కార్ లో వ్యూ మిర్రర్ లో నుండి విజ్జి ని చూస్తూ ఉన్నాడు విజయ్ , వీడు duty మీద వెళుతున్నాడా లేకపోతే సైట్ కొట్టడానికి ఇలా ట్రిప్ ప్లాన్ చేశాడా అని గంగ చెవిలో అంది విద్య .
విద్య వైపు సీరియస్ గా చూసింది గంగ .
అబ్బో ఈ మధ్య నీకు నాకంటే మీ అన్నయ్యే ఎక్కువై పోయాడు అనుకుంటా అంది బుంగ మూతి పెట్టుకొనింది విద్య .
Duty మీద వెళుతుంటే మాత్రం ఏంటి కార్ విండో లుండి బయటకు చూస్తూ క్రిమినల్స్ ని వేటకమన్టావా చెప్పు అని కౌంటర్ ఇచ్చింది గంగ.
గంగ : మా అన్నయ్య తలుచుకుంటే అమ్మాయిలు క్యూ లో నిల్చుంటారు తెలుసా , నువ్విలానే పొగరు చూపించావంటే తాతయ్య వాళ్ల వూరిలో ఎవరయినా మంచి అమ్మాయిని చూసి మా అన్నయ్యకు సెట్ చేసేస్తా అప్పుడు నీ తిక్క కుదురుతుంది .
చూసుకో నాకేంటి అని మూతి తిప్పుకుంది విద్య .😏
విద్య మొహం చూసి నవ్వుకుంది గంగ .
ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరూ ఏవో జోక్స్ చెప్పుకుంటూ వున్నారు, అదేదో మాకు కూడా చెప్పొచ్చుగా అన్నాడు గంగ నవ్వడం గమనించిన సాగర్ .
అబ్బే ఏం లేదు చిన్ను మా కాలేజ్ లో ఒక అమ్మాయి గురించి మాట్లాడు కుంటున్నాం లే అని చిన్ను అన్నందుకు నాలుక కరుచుకుంది గంగ .
ఓహో చిన్నూ అంటూ అరిచారు ఒకేసారి విద్య , విజయ్.
అబ్బా తింగరబుచ్చి నన్ను బుక్ చేసేసింది అడ్డంగా అనుకున్నాడు మనసులో సాగర్ .
మంచినీళ్లు తాగుతావా చిన్నూ అన్నాడు విజయ్ నవ్వుతూ .
అబ్బా ఆకలేస్తుంది చిన్నూ అంది విద్య .
అబ్బా ఆపండి రా ఇంకా అసలే డ్రైవింగ్ లో వున్నాను, లెట్ మి కాన్సంట్రేట్ ఆన్ ద డ్రైవింగ్ అన్నాడు సాగర్ ఆ topic ని డైవర్ట్ చేయడానికి.
అవును విజయ్ , చిన్నూ ని డిస్టర్బ్ చేయకు అని నవ్వేసింది విద్య .
విద్య ఫస్ట్ టైం తనతో నవ్వుతూ మాట్లాడినందుకు చాలా హ్యాపీ గా అయ్యాడు విజయ్ , మనసంతా గాలిలో తేలిపోతున్నట్టు ఫీల్ అయ్యాడు . అప్పుడే బయట చల్ల గాలి , తొలకరి చినుకులు మొదలయ్యాయి.
మధ్యాహ్నం అయ్యింది .
నాకు బాగా ఆకలేస్తుంది ఎక్కడయినా ఆగుదాం కదా అంది గంగ .
సరే బంగారం ఎక్కడయినా ధాబా చూసి ఆపుతా , నీకు ఇష్టమయిన ఆలూ పరోటా తిందువు అన్నాడు సాగర్.
మాకు ఆకలంటే ఎవ్వరూ పట్టించుకోరు , బంగారం కి ఆకలయితే నే పట్టించు కుంటారు అంది విద్య అలిగి నట్టు నటిస్తూ ,
నువ్వు అడిగినప్పుడు ఏ టైమ్ అయింది చెప్పు , నువ్వు కావాలనే అప్పుడు అలా అన్నావని నాకు తెలుసు , నీకు ఇష్టమయిన పుల్కా , ఎగ్ బుర్జి కూడా తిందువు సరేనా అన్నాడు సాగర్ నవ్వుతూ.
నువ్వు చెబుతుంటే నే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి , అర్జంట్ గా దాభా కనిపిస్తే బాగుండు అంది విండో లోంచి అటూ , ఇటూ చూస్తూ విద్య .
