సాయంత్రం ఇంటికి చేరుకున్న ప్రీతి, తల్లిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది...
డాక్టర్ చెప్పిన టెస్ట్ లన్నీ చేయించి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారిద్దరూ...
" ఇప్పుడెందుకు తల్లీ ఈ టేస్ట్ లన్నీ నాకు... బానే వున్నాను కదా... చెప్పినా వినకుండా ఇలా వేలు ఖర్చు చేసావ్ నాకోసం... "
" ఇప్పటికే ఇంటికి రెంట్ అడ్వాన్స్ అనీ, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, సామాన్లు ఇలా చాలానే ఖర్చులయ్యాయి కదా... మళ్ళీ ఇవి కూడానా... "
" అమ్మా...!! నాకు నీ హెల్త్ కన్నా, ఇంకేం ముఖ్యం కాదు... కాసేపు మాట్లాడకుండా కూర్చో.... "
" హుమ్మ్... మొండి పిల్లవి.. చెప్పినా వినవు కదా... "
నర్స్ వచ్చి పిలవడంతో, ఇద్దరూ డాక్టర్ గారి క్యాబిన్ లోకి వెళ్తారు...
డాక్టర్ రిపోర్ట్స్ చూసి, రాసిచ్చిన మందులు తీసుకొని, బయల్దేరారు ఇద్దరూ...
ఆటోలో వస్తూ, మార్కెట్ దగ్గర ఆగి, కావాల్సిన కూరగాయలు తీసుకొని ఇంటికి బయల్దేరుతారు...
" ప్రీతి...!! కాలేజ్ ఎలా వుంది... " మాధవి అడగడంతోనే, ప్రీతి బ్రెయిన్లో అధర్వ్ స్ట్రైక్ అవుతాడు...
" గుడ్ మా... బట్ ఒక స్టూడెంట్ వున్నాడు... వెరీ రూడ్ అండ్ అరోగెంట్... లెక్చరర్ తో ఎలా బిహేవ్ చెయ్యాలో కూడా తెలియదు... ఇడియట్... " ఉదయం నుంచి అధర్వ్ తనతో ఎలా బిహేవ్ చేశాడో గుర్తు చేసుకుంటూ, విసుగ్గా మాట్లాడుతుంది ప్రీతి...
" హు.. హు.. హు.. ప్రతీ స్టూడెంట్ టీచర్ కి నచ్చేలా వుండరు కదా... ఇరిటేట్ అవ్వకు... లీవ్ ఇట్... "
ఇల్లు రావడంతో ఆటో వాడికి డబ్బులిచ్చి, ఇద్దరూ దిగేస్తారు...
తల్లి మాటలకు నార్మల్ అవుతూ, ఆమె వెంట లోపలికి నడుస్తుంది ప్రీతి...
మరుసటి రోజు:
ఇంటి పనులు, వంట పనులు పూర్తి చేసుకొని, కాలేజ్ కి రెఢీ అవుతుంది ప్రీతి...
మాధవి కూడా ప్రీతి బలవంతం మీద వాకింగ్ చేసొచ్చి, ఫ్రెష్ అవుతుంది...
ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ...............
" ప్రీతి...!! రోజూ కాలేజ్ కి ఆటోలో, క్యాబ్లో వెళ్ళడం కన్నా, ఒక బైక్ తీసుకోవడం బెటర్ అనుకుంట... "
" హుమ్మ్...!! మా... బైక్ అయితే తీసుకుంటాను... కానీ... కాలేజ్ కోసం కాదు... ఇంటికోసం చిన్న చిన్న నీడ్స్ వుంటాయి కదా... లైక్ షాపింగ్... అదీ ఇదీ... వాటి కోసం... "
" మరి కాలేజ్...!? " అయోమయంగా అడుగుతుంది మాధవి...
" అమ్మా...!! చక్రపాణి అంకుల్ కాలేజ్ ప్రిన్సిపల్ విష్ణు మోహన్ గారితో మాట్లాడారట... ఆయన స్టూడెంట్స్ కోసం వచ్చే కాలేజ్ బస్ ని నాకు కూడా ఎలాట్ చేశారు... "
" చాలా చేస్తున్నారు మా పాణి అంకుల్ మనకోసం... దూరంగా ఉన్నాకూడా, మన నీడ్స్ కోసం ఆలోచిస్తున్నారు... అమ్మా...!! వచ్చిన తరువాత ఒక్కసారి కూడా అంకుల్ కి కాల్ చెయ్యలేదు... బాగోదు కదా... ఇప్పుడు చేస్తాను ఒకసారి... థాంక్స్ చెప్పాలి మనం... " మొబైల్ తీస్తున్న ప్రీతిని అడ్డుకుంటూ .........
" వద్దు ప్రీతి... ఇంక మనం చక్రపాణి గారికి కాస్త దూరంగా వుండటం మంచిది... ఇప్పటి వరకూ, ఆయన మనకోసం చేసింది చాలు... మనమిలా ఇంకా ఆయనతో టచ్లో వుంటే, ఆయన కూడా హెల్ప్ చేస్తూనే పోతారు... పరాయి వాళ్ళ సాయం.... ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు... ఎటువంటి వ్యక్తుల్నైనా, ఎంతలో ఉంచాలో అంతలో వుంచడమే మంచిది... "
తననే అనుమానంగా చూస్తున్న, ప్రీతి చూపులకు తడబడుతూ...................
" అంటే... ప్రీతి...!! చక్రపాణి గారు మనకి సహాయం చేస్తున్నారు కదా అని, మనం కూడా ఎక్కువగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని... మనం ఎంతలో వుండాలో అంతలోనే వుంటే..........
మనకి కూడా మర్యాదగా వుంటుంది కదా... "
తల్లి మాటలకు ఆలోచనలో పడుతుంది ప్రీతి...
" సరే అమ్మా... నువ్వు చెప్పింది కూడా కరెక్టే... ఇకనుంచి మనం అంకుల్ ని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు... కానీ మా.... ఇంతవరకూ ఆయన చేసిన సహాయానికి కనీసం ఒక థాంక్స్ చెప్పాలి కదా... "
" నేనే చెప్తాను తల్లీ... ఎవరూ తెలియని ఈ ఊరిలో మనం ప్రశాంతంగా బ్రతకడానికి నీకు మంచి ఉద్యోగం చూపించిన ఆయనకి, నేనే థాంక్స్ చెప్తాను... " పైకి ప్రీతితో ఈ మాటలు చెప్తూనే, మనసులో మాత్రం.......
" ఇక ఎప్పటికీ మా జీవితాల్లోకి రావద్దని కూడా చెప్తాను... " అనుకుంటుంది మాధవి...
" అమ్మా...!! ఏమాలోచిస్తున్నావ్...!? " మాధవి చేయి మీద చేతిని వుంచి అడుగుతుంది ప్రీతి...
ఆలోచనల నుంచి తేరుకుంటూ..........
" ఏం లేదు తల్లీ... నీకు టైం అవుతుంది... బాక్స్ ప్యాక్ చేసుకున్నావా...!? "
" హా...!! చేసుకోవాలి మా... " ఖాళీ అయిన ఇద్దరి ప్లేట్స్ తీసుకొని, కిచెన్ లోకి వెళ్తుంది ప్రీతి...
వెనుకే హ్యాండ్ వాష్ కోసం వచ్చిన తల్లితో.......
" అమ్మా...!! టైంకి లంచ్ చేసి, ట్యాబ్లెట్స్ వేసుకో... అలానే పాణి అంకుల్ కి కూడా కాల్ చేసి మాట్లాడు... అడిగా అని చెప్పమ్మా అంకుల్ తో... " ప్లేట్స్ కడగడం పూర్తి చేసి, బాక్స్ ప్యాక్ చేసుకుంటూ అంటుంది ప్రీతి...
" హా...!! చెప్తాను... " బాక్స్ రెఢీ చేసుకుంటున్న ప్రీతిని బ్లాంక్ ఫేస్ తో చూస్తూ చెప్తుంది మాధవి...
కాలేజ్ బస్ ఇంటిముందు ఆగడంతో.......
" అమ్మా...!! బస్ వచ్చేసింది... " కంగారుగా తన రూంలోకి పరిగెత్తి, బ్యాగ్ తో బయటకు వస్తుంది ప్రీతి...
