“ సాగర్ ! మీరు వయసు లో నా కన్నా
చిన్నవారు . అయినా పెద్దమనసు చూపించారు . ఏమిస్తే మీ ఋణం తీరుతుంది . / రాహుల్ కళ్ళ లో పల్చటి కన్నీటి పొర .
‘ మీరు నాకు ప్రత్యేకం గా ఏమీ
ఇవ్వక్కర లేదు . మీ చిన్నాన్న బారి
నుండి విద్యాను కాపాడితే చాలు . “ స్పందన
గా సాగర్ చిరునవ్వు .
“ అమ్మ నా ప్రాణం. ఆమె కోసం దేవుడినైనా ఎదిరిస్తాను . పదేళ్ళ వయసు లో అమ్మను
దూరం చేసుకొని చాలా పోగొట్టుకొన్నాను . మళ్ళీ ఆ పొరపాటు జరగదు . “ హామీ ఇచ్చాడు
రాహుల్ .
నేనూ రాహుల్ సపోర్ట్ తో నే ఇంత సాహసం
చేస్తున్నాను . నాకు విద్యాగారి పట్ల కమిట్మెంట్ ఉంది . I am not totally proffessional.” జస్వంత్ భుజాలు
తడుముకున్నాడు . అతడి నిజాయితీని సాగర్ గుర్తించాలని ఆరాటం . గుర్తించినట్లు సాగర్
నవ్వాడు .
‘ డైరీ చదివిన తర్వాతే నాకూ పరిస్థితి అర్థమైంది . ఈ assignment మీ వల్లే
విజయవంతమవుతుంది .we need the support of an investigative journalist . “ జస్వంత్ తృప్తి గా
నవ్వాడు .
“ Now let us come to the point . నా రొటీన్ వర్క్ నా
అసిస్టెంట్ కు అప్పగించాను . Now I am free . పారా సైకాలజీ లో ఓ అద్భుతం . నా
పర్యవేక్షణ లో జరగబోతుందంటే నాకెంతో గొప్పగా, గర్వం గా ఉందొ తెలుసా
!?
సుదర్శనం నా నీడ లాంటి వాడు . హైదరాబాద్ లో అతడి ప్రాక్టీస్ చూసుకోవడానికి
కొడుకు ఉన్నాడు . అతడూ free . విద్యా ఆరోగ్యం, రక్షణ అతడి బాధ్యత .
జస్వంత్ ! ప్లాన్ అఫ్ ది యాక్షన్ నిర్ణయించ వలసినది నువ్వే . జస్ట్ వియ్ ఫాలో యు . సాభిప్రాయం
గా చూశాడు భరత్ రామ్ .
జస్వంత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు . అతడి లో పరిస్థితిని సమీక్షించే మధనం
జరుగుతోంది .
“ నా ఆర్టికల్ లో అజయ్ పునాదులు కదిలాయి . కోమలా దేవి కి జరిగిన కిరాతకం వెలుగు
చూస్తే అతడు లోకానికే కాదు , చట్టానికి
సమాధానం చెప్పుకోవాలి . అందుకే ఈ అపాయం తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం
ఇప్పటికే ప్రారంభించి ఉంటాడు . “
‘ ఎలాంటి ప్రయత్నం ? సాగర్ లో కలవరం .
“ కంగారు పడకండి . అప్పటిలా విద్యాధరిని టార్గెట్ చేయలేడు . “
“ ఎలా చెప్ప గలరు ?”
“ వంశగౌరవం కోసం ఆనాడు కోమలాదేవి ని బలి దీసుకున్నారు . ఆమె అమాయకురాలు. అనాధ; social status, చదువు, సమయస్ఫూర్తి, ఉన్న విద్యాధరిని
టార్గెట్ చేస్తే ఆ వంశ గౌరవమే తుడిచి పెట్టుకు పోతుంది . ప్రాణాలు పోతాయి . పరువు పోతుంది . “
“ మరి --- అతడు చేసే చివరి ప్రయత్నం ...?
