Those three - 33 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 33

Featured Books
Categories
Share

ఆ ముగ్గురు - 33

కళ్ళు గిర్రున తిరిగాయి. తండ్రి మరణ వార్త అతడిని కృంగదీసింది. మెల్ల మెల్లగా మెట్లు దిగి ఎదురుగా ఉన్న షాపు ముందు నిలుచున్నాడు.
విహారి కలుసుకున్న ' గడ్డం పెద్దాయన ': అన్వర్ ను ప్రశ్నార్థకంగా చూశాడు.
" మామూ" అన్వర్ పెదవులు మెల్లగా కదిలాయి.
మామూ అన్వర్ నుండి వెంటనే పోల్చుకోలేక పోతున్నాడు. ఆయన మనసు జ్ఞాపకాల పొరలు చీల్చుకుంటూ వెనక్కి
పరుగులు తీసింది. ఆనాటి అన్వర్ కళ్ళముందు మెదిలాడు.
ఒక్క ఉదుటున క్రిందికి దిగి అన్వర్ ను దగ్గరకు తీసుకున్నాడు
" అన్వర్ మేరే బేటే" ! అన్న పిలుపు అన్వర్ ను కదిలించింది. తడికళ్ళ ను తుడుచుకున్నాడు .
మామూ అన్వర్ ను ఇంటికి తీసుకెళ్ళాడు. అన్వర్ ను ఆయన భార్య ఆప్యాయంగా పలకరించింది. ఇద్దరి ఆదరణతో అన్వర్ కొంత తేరుకున్నాడు.
" మీ నాన్న నీ కోసం అల్లాడి పోయాడు. నీ దిగులుతోనే
మంచం పట్టాడు. పుల్లలా లా కరిగి పోయాడు.
అన్వర్ ను ఒక్కొక్క మాటా బాణంలా గుచ్చుకుంటోంది.
" మీ నాన్న దాటుకున్న తర్వాత మీ అమ్మ పరిస్థితులతో యుద్దమే చేసింది. మెహర్ని బాగా చదివించింది. ఆ అమ్మాయి చదువు కోసం తన ఆరోగ్యం కూడా లెక్క
. చేయలేదు. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది.
అల్లా కీ రెహమ్ ! మెహర్ కి మంచి ఉద్యోగం వచ్చింది.
కాలేజీ లెక్చరర్. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. కాకపోతే ఆమె ఆశ ఒక్కటే . ఊపిరి పోయే ముందు నిన్ను ఒకసారి చూడాలని. అసలు నువ్విప్పుడు కనిపిస్తే చాలురా. ఠక్కున లేచి కూర్చుంటుంది. ఆమె మనోవ్యాధి చేత్తో తుడిచినట్లు మాయమవుతుంది. మెహర్ నిఖా నీ చేతులు మీద జరగాలే కానీ ఆమె కింకేమి కావాలి. ?" మామూ ఒక పచ్చటి ఊహా చిత్రాన్ని అన్వర్ కళ్ళ ముందు ఉంచాడు.
అప్పుడు పూర్తిగా అర్థమైంది అన్వర్ కు తనేం పోగొట్టూకున్నాడో .
అయిన వాళ్ళ ప్రేమ . ఒక చక్కని కుటుంబ నేపథ్యాన్ని ఈ రెండూ తను మళ్ళీ పొందగలడా ?
మెహర్ కు వెంటనే ఫోన్ చేయబోయాడు మామూ.అన్వర్ ఆపాడు.
" వద్దు మామూ ! వాళ్ళను వెంటనే కలవలేను. కొంత టైం కావాలి."
" ఇప్పుడు నీ పరిస్థితి బాగానే ఉంది కదా " సందేహం గా అన్నాడు పెద్దాయన. " నా పరిస్థితి బాగానే ఉంది . కొద్దోగొప్పో సంపాదిస్తున్నాను. కానీ వాళ్ళను కలవాలంటే కొంత టైం కావాలి. "
" అలాగే నువ్వు పూర్తిగా కుదుటపడ్డాకే అమ్మను కలువు.అంతవరకు మాతోనే ఉండరాదా! ఒంటరిగా ఎందుకు ఇబ్బంది పడతావు ?" ఆ ఆహ్వానం లో ఆదరణ ఉంది. ప్రేమ ఉంది.
" ఇక్కడే ఉంటే ఏదోవిధంగా నా గురించి వారికి తెలిసిపోతుంది. వారిని కలిసేంతవరకు దూరంగా ఉంటాను. ఏమనుకోవద్దు."
మామూ ఇంటి నుండి బయలు దేరాడు. మనసు నిండా ఆలోచనల జడి. తండ్రి మరణం అతడిని బాగా కదిలించింది. ఆనాటి తన మూర్ఖత్వం, మొండితనం తండ్రి నే లేకుండా చేశాయి. కుటుంబం ఛిద్రమైంది కేవలం తన వల్లే. ఆలోచిస్తూ రోడ్డు దాటుతున్నాడు. రాత్రి పదకొండు గంటల సమయం. ఆ రోడ్డు పగలే రద్దీ తక్కువ. రాత్రి నిర్మానుష్యం. అదే సమయంలో ముందు బాగా బిగించి బార్ నుండి ఇంటి కెళుతున్న ఓ ఇర్రెస్పాన్స్్బిల్ గై'బుల్లెట్ పై యమస్పీడులో వెళుతూ రోడ్డు దాటుతున్న అన్వర్ ను రాచుకుంటూ వెళ్ళాడు. చీకటి, పైగా వేగం. మనసునావరించుకున్న మత్తు. అతడు అన్వర్ ను గమనించలేదు. బులెట్ క్రాష్ గార్డ్ అన్వర్ కాలుకు తగిలింది.
విసురుగా ఫుట్ పాత్ పై పడిపోయాడు. తలా నేలకు తగిలింది. క్షణాల్లో స్పృహ పోయింది. చూస్తూండగానే అతడి జుట్టు రక్తంతో తడిసిపోయింది.
ఆ సమయం లో రోడ్డు పై ఎవరూ లేరు.

