అతడో దగా పడ్డ తమ్ముడు . అతడి ప్రతి మాటలో నిజం ఉంది . అతడినిలా వదిలేస్తే చాలా ప్రమాదం . " నీ పరిస్తితి అర్థమైంది . నీ మనసు మార్చుకొని అప్రూవర్ గా మాతో సహకరిస్తే " నీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తాను . "
నవ్వాడు యాకూబ్ " నన్ను మీరు ఉచ్చు లోకి లాగుతున్నారు . ప్రతి పోలీస్ ఆఫీసర్ ఇలాగే మాట్లాడుతాడు ."
" నేను నీ మంచికే చెబుతున్నాను . నీవిప్పుడు వెళ్ళే దారిలో ఎక్కువ కాలం సాగలేవు . ఈ స్తితిలో బయట పడే అవకాశం ఉంది . ఆ తర్వాత మీ సంస్థ పాపాలు బయట పడ్డాక ఎవరూ ఏమీ చేయలేరు . "
" మా సంస్థను మీరనుకున్నంత సులభంగా టార్గెట్ చేయలేరు . నా విషయం వదిలేయండి . చీమలాంటి వాడిని . ఈ నెట్వర్క్ మూల స్తంభాలు చాలా బలమైనవి . వారెవరో మాకూ తెలియదు . మేము అప్రూవర్స్ గా మారినంత మాత్రాన మీకు ఒరిగేదేమీ లేదు . మమ్మల్ని ఇలా వదిలేస్తే మా ప్రాణాలైనా దక్కుతాయి . "
యాకూబ్ అబడ్డలు చెప్పటం లేదు . అతడ న్నట్లు అతడికి తెలిసింది చాలా తక్కువ. అతడు ఒక పరిధిలో ఉన్నాడు . ఆ పరిధి దాటి అతడి చూపు బయటకు పోలేదు .
" ఓకే ! నిన్ను వదిలేస్తాను . But on one condition . నీకు తెలిసినంతవరకు ఒక్కటి కూడా దాచకుండా మాకు చెప్పాలి ."
ఆర్య నిమిషం ఆలోచించి 'ఒకే' అన్నాడు యాకూబ్. ఆదిత్య కూడా ఇంతియాజ్ పక్కన కూర్చున్నాడు .
" ఆపరేషన్ జన్నత్ లక్ష్యం ఏమిటి ?"
" సమాజం లో ముస్లిం యువకుల స్థాయిని అన్నీ రంగాలలో పెంచటం . అదే మా లక్ష్యం . "
" అందుకు భారీగా ఫండ్స్ కావాలి. ఈజీ మనీ కి రాజమార్గం ఈ డ్రగ్స్ ట్రేడ్ . అందుకే ఈ anti - social activity ప్రారంభించారు ."
యాకూబ్ నవ్వాడు " ఇది anti - social activity కాదు . It's a kind of trade . "
పొంగుతున్న కోపాన్ని నిగ్రహించుకున్నాడు ఇంతియాజ్ . " యువకుల్ని తప్పు దారి పట్టించి చివరకు ప్రాణాలు తీసే డ్రగ్స్ ఒక వ్యాపారమా ?"
" ఆల్కహాల్ ప్రజల ఆదాయాన్ని , ఆరోగ్యాన్ని గుల్ల చేయటం లేదా ? ప్రభుత్వాలు ఆ వ్యాపారాలను కంట్రోల్ చేస్తున్నాయా ? Statutary warning తో చేస్తులు దులుపుకోవటం లేదా ? వేల కోట్ల రాబడిని వాడులుకొంటున్నాయా ? మరి మాకెందుకు ఈ మినహాయింపు ?"
" అలాగని మీ మాస్టర్ మైండ్స్ మీకు brain wash చేసాయా ?"
" సర్ ! ఇది సింపుల్ లాజిక్ . brain wash చేసేంత గొప్ప విషయం కాదు . "
" ఒకే . ఇప్పుడు ఆ విషయం వదిలేద్దాం. ఇప్పుడు ఆ టాపిక్ అనవసరం . మీరు భారీ స్థాయి లో సంపాదిస్తున్నారు కదా , ఈ మొత్తాన్ని ఏ విధం గా పేద యువకులకోసం ఖర్చు చేస్తున్నారు ?"
" వారి చదువుకు సహాయం చేస్తాం. వారికి ఉద్యోగాలు వచ్చేవరకు వారి భాద్యత తీసుకుంటాం . వారి వారి చదువు, తెలివితేటల ఆధారం గా ఉద్యోగాలు సంవదించటానికి కావలసిన ట్రయినింగ్ ఇస్తాం. "
" అంతే వారి కోసం మీరొక సంస్థ నడుపుతున్నారా ? ఆ సంస్థ పేరేమిటి ?"
" ఆ వివరాలు నాకు తెలీదు. ఒక సంస్థ నాడుపుతున్నారని మాత్రం తేకూసు , "
" ఆ సంస్థ పేరు " మిషన్ జన్నత్ , అవునా ?"
యాకూబ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు .
" ఆపరేషన్ జన్నత్ , మిషన్ జన్నత్ .. రెండింటిలో కామన్ వర్డ్ 'జన్నత్'. ఈ క్లూ చాలదా రెండు సంస్థలు ఒకటే అని చెప్పటానికి ?"
యాకూబ్ లో కదలిక లేదు
" చూడు యాకూబ్ ! నువ్వు ఇప్పుడు మా కంట్రోల్ లో ఉన్నావు. నీ చేత నిజం చెప్పించటానికి మాకు ఏమంత కష్టం కాదు " ఇంతియాజ్ మాటలు చాలా కటువుగా అనిపించాయి యాకూబ్ కు. ఎదుగుగా ఉన్నది A well trained police officer. చాలా సిన్సియర్ . అనుకున్నది సాధించడానికి ఎంత రిస్క్ అయినా చేయగలడు . మొండిగా మొరాయించటం చాలా ఫూలిష్ . తనేతవ్వ వారికి దొరికి పోయాడు . అడిగినది చెప్పటం మంచిది. చెప్పినందువల్ల వచ్చే నస్తమేమీ లేదు .
" ఆపరేషన్ జన్నత్, మిషన్ జన్నత్ ---రెండూ ఒకటి కావు . మిషన్ జన్నత్ కు మేము ఫండింగ్ చేస్తాం. "
" ఫండింగ్ చేస్తారా ? ఏ పేరుతో ?" ఆతృత కనిపించింది ఇంతియాజ్ స్వరం లో .
" ఎవరో ఎలా తెలిస్తుంది సర్ ! ముందే చెప్పానుగా నేనొక హ్యా కర్ నని ." నవ్వుతూ అన్నాడు యాకూబ్ . "
"ఔనాన్నట్లు తల ఊపడు ఇంతియాజ్ . 'మిషన్ జన్నత్ donors లిస్ట్ చూస్తే తెలుసుకోవచ్చు అనుకున్నాడు . కానీ అదంతా సులభం కాదని తర్వాత తనకు తెలిసింది .
" మీరీ సంస్థ లో ఎలా చేరారు ?"
" మేము అల్ అమీన్ మినారిటీ కాలేజీ స్టూడెంట్స్ ము . నేను ఇంటర్ చేసి కరెస్పానడేన్స్ కోరస్ కూడా ఆ కాలేజీ ద్వారానే చేశాను . మా బయో డేటాలు వెరిఫై చేసి మాలో కొందరిని సెలెక్ట్ చేశారు . మా కుండవలసిన మొదటి క్వాలిఫికేషన్ పేదరికం,. కొద్దో గొప్పో ఇంగ్లీష్ లో మాట్లాడగలగాలి. తెలుగు భాష తడుముకోకుండా , అరబ్బీ, ఉర్దూ యస్య లేకుండా మాట్లాడాలి "
" పాత బస్తీ లో ముస్లిములు మాతృభాష ప్రభావం లేకుండా ఎలా మాట్లాడగలరు ?" చిరునవ్వు తో ప్రశ్నించాడు ఇంతియాజ్ .
" మాతో సెలెక్ట్ అయిన వాళ్లెవరో పాత బస్తీ యువకులు కారు. అంతా సిటీ లో ఉంటున్న వాళ్ళే . మాకు తెలుగు వారితో మంచి పరిచయాలు ఉన్నాయి . తెలుగు చక్కగా మాట్లాడగళం . పైగా తెలుగు మాట్లాడటం లో మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు . "
ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు ఆదిత్య, ఇంతియాజ్ లు . " నాది విలేజ్ background , తెలుగు తడుముకోకుండా మాటలాడ గలను . "
అవునన్నట్లు తల ఊపాడు ఇంతియాజ్ .
" మాకు చాలా చాలా పరీక్షలు పెట్టారు . మమ్మళం అన్నీ కోణాల్లో టెస్ట్ చేశారు . మా సాహసం, మా తెలివి. presence of mind , మాటకరితనం ఇలా ఎన్నో !
అనుకోని పరిస్తితులు ఎదురైనప్పుడు .. సెల్ఫ్ డిఫెన్సు కోసం ఫైరింగ్ కూడా నేర్పించారు .
వెంటనే ఇంతియాజ్ వివరాలు తన సిబ్బందిని అడిగాడు.
" లేదు సర్ ! అతడిని సెర్చ్ చేస్తున్నప్పుడు ఎలాంటి వెపన్స్ దొరకలేదు . ఒకడు సమాధానం చెప్పాడు . యాకూబ్ నవ్వాడు ." నేనీ రోజు డ్యూటి లో లేను .
నమాజ్ చేసి వెళుతుంటే మీ వాళ్ళు పట్టుకున్నారు . డ్యూటి లో లేనప్పుడు నా దగ్గర పిస్టల్ ఉండదు .
."
" కంటిన్యూ " ఇంతియాజ్ తొందర చేశాడు . " ముందుగా పైలట్ ప్రాజెక్టు అనుకున్నారు . ఇందులో సెలెక్ట్ చేసిన వారిలో ఇరవై మందిని క్రీమ్ బ్యాచ్ గా మళ్ళీ
సెలెక్ట్ చేశారు .