YOUR THE ONE - 16 in Telugu Fiction Stories by Chaithanya books and stories PDF | జతగా నాతో నిన్నే - 16

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

జతగా నాతో నిన్నే - 16










గీతకు జరిగిన విషయాన్ని కాఫీ షాప్ యజమానికి కూడా చెప్పి, కొన్ని రోజులు తన కోసం సెలవులు అడిగారు. తన పని కూడా వాళ్లే చేస్తామని హామీ కూడా ఇచ్చారు .


ఆయన అదేమీ వద్దు .తనకి నేను డబ్బులు ఇస్తాను. మీ పని మీరు చేయండి చాలు! అంటూ ఒప్పుకున్నాడు .


ఎంతైనా మూడు సంవత్సరాలుగా అతడి దగ్గరే పని చేస్తున్నారు వాళ్ళు . తన కింద పని చేసే వాళ్లపైన ఆమాత్రం అభిమానం ఉండటంలో తప్పులేదు కదా!.



అప్పుడే కాఫీ షాప్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చాడు అభయ్ . అతడు వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆర్డర్ తీసుకోవడానికి వెళ్లిన అన్వి అతని చూసి , “ సార్ మీకు ఏం కావాలి ....” అంటూ ప్రశాంతమైన వదనంతో అడిగింది .


అంత బాధ పడుతూ కూడా ఎలా ఇలా? అంటూ ఆమె మొఖం వైపు చూస్తూ ఉండిపోయాడు.

“ హలో సార్, మిమ్మల్నే ” అంటూ చేతులుపి అతని ఈ లోకంలోకి తీసుకువచ్చింది అన్వి.



“ నాకు ఒక కాఫీ చాలు ” అంటూ ఆర్డర్ ఇచ్చి అక్కడ ఉన్న మెనూ కార్డుని చూడడం మొదలుపెట్టాడు .


ఆ కాఫీ కప్ తీసుకొచ్చింది. అది టేబుల్ పైన పెట్టింది. తను తిరిగి వెళ్ళిపోతుంటే “అన్వి ఒక్క నిమిషం ” అంటూ మాటలతో అడ్డుపడ్డాడు అభయ్.


“ ఏంటి ?” అంటూ ఒక్కసారిగా ముక్తసరిగా అడిగేసింది .



“ మన క్రికెట్ టీం ఫైనల్లో గెలిచింది. అందులో నాకు బహుమతిగా పదివేల రూపాయలు వచ్చాయి .నాకు తెలుసు గీతకి అలా జరిగి ఉండకూడదు. అందుకే ఒక ఫ్రెండ్లానికి సహాయం చేద్దామని వచ్చాను ” అంటూ తన చేతిలో పదివేల రూపాయలు పెట్టాడు.


“ ఏ నాకేమీ వద్దు. ఇప్పుడైనా తనకి ఆరోగ్యం బాగుంది . మేము మా సమస్యను పరిష్కరించేసాం ” అంటూ వెనక్కి ఇవ్వబోయింది అన్వి .


“ పర్వాలేదా అన్వి! నీకు నా పైన మంచి అభిప్రాయం లేదని తెలుసు. నావల్ల నువ్వు కాలేజీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నావని కూడా తెలుసు. అందుకే అన్నిటికి సారీ చెబుతూ ,నీతో నేను ఒక మంచి ఫ్రెండ్ గా ఉండాలనుకుంటున్నాను .ప్లీజ్! నా సంతృప్తి కోసమైనా తీసుకో. ఇప్పుడు మీకు డబ్బు అవసరం చాలా ఉంటుంది ” అంటూ ప్రాధేయపడుతున్నట్టుగా అన్వి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.


అన్వి మరేం మాట్లాడలేకపోయింది . “ సరే ఇప్పటివరకు జరిగిన ప్రతిదానికి నిన్ను క్షమిస్తున్నాను. ఇకపై నువ్వు కూడా మా ఫ్రెండ్స్ లో ఒకరివే ” అంటూ ఆ డబ్బులు తీసుకుంది.


అభయ్ చాలా సంతోషంగా ఆ కాఫీ కప్ పూర్తి చేసి వెళ్లిపోతూ, “ అన్వి! మీరు కాంపిటీషన్ కోసం ఒక స్కిట్ చేద్దామనుకున్నారు కదా .దాంట్లో నేను కూడా సహాయం చేయనా ? నా దగ్గర ఒక ఐడియా ఉంది ” అంటూ చెప్పాడు .



“ నిజంగానా ఏం ఐడియా ” అంటూ కాస్త ఊరటగా అడిగింది.