ప్రీతి రెఢీ చేసుకున్న బాక్స్, వాటర్ బాటిల్ తో కిచెన్ లోంచి బయటకు వస్తుంది మాధవి...
నవ్వుతూ మాధవి చేతుల్లోంచి బాక్స్ తీసుకొని......
" థాంక్స్ మా... వెళ్ళొస్తాను... జాగ్రత్త... ట్యాబ్లెట్స్ టైం కి వేసుకో... " చెప్పేసి, బయటకు వెళ్తుంది ప్రీతి వడివడిగా...
బస్ వెళ్ళేంత వరకూ బయటనే వున్న మాధవి......
కంగారుగా లోపలికి వెళ్ళి, తలుపు గడియ పెడుతుంది...
తన గదిలోకి వెళ్ళి మొబైల్ తీసి, చక్రపాణి నంబర్ కి కాల్ చేస్తుంది...
" హెలో మాధవి గారు...!! బాగున్నారా...!? " అటునుంచి చక్రపాణి గారు...
" బాగున్నాను చక్రపాణి గారు... "
" ప్రీతి ఎలా వుంది...!? అక్కడంతా మీకు బానే వుందా... తనకి కాలేజ్ నచ్చినట్టేనా...!? " ఆప్యాయంగా అడుగుతాడు చక్రపాణి...
" మాకిక్కడంతా బానే వుంది చక్రపాణి గారు... మీరు మాకోసం ఆలోచించాల్సిన అవసరం లేదు... " కాస్త కఠినంగా వచ్చాయి మాధవి మాటలు...
మాధవి మాటల్లోని కరుకుతనానికి, చిన్నగా నిట్టూరుస్తూ...................
" ఆఖరిసారిగా అడుగుతున్నాను మాధవి గారు... మీరొప్పుకుంటే, ప్రీతితో నేను మాట్లాడుతాను... తను నా మాట కాదనదు... "
" చక్రపాణి గారు...!! ఇంతవరకూ మీరు మాకు చేసిన సహాయానికి మీకు మేము చాలా ఋణపడివుంటాం... కానీ ఇక మీరు మా విషయాల్లో జోక్యం చేసుకోకుండా వుంటేనే మంచిది... " స్థిరంగా చెప్పి కాల్ కట్ చేస్తుంది మాధవి...
@@@@@@@@@@@@@
ఫ్రెషర్స్ పార్టీ కోసం అన్ని క్లాసెస్ కి వెళ్ళి, ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వారి నేమ్స్ తీసుకుంటున్నారు మన అధర్వ్ బాబు బ్యాచ్...
అలా మన ప్రీతి పాప క్లాస్ చెప్తున్న క్లాస్ కి కూడా వెళ్తారు...
టెక్స్ట్ బుక్ పట్టుకొని, స్టూడెంట్స్ మధ్య అటూ ఇటూ తిరుగుతూ క్లాస్ చెప్తున్న ప్రీతి.........
" ఎక్స్క్యూజ్ మీ మ్యామ్... " వివేక్ బాబు గొంతు విని, డిస్టర్బ్ ఫీల్ అవుతూ డోర్ వైపు చూస్తుంది...
బ్యాచ్ మొత్తాన్ని చూస్తూ.............
" వాట్...!? డోంట్ యూ హావ్ క్లాసెస్...!? " సీరియస్ గా అడుగుతుంది ప్రీతి...
" మ్యామ్...!! ఫ్రెషర్స్ పార్టీ......... " వింధ్య మాట పూర్తి కాకముందే, " కమ్ ఇన్సైడ్... " చెప్పేసి, తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది...
సంతోష్ బాబు స్టూడెంట్స్ అందరికీ మ్యాటర్ చెప్పి,
ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళని నేమ్స్ ఇవ్వమని చెప్తాడు...
అధర్వ్ బాబు మాత్రం పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకొని, స్టయిల్ గా వాక్ చేస్తూ లోపలికి వచ్చి, ప్రీతి ముందున్న టేబుల్ కి ఆనుకొని, క్రాస్ లెగ్స్ వేసుకొని నుంచుంటాడు...
విసుగ్గా చూస్తుంది ప్రీతి అధర్వ్ ని... ఆమెనే ఇంటెన్స్డ్ లుక్స్ తో చూస్తున్న అధర్వ్ వెంటనే ఐ బ్రోస్ వేవ్ చేస్తాడు ఏంటి అన్నట్టు...
