The shadow is true - 24 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 24

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

నీడ నిజం - 24

ఎదురుగ ఉన్న

అపరిచిత వ్యక్తుల్ని ప్రశ్నార్థకం గా చూశాడు భరత్ రామ్ .

“ జస్వంత్, జర్నలిస్ట్, ...హి ఈజ్ రాహుల్.”

మర్యాద పూర్వకం గా చేయి కలిపాడు .

భరత్ రామ్ కళ్ళలో మెరిసిన ఆశ్చర్యం;

జస్వంత్ , రాహుల్ కూర్చున్నారు .

“జస్వంత్ ! చెప్పండి. “

జస్వంత్ విద్యాధరి డైరీ టేబుల్ పై ఉంచాడు .

“ఈ డైరీ.....?

“ విద్యాధరి గారిది . మీరు దిగిన లాడ్జ్ రూము లో వార్డ్ రోబ్ పై అరలో కనిపించింది .”

ఈ ఆయుధం తో నే ఇంత సంచలనం సృష్టించారు కదూ .?”

జస్వంత్ జవాబు.....చిరునవ్వు

“ ఈ డైరీ చదవాలని మీకు ఎందుకు అనిపించింది . ...It reflects the mind of a lady….her sensitive feelings and thoughts.

..ఒకరి డైరీ చదవటం సంస్కారం కాదు . ..కానీ ముత్యాల సరాల్లాంటి అక్షరాలూ , భాష నన్ను చదివించాయి . రెండు పేజీలు చదవగానే విద్యాధరి మానసిక స్థితి అర్థమై పోయింది . తర్వాత ఆగలేక పోయాను .పూర్తిగా చదివాను . నాలో జర్నలిస్ట్ , మనిషి---ఇద్దరూ సమాన స్థాయి లో కదిలి పోయారు . ఆ క్షణమే నిశ్చయించుకున్నాను .---కోమలాదేవికి సామాజిక న్యాయం జరగాలి. అప్పుడే విద్యాధరి తన సమస్య నుండి బయట పడుతుంది . నా ఊహకు అందినంత వరకు

కోమల ..సమస్య----విద్యాధరి సమాధానం. డైరీ చదివితే మీకు క్లారిటీ వస్తుంది .”

“అంత అవసరం లేదు. నాలుగు రోజుల క్రితం విద్యాధరి ఫోను చేసింది . తన మానసికస్థితి గురించి వివరం గా చెప్పింది . మీరు చెప్పింది నిజం . కోమల సమస్య ; విద్యా సమాధానం. కోమల శాంతిస్తేనే విద్యా తన సమస్య నుండి బయట పడుతుంది .”

“ఈ క్లారిటీ కోసమే మిమ్మల్ని కలిసింది “

“రాహుల్ ! జస్వంత్ జీ ని ఎందుకు కలవాలనిపించింది .?”

“తన ఆర్టికల్ చదివిన తర్వాత జస్వంత్ జీ investigative journalist అని అర్థమైంది .’కొసమెరుపు తో ఆయన లక్ష్యమేమిటో తెలిసింది . మా ఇద్దరి లక్ష్యం ఒకటే . అందుకే కలిశాను .

you have met the right person. …జన్మ మారినా మీ అమ్మ నిన్ను మరిచి పోలేదు . ఆమె పునర్జన్మ నీకు వరం. ఆమెలో అమ్మను కదిలించు . ఆపై జరగవలసింది ఎవరూ ఆపలేరు ....మీ చిన్నాన్న కూడా . “

“డాక్టర్ ! మీరు త్వరలో నే విద్యాధరిని కలవబోతున్నారు కదా ?”

“ కలుస్తాను. ఆ తర్వాతే మీ plan of action ready చేసుకోండి. నిజం చెప్పాలంటే ఈ పరిస్థితి విద్యా కు ఓ ఛాలెంజ్ . అజయ్ లాంటి రాక్షసుడిని చట్టమనే చట్రం లో ఎలా బిగించాలి ? Really a uphill task . నేనొక డాక్టర్ ని . వృత్తి రీత్యా నాది మృదు స్వభావం. రాహుల్ లెక్చరర్ . మా ఇద్దరి లో దాదాపు స్వభావం ఒకటే . అజయ్ లాంటి అహంభావిని, మొండివాడిని ఎలా మన దారికి తీసుకు రావాలి . విద్యా నాకు ఫోన్ చేసిన క్షణం నుంచీ తీవ్రం గా ఆలోచిస్తున్నాను. మీ రంగ ప్రవేశం నాకు కొండంత రిలీఫ్ . ! నేను నాస్తిక వాదిని కాను. కానీ---విధి, కాల ప్రభావం లాంటివి నమ్మను . ఇప్పుడు ఈ సంధర్భం లో నమ్మి తీరాలి . ..తప్పదు . మీ లాంటి INVESTIGATIVE JOURNALIST కు డైరీ దొరకటం విధి అనవచ్చా ? ఇలా జరగాలి అన్న సూత్రం పైనే ఈ అద్భుతం జరిగింది. U are the right person to tackle vidyaa’s issue. Chain of these incidents చూస్తుంటే కోమల పునర్జన్మకు బలమైన కారణముంది అనిపిస్తుంది . ఇది అనివార్య ఘటన .” భరత్ రామ్ విశ్లేషణ .

