నా పేరు ఆర్య నేను ఒక రోజు నా స్నేహితుడు నీ కలవడానికి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది . ఆ వెంకటాపురం గ్రామానికి వెళ్లాలంటే 5 కిలోమీటర్లు మేరా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటాలని ఒక వ్యక్తి చెప్పాడు.
ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలోకి ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అడవి అంతా కటిక చీకటిగా మారింది. అ కటిక చీకటిలో కారులో ఇళయరాజా పాటలు వింటూ సంతోషంగా వెళుతున్నాను.
అలా అడివి మధ్యలో వచ్చేసరికి ఒక్కసారిగా కారు హెడ్ లైట్ లో వెలుతురు తగ్గిపోయింది . నేను వెళ్తున్న దారి నాకు అసలు కనిపించడం లేదు. మెల్ల మెల్లగా కార్ హెడ్లైట్లో వెలుతురు తగ్గి ఒక్కసారిగా కారు ఆగిపోయింది.కారుని మళ్లీ స్టార్ట్ చేశాను కానీ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు. ఏమైంది అని కారు దిగి చూశాను కారు దిగిన వెంటనే ఒక్కసారిగా కారు డోర్స్ క్లోజ్ అయ్యాయి కారు డోర్ ఎంత ఓపెన్ చేసినా మళ్ళీ తెరుచుకోలేదు.
కారు డోరు ఓపెన్ కాకపోవడంతో నాకు ఒక్కసారిగా గుండె దడ పెరిగింది . భయంతో గొంతులో తడి ఆరిపోతుంది. చుట్టుపక్కల ఎవరు లేరు దూరం నుంచి అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి . ఆ సమయంలో నా వెనక ఎవరో నిలబడి ఉన్నట్లుగా నాకు అనిపించింది . తిరిగి వెనక్కి చూసాను కానీ అక్కడ ఎవరూ లేరు భయంతో నా కాళ్లు చేతులు వనకడం మొదలైనవి ఇక్కడ ఉంటే ప్రమాదం అని నాకు అనిపించింది నా దగ్గర ఉన్న మొబైల్ లైట్ తో భయంతో ముందుకు నడిచాను అప్పటికి కూడా నా వెనక ఎవరు వస్తున్నట్లు అనిపిస్తుంది . కానీ తిరిగి వెనక్కి చూడకుండా వేగంగా నడిచాను.
కొంత దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది . ఎవరో అక్కడ ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చింది ఆ వెలుతురు చూస్తూ అక్కడికి మెల్లగా చేరుకున్నాను . అది ఒక చెక్కతో చేసిన ఫారెస్ట్ హౌస్ ఆ హౌస్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాను .అప్పుడు ఆ ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశారు . ఆ ఇంటి ఓనర్ నన్ను ఎవరు మీరు అని అడిగారు ? నేను జరిగిన కథ మొత్తం ఆ ఇంటి ఓనర్ కి చెప్పాను . నేను ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో ఉంటానని ఆ ఇంటి ఓనర్ కి అడిగాను.
ఆ ఇంటి ఓనర్ సరే అని ఒప్పుకున్నారు .ఆ ఇంట్లో ఆ ఇంటి ఓనర్ మరియు అతని భార్య వారికి పుట్టిన ఒక చిన్న పాప కూడా ఉన్నారు .వారి పాప చాలా ముద్దుగా అందంగా ఉంది . అంతా బాగుంది అన్న కొంత సమయానికి ఒక్కసారిగా కరెంట్ పోయింది వెలుతురు గా ఉన్న ఇల్లు ఒక్కసారిగా చీకటిగా మారింది . నాకు ఇక భయం మొదలయ్యింది నా గుండె దడ పెరిగింది భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అగ్గి పెట్టి తో కొవ్వొత్తిని వెలిగించారు . అప్పుడు ఆ ఇంటి ఓనర్ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టే కరెంటు ఎక్కువగా ఉండదు అని చెప్పాడు.మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి మీకు ఏమీ కాదు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు
ఆ ఇంటి ఓనర్ నాతో చెప్పిన మాటలు నాకు ఒక్కసారిగా తిరిగి ఊపిరి వచ్చినట్లు అనిపించింది.మీరు చాలా టెన్షన్ పడిపోయినట్లు ఉన్నారు మీరు ఈ రూమ్ లోకి వెళ్లి రిలాక్స్ అవ్వండి మళ్లీ ఉదయం మీరు వెళ్లిపోవచ్చు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు. అప్పుడు నేను ఆ రూమ్ లోకి వెళ్లాను నేను చాలా అలిసిపోయి ఉండటం వల్ల చాలా బాగా ఆ రాత్రి నిద్ర పోయాను.
మరునాడు నేను నిద్ర లేచి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాను. విచిత్రం ఏమిటంటే ఆ ఇల్లు రాత్రి చూసిన ఇల్లు కంటే చాలా దారుణంగా ఉంది ఇల్లు మొత్తం చెదలు పెట్టి ఉన్నాయి . అక్కడక్కడ సాలి పురుగుల గూళ్ళు కనిపిస్తున్నాయి.ఆ ఇంట్లో ఉన్నవారు ఎవరు కనబడలేదు నాకు ఒక్కసారి గా భయం వేసి నేను ఆ ఇంటి మెయిన్ డోర్ వద్దకు వచ్చి తలుపు తీసే బయటికి పారిపోయాను.
ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత అప్పుడు దూరంగా ఒక పాల ట్యాంకు లారీ ఆ దారిన వెళ్తుంది. ఆ లారీ డ్రైవర్ నన్ను చూసి లారీ నీ ఆపాడు ఆ లారీ డ్రైవర్ ఎవరు మీరు ఈ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు. అని అడిగాడు నేను జరిగిన కథ మొత్తం చెప్పాను. అప్పుడు ఆ లారీ డ్రైవర్ ఈ ఇంట్లో ఉన్న వారు రెండు సంవత్సరాల క్రితమే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ప్రతి అమావాస్య రోజున ఈ ఇంట్లో ఎవరూ ఉన్నట్లుగా మాటలు వినిపిస్తూ ఉంటాయని అని ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అని ఇక్కడ నుంచి త్వరగా వెళ్లిపోండి అని చెప్పాడు. ఆ లారీ డ్రైవర్ చెప్పిన మాటలు విన్న వెంటనే నాకు ఒక్కసారిగా చావుని కాళ్ళ చూసినంత పని అయింది . అక్కడినుంచి త్వరగా నడుచుకొని నా కారు దగ్గరికి వెళ్లాను నా కారు డోర్ తీయగానే డోర్ ఓపెన్ అయ్యింది కారుని స్టార్ట్ చేశాను
కారు ఒక్కసారిగా స్టార్ట్ అయింది అక్కడినుండి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్లిపోయాను ఈరోజుకి కూడా నాకు ఆ ఇల్లు అందులో ఉన్న మనుషులు గురించి తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది