Will this journey reach the coast.. - 20 in Telugu Love Stories by Lakshmi Venkatesh దేవేష్ books and stories PDF | ఈ పయనం తీరం చేరేనా...- 20

Featured Books
Categories
Share

ఈ పయనం తీరం చేరేనా...- 20

ముందుగా 1-19 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..


గీతా " ఎంటి ఇది షివి.. అతను కావాలి అని ఇలా ప్రవర్తిస్తూ వుంటే నువ్వు సైలెంట్ గా వుండటం నాకు ఏమి నచ్చలేదు.. అనిరుధ్ అన్నయ్య కి చెప్పొచ్చు కదా.. అన్నయ్య చూసుకునే వాడు.." అని అనింది..


అనిరుధ్ పేరు విన్న అపురూప ఏదో లోకం లోకి వెళ్ళిపోయింది.. తను కాలేజ్ లో జాయిన్ అయిన రోజులు గుర్తు చేసుకుంది..


అపురూప ఒక అనాధ.. తనకి అంటూ ఎవరు లేరు కానీ.. తను పెరిగిన అనాధాశ్రమం కొంచిం మంచిదే.. అక్కడ ప్రేమగా దగ్గరకి తీసుకునే గార్డియన్ వుండేవాళ్ళు.. తిండి కి కానీ గుడ్డ కి కానీ చదువు కి కానీ ఎలాంటి లోటు లేదు.. అందులోనూ అపురూప చాలా తెలివైనది.. చదువులో ముందు వుండేది.. అలాగే తన చదువులో బాగా రానిస్తు.. డాక్టర్ అవ్వాలి అనుకుంది.. అందుకు ఎక్కువ కర్చు అవుతుంది అని తెలిసి ఎలా అయిన చదవాలి అనే పట్టుదల పట్టుకుంది.. అందుకే కష్టంగానో ఇష్టంగానో చదివి నీట్ లో మంచి ర్యాంక్ సంపాదించి తను ప్రస్తుతం చదివే కాలేజ్ లో ఫ్రీ సీట్ సంపాదించింది.. అలాగే ఫీజ్ లో కూడా కొంత కాలేజ్ తరుపు ఉన్న ఛారిటీ కట్టేస్తుంది.. ఇంక స్కలర్ షిప్ వల్ల ఇంక మిగిలిన సగం ఒకే.. ఇంక కొంతమంది అనాధారమం కి వచ్చే పెద్ద వ్యక్తుల్లో ఒకరు.. అపురూప చదువును మెచ్చి తనకి స్పాన్సర్ గా వుంటాము అన్నారు.. ఆ పెద్ద వ్యక్తి పేరు.. దామోదర్ .. నోయిడా లో టాప్ 10 బిజినెస్స్ మెన్స్ లో అతను ఒకడు.. మన కర్మ కాలి అతని కొడుకే ఈ మనీష్.. అది తర్వాత విషయం..


అల ఎలానో తను కాలేజ్ లో జాయిన్ అయ్యింది.. మొదటి రోజు కాలేజ్ కి వెళ్ళింది.. కాలేజ్ లో రాగింగ్ అనే పదం చాలా వరకు కనిపించలేదు అక్కడ ఎవరికి.. ఎక్కడో ఒకరిద్దరు తప్పా అందరూ నార్మల్ గా వున్నారు.. అందులో నుండి ఒకరు వచ్చి తనకి ప్రపోజ్ చేశారు.. తనకి ముందు షాక్ అసలు అపురూప అలాంటి అమ్మాయి కాదు.. ప్రేమ పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేది కాదు.. తను ఒక అనాధ.. అలానే తన లాంటి వారికి తనకు చేత నైన అంతా వరకు సహాయం చెయ్యాలి అనే మంచి గోల్ వున్న అమ్మాయి.. జాయిన్ అయిన అతి కొద్దీ రోజులకే తన అందం కి తన చదువుకి కాలేజ్ మొత్తం కోంచోం లో కొంచెం బాగానే ఫేం పొందింది.. చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ అందరికీ ఒకటే సమాధానం ' నో..' చెప్పేది.. అల కాలేజ్ స్టార్ట్ అయ్యిన నెల రోజులకు షివి జాయిన్ అయ్యింది.. తన కన్న చదువులోనూ అందం లోని ఒక పాలు ఎక్కువే షివి.. అప్పటి నుండి ప్రతి ఒక్కరి కన్ను షివి మీదనే వుండేది.. ఎందుకో మనసులో ఒక మూల నుంచి షివి మీద అసహనం మొదలు అయ్యింది.. క్రమేపీ అది కోపంగా మారింది.. ఇంక అది ఎలా మారుతుందో.. అనుకున్న రోజుల్లో.. సీనియర్స్ లో ఒక బెవర్స్ గాంగ్ కి పని పాట లేనట్టు వచ్చి షివి నీ రాగింగ్ చేస్తూ చాలా నీచంగా మాట్లాడటం మొదలు పెట్టారు.. ఆ విషయం ఆ నోట ఈ నోట పాకి అదే కాలేజ్ కం హాస్పిటల్ లో అప్పుడు జూనియర్ డాక్టర్ గా వర్క్ చేస్తున్న అనిరుధ్ కి తెలిసింది..


