రాహుల్ ఆజ్ఞ ప్రకారమే ఆత్మ ,అన్వి గురించి ఏ చిన్న విషయమైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్ళిపోయింది .
ఆరోజు ఎలాగైనా సరే కాంపిటీషన్ లో, ఏ ....ఏ ప్రోగ్రాంలో పాటిస్పేట్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవాలని చాలా ఆతృతగా క్లాస్ వైపు నడిచిన వాళ్లకి ,మధ్యలో మన క్రికెట్ కామెంట్రీతో అంత చెడిపోయింది .
ఇక సాయంత్రం ఆ విషయం గురించే వాళ్ళు మాట్లాడుకుంటూ, ఇండియా గెలిచిన ఆనందంలో కొత్త ఉత్సాహంతో ఊర్రుతలుగుతూ వెళ్ళిపోయారు .ఈరోజు ఇండియా గెలవడం మన అదృష్టమే ! మనం కూడా మన ప్రోగ్రాంలో విజయం సాధించల్సిందే అని వాళ్ళ బ్యాగ్ ని భుజాలకేసుకొని వాళ్ల రూమ్ వైపు వెళ్లారు .
రూమ్లోకి వెళ్లి కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత “ సరే ఇక మనం వెళ్దామా ?” అంటూ అడిగింది అన్వి.
“ పదా..... పోదాం .అసలే మనకి దొరక దొరక రెండు రోజులు హాలిడేస్ ఇచ్చారు. అవి అయిపోయాయి. ఈరోజు టైంకన్నా అక్కడ ఉండాలి ” అంటూ సర్దుకుంటూ చెప్పింది సంజన.
“ అవును , లేకపోతే మన ఓనర్ చాలా కోప్పడతాడు ” అంటూ గీత కూడా తనకు కావాల్సినవి తీసుకొని బయలుదేరింది .
ముగ్గురు అలాగా బయలుదేరి ,చిన్న కాఫీ కేఫ్కి వచ్చారు. అక్కడ ఏదో ఆలోచిస్తూ పని చేసుకుంటున్న వాళ్ళ యజమానిని చూసి ,“ గుడ్ ఈవెనింగ్ సార్ ” అంటూ చిన్నగా పలకరించారు ముగ్గురు .
ఆయన చిన్నగా నవ్వుతూ , “మీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటాబ్బా ఇంత ఆలస్యమైనా ఇంకా రాలేదు అనుకుంటూ .మీకు కావాల్సిన డ్రెస్సులు అక్కడున్నాయి, వేసుకొని త్వరగా పనిలో దిగండి ” అంటూ ఆయన మళ్లీ ఏదో రాసుకోవడంలో మునిగిపోయారు .
వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి, కాఫీ షాప్ డ్రెస్ వేసుకొని షాప్లోకి వచ్చారు. గీత ఏమో కౌంటర్ దగ్గరికి వెళ్లి నిలుచుంది. అన్వి ఆర్డర్లు తీసుకుంటూ, వాటిని నోట్ చేసుకుంటూ ఉంది. సంజన ఆ ఆర్డర్ని వాళ్ళకి అందించడంలో హెల్ప్ చేస్తుంది .
ఆ షాప్ యజమాని చాలా మంచివారు. అందుకే స్టూడెంట్స్ కష్టాలను అర్థం చేసుకొని వాళ్లకి పార్ట్ టైంగా చేయడానికి జాబ్ ఇచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ షాప్ రాత్రి పూటే బాగా జరుగుతుండటంతో వాళ్లకి వర్కర్స్ కూడా అప్పుడే అవసరం అవుతారు .
నేనిచ్చే తక్కువ జీతానికి వాళ్లు పనిచేయడం నిజంగా నా అదృష్టమని ఆ యజమాని ఫీలింగ్ !
మాకు ఏదోలా జాబ్ ఇచ్చి సహాయం చేశారు అని వీళ్ళ ఫీలింగ్!
ఆరోజు కాఫీ షాప్ వీళ్ళ కారణంగా కలకల్లాడిపోయింది. రోజు వచ్చే ఆదాయం కంటే కాస్త ఎక్కువగానే వచ్చింది. రెండు రోజులు వాళ్ళకి సెలవు ఇవ్వటం కారణంగా ,అతడి షాప్ పెద్దగా లాభాలను పొందలేదు .
కానీ ఈరోజు వాళ్ళు పనిలోకి రాగానే తన ఆదాయం పెరిగింది .తను పెట్టుకున్న టాస్క్ ని రీచ్ అవ్వడంతో అతడి చాలా హ్యాపీగా వాళ్ళవైపు ఒకసారి చూశాడు. వాళ్లు రోజు కంటే చాలా ఉత్సాహంగా పనిచేయడం చూసి , “ బహూష నేను అప్పుడప్పుడు వీళ్లకు సెలవులు ఇస్తే ,వీళ్ళు రెట్టించిన ఉత్సాహంతో నా కోసం పని చేస్తారని అనుకుంటా ! " అంటూ వ్యాపారాన్ని ఎలా ఇంకా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచిస్తున్నాడు .