“ సర్! మీకు అభ్యంతరం లేకుంటే రెండు , మూడు రోజుల తర్వాత విద్యాధరిని కలవాలనుకుంటున్నాను . కొంత గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకోవాలి. ”

“ తప్పకుండా ! మీ ప్రయత్నం లో మీరుండండి . మీరు ముఖ్యం గా విద్యా భర్త సాగర్ ను కలవాలి . అతడో సగటు మనిషి . అంత తేలిగ్గా మీ ప్రపోజల్ ను ఒప్పుకోడు . చాల భయస్తుడు. విద్యా పై ఈగ వా లనివ్వడు . మీ ప్రయత్నం లో రాహుల్ మీకు కాటలిస్ట్ . మీ ఇద్దరు చేయి కలిపితే సాధించటం సులభం. “

తన ప్రయత్నానికి ఒక చక్కటి మార్గం ఇంత త్వరగా ఏర్పడినందుకు జస్వంత్ తృప్తిగా నిట్టూర్చాడు .

“ ముందు సాగర్ కు ఓ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇదిగో నెంబర్ . హైదరాబాద్ కు ఫోన్ చేయి “

“ నేనా ! “ రాహుల్ కంగారు .

“నువ్వే ! జరగబోయే నాటకానికి సూత్రధారి , ప్రధాన సూత్రధారి . _ రెండూ నువ్వే . నేను , భరత్ రామ్ తెర వెనుక వ్యక్తులం ... కమాన్ ! కాల్ చేయి .”

తప్పదన్నట్లు కాల్ చేశాడు రాహుల్ .

“ హలో ! సాగర్ స్పీకింగ్>” గొంతు లో సౌమ్యత .

“సర్ !-----గుడ్ ఈవెనింగ్ .! రాహుల్ స్పీకింగ్ “ అవతల క్షణం నిశ్శబ్దం .

“ ఎందుకు ఫోన్ చేశారు ? ఈ నెంబర్ ఎలా తెలిసింది ?” ఈసారి గొంతులో అసహనం.

“ మీతో మాట్లాడాలి సాగర్ గారు .”

“ నాతో ఏం మాట్లాడుతారు ? మీతో మాట్లాడే అవసరం నాకు లేదు . “ విసురుగా రిసీవర్ పెట్టిన చప్పుడు . రాహుల్ జస్వంత్ ను నిస్సహాయం గా చూశాడు .

“ ఇలాంటి ఎదురు దెబ్బలు తప్పవు . మళ్ళీ ట్రై చేయి .

రాహుల్ గొంతు వినిపించగానే సాగర్ రిసీవర్ పెట్ట బోయాడు .

“సాగర్ గారు ! క్షణం ఆగండి ! ....... విద్యాధర గారి సమస్య ఏంటో మీకు తెలుసు .”

“ మీకెలా తెలుసు.”?

“ సతి పై ఆర్టికల్ రాసిన జస్వంత్ గారిని నేను కలిశాను . ఆయన కు మీరు దిగిన

లాడ్జ్ లో విద్యాధర గారి డైరీ దొ రికింది . “.......ఒకరి డైరీ చదవటం సభ్యత కాక పోయినా ఆయన చదివారు . కోమలా దేవి పునర్జన్మ వివరాలు తెలుసుకొని

ఆర్టికల్ రాశారు . మమ్మలిని రచ్చ కీడ్చారు . ఇప్పుడు ఫోన్ చేసి ఆమె సమస్య పై

సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు . మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటానికి ఆయన ఎవరు ? ముందాయనకు ఫోన్ ఇవ్వండి .”

“ హలో! సాగర్ గారు ! కోపం తెచ్చుకోవద్దు . మీ శ్రీమతి గారి డైరీ చదవటం సభ్యత కాదని నాకూ తెలుసు . కానీ—డైరీ చదవటం వల్లే నాకు సమస్య అర్థమైంది . సతి పై ఆర్టికల్ రాసింది మిమ్మలిని ఇబ్బంది పెట్టాలని కాదు . నా లక్ష్యం అజయ్ సింహ్ . అంతే కాని-----విధ్యాధరి కాదు . ఇప్పుడు మీకు ఫోన్ చేసింది మీకో ముఖ్యమైన విషయం చెప్పాలని ; విద్యాధరి సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు . మీరు మరోసారి భరత్ రామ్ ను కలవాలి .విద్యాధరి గారికి కౌన్సిలింగ్ అవసరం. ప్లీజ్ ! నన్ను అర్థం చేసుకోండి .! డైరీ మీ అడ్రెస్ కు పంపాను . Once again Iam extremely sorry !”

“ఇట్సాల్ రైట్ “ విసురుగా రిసీవర్ పెట్టిన చప్పుడు .

“ఏమన్నాడు”?

“ఏమంటాడు ? చేసిన అధిక ప్రసంగం చాలు ---నోరు మూసుకోండి . అన్నాడు .”

జస్వంత్ నవ్వాడు . రాహుల్ శృతి కలిపాడు .

“ మరి ----- ఈ సీమ టపాకాయ ను tackle చేయటం ఎలా ? మీ మాట వింటేనే భగ్గుమంటు న్నాడు .”

“ అతడికి విద్యాధరి సమస్య పై క్లియర్ అయిడియా లేదు . అందువల్లే అతడికి మన అవసరం తెలీదు . భరత్ రామ్ చెబితేనే వింటాడు . అప్పుడు తనే మనల్ని పిలుస్తాడు .ఎనీవే ! ఆ సీమ టపాకాయను మరోసారి కదిలించాలి . రేపే మన హైదరాబాద్ ప్రయాణం. మరో జన్మ ఎత్తిన మీ అమ్మను నువ్వు చూసేది రేపే

రాహుల్ కళ్ళు కుతూహలం తో , ఆనందం తో మెరిశాయి .