YOUR THE ONE - 01 in Telugu Fiction Stories by Chaithanya books and stories PDF | జతగా నాతో నిన్నే - 01

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

జతగా నాతో నిన్నే - 01













ఆకాశంలో తేలి ఆడుతున్న ఒక ఆకు ,దానికి గమ్యం ఏంటో తెలియక గాలి చూపిన మార్గంలో వెళుతూ ఉంది .

ఆకాశం అంచులోకి ఆకు చేరినప్పుడు భూమి పైన ఉన్న మనుషులంతా చిన్న అల్పజీవులైన చీమలలాగా కనిపించారు .ఆ పచ్చని ఆకు పైన సాయంత్రపు సూర్యకిరణాలు స్పృశించగానే ఆకులోని పత్ర రంధ్రాలు ,దాని ఈకలు స్పష్టంగా ఒక పాదదర్శకం తేరలా కనిపించింది.

ఆకాశంలో ఉన్న మేఘాలు జతలు-జతలుగా వాటి ఇళ్ళను సమీపిస్తున్నాయి .సూర్యుడు గొర్రెల కాపరిలా వాటన్నిటికీ కాపలాదారుడులా నిలబడుకుని, తన ప్రభావాన్ని వాటి పైన చూపుతున్నాడు. అందుకే లేత నారింజ రంగులో మేఘలన్నీ ముస్తాబయ్యాయి .

ఆహారం కోసం పొద్దున అనగా బయలుదేరిన పక్షులు, తమ బృందాన్ని యుద్ధానికి సిద్ధమైన జెట్ లాగా మార్చి ,ఎగురుతూ వెళుతున్నాయి. ఆ పక్షుల అరుపులు ,ఆ ప్రశాంతమైన సాయంత్రంలో ఒక చక్కటి సంగీతాన్ని చెవులకు అందించాయి.

అనుకోకుండా ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది .ప్రమాదానికి ముందు వచ్చే సూచనల పరుగులు తీస్తూ కనిపిస్తుంది .గాలి ప్రభావానికి గురైన ఆకు, సూర్యుడి వెలుతురిని తన మీద పడనీయకుండా పారిపోతున్నట్టుగా ,వేగంగా జనసంచారం ఉన్న ఒక వీధిలోకి వచ్చింది .

ఈ ప్రపంచంతో నాకేమీ సంబంధం లేదు అన్నట్టు నడుచుకుంటూ వెళుతున్న ఒక ఇరవై ఏళ్ల, లేత బంగారు వర్ణపు శరీరం కలిగిన అమ్మాయి ముఖాన్ని తాకింది. కోమలమైన తన చేతి వేళ్ళతో తన ముఖానికి అడ్డుగా ఉన్న ఆకుని చిన్నగా చేతిలోకి తీసుకుంది.

ఆ అమ్మాయి గోర్లకి ఉన్న రెడ్ రోజ్ నెయిల్ పాలిష్ చూడముచ్చటగా గులాబి వనాన్ని కురిపిస్తున్నట్టు అనిపించింది .ఆ పత్రాన్ని నెమలి కళ్ళ లాంటి నయనలతో చూస్తూ, తన పద్మం వంటి మోము వికసించింది . ఆ చిన్న అందమైన అరవిందంలో ముచ్చట గోలిపే ఒక చిరునవ్వు కనిపించింది .

“ ఏంటి నువ్వు కూడా ఇక్కడ తప్పిపోయావా ? సరే ఈ గాలికి నువ్వేం భయపడకు. నిన్ను సురక్షితంగా నేను ఇంటికి తీసుకు వెళ్తాను ” అంటూ ఆ ఆకుతో మాట్లాడి, దాన్ని తన కోటు జోబులో పెట్టుకుంది .

తను వెంటాడుతున్న ఆకుని తీసుకుంది అనే కోపంతోనేమో, బహుశ! ఆ గాలి వేగంగా అమ్మాయిని తాకింది. తన తల పైన ఉన్న ఆ మంకీ క్యాప్ గాలికి వెనక్కి పడింది .అప్పటిదాకా ఊపిరాడక నలిగిపోతున్న తన కురులన్నీ ,గాలి తాకిడికి జల ప్రవాహంలగా కదిలాయి.