అదేంటంటే అంటూ చెవిలో చిన్నగా చెప్పాడు. ఈ నాటకానికి ఎక్కువ మనుషులు కూడా అవసరం లేదు. ఇక నేను ఆ పోటీలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తాను. నాకెలాకో సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ నాటకాన్ని కాస్త ప్రాక్టీస్ చేయమని నేను నీ బదులుగా వెళ్లి రాహుల్ ని అడగనా? అన్నాడు.


“ సరే ” అంటూ ఒప్పుకుంది . రాహుల్ కోసం అభయ్ కాలేజీ మొత్తం వెతికాడు. కానీ తను ఎక్కడ కనిపించలేదు. చూస్తుండగానే కాంపిటీషన్ మొదలయ్యింది .ఆరోజు ఒక గంట ముందు అక్కడ ప్రత్యక్షమైనడు రాహుల్ .


వెంటనే అతని దగ్గర చేరుకున్నాడు అభయ్. తనకి అడ్డంగా నిలబడ్డాడు .


ప్రస్తుతం తనతో గొడవ పడే ఉద్దేశం లేని రాహుల్ తనని పక్కకు తప్పించి ,వెళ్ళిపోదామని ప్రయత్నించాడు. కానీ అది అతని వల్ల కాలేదు.


“ రాహుల్ ఒక్కసారి, నేను చెప్పేది విను .ఇప్పుడు నేను అన్వికి సహాయం చేద్దామనుకున్నాను .అందుకే మేము ఒక నాటకాన్ని ఆలోచించాము. అందులో నువ్వు వేషం వేసుకుంటే చాలు ” అంటూ తనకి కూడా ఐడియా చెప్పాడు.


స్టేజ్ పైన మాట్లాడటం ఇష్టం ఉండని రాహుల్ కి అందులో మాట్లాడకుండా ఓన్లీ నిలబడే పాత్ర దొరకడంతో ,తను కూడా కొద్దిగా సంతోషంగా ఫీల్ అయ్యాడు. కాస్టింగ్ రూమ్ లోకి వెళ్ళాడు .


కాస్ట్యూమ్ రూమ్లో అప్పటికే అన్వి, సంజన, గీత ఉన్నారు. అక్కడ ఉన్న మరికొంతమంది అమ్మాయిలు అబ్బాయి ఇంకా రాహుల్ ఇద్దరు నాటకంలో ఉంటారని తెలియడంతో వెళ్లి అందరికీ చెప్పేశారు. క్షణాల్లోనే ఆ స్టేజిలు మొత్తం ఫుల్ అయిపోయాయి. చాలా వరకు బయలు నిలబడుకొని వెనకనుంచి చూస్తూ ఉన్నారు .


వెంటనే రాహుల్ ఒక రాక్షసుడి వేషం వేసుకున్నాడు .అన్వి ఒక రాజకుమారి వేషం వేసుకుంది. ఆ నాటకమే , “ బెస్ట్ ఆఫ్ బ్యూటీ ” క్షణాలలోని స్టేజ్ పైకి వచ్చారు .

అభయ్ పియానో దగ్గరికి వెళ్లిన నెమ్మదిగా తన మ్యూజిక్ ని మొదలు పెట్టాడు .దేవతల సంగీతానికే రాళ్లే కరుగుతాయి .అలాంటి మనుషుల హృదయాలు కరగవా ? అందుకే కొన్ని క్షణాలలోనే వాళ్లు ఆ నాటకంలో లీనమైపోయేలాగా చేశాడు.


అభయ్ తన అద్భుతమైన చేతివేళ్ళను కదిలిస్తూ ఆ పియానోని అందంగా వయించాడు .అప్పుడే అత్యంత అందంగా రెడీ అయిన అన్వి నిజంగా దేవకన్య లాగా స్టేజ్ పైకి వచ్చింది .తను ఆ నాటకంలో కాస్త తనకున్న డ్యాన్స్ నైపుణ్యాలను కూడా సమ్మేళనం చేసింది .


అడవిలో తప్పిపోయిన అమ్మాయి ఒక రాక్షసుడి ఇంటిని చేరింది . ఆ రాక్షసుడు శాపం కారణంగా అలా ఉన్నాడని, తనని ఎవరైతే నిజంగా ప్రేమించి ముద్దు పెట్టుకుంటే ,తనకి శాప విమోచన కలుగుతుంది. నిజమైన ప్రేమకి రెండు హృదయాలు అనే వాక్యాల ఆధారంగా చేసుకుని రాసినది ఈ నాటకం.


అప్పుడే భయంకరమైన రూపంలో ఉన్న రాహుల్ స్టేజి పైకి వచ్చాడు .అప్పుడే అభయ్ భయంకరమైన మ్యూజిక్ ప్లే చేయడం మొదలు పెట్టాడు.


నిజానికి రాహుల్ ఏలాంటి మేకప్ వేసుకోలేదు. తను మామూలు శరీరంతోనే పైకి వచ్చాడు. డ్రాకులాగా మారిన అతని శరీరం పూర్తి భయానకంగా కనిపించింది .