అంతే కోపంగా అక్కడికి వెళ్లి వాళ్ళని చిత్తకొట్టి షివి జోలికి రావొద్దు అని గట్టి వార్నింగ్ నే ఇచ్చాడు.. అసలు నిజానికి ఆ కాలేజ్ లో రాగింగ్ అనే పదం దూరం అవ్వటానికి అనిరుధ్ నే కారణం అలాంటిది అతనే వచ్చి వార్నింగ్ ఇచ్చే సరికి కాలేజ్ మొత్తం నిశ్శబ్ధం నెలకొంది..


మొదటి చూపులోనే అనిరుధ్ మీద ఇష్టం ఏర్పడిన అపురూప ఎందుకో.. అనిరుధ్ షివి కి సపోర్ట్ గా మాట్లాడటం నచ్చలేదు.. ఇంక వాళ్ల మధ్య వున్న రిలేషన్ తెలియని కాలేజ్ మొత్తం వాళ్ల గురించి రకరకాలుగా మాట్లాడటం మొదలు పెట్టింది..


కాలేజ్ మొదట్లో నే గీత, అపురూప మంచి స్నేహితులు అయ్యారు.. ఆ తర్వాత వచ్చిన షివి బిహేవియర్ కి గీత తనకి అతి కొద్దీ రోజుల్లోనే ప్రాణ స్నేహితురాలు అయిపోయింది.. అల షివి కి అపురూప కి పరిచయం తప్పా ఏమి లేదు.. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని వాక్యాలు మాత్రమే మాట్లాడు కోవటం వాళ్ల కి అలవాటు పెద్దగా మాట్లాడుకోరు..


ఇలా కాలేజ్ వాళ్ల టాక్ తో సగం సంవత్సరం పూర్తి అయ్యింది.. షివి పుట్టిన రోజుకి ఒక రోజు ముందు అనిరుధ్ షివి తో మాట్లాడటానికి వెళ్ళాడు.. అప్పుడు గీత, అపురూప కూడా అక్కడే వున్నారు..


అనిరుధ్ " షివి..."


మీకు మొదట్లో చెప్పాను కదా.. షివి అనిరుధ్ నీ పేరు పెట్టె పిలుస్తుంది.. ఇంట్లో మాత్రమే అన్నయ్య అని పిలుస్తుంది అది కూడా శ్రీనాథ్ గారికి భయపడి.. లేకపోతే ఇంట్లో కూడా పేరు పెట్టే పిలుచుకునే వారు..



షివి నవ్వుతూ.. " అనిరుధ్.. ఎంటి విశేషం.. కనీసం ఫోన్ కూడా చెయ్యరు కదా.. ఎంటి ఇవాళ మాట్లాడాలి అని పిలిచారు..."


అనిరుధ్ చిన్న స్మైల్ ఇచ్చి.. " ఎం లేదు రా.. ఇంటికి వెళ్దాం వస్తావా.."


షివి " ఇప్పుడు అంత అర్జెంట్ గా ఇంటికి ఎందుకు.." వీళ్ళ మాటలు విన్న ఎవరికి అయిన తప్పుగానే అనుకుంటారు కదా..


అనిరుధ్ " అర్జెంట్ ఎం వుంది రా.." అంటూ ఏదో మాట్లాడే లోపే ఫోన్ రింగ్ అయ్యింది.. లిఫ్ట్ చేసి " హెల్లొ.. మా.."


శారద గారు " అని.. షివి నీ తీసుకొని రేపు వస్తావు కదా.." అని అడిగారు..


అనిరుధ్ " అదే మాట్లాడుతున్న మా.. ఇంక ఏమి చెప్పలేదు.. అడగలేదు.."


శారద " నేను మాట్లాడతా ఫోన్ ఇవ్వు.." అనిరుధ్ " హా మా.." అని ఫోన్ షివి కి ఇచ్చాడు..