మూతి తిప్పేస్తూ, బుక్ లోకి తల దూరుస్తుంది ప్రీతి వీడితో మనకెందుకు అనుకుంటూ....
అధర్వ్ సైడ్ స్మైల్ చేస్తూ, ఆమెనే చూస్తూ వుంటాడు...
ప్రీతి మాత్రం అస్సలు అధర్వ్ ని పట్టించుకోకుండా, బుక్లో మునిగిపోతుంది...
బుక్ చదివేప్పుడు, కాటుక కళ్ళల్లో, ఒత్తైన కనురెప్పల చాటున, అటూ ఇటూ కదులుతున్న కనుపాపలు చిత్రంగా అనిపిస్తుంటే, చూస్తూ వుంటాడు అధర్వ్...
" ఈవినింగ్ డాన్స్ మాస్టర్ వస్తారు... నేమ్స్ ఇచ్చిన వారంతా సి బ్లాక్ లోవున్న హాల్ కి వచ్చేయండి... " చెప్పడం పూర్తిచేసి, బ్యాచ్ మొత్తం బయటికి కదులుతారు...
అధర్వ్ వెంటనే టేబుల్ పట్టుకొని, క్లాస్ కంటిన్యూ చెయ్యడానికి లేస్తున్న ప్రీతి మీదకు రెండించుల గ్యాప్ తో ఒరుగుతాడు...
దెబ్బకి బెదిరే కళ్ళతో చూస్తుంది ప్రీతి తనకు అతి చేరువలో వున్న అధర్వ్ ని...
" ఓయ్ లెక్చరర్ పాప...!! ఏమాలోచించావ్ నా పనిష్మెంట్ కోసం... హుమ్మ్... " ఐ బ్రోస్ వేవ్ చేస్తూ అడుగుతాడు...
నాలుగు సార్లు తన చక్రాల్లాంటి కళ్ళను టపటపా ఆర్పి...............
" ఇడియట్...!! " పళ్ళు బిగించి తిడుతూ, పక్కకి వెళ్ళిపోతుంది ప్రీతి...
కళ్ళల్లో అమాయకత్వం, మాటల్లో కోపం... ఒకేసారి చూపిస్తున్న ప్రీతి పాపని క్షణకాలం పాటు తదేకంగా చూసి...............
" ఓయ్ లెక్చరర్ పాప...!! నువ్వు త్వరగా పనిష్మెంట్ కి ఓకే చెప్పకపోతే, నువ్వొద్దన్నా కూడా ఇవ్వడానికి మరో పనిష్మెంట్ రెడీగా వుంది నా దగ్గర... "
" ఇంకో పనిష్మెంటా...!? " అసహనంగా అడుగుతుంది ప్రీతి...
" హా...!! అది నువ్వు ఊహూ అన్నా ఇచ్చేస్తా... నా ఈగో స్యాటిస్ఫై అవ్వాలి కదా మరి... " తంబ్ ఫింగర్ తో, పెదవుని నిమురుకుంటూ, ఇంటెన్స్డ్ లుక్ తో చూస్తూ చెప్తాడు అధర్వ్...
అయోమయంగా చూస్తూ వుంటుంది ప్రీతి అధర్వ్ ని... తన పెదవుల మీద నిలిచిన అతని ఇంటెన్స్డ్ లుక్స్ ని గమనించి....................
" గెట్...... అవుట్...!! " ఎరుపు రంగు పులుముకున్న కళ్ళతో చూస్తూ చెప్తుంది...
నాలుక నోట్లో తిప్పుతూ, ఐ వింక్ చేసి వెళ్ళిపోతాడు అధర్వ్... అతని వెనుకే మిగిలిన బ్యాచ్ కూడా.......
" ఇడియట్...!! " తిట్టుకుంటూ, కణతలు రుద్దుకుంటుంది ఫింగర్స్ తో...
క్లాస్ మొత్తం నోరు వదిలేసి చూస్తూ ఉండిపోయారు ఇంతసేపు మన అధర్వ్ బాబుని.... అతను వెళ్ళిపోవడంతో ప్రీతి మేడమ్, అధర్వ్ సర్ క్రష్ అని ఫిక్స్ అయిపోతారు...
