YOUR THE ONE - 28 in Telugu Fiction Stories by Chaithanya books and stories PDF | జతగా నాతో నిన్నే - 28

Featured Books
Categories
Share

జతగా నాతో నిన్నే - 28







అలా రోడ్డుపై ఆలోచించుకుంటూ వస్తున్న రాహుల్ కంటికి దూరంగా ఏదో కనబడింది .దాన్ని చూడగానే అతడి అడుగుల వేగం పెరిగింది.


దాని సమీపించే కొద్దీ అది ఏంటో అర్థం అయ్యి అప్రయత్నంగానే బాధగా “ స్నూపీ .........” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు .


దాన్ని చేరుకుని దాని చేతిలోకి తీసుకోగానే, దానికి ఉన్న రక్తం అంతా అతడి శరీరాన్ని తడిపేసింది.


“ స్నూఫీ ఎవరు నిన్ను ఇలా చేసింది ?” అంటూ ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయాడు .


రోడ్డు పైన అన్విని వెతుక్కుంటూ వస్తున్న అభయ్కి దూరంగా రాహుల్ కనిపించేసరికి , పరుగు పరుగున తన దగ్గరికి చేరుకున్నాడు.


రాహుల్ చేతులో కుక్క పిల్లని చూడగానే , “ రాహుల్ అన్వి ఎక్కడ ? ” అన్నాడు భయంగా.


అప్పటిదాకా ఏడుస్తున్న రాహుల్ తేరుకొని, “ అన్వి ఎక్కడ ?” అంటూ తిరిగి ప్రశ్నించాడు.


“ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నువ్వు చూడలేదా ?”


“ లేదు ! నేను వచ్చేసరికి ఈ కుక్కపిల్ల మాత్రమే ఇలా పడి ఉంది ” అన్నాడు బాధగా.


“ హో షట్ ! అన్విని ఎవరో కిడ్నాప్ చేశారు ” అన్నాడు వెంటనే .


“ ఏంటి ?" గట్టిగా అరిచేసాడు రాహుల్ కూడా. ఇద్దరు తలలు పట్టుకొని అక్కడే కూర్చుండి పోయారు.


కొద్దిసేపటికి తేరుకున్న వాళ్ళిద్దరూ , నువ్వు అటువైపు వెళ్లి వెతుకు, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను అని విడిపోయారు.


ఆ కుక్క పిల్లని అలాగే వదిలేయడం ఇష్టం లేక వెంటనే కొండ ప్రాంతాన్ని చేరి, ఒక చిన్న గుంత తీసి అందులో పూడ్చి పెట్టాడు బాధగా దానివైపే చూస్తూ. అన్వి ముఖ్యమని అక్కడి నుండి మళ్ళీ వెతకడానికి వచ్చేసాడు .


అలా రాహుల్ ఆ చీకటిలో కేవలం రోడ్డు లైట్ వెలుతురులోనే అన్వి కోసం ఏదైనా చిన్న ఆధారం దొరుకుతుందేమో? అన్నట్టుగా వెతకడం మొదలుపెట్టాడు .

ప్రతి దాన్ని వెతుకుతూ వెతుకుతూ పరిగెత్తాడు. తను అలా వెతకడం వల్ల శరీరం అలసిపోయింది . చెమటలు ధారాళంగా కారుతున్నాయి .


పూర్తిగా అంత వెతికిన తర్వాత తను అక్కడ లేదని అర్థమైంది . ఏం చేయాలో అర్థం కాక అలాగే అర్ధరాత్రి ఆ రోడ్డుపైన కూర్చుండిపోయాడు. కొద్దిసేపు బాధగా అంత చూశాడు .



తన జాడ కనిపించదని అర్థమై “ అన్వి.........” అంటూ దిక్కులు పీక్కటిల్లెల అరిచాడు . ఆ అరుపులకి శూన్యం కూడా బెదిరిపోయినట్టు అనిపించింది .