అబ్బా చిన్నపిల్ల లాగా ఫేస్ పెట్టి ఎంత క్యూట్ గా వున్నావే నా బంగారం అనుకున్నాడు విజయ్ , విద్య ని మిర్రర్ లో నుండి చూస్తూ .
ఇంతలో ఒక ధాబా కనిపిస్తే ఆగి లోపలికి వెళ్లారు.
ఒక ఖాళీ place చూసుకొని వెళ్లి కూర్చున్నారు నలుగురూ .
Food ఆర్డర్ చేసుకొని రాగానే కబుర్లు చెప్పుకుంటూ తినడం స్టార్ట్ చేసారు.
బీచ్ కి వెళ్ళి ఆడుకొని అలసిపోగానే అక్కడున్న ధాబా లో ఇలానే కూర్చొని తినేవాళ్ళం ఎన్ని రోజులు అయిందో కదా అలా వెళ్ళి , అన్నాడు సాగర్ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ .
అవును ఈ సారి మనతో విజయ్ అన్నయ్య కూడా వస్తాడు , మనం తిరిగి వూరికి వచ్చాక ఒకరోజు బీచ్ కి వెళదాం సరదాగా అంది గంగ వుత్సాహంగా.
ఒక సిక్స్ మంత్స్ వరకు అలాంటివి ఏవి పెట్టుకోకు , ఇప్పటికే చాలా క్లాసెస్ మిస్ అయ్యాం , కాలేజ్ కి వెళ్ళగానే పెండింగ్ నోట్స్ అంతా ఫినిష్ చేయాలి అంది విద్య.
అబ్బా ఒక్క రోజు గురించి కూడా ఇంత క్లాస్ పీకకే అంది గంగ .
చూడు ఈ సిక్స్ మంత్స్ కష్టపడి చదవాలి తప్పదు , ఆ తరువాత కావాలంటే మచలీపట్నం బీచ్ ఏం ఖర్మ చక్కగా పెళ్లి చేసుకుని మీ వారితో గోవా బీచ్ కి వెళ్లి రా అంది విద్య గంగని ఆట పట్టిస్తూ .
విద్య మాటలకి సిగ్గు పడింది గంగ , గంగ వైపు అలా చూస్తూ ఉన్నాడు సాగర్ .
మా అన్నా , వదిన లకు పెళ్లి కళ వచ్చేసింది అంది విద్య నవ్వుతూ .
గంగ : ఏమోనే పెళ్లి విషయం తలుచుకుంటేనే భయం గా వుంది , నాన్న గారికి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలీడం లేదు.
సాగర్ : మోహన్ బావ ఎలాగయినా uncle ని ఒప్పిస్తాడు నువ్వేం భయపడకు బంగారం.
విద్య : ఇప్పుడు నీకు ఇద్దరు అన్నయ్యలు వున్నారు కదా గంగా ఎలా అయినా ఒప్పిస్తారు , నువ్వు టెన్షన్ పడకు .
అమ్మో ఏంటి విజ్జి నా గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడుతుంది అనుకున్నాడు మనసులో విజయ్ .
విజయ్ : అవును గంగ మేమంతా ఎలాగయినా సరే మీ పెళ్లి జరింపించి తీరుతాం .
గంగ : థాంక్స్ అన్నయ్య. 😊
విద్య : మా గంగ ఎప్పుడూ ఇలా నవ్వుతూనే వుండాలి.😀
విజయ్ ఫోన్ రింగ్ అయింది , ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు విజయ్ , ఫోన్ లో అటు నుండి హెల్లో mr.విజయ్ , నేను మచలీపట్నం స్టేషన్ నుండి SI ప్రభాకర్ ని మాట్లాడుతున్నా .
విజయ్ : చెప్పండి mr.ప్రభాకర్ ఆ పీటర్ గురించి ఏమయినా తెలిసిందా .
ప్రభాకర్ : మాకు 2 డేస్ కిందట బీచ్ లో ఒక గుర్తు తెలియని dead body దొరికింది , చేపలు తినేయటం వల్ల ఫేస్ ని గుర్తుపట్టలేదు , బాడీ ని పోస్ట్ మార్టం కి పంపాము , అతన్ని గొంతు కోసి చంపి సముద్రం లో పడేశారు అని తెలిసింది .
జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఆ dead కనిపించింది .
ప్రభాకర్ చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు విజయ్.
