The shadow is true - 28 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 28

Featured Books
Categories
Share

నీడ నిజం - 28

గిరిధర్ లాల్ జైపూర్ లో వెదకని లాడ్జంటూ లేదు . చిన్న చితక మొదలుకొని అయిదు నక్షత్రాల స్థాయి వరకు జల్లెడ పట్టేశాడు . ఎక్కడా విద్యాధరి వివరాలు ఆవగింజంత కూడా దొరకలేదు .

అతడికి ఈ పని అప్పగించింది రూపాదేవి . అజయ్ కు చెప్పలేదు . “భర్తకు తెలియకుండా మొదట తనే విద్యాదరి ని కలవాలి . మిస్టరీ తెలుసుకోవాలి .” ఆమె ఆలోచన.

అసైన్మెంట్ ఒప్పుకున్నాక గిరిధర్ మొదట విద్యాదరి టీం వివరాల కోసం గ్రామం లో వాకబు చేశాడు . ఒక అవగాహన కు వచ్చాడు .

మిగతా పట్టణాలు , నగరాల తో పోల్చుకుంటే అజయ్ సింహ్ గ్రామం జైపూర్ కే కాస్త దగ్గర . పైగా సాగర్ స్థాయి వ్యక్తులు సాధారణం గా తమ విడిదికి జైపూర్ నే prefer చేస్తారు . అందుకే గిరిధర్ తన పరిశోధన జైపూర్ తో ప్రారంభించాడు .

గ్రామం లో విద్యాధరి రాజస్థాన్ బోలీ లో ( regional rajastaneedialect ) మాట్లాడింది . భాష గిరిధర్ కు మరో అడ్డంకి .

చివరి ప్రయత్నం గా ఒక టాక్సీ స్టాండ్ కు వెళ్ళాడు . అక్కడ డ్రైవర్ లను వాకబు చేశాడు . ఫలితం శూన్యం . అయినా ప్రయత్నం మానలేదు . ఆ రోజు గ్రామం లో ఏం జరిగిందో ప్రతి డ్రైవర్ కు టూకీ గా చెప్పాడు . ఆ సంఘటన సామాన్యమైంది కాదు గనుక ఆ అజ్ఞాత స్త్రీ ని గ్రామానికి తీసుకు వెళ్ళిన డ్రైవర్ కు ఆమె తప్పక గుర్తు ఉందడి ఉంటుంది . అదే అతడి అన్వేషణ కు ఆధారం . చివరకు ఆ డ్రైవర్ ను పట్టుగో గలిగాడు . ముందు చూపుతో సాగర్ అతడిని పెద్ద మొత్తం తో కొన్నాడు . అందుకే ముందు దిగి రాలేదు . గిరిధర్ కూడా అతడికి ఎ ర వేశాడు .

బెదరించాడు . దిగిరాక తప్పలేదు . అతడు పని జేసే టూరిస్ట్ ఏజన్సీ ద్వారా విద్యాధర వివరాలు తెలిశాయి . వెంటనే రూపాదేవిని కలిశాడు .

“ అడ్రస్ తెలిసింది. మీ అసైన్మెంట్ ఇంతవరకే . ...మీ ఫీజు .” మరో మాటకు అవకాశం ఇవ్వలేదు . రూపాదేవి పెద్ద పార్టీ . పెద్ద మొత్తం ఆశించాడు . చేసిన పనికి ఊహించిన దాని కంటే ఎక్కువే లభించింది . కానీ పరిశోధన అప్పుడే ఆగిపోవటం నిరుత్సాహం కలిగించింది .

“ అవసరం వస్తే మిమ్మల్నే పిలుస్తాను . మీ పని తీరు నాకు బాగా నచ్చింది . “ అతడి తటపటాయింపు చూసి రూపా హామీ ఇచ్చింది .

“థాంక్ యు మేడం ! “ గిరిధర్ కు కాస్త ఊరట .


రాహుల్, విద్యాదరి ఎదురెదురు గా కూర్చొని ఉన్నారు . ఆ విశాలమైన గది లో మరెవరు లేరు . ఆ సమావేశం ఏర్పాటు చేసింది సాగర్ . ఇలా పెద్ద మనసు తో తన సంస్కారం, స్థాయి ఊహకందనంత గా పెంచుకున్నాడు .

విద్యాధర లో తల్లిని చూడగలుగు తున్నా వయసు రాహుల్ ప్రేమ కు కొద్దిపాటి అవరోధం కల్పిస్తోంది . అతడి లో ‘ఏజ్ కాన్షస్ నెస్ ‘ విద్యాదరి లో అమ్మ ఆ పరిధి కూడా దాటింది . రాహుల్ విద్యాను ఆర్తిగా చూస్తున్నాడు . ----మాటలు కరువైనాయి .

