Truth - 10 in Telugu Thriller by Rajani books and stories PDF | నిజం - 10

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

నిజం - 10

జీప్ లో రాయవరం బయలు దేరారు రాఘవులు , విజయ్ . శరభయ్య కి రామారావు గారి ఫ్యామిలీ కి ఏదయినా గొడవ ఉందా రాఘవులు గారు అని అడిగాడు విజయ్ , లేదు sir శరభయ్య తోనే కాదు ఈ వూళ్ళో ఎవరితోనూ వాళ్ళకి ఎలాంటి శతృత్వం లేదు వాళ్ళకి , వూరి జనం అందరికీ ఆ కుటుంబం అంటే ఎంతో అభిమానం , ఒకప్పుడు ఈ ఊళ్ళో సగం కంటే ఎక్కువగా ఉన్న చేనేత కార్మికులు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు నేను ఈ ఊరికి కొత్తగా duty కి వచ్చిన రోజులవి , రామారావు గారు వాళ్ళ కోసమే ఒక హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేశారు , దాని కోసం కోట్లు విలువ చేసే స్థలాన్ని రాసిచ్చారు , గవర్నమెంట్ స్పందించే వరకు లెటర్స్ రాసి వాళ్ళ ద్వారా కూడా ఆర్థిక సాయం తీసుకుని తెలిసిన వాళ్ళ ద్వారా కూడా డబ్బు సేకరించి ఆ మార్కెట్ కట్టించారు దగ్గర ఉండి , అక్కడి నుండి వాళ్ళు సరుకును వేరే వూళ్లకి కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు , మోహన్ అగ్రికల్చర్ బీఎస్సీ చేసి సేంద్రియ వ్యవసాయం తో ఎక్కువ పెట్టుబడి తెచ్చుకోవటం గురించి రైతులకు అవగాహన కల్పించటం , పంటకు గిట్టుబాటు ధర వచ్చేవిధం గా చూడటం లాంటివి చేస్తూ ఉంటాడు , చెప్పాలంటే ఆ కుటుంబం వల్లే ఈ వూరు ఇంత ప్రశాంతం గా ఉంది, ఈ వూళ్ళో వాళ్ళ ని సొంత కుటుంబ సభ్యలలాగా అనుకుంటారు రామారావు గారు , సాగర్ పై చదువులకి కూడా ఆయన సాయం చేశారు , ఇప్పుడు సాగర్ ఉద్యోగం చేస్తూ తన చెల్లెలి ని డాక్టర్ చదివిస్తున్నాడు అంటే ఆ రామారావు గారి దయ వల్లే , అలాంటి వాళ్లకు గిట్టని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అన్నాడు రాఘవులు , ఆయనకు ఉన్న మంచి పేరు చూసి అసూయ తో ఉన్న వాళ్ళు గానీ లేదంటే ఆ కుటుంబాన్ని నాశనం చేస్తే వాళ్లకు ప్రయోజనం వచ్చే వాళ్ళు గానీ ఎవరయినా ఉండొచ్చు , ఆ శరభయ్య ఒక్కడే కావాలని చేశాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు రాఘవులు గారు , ఒకసారి స్టేషన్ కి ఫోన్ చేసి ఆ శరభయ్య ఏం గోల చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అన్నాడు విజయ్ , అయ్యో అవును sir ఆ సంగతే మర్చిపోయా ఏం రాద్దాంతం చేస్తున్నాడో స్టేషన్ లో వాడు అనుకొని స్టేషన్ కి కాల్ చేసాడు రాఘవులు , అటు నుండి కానిస్టేబుల్ చంద్రం ఫోన్ లిఫ్ట్ చేశాడు , హెల్లో చంద్రం నేను రాఘవులు ని , శరభయ్య ని స్టేషన్ లోనే కూర్చో బెట్టావు కదా అడిగాడు రాఘవులు , ఏమి కూర్చోబెట్టడం sir రావడానికి ముప్పు తిప్పలు పెట్టాడు , మీ S.I నే ఇంటికి వచ్చి కలవమని చెప్పు నా మీద అనుమానం ఉంటే , పోలీస్ స్టేషన్ గుమ్మం నేను తొక్కను అని నానా యాగి చేశాడు , అలా కాదు స్టేషన్ కి వచ్చి నీ భార్య ఎలా చనిపోయిందో రాసి ఇవ్వాలి , నువ్వు రావలసిందే అని బలవంతం గా తీసుకొచ్చాం, ఇక్కడి వచ్చిన దగ్గర నుండి నేను ఇంటికి వెళ్ళాలి మైల స్నానం చేయాలి అని పిచ్చి కోతి లాగా ఒకటే అరుపులు అన్నాడు చంద్రం , సరే మేము దగ్గరలోనే ఉన్నాం వాడు ఎంత గోల పెట్టినా అక్కడి నుండి కదల నివ్వకు మేము వచ్చేవరకు అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రాఘవులు .