“ కాళ్ళ బేరమే ! ఆనాటి సంఘటనలు బయట పెట్టవద్దని బతిమాలు కుంటాడు . అతడికి మిగిలిన ఏకైక మార్గం
ఇదే . విద్యా ఎప్పటికీ అజ్ఞాతం లో ఉండి
పొతే
ఆ రహస్యం వెలుగు చూడదు . సత్యం మరుగున పడి పోతుంది . ప్రజలు మరిచి పోతారు . “
“ కానీ---విద్యాను అతడు ట్రేస్ అవుట్ చేయలేడు . రాజస్థాన్ లో ఎక్కడా ఆమె
ఆనవాలు లేకుండా చేశాం . అజయ్ విద్యా ను కలిసే అవకాశం లేదు . “
“ మనసుంటే మార్గం లేక పోలేదు . మీరు కావాలి .” భరత్ రామ్ సూచన . అన్ని
జాగ్రత్తలు తీసుకున్నారు . -----అయినా డైరీ బయట పడింది . ఇలాగే ఎక్కడో, ఏదో పొరపాటు తప్పక
జరిగి ఉంటుంది . ఇలాంటి loop holes ను ప్రైవేటు డిటెక్టివ్స్ సులభంగా
పట్టేస్తారు . “
“ ప్రైవేటు డిటెక్టివ్స్ !!!” అందరూ ఒక్కసారే ఆశ్చర్య పోయారు .
“ ఎస్. అజయ్ భార్య రూపాదేవి చాలా
తెలివైంది . ఆమెను కాదని , ఆమెకు తెలియకుండా అజయ్ ముందుకు అడుగు వేయ లేడు . ఆమె
చొరవ తో ఇప్పటికే
అన్వేషణ పారంభమై ఉంటుంది . ఏదో ఒక రోజు అజయ్, రూపా దేవి ఇక్కడకు
వస్తారు . మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు . ”
“ కానీ --- ఇప్పుడిప్పుడే విద్యా అజయ్ ను కలవ కూడదు . అందుకు చాలా ప్రిపరేషన్ కా
వాలి. “
భరత్ రామ్ సూచన .
“ సో ---ఆమె ఇక్కడ ఉండటం ఏ కోణం లో చూసినా అంత క్షేమం కాదు . వేరే చోటుకు
మార్చాలి . ఆమెకు పూర్తి రక్షణ రాహుల్ ఉన్న చోటే. అతడింటికి పంపితే మేలు . “
చివరి మాటతో రాహుల్ వికసించింది . జస్వంత్ సూచన అందరికీ నచ్చింది .
“ అమ్మను చూస్తే నాన్నమ్మ సంతోష
పడుతుంది . ఆమె ఆశీర్వాదం అమ్మకు కొండంత బలం. “ సంబరపడి పోయాడు రాహుల్ .
“ రాహుల్ చెప్పింది నిజం . పెద్దావిడ మోరల్ సపోర్ట్ విద్యా కు అవసరం . “ అదే మాట
ను భరత్ కూడా బలపరిచాడు .
“ సాగర్ ! అజయ్, రూపాదేవిని చూసి
కంగారు పడకండి .” విద్యా పుట్టింటికి వెళ్లిందని చెప్పండి . ఆరోగ్యం పూర్తిగా
కుదుట పడలేదని చెప్పండి . ఆమె ఎట్టి పరిస్థితి
లో కూడా నిజం బయట పెట్టద ని హామీ ఇవ్వండి
. వారి లాగే మీరూ పరువుకు ప్రాణం ఇచ్చే మనుషులని చెప్పండి . మీ మాట మీద నమ్మకం తో
వారు ధైర్యం గా తిరిగి వెళ్లి పోవాలి .
ఒకే! “ సరే నని సాగర్ తల ఊపాడు .
