YOUR THE ONE - 20 in Telugu Fiction Stories by Chaithanya books and stories PDF | జతగా నాతో నిన్నే - 20

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

జతగా నాతో నిన్నే - 20










కాలేజీకి వెళ్ళిన రాహుల్,అభయ్ కి ఒకచోట అన్వి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి ఏదో మాట్లాడుతూ ఉంటుంది . కొన్ని క్షణాల్లోనే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా సీరియస్ విషయానికి సంబంధించిన అని అర్థం అయింది .దాంతో వాళ్ళిద్దరూ అటుగా నడిచారు.



“ హాయ్ ! ఏంటి , ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నారు? ” అనీ అభయ్ పలకరించగానే ....


“ అదేం లేదు అభయ్ . రెండు వారాల్లో కాలేజీ ప్రాజెక్టు ఉంది కదా! దాని గురించే మాట్లాడుతున్నాము ” అంది చేపుతూ.


“ దాంట్లో మాట్లాడుకోవడానికి ఏముంది? ఏ గూగుల్ లో లేకుంటే ఎలక్ట్రానిక్స్ సిటీ లోను మనీ ఇస్తే, ప్రాజెక్ట్ చేసి ఇస్తారు అంటా కదా? ” అన్నాడు ఉచిత సలహా ఇస్తూ .


“ అయ్యా మహానుభావా! మేము అదే సలహా ఇచ్చాం ” అంది సంజన వెక్కిరిపూగా.


ఏం అర్థం కానట్టుగా మొఖం పెట్టాడు అభయ్.


“ మనం ప్రాజెక్టు కోసం రికార్డులు రాసి, దానికోసమే ఒక రెండు నెలలు కష్టపడతాం. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడానికి .....దాన్ని ఇంప్రూమెంట్ చేయడానికి , ఇలా చాలా పనులు ఉంటాయి కదా.

అదేదో రియల్ టైం ప్రాజెక్ట్ అవుతే చాలా బాగుంటుంది. భవిష్యత్తులో కూడా మనకి ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ అంటే కేవలం రోబోట్లతో చేయాలని ఏమీ లేదు కదా? మనం ఏదైనా ఒక కొత్త ఐడియాని సమాజంలోకి తీసుకెళ్లాలి దానిని కదా అసలైన ప్రాజెక్టు అనేది ” అంటూ ఇద్దరికీ అర్థమయ్యేలాగా చెప్పింది అన్వి.


ఆ మాటలకి అభయ్ కళ్ళు రెండు సంతోషంతో మెరిసాయి . మనుషుల్లో కూడా మానవత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అమ్మాయిని నా లాస్ట్ మెషిన్ గా పంపినందుకు , దేవుడికి నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి అని మనసులోనే డిస్కో డాన్స్ చేస్తున్నాడు.


“ అయితే నీ దగ్గర ఏదో ప్లాన్ ఉంటుంది కదా ! చెప్పు ?” అంటూ సీరియస్ టోనులో రాహుల్ .


“ అంటే, అది .......” అంటూ తడబడుతూ చేతులు నలుపుకోసాగింది అన్వి .



తన ప్రవర్తన చూసిన అభయ్, “ నువ్వేం భయపడకు .డబ్బు విషయం మేము చూసుకుంటాంలే !” అన్నాడు ధీమా ఇస్తూ.


“ ఛీ ! అది కాదు ” అంటూ చిన్నగా భుజంపై కొట్టింది . “ నా ఐడియా మీకు నచ్చుతుందో, లేదో? అని ” అంటూ సాగదీసింది.


“ ముందు నువ్వు చెప్పు .తర్వాత చెప్తాము ” అన్నాడు రాహుల్ .


“ ఈమధ్య మనిషి నాగరికత చాలా పెరిగింది. ఎక్కడ చూసినా సిమెంట్ బిల్డింగులు, పరిశ్రమలు వీటితోనే సరిపోతుంది . కాబట్టి మనం వీటికి విరుద్ధంగా ,ప్రకృతికి దగ్గరగా ఏదైనా చేద్దాం. ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి రెండు నెలలో దాని ప్రోగ్రెస్ ఎంత కొంత ఉంటుంది . దాన్ని మనం ప్రాజెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం .ఒకవేళ క్లిక్ అవుతే మనం అదృష్టవంతులు అయిపోతాం ” అంటూ కాస్త సంతోషంగా చెప్పింది అన్వి.


