Truth - 32 in Telugu Thriller by Rajani books and stories PDF | నిజం - 32

The Author
Featured Books
Categories
Share

నిజం - 32

విజయ్ మాటలకు రామారావు గారు సరే అని తల వూపుతోంటే మరో పక్క సాగర్ , విజ్జి మాత్రం విజయ్ వైపు జాలిగా చూస్తూ వున్నారు . వాళ్ళిద్దరినీ గమనించిన విజయ్ వీళ్లిద్దరూ మా పెదనాన్న కి అనుమానం వచ్చేటట్టు బిహేవ్ చేస్తున్నారు అని మనసులో అనుకొని ,సాగర్ ఇక వెళదామా అన్నాడు భుజం గట్టిగా నొక్కుతూ , విషయం అర్థమయయిన సాగర్ ఆ వెళదాం అని రాని నవ్వు తెచ్చుకొని సరే వెళ్ళొస్తాము అని అందరికీ చెప్పి విజ్జి ని తీసుకొని బయటికి నడిచాడు వాళ్ళ వెనుకే విజయ్ కూడా బయటకు నడిచాడు.
బయట జీప్ లో రాఘవులు వచ్చి ముగ్గురినీ ఎక్కించుకొన్నాడు ఎలా జరిగింది sir ప్రయాణం , ఇంతకీ వెళ్లిన విషయం ఏమయింది , సాగర్ ని ఫోన్ లో అడిగితే అక్కడికి వచ్చాక చెప్తా అన్నాడు అని మాట్లాడుతూ వుంటే విజయ్ మాత్రం పరధ్యానం గా వున్నాడు , sir ఏమయింది అని రాఘవులు గట్టిగా అనగానే ఈ లోకంలోకి వచ్చిన విజయ్ , uncle జర్నీ చేయడం వల్ల కొంచం tired గా వున్నాను అంతే , అక్కడ జరిగిందంతా సాగర్ మీకు చెప్తాడు , మీరు మాత్రం రేపు స్టేషన్ కి త్వరగా వచ్చేయండి మనకు చాలా పని వుంది అనడం తో సరే sir అని , విజయ్ ని పోలీస్ క్వార్టర్స్ దగ్గర దింపి , సాగర్ , విజ్జి లను తీసుకొని ఇంటికి వెళ్ళాడు రాఘవులు.
మరోవైపు పడుకోడానికి తన గదికి వెళ్లిన గంగ గది తలుపు ఎవరో కొట్టడం తో, ఈ టైం లో ఎవరబ్బా అని ఆలోచిస్తూ తలుపు తీసిన గంగ ఎదురుగా తన అన్నయ్య మోహన్ ని చూసి ఏన్టి అన్నయ్య ఈ టైం లో వచ్చావు ఏమయినా మాట్లాడాలా అంది గంగ.
అందుకు మోహన్ గంభీరంగా , ఫోన్ లో ఏమడిగినా ఇంటికి వచ్చాక చెప్తా అంటూ ఫోన్ పెట్టేసావు ఇప్పుడేమో ఏమయినా మాట్లాడాలా అనంటున్నావు అన్నాడు గది లోపలికి వస్తూ .
గంగ : అది కాదు అన్నయ్య జర్నీ వల్ల అలసిపోయాను అందుకే అలా అనేసా .
మోహన్ : సరేలే ఇంతకీ బాబాయి గురించి ఏమయియా తెలిసిందా లేదా .
మోహన్ బాబాయ్ అనగానే గంగ కళ్లల్లో నీళ్ళు వచ్చేశాయి , అది చూసిన మోహన్ కంగారు పడుతూ చిన్నీ ఏమైందిరా అని అడిగాడు గంగ ని దగ్గరికి తీసుకొని ఇక గంగ మోహన్ ముందు నిజం దాచలేక పోయింది , అది అది మన బాబాయ్ అంటూ. జరిగిందంతా చెప్పేసింది.
