In your pair.. in Telugu Love Stories by Sai kumar Naidu books and stories PDF | నీ జతలో..

Featured Books
Categories
Share

నీ జతలో..




టైం చూస్తే పదకొండు దాటింది
ఒక అమ్మాయి హడావిడిగా రెడీ అవుతుంది

ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయి బయటికి వచ్చి
వెంటనే తన వెళ్లాల్సిన చోటికి అడ్రస్ చెప్పి
క్యాబ్ ఎక్కికూర్చుంది

ఒక అర్థగంట తర్వాత తను వెళ్ళాల్సిన చోట దిగింది
అప్పటికే ఒక అతను చాలా
అసహనంగా ఎదురుచూస్తూ ఉన్నాడు
దిగిన వెంటనే ఫాస్ట్ గా అతని దగ్గరకు వచ్చింది

అతడు ఆమె వైపు చిరాకుగా చూశాడు
సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ సారీ
అదేంటో తొందరగానే బయల్దేరాను
ట్రాఫిక్ లో లేట్ అయిపోయింది అని చెప్పింది ఆ అమ్మాయ్

నువ్వు ఎప్పుడు ఇటువంటి పనే కదా చేసేది
ఎన్నిసార్లు చెప్పినా మాములే కదా...
నేను నీకు టైం కి రమ్మని చెప్పినా నీకు అర్థం కాదా
వాట్ ఇస్ థిస్ టైం
మెయింటైన్ చేయమని చెప్పాను నీకు
కానీ అప్పుడు మాత్రం చెప్పినట్లు వింటావు కానీ
మళ్ళీ మాములే...అన్నాడు విసుగ్గా

రాజ్ రియల్లీ వెరీ సారీ
ప్లీజ్ అర్థం చేసుకో అంది తను...

ఏమి అర్థం చేసుకోవాలి
అప్పటి నుంచి నీకు చెబుతూనే ఉన్నాను
ఇదంతా టైం వేస్ట్
నాకు అర్థమే కాదు లే

యువర్ వెస్ట్ పీస్ కార్తీక
కోపంగా చెప్పాడు అతను

ఎందుకో ఆ మాట వినగానే
మనసుకు ఒక్క క్షణం బాధగా అనిపించింది

అలాగే ఉంది అతని పక్కన
ప్లీజ్ ఏడుపు ఆపు...
ఆ ఏడుపు అనేది నాకు నచ్చదు దీనిని కట్టిపెట్టు

బి ఎ గుడ్ గర్ల్ అంటూ
ఆమెను బలవంతంగా తన వైపు లాక్కుని
ఆమె నడుము చుట్టూ చేయి వేసి
అమె పెదవులపై ముద్దు పెట్టాడు

అతడి పెదవులు అందించిన
ఆమె అస్సలు తన పెదవులని ఓపెన్ చేయలేదు

పైగా అందరి ముందు
ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది

రాజు అందరూ ఉన్నారు ప్లీజ్ వదలవా
అంది కార్తీక...

ఈ తొక్కలో మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే
నాకు నచ్చవ్ అని నీకు తెలుసు కదా...

నీకు నాల ఉండమని చెప్పాను గా నేను
నన్ను ప్రేమించినప్పుడు
నువ్వు నాలానే ఆలోచించాలి అర్థమైందా

ఓపెన్ యువర్ మౌత్ గట్టిగా అరిచాడు అతను
అయినా సరే ఆమె అందరి వైపు చూస్తూ
తన పెదవులను తెరవలేదు...

