The shadow is true - 17 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | నీడ నిజం - 17

Featured Books
Categories
Share

నీడ నిజం - 17

విద్యాదరి సుదీర్ఘ కధనం ముగిసింది. చివరి సంఘటన లో ప్రభావం ఆమె ముఖం పై స్పష్టం గా కనబడుతోంది . బంగారు ఛాయలో మెరిసే ఆమె ముఖం లో అరుణ వర్ణం .

విద్యాధరి తీవ్రమైన మానసిక సంఘర్షణ కు , ఉద్రేకానికి లోనవుతున్నట్లు ప్రొఫెసర్ భరత్ రామ్ గమనించాడు .

“ కూల్ డౌన్ “ ఆమె వెన్ను తట్టి అనునయించాడు . తండ్రి లాంటి భరత్ రామ్ అరచేతిని విద్యాధరి ఆర్తిగా చెంపకు ఆనించుకుని కళ్ళు మూసుకుంది . ఆమె కళ్ళు స్రవిస్తున్నాయి . భరత్ రామ్ కు ఆ క్షణాలు ఎంతో పవిత్రం గా అనిపించాయి . గతం లోంచి వర్తమానం లోకి ఆమె పూర్తిగా రాలేక పోతోంది . ఇంకా ఏవో జ్ఞాపకాల శకలాలు మనసు పొరల్లో ఉండిపోయి ఆమెను కదిలిస్తున్నాయి . ఇంకా ఏదో చెప్పాలన్న తహ తహ ఆమె కళ్ళల్లో స్పష్టం గా కనిపిస్తోంది .

“ ఆ సాధువు ప్రయోగించింది మంత్రమో కాదో నాకు తెలియదు . అతడి ప్రభావం వల్లే నేను సహగమనం చేశాను . పైగా నా మానసిక పరిస్థతి కూడా అందుకు అనుకూలంగా ఉంది . సాధువు మంత్రం కన్నా మంచి మాటలతో నన్ను చావుకు సిద్ధం చేశాడు. సహజమైన మాతృప్రేమ “అమ్మా” అన్న రాహుల్ పిలుపుతో వరద గోదారిలా పొంగుకొచ్చింది . ఆ ప్రేమ, సాధువు మంత్ర ప్రభావాన్ని , నా నిర్ణయాన్ని కూడా లెక్క చేయలేదు . నన్ను ‘స్పృహ లోకి తీసుకువచ్చింది ఆ పవిత్ర భావనే .

అందుకే అంతగా కదిలి పోయాను . రాహుల్ కు అన్యాయం చేశానన్న భావన నన్ను చితి మంటల్లో కూడా నిలువునా దహించి వేసింది . నా శరీరం ఆ మంటల్లో కాలి బూడిదై పోయింది . కానీ, నా మనసులో నుండి అ భావన తొలగిపోలేదు .

ఆ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఈ జన్మ లో కూడా ఇంతగా నన్ను కదిలించిందంటే అమ్మ అనురాగం ఎంత గొప్పదో చూశారా ? రెండు జన్మల నడుమ తీగెలా అల్లుకొని నాలో ఇంత అలజడి రేపిందంటే అద్భుతం లా అనిపించటం లేదూ ? నిన్నటి వరకు’ జన్మ జన్మ ల బంధం” అన్న ఆలోచన కవుల కల్పన అనుకునేదాన్ని . కానీ—ఈ క్షణం లో ఆ భావం ఎంత గొప్పదో అనుభవం తో తెలుసుకున్నాను . ఈ అనుభవం ఈ జన్మ లో మరిచి పోలేను . .....రాహుల్........... ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ? ......నాకు తెలిసి నేను అతడి మనసు లో ఇప్పటికీ ( పచ్చ ) పచ్చ గా ఉండే అవకాశం ఉంది . అప్పటి ఆ పసివాడు నన్ను ఎంతగా ప్రేమించాడో ఇప్పటికీ మరిచి పోలేను . ......’ నేను అంటే ‘నేను కాదు ....’ కోమలా దేవి ‘.!

She is true to her confession !

ఆమె చివరి నాలుగు వాక్యాలు భరత్ రామ్ ను ఆశ్చర్య పరచాయి. ... ఆలోచింప చేశాయి .

విద్యాదరి మనసు తేలిక పడింది . ఆమెలో ఇప్పుడు సంఘర్షణ లేదు . ప్రశాంతం గా, నిర్మలం గా ఉంది . పుటం పెట్టిన బంగారం లా ఆమె రూపం , వ్యక్తిత్వం మెరిసి పోతున్నాయి . ఆమె అపురూపం గా అనిపించసాగింది .