“ ఉత్తరం రాసి చాలా మంచిపని చేశావ్. రాహుల్ బాబు ! .... అ ఉత్తరం నన్నే కాదు సాగర్నీ కదిలించింది . నా మనసు లో నీ స్థానమేమిటో తెలుసుకోగలిగాడు . మంటల్లో కాలిపోతున్నప్పుడు నీ పిలుపు తో ఉలిక్కి పడ్డాను . నేనెంత తప్పు చేశానో అ ర్థమైంది . కానీ---అప్పటికే ఆలస్యమైంది . మీ చిన్నాన్న , సాధువు నన్ను కీలుబొమ్మ ను చేసి తమ పని పూర్తి చేసుకున్నారు . ...నేను మళ్ళీ పుట్టింది నీ కోసం . .... వాళ్ళిద్దరినీ టార్గెట్ చేయాలనుకోవటం నాలో కోమలను శాంత పరచటానికే . ఆమె శాంతిస్తే , నా గుండె లో ఒదిగి పొతే ఇద్దరమ్మల ముద్దుబిడ్డ వవుతావ్ . “ విద్యా నవ్వింది . పుచ్చ పువ్వు లాంటి వెన్నెల విరిసినట్లు అనిపించింది రాహుల్ కు .

“ అమ్మా ! ....ఇప్పుడు – ఈ క్షణం లో కూడా నువ్వు నా ముందు ఉన్నావన్న నిజం నమ్మలేక పోతున్నాను . కలా ! నిజమా ! కల అనుకొంటే కరిగిపోతుందనే భయం .! నిజం అనుకుంటే --- నన్ను మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచం లోనే ఉండడని అనిపిస్తుంది . సాగర్ గారు ఇంత త్వరగా నా మనసు అర్థం చేసుకోవటం , ఇలా తల్లీ, కొడుకు ను కలపటం అద్భుతం ! ఇది కేవలం దైవ నిర్ణయం . నీ పునర్జన్మ మొదలు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు మన ఊహకందని విచిత్రాలు ....I am too emotional ----మాటలు రావటం లేదు . “

విద్యా నవ్వింది . అతడి పక్కన కూర్చొని తల నిమిరింది . అతడు కళ్ళు మూసుకున్నాడు .

“ .....ఈ మదర్లీ టచ్ దూరమై పాతికేళ్ళు దాటింది . నా ముందున్నది అమ్మ ; విద్యాధరి కాదు “. ఆమె రెండు చేతుల్ని కళ్ళకు అద్దుకున్నాడు . ఆమె మూర్తీభవించిన అమ్మ

లా గే నవ్వింది .

“ నీ వయసు నిన్ను వెనక్కి లాగుతోందని అర్థమైంది . అందుకే నేనే ముందు కదిలాను . రాహుల్ బాబు ! ఎవరో ఏదో అనుకుంటారని నీ ఎమోషన్స్ దాచుకోవద్దు . మన

అనుబంధం అర్థం చేసుకోవాలంటే , ఆ స్థాయికి ఎదగాలంటే ఎంతో సంస్కారం కావాలి . ఆ సంస్కారం నా భర్త కు ఉండటం మనిద్దరి అదృష్టం . సమాజాన్ని పట్టించుకోవద్దు . అయినా – నాకు లేని అభ్యంతరం నీకు ఎందుకు ?”

“ అమ్మా ! ఇప్పుడు నీవు విద్యాధరివి . నీ కంటూ ఒక entity , వ్యక్తిత్వం, బాధ్యతలు ఉన్నాయి . వాటిని కాదని నువ్వు నా పై అభిమానం చుపలేవు . కోమలా దేవి లా అంత చనువుగా ఉండలేవు . --- ఉండకూడదు . నా వల్ల నీకు నలుగురి లో సమస్యలు రాకూడదు . నువ్వు నా అరుదైన వరానివి . నిన్ను కంటికి రె ప్పలా కాపాడుకోవాలి . అందుకే ఒక్క అడుగు దూరం గా ఉంటే మంచిదనుకుంటున్నాను . “

అతడి మాటలకు అభిమానం గా చూసింది .

“ నువ్వు మాట్లాడింది చాలా రీజనబుల్ గా ఉంది . కానీ—ఈ లోకం కోసం, నువ్వు చెప్పే నలుగురి కోసం నిన్ను, నీ స్నేహం వదలుకోలేను “

రాహుల్ తృప్తిగా నవ్వాడు .

****************************************

కొనసాగించండి 29 లో