“ మరి ---గ్రామానికి ఎందుకు వచ్చారు
ని అడిగితే ?”
వారి గ్రామానికి వచ్చిన తర్వాతే
విద్యా పూర్వ జన్మ వివరాలు తెలిసి మానసిక అలజడి పూర్తిగా తగ్గిందని చెబుతాను . డాక్టర్
సూచన తో నే అంత దూరం
రావాల్సి వచ్చిందని కూడా చెబుతాను . “
అలా వారి దృష్టి ని విద్యా పై నుండి మరల్చ గలిగా మంటే మన పని
సులువవుతుంది. అతడిని సులభం గా టార్గెట్ చేయగలం. ”
సాగర్ జస్వంత్ ను ప్రసన్నం గా చూశాడు .
“ అంకుల్ ! నేనిక నిశ్చింత గా
ఉండొచ్చు . జస్వంత్ అనుకున్నది సాధిస్తారు . “
“ నా మీద మీకున్న నమ్మకానికి థాంక్స్ . “ జస్వంత్ స్పందన.
“ జస్వంత్ ! విద్యా లో దాగుడు మూతలాడుతున్న
కోమల పూర్తీ స్థాయి లో బయట పడా.లంటే ఆమె
తన అత్తగారిని కలవాలి . ఆ పెద్దావిడను కలిసేది విద్యా అయినా ఆమె తో
మాట్లాడేది కోమల . అత్తగారి మోరల్ సపోర్ట్
, ఆశీస్సులు కోమల లక్ష్యానికి చాలా అవసరం “.భరత్ వివరణ .
“ అంకుల్ ! విద్యా కోమలా దేవి లా పదే పడే మారటం వల్ల ఆరోగ్యం దెబ్బ తినదా ?” సాగర్
స్వరం లో ఆత్రుత, కలవరం .
" నెర్వస్ సిస్టం పై కొంత ఒత్తిడి ఉంటుంది . సుదర్శనం విద్యాకు కావలిసిన మందులు ఇస్తూ ఆమె బాగోగులు
చూసుకుంటాడు . అయినా ఈ ఒత్తిడి తాత్కాలికమే . తనకు న్యాయం జరిగిన మరుక్షణం కోమల శాంతించి విద్యా లో కలిసి పోయి కలలా కరిగి పోతుంది . అంతే
---అదే సమస్య కు పరిష్కారం .”
ఆ వివరణ తో సాగర్ తృప్తి పడ్డాడు . సమావేశం పూర్తి కావటం తో సుదర్శనం శెలవు
తీసుకున్నాడు . జస్వంత్, రాహుల్ ప్రయాణపు
ఏర్పాట్లు చూడటానికి బయటకెళ్ళారు .
“ రాహుల్,
విద్యా అనుబంధాన్ని అర్థం చేసుకొని చాలా మంచి పని చేశావ్ ! నీ మారల్ సపోర్ట్ భర్త గా తనకున్డాలి . అప్పుడే
తను మనసు పెట్టి. ధైర్యం గా అజయ్ ను ఎదుర్కొంటుంది . నీలో మార్పు మన ప్రయత్నానికి
శుభ సూచకం . నీ పెద్ద మనసుకు , సంస్కారానికి హాట్స్ ఆఫ్ !!”
భరత్ రామ్ అభినందన తో సాగర్ సంతోష పడి
పోయాడు .
“ విద్యా డైరీ, రాహుల్ ఉత్తరం నన్ను కదిలించి నాలో మార్పు తెచ్చాయి
. జరగబోయేది ఒక అద్భుతం ! అందుకు తగినట్లే మన మందరం మన ప్రయత్నం లేకుండానే ఆ దారి లో ముందుకు
పోతున్నాము . we are going to witness an un imaginable , rare incident .” సాగర్ మొహం లో
సంభ్రమం !
*****************************
కొనసాగించండి 30 లో