ఆరోజు కాఫీ షాప్లో ఆ కాఫీలు, ఇంకా కస్టమర్ల యొక్క మాటలు అలా అలా గడిచిపోయింది మన కోతి బ్యాచుకి కూడా!
ఇక రాత్రి కావడంతో కాఫీ షాప్ మూసేసే టైం అయింది . ఆ ఓనర్ వెళ్లి వాకిలికి తగిలించిన ఓపెన్ అనే నేమ్ ప్లేట్ తిప్పేసి క్లోజ్ అని పెట్టాడు.
తర్వాత వీళ్ల దగ్గరకు వచ్చి , “ మీరు ఈరోజు చాలా బాగా పనిచేశారు . మీ పని తీరని చూస్తున్నాను చాలా రోజులగా! అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను . ఇకపై మీకు వారం వారం జీతం ఇస్తాను. ఇంకా మీకు ప్రతి ఆదివారం సెలవు కూడా ఉంటుంది ” అంటూ ఆయన నవ్వుతూ చెప్పారు.
“ ఏంటి నిజంగానా........” అంటూ వాళ్ళ మూఖాలు సంతోషంతో వెలిగిపోయాయి .
“ అవును మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కూడా నా కుటుంబంతో గడపాలనిపించింది. అందుకే వాళ్లకోసం నేను ప్రతి ఆదివారం కేటాయించాలని నిర్ణయించుకున్నాను . మీరు విశ్రాంతి తీసుకుంటే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు .అందుకే మీకు కూడా ఇవ్వాలని ఇలా ఆలోచించాను ” అంటూ చిన్నగా నవ్వుతూ అభిమానంతో అన్నాడు.
“ చాలా చాలా థాంక్స్ సార్ ” అంటూ ముగ్గురు ఒకటేసారి ఆయన చుట్టూ చేరి చెప్పారు.
“ మరేం పర్వాలేదు. ఇదిగోండి, ఈ వారం మీకు ఇవ్వాల్సిన డబ్బులు ” అంటూ ముగ్గురికి కొంత డబ్బుని అందజేశాడు.
చేతిలో డబ్బు పడి ఎన్ని రోజులైందో? ఇప్పుడు వాటిని చూడగానే సంతోషంగా చేతులతో తడిమి చూసుకోవడం మొదలుపెట్టారు.
“ ఇక మీరు వెళ్ళండి .నేను కూడా షాప్ క్లోజ్ చేసేసాను ” అంటూ ఆయన చెప్పి, అన్ని సరి చూసుకోవడానికి మరోసారి వెళ్ళాడు .
“ సార్ చాలా మంచివాళ్ళు కదా! మనం వచ్చిన నెల రోజులకి మనకి ఎన్ని ఆఫర్స్ వచ్చాయి ” అంటూ కాఫీ షాప్ డ్రెస్ ని తీసేసి ఎక్కడుందో అక్కడే పెట్టేశారు .
ఇక వాళ్లంతా బయటికి రాగానే వాళ్ల చేతుల్లో ఉన్న డబ్బుని లాగేసుకుంది అన్వి.
“ మీరు డబ్బులు వృథాగా ఖర్చు చేస్తారు .ముందు దీంతో మనకి నెక్స్ట్ మంత్ కి రెంట్ కట్టేద్దాం .మళ్లీ వారం వచ్చిన డబ్బులతో మనకు కావలసినవి కొనుక్కోవచ్చు ” అంటూ లెక్కలేసుకుంది.
“ పెద్ద శాడిస్ట్ గా తయారు అయ్యావు నువ్వు ” అంటూ బుంగమూతి పెట్టుకుంది సంజన ,ఆ డబ్బు వైపు చూస్తూ .
అదంతా లెక్క వేసిన తర్వాత పోయిన నెల జీతంతో పాటు ,ఈ వారానికి కావలసిన డబ్బులు కూడా ఇచ్చేసాడని గ్రహించిన అన్వి , “ అన్ని సరిపోగా, మనకి ఇంకాస్త డబ్బులు మిగిలాయి. పదండి మనం ఏదైనా చిన్న రోడ్డు సైడ్ బండి దగ్గర ఏదైనా తిందాం ” అంటూ చెప్పింది వాళ్ళ బాధను చూడలేక !.
“ నిజంగానా........” అంటూ నోరు పెద్దవి చేసి సంతోషంగా అడిగారు.
“ త్వరగా పోదాం పద. మళ్లీ మూడ్ మారిపోతే ఆ డబ్బులు కూడా ఏదో ఒక దానికి కావాలంటూ తీసేసుకుంటుంది ” అనీ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది గీత .