ఆమె అలా చేయడంతో
అతను గట్టిగా ఆమె నడుము దగ్గర గిచ్చి
నుదిటి పైన ముద్దు పెట్టుకున్నాడు

బాధగా అనిపించినా వచ్చే కన్నీళ్ళను
కళ్ళలోనే ఆపేసి అతనివైపు
చిరునవ్వుతో చూసింది

ఇద్దరు కలిసి ఏదో మూవీ కి వచ్చారు
అతని డ్రైవర్ టికెట్స్ తెచ్చి
అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు

కార్తీక మౌనం గా నిలబడింది
అతని మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ
ఆమెకు అర్థం కావడం లేదు

అందరి ముందు ఒకలా బిహేవ్ చేస్తాడు
ఎవరూ లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తాడు
ఫ్రెండ్స్ ముందర ఒకలా ఉంటాడు
తల్లిదండ్రుల దగ్గర ఇంకొక రకంగా ప్రవర్తిస్తాడు
ఆమెకు నిజంగానే పిచ్చెక్కి పోతున్నట్టు అనిపించింది

మౌనంగా అలాగే ఉంది తనని చూస్తూ...
అతను మాత్రం చుట్టూ వచ్చి పోతున్న
అమ్మాయిలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు

లుక్ అట్
నువ్వు చూడు ఎలా ఉన్నావు
వాళ్లు చూడు అసలు ఎలా ఉన్నారు

అంత దూరం నుంచి
అమ్మాయిల అందాన్ని తినేసిటట్లు చూస్తూ ఉన్నాడు

అది ఆమెకు నచ్చకపోయినా మౌనంగా ఉంది
చుడిదార్ లో నీటుగా వచ్చింది ఆమె

అతనికి మాత్రం షార్ట్ జీన్స్
టీ షర్ట్ లాంటివి వేసుకోవాలి

ఆ తొడలు కనిపించేలా డ్రెస్ వేయడం
ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు

మన శరీరం మన ఇష్టం అంటాడు అతను
మనం ఏ డ్రెస్ వేస్తే ఏముంది అది మనకు నచ్చాలి
అని తనని చాలా మార్చడానికి ట్రై చేస్తాడు...

కానీ ఆమె దానిని ఒప్పుకోలేక పోతుంది
మన శరీరం మన ఇష్టం కానీ
అది ఎంతవరకు మన గదిలో ఉన్నంతవరకే

కానీ బయటికి వచ్చిన తర్వాత
మన శరీరం పైన మనకు ఎంత హక్కుందో
మనల్ని చూసినవాడు ఊహల్లో
అంతే హక్కు పొందుతాడు అంటుంది కార్తీక..

అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి
కచ్చితంగా మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా
కొన్ని ఆలోచనలకు బీజం వేస్తుంది

నీట్ గా డీసెంట్ గా ఉండటంలో
తప్పులేదు కదా అంటుంది

అతనేమో ఫ్యాషన్ గా
హాట్ గా ఉండాలి అంటాడు

ఆమె ఏమో పద్ధతిగా ఉండాలి అంటుంది
ఆమె చుడిదార్ వేస్తాను అంటుంది

అతడు షార్ట్ అండ్ స్లీవ్ లెస్ వెయ్ అంటాడు

ఆమె చీర ఉంటుంది
అతడు జీన్స్ టీ షర్ట్ వేయమంటాడు

ఆమె గుడికి వెళ్దాం అంటుంది
అతడు పబ్ కి వెళ్దాము అంటాడు

సినిమాలకు షికార్లకు
ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు
అతడు మాత్రం ఖరీదైన సినిమా హాల్స్ లో కూర్చుని
కార్నర్ సీట్ లో రొమాన్స్ చేయాలి అంటాడు

అది ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు
చాలా చిరాకు అందుకే అతను పిలిచిన ప్రతిసారి తప్పించుకోవాలి అని చూస్తుంది

భార్యాభర్తల మధ్య ఏదైనా
పెళ్లయిన తర్వాత బాగుంటుంది

పెళ్లికి ముందే కక్కుర్తిపడితే ఆమెకి నచ్చదు
చిన్నచిన్న కౌగిలింతల వరకు ఓకే కానీ
అంతకుమించి వద్దు అంటుంది ఆమె