శరీరం అంత బూడిద పోసినట్టుగా పాలిపోయి, అతడికి శరీరాకృతి పూర్తిగా మారిపోయింది .ఒక నల్లని వస్త్రంలో చుట్టబడిన గబ్బిలములాగా ఉన్నాడు . కనిపించే అతడి తీరుకి ప్లే అవుతున్న ఆ సంగీతనికి అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోయారు .


కాస్త ఇబ్బంది పడుతున్నట్టు నియంత్రించుకోడానికి ప్రయత్నించాడు రాహుల్. ఎందుకంటే డ్రాకులాగా మారిన తర్వాత తనపై తాను నియంత్రణ కోల్పోతాడు .మనిషి రక్తం కోసం మహారాటపడుతూ ఉంటాడు. చాలా మంది ఉండే సరికి పిచ్చి పట్టిన వాడిలా అటు ఇటు కదులుతూ ప్రయత్నించాడు .


అది నాటకంలో ఒక భాగంలా అందరికీ కనిపించింది. కానీ నిజానికి అది రాహుల్ యొక్క నిజమైన స్వభావం.


అప్పుడే అన్విని చూసాడు. తన అందమైన కన్నులు .....యాక్టింగ్ చేస్తున్న తనని చూసి ఒక్క క్షణం ,తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు . తనంతాను నియంత్రించుకోగలిగాడు .


అప్పుడే దగ్గరగా వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తున్నట్టు డాన్స్ మొదలైంది .కొన్ని క్షణాల్లోనే పియానోలో ఒక ప్రేమ సంగీతం వినిపించింది.


అన్వి ఆ సంగీతాన్ని బట్టి నృత్యం చేస్తుంది కాబట్టి తను ఆ ట్రాకులో సంతోషంగా గడిపి ,మళ్లీ మ్యూజిక్ మారగానే తను చచ్చిపోయినట్టే యాక్టింగ్ చేయడం మొదలు పెట్టింది .


అదంతా మర్చిపోయి, అదేదో హాయిలో ఉన్న ఒక్కసారిగా చచ్చిపోయినట్లు కనిపించడంతో పూర్తిగా పిచ్చి పట్టింది .అన్వి దగ్గరికి ఏడుస్తున్నట్టుగానే వెళ్లి ,తన చేతిని సితిమెత్తగా తీసుకుంటూ ఏడుస్తున్నాడు రాహుల్.


తను కళ్ళు తెరిచి చనిపోయినట్టు నటన చేస్తుంది . దాంతో డ్రాకులా హృదయవిదరకంగా ఏడవటం మొదలుపెట్టాడు .మామూలుగానే దయ్యాల ఏడుపులు భయానకంగా ఉంటాయి.


అలాంటి వాళ్ళ కళ్ళముందే అలా ఏడుస్తూ ఉన్న రాహుల్ ని చూసి అందరూ ఒక క్షణం భయానికి గురయ్యారు . కానీ అదంతా నటనలో జరుగుతున్న ఒక భాగమే అవ్వడంతో అందరూ రాహుల్ని జాలిగా చూద్దాం మొదలుపెట్టారు.


కొద్దిసేపటికి బాగా ఏడ్చి ఏడ్చి ఆ మ్యూజిక్ అయిపోగానే తెరదించేశారు .స్టేడియం అంతా ఒక్కసారిగా పైకి లేచి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది .అయిన కూడా రాహుల్ ఏడుస్తూనే ఉన్నాను .



తన ఒడిలో పడుకున్న అన్వి లేచి , “ ఏమైంది రాహుల్! ఎందుకలా ఏడుస్తున్నావు ? ” అంటూ తలపై చేయి పెట్టి తన ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని, తను మళ్ళీ బ్రతికింది అనీ సంతోషంతో మాట్లాడలేక ఉండిపోయాడు.


ఇంతలో అక్కడికి వచ్చిన గీత, సంజన ,అభయ్ ముగ్గురు “ నాటకం అదిరిపోయింది. అయినా ఈ గెటప్ కాదు కదా ,ఈ నాటకానికి? ఏదేమైనా కానీ ఈ చాలా బాగుంది ” అంటూ ప్రశంసించింది సంజన.



అప్పుడు కాని అర్థం కాలేదు, తను అసలైన రూపంలో ఉన్నాడు అనీ! కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు రాహుల్ .


“ ఇంకా క్యారెక్టర్ లో లీనం వట అయిపోయినట్టు ఉన్నాడు రాహుల్.......నాకైతే అర్థం కావట్లేదు ” అంది అన్వి వెళ్తున్నా రాహుల్ వైపే చూస్తూ!



——— ***** ———