The shadow is true - 35 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 35

Featured Books
Categories
Share

నీడ నిజం - 35

సహగమనం సాంఘిక దురాచారం అన్న ఒకే ఒక్క ఆయుధం తో వారు అజయ్ పై ప్రత్యక్ష పోరాటం ప్రారంభించారు . అధికార పార్టీ లోని పై వర్గాలు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయి లో వినియోగించుకున్నాయి . సమావేశాలతో , ప్రదర్శనలతో అతడి కీర్తిని , పలుకుబడిని దెబ్బ దీశాయి .

ఇలా అన్నివిధాల అడకత్తెర లో పోక చెక్క లా నలిగిపోయిన అజయ్ చివరకు భార్య ముందు తలవంచాడు . ఆనాడు జరిగినవన్నీ క్లుప్తంగా చెప్పాడు . అలా చెప్పుకుంటే బార్య దృష్టి లో తనెంత దిగజారి పోతాడో తెలుసు . కానీ—తప్పదు .ఈ మానసిక క్షోభ కన్నా ఆ పతనం మేలు .

అజయ్ చెప్పింది మౌనం గా విన్నది . ఆమె మొహం లో కోపం, బాధ, అసలు కనిపించలేదు . నిర్వికార స్థితి . అజయ్ ఆశ్చర్య పోయాడు .

“ నన్ను చూస్తుంటే అసహ్యం వేయటం లేదా “?

“ఎందుకు?

“ సొంత వదిననే కిరాతకం గా చంపటం .....”

“ ఆనర్ కిల్లింగ్ రాజవంశాలలో , జమీందారీ కుటుంబాల్లో మామూలేగా . మీరేం మినహాయింపు కాదు .”

“ ఆనర్ కిల్లింగ్ అంటే.......? అజయ్ కు అర్థం కాలేదు .

“ సంప్రదాయం కావచ్చు . వంశ గౌరవం కావచ్చు . సొంత వారినే చంపుకోవటం ....”

అజయ్ తలవంచుకున్నాడు .

“ ఇప్పుడు మీరు చెప్పి వుండే వారు కాదు . పరిస్థితులు మీ చేత చెప్పించాయి .

మీకు నా సలహా, సాయం కావాలి . నా దృష్టి లో మీ స్థానం పడిపోయినా ఫర్వాలేదు . లోకం దృష్టి లో రాజా అజయ్ సింహ లాగే నిలిచి పోవాలి . ప్రాణం పోయినా పర్వాలేదు . పరువు మాత్రం పోకూడదు . “ కత్తి తో నిలువునా కోస్తున్నట్లు ఉంది అజయ్ కు .

“ మీరు పది రోజుల క్రితం ఓ మంత్రగాడి తో మాట్లాడారు . అతడేగా మీ వదిన గారి పై మంత్రం ప్రయోగం చేసింది . ? కాని --- ఆ మంత్రగాడి కున్న న్యాయం

, మానవత్వం మీకు లేకుండా పోయినాయి . మంటల్లో కాలిపోతూ రాహుల్ బాబు కోసం మీ వదిన గారు అల్లాడి పోయారు . ఆమె కేకలు అతడిని కదిలించలేకపోయాయి . ప్రతిఫలం వద్దనుకొని వెళ్ళిపోయాడు . పైగా రాహుల్ బాబును , మళ్ళీ పుట్టిన వదినగారికి , కలిసి చేసిన పాపం కొంత తగ్గించుకోమన్నాడు . ఆ మాటలు చెవికెక్క లేదు . ఆమెను ఎలాగైనా కలిసి నయానో , భయానో ఆమె నోరు మూయిన్చాలనుకున్నారు . వంశ గౌరవం ముందు ఏ విలువలు నిలువవు . ఇంత జరిగాక , ఇన్ని అద్భుతాలు చూశాక కూడా మీలో మార్పు రాలేదు . ఇది మీ మొండితనమా , మూర్ఖత్వమా ?”..మీరన్నట్లు రాక్షసత్వమా ?”

కళ్ళు తిరిగి పోయాయి అజయ్ కు . పది రోజుల క్రితమే తెలిసినా పెదవి కదపలేదు . ఈ పది రోజులు ఎంత మానసిక క్షోభ అనుభవిన్చిందో ? అన్ని దశలు దాటి ఇప్పుడు నిర్వికార స్థితికి దాటుకుంది . అందుకే మాట తీరులో నిలకడ .

ఆమె ఇప్పటికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఉంటుంది . ఇక ఆ అభిప్రాయాన్ని దేవుడు కూడా మార్చలేడు

“ ఆమె వివరాలు నాకు తెలిశాయి . వారు ఉండేది హైదరాబాదు . మీ తరపున హైదరాబాదు నేను వెళతాను . మనకు అనుకూలం గా ఆమెను ఒప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను . నామీద నాకు నమ్మకముంది . మంచితనం మీద నమ్మకముంది .” “ ఆమె వివరాలు రూపా ఎలా తెలుసుకుంది ? అజయ్ కు అర్థం కాలేదు . “ రూపా అంత పట్టుదలగా ప్రయత్నించింది అంటే తనపై అసలు నమ్మకం లేకే . తను చెప్పేది నిజమా , కాదా అని ఋజువు చేసుకోవటానికే “

“ మీకోసం చేసే ప్రయత్నం కాదిది . కేవలం నా పిల్లల కోసం , వారి దృష్టి లో మీ స్థానం పడిపోకూడదు . ఆనాటి పీడకల , పాపం వెలుగు చూసి సమాజం లో వారు అవమానం తో తలదిన్చుకోకూడదు “

In favour of your fight for social కాజ్‘ టాక్ అఫ్ ది లెటర్ పై రాసిన కొటేషన్ దీప్తి దృష్టిని ఆకర్షించింది . ఆ లెటర్ పంపింది జస్వంత్ . public relation s తో తలమునకలుగా ఉండే దీప్తికి జస్వంత్ ఎవరో తెలుసు . అతడి సత్తా తెలుసు . అతడో ప్రపోజల్ తో ముందుకు రావటం ఆమెకు ఆనందం , ఆశ్చర్యం కలిగించాయి . తన ప్రయత్నానికి అతడి సహకారం చాలా అవసరం. అతడిని వెంటనే కలవాలి .

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది . దీప్తి వెళ్లి తలుపు తెరిచింది . ఎదురుగా గిరిధర్ లాల్ . ప్రైవేటు డిటెక్టివ్ . అతడు తన వివరాలు , విద్యాదరి కేసు వివరాలు క్లుప్తం గా చెప్పాడు . ఆమె అడ్రెస్ మాత్రం చెప్పలేదు . దీప్తికి అతడి వైఖరి అర్థమైంది . టర్మ్స్ కుదిరితేనే గాని పెదవి కదపడు .

నిజానికి ఇప్పుడతని అవసరం లేదు .

***

జస్వంత్ అన్నివిధాలా సహకరిస్తాడు . కాని—అతడు స్థానికుడు . అక్కడి వివరాలు , మనుషుల మనస్తత్వాలు తెలిసిన వాడు .

“ అజయ్ తో మీ అసైన్మెంట్ విద్యాదరి వివరాలు తెలుసుకోవటం వరకేనా ?”

“ అంతే మేడం !”

“ విద్యాధరి వివరాలు నాకు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు “? ఆమె అతడిని నిశితంగా చూసింది . చురుక్కుమన్న ఆ చూపులు అతడిని ఇబ్బంది పెట్టాయి .

************************************

కొనసాగించండి 36 లో