వాళ్ళలా నవ్వుకుంటూ ఆ డబ్బుల్ని జాగ్రత్తగా దాచుకొని ఆ రోడ్ సైడ్ బండి దగ్గర కూర్చుని తిన్నారు.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా! మనిషి ఎంత ధనవంతుడైన సరే ,తనని ఆప్యాయంగా పలకరించి, తనతో నిజాయితీగా నడుచుకునే ఒక నలుగురు వ్యక్తులు లేకపోతే ,అతడి జీవితం నరకంలోనే ఉంటుంది .
నాకు నిజమైన స్నేహితుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ అక్కడే తింటూ ఆలోచిస్తుంది అన్వి.
రూమ్ కి చేరాక క్యాలెండర్లో తెగ చూస్తున్న సంజనాన్ని గమనించిన అన్వి ,“ ఏంటే, క్యాలెండర్ని తినేసేలా చూస్తున్నావ్ ? ఇప్పుడే కదా బయట తినేసి వచ్చావు ” అంటూ ఆట పట్టించింది.
“ అబ్బా కాదే ! మనకి రేపు సెలవు .రేపు ఆదివారం. ఆ విషయమే మర్చిపోయాం మనం ” అంటూ దానివైపే చూస్తూ ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటుంది .
“ అవును కదా .అయితే మనం ప్రోగ్రాం గురించి రేపు ఆలోచిద్దాం .ముందు అయితే కంటి నిండా నిద్ర కోసం ప్రశాంతంగా నిద్రపోతాం ” అంటూ ఒక డ్రమెటిక్ లా చెప్తూ ,వెళ్లి బెడ్ పై వాలిపోయింది.
********
సెయింట్ చర్చిలో అప్పటికే చేరుకున్న అభయ్ ముసిముసిగా నవ్వుకుంటూ కనిపించాడు.
పోప్ ఆశ్చర్యంగా చూస్తూ , “ ఏంటి అంత సంతోషంగా ఉన్నావు ” అంటూ అడగకుండా ఉండలేకపోయాడు.
“ ఏమీ లేదు .నేను నాకిచ్చిన పరీక్షని ఎలా మొదలు పెట్టాలో ఆలోచించాను . దానికోసం నేను క్రికెట్ అనే ఒక ఆటను నేర్చుకోవాల్సి ఉంటుంది .అది కూడా రెండు రోజుల్లో ” అంటూ విషయాన్ని చెప్పూతూ.
“ ఓ ....నీకు ఇష్టమైన అమ్మాయికి, ఆ ఆట అంటే ఇష్టం అనుకుంటా ! అందుకే నువ్వు ఇలా చెప్తున్నావు అంతేనా ?” అంటూ పోప్ ఓరకంట చూస్తూ
“ ఆ విషయం మీకు ఎలా తెలుసు. మీరు ఏమైనా నా మనసుని చదివే విద్యను నేర్చుకున్నారా ?” అంటూ రెండు కళ్ళు పెద్దవి చేశాడు అభయ్.
“ అది పెద్ద విషయమే కాదు .ముందైతే నువ్వు ప్రాక్టీస్ చేయ్యాలి పదా ” అంటూ ఒక రూమ్ లో మాయాజాలం ఉపయోగించి విజువల్ వండర్ లాంటి ఒక క్రికెట్ ని సృష్టించాడు.
ఇక ఆయన కూడా నేను నీకు సహాయం చేస్తాను అంటూ బాల్ ని తీసుకొని బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు.
స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన అభిమానం ఈ రెండు నా చివరి మిషన్ కి సహాయం చేస్తున్నాయన్నమాట అని మనసులోని చిన్నగా నవ్వుకున్నాడు అభయ్.
*******
తన హాస్టల్ రూమ్ కి చేరుకున్న రాహుల్ ,అన్వి కోసం ఎంత కష్టాన్ని అయినా సరే భరించాలి అంటూ మాయ శక్తితో విల్లులు ఇంకా ఒక లక్ష్యాన్ని నిర్ణితమైన దూరంలో పెట్టుకొని గురి చూసి కొట్టడం నేర్చుకుంటున్నాడు. దానికి ఎటువంటి మాయ శక్తిని ఉపయోగించాలి అనుకోలేదు.
తన స్వయశక్తులతోనే సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు . అందుకే ఆ ఆటలో ప్రావీణ్యం కోసం చాలా శ్రమించడం మొదలుపెట్టాడు.
చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఇబ్బంది పెట్టడానికి ,ఆటపై దృష్టి మరింత పెరిగింది. చూస్తుండగానే నెమ్మది నెమ్మదిగా ఆ ఆటలో మెరుగుపరుతూ వచ్చాడు .
మనకి ఇష్టమైన అమ్మాయి కోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే భరిస్తాం మరి!
——— ***** ———