" నేనీ రోజు డ్యూటి లో లేను . నమాజు కు వెళుతుంటేమీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నారు . డ్యూటి లో లేనప్పుడు నా దగ్గర పిస్టల్ ఉండదు . "
" కంటిన్యూ " ఇంతియాజ్ తొందర చేశాడు .
" ముందొక పైలట్ ప్రాజెక్టు అనుకున్నారు . ఇందుకోసం సెలెక్ట్ చేసిన వారిలో ఇరవై మందిని క్రీమ్ బ్యాచ్ గా సెలెక్ట్ చేశారు . వారిలో నేనూ ఒకడిని. వారు సెలెక్ట్ చేసిన ఇరవై కార్పొరేట్ కాలేజీ లలో మేము చిన్న ఉద్యోగం సంపాదించాలి . మరో విషయం అన్నీ colleges సిటీ లిమిట్స్ లో ఉన్నవే . వాటిల్లోడ్రగ్స్ అలవాటు ఉన్నవారిని హూర్తయించాలి. వారి ద్వారా కొత్తవారికి వల వేయాలి . వారికి ముందు శాంపిల్స్ ఇచ్చి ఊరించాలి . ఆపై జరగాల్సింది సిక్స్ లైనర్ హై వే బుల్లెట్ లా దూసుకు వెళుతుంది ." నవ్వాడు యాకూబ్
" ఇలా ఎంతకాలం సాఫీగా జరుగుతుందనుకుంటున్నారు ? చీకటి వ్యవహారాలు ఎక్కువ కాలం దాగవు . ఏదో రూపం లో వెలుగు చూస్తాయి . డ్రగ్స్ సామ్రాజ్యాలు పేకమేడల్లా కూలిపోతాయి ఇప్పుడు జరిగినది ఆదేగా ? " ఇంతియాజ్ మాటల్లో విజయ గర్వం తొణికిసలాడింది .
" నిజమే తెలిసో తెలియకో చిన్న తప్పు జరిగినా చాలు మా ట్రేడ్ కుప్ప కూలి పోతుంది. కానీ ఇలాంటివి మీరు కొంతకాలమే ఆపగలరు. ఎంతకాలం మాపై నిఘా పెడతారు ? యూత్ మత్తులో ఉన్నంతకాలం మా వ్యాపారానికి తిరుగు లేదు . పాగా మా టార్గెట్ డబ్బు, హోదా ఉన్న శ్రీమంతుల ముద్దుల కొడుకులు . అలాంటి వారికి స్టేటస్ conscious
ఎక్కువ. తమ బలహీనతలు బయటపడి సమాజం లో పరువు పోవడం వారసలు భరించలేరు . వారికి వారు ప్రయాణం పోయినా పైకి తేలరు . మాకు అదొక ప్లస్ పాయింట్ . ఇంతెందుకు ? ఇంత జరిగినా పవన్ నోరు విప్పాడా ? ఎవరి ద్వారానో తాను దరుగ అడిక్ట్ అని మీకు తెలిసింది . " యాకూబ్ మాటల్లో దహేమమ కనిపించింది .
" ఎంత పొగరు నీకు ? నీలాంటి వాడిని నడివీధి లో అందరూ చూస్తుండగా కాల్చి పారేయలి . అప్పటికి కానీ సమాజానికి పట్టిన పీడ వదిలి పోడు . " ఆదిత్య మాటల్లో నిప్పు కణాలు . కోపం తో మొహం ఎర్ర బడింది.
" కూల్ డౌన్ ఆదిత్యా కూల్ డౌన్ ! అతని మాటల్లో పొగరే కాదు . నిజం కూడా ఉంది . మనం కొంటున్నాం . వాళ్ళు అమ్ముతున్నారు . మనలో మార్పు వచ్చి కొనడం ఆపేస్తే వాళ్లెలా అమ్ముతారు ? ఈ సమస్యకు సమాధానం మన దగ్గరే ఉంది . యువకుల్లో మార్పు రావాలి . ఆ మార్పు ఒక్కటే డ్రగ్స్ మాఫియాను రూట్ అవుట్ చేయగలదు . . ఇందుకు ఇటు ప్రభుత్వాలు, అటు ప్రజలు నడుం బిగించాలి. ఇది సామాన్య మైన విషయం కాదు. ఓ ఉద్యమం లాంటిది ."
ఆదిత్య ఆలోచిస్తూ ఉండి పోయాడు. ఆలోచన కోపాన్ని తుడిచి వేసింది.