కట్టలు తెంచుకున్న కోపం అర్థమవుతున్న, కన్నీరు ఎంత ఆపాలనుకున్న ఆగటం లేదు . అలాగే రోదిస్తూ వెక్కిళ్లు పెట్టి మరి అలాగే రోడ్డుపై కూర్చుండిపోయాడు .అతని బాధకి ఓదార్చడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు .


ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఆత్మ వేగంగా రాహుల్ దగ్గరికి చేరుకుంది. అతని బాధను చూడగానే అది కరిగిపోయినట్టు అనిపించి, నెమ్మదిగా ఓదార్చడం మొదలు పెట్టింది.


ఆ ఆత్మ ఒక అమ్మ రూపాన్ని ధరించి రాహుల్ ని ఓదార్చడం మొదలుపెట్టింది. ఆ నల్లని పొగ ఒక అమ్మ రూపంలోకి మారగానే రాహుల్ కి తెలియకుండానే మరింత బాధగా అనిపించి , ఏడవటం మొదలుపెట్టాడు.


తలపై చిన్నగా నిమరుతున్న ఆత్మ “ నాకు అర్థం అవుతుంది నీ బాధ ! దీనికి పరిష్కారం నువ్వు ఛటర్జీ గారిని అడిగితే ఒక సలహా దొరుకుతుంది .ఈ ప్రపంచంలో నీకంటూ సమాధానం చెప్పగలిగేది కేవలం ఇద్దరు మాత్రమే ! అందులో ఒకరు అభయ్ మరొకరు చటర్జీ ” అంటూ ఊరటగా మాట్లాడింది.


ఆత్మ చెప్పిన మాటలకు వినగానే " అమ్మ.......!" అంటే ఏడుస్తూ లేచి నిలబడ్డాడు. అక్కడి నుండి ఒక్క క్షణంలో మాయమై చటర్జీ దగ్గర ప్రత్యక్షమయ్యాడు.



ఆయన అప్పటికే మందు తాగుతూ ఉన్నాడు. సడన్గా తన ముందు ప్రత్యక్షమైన రాహుల్ ని విచిత్రంగా చూస్తూ , “ ఏంటి ప్రభు ఇలా వచ్చారు? ” అన్నాడు .


అప్పటికే రాహుల్ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి.


“ అన్విని ఎవరో కిడ్నాప్ చేశారు ” అన్నాడు బాధగా! ఆ మాట వినగానే ఆయనకు అర్థమైపోయింది .


రాహుల్ అన్విని ప్రేమిస్తున్నాడు అనీ. అందుకే ఏం మాట్లాడకుండా తన దగ్గరకు వచ్చాడు .తనని కూర్చున్నట్టుగా సోఫా చూపించి , అతడికి తాగటానికి కొన్ని మంచి నీళ్లు ఇచ్చాడు.


“ ప్రభు నేను ఇలా మందు తాగుతున్నాను కదా? దానికి కారణం ఏంటో తెలుసా ? ”

రాహుల్ తెలియదు అన్నట్టుగా తలవూపాడు.



“ నేను కూడా అచ్చం నీలాగే! నాక్కూడా ఆ సామ్రాజ్యంలో బ్రతకాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు . మనుషులు మన ఊహించినంత చెడ్డవాళ్లేమీ కాదు అన్నది నా నమ్మకం.


అందుకే నేను ఈ మానవలోకంలో బ్రతకాలని వచ్చాను. ఇక్కడ నేను ఒక్కడినే సంతోషంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడిని . అలాంటి సమయంలోనే నాకు పరిచయమైంది ఒక ప్రేమ ” అంటూ తన ఎదురుగా ఉన్న గోడపై ఒక ఫోటోని చూపించాడు . అందులో ఒక ఆమె చిత్రం ఉంది.