తన చెవులకి ఉన్న ఆ జుంగిలు సూర్యకాంతి కారణంగా బంగారు రంగులో మెరుస్తూ ఉయ్యాలలూగాయి .విల్లు లాంటి తన కనుబొమ్మలు ప్రశాంతంగా ఉంచుతూ, మళ్లీ అమ్మాయి తలపైకి క్యాప్ ని వేసుకుంది .తన కోటుకున్న జోబులో చేతులు పెట్టుకొని చుట్టూ ఏమి గమనించకుండా ముందుకు నడవడం మొదలుపెట్టింది.

దారి పొడుగునా రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రుచిని గొలిపే సువసనలతో ఉన్నాయి. తన కడుపులో పేగులు ఆకలి —ఆకలి అంటూ ఎంత గొడవ చేసినా సరే, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అని వాటికి నచ్చ చెబుతూ , ఇంటికి ప్రయాణం అయ్యింది . కొన్ని క్షణాలలోనే రద్దీగా ఉండే మనుషుల సంచారం నుంచి ఒక మెట్రో స్టేషన్ చేరుకుంది .

బెంగళూరు మెట్రో స్టేషన్,
రాత్రి ఏడు గంటల నాలభై నిమిషాలు.

దాదాపు దేదిప్యామానంగా వెలిగిపోతున్న ఆ స్టేషన్లో “ బెంగుళూరు మెట్రో స్టేషన్ .....ప్రయాణికులకు స్వాగతం ” అంటూ అనౌన్స్మెంట్లు వినిపిస్తూ ఉంటాయి. రైలు శబ్దాలకి చాలా దూరంగా ప్రయాణమైంది ఆ అమ్మాయి.

మెట్రో స్టేషన్ నుంచి తన ఊరికి మధ్య పది కిలోమీటర్ల దూరం ఉంది. దాంతో ఆలోచిస్తూనే బస్సు కోసం ఎదురు చూసింది .

అప్పటికే బస్టాప్ లో దాదాపు జనాలందరూ వెళ్లిపోయారు. ఒక నాలుగు, ఐదు మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారి నుంచి ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్తున్నట్టుగా, ఆ బస్సు ఎక్కి తన ఇంటికి వెళ్లే దారిలోని బస్టాప్ దగ్గర దిగింది.

దారిపొడుగు చీకటి. అక్కడక్కడ బిల్డింగ్స్ వాటి మధ్యలో డ్రైనేజ్ కోసం ఉంచిన చిన్న చిన్న వీధులు చీకటితో దారుణంగా కనిపిస్తున్నాయి.

ఆ గ్రామం చివరన వాళ్ళ ఇల్లు ఉంది .రాత్రి ఎనిమిది దాటిన తర్వాత కచ్చితంగా అక్కడ ఒక్క మనిషి కూడా రోడ్డుపైన ఉండడు .అలసిపోయి ఆకలితో ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్లు అన్ని ఫుల్ అయిపోయి ఉంటాయి .

విపరీతమైన ఆకలి కారణంగా తన ఎదురుగా ఉన్న రెస్టారెంట్ వైపు చూస్తూ తన బుజ్జి కడుపు పైన చెయ్యి పెట్టుకుంది ఆ అమ్మాయి.

తన ఎదురుగా ఉన్న కోకో కోలా క్యాన్ ని కాలితో తన్నుతూ, మాసిపోయిన షూస్ తో రోడ్డుపైన ఆడుకుంటూ ముందుకు వెళుతుంది. తను ఆడుకోవడం పైనే దృష్టి పెట్టి ఉంది .

అందుకే తన వెనక ఏం జరుగుతుందో సరిగ్గా గ్రహించలేకపోయింది .వెనక ఉన్న ఒక ఓల్డ్ మోడల్ కార్ ఎరుపు రంగులో, మృత్యువుల తన వైపు దూసుకొస్తుంది .అమ్మాయి రోడ్డుకి ఒక సైడు నడుస్తూ ఆడుకుంటూ వెళ్లడం వల్ల ఆ కార్ తనని ఢీకోట్టడానికి వస్తుందని అనుకోలేదు .

