The shadow is true - 36 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 36

Featured Books
Categories
Share

నీడ నిజం - 36

చిన్నగా దగ్గి సీట్లో సర్దుకుని కూర్చున్నాడు . ఆమెకు తన ఆంతర్యం తెలుసు .అయినా ఇలా అడుగుతుందంటే ఆమె మరేదో ఆశిస్తోంది జాగ్రత్తగా మాట్లాడాలి .

“ కోమలా దేవి సహగమనం వెనుక మిస్టరీ ఉన్న మాట నిజం. అందరూ అనుమానిస్తున్నట్లే అది

కోమలాదేవి తనకై తాను కోరుకున్న సహగమనం కాదు . మరెవరిదో హస్తముంది . మన:స్ఫూర్తిగా సహగమనానికి పూనుకున్న తర్వాత ఎవరూ కేకలు పెట్టరు . చితిలో నిలువునా కాలిపోతున్నా ఉలకరు, పలకరు .ముఖ్యంగా రాజపుత్ర స్త్రీలు . కోమలా దేవి రాజపుత్ర స్త్రీ కాకపోయినా సంస్కారం లో , సాహసం లో వారికే మాత్రం తీసిపోదు . ఆమె అలా కేకలు పెట్టడానికి ‘ అమ్మా అన్న రాహుల్ బాబు పిలుపు కారణం . విక్రం సింహ ఆమెను వివాహం చేసుకుంది రాహుల్ కోసం . ఆ బాధ్యతను కూడా కాదని ఆమె సహగమనానికి సిద్ధపడిందంటే ఆమె నిర్ణయం వెనుక ఎవరి ప్రోద్బలమో ఉన్నట్లేగా ?మా అమ్మ పుట్టిల్లు ఆ ఊరే . కోమలాదేవి సహగమనం జరిగిన రోజున ఆమె అక్కడే ఉంది . అక్కడ జరిగిన ప్రతి సంఘటన కు అమ్మ సాక్షి . ఈ కేసు టేకప్ చేశాక అమ్మ తో అన్నీ వివరం గా మాట్లా డాను . కోమల పట్టుదల తోనే సహగమనం జరిగింది .

కానీ—‘అమ్మా అన్న రాహుల్ కేక తో ఆమె కదిలిపోయింది . అప్పటి వరకు మత్తులా ఆవహించిన శక్తి ఏదో రాహుల్ కేక తో వదిలి పోయి , పరిస్థతి , రాహుల్ తెలుసుకొని , బాబుకు దూరమవుతున్నాను అన్న బాధతో కేకలు పెట్టింది ---ఇది నిజం .”

“ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు- ఏదీ మళ్ళీ రిపీట్ చెయ్యండి . ----“ అప్పటి వరకు , మత్తులా ఆవహించిన శక్తి ... ఆ తర్వాత ? ఆమెను ఆశ్చర్యం గా చూశాడు . ఆమె చెప్పినట్లే చేశాడు గిరిధర్ .

మీ కెందు కలా అనిపించింది . ?” ఆమె మాటల్లో ఆతృత కనిపించింది .

“ నాకు కాదు మేడం ! మా అమ్మకు అలా అనిపించింది .

“ ఒక డిటెక్టివ్ గా ఈ point ను మీరు సీరియస్ గా తీసుకోలేదా ? ఇందులో మీకు ‘క్లూ ‘ దొరకలేదా ?”

“ క్లూ దొరికింది . కానీ—నా అనుమానం క్లియర్ చేసుకోవటానికి సాక్ష్యమేది ? పాతిక సంవత్సరాల నాటి సంఘటనకు సాక్ష్యాలు రాబట్టేది ఎలా ?”

ఆమె ఏదో ఒక ప్రభావానికి లోని సహగమనానికి తలవంచింది . అది హిప్నాటిక్ ట్రాన్స్ కావచ్చుగా “. ఉత్సాహం గా అంది దీప్తి .

అతడు క్షణం ఆలోచించి కాదన్నట్లు తల ఊపాడు .