అంతా విన్న మోహన్ అన్టే మన విజయ్ నిజంగానే నాకు తమ్ముడా అన్నాడు ఆనందంగా .
అవును అన్నట్టు తల వూపింది గంగ మోహన్ కళ్ళలోకి చూస్తూ .
అంతలోనే ఏదో గుర్తు వచ్చిన్నట్టుగా , అనట్టు అనాయ్యా ఈ విషయం నాన్నకి గానీ బయట వాళ్లకు గానీ చెప్పొద్దని విజయ్ అన్నయ్య అన్నాడు అంది గంగ.
తన తమ్ముడు లేడని నాన్నకి సమయం చూసి చెప్పాలి , విజయ్ ఎప్పుడంటే అప్పుడే చెబుదాం, సరే నువ్వు పడుకో మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చోకు అని గది నుండి బయటకు వెళుతుంటే , నేనిప్పుడు సాగర్ తో చాట్ చేస్తానని అన్నయ్య కి ఎలా తెలుసు అని గంగ మనసులో అనుకొంటుంటే, నాకు అన్నీ తెలుసు అని వెనక్కి తిరక్కుండానే అనేసి వెళ్ళిపోయాడు మోహన్.
అబ్బా ఈ అన్నయ్యలున్నారే అనుకుంటూ తల కొట్టుకుని తలుపు వేసేసి వెళ్లి పడుకుంది.
మరోపక్క సాగర్ ఇంట్లో రాఘవులు కి ,విజ్జి జరిగింది అంతా సినిమా స్టోరీ లాగా తన. హావ భావాలతో విడమర్చి చెప్పింది , అదంతా చూసి ఈ ఆడవాళ్ళు మనసులో ఏది దాచుకోలేరు అనుకున్నాడు మనసులో.
అదంతా విన్న రాఘవులు , నాకందుకే మొదటి నుండీ విజయ్ గారికి , మోహన్ కి పోలికలు వున్నట్టు అనిపించింది అన్నాడు ఆనందం గా.
నాన్న ఈ విషయం అప్పుడే ఎవరితో అనకండి అన్నాడు సాగర్.
రాఘవులు: సరేరా, రేపు మీ అమ్మ వూరి నుంచి వస్తుంది దాని ముందు ఈ టాపిక్ తేవద్దు , దానికి తెలిస్తే వూరంతా తెల్సినట్టే .
సరే అనట్టు తలలూపి నిద్రకు ఉపక్రమించారు.
ఒంటరిగా వున్న విజయ్ కు మాత్రం తన మెదడు. అంతా ఆలోచనలతో నిండపోయింది ఇంతలో తన ఫోన్ రింగ్. అవడం తో సాలోచనగా ఫోన్ లిఫ్ట్ చేశాడు.
అటు. వైపు కన్నా అంటూ ప్రేమగా పలకరించింది తన తల్లి .
తల్లి తో కాసేపు మాట్లాడిన విజయ్ కి మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది.
ఫోన్ పెట్టేసి వెళ్లి తన స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని ఒక పెన్ , పేపర్ బయటకి తీసాడు.
నేను ఇప్పటివరకూ ఈ case ని రామారావు గారి ఫ్యామిలీకి వైపు నుండే చూసాను , ఇప్పుడు శరభయ్య ఫ్యామిలీ వైపు నుండి చూస్తాను . Maybe వాళ్ళు అసలు శరభయ్య ని అరెస్ట్ మర్డర్ కేసు లో ఇరికించడానికే ఇదంతా చేసి వుంటారా , అసలు శరభయ్య శత్రువులు ఎవరు వుండి వుంటారు , ఒక వేళ వున్నా సరే కోపం వుంటే తన మీద డైరెక్ట్ గానే ఎటాక్ చేయొచ్చు కానీ ఇదంతా ఎందుకు చేశారు అని ఆలోచిస్తూ వున్నాడు.