గిరిధర్ లాల్ జైపూర్ లో వెదకని లాడ్జంటూ లేదు . చిన్న చితక మొదలుకొని
అయిదు నక్షత్రాల స్థాయి వరకు జల్లెడ పట్టేశాడు . ఎక్కడా విద్యాధరి వివరాలు
ఆవగింజంత కూడా దొరకలేదు .
అతడికి ఈ పని అప్పగించింది రూపాదేవి . అజయ్ కు చెప్పలేదు . “భర్తకు తెలియకుండా
మొదట తనే విద్యాదరి ని కలవాలి . మిస్టరీ తెలుసుకోవాలి .” ఆమె ఆలోచన.
అసైన్మెంట్ ఒప్పుకున్నాక గిరిధర్ మొదట విద్యాదరి టీం వివరాల కోసం గ్రామం లో
వాకబు చేశాడు . ఒక అవగాహన కు వచ్చాడు .
మిగతా పట్టణాలు , నగరాల తో పోల్చుకుంటే అజయ్ సింహ్ గ్రామం జైపూర్ కే కాస్త
దగ్గర . పైగా సాగర్ స్థాయి వ్యక్తులు సాధారణం గా తమ విడిదికి జైపూర్ నే prefer చేస్తారు . అందుకే
గిరిధర్ తన పరిశోధన జైపూర్ తో ప్రారంభించాడు .
గ్రామం లో విద్యాధరి రాజస్థాన్ బోలీ లో (
regional rajastanee – dialect ) మాట్లాడింది . భాష గిరిధర్ కు మరో అడ్డంకి .
చివరి ప్రయత్నం గా ఒక టాక్సీ స్టాండ్ కు వెళ్ళాడు .
అక్కడ డ్రైవర్ లను వాకబు చేశాడు . ఫలితం శూన్యం . అయినా ప్రయత్నం మానలేదు . ఆ రోజు
గ్రామం లో ఏం జరిగిందో ప్రతి డ్రైవర్ కు టూకీ గా చెప్పాడు . ఆ సంఘటన
సామాన్యమైంది కాదు గనుక ఆ అజ్ఞాత స్త్రీ
ని గ్రామానికి తీసుకు వెళ్ళిన డ్రైవర్ కు ఆమె తప్పక గుర్తు ఉందడి ఉంటుంది .
అదే అతడి అన్వేషణ కు ఆధారం . చివరకు ఆ డ్రైవర్ ను పట్టుగో గలిగాడు . ముందు
చూపుతో సాగర్ అతడిని పెద్ద మొత్తం తో కొన్నాడు .
అందుకే ముందు దిగి రాలేదు . గిరిధర్ కూడా అతడికి ఎ ర వేశాడు .
బెదరించాడు . దిగిరాక తప్పలేదు . అతడు పని జేసే టూరిస్ట్ ఏజన్సీ ద్వారా
విద్యాధర వివరాలు తెలిశాయి . వెంటనే రూపాదేవిని కలిశాడు .
“ అడ్రస్ తెలిసింది. మీ అసైన్మెంట్ ఇంతవరకే . ...మీ ఫీజు .” మరో మాటకు అవకాశం
ఇవ్వలేదు . రూపాదేవి పెద్ద పార్టీ . పెద్ద మొత్తం ఆశించాడు . చేసిన పనికి ఊహించిన
దాని కంటే ఎక్కువే లభించింది . కానీ పరిశోధన
అప్పుడే ఆగిపోవటం నిరుత్సాహం కలిగించింది .
“ అవసరం వస్తే మిమ్మల్నే
పిలుస్తాను . మీ పని తీరు నాకు బాగా నచ్చింది . “ అతడి తటపటాయింపు చూసి రూపా హామీ
ఇచ్చింది .
“థాంక్ యు మేడం ! “ గిరిధర్ కు కాస్త ఊరట .
రాహుల్,
విద్యాదరి ఎదురెదురు గా కూర్చొని ఉన్నారు . ఆ విశాలమైన గది లో మరెవరు లేరు . ఆ
సమావేశం ఏర్పాటు చేసింది సాగర్ . ఇలా పెద్ద మనసు తో తన సంస్కారం, స్థాయి ఊహకందనంత గా
పెంచుకున్నాడు .
విద్యాధర లో తల్లిని చూడగలుగు తున్నా వయసు రాహుల్ ప్రేమ కు కొద్దిపాటి అవరోధం కల్పిస్తోంది . అతడి లో ‘ఏజ్ కాన్షస్
నెస్ ‘ విద్యాదరి లో అమ్మ ఆ పరిధి కూడా దాటింది . రాహుల్ విద్యాను ఆర్తిగా
చూస్తున్నాడు . ----మాటలు కరువైనాయి .