**************
ఇనాయతుల్లాకు సంప్రదాయ పద్ధతిలో వినయంగా ఒంగి
సలాం చేశాడు ఇంతియాజ్. లాల్చీ,పైజామా, నమాజు టోపీ లో అసలు సిసలైన ముస్లిం లా ఉన్నాడు
ప్రొఫెసర్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.
" అబ్బా జాన్ కైసే హైం ? తబీయత్ ఠీక్ హై నా ?" పరామర్శ చేశాడు.
ఒకే వూరివారు కొంత వ్యవధి తర్వాత కలుసుకుంటే వారి సంభాషణ ఏ తీరున సాగుతుందో అదే విధంగా సాగింది. వారున్న గది జ్ఞాపకాల అగరు ధూపం తో గుబాళించింది.
మిషన్ జన్నత్ వివరాలు, ఎదుగుదల తెలుసుకొని ఇంతియాజ్ చాలా సంతోషించాడు. ఆ వివరాలు చెబుతున్నప్పుడు ప్రొఫెసర్ కళ్ళు దీపాల్లా మెరిశాయి.
" నిజం గా అదో అద్భుతం. అంతరాలు మరిచి అందరూ కలిసిపోవటం పరమాద్భుతం. ఒకే ఆలోచన,. ఒకే ఆచరణ , ఒకే లక్ష్యం. అందరూ కలిసిమెలసి బ్రతకాలి. మనిషిలా జీవించాలి . మానవత్వమే దైవత్వం అని తెలుసుకోవాలి.
ఈ రెండింటి మధ్య బేధం చూడనివాడే అల్లా దృష్టిలో మనిషి. మిషన్ జన్నత్ లో ఈ ప్రయత్నమే జరుగుతోంది. మతాల సరిహద్దు లను చెరిపేస్తున్నిం. సాహిత్య పు విలువలు పరిమళించే ఉర్దూ ఇనాయతుల్లా సంభాషణ లో చందనపు సువాహనలీనింది

కొనసాగించండి. 34