తను అజయ్ వస్తాడని ఎదురు చూస్తున్నాడు . వచ్చింది అతడి భార్య రూపాదేవి !
కారణం ఏమిటో సాగర్ కు అర్థం కాలేదు .
“ నమస్తే ! నేను రూపాదేవి---అజయ్ సింహ్ భార్యను . “ . స్వచ్చమైన ఆంగ్లం .
అంతకన్నా స్వచ్చమైన చిరునవ్వు . రూపాదేవి చేతులు జోడించింది . ఆమె లో రూపం, స్వరం, వినయం, వందనం పోటీ
పడుతున్నాయి .
సాగర్ మర్యాదగా కూర్చోమన్నాడు . కూర్చుంది . “ విద్యాధర బాగున్నారా ? ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా ?” ఆమె ప్రశ్న కు సాగర్ సమాధానం చెప్పాడు .
“ మీరు మా గ్రామం వచ్చినప్పుడు మేము లేము . పిల్లల్ని చూడటానికి జైపూర్
వెళ్లాం “
“ ఇట్సాల్ రైట్ .”
అర నిమిషం నిశ్శబ్దం . సంభాషణ ఎలా పొడిగించాలో ఎవరకీ అర్థం కాలేదు .
“ విద్యాధరి గారిని పిలుస్తారా ? “ ముందు తనే ప్రారంభించింది . “ సారీ ! ఆమె
అమ్మ గారింటికి వెళ్ళింది .”
“ అయితే ఆమెను చూసే అదృష్టం లేదన్న
మాట . “ నవ్వుతూ అం ది
“ మీరు ఆమెను ఎందుకు చూడాలనుకుంటు న్నారు .?
ఆమె తో ఏం మాట్లాడాలి ? “ నాన్చకుండా సూటిగా అడిగాడు .
ఆమె ఇలాంటి పరిస్థతి ముందే ఊహించింది . ఇందుకు సిద్ధం గా ఉంది .
“ మీకు పాతికేళ్ళ క్రితం జరిగిన సంఘటనలన్నీ తెలుసనుకుంటాను .” తలవంచుకొని మెల్లగా అడిగింది
.
“ తెలుసు. తను పూర్వజన్మ లో కోమలా దేవి అని తెలిశాక విద్యా ఆనాటి సంఘటనలు వివరం గా చెప్పింది . చెప్పిన తర్వాతే ఆమె
సమస్య నుండి బయట పడింది . ఇప్పుడు ప్రశాంతం గా ఉంది .”
“ మాకూ కావాల్సింది అదే . ఇప్పుడు మిమ్మలిని కలిసింది నా భర్త తరపున క్షమాపణ
చెప్పుకోవటానికి . తను చేసింది క్షమించరాని తప్పు . భగవంతుడు ఎలాగూ క్షమించడు . కనీసం కోమలాదేవి క్షమిస్తే కొంతలో కొంత
మనశ్శాంతి . !” వచ్చిన కారణం ఎలాగో బయట
పెట్ట గలిగింది .
“ ఇప్పుడా విషయాలు ఎందుకు లెండి
! అయినా కోమలా దేవి , విద్యా ఒకరు
కారుగా ? విద్యా ( ఆమె ) మెంటల్ కమోషన్ కు
కారణం తెలుసుకోవటానికి సైకియాట్రిస్ట్ సలహా తో మీ ఊరికి వచ్చాము . అక్కడికి రాగానే
విద్యాకు అన్నీ గుర్తుకొచ్చాయి . చిక్కుముడి విడిపోయింది . Now she is very happy . మాకు కావాల్సింది
ఇదే . కోమలాదేవి తో ఆమెకు సంబంధించిన వ్యక్తులతో
మాకు ఎలాంటి concern లేదు . ..”
ఆమె అవునన లేదు , కాదనలేదు . మౌనం గా ఉండి పోయింది .
“ మీ భయం నాకు అర్థమైంది . బయట జరిగే హడావుడి చూసి మేము వెలుగు లోకి వస్తామని
, మీ పరువు పోతుందని ఆలోచిస్తున్నారు . “
అవునన్నట్లు తల ఊపింది . ఆమె సిగ్గుతో కుదిన్చుకుపోతోంది . guilty conscious ఆమెను బాగా ఇబ్బంది
పెడుతోంది .
“ అసలు ఈ రభసకు కారణం జస్వంత్ ఆర్టికల్ . అతడు మమ్మల్ని బయటపెట్టాలని చూస్తే
అతడి పై , అతడి డైలీ పై లీగల్ గా proceed అవుతాము . పైగా ఈ issue పేరుతొ మా కుటుంబం
అందరి దృష్టి లో పడటం మాకేమాత్రం ఇష్టం
లేదు . మీ లాగే మాకూ కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉన్నాయి .