“ ఐడియా బాగుంది. దీని గురించి ఆలోచిస్తా !” అంటూ చెప్పి సీరియస్ గా బ్యాక్ భుజాన్ని పెట్టుకొని వెళ్లిపోయాడు రాహుల్.


ఎప్పుడు చూడు ఎండుమిర్చి మొఖం వేసుకొని ఉంటాడు అని మనస్సులో అనుకుంటూ మూతి చిట్లించింది అన్వి.


ఆ తర్వాత రోజు వీకెండ్ అవ్వడంతో, క్లాసులకి భూషణ్ సార్ నామమాత్రంగా వచ్చారు. ఏదో చెప్పాలి అంటే చెప్పాలి అన్నట్టుగా చెప్పేశారు. కాలేజీలో ఉన్న రాహుల్, అభయ్ ఇద్దరి పాపులారిటీ కూడా యధా మామూలుగా మారిపోయింది.



సాయంత్రం ఇంటికి బయలుదేరినా రాహుల్తో ““ రాహుల్ నువ్వు రూమ్ కి వెళ్ళు. నాకు కొంచెం పని ఉంది .వస్తానో, రానో చెప్పలేం ” అంటూ; తను వస్తాను అంటే ఏం చెప్పాలి అబ్బా అని మనసులో ఆలోచిస్తున్నాడు.


" సరే....." అని ఒక్క మాటతో తేల్చేసి ,అక్కడ నుండి కదిలాడు రాహుల్.


అసలు వీడేంటి ? ఎవరైనా ఏం పని ,నేనేమన్నా హెల్ప్ చేయాలా? అని కనీసమైన అడుగుతారు . వీడు మనిషా అనుకోవాలో, ఇంకేం అనుకోవాలో అంటూ తిట్టుకుంటూ చర్చ్ వైపు నడిచాడు అభయ్.




*******


రాహుల్ ; ఇదే దొరికిన చాన్స్ అనుకోని తొందరగా తన గదికి వెళ్లి , తన వస్తువులన్నీ పెట్టేసాడు . కాస్త ముఖానికి పౌడర్ అద్దుకొని అందంగా రెడీ అయినట్టు మెరిసిపోతూ.......రక్తం తాగడానికి బయటికి నడిచాడు .



తన ఫోన్లో క్రిమినల్ లిస్ట్ ని ఓపెన్ చేసి చూస్తే, అందులో ఒక వ్యక్తి భూమి పై బ్రతకడం వృధా అనిపించింది . ఆ వ్యక్తిని టార్గెట్ చేసి, గబ్బిలంలా మారి వెళ్ళిపోయాడు.


ఆ వ్యక్తి అప్పుడే మందు తాగుతూ ఒక బీర్ షాప్ లో కూర్చున్నాడు. అతడు బయటికి వచ్చే వరకు చెట్టు పైన కూర్చున్నాడు.



అతడి ఎప్పుడైతే నిర్మానుష ప్రదేశంలోకి వచ్చాడో, అప్పుడే వెనుక నుండి అతని బలంగా తన్నాడు . ఆ దెబ్బకి తగిదంత మొత్తం వదిలిపోయేలా, ఆ తారు రోడ్ శరీరని గీసుకుపోయి రక్తం బయటకు వచ్చింది .


“ రేయ్ ఎవర్రా నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు ” అంటూ మేకపోతు గాభీర్యానీ చూపిస్తూ యుద్ధానికి సైయ్యన్నట్టు లేచాడు ఆ వ్యక్తి .


“ నువ్వు అంత మగాడివా రా ?” అంటూ రాహుల్ ఒక్కసారి తన విశ్వరూపాన్ని చూపించగానే , దడుచుకు చచ్చి , కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు.


