శుక్రవారం పగలు పదకొండు గంటలు , సాగర్ 'బి' స్కూల్ మెయిన్ గేట్ దగ్గర యాదగిరి. షేర్ ఆటో కోసం నిరీక్షణ . ఆ రోడ్డు చివర ఒక ఆటో నిలిచి ఉంది . యాదగిరిని చూడగానే మెరుపులా కదిలి క్షణాల్లో లో వచ్చి అతడి ముందు నిలి చింది . యాదగిరి ఎక్కడు . ఆటో కదిలింది . ముందే ఆటో లో ఇద్దరున్నారు . వారిద్దరి మధ్య యాదగిరి కూర్చున్నాడు .
శుక్రవారం రాహుకాలం ఘడియాల్లో లక్ష్మీ దేవి పూజ చేస్తే అనుకున్నది సిద్ది స్తుందని వాళ్ళ వూరి పెద్ద పూజారి యాదగిరి తో చెప్పాడు . అందుకే ప్రతి శుక్రవారం మసీదు కెళ్ళి మరీ పెద్ద పూజారి చెప్పినట్లు తంతు తూ . చ తప్పకుండా జరిపిస్తున్నాడు యాదగిరి ఉరఫ్ యాకూబ్ ! ఎంత నిష్ట . !
పది నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత రద్దీ లేని చోటికి వచ్చి ఆటో ఆగింది . ఆటో డ్రైవర్ మెరుపులా 'yoo' టర్న్ తీసుకొని అభిముఖం గా వేగంగా వెళ్ళ సాగాడు .
" ఎందుకు యూ టర్న్ తీసుకున్నావ్ ? నేను వెళ్ళ వలసింది ఇటు కాదు . " కంగారుగా అన్నాడు యాదగిరి
" అరవకుండా నోరు మూసుకొని కూర్చో " యాదగిరి కి ఎడమ వైపు ఉండే వ్యక్తి యాదగిరి చెవిలో కటువుగా గుసగుసలాడాడు . అతడి చేతిలోని పిస్టల్ మోనా యాదగిరి డొక్కలో గుచ్చుకుంటోంది . కుడి వైపు ఉన్న వ్యక్తి అతడి కుడి చేతిని వాటేసుకున్నాడు . ఎటూ కదల్లేని పరిస్తితి .
యాదగిరి కి పరిస్థితి అర్థమైంది. తను పోలీస్ ట్రాప్ లో ఉన్నాడు . నోరు మూసుకొని కూర్చోవటమే తనకు మంచిది .
గంట ప్రయాణం చేసి ఓ కాలనీ లోకి ప్రవేశించింది ఆటో . కొత్తగా ఏర్పడుతున్న కాలనీ . ఇల్లు అక్కడక్కడా విసిరేసినట్లున్నాయి . ఒక పెద్ద మేడ ముందు పోర్టికోలో ఆగిడి ఆటో .
యాదగిరి ని లోపలికి తీసికెళ్లారు . విశాలమైన హాలు. డూప్లెక్స్ . ఒక వైపు మూడు గదులు . యాదగిరిని ఓ గదిలోకి తీసుకొచ్చారు . విశాలం గా ఉంది ఆ గది . ఒక టేబిల్, నాలుగు కుర్చీలు ఉన్నాయి . గోడకు ఆన్చి ఒక బరువైన ఐరన్ కుర్చీ ఉంది . యాదగిరి ని అందులో అరదండలతో బంధించి కూర్చోపెట్టారు .
ఐదు నిమిషాలు మౌనం గా గడిచాక ఆ గదిలోకి ఇంతియాజ్ అడుగు పెట్టాడు . అతడి వెనకే చిరు నవ్వు తో ఆదిత్య .
" ప్రయాణం బాగా జరిగిందా యాదగిరి ఉరఫ్..........? ఇంతియాజ్ అడిగాడు .
నోరు మెదపలేదు యాదగిరి. "యాదగిరి ఉరఫ్.. " రెట్టించాడు ఇంతియాజ్ .
" ఉరఫ్ యాకూబ్ " గొణిగాడు యాదగిరి .
అదిత్యను మింగేసేలా చూశాడు .
"చూపులతో చంపేస్తావా యాదగిరి ?"
యాదగిరి చిరునవ్వు తో నే ప్రసన్నంగా అడిగాడు .
యాదగిరి తలవంచుకున్నాడు . " నేనెవరో నీకు తెలుసు .. మీరు మా టార్గెట్ అయినప్పుడు మీరు మా కదలికలు ప్రతి క్షణం గమని స్తుంటారు . మీ హై కమాండ్ మా గురించి అన్నీ వివరాలు చెప్పి హెచ్చరించి ఉంటుంది .
అవుననలేదు . కదనలేదు యాదగిరి .
" ఈ ఆదిత్య సాయం తో కూపీ లాగి నన్ను పట్టుకున్నారు. దాని వల్ల ప్రయోజనం జీరో . మీ వలలో పడ్డ చిరు చేపను నేను " యాదగిరి నవ్వాడు .