“ ఉత్తరం రాసి చాలా మంచిపని చేశావ్. రాహుల్ బాబు ! .... అ ఉత్తరం నన్నే కాదు
సాగర్నీ కదిలించింది . నా మనసు లో నీ స్థానమేమిటో తెలుసుకోగలిగాడు . మంటల్లో
కాలిపోతున్నప్పుడు నీ పిలుపు తో
ఉలిక్కి పడ్డాను . నేనెంత తప్పు చేశానో అ ర్థమైంది . కానీ---అప్పటికే
ఆలస్యమైంది . మీ చిన్నాన్న , సాధువు నన్ను
కీలుబొమ్మ ను చేసి తమ పని పూర్తి చేసుకున్నారు . ...నేను మళ్ళీ పుట్టింది నీ కోసం
. .... వాళ్ళిద్దరినీ టార్గెట్ చేయాలనుకోవటం
నాలో కోమలను శాంత పరచటానికే . ఆమె
శాంతిస్తే , నా గుండె లో ఒదిగి పొతే ఇద్దరమ్మల ముద్దుబిడ్డ వవుతావ్ . “
విద్యా నవ్వింది . పుచ్చ పువ్వు లాంటి
వెన్నెల విరిసినట్లు అనిపించింది రాహుల్ కు .
“ అమ్మా ! ....ఇప్పుడు – ఈ క్షణం లో కూడా నువ్వు నా ముందు ఉన్నావన్న నిజం
నమ్మలేక పోతున్నాను . కలా ! నిజమా ! కల అనుకొంటే కరిగిపోతుందనే భయం .! నిజం
అనుకుంటే --- నన్ను మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచం లోనే ఉండడని అనిపిస్తుంది .
సాగర్ గారు ఇంత త్వరగా నా మనసు అర్థం చేసుకోవటం , ఇలా తల్లీ, కొడుకు ను కలపటం
అద్భుతం ! ఇది కేవలం దైవ నిర్ణయం . నీ పునర్జన్మ
మొదలు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు మన ఊహకందని విచిత్రాలు ....I am too emotional ----మాటలు రావటం లేదు . “
విద్యా నవ్వింది . అతడి పక్కన కూర్చొని తల నిమిరింది . అతడు కళ్ళు
మూసుకున్నాడు .
“ .....ఈ మదర్లీ టచ్ దూరమై పాతికేళ్ళు దాటింది . నా ముందున్నది అమ్మ ; విద్యాధరి కాదు “. ఆమె రెండు చేతుల్ని
కళ్ళకు అద్దుకున్నాడు . ఆమె మూర్తీభవించిన అమ్మ
లా గే నవ్వింది .
“ నీ వయసు నిన్ను వెనక్కి లాగుతోందని అర్థమైంది . అందుకే నేనే ముందు కదిలాను .
రాహుల్ బాబు ! ఎవరో ఏదో అనుకుంటారని నీ ఎమోషన్స్ దాచుకోవద్దు . మన
అనుబంధం అర్థం చేసుకోవాలంటే , ఆ స్థాయికి ఎదగాలంటే ఎంతో సంస్కారం కావాలి . ఆ
సంస్కారం నా భర్త కు ఉండటం మనిద్దరి అదృష్టం
. సమాజాన్ని పట్టించుకోవద్దు . అయినా – నాకు లేని అభ్యంతరం నీకు ఎందుకు ?”
“ అమ్మా ! ఇప్పుడు నీవు విద్యాధరివి .
నీ కంటూ ఒక entity , వ్యక్తిత్వం, బాధ్యతలు ఉన్నాయి . వాటిని కాదని నువ్వు నా పై
అభిమానం చుపలేవు . కోమలా దేవి లా అంత చనువుగా ఉండలేవు . --- ఉండకూడదు . నా వల్ల
నీకు నలుగురి లో సమస్యలు రాకూడదు . నువ్వు
నా అరుదైన వరానివి . నిన్ను కంటికి రె ప్పలా కాపాడుకోవాలి . అందుకే ఒక్క అడుగు
దూరం గా ఉంటే మంచిదనుకుంటున్నాను . “
అతడి మాటలకు అభిమానం గా చూసింది .
“ నువ్వు మాట్లాడింది చాలా రీజనబుల్ గా ఉంది . కానీ—ఈ లోకం కోసం, నువ్వు చెప్పే నలుగురి
కోసం నిన్ను,
నీ స్నేహం వదలుకోలేను “
రాహుల్ తృప్తిగా నవ్వాడు .
****************************************
కొనసాగించండి 29 లో