అతని dead body మీద వున్న బట్టలు చూసి గుర్తు పట్టి ఒక అతను అతడిని కొన్ని రోజుల ముందు బీచ్ లో రాత్రి పూట మందు తాగుతూ కనిపించాడు అని చెప్పాడు.
విజయ్ : ఆ బాడీ ఎవరిదో తెలిసిందా ?
ప్రభాకర్ : గుర్తు పట్టిన అతని తో స్కెచ్ వేయించాము , ఆ స్కెచ్ లోని అతను , మీరు మా స్టేషన్ కి పంపిన స్కెచ్ లోని అతను ఒక్కడే. సో పీటర్ is dead , he is no more Mr.విజయ్ .
షాక్ అయ్యి కళ్ళు పెద్దగా చేసి వాట్ అని గట్టిగా అన్నాడు విజయ్ .
అక్కడికి దగ్గరలోనే ఉన్న గంగ , సాగర్, విద్య ముగ్గురూ విజయ్ అరుపుకి ఉలిక్కి పడి అతని వైపు చూసారు .
విజయ్ : మనకు ఈ case లో వున్న క్లూ ఈ పీటర్ ఒక్కడే , వాడిని కూడా మనం ప్రాణాలతో పట్టుకో లేక పోయాం . ఆ మర్డర్ చేసిన వాడి గురించి ఏమయినా details దొరికాయా.
ప్రభాకర్ : పీటర్ dead body ని గుర్తు పట్టిన వ్యక్తి ని ఎంక్వైరీ చేశాను , ఆ పీటర్ తో పాటు ఒక పోలీస్ ని మాత్రమే చూసాను అన్నాడు , కానీ ఆ పోలీస్ ని వెనుక నుండి చూశానని చెప్పాడు .
ఆ పోలీస్ 6 ఫీట్ వుంటాడు , అని ఈ పీటర్ తాగుతూ వున్నాడని మాత్రం చెప్పాడు .ఇంకేమైనా డీటైల్స్ తెలిస్తే మీకు వెంటనే కాల్ చేసి చెప్తాను అని ఫోన్ పెట్టేసాడు ప్రభాకర్ .
తల పట్టుకొని పక్కనే వున్న చైర్ లో కూర్చున్నాడు విజయ్ , అతను ఫోన్ పెట్టేయడం గమనించిన సాగర్ , విద్య , గంగ ముగ్గురూ విజయ్ దగ్గరికి వచ్చారు.
ఏం జరిగింది విజయ్ , భుజం మీద చెయ్యి వేసి అన్నాడు సాగర్ .
నేనకున్నది నిజమే అయ్యింది సాగర్ , ఎవరో మన మధ్య నే వుండి ఇక్కడ జరిగేది అంతా తెలుసుకుంటున్నారు .
ఆ పీటర్ గురించి మనకు తెలిసిన విషయం తెలీగానే వాడిని మనం పెట్టుకోక ముందే మర్డర్ చేసేశారు.
ఎలా తెలిసింది , ఎవరు చెప్పారు ఈ విషయం అని అడిగాడు సాగర్ .
ఆ పీటర్ body బీచ్ లో దొరికింది అని మచలీ పట్నం SI ఫోన్ చేసి చెప్పాడు.
అది విని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు గంగ, సాగర్ , విద్య ఆశ్చర్యంగా .
ఆ చంపిన వాడు పోలీస్ డిపార్ట్ మెంట్ అతనే అని కూడా డౌట్ , మనకు ఈ case లో ఎలాంటి క్లూ దొరక కూడదని చాలా జాగ్రత్త పడుతున్నారు, కానీ దీని వెనుక ఎవరు వున్నా సరే వాళ్ళను ఎలాగయినా పట్టుకోవాలి .
మరి ఇంటి దగ్గర మఫ్టీలో పోలీసల్ని పెట్టారు కదా వాళ్ళు ఎలాంటి వాళ్లో ఏమో భయపడుతూ అంది గంగ .
విజయ్ : లేదు గంగ , వాళ్ళు ఇక్కడ ఎవరికీ తెలీదు , నేను DCP తో మాట్లాడి స్పెషల్ పెర్మిషన్ తో రప్పించి అక్కడ వుంచాను . So ఇంట్లో వాళ్లకు ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు . నేను త్వరలోనే ఇదంతా సాల్వ్ చేసేస్తా ,ట్రస్ట్ మి గంగా.
గంగ : నీ వెనుక మేమంతా వున్నాం అన్నయ్య , అంతా మంచే జరుగుతుంది 🙂.