సుందరవల్లి తన సోదరిలా కాక మనసు కుదిరినప్పుడు తపోధ్యానములో కూర్చునేది .
లోక కల్యాణ కారకుడైన నారదమహర్షి తరుణం చూసి శివ తనయుని స్కందగిరి లో దర్శించాడు . నారాయణ పుత్రికల మనో వాంఛితమును షణ్ముఖునికి వివరిస్తాడు . యుక్తవయస్కుడైన కార్తికేయుడు విష్ణుకన్యల రూపురేఖలను, మనసును నారదుని కథనం ద్వారా గ్రహించి వారిని అనుగ్రహించాలని సంకల్పిస్తాడు .
పై ఉదంతం శివకేశవుల అభేదాన్ని ఆవిష్కరిస్తుంది . శివశక్తి విష్ణుశక్తి వైపు మొగ్గు చూపటం చాల సహజమైన పరిణామం. ‘ జగతి లో ఏ మహత్కార్యానికైనా శివకేశవులు ఏకం కానిదే పరిపూర్ణ సిద్ధి లభించదు’ పైగా జ్ఞానశక్తికి ఇచ్ఛా క్రియా శక్తులు సోపానములై , సాధనా విశేషములై అలరారుట ఒక ‘ క్రమ పరిణామం.’ ఇదొక సహజగతి ‘ HYPOTHESIS, OBSERVATION, EXPERIMENTATION AND INFLUENCE అనే SCIENTIFIC PROCESS కు ఇదొక ప్రతిరూపం వల్లీ దేవసేనా సమేతుడైన షణ్ముఖుడు ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల సంగమం. ఇహలోక సౌఖ్యము , పరలోక సిద్ధికై కర సాధన, సాధన సిద్ధించిన పిదప పరిపూర్ణ జ్ఞాన చైతన్యం తో పరాత్పరునిలో ఐక్యమై , అద్వైత సిద్ధిని పొందుట జీవునకు అతి సహజమైన పరిణామమే కదా !
శివకుమారుడు ముందు అమృతవల్లిని గ్రహిస్తాడు . ఆమె నిశ్చల్ ధ్యానం , నిర్మలాంతరంగం, షణ్ముఖుని మురిపిస్తాయి . అంబ తనయుడు అమృతవల్లికి కనిపించి కనువిందు చేస్తాడు . మనసు, తనువు పరిపక్వత పొండనిదే తన పొందు లభించిందన్న పరమ సత్యం ఆమెకు తెలియ చేస్తాడు . కార్యసిద్ధికి వైకుంఠం అనువైన క్షేత్రం కాదని , కారభూమిపై కాలు మోపి పవిత్ర మానస సరోవరం చెంత తపమాచరించామని హితవు చెబుతాడు .
“ అమృతవల్లీ ! మన ఇరువురి సమాగమము అతి సహజమైన పరిణామం. నీ జనకుడు నారాయణుఁడు స్థితి కారకుడు . నా తండ్రి నిటలాక్షుడు , లయకారకుడు, విశుద్ధ జ్ఞాన స్వరూపుడు . నేను జ్ఞాన శక్తిని . నీవు క్రియాశక్తివి . సాధన లేనిదే సిద్ధి లభించదు . క్రియాశీలి కానిదే జీవుడు జ్ఞాన స్వరూపుడు కాలేదు . జగతి లో ఈ పరమ సత్యం మన ఇరువురి అన్యోన్యత వల్లే ఆవిష్కరింపబడుతుంది . సతిగా మేను చాలించిన నా తల్లి —- పర్వతరాజు పుత్రికగా పంచాగ్నుల నడుమ తనూ లతికను తపింప జేసి , నా తండ్రికి శివ తత్వాన్ని సహేతుకంగా , సుందరంగా వివరించిన పుణ్యభాగిని . ఆ తదేక ధ్యానమే , ఆ తత్పరతే నీకూ ఆదర్శం కావలి . ఏ హిమశైలములపై శైలజ ఉగ్రరూపం తో శివుని ప్రసన్నం చేసుకుందో ఆ కర్మ క్షేత్రం లో , పవిత్ర మానస సరోవర తీరాన నీవూ అకుంఠిత దీక్షతో పదివేల సంవత్సరాలు పరమ ధ్యానం లో గడపాలి . నా జన్మ లక్ష్యం శూర పద్మాది రాక్షస కోటి సంహారం . దుష్ట శిక్షణ పూర్తి కాగానే తరుణం చూసి చేస్తాను . అంతవరకూ తపస్సోక్కటే నాకు తరుణోపాయం”.
ఇలా సుబ్రహ్మణ్యుని ఆనతి మేరకు అమృతవల్లి పవిత్ర మానస సరోవర తీరాన తపస్సమాధి లో లీనమైపోతుంది .
సుందరవల్లికి సైతం సుందరేశ్వరుడి తనయుడు దర్శనమిచ్చాడు . షణ్ముఖుని దివ్యమంగళ రూపం సుందరవల్లిని అమితంగా ఆకర్షిస్తుంది . ‘ లత లాంటి తన దేహం స్కందుని అల్లుకు పోతే ఆ దివ్యస్పర్శ అనిర్వచనీయము కదా ‘! — ఈ భావన ఆమె మనోభూమిలో బీజమై నాటుకొని చంచల చిత్త ను గావిస్తుంది .
అమృతవల్లిని ఆదేశించినట్లు సుందరవల్లిని సైతం షణ్ముఖుడు తపోమార్గం లోనే ముందుకు సాగమంటాడు . కానీ, ఆమె మనోగతం గ్రహించిన అంబ తనయుడు సూచన మాత్రంగానే తన ఉద్దేశ్యం వెల్లడి చేస్తాడు . సౌంద ర్యాతిశయము గల సుందరవల్లిది స్పర్శాజనితమైన సుఖలాలస . పరిపూర్ణ సిద్ధి సాధించుటకు ఆమె కింకా సమయమున్నదని సుబ్రహ్మణ్యుని భావన
ఇలా సుబ్రహ్మణ్యుని ఆనతి మేరకు అమృతవల్లి పవిత్ర మానస సరోవర తీరాన తపస్సమాధి లో లీనమైపోతుంది .
సుందరవల్లికి సైతం సుందరేశ్వరుడి తనయుడు దర్శనమిచ్చాడు . షణ్ముఖుని దివ్యమంగళ రూపం సుందరవల్లిని అమితంగా ఆకర్షిస్తుంది . ‘ లత లాంటి తన దేహం స్కందుని అల్లుకు పోతే ఆ దివ్యస్పర్శ అనిర్వచనీయము కదా ‘! — ఈ భావన ఆమె మనోభూమిలో బీజమై నాటుకొని చంచల చిట్టాను గావిస్తుంది .
అమృతవల్లిని ఆదేశించినట్లు సుందరవల్లిని సైతం షణ్ముఖుడు తపోమార్గం లోనే ముందుకు సాగమంటాడు . కానీ, ఆమె మనోగతం గ్రహించిన అంబ తనయుడు సూచనా మాత్రంగానే తన ఉద్దేశ్యం వెల్లడి చేస్తాడు . సౌంద ర్యాతిశయము గల సుందరవల్లిది స్పర్శాజనితమైన సుఖలాలస . పరిపూర్ణ సిద్ధి సాధించుటకు ఆమె కింకా సమయమున్నదని సుబ్రహ్మణ్యుని భావన