రాఘవులు ఫోన్ స్పీకర్ లో పెట్టడం తో విజయ్ కూడా ఈ మాటలు విన్నాడు , జీప్ తానే డ్రైవ్ చేస్తానని చెప్పి విజయ్ తానే డ్రైవ్ చేస్తున్నాడు , రాఘవులు ఫోన్ చేసి మాట్లాడాడుఅన్నమాట , ఇద్దరూ స్టేషన్ కి చేరేసరికి రాత్రి అయింది , దారిలోనే హోటల్ లో భోజనం చేసి స్టేషన్ కి వచ్చారు , శరభయ్య అరచి, అరచి అలసి పోయి కూర్చుని కునుబాట్లు పడుతూ ఉన్నాడు , అప్పుడే స్టేషన్ కి వచ్చారు రాఘవులు, విజయ్. అక్కడ శరభయ్య ని చూడగానే తాను రక్తపుమడుగులో చూసిన పిల్లాడు గుర్తు వచ్చాడు , అక్కడికక్కడే వాడిని షూట్ చేసేయాలి అన్నంత కోపం వచ్చింది విజయ్ కి , టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని దానిలో వాటర్ ని తీసుకెళ్ళి శరభయ్య మొహం మీద కొట్టాడు కోపం గా , శరభయ్య ఎవడ్రా నీళ్ళు కొట్టింది అని పైకి లేచి ఇంకేదో అనాబోయేవాడల్లా రాయిలా ఉండిపోయాడు , తన కళ్ళ ముందు కోపంగా చూస్తున్న విజయ్ ని చూసి నోరు పెగల్లేదు శరభయ్య కి , వీడిని సెల్ లోకి తీసుకెళ్లండి అని రాఘవులు వైపు చూసి అన్నాడు విజయ్ , విజయ్ ని అలా కోపం గా చూసిన కానిస్టేబుల్స్ ఈ శరభయ్య కి మూడింది ఈరోజు అనుకున్నారు మనసులో , రెండు నిమిషాల తరువాత సెల్ లో ఒక చైర్ లో శరభయ్య ఎదురుగా చైర్ లో విజయ్ కూర్చున్నారు , రామారావు గారి మనవడు ని ఎందుకు చంపాలనుకున్నావు అని స్త్రైట్ గా అడిగాడు విజయ్ , నేనా నేనెందుకు చంపుతాను నాకేంటి అవసరం అని బుకాయించాడు శరభయ్య , మరి నీ ఇంట్లో నీకు తెలీకుండానే బాబు ఉన్నాడా , ఇంకా దాచడానికి ఏమి లేదు కానీ నువ్వు ఈ పని ఎందుకు చేసావో తెలియాలి అంతే , నువ్వు మంచిగా చెబితే straight గా కోర్టు కి తీసుకెళతా లేదంటే నా స్టైల్ లో చెప్పిస్తాను అప్పుడు ముందు హాస్పిటల్ కి తీసుకెళ్ళి తరువాత కోర్టు కి తీసుకెళతారు , అసలే వయసై పోతుంది నా దెబ్బలకి సెల్ లోనే చచ్చావంటే డైరెక్ట్ మార్చురీ కే , నీ కోసం ఏడ్చేవాడు కూడా ఎవ్వడూ లేడు, హార్ట్ ఎటాక్ తో చచ్చాడు అని అందరికీ చెప్తా , నువ్వే బాబు ని కిడ్నాప్ చేశావని చెప్పడానికి అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి , ఇంక నిజం చెప్పు అన్నాడు విజయ్ బెదిరిస్తూ , శరభయ్య ఒక నిమిషం ఆలోచించి నేను నా లాయర్ తో మాట్లాడాలి ఒక సారి ఫోన్ ఇప్పించండి అన్నాడు ఏ మాత్రం బెదరకుండా పైకి మేక పోతు గాంభీర్యం చూపిస్తూ , శరభయ్య మాట పూర్తి కాక ముందే తన గూబ గుయ్యమంది , నువ్వు మాటలతో చెప్తే వినే రకానివి కాదు అని , చంద్రం ఆ లాఠీ తీసుకుని రా అన్నాడు విజయ్ , yes sir అని చేతిలోకి లాఠీ తీసుకున్నాడు చంద్రం , చంద్రం ని లాఠీ తో చూస్తే యముడు గథ తో వస్తున్నట్టు కనిపించాడు శరభయ్య కి , చంద్రం ఆకారం అలాంటిది మరి , భయం తో గుటకలు మింగుతూ వద్దు చెప్పేస్తాను , అసలే ముసలి ముండావాడిని , నన్ను కొట్టద్దని చెప్పండి అని బ్రతిమాలాడు శరభయ్య , ఆగమని చంద్రం కి చేతితో సైగ చేస్తూ , శరభయ్య ని చూసి చెప్పు అన్నాడు విజయ్ . శరభయ్య తడబడుతు అది అది అని నీళ్ళు నమిలుతూ చచ్చింది కదా నా పెళ్ళాం సుజాత అదే చేసింది , క్షుద్ర పూజలు చేసి పిల్లాడిని బలి ఇస్తే పిల్లలు పుడతారని వాళ్ళ ఊళ్ళో ఎవరో చెప్పారు దానికి అందుకే నాకు తెలీకుండా చేసింది , నాకు విషయం తెలిసి నిలదీసే సరికి తప్పు ఒప్పుకుంది , నేను వూళ్లో జనానికి చెప్తా అన్నానని తను ఒంటిమీద కిరసనాయిలు పోసుకుని చస్తా అని బెదిరించింది , అయినా నేను ఒప్పుకోలేదు , చివరికి అన్నంత పని చేసింది , అటు సర్పంచ్ మనవడిని చంపింది ఇటు దాని కడుపు లో వున్న నా బిడ్డను చంపింది అదో రాక్షసి అన్నాడు కచ్చిగా శరభయ్య , మళ్ళీ ఒకసారి చెంప మీద ఒక్కటిచ్చాడు విజయ్ , నోట్లో పళ్లు ఉన్నాయా వూడాయా అనిపించింది శరభయ్య కి, వీడు పోలీసా రౌడీ నా ఇలా కొడుతున్నాడు అనుకున్నాడు మనసులో శరభయ్య , నేను చెప్పమంది నీకు నచ్చినట్టు స్టోరీ అల్లి చెప్పమని కాదు , నిజం చెప్పమని .