మేటర్ అర్దం కాని షివి ఫోన్ తీసుకొని చేవి దగ్గర పెట్టుకొని " హెల్లొ " అని అనింది..


శారద " షివి రేపు నీ పుట్టిన రోజు కదా నాన్న ఇంటికి రండి మా.. ఇంట్లో నువ్వు లేక అన్నయ్య లేక ఇల్లు అంతా బోసి పోయింది.." అంటే..


షివి " సారీ మా.. అక్కడికి వస్తె నాన్న గారు పెళ్లి గురించి మాట్లాడుతారు.. నాకు అది ఇష్టం లేదు.. ప్లీస్ మా బలవతం చెయ్యకు.." అని ఇంకేం మాట్లాడకుండా ఫోన్ అనిరుధ్ కి ఇస్తుంది..


ఇక్కడ అపురూప కి గీత కి షివి అనిరుధ్ వాళ్ల అమ్మ నీ మా అని పిలవటం తో నే అర్దం అయిపోయింది.. ఇద్దరూ అన్నాచెల్లెల్లు అని..


ఎందుకో అప్పటి వరకు లేని ఒక రకమైన ప్రశాంతత ఆ క్షణం అపురూప సొంతం అయ్యింది... తన నుండి మొదటి స్థానం లాగేసుకుని.. అందం లో తనని రెండో ప్లేస్ లో నుంచో పెట్టిన షివి నీ మొదటి సారి తొక్కిపెట్టే అవకాశం వచ్చింది అన్నట్టు హ్యాపీ ఫీల్ అయ్యింది..


అప్పటి నుండి మొదలు అనిరుధ్ నీ అదే పని గా చూడటం అనిరుధ్ తనని చూస్తే చూపు తిప్పుకోవటం.. అనిరుధ్ లో ఒక రకమైన క్యూరియాసిటి పెంచింది..


అనిరుధ్ కి కూడా మొదటి చూపులోనే అపురూప నచ్చడం అపురూప కూడా తనని చూసి పాజిటివ్ రిప్లై గ తనని చూడటం గమనించి తనకి కూడా తనంటే ఇష్టం అని అర్దం చేసుకున్నాడు కానీ ప్రపోస్ చెయ్యడానికి దైర్యం సరిపోలేదు.. ఆ కధ అప్పటినుండి ఇప్పటికీ సాగుతూనే వుంది.. ఆలోచనల్లో వున్న అపురూప కి షివి సమాధానం విని ఈ లోకంలో కి వస్తుంది..


షీవి " అమ్మో వాడికి నేనంటే ప్రాణం.. నాకేమైనా అయ్యింది అని తెలిస్తే ప్రాణాలు తియ్యడానికి కూడా వెనుకాడడు.. అలాంటిది ఇతను నన్ను ఎదిపిస్తున్నాడు అని తెలిస్తే మనీష్ నీ ఏదో ఒకటి చేస్తాడు.. అది అన్నయ్య కెరీర్ లో బ్లాక్ స్పాట్ గా మిగలడం నాకు ఇష్టం లేదు అందుకే.." అంటుంది..


అపురూప కి షీవి అంటే కోపం లేదు కేవలం జెలస్ మాత్రమే వుంది అంతే తప్పా షివి లో వంక పెట్టడానికి ఏమి లేవు.. ఒక్కోసారి అపురూప కూడా షివి కి ఫిదా అవుతుంది.. అయిన అది బయటపడకుండా తన జెలస్ కప్పిపుచ్చుతుంది..


గీత ' ఎన్ని చెప్పినా ఇది ఇంతే.. ఇది ఇబ్బంది పడిన పర్వాలేదు.. దీని మూలంగా వేరే ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకునే టైప్' అని మనసులో అనుకొని క్లాస్ కి నడుస్తారు అందరూ



అల ఆ రోజు క్లాస్ ఫినిష్ చేసుకొని హాస్టల్ కి వెళ్ళే సమయం లో వస్తాడు అసద్ ప్రణయ సమేతంగా.. దూరం నుండే షివి ఎవరో చూపించి " ఎలా వుందో అడుగుతాడు.. షివి నీ చూసిన ప్రణయ్ తనని చూసిన వెంటనే తన అమాయకమైన మోము చూసి " నీకు సరీ జోడీ రా.." అని కాంప్లిమెంట్ కూడా ఇస్తాడు.. ప్రణయ్ కాంప్లిమెంట్ కి అసద్ చిన్నగా బ్లష్ అవుతాడు.


కొనసాగుతుంది...