి చూపులు, మౌనం తప్ప ఇంకేం సమాధానంగా రాకపోతుంటే చేతులెత్తి కన్నీళ్లతో దండం పెట్టి వెనుదిరుగుతారు.

మూడు నెలల క్రితం వచ్చినప్పుడు ఎలాంటి సమాధానం దొరికిందో ఇప్పుడు అదే సమాధానం కాకపోతే ఈ సారి వాళ్ళకి తమ కూతురిని దూరంగా చూసుకునే అదృష్టం ఇచ్చాడు భగవంతుడు.

వాళ్ళు వచ్చిన దగ్గరి నుండి ఊపిరి బిగబట్టి కన్నీళ్లు ఆపుకుంటూ చూస్తూ ఉంటుంది పేరుకి ఆ ఇంటి కోడలు, వాస్తవానికి ఆ ఇంటి పనిమనిషి అయిన ఇరవై ఏళ్ల అమ్మాయి.

ఆరు నెలల తరువాత చూస్తున్న తమ తల్లి దండ్రులు, బాధగా తన గురించి అడుగుతుంటే ఏ కూతురికైనా కన్నీళ్లు ఆగవు కానీ ఆమె కంట్లో నీళ్లు వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో గుర్తొచ్చి బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటూ తన అమ్మ నాన్న రూపాలని మనసారా మనసులో నింపుకుంటుంది.

మరుక్షణం ఆమె భుజం మీద పడిన చేతి స్పర్శకి వెనక్కి తిరిగి చూడకుండానే భయంతో బిగుసుకుపోయి బొమ్మలా నిలుక్కుపోతుంది.

"చూసుకున్నావా నీ వాళ్ళని?"...

ఘంబిరమైన గొంతుతో సన్నని నవ్వు రువ్వుతు ప్రశ్నిస్తున్న అతని స్పర్శకి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే గుటకలు మింగుతు మెల్లిగా వెనక్కి తిరుగుతుంది.

గ్రే కలర్ ట్రాక్ పాంట్ లో, బ్లాక్ కలర్ కట్ బనియన్ తో ఒళ్ళు విరుచుకుంటున్న అతన్ని చూసి అంగుళం దూరంలో మృత్యువు చుసినంతగా వణుకుతుంది.

"నన్ను అడగకుండానే, నా అనుమతి లేకుండానే నీ వాళ్ళని తృప్తిగా చూసుకున్నావు కదా?"...

చూపుడు వేలితో ఆమె బుగ్గ నుండి గడ్డం వరకు తాకిస్తూ అతి చిన్నగా అడుగుతాడు కానీ ఆ గొంతులో బేస్ కి ఆమెలో వణుకు పదింతలు పెరుగుతుంది.

"ఎలాగో నీ అమ్మ, బాబుని చూసుకున్నావు కాబట్టి ఇంక ఈ భూమ్మీద వాళ్ళతో పనేముంది చెప్పు?"... అని కన్నింగ్ గా అడుగుతున్న అతని కాళ్ళని క్షణాల్లో చుట్టుకుంటాయి ఆమె చేతులు.

"వద్దు దొర!! నువ్వెది చెప్తే అదే చేస్తాను, దయచేసి నా అమ్మ, అయ్యని వదిలిపెట్టు దొర"... అని కన్నీళ్లతో అతని కాళ్ళని అభిషేకిస్తుంటే విసురుగా తన జబ్బ పట్టి పైకి లేపుతాడు రాథోడ్.

ఎక్కిళ్ళు పెడుతూ భయంగా కళ్ళు మూసుకున్న ఆమె గొంతు నులుమూతు..."నీ చేతి స్పర్శ నా చెంప మీద ఎంతలా ముద్రించుకుపోయిందో నువ్వింకా పూర్తిగా చూడలేదు కోమలి, చూపిస్తా ముందు ముందు"... అని ఆఖరి మాటని గట్టిగా అరిచి తనని నెట్టి అక్కడి నుండి గదిలోకి వెళ్తాడు.

వెనక నుండి అతన్ని చూస్తున్న ఆమె కంట్లో కన్నీరు ధారళంగా కారుతుంటే, ఓదార్పుకి ఆ కన్నీళ్లని చెరిపేస్తుంది ఓ ఆప్యాయత నిండిన చేతి స్పర్శ.


ఇంకా ఉంది ❤️...

షేర్ యువర్ ఒపీనియన్... ❣️