" ఆవగింజయంత దొరికినా చాలు. కొ సవరకు అల్లుకు పో గలము . నీ చేత నిజాలు ఎలా కక్కించాలో తెలుసు . "
" నిజాలు .. నో ప్లూరల్ ఓన్లీ సింగులర్ " మళ్ళీ నవ్వాడు యాకూబ్ . " నాకు తెలిసిన నిజం ఒక్కటే . I am only a tool. ----hacker . అనంతరామ్ అనే వ్యక్తి నుండి మాల అందుకుంటాను . ఇవ్వవలసిన వాళ్ళకు ఇచ్చి డబ్బు వసూల్ చేస్తాను . నా కమీషన్ పోను మిగతా పైకం అనంతరామ్ కు పైసా పోకుండా చెల్లిస్తాను . "
" అనంతరామ్ మరో ఉరఫ్.. అవునా ?"
నాకు తెలియదు . నాకు సరుకు వేసే వ్యక్తి అనంతరామ్ గానే పరిచయం అయ్యాడు . "
ఈసారి ఇంతియాజ్ నవ్వాడు .
" దాదాపు పడినేలాల క్రితం జరిగిన సంఘటన . ఎల్. ఓ. సీ దాటుతున్న మిలిటెంట్లను సరిహద్దు భద్రతా దళాలు టార్గెట్ చేశాయి . వాళ్ళలో నలుగురు చనిపోయారు . ఒకడు తప్పించుకొని ఇక్కడకు చేరాడు . ఆపరేషన్ జన్నత్ కు అతడు గుండె లాంటి వాడు . .. అన్వర్ హుస్సేన్ ."
ఆదిత్య ఉలిక్కిపడ్డాడు . ఇంతియాజ్ ను నమ్మలేనట్లు చూశాడు . ఇంతియాజ్ ఆదిత్యను గమనించాలడు . అతడి దృష్టి యాకూబ్ పైనే ఉంది .
యాకూబ్ పెదవులపై మళ్ళీ చిరునవ్వు . " థాంక్స్ ఏ. సీ. పీ గారు ! నాకు తెలియని చాలా విషయాలు చెబుతున్నారు . అనంతరామ్ అన్వర్ అయి ఉండవచ్చు . కచ్చితం గా చెప్పలేను . "
ఆనంతరమే అన్వర్ అని యాకూబ్ కు తెలుసు . కావాలనే అలా చెప్పాడు .
" నీ ధైర్యం నాకు నచ్చింది యాకూబ్ ! రియల్లీ వెల్ trained యు ఆర్ .పట్టుబడ్డానన్న కంగారు నీలో లేదు . యు ఆర్ రెడీ టు ఫేస్ యువర్ ఫేట్ ."
కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు యాకూబ్ . " మా ఆర్గనైజయశం లో మాకు అలాగే ట్రైనింగ్ ఇచ్చారు . ఇందులో డబ్బుకోశం చేరాము . కానీ---ఆశయం మా ఊపిరి . మా అప్రోచ్ లో హింస లేదు . ప్లానింగ్ ఉంది . పేద ముస్లిం యువకుల్ని ప్రయోజకులు గా మార్చటం మా సంస్థ యొక్క లక్ష్యం ." యాకూబ్ మాటల్లో గర్వం స్పస్టం గా వినిపించింది .
" ఒక జాతి యువకుల కోసం మరో జాతి యు వకులను పాడు చేస్తున్నారు . మట్టుకు బానిసల్ని చేస్తున్నారు ."
" చేతి నిండా డబ్బు, హద్దుల్లేని స్వేచ్చ .. ఏ రెండూ ఉంటే ఏ జాతి యువత చెడిపోదు ? ఎవరూ మినహాయింపు కారు . అలాంటి వారే మా టార్గెట్ . వారిని పనిగట్టుకొని పాడుచేయవలసిన పని లేదు . ఏ కారణం చేతనైనా వారి దారి లోంచి మేము తప్పుకుంటే మాలాంటి వారికోసం వారే వెదుక్కుంటారు సార్ ! చేతులు ముడుచుకొని కూర్చొరు ."
అతడి ధైర్యం మాట తీరు ఇంతియాజ్ కు కోపం తెప్పించాయి . కానీ అతడి లాజిక్ కరెక్ట్ అనిపించింది . అందుకే మాట్లాడలేకపోయాడు . అతడికెదురుగా కుర్చీ లో
కూర్చున్నాడు .
"నువ్వు చాలా తెలివైన వాడివి. ఏమి చదువుకున్నావు ?"
" మా నాన్న ఓ మారుమూల గ్రామం లో చిన్న టైలర్ . నలుగురు ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను . నన్నేం చదివించగలాడు ? ఇంటర్ కే చేతులెత్తేశాడు . ఆ తర్వాత కరెస్పాండెంస్ కోర్స్ పుణ్యమా అని ఎం . కామ్ వరకు లాగించాను . ఎంత చదివినా ఉద్యోగాలేవి ? ఓటు బ్యాంక్ రాజకీయాలు మా దారులన్నీ మూసేశాయి . పధకాల పేరు తో ప్రజలకు డబ్బులు పంచుతూ వారిని సోమరులను చేస్తున్నారు . నో డెవలప్మెంట్. నో జాబ్స్ అందుకే ఇలా అడ్డదారులు దాటవలసి వచ్చింది .