" మీరు జిహాద్ ను వ్యతిరేకిస్తారు. మరి పి.ఓ.కే నుండి మిలిటెంట్ ట్రైనీస్ ను ఎందుకు దిగుమతి చేసుకున్నారు?"
" మీకు తెలియనిదేముంది సార్ ! డ్రగ్స్ వ్యాపారం లో అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంటుంది . అవసరం వస్తే పోలీసుల్ని టార్గెట్ చేయాలి . ఆ తెగువ ఒక్క మిలిటెంట్ కె ఉంటుంది . పైగా లీకల మిలిటెంట్స్ ను మీరు సులభం గా ట్రేస్ చేయగలరు . పీ. ఓ. కె మిలిటెంట్స్ అంతా సులువుగా దొరకారు. "
" జిహాద్ ను మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు . ?
" జిహాద్ ఒక రాజకీయ కుట్ర . కొందరు స్వార్థ పరులు మతాన్ని యువత పై ఒక సెంటిమెంట్ లా ప్రయోగించి వారిని ఓ ఆయుధం లా మీరచి శత్రువులపై గురి పెడుతున్నారు . కొందరు ముస్లిం యువకులు ఈ religion అనే ట్రాన్స్ భ్రమ లో padi తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు . ఏ జాటికైనా యువశక్తే ప్రయాణం. వారిని సరైన దారిలో పెడితే జాతి బాలపడుతుంది . "
" పవిత్ర ఖురాన్ లో జిహాద్ గురించి ఏం చెప్పారో తెలుసా ?"
"తెలియదు . నాకు అరబ్ అంతంత మాత్రం గానే తెలుసు . అలవాటు కొద్దీ ఖురాన్ చదవగలను . అంతే అందులోని దాగున్న గొప్ప గొప్ప రహస్యాలు , అద్భుత సందేశాలు అర్థం చేసుకోలేను
" ఒక. ప్రతి ముస్లిం ఖురాన్ కేవలం చదవటమే కాదు . అందులోని గొప్పదానం , విలువలు తెలుసుకోవాలి . you have to study the Holi Scripter"
" మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం . ఒక ముస్లిం గా నా డ్యూటి మారిచాను కాబట్టే ఈనాడు మీ ముందు ఇలా దేశద్రోహి గా నిలబడ్డాను " యాకూబ్ మాటల్లో పశ్చాత్తాపం . ఖురాన్ ప్రశక్తి వచ్చేసరికి యాకూబ్ సెంటిమెంటల్ గా కదిలిపోయాడు .
hit the iron when it is hot . ఇంతియాజ్ లో ఓ ఫ్లాష్ .
" యాకూబ్" స్వరం లో మెత్తదనం.
" యాకూబ్ ! నా మాట విను . ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదు . ఈ ఊబి లోంచి బయట పడు . కొన్నాళ్ళు ఎవరికీ కనిపించవద్దు . మీ వాళ్ళు పట్టుబడిన తర్వాత నీ సాక్ష్యం తో ఈ డ్రగ్స్ మాఫియాను సులభం గా కార్నర్ చేయవచ్చు .
" సార్ ! నేను కనిపించకపోతే వాళ్ళు అలర్ట్ అయిపోతారు . అంతేకాదు . నన్ను అసలు వదలరు . ఎలాగైనా తప్పకుండా పట్టుకుంటారు . పట్టుకుంటే నాకు చావు తప్పదు . " అతడి కళ్ళల్లో చావు భయం కనబడింది.
అర నిమిషం ఏం మాట్లాడ లేదు ఇంతియాజ్ . " నీకు అన్వర్ తప్ప ఈ నెట్వర్క్ లో మరొకరు తెలీదా ?"
" ఎలా తెలుస్తుంది సర్ ! మా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మేమొక సమావేశానికి వెళ్ళాము . మమ్మల్ని ఒక మినీ బస్ లో ఎక్కడికో తీసుకెళ్లారు . బస్ విండో గ్లాసులు బిగించారు . థిక్ curtains . మమ్మల్నే కళ్లార్పకుండా చూస్తున్న armed person . నిజం చెప్పాలంటే మేము సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేక పోయాము . చాలా సేపు ప్రయాణం చేసిన తర్వాత సిటీ అవుట్ స్కర్ట్ లో ఒక పెద్ద భవనం ముందు బస్ ఆగింది . ఓ విశాలమైన హాలులో మమ్మల్ని దూర దూరం గా కూర్చోబెట్టారు . "