అందువల్ల ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉంది . ఆ కార్ మాత్రం ఏదో పగ పట్టిన దానిలాగా చాలా వేగంగా ,మృత్యు కోరలు తెరుస్తూ సరిగ్గా అమ్మాయిని ఢీకొట్టడానికి వచ్చేసింది.

చుట్టూ రెస్టారెంట్ అద్దాల నుంచి యాక్సిడెంట్ ని చూడడానికి ప్రజలందరూ తమ రెండు కళ్ళు పెద్దవి చేసుకున్నారు. వాళ్ళ అరుపులు కూడా ఆమెకి చేరిన ఉపయోగం ఉండనంత దగ్గరగా కారు వచ్చేసింది .

ఒక్క క్షణంలో.....

అదేదో అద్భుతం జరిగినట్టుగా ఆ కార్ ఆ అమ్మాయి ముందున్న చెట్టుని ఢీకోట్టేసింది. అప్పుడు కానీ తనకి అర్థం కాలేదు. “ లబ్ ....డాబ్...లబ్ ....డాబ్ ” అంటూ తన గుండె చప్పుడు ఆ చీకటిలో ప్రతిధ్వనిస్తుంది .నాకేం కాకుండా ఎలా బయటపడగలిగానా! అని ఆలోచించడం మొదలుపెట్టగానే తను ఎవరి చేతిలోనే ఉన్నట్టుగా అనిపించింది .

అసలు ఏం జరిగింది అని నెమ్మదిగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.

సరిగ్గా ఆ కార్ ఆ అమ్మాయిని ఐదు సెకండ్లలో ఢీకొడుతుంది అనగా ,రోడ్డుకు అవతల వైపు ఉన్న ఒక వ్యక్తి బ్లాక్ మంకీ క్యాప్ వేసుకోని నడుచుకుంటూ వెళ్తున్నాడు .

మన హీరోయిన్ ప్రొఫెషనల్ గోల్ కీపర్ లాగా కొట్టడానికి కాలు పైకెత్తింది .

ఊహించినటువంటి వేగంతో కారు వస్తుంది. దాన్ని గమనించి అతడు అవతల నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ తనను సమీపించి పక్కనే ఉన్న ఫుడ్ పాత్ పైకి తీసుకొని వెళ్లాడు.

మోకాళ్ల పైన తానను తాను తామయించుకోని కూర్చోనీ, బ్యాలెన్స్ చేస్తూ అమ్మాయిని పట్టుకున్నాడు .

అదంతా చూసిన ఆ రెస్టారెంట్ వాళ్లంతా బయటకు వచ్చి ఆ కార్ అతనికి నాలుగు తగిలించారు. ఆ అమ్మాయిని ఇకపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు.

కానీ ఆ అమ్మాయి దృష్టి అంతా అబ్బాయి ముఖంపైనే పడింది. ఒక్క క్షణంలో అందమైన ముఖాన్ని చూసి హీరోయిన్ కన్నులు తనను ఫోటో తీసేశాయి. చూట్టు ఏమి వినిపించడం లేదు. కేవలం ఆ అబ్బాయి వైపు చూస్తూ నిలబడిపోయింది. అబ్బాయి అదేదో చిన్న విషయంగా....పెద్దగా పట్టించుకోకుండా తన మంకీ క్యాప్ మళ్ళీ వేసుకొని నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

తను అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీకటిగా ఉన్న ఒక ప్రాంతంలోకి వెళ్లి మాయమైపోయాడు .

ఇప్పుడే అటూగా సిగరెట్ వెలిగిస్తూ వచ్చిన ఒక వ్యక్తి ,ఆ చీకటిలో ఏదో మెరుస్తున్నట్టుగా అనిపించింది .దగ్గరగా వెళ్లి చూద్దామని వెళుతూ ఉంటే రెండు మెరుపులు కనిపించాయి .అవి ఒక వ్యక్తి కళ్ళలాగా అనిపించాయి.

భయంతో వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లిపోదాం అని అరవడానికి నోరు తెరవగానే ,తన చప్పుడు ఆగిపోయింది.

అతడి శరీరం నుండి రక్తం పారి ఆ నేలపై పడింది.
తన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. తన శరీరాన్ని ఆ చీకటిలోకి ఆ రెండు కన్నులు లాక్కొని వెళ్ళిపోయాయి.

——— ***** ———