పిల్లాడిని కిడ్నాప్ చేసింది నువ్వే అని నాకు తెలుసు , వాడిని కిడ్నాప్ చేయడానికి 6 నెలలుగా స్కెచ్ వేసావు అన్న సంగతి కూడా తెలుసు , కొన్ని రోజులు అందరి పిల్లలకి ప్రసాదం ఇచ్చావు , తరువాత చిట్టికి, సంపత్ కి మాత్రమే పిలిచి ప్రసాదం ఇస్తూ వచ్చావ్ , పిల్లలి తో మంచిగా ఉనట్టు నమ్మించి చిట్టి స్కూల్ కి రాకుండా ముందు రోజు తనకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశావ్ ,తరువాత ఒంటరిగా ఉన్న సంపత్ ని ప్రసాదం ఇవ్వడానికి అని పిలిచి పిల్లాడిని కిడ్నాప్ చేశావు , ఇవన్నీ ఎందుకు చేసావు ఆ కుటుంబం నీకు ఏదయినా శతృత్వం ఉందా అందుకే పిల్లాడిని చంపలనుకున్నావా అని సూటిగా శరభయ్య కళ్ళ లోకి చూస్తూ అడిగాడు విజయ్ , ఇదంతా విన్న శరభయ్య భయం తో వణికి పోయాడు , నేనేది కావాలని చేయలేదు ఆ మరిడయ్య చెప్పినట్టు చేశాను అంతే , వాడు చెప్పినట్టు చేస్తే నాకు పిల్లలు పుడతారని , మా ఇంటి వెనుక బావిలో నిధి కూడా దొరుకుతుందని చెప్పాడు , వాడు చెప్పింది చేశాను అంతే ఇప్పుడు నా భార్య ను కూడా పోగొట్టు కున్నాను , నేను మోసపోయాను అంటూ మొసలి కన్నీళ్లు కార్చాడు శరభయ్య.