“ తన పేరు మధుబాల ! తను ఒక టూరిజం ట్రావెలర్ . విధి కలపటం వల్ల కలిశాం అనుకుంటా! ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. కానీ ఆమె రాతలో నేను లేను . అందుకే ఒక యాక్సిడెంట్ లో ఆవిడ చనిపోయింది . ఆ తర్వాత నన్ను మీ నాన్నగారు తన రాజ్యానికి రమ్మని ఎంతగానో బ్రతిమిలాడారు . కానీ ఆమె జ్ఞాపకాలతో నేను అక్కడ సంతోషంగా ఉండలేనని , ఇలా భూమిపైనే ఉండిపోయాను. ఆమె గుర్తు రాని రోజు అంటూ లేదు. ఆమెను తలుచుకున్న ప్రతిసారి , నేను ఇన్ని శక్తులు కలిగి ఎందుకు కాపాడలేకపోయాను అన్న బాధ నన్ను తొలిచేస్తుంది . అందుకే మరుపు కోసమే ఈ మందు ” అంటూ చేతిలో ఉన్న పెగ్ని తాగేశాడు.



ఇంతలోనే మళ్లీ మాట్లాడుతూ , “ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అర్థం అవుతుంది. మీరు అన్పిని ఎంతగా ప్రేమిస్తున్నారో!. ఇప్పటిదాకా మీరు మీ కంటితోనే వెతికారు . ఇప్పుడు మీలో దాగున్న ఆ ప్రేమని బయటికి తీసి, మీ మనసు చెప్పిన మాట వింటూ వెతకండి” అన్నాడు అంతే బాధగా.



రాహుల్ ఆయన వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు.


“ ప్రేమ ఒక బలమైన ఆయుధం. అదే ఈ భూమి పుట్టక ముందు నుంచి ఉంది. అదే మిమ్మల్ని కలుపుతుంది ” అని నిశ్శబ్దంగా ఉండి పోయాడు.


రాహుల్ కి ఏమీ అర్థం కాలేదు .

“ తాగేసి ఏదేదో మాట్లాడుకుంటున్నాడు .సలహా ఇస్తాడని వస్తే, తన గతాన్ని చెప్పి ఇంకా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడటం వృధా ప్రయాసం .నేనే వెతుక్కుంటాను ”అంటూ బయటికి వచ్చాడు రాహుల్.


********


ఆ నలుగురు కిడ్నాప్ చేసి తనని ఒక పాడుబడిన భవనంలో దాచారు . అది వేరే ప్రాంతం అవటంతో ఎవరు అటూగా రారు.


అందులో గుండు వేసుకున్న ఒకడు వాళ్ళ బాస్ కి ఫోన్ చేశాడు .


“ బాస్ మిషన్ సక్సెస్ఫుల్ . ఇప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకురావాలో చెప్తే , మేము తీసుకొని వచ్చేస్తా !”


“ సరే అలాగే కాసేపు ఉండండి. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తా” అని పెట్టేసాడు.


ఆ వ్యక్తి సోమనాథ్ కి ఫోన్ చేశాడు.....!!


“ సోమనాథ్ మీరు చెప్పినట్టుగానే, తనని కిడ్నాప్ చేసాం. ఇప్పుడు ఎక్కడికి తీసుకుంటావాలి ” అని ప్రశ్నించాడు .


“ తనని ఒక రోజు మీ చెరలోనే పెట్టండి . నేను ఇండియాకి తిరిగి వస్తున్నాను. రాగానే తన పని చూస్తాను . ఇక డబ్బు విషయం అంటారా? అది మీకు అడ్వాన్స్గా సగం పంపిస్తున్నాను ” అంటూ పంపించేశాడు .


ఆ మరుసటి రోజు కమిటీ సభ్యులంతా కూర్చున్నారు . పవర్ ఆఫ్ అటాని తీసుకొని సోమనాథ్ ఆ మీటింగ్ కి వచ్చి, “ తొందరగా వారసురాలిని ప్రవేశపెట్టండి . దీనిని ఆమెకే అందించేసి నేను వెళ్ళిపోతాను” అన్నాడు.


వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు . అది గమనించి చిన్నగా నవ్వుకున్నాడు సోమనాథ్ .


“ చూడు సోమ్నాథ్! మేము ఇంకా అన్విని వెతకలేదు . తనని వెతకడానికి మనుషులను పంపించాము. తను కనిపించట్లేదని చెప్తున్నారు. తను ఒకవేళ లేకపోతే చట్టం ప్రకారం రెండు రోజులు తర్వాత అది వారసురాలు చేతికి వెళ్లకపోతే నువ్వే ఈ పదవిలో కొనసాగుతావని మేము హామీ ఇస్తున్నాము ” అన్నారు .


“ పిచ్చ నాయాలరా ....తను నా చెరలో ఉంటే మీకు ఎప్పుడు దొరుకుతుంది రా? రేపు రాత్రి దానిని చంపి, ఇది నా సొంతం చేసుకుంటాను ” అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు .



*******



అన్విని కాపలా కాసిన వాళ్లకీ, అన్వి అందానికి మతి చెదిరింది . తనని అనుభవించాలని వాళ్లలో కోరికలు మొదలయ్యాయి. అందులో ఇద్దరు ఆమె దగ్గరికి వెళ్లి......

“ పిల్ల భలే ఉందిరా ! ఒక్కసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది ?” అన్నాడు మత్తుగా.


“ నీ తర్వాత నేను ట్రై చేస్తాను. తొందరగా పని కానిచ్చి వచ్చేయ్ ” అన్నాడు ప్రోత్సహిస్తూ .


దానికి వాడు సంతోషించి , తన పైన చేయి వేయడానికి ముందుకు వెళ్లాడు . అప్పుడే అక్కడికి వచ్చిన మూడో వాడు అంటే వాళ్ళ బాస్తో కాంటాక్ట్ లో ఉండేవాడు .


“ రేయ్ ఏం చేస్తున్నావు? ” అంటూ వాడిని వెనక్కిలాగాడు .


“ నీకు అసలు బుర్ర ఉందా రా? లేకుంటే ఏదైనా చెత్తకుప్పలో పడేసి వచ్చావా ? చెత్త నాయలా! ఈ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు . ఈ అమ్మాయికి మనం ఎంత దూరంగా ఉంటే, మనకి అంత మంచిది . మనం ఈ చిన్న పొరపాటు చేసి దొరికిన మన శరీరంలో ఒక్క భాగం కూడా మిగలదు.అన్ని పీసులు పీసులుగా నరికేస్తారు” అని వాళ్ళకి ప్రాణాలు గురించి చెప్పాడు.



అమ్మాయి బ్యాగ్రౌండ్ గురించి మొత్తం వివరించేసరికి, వాళ్ళ గుండెలు దడేలుమన్నాయి. భయంగా అన్వి నుంచి దూరంగా వెళ్లిపోయారు.


ఆ మాటలన్నీ వింటూ ఉన్న తన ఎదురుగా ఉన్న వాళ్ళని చూడలేక పోతుంది అన్వి. ఎందుకంటే తన కళ్ళకి నల్లని ఒక బట్ట కట్టారు. చేతులు రెండు కుర్చీకి కట్టేశారు. అది చెక్క కూర్చి అవ్వడం వల్ల కాళ్ళకి కూడా కట్టి బిగించారు.


శరీరంలో సత్తువ పోయి, నీళ్లు తాగకపోవడంతో “ దాహం.....దాహం ” అంటూ చాలా నీరసంగా పలికింది అన్వి!


“ రేయ్ దానికి కొన్ని నీళ్లు తాపిరాపో! చచ్చిపోయేలా ఉంది . అది చచ్చిపోతే మనం అసలు బ్రతకం ” అంటూ పురమాయించాడు ఒకడు .


వాడు అన్వి దగ్గరికి వెళ్లి “ తాగు........”అంటూ నీళ్లు తాపాడు .


——— ***** ———