“ నిన్ను రకరకాలుగా బాధపెట్టి చంపుదామనుకున్నారా? నీ అదృష్టం. ఒకటే దెబ్బకి చచ్చిపోయావు ” అంటూ తన చేతి వేళ్ళ పై ఉన్న గోర్లతో అతని శరీరంపై రక్కుతూ , ఒక అందమైన పెయింటింగ్ లాంటిది వేశాడు .


అతని శరీరంలో నుండి ఒక్కొక్క నరాన్ని బయటకి తీసి , అందులో ఉన్న రక్తన్ని స్ట్రాగా పీల్చినట్టుగా పిలుస్తూన్నాడు.

ఇప్పుడే మందు తాగడం వల్ల రక్తము రూచిగా అయ్యింటుంది అంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రాహుల్.



అప్పుడే చుట్టు దూరంగా ఏదో అలికెడు అవడం మొదలయ్యింది . ఈ సమయంలో ఇక్కడెవరు అంటూ కాస్త ఆశ్చర్యంగా అటువైపు చూస్తూన్నాడు రాహుల్. నెమ్మదిగా చెట్టు పొదల నుంచి చాలా వేగంగా ఒక ఆత్మ బయటికి వచ్చింది .


“ నువ్వా ? నేనింకా ఎవరో అనుకున్నాను. ఏంటి ఈ సమయంలో ఇలా వచ్చావు. కావాలంటే ఇతడి శరీరాన్ని తిను” అన్నాడు ఆఫర్ ఇస్తూ.


" లేదు యువ రాజా! క్షమించండి . మీరు నాకు ఇచ్చిన పనిని నేను నిర్వర్తిస్తున్నాను. అందులో నాకు కొన్ని విషయాలు తెలిసాయి . అది మీకు చెప్పాలని నేను ఆరోజు ప్రయత్నించాను . కానీ మీ పరిస్థితిని చూసి చెప్పలేకపోయాను” అంటూ నెమ్మదిగా తలదించింది ఆత్మ .


“ అవునా ఏంటి అది ? ” అన్నాడు రాహుల్ రక్తం తాగడం మానేసి సీరియస్ గా చూస్తూ.


*******



సెయింట్ చర్చ్ దగ్గరికి చేరుకున్న అభయ్ చుట్టూ ఒకసారి గమనించాడు. ఆ చర్చి చుట్టుపక్కల అంతా చీకటిగా ఉంది . ఒక్క మనిషికి జడా కూడా లేదు. కీటకాలు కిటకిటలు మాత్రమే వినిపిస్తున్నాయి.



ఎవరూ లేరని నిర్ధారించుకుని తర్వాత నెమ్మదిగా చర్చిలోపలికి వెళ్ళాడు .


“ ఏంటి. ఎవరో దారి తప్పి వచ్చినట్టున్నారు? ” ఏదో పని చేసుకుంటూ అన్నాడు పోప్ .


“ అదేం లేదు .నా చివరి మిషన్ని చేయడంలో కాస్త బిజీ ” బ్యాగ్ పక్కన పెడుతే చెప్పాడు అభయ్.


" అవునా ! మరి ఎంత వరకు వచ్చింది ?” అన్నాడు చేస్తున్న పనిని ఆపి చూస్తూ .


“ దాదాపు సగానికి వచ్చింది ......” తాపీగా బదులిచ్చాడు.


“ సరే కానీ ,ఇప్పుడు నన్ను చూడ్డానికి వచ్చావా? లేదంటే ఇంకేదైనా పని ఉందా? ” అన్నాడు సూటిగా అసలు విషయాన్నీ తెలుసుకుంటూ .



“ మొదట అయితే నిన్ను చూడ్డానికి వచ్చాను ” అంటు నాలిక కర్చుకుంటూ ; ” నాకు ఒకసారి ఇంటికి వెళ్లాలని ఉంది . ”


“ నీకు తెలుసు అనుకుంటా! నువ్వు భూమి పై ఉన్నప్పుడు మళ్లీ నువ్వు నీ ఇంటికి వెళ్లాలి అంటే, అక్కడ ఇచ్చే ఒక పరీక్షని చేయాల్సి ఉంటుంది . లేదంటే భారీ పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరమా అదంతా? ” అన్నాడు కాస్త కసురుతున్నట్టుగా .