సమస్య ఇంతటి తో ముగిసినట్లు నమ్మకం ఏమిటి ? విద్యాదరి రాక ఊరి లో కలకలం రేపింది . ఆమె ఉనికి , వివరాలు తెలియకూడ ని వారికి తెలిస్తే ....ఆమె ప్రబల విరోధి అజయ్ సింహ ఈ విషయం తేలిగ్గా తీసుకుంటాడా ? చితి మంటల్లో కాలిపోయిన ‘ రహస్యం నేడు ఇలా విద్యాదరి రూపం లో వెలుగు చూడటం ఆమెకు ప్రమాదం కాదా ? ఈ సందేహం విద్యాదరి భర్త సాగర్ కు కలిగింది . అతడి సందేహం అందరికీ సబబు గా అనిపించింది .అందుకే అందరూ ఏకగ్రీవం గా ఒకే నిర్ణయానికి వచ్చారు . వీలైనంత త్వర లో రాజస్తాన్ వదిలి వెళ్లి పోవాలి . కనీసం చిన్న ఆనవాలు కూడా మిగల్చకూడదు . అజయ్ సింహ ఈ విషయం లో ఏ కూపీ లాగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .

నిర్ణయం తీసుకున్న మరు క్షణం లోనే అందుకు సంబంధించిన అన్ని ప్రయత్నాలు చకచకా జరిగి పోయాయి . ముందు, లాడ్జ్ రిజిస్టర్ లో సాగర్ వివరాలు లేకుండా చేయాలి . రిసెప్షన్ లో పని చేసే క్లర్క్ లు ముగ్గుర్ని డబ్బు తో కొన్నారు . వారు అతి లాఘవం గా సాగర్ వివరాలు ఎంటర్ చేసిన కాలం లో భరత్ రామ్ పేరు, ఢిల్లీ అడ్రస్ ఎంటర్ చేశారు . అందుకు ఎంతో ఓపిక, శ్రమ అవసరం . ఆ ముగ్గురి కష్టానికి వారు ఊహించిన దానికన్నా ఎక్కువే ముట్టింది .

టాక్సీ డ్రైవర్ కూడా వీళ్ళ డబ్బుకు దాసోహం అన్నాడు . అతడి నోరు పెద్ద మొత్తం తో మూయించారు .

ఇలా చర్చల్లో , జాగ్రత్తలు తీసుకునే హడావుడిలో అందరూ తలమునకలు గా ఉంటే విద్యాదరి మాత్రం హోటల్ రూమ్ సిటౌట్ లో కూర్చొని , ఆలోచనల తో , పరిసరాల అవలోకనతో ప్రశాంతం గా. ఉండి పోయింది . ఆమె నిర్లిప్తత, పరధ్యానం సాగర్ కు కొంచెం చిరాకు కలిగించాయి . ఉండబట్ట లేక , తన సహజ ధోరణి లో అ చికాకు ప్రదర్శించాడు . ... అందుకు ఆమె సమాధానం ఓ అర్థవంతమైన చిరునవ్వు !

ఆ చిరునవ్వు మెరుపులో , ఆ సోగకళ్ళ నీలినీడల్లో అవగాహన, ఆర్ద్రత ఉన్నవారికి ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి . సాగర్ కు ఆ స్థాయి లేదు . అంత ఓపిక లేదు .

కొన్ని పరిమితులకు, అభిప్రాయాలకు కట్టుబడి ఉన్న సగటు మనిషి సాగర్ . ఆ విషయం భరత్ రామ్ కు తెలుసు . అందుకే వారిద్దరినీ వినోదం గా చూస్తుండిపోయాడు .

ఒక మనస్తత్వ నిపుణుడిగా విద్యా మానసిక స్థితి చక్కగా అంచనా వే య గలిగాడు భరత్ రామ్ . ఆమె మౌనం వెనుక, పరధ్యానం వెనుక చిత్రమైన సంఘర్షణ జరుగుతోంది . ఆమెలో ఇన్నాళ్ళు అజ్ఞాతం గా ఉంటూ కల్లోలం సృష్టించిన కోమల నేడు ప్రశాంతం గా ఆలోచిస్తూంది .

విద్యాదరి లో గత జన్మపు మరువపు మొలక లా సువాసన లీనుతున్న కోమలా దేవి ఆమె మనసు లో , హృదయం లో వ్యక్తిత్వం లో ఒక భాగమై పోయింది . విడరాని బంధం అయిపో యింది .

ఇంకేం కావాలి. ఇలాంటి స్థితి చాలా అరుదు. రెండు జన్మల నడుమ , రెండు వ్యక్తిత్వాల నడుమ ఈ చిత్రమైన ‘ సంబంధం ‘ ఊహించని ఎన్నో పరిణామాలకు దారి తీయవచ్చు. ఆ మానసిక సంఘర్షణ తట్టుకునే ధైర్యం పేషంటుకు లేనప్పుడు ఆ స్థితి మరో నరకం అవుతుంది .