ఎవరికీ ఏమీ చెప్పం . ఎవరూ మమ్మలిని ఈ కారణం తో లోకం దృష్టికి తీసుకు రాలేరు . చివరకు మీ రాహుల్ వచ్చినా కోమలాదేవి ప్రమేయం తో
నే సహగమనం జరిగిందని చెబుతాం . ఎప్పుడో పూర్వజన్మలో జరిగిన రహస్యాలను త్రవ్వుకోవటం, తలనొప్పి తెచ్చుకోవటం
రియల్లీ foolish ! మీరు
నిశ్చింతగా బయలుదేరండి .” తేల్చి చెప్పాడు సాగర్ .
ఆమె మౌనం గా లేచి, చేతులు జోడించి శెలవు తీసుకుంది .
భరత్ రామ్,
జస్వంత్ ట్రైనింగ్ తో తన పాత్రకు పూర్తి
న్యాయం చేశాడు సాగర్ .
అతడికి చాలా ఆనందం గా ఉంది . అజయ్
పడగ నీడలోంచి
విద్యా బయట పడింది .
అనుకున్నట్లే అఘోరి అజయ్ దేవిడీ కి వచ్చాడు . పూజ మందిరం లో కూర్చొని దాదాపు
గంట పూజ చేశాడు . పక్కనే పద్మాసనం లో కూర్చున్న
అజయ్ అఘోరీ ఏకాగ్రత , మంత్రోచ్చారణ గమనించి ఆశ్చర్య పోయాడు . హీరాలాల్ అఘోరీ అంత ఎత్తుకు ఎదగటం అద్భుతం .
పూజ ముగిసింది . భక్తితో తీర్థ
ప్రసాదాలు అందుకున్నాడు అజయ్ . ఇద్దరూ ప్రశాంతం గా దర్బార్ హాల్లో కూర్చున్నారు
. అజయ్ మౌనం వెనుక జరిగే సంఘర్షణ ,
జరిగింది పైకి చెప్పుకోలేని సంకోచం అఘోరీ
గమనించాడు .
“ అజయ్ బాబు ! నాకు అన్ని విషయాలు
తెలుసు . జరిగినదానికి మీరు చాలా
బాధపడుతున్నారు . ఈ మధ్య పన్నాలాల్
మిమ్మల్ని కలిశాడట . “
అజయ్ ఇంక సందేహించలేదు . అఘోరికి రెండు చేతులెత్తి నమస్కరించబోయాడు . అఘోరి
సున్నితం గా వారించాడు .
“ మీకు అభ్యంతరం లేకపోతే ------ మీ మనసు తేలికపడే మార్గం చెబుతాను . ....”
“ అంతకన్నానా ? చెప్పండి స్వామీ !” అజయ్ పూర్తిగా అఘోరికి విధేయుడై పోయాడు .
“ మీ ఇంటి ఇలవేల్పు అయిస్వర్యాదేవికి
కోమలా దేవి ఎందులోనూ తక్కువ కాదు . కో మలాదేవికి గుడి కట్టించండి . ఆమెకూ
మీ ఇంటి ఇలవేల్పు స్థాయి ఇవ్వండి . అప్పుడు ఈ సమాజానికి మీపై ఉన్న అనుమానాలు
తొలిగిపోతాయి .
మీరు బయటపడి పోతారు . మిమ్మల్ని వేలెత్తి చూపే వారుండరు . ముందు ముందు మీరు
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనగలరు . మీ మానసిక
బలం పెరుగుతుంది . “
అలాగే నని వినయం గా తల ఊపాడు అజయ్ .
“ రూపాదేవి హైదరాబాద్ వెళ్ళారు .
మీకు అనుకూలంగా విద్యాధరిని ఒప్పించటానికి
.....” అజయ్ కు ఇది మరో షాక్ .
“ ప్రయత్నించటం లో తప్పు లేదు . రూపాదేవి గారి సమర్ధత నాకు తెలుసు . ఆమె సాధించ
గలరు . ఆమె తిరిగి వచ్చిన తర్వాత మీ నిర్ణయం చెప్పండి . ఆమె కాదనరు .ఆమె సహకారం తో
నే గుడి నిర్మాణం నిర్విఘ్నంగా
పూర్తవుతుంది .
“ శంకుస్థాపన మీ పర్యవేక్షణ లో జరగాలి . ఇది నా విన్నపం .” తేలిక పడ్డ మనసుతో
వినయంగా అ ర్ధించాడు అజయ్ .
“ తప్పకుండా ! “ ఒక్క క్షణం
కళ్ళుమూసుకున్నాడు . మనోనేత్రం ముందు కోమల మెదిలింది . ఆ విరాగి మనసులో ఓ బాధా
వీచిక . హృదయం ఆర్ద్రమైంది .
“ ఆ తల్లి ఆతిధ్యం ఈ జన్మ లో మరిచి పోలేను . మా అమ్మలా కొసరి కొసరి వడ్డించింది
. ఆ అమృతమూర్తికి స్మృతిచిహ్నం
నిర్మిస్తుంటే రాకుండా ఉండగలనా ? అది నా
ధర్మం .”
******************************
కొనసాగించండి 39 లో