డిస్టర్బ్డ్ మైండ్ తో క్లాస్ చెప్పలేక, మధ్యలోనే వెళ్ళిపోతుంది ప్రీతి క్లాస్ నుంచి...
ఆరోజు ప్రీతికి అధర్వ్ క్లాస్ లేకపోవడంతో, మళ్ళీ ఎదురుపడలేదు అధర్వ్ ఆమెకు...
ఈవినింగ్ కాలేజ్ అయిపోవడంతో, వైష్ణవి గారితో మాట్లాడుతూ వస్తున్న ప్రీతికి, డాన్స్ హాల్ బయట కొంతమంది ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు మీటింగ్ పెట్టి కనిపిస్తారు...
ఇద్దరూ వాళ్ళదగ్గరికి వెళ్ళి, మ్యాటర్ ఏంటని అడుగుతారు...
" మ్యామ్..!! డాన్స్ మాస్టర్ రాలేదు... ఏదో హెల్త్ ఇష్యూ వల్ల, ఆయన రావడం కుదరదని చెప్పేశారు... " దిగులుగా చెప్తారు వాళ్ళు...
" హయ్యో... మరెలా ఇప్పుడు...!? పోనీ... మీకు వచ్చినట్టే ప్రాక్టీస్ చెయ్యండి అమ్మాయిలు... " సలహా ఒకటి పడేస్తారు వైష్ణవి గారు స్టూడెంట్స్ మొహాల మీద...
" మ్యామ్... ఫ్రెషర్స్ పార్టీలో మేము మాకొచ్చిన డాన్స్ చేస్తూ, ఏదన్నా పొరపాటు చేసామంటే, ఇక సీనియర్స్ అందరూ మాతో ఇయర్ మొత్తం ఆడుకోవడం ఖాయం.... మాకొద్దు బాబూ... మేము డ్రాప్ అయిపోతాం మేడమ్... " ఖచ్చితంగా చెప్పేస్తారు అందరూ ముక్త కంఠంతో....
" ఓహ్... ఓకే.. ఓకే... నేను ప్రిన్సిపల్ సర్ తో మాట్లాడుతాను మీకోసం... కొత్త డాన్స్ టీచర్ ని ఎరేంజ్ చెయ్యమని... కానీ మన కాలేజ్ డాన్స్ మాస్టర్ చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు... ఇప్పుడు సడెన్గా కొత్త మాస్టర్ అంటే......... ఏమో చెప్పలేను... ఒప్పుకోకపోవచ్చు విష్ణు సర్... " తన ప్రయత్నం తాను చేస్తాను అన్నట్టు చెప్పేస్తారు వైష్ణవి గారు...
స్టూడెంట్స్ అందరూ మొహాలు వేలాడదీసుకొని....
" ఓకే మ్యామ్... థాంక్యూ... ఇక మేము వెళ్తాం... మాస్టర్ లేకుండా ఇక్కడే వుండి మాత్రం ఏం చేస్తాం... " చెప్పేసి, వెనుదిరుగుతారు....
అప్పటి వరకూ మౌనంగా చూస్తూ వున్న ప్రీతి.........
" ఆగండి... ఒక్క ఈవెంట్ కోసం ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న మాస్టర్ ని కాదని, కొత్త టీచర్ ని తీసుకోవడం కరెక్ట్ కాదు... అది కూడా మాస్టర్ ఆగిపోయింది హెల్త్ ఇష్యూ వల్ల అని కూడా మీరే చెప్తున్నారు కదా... "
" హా మ్యామ్... కానీ డ్యాన్స్ టీచర్ లేకుండా ఎలా...!? "
" నేను మీకు డ్యాన్స్ నేర్పిస్తాను... " స్టూడెంట్స్ కి చెప్తూనే, వైష్ణవి గారి వైపు చూస్తుంది ప్రీతి...
చిన్న స్మైల్ తో ఆవిడ సరే అన్నట్టు చెప్పడంతో, ప్రీతి అందరినీ హాల్ లోకి వెళ్ళమని చెప్తుంది...
స్టూడెంట్స్ హుషారుగా లోపలికి వెళ్తారు...
To be continued...!!