“ కాదు . హిప్నాటిక్ ట్రాన్స్ నుండి బయటపడాలంటే మళ్ళీ ఆ వాయిస్ కే ఆమె ట్యూన్ కావాలి . లేదా ఏదైనా సంకేతం ఆమెకు అంది ఉండాలి . ఆ రోజు శ్మశానం లో అలాంటిదేమీ జరగలేదు . అసలందుకు అవకాశం లేదు . “.

“ మరైతే --- మంత్ర ప్రభావమా ? “

“ అలాంటివి మీరు నమ్మతారా ?”

“ .... ఈ విశ్వం లో మనకు తెలియని , అర్థం కాని చాలా రహస్యాలు , అద్భుతాలు ఉన్నాయి . కొందరు అవి లేవంటారు . కొందరు ప్రత్యక్ష సాక్షులు మేము చూశాం అంటున్నారు . ఒక్కటి మాత్రం చెప్పగలను ----- దైవ మంత్రాలకు శక్తి ఉంది . అందుకు మా తాతగారు సాక్ష్యం . ఆయన మంత్ర శక్తి తో , కొన్ని మూలికల తో

మొండి వ్యాధులకు చికిత్స చేసే వారు . మనో సంకల్పం , మంత్రం అన్నిటికన్నా గొప్పవని మాకు చెబుతూండే వారు . ఆ మంత్రమే పాజిటివ్ ఎనర్జీ . అది ఉన్నప్పుడు నెగటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంది . వాడుక భాష లో అది క్షుద్రశక్తి . .....ఆనాటి సంఘటనకు సాక్ష్యం లేదన్నారే. మరి విద్యాధరి ఎవరు ?”

“ అవును మేడం ! సజీవ సాక్ష్యం విద్యాధరి ఉందిగా ?”

“ విద్యా ! పెద్దావిడ దగ్గర పొరబాటుగానైన అజయ్ ప్రసక్తి తీసుకు రావద్దు . ఆ ముసలి ప్రాణం తట్టుకోలేదు . సమయం వచ్చినపుడు నెమ్మదిగా చెబుతాం .” భరత్ రామ్ సూచన .

అలాగే ‘ అంటూ తల ఊపింది విద్యాధరి .అలా సమాధానం చెప్పింది కోమలా, విద్యాధరా ?

భరత్ రామ్ కే అర్థం కాలేదు . విద్యా కళ్ళు మూసుకొని ఉంది . మనసు పొరల్లోంచి కోమల జీవం పోసుకుంటున్న అపురూప క్షణాలవి . ఈ సమయం లో మాట తీరులో, మనస్తత్వం లో ఇద్దరి మధ్య ఉల్లిపొరలాంటి తేడానే .

అదురుతున్న గుండె ను చిక్కబట్టుకొని ఆ గదిలో అడుగు పెట్టింది విద్యాధరి. గదిలో ఓ పట్టెమంచం . మంచం పై మెత్తటి పరుపు . పరుపుపై గువ్వలా మసలావిడ . వయసు , వృ ద్దాప్యం ఆమెను కొండ చిలువలా తన లో ఇముడ్చుకొంటున్నా మొహం లో దీప్తి , చురుకుదనం తగ్గలేదు . ఆమెలో ఇంకా ఆనాటి ప్రశాంతత , ప్రేమ, పోయింది . అత్తగారికి మాటలు కరువైనాయి . దు:ఖం తో గొంతు పెగిలి రాలేదు . జీర్ణమైన చేతులతో కోమల ( ముసలావిడ దృష్టి లో ) వీపు నిమురుతూ ఉంది పోయింది .

నెమ్మదిగా విద్యాధరి తేరుకుంది . కళ్ళు తుడుచుకొని స్థిమితం గా పక్కన కూర్చుంది . నిర్మలం గా , మనోహరం గా నవ్వింది .

జన్మ మారింది . రూపం మారింది . కట్టుబొట్టు లో తేడా ఉంది . కాని ---మొహం లో అమ్మయకత్వం , పెదవులపై చిరునవ్వు .---తనకు బాగా తెలిసినవే .

అత్తయ్య –కోడలు తేరుకున్నారు . స్థిమిత పడ్డారు . విద్యాలో కోమల శాంతించింది .

*****************************

కొనసాగించండి 37లో