" మరేం పర్వాలేదు. అదంతా నేను చూసుకుంటాను. నన్ను వెంటనే పంపించు " అంటూ అంతే దృఢంగా చెప్పాడు అభయ్.


“ సరే నిన్ను మాత్రం నేను మార్చలేను ” అంటూ ఏదో మంత్రాలు చదువుతూ ,చేతితో మ్యాజిక్ చేయగానే .......చేతి చుట్టూ ఒక నక్షత్రాల మార్గం ఏర్పడుతుంది .


దాన్ని అభయ్ వైపు పంపించగానే అది చర్చి పై నుండి కాంతి వేగంతో ఆకాశం లోకి దూసుకుపోయింది . దూరం నుండి చూసే ప్రతి ఒక్కరికి అది ఒక తోకచుక్కలా మాత్రమే కనిపిస్తుంది.



అలా కేవలం పది నిమిషాల్లోనే అతను స్వర్గం ద్వారం దగ్గరికి చేరాడు. అక్కడ ఉన్న ద్వార పాలకులు తన్ని లోపలికి పంపించారు.



మేఘాల పైన రెండు పెద్ద గేట్లు తెరుచుకొని ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క సూలాలను పట్టుకొని రెక్కలు కలిగిన ఇద్దరు మనుషులను నిలబడ్డారు. లోపలికి అడుగుపెట్టిన వెంటనే , అభయ్ న్యాయస్థానం లాంటి ఒక చిన్న గదిలోకి వెళ్ళాడు.



అక్కడ అప్పుడే పుట్టిన చిన్న పాప , రెండు చిన్న రెక్కలతో .......తల పైన మెరిసే ఒక రింగుతో పెన్ పట్టుకొని ఏదో రాస్తూ ఉంది .


“ ఇప్పుడు ఎవరొచ్చారు ” అంటూ చిరాగ్గానే గడ్డం కింద చేతులు తీస్తూ చూసింది .



” ఓ నువ్వా...?” అంటూ మళ్ళీ ఏదో రాసుకుంటూ కూర్చుంది. ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్టుగా, “ ఏంటి అభయ్ .......నువ్వా ?” అంటూ ఆశ్చర్యపోయింది.


“ ఆ నేనే ! ఎందుకంత ఆశ్చర్యం ”


“ నువ్వు ఎప్పుడూ ,ఇలాంటి పెనాల్టీలు ఎదుర్కోలేదు కదా ! సరే కానీ ఎన్ని రోజులు ఉండాలని వచ్చావు? ” అంటూ పెన్ పేపర్ పై రాస్తూ అడిగింది .


“ రెండు రోజులు ఉండాలనుకుంటున్నాను .”


“ సరే మరి .........” అంటూ ఆ చిన్న ఏంజెల్ తన పెన్ను రౌండ్ గా రెండు సార్లు తిప్పగానే, మూలనున్న అలమారాలనుంచి ఒక పుస్తకం బయటకు వచ్చింది.


అదే తెరుచుకొని పేజీలు టక టక మంటూ తిరుగుతున్నాయి . కొద్ది క్షణం తర్వాత టపమని ఒక పేజీ ఓపెన్ అయింది . అందులో ఉన్న అక్షరాలని ఆ పుస్తకమే పెద్దగా చదివింది.


“ రెండు రోజులకి మీరు ఎదురుకోవాల్సిన ; పరీక్ష భూమిపైన పది పవిత్రం వృక్షాలని నాటడం ” అంటూ చెప్పి యధా స్థానానికి వెళ్లిపోయింది .


“ నీ పరీక్ష విన్నావు కదా ! ఇక స్వర్గానికా? భూమికా? ఆలోచించుకొని చెప్పు ”” అంటూ రాసేది కాస్త ఆపి ,తన వైపు చూసింది.




——— ***** ———