అతడేమో ఒక్కసారే అన్ని రుచులు చూడాలి
అని ఆత్ర పడతాడు

అందుకే అతడు ఎప్పుడైనా పిలిస్తే
సాధ్యమైనంతవరకు తప్పించుకొని తిరుగుతుంది

కానీ ఇప్పుడు తప్పదు
ఎందుకు అంటే అతనికి తనకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది

ఇంకో నెల రోజుల్లో అతనితో పెళ్లి
పైగా రాజు ఇంట్లో తన తల్లిదండ్రులను ఒప్పించి
తనతో సినిమా కు అని పిలిచాడు

తల్లి తండ్రి అదేపనిగా చెప్పి పంపించారు
హ్యాపీగా వెళ్లి సంతోషంగా
ఒకరి మనసు ఒకరు పంచుకోండి
అన్ని విషయాలు తెలుసుకోండి

జీవితంలో కలిసి మెలిసి ఉండాల్సింది మీరు
కాబట్టి ఎటువంటి దాపరికాలు లేకుండా
సంతోషంగా ఉండండి అని చెప్పారు

తన తల్లి తండ్రి అంటే చాలా ప్రాణం ఆమెకి
ఎందుకు అంటే తనని ఒక యువరాణి లా ప్రేమిస్తారు

కానీ వాళ్ల ముందర రాజు స్ప్లిట్ పర్సనాలిటీ
ఎలా చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు

ఒక అహంకారి కోటీశ్వరుడు అతను
తన మాటే చెల్లాలి అనుకుంటాడు
తను చెప్పిందే వేదం అనుకుంటాను

తను చెప్పింది చెప్పినట్టు జరగకపోతే
అతను అస్సలు ఒప్పుకోడు
మౌనంగా ఆలోచిస్తూ ఉంది

కొన్నిసార్లు ఆమెకు అర్థం కాదు
మరి ఇటువంటి వ్యక్తితో
తాను ప్రేమలో ఎలా పడింది అని

నిజంగానే తనని ప్రేమిస్తున్నానా
నిజంగానే ప్రేమిస్తున్నానా నేను
అని తన మనసుకు అనిపిస్తూ ఉంటుంది...

ఏమో పెళ్లి దగ్గర పడే కొద్దీ
ఆమె భయం ఇంకా పెరుగుతూ ఉంది

అతనిని పెళ్లి చేసుకున్న తర్వాత
జీవితాంతం సంతోషంగా ఉండగలనా అని

ఇప్పుడే ఇలా ఉంది జీవితం
రేపు నిజంగానే సంతోషంగా ఉంటుందా లేదా
అని ఏం అర్థం కావడం లేదు ఆమెకి

రోజూ ఏదో ఒక రూపాన్ని చూపిస్తాడు
తనలో వున్న కోణాలన్నీ చూపించి
నరకాన్ని దగ్గరగా పరిచయం చేస్తాడు...

అందరి ముందు ఒకలా
ఎవరు లేనప్పుడు ఒకలా ఉంటాడు...

కానీ మనస్ఫూర్తిగా అతనిని ప్రేమించింది
తను లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది...

అసలు తన ప్రేమ ఎప్పుడు
ఎలా మొదలైందో కూడా తనకు కూడా అర్థం కాలేదు

ప్రేమించినందుకే కదా పెళ్లి వరకు వచ్చింది
మళ్ళీ ఏంటి కొత్తగా ఆలోచిస్తున్నాను అనిపించింది

తన ఆలోచన తప్పని అనిపిస్తోంది...
కానీ తన ప్రవర్తన తలచుకొని బయపడుతోంది
మనసుకు బాధగా ఉంటుంది...

తనను అర్థం చేసుకోలేకపోతున్నాడో
లేకపోతే తనే రాజుని అర్థం చేసుకోలేకపోతుందో
ఏమి తెలియడం లేదు పల్లవి కి...

ఒకరితోనే ప్రేమ
ఒకరి తోనే జీవితం అనుకునే అమ్మాయి ఆమె
అందుకే రాజు ఎన్ని చేస్తున్న కూడా
మౌనంగా భరిస్తూ వుంది..!!