భరత్ రామ్ దృష్టి లో విద్యాదరి ఓ సంపూర్ణ స్త్రీ, ఎలాంటి పరిస్థితి నైనా ఆత్మ విశ్వాసం తో , ఓర్పుతో ఎదుర్కొన గలదు . కానీ ---- అందుకు సాగర్ సహకారం కావాలి . ఆ సహకారం అందుతుందా లేదా అన్న విషయం లో భరత్ రామ్ కు కొన్ని సందేహాలు ఉన్నాయి . ఈ టాపిక్ పై ఆయన సుదర్శనం తో చర్చించాడు . సుదర్శనం మనసులో కూడా ఇదే సందేహం ఉంది .

తిరుగు ప్రయాణం లో సాగర్ లేకుండా చూసి విద్యా భరత్ రామ్ తో ఓ మాట అంది ---“ అంకుల్ ! ఒక్కసారి రాహుల్ బాబును కలిసి మాట్లాడాలని ఉంది . నన్ను చూస్తే మా అమ్మ మళ్ళీ పుట్టిందని ‘ ఎంత సంతోష పడతాడా ?” అని. ఉలిక్కి పడ్డాడు సుదర్శనం . భరత్ రామ్ ను అయోమయంగా చూసాడు . ఆయన చిద్విలాసం కలిసిన చిరునవ్వు తో స్నేహితుడిని చూసాడు . ఆ ప్రొఫెసర్ నోటి నుండి ఒకే మాట వెలువడింది . –‘డియర్ ఫ్రెండ్ ! ఇది అంతం కాదు –ఆరంభం !’

ఇంతవరకు జరిగిన సంఘటనల సమాహరానికి ఓ ‘ కొసమెరుపు ‘ చెప్పి ముక్తాయించాలి . విద్యాదరి ప్రయాణం హడాఉడి లో తనకెంతో అపురూపమైన డైరీని లాడ్జ్ రూమ్ లో మరిచి పోయింది .

దాదాపు పాతిక సంవత్సరాల పై చిలుకు సుదీర్ఘకాలం . ఎన్నో మార్పులకు మంచి చెడులకు ఆలవాలమైన కాలం- వయసు రీత్యా మనిషి లో ఎంతో వైవిధ్యాన్ని, వైఖరిలో ఎంతో విలక్షణత్వాన్ని తెచ్చే అవకాశం ఉంది . కొన్ని నమ్మకాలు , విలువలు తారుమారై ఆలోచనా ధోరణి లో ఊహించని మార్పు రావచ్చు . కాలం ఓ చైతన్య స్రవంతి ! ఆ స్రవంతి లో సాగి పోయే మానవులు ఎంత జడులైనా , మూర్ఖులైనా పూర్తిగా ఆ ప్రభావానికి దూరం కాలేరు . కాలం వదిలిన చిహ్నాలు . కొన్ని తమ వ్యక్తిత్వం పై పడకుండా ఏ వ్యక్తీ ‘మడి కట్టుకుని కూర్చోలేడు .

అజయ్ బాబు విషయం లో అదే జరిగింది . అతడిలో బాహ్యం గా ఎంతో మార్పు వచ్చింది . జుట్టు పైపైకి పోయి నుదురు మరీ విశాలమైంది . అతడు తన విశాల

ఫా లభాగం పై తీర్చి దిద్దే సింధూరపు రేఖ అతడి గంభీరమైన ముఖానికి ,వింత సోయగం తెచ్చి పెట్టింది . గుబురు మీసాలు, చురుకైన కళ్ళు ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తాయి నడకలో హుందాతనం , నడత లో నెమ్మది తనం కాలం అతడికి ప్రసాదించిన అపురూపమైన వరాలు . అనుభవం, అవలోకనం అతడిలో ఆవేశం తగ్గించి ఆలోచన పెంచాయి . వివాహమైంది . భార్య రూపాదేవి అందాల రాశి . విద్యావంతురాలు . వారిది పరిమిత కుటుంబం . కొడుకు, కూతురు. గ్రామం లో లేరు . జైపూర్ లో చిన్నాన్న విజయ్ ఇంట్లో ఉంటూ చదువుకొంటున్నారు . ఇద్దరు అజయ్ సింహ్ కళ్ళు . పెద్దన్న విక్రం మరణించిన కొద్ది కాలానికే విజయ్ మకాం జైపూర్ కు మార్చాడు . కారణాలు ఏవైనా కావచ్చు . అక్కడ క్వారీ బిజినెస్ ప్రారంభించాడు. దశ తిరిగింది. లక్షలు గడించాడు .అతడికీ వివాహమైంది . ఒకే ఒక మగ సంతానం