" ఇంతియాజ్ ! ఆదిత్య తమ్ముడు గమనించక పోతే పవన్ పరిస్థితి ఏమిటీ ? ఎంతో పద్ధతి గా, క్రమశిక్షణ తో పెరిగిన పవన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడంటే? మరి పేరెంట్స్ మానిటరింగ్ లేని పిల్లల సంగతి ఏంటి ? తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే కదా విశాల్ బలైంది. .మనలో మార్పు రావాలి, ఇంతియాజ్ ! ది" పరాంకుశరావు మాటల్లో బాధ, పశ్చాత్తాపం.
" అరవింద్ - పవన్ కు ఉన్న ఇంటిమసీ, అరవింద్ -విశాల్ కు లేదు. పవన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడంటే కారణం.. స్వేచ్ఛ.
డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే కుతూహలం. క్యూరియాసిటి. విశాల్ పరిస్థితి వేరు. ఒంటరితనం, తల్లిదండ్రుల ఆత్మీయత, శ్రద్ధ లోపించటం. విశాల్ ను డ్రగ్ అడిక్ట్ ను చేశాయి. అందుకే అరవింద్ అతడిని కదిలించలేకపోయాడు.Moreover the fate has already written his destiny. " అవునన్నట్లు తల వూపాడు పరాంకుశరావు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. ఎవరి ఆలోచనలో వారుండిపోయారు.
" పరిస్థితులే కాదు. విశాల్ ఆత్మహత్య కు నేనూ కారణమైయ్యాను. "
అర్థం కానట్లు చూశాడు పరాంకుశరావు.
" అవునంకుల్ ! పవన్ డ్రగ్ అడిక్ట్ అని తెలిశాక మా ఇంటికి తీసుకెళ్ళిపోయాను. నా కార్లోనే రోజూ కాలేజీకి వెళ్ళేవాడు.
ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ డీ- అడిక్షన్ సెంటర్ లో చేర్చాను.
పవన్ లేకపోవడంతో విశాల్ మరీ ఒంటరివాడైనాడు.
అతడి ఆత్మహత్య కు అదీ ఒక కారణం. . హరీష్ రావ్ ను ఆరోజే అలెర్ట్ చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేదికాదు. " ఇంతియాజ్ కళ్ళల్లో పల్చటి కన్నీటి పొర. పరాంకుశరావు
ఓదార్పు గా అతడి భుజం తట్టాడు.
" నువ్వొక్కడివే కాదు. విశాల్ ఆత్మహత్య కు అందరం కారణాలేమైనా ము. ఈ సమాజమే కారణమైంది. మనందరి నిర్లక్ష్యం క్షమించరాని తప్పు. మరో పసివాడి ప్రాణం గాలిలో కలిసిపోకూడదు. మొన్న విశాల్ సంస్మరణ సభ లోౠ సి.ఎమ్ చెప్పిన ప్రతి మాట సిన్సియర్ గా తీసుకోవాలి. బాధ్యత మరిచిపోకూడదు ."
" ఇదే విశాల్ కు మనమిచ్చే నిజమైన నివాళి. ఫయాజ్ ఎగతాళి చేసినట్లు మనం తీసుకునే మష్,్. మెషర్స్
నాలుగు రోజుల తంతు కారాదు. గమ్యం చేరేవరకు శ్రమించాలి. మనం యువతను కాపాడుకోవాలి. నేనూ ఒక పోలీసు అధికారిలా నా వంతు కృషి నేనూ చేస్తాను."
చిరునవ్వు తో ఇంకోసారి ఇంతియాజ్ భుజం తట్టాడు పరాంకుశరావు.
" రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్" ఆఫీస్ ముందు అన్వర్, అలీ, యాకూబ్ , వాళ్ళ కుటుంబాలు, ఇంతియాజ్, సమతా సదన్ పరివారం, మరి కొంతమంది శ్రేయోభిలాషులు , అందరూ ఒకే చోట , సందడి గా. అందరి కళ్ళల్లో ఆనందం, సంతోషం
పూలదండలు, ఖరీదైన దుస్తుల్లో ఆదిత్య - మెహర్,. అలీ- దిల్ రుబా.( యాకూబ్ వాళ్ళ అక్క). మెరిసి పోతున్నారు. , హసీనా, ఫాతిమా మొహాల్లో నిండైన తృప్తి.
అన్వర్, యాకూబ్ కృతజ్ఞతతో తడిసి ముద్దవుతున్నారు.
అప్పుడే ఆగిన కారులోంచి పరాంకుశరావు, ఇనాయతుల్లా, షేక్ మస్తాన్ దిగారు. నూతన జంటలకు శుభాకాంక్షలు తెలిపారు.
" చీకటి తర్వాత వేకువ రావటం సహజం. కానీ వేకువ ఇంత అద్భుతంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. ఆదిత్యా ! నువ్వు మతాల సరిహద్దులు చెరిపేశారు. అలీ నువ్వు ఉత్తర దక్షిణాలు కలిపేశావు.
" This is real, social and cultural harmony." ఈ కెరటం ఇలాగే నింగిని తాకాలి. అందుకు మనమంతా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఇంతియాజ్ ! అన్వర్ టీ ం. టీం మిషన్ జన్నత్ లో బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకుంటోంది." భాషలో , భావంలో , సాహిత్య పరిమళం , హృదయం లో అవధులు మించిన ప్రేమ....... వెరసి. డా. ఇనాయతుల్లా.
ఈ దేశం ప్రశాంతంగా ప్రగతి బాటలో అడుగు వేయాలంటే ఒక ఇనాయతుల్లా, పరాంకుశ రావు, ఆదిత్య, ఇంతియాజ్, సర్దార్ జీ. చాలరు. కనీసం వీరు వందల సంఖ్యలో చాలు అఖండ భారతం సాకారమవుతుంది.
యువత దేశ ప్రగతికి కరదీపికలవుతారు. శుభం భూయాత్. !
******************
Retrospection
ఆ చిన్న కొండ పై నుంచి ఆ గ్రామం పూర్తి గా కనిపిస్తుంది.
గట్టిగా వుంది గడిపి లేని కుగ్రామం అది . చుట్టూ కనుచూపు మేర విశాలంగా పరుచుకున్న పచ్చదనం, నిశ్శబ్దాన్ని మాటిమాటికీ కలవరపెట్టే పిల్ల తెమ్మెర లు. సూర్యుడు ఆనాటి గమనం ముగించుకొని పడమట సింధూరం వెదజల్లుతున్నాడు.
అన్వర్,. అలీ,. యాకూబ్ -------- ఓ పెద్ద బండరాయి పై కూర్చుని, ఎవరి ధ్యాసలో వారున్నారు. ఎవరి ఆలోచనలో వారున్నారు. కానీ ముగ్గురి ఆలోచనల కేంద్ర బిందువు ఒకటే.
మొదట అన్వర్ లో కదలిక వచ్చింది. పచ్చటి వరి మొలకలపై నుండి వీచే ప్రాణ వాయువు ను గుండెల నిండా పీల్చుకున్నాడు.
***********************************